South Central Railway
-
కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన మహాకుంభమేళా ముగియనున్న దృష్ట్యా.. చర్లపల్లి–దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–దానాపూర్ (07791) ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 9.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి రెండోరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో దానాపూర్–చర్లపల్లి (07792) ప్రత్యేక రైలు ఈ నెల 20 నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 4.45 గంటలకు దానాపూర్ నుంచి బయలుదేరి.. మర్నాడు రాత్రి 9.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బర్హంపూర్ తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి రీ డెవలప్మెంట్ (redevelopment) పూర్తిచేయాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. సుమారు రూ.720 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రైల్వేస్టేషన్లో సివిల్ పనులు కొనసాగుతున్నాయి. ఉత్తరం వైపున ఉన్న స్టేషన్ భవనాన్ని కూల్చివేశారు. దానిస్థానంలో కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు...ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు గణేష్ టెంపుల్ (Ganesh Temple) వైపు ఉన్న 2వ గేట్‌ను వినియోగించుకోవాలి. ప్రస్తుతం ఈ గేట్‌ను ప్రయాణికుల రాకపోకల కోసం తెరిచి ఉంచారు. అలాగే జనరల్ బుకింగ్ కౌంటర్లు, విచారణ కేంద్రాలు, సుమారు 750 మంది ప్రయాణికులు వేచి ఉండేందుకు 500 అదనపు సీటింగ్ సామర్థ్యంతో వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. (Secunderabad Railway Station: జ్ఞాపకాల స్టేషన్)ప్రస్తుతం 4వ గేట్ మూసివేశారు. స్వాతిహోటల్ ఎదురుగా ఉన్న 3వ, 3బి నెంబర్ గేట్లను వినియోగించుకోవచ్చు. ఈ గేట్ల వద్ద వద్ద అదనపు ప్రవేశం కల్పించారు.10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు...10వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు బోయిగూడ ప్రవేశద్వారం వైపు 8వ గేట్‌ను తెరిచారు. ప్రయాణికులు ఇక్కడ సాధారణ టిక్కెట్లను కూడా బుక్ చేసుకొనేందుకు కౌంటర్లు ఉన్నాయి.నిర్మాణ పనులు కొనసాగుతున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులను చేసేందుకు 24 గంటల పాటు విధులు నిర్వహించేవిధంగా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్చీలు ఇక చరిత్ర పుటల్లోనేఒకటో నెంబర్ నుంచి 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వరకు ప్రయాణికులు చివరి నిమిషంలో పరుగెత్తవలసిన అవసరం లేకుండా ఏ ట్రైన్ ఏ ప్లాట్‌ఫామ్ పైన ఆగనుందనే సమాచారాన్ని ముందుగానే ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు అన్ని చోట్ల ఆర్పీఎఫ్ (RPF) అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ 139... పునరాభివృద్ధి పనుల్లో భాగంగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.ప్రయాణికుల భద్రత, రక్షణ, తక్షణ సహాయ సహకారాల కోసం ఆర్పీఎఫ్ హెల్ప్‌లైన్ – 139ను సంప్రదించాలని సూచించారు. -
ఒడిశా ప్రయోజనాలకే పట్టం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టం హామీ కూడా అయిన విశాఖపట్నం రైల్వే జోన్‌ను అనుకున్న విధంగా సాధించలేక చేతులెత్తేసింది. ఒడిశా ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టింది. అత్యధిక రాబడినిచ్చే కొత్తవలస–కిరండోల్ లైన్ (కేకే లైన్) లేకుండానే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేస్తూ కేంద్ర రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు లోయతో సహా కేకే లైన్‌ను ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజన్లో చేర్చింది. ఆ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దాంతో కొత్తగా ఏర్పడే విశాఖపట్నం రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండి పడనుంది. జోన్ అభివృద్ధికి పురిట్లోనే గండి కొట్టినట్లయింది. