
5 కీలక విభాగాలకు అతివలే అధిపతులు
పద్మజ హేమ సునీత అరోమా సింగ్ ఠాకూర్ నిర్మలా నరసింహన్ ఇటీ పాండే
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే ఓ అరుదైన ఘనతను సాధించింది. జోన్ పరిధిలో 11 ప్రధాన విభాగాలుండగా, వాటిల్లో ఐదు విభాగాలకు మహిళలే అధిపతులయ్యారు. ఇటీవలి వరకు మూడు విభాగాలకు వారు నేతృత్వం వహిస్తూ రాగా, తాజాగా జరిగిన బదిలీల్లో మరో రెండు విభాగాలను కూడా వారికే అప్పగించారు. కీలక ఐదు విభాగాలను మహిళలే పర్యవేక్షిస్తుండటం పట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్‌మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ఆనందం వ్యక్తం చేశారు. ఎలాంటి కీలక లక్ష్యాలనైనా సాధించే సత్తా మహిళలకుందని, జోన్ పరిధిలో కీలక విభాగాలను సమర్థంగా పర్యవేక్షిస్తున్నారన్నారు.
ఆపరేషన్స్: కె. పద్మజ
రైళ్ల రాకపోకలు, వాటి సమయపాలన, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర విభాగాలతో సమన్వయం, రోలింగ్ స్టాక్ నిర్వహణ వంటి కీలక అంశాలు రైల్వేలో ఆపరేషన్స్ విభాగ పరి«ధిలోకే వస్తాయి. ఈ విభాగ నిర్వహణ కత్తిమీద సామే. ఈ సంవత్సరం జూలై వరకు సరుకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వే రూ.4,601 కోట్ల ఆదాయం సాధించింది.
49 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి కొత్త రికార్డు సృష్టించింది. పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో 1,117 ప్రత్యేక రైళ్లు నడిపింది. దీనికి ప్రస్తుతం 1991 బ్యాచ్ ఐఆర్‌టీఎస్ అధికారి కే.పద్మజ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. 2025 జనవరిలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు.
వాణిజ్య విభాగం: ఇటీ పాండే
ఆపరేషన్స్ తర్వాతఅంత ప్రాధాన్యం ఉన్న విభాగమిది.టికెట్ అమ్మకాలు, రిజర్వేషన్,స్టేషన్ నిర్వహణ, సరుకు రవాణా,మార్కెటింగ్, ఆదాయ వనరుల పెంపువంటివి దీని పరిధిలో ఉంటాయి. ఈ విభాగానికి ఈ నెల రెండో తేదీన 1998 బ్యాచ్ ఐఆర్‌టీఎస్ అధికారి ఇటీ పాండే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆమె ‘రైల్ మంత్రి రాజభాష రజత్ పథక్ (2025), మంత్రిత్వ శాఖ పురస్కారం (2007), జీఎం అవార్డులు (రెండుసార్లు), విమెన్ ఎచీవర్స్ (2016) లాంటి అనేక పురస్కారాలు పొందారు. ‘రైడింగ్ ది ఫ్రైట్ ట్రైన్’అనే పుస్తకం రాశారు. అంతర్జాతీయస్థాయిలో కామ్ రోడ్స్ మారథాన్ (88 కి.మీ.)ను పూర్తి చేసిన ఏకైక మహిళా సివిల్ సర్వెంట్‌గానూ గుర్తింపు పొందారు.
భద్రతా విభాగం: అరోమా సింగ్ ఠాకూర్
రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత చాలా కీలకం. అసాంఘిక శక్తులు, ఆకతాయిలు మొదలు ఉగ్రవాదుల వరకు రైల్వేపై దాడులు చేయటం సహజం. ట్రాక్‌పై అడ్డుగా ఇనుప చువ్వలను ఉంచి రైళ్లు పట్టాలు తప్పేలా చేసే కుట్రలు తరచూ జరుగుతున్నాయి. ఇలాంటి వాటినినిర్వీర్యం చేయటం సహా స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులు క్షేమంగా ఉండేలా, భద్రంగా గమ్యంచేరేలా ఆర్‌పీఎఫ్ సిబ్బంది పహారాలో ఉంటారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షించే కీలక బాధ్యతనుప్రస్తుతం 1993 బ్యాచ్ ఐఆర్‌పీఎఫ్‌ఎస్ అధికారి అరోమాసింగ్ ఠాకూర్ పర్యవేక్షిస్తున్నారు.
2023 జూలైలో ఆమె ఐజీ కమ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్యూరిటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె నేతృత్వంలో ‘ఆపరేషన్ యాత్రి సురక్ష‘, ‘ఆపరేషన్ అమానత్‘, ‘ఆపరేషన్ నన్హే ఫరిస్తే్త‘, ‘ఆపరేషన్ సతర్క్‘వంటి ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయి. మహిళల భద్రతకు ‘ఉమన్ శక్తి టీమ్‌లు‘, ‘మెరి సాహిలీ‘, ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు‘ప్రారంభించారు.
వైద్య విభాగం: డా. నిర్మలానరసింహన్
రైల్వేలో ప్రత్యేక ఆస్పత్రులు ఉంటాయి. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఇవి వైద్య సేవలందిస్తాయి. ఇవి కాకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే ప్రత్యేక మొబైల్ ఆస్పత్రులు ఆయా ప్రాంతాలకు చేరుకుని వైద్యం అందిస్తాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 8 ప్రధాన ఆస్పత్రులు, 40 హెల్త్ యూనిట్లు ఉన్నాయి. లాలాగూడలోని 380 పడకల కేంద్ర రైల్వే ఆస్పత్రి ఉంది. ఈ విభాగానికి 1989 బ్యాచ్ ఐఆర్‌హెచ్‌ఎస్ అధికారి డా.నిర్మలానరసింహన్ డిసెంబర్‌లో ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆర్థిక విభాగం: హేమ సునీత
అతి పెద్ద నెట్‌వర్క్ అయిన రైల్వేలో ఆర్థిక అంశాల పర్యవేక్షణ కూడా చాలా కీలకం. ఆర్థికపరమైన పొరపాట్లు, అక్రమాలకు తావు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈ విభాగానికి 1993 ఐఆర్‌ఏఎస్ అధికారి హేమసునీత గత ఏప్రిల్ నుంచి ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. లండన్, పారిస్, మలేíÙయా, సింగపూర్‌లలో ఆర్థిక అంశాలçపై అంతర్జాతీయ స్థాయిలో కోర్సులు చేసి, శిక్షణ పొందారు. ఆమె పీపీపీ, ఇంటర్నేషనల్ టాక్స్, అక్రూవల్ అకౌంటింగ్‌లలో ప్రావీణ్యం పొందారు.