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర రైల్వే శాఖ ఆమోదించింది. ఆమేరకు 2024 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రైల్వే జోన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ స్వరూపంపై రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది.విశాఖపట్నం, రాయగడ డివిజన్ల ఏర్పాటు2024 ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్వర్వుల్లో వాల్తేర్ రైల్వే డివిజన్‌ను తొలగిస్తున్నట్టుగా రైల్వే శాఖ పేర్కొంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలిపింది. అత్యధిక రాబడి నిచ్చే కేకే లైన్‌తోపాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చింది. రాయగడ రైల్వే డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తరకోస్తా రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. రైల్వే జోన్ ప్రధాన కేంద్రం ఉన్న చోట రైల్వే డివిజన్ కేంద్రం లేకపోవడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలను భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా జోన్లో చేరిస్తే ఆ రెండు జిల్లాలకు రైల్వే ప్రాజెక్టుల్లో తగిన న్యాయం జరగదని, కేకే లైన్‌ను కోల్పోతే విశాఖ జోన్ ఆర్థిక స్వయం సమృద్ధి సాధ్యం కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కేకై లైన్తోసహా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని.. విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్ చేశారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని కోరింది. వివిధ ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్లు కూడా అదే డిమాండ్ చేశాయి. మరోవైపు రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఒడిశా వాసులు పట్టుబట్టారు. కేకే లైన్ లేకుండా విశాఖ డివిజన్ ఏర్పాటు2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర రైల్వే ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోనే ఉంచాలన్న ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్‌ను పూర్తిగా బేఖాతరు చేసింది. దాంతో ఒడిశా ఒత్తిడికి తలొగ్గుతూ కేంద్ర రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ స్థానంలో విశాఖపట్నం, రాయగడ కేంద్రాలుగా రెండు వేర్వేరు రైల్వే డివిజన్లను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్‌ను చేర్చింది. కానీ అత్యధిక రాబడి నిచ్చే కొత్తవలస–కిరండోల్ సెక్షన్‌తోపాటు పలాస–ఇచ్ఛాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించింది. వాటిని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో విశాఖపట్నం డివిజన్ తీవ్రంగా నష్టపోనుంది.దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం ఖరారైంది. అటు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను విభజించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తేనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. దాంతో దక్షిణ కోస్తా రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్ల స్వరూపం ఇలా ఉండనుంది.ఇక విశాఖపట్నం, రాయగడ డివిజన్లు ఇలా » విశాఖపట్నం డివిజన్: పలాస– విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు–విజయనగరం, నౌపాడ జంక్షన్– పర్లాఖిముడి, బొబ్బిలి జంక్షన్ – సాలూరు, సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్, వదలపూడి– దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ – జగ్గయ్యపాలెం సెక్షన్లు.» రాయగడ డివిజన్: కొత్తవలస– కిరండోల్, బచ్చెలి / కిరండోల్, కూనేరు– తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్– కొరాపుట్ జంక్షన్, పర్లాఖిముడి – గుణుపూర్ సెక్షన్లు.పలు డివిజన్ల పరిధిలో స్వల్ప మార్పులు » గుంతకల్ డివిజన్ పరిధిలోని రాయచూర్ – వాడి సెక్షన్‌ను సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తెస్తారు. దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే, సెంట్రల్ రైల్వేలకు మధ్య ఆ సెక్షన్ ఇంటర్ ఛేంజ్ పాయింట్‌గా ఉంది. దాంతో పరిపాలన పరమైన సౌలభ్యం కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తెచ్చారు.» గుంటూరు డివిజన్ పరిధిలోని విష్ణుపురం నుంచి పగడిపిల్లి, విష్ణుపురం నుంచి జన్పాహడ్ సెక్షన్లను సికింద్రాబాద్ డివిజన్‌లోకి తెస్తారు. తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి చేరుస్తారు. సింగరేణి నుంచి బొగ్గు రవాణాకు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.» దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొండపల్లి నుంచి మోతుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్ పరిధిలోకి తెస్తారు. తద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో చేరుస్తారు. నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్, రాయనపాడు వర్క్ షాపులకు ఇబ్బంది లేకుండా జోనల్ పరిధిని సర్దుబాటు చేశారు. -
ప్రాజెక్టులకు మధ్యంతర నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులతో ప్రమేయం లేకుండా, పనుల వేగాన్ని బేరీజు వేసుకుంటూ కేంద్రం అప్పటికప్పుడు నిధులు కేటాయిస్తోంది. ఈసారి కూడా అదే పంథాను అవలంబించే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్లో కొత్త రైళ్ల ప్రకటనపై అంతగా దృష్టి సారించని కేంద్రం, కొత్త లైన్లను పూర్తి చేయడానికే ప్రాధాన్యమిస్తోంది. కొత్త రైళ్లను మాత్రం వీలు చిక్కినప్పుడు ప్రారంభిస్తోంది. గత బడ్జెట్లో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను ఆ తర్వాత ఉన్న ఫళంగా పెంచింది. దీంతో ఆ ప్రాజెక్టుల్లో పనులు వేగంగా జరిగేందుకు అవకాశం చిక్కింది. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.14,232.84 కోట్లు కేటాయించగా, ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టుల నిధులను పెంచింది. అలా జోన్‌కు అదనంగా రూ.1350.26 కోట్ల మేర నిధులు అందాయి. ముఖ్యంగా, అతి కీలక మూడో లైన్ నిర్మాణ పనులకు కేటాయింపులు పెంచింది. కాజీపేట–బల్లార్షా పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. కాజీపేట–విజయవాడ మూడోలైన్ పనుల్లో దాదాపు 100 కి.మీ. పనులు చేయాల్సి ఉంది.వీటి వేగం పెంచటం ద్వారా, ఆ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు దానికి రూ.190 కోట్లను అదనంగా కేటాయించింది. బడ్జెట్లో రూ.310 కోట్లు ప్రతిపాదించగా, ఆ తర్వాత దాన్ని రూ.500 కోట్లకు పెంచింది. ఫలితంగా ఈ ఏడాది కాలంలో ఏకంగా 60 కి.మీ. మేర మూడో లైన్ పనులు పూర్తయ్యాయి. ఇందులో 40 కి.మీ.కు సంబంధించి రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీ పూర్తి చేసి పచ్చజెండా ఊపటంతో అంతమేర ట్రాక్‌పై రైళ్లను కూడా తిప్పుతున్నారు. మిగతా 20 కి.మీ. పనులకు సంబంధించి సేఫ్టీ కమిషనర్ తనిఖీ జరగాల్సి ఉంది. ఈసారి కేటాయింపులు వేటికి? డోన్–అకోలా డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మన రాష్ట్రంలో నిజామాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా డోన్ వరకు రెండో లైన్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తికాగా, మిగతా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. గత బడ్జెట్లో ఈ పనులకు రూ.220 కోట్లు ప్రతిపాదించగా, తర్వాత దాన్ని ఏకంగా రూ.550 కోట్లకు పెంచారు. దీంతో గత ఏడాది కాలంలో 45 కి.మీ. డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో వికారాబాద్–కృష్ణా లైన్‌పై విన్నపాలు వచ్చాయి. దీనికి ఈసారి కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. సికింద్రాబాద్–కాజీపేట మూడో లైన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. రామగుండం–మణుగూరు, సికింద్రాబాద్–వాడీ మూడు, నాలుగు లైన్లకు నిధులు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు. -
ఈసారైనా నమో భారత్ రైలొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్.. సమీప నగరాలను, పట్టణాలను చుట్టేసే ఇంటర్ సిటీ రైలు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల కోసం హైదరాబాద్ ఎదురుచూస్తోంది. గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లను, హైదరాబాద్ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోనూ అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదన రెండేళ్ల నుంచే ఉంది. వందేభారత్ తరహాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లు, గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిని మొదట వందే మెట్రో రైళ్లుగా పిలిచారు. అనంతరం నమో భారత్ ర్యాపిడ్ రైళ్లుగా పేరు మార్చారు. అహ్మదాబాద్–భుజ్ స్టేషన్ల మధ్య మొట్టమొదటి నమో భారత్ రైలు పట్టాలెక్కింది. గత సంవత్సరమే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయని భావించినా వీలు కాలేదు. వచ్చే బడ్జెట్లో అయినా మనకు వీటిని కేటాయిస్తారని ప్రజలు ఆశపడుతున్నారు.సామాన్యుల రైళ్లు..నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను కనిష్టంగా 100 నుంచి గరిష్టంగా 250 కిలోమీటర్ల దూరం వరకు నడపాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి వరంగల్, భద్రాచలం, కర్నూల్, మహబూబ్‌నగర్, గజ్వేల్, వికారాబాద్, తాండూర్‌తోపాటు ప్రస్తుతంఇంటర్ సిటీ రైళ్లు నడుస్తున్న సికింద్రాబాద్–విజయవాడ మధ్య కూడా ఈ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఉంది. గతంలో జరిగిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలోనూ ఇంటర్ సిటీ రైళ్లుగా వీటిని ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు వీటిని నడపడం వల్ల ప్రజలు తక్కువ చార్జీలతో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. కాజీపేట – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఇంటర్ సిటీ లేదా మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని 12 సంవత్సరాల క్రితం ప్రతిపాదించినా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం నమో భారత్‌ను ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌గా నడపాలనే డిమాండ్ ఉంది. సామాన్య, మధ్య తరగతివారికి ఉపయోగపడే తక్కువ దూరం నడిచే పుష్పుల్ మెము, ఇంటర్ సిటీ, నమో భారత్ ర్యాపిడ్, వందే సాధారణ్ (అమృత్ భారత్) ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్–మనోహరాబాద్–కొత్తపల్లి రూట్లో రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి వెళ్లే భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.స్టాండింగ్ జర్నీకి అవకాశం..ప్రస్తుతం ఎంఎంటీఎస్ వంటి లోకల్ రైళ్లు నడుస్తున్నట్లుగానే వందే మెట్రోలు రాకపోకలు సాగిస్తాయి. ఒక బోగీలో 100 మంది కూర్చొనే సదుపాయం ఉంటుంది. వీటిలో కనీసం 200 మంది నిలబడి ప్రయాణం చేయవచ్చు. ఆటోమెటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాలను నివారించే కవచ్ సాంకేతికతతో వీటిని అనుసంధానం చేశారు. ప్రతి బోగీలో సీసీటీవీ నిఘా ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భద్రత లభిస్తుంది. -
173 కిలో మీటర్లు.. నాలుగు లైన్లు..
సాక్షి, హైదరాబాద్ : ఒక్క రైలు మార్గం.. నాలుగు లైన్ల ట్రాక్.. దేశంలోనే అరుదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు లేదు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు రైల్వే లైన్లతో కూడిన కారిడార్ సిద్ధం కాబోతోంది. సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని వాడీ మధ్య ఉన్న మార్గాన్ని నాలుగు లైన్లకు విస్తరించాలని రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్‌ను సిద్ధం చేసి ఇటీవలే రైల్వే బోర్డుకు పంపింది. 173 కిలోమీటర్ల పొడవున చేపట్టే ఈవిస్తరణకు దాదాపు రూ.4,446 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేస్తే.. వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయించేఅవకాశం ఉంది. ఈ విస్తరణతో వంద అదనపు రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.ప్రస్తుతం రెండు లైన్లతో..సికింద్రాబాద్–వాడీ మధ్య ప్రస్తుతం 183 కిలోమీటర్ల మేర రెండు వరుసల రైల్వే కారిడార్ ఉంది. ఇది ముంబైకి ప్రధాన మార్గం కాగా.. బెంగళూరుకు ప్రత్యామ్నాయ మార్గం. ఈ రూట్లో నిత్యం 66 ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి. ఇక తాండూరు– వాడీ మధ్య పదుల సంఖ్యలో సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా పరిశ్రమలనూ నిర్మిస్తున్నారు. సేడం, నాగులపల్లి ప్రాంతాల్లో స్టీలు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నిత్యం వందల టన్నుల సిమెంటు, స్టీలు ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుంది. ఇక ఈ ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు తరలుతుంటాయి. వీటన్నింటికీ సంబంధించి నిత్యం 70 వరకు గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో రైల్వే ట్రాఫిక్ 120 శాతంగా ఉంది. అంటే సామర్థ్యం కంటే 20శాతం అదనంగా రైళ్లు నడుస్తున్నాయి. పైగా సరుకు రవాణాకు, ప్రయాణికుల రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. కానీ రైళ్లను పెంచలేని పరిస్థితి. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మూడో లైన్ నిర్మించాలని నిర్ణయించారు.రైల్వే బోర్డు జోక్యంతో నాలుగోలైన్..దేశవ్యాప్తంగా కీలక కారిడార్లపై ఇటీవల రైల్వే బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో సికింద్రాబాద్–వాడీ సెక్షన్‌ను పరిశీలించింది. ఇక్కడ మూడోలైన్ నిర్మించిన కొంతకాలానికే నాలుగోలైన్ అవసరం ఏర్పడుతుందని, మళ్లీ భూసేకరణ సహా సమస్యలు వస్తాయని గుర్తించింది. ఒకేసారి రెండు అదనపు లైన్లు నిర్మిస్తే మంచిదని తేల్చింది. పీఎం గతిశక్తిలో భాగంగా ఉన్న రైల్వే నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ దీనికి ఆమోదముద్ర వేసింది. అధికారులు ఇటీవలే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసి, డీపీఆర్ రూపొందించి రైల్వే బోర్డుకు సమర్పించారు.హఫీజ్‌పేట వరకు 4 లైన్లు.. సనత్‌నగర్ వరకు 3 లైన్లు.. సికింద్రాబాద్ వరకు నాలుగు లైన్లు నిర్మించాలనుకున్నా.. మధ్యలో భారీ నిర్మాణాలు ఉన్నందున భూసేకరణ కష్టమని గుర్తించారు. దీంతో వాడీ నుంచి నగరంలోని హఫీజ్‌పేట వరకు నాలుగు లైన్లకు విస్తరించి.. అక్కడి నుంచి సనత్‌నగర్ వరకు మూడు లైన్లకు పరిమితం చేస్తారు. సుమారు 600 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంటుందని, రూ.330 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక ఈ మార్గంలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 202 వంతెనలు ఉన్నాయి. ఆయా చోట్ల కొత్త లైన్ల కోసం వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే నెల రోజుల్లో టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు.భవిష్యత్‌లో బందరు పోర్టుతో అనుసంధానంమరో రెండేళ్లలో ఏపీలోని బందరు పోర్టు సిద్ధం కాబోతోంది. తెలంగాణకు దగ్గరి పోర్టు ఇదే కావటంతో నేరుగా అనుసంధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి డెడికేటెడ్ రైల్వే కారిడార్ కావాలని ఇటీవలే సీఎం రేవంత్ ప్రధానిని కోరారు.ఆ లైన్ అందుబాటులోకి వస్తే, దానితో వాడీ లైన్‌ను అనుసంధానించే అవకాశం ఉంది. ఈ మార్గంలో వచ్చే సిమెంటు, స్టీలు, వ్యవసాయ ఉత్పత్తులువేగంగా బందరు పోర్టుకు చేరుతాయి. -
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. 'జన సాధారణ్ అన్ రిజర్వ్డ్’ స్పెషల్ ట్రైన్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.1) రైలు నంబర్ (08534) చర్లపల్లి-విశాఖపట్నం (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 11, 13, 16, 18 తేదీలలో చర్లపల్లి నుంచి ఉదయం 00.30 గంటలకు (రాత్రి 12.30 గంటలకు) బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు (అదే రోజున ) విశాఖపట్నం చేరుకుంటుంది. 2) రైలు(08533) విశాఖపట్నం-చర్లపల్లి (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) విశాఖపట్నం నుంచి జనవరి 10, 12, 15, 17 తేదీలలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరి (అదే రోజు) రాత్రి 22.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రత్యేక రైళ్లు నంబర్ (08533/08534) విశాఖపట్నం-చర్లపల్లి - విశాఖపట్నం జనసాధారణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ లలో ఇరువైపులా ఆగుతాయి.3) రైలు నంబర్: (08538) చర్లపల్లి-విశాఖపట్నం (జన సాధారణ్ అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 11, 12, 16, 17వ తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరి 22.00 గంటలకు (అదే రోజు రాత్రి) విశాఖపట్నం చేరుకుంటుంది. ఇదీ చదవండి: పండుగ బస్సు..‘ప్రత్యేక’ చార్జీ4) రైలు నంబర్ (08537) విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధారణ అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) 2025 జనవరి 10, 11, 15 & 16 తేదీలలో విశాఖపట్నం నుండి (సాయంత్రం 6.20) 18.20 గంటలకు బయలు దేరుతుంది మరియు 08.00 గంటలకు (మరుసటి రోజు ఉదయం) చర్లపల్లి చేరుకుంటుంది. రైలు(08537/08538) విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం జనసాధరణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. జనసాధరన్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులను సులభతరం చేయడానికి అన్రిజర్వ్డ్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చింది.సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లుదక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ సాక్షి మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామన్నారు. ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా 16 జన సాధారణ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఛార్జీలే ఈ జన సాధారణ రైళ్లలో వసూలు చేస్తామన్నారు. ఛార్జీల పెంపు భారీగా ఉండదు. ప్లాట్ ఫారమ్ చార్జీలు కూడా పెంచటం లేదు.చర్లపల్లి నుంచి కొన్ని రైళ్లు ఈ సంక్రాంతికి నడపనున్నాం. సిటీ నుంచి చర్లపల్లికి వెళ్లాలంటే సికింద్రాబాద్ స్టేషన్ బయట నుంచి కొన్ని బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. చర్లపల్లి కాకుండా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రైళ్లు నడుస్తాయి’’ అని శ్రీధర్ వెల్లడించారు. -
సంక్రాంతికి సొంతూరు వెళ్లేదెలా?
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు ఇప్పటినుంచే బస్సులు, రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఈసారి అనూహ్యంగా ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా వేడుకలు రావడంతో హైదరాబాద్‌తో పాటు, వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ప్రస్తుతం శబరిమలకు నడుస్తున్న రైళ్లను క్రమంగా ప్రయాగ్‌రాజ్‌కు మళ్లిస్తున్నారు. దీంతో సంక్రాంతికి ప్రత్యేక రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే అన్ని రెగ్యులర్ రైళ్లలో బుకింగ్‌లు భర్తీ అయ్యాయి. ఏసీ, నాన్ ఏసీల్లో ఫిబ్రవరి వరకు కూడా బెర్తులు అందుబాటులో లేవు. కొన్ని రైళ్లలో స్లీపర్ కోచ్‌లలో వెయిటింగ్ లిస్ట్ 250పైనే కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాలకు ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప సొంత ఊళ్లకు బయలుదేరడం సాధ్యం కాదు. ఆర్టీసీ యథావిధిగా అ‘ధనం’సంక్రాంతి సందర్భంగా ఈసారి సుమారు 6 వేల బస్సులు అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులను నడపనున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులకు ఇవి అదనంగా అందుబాటులో ఉంటాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు. ఈసారి కూడా యథావిధిగా అదనపు చార్జీలు విధించే అవకాశం ఉంది. ప్రత్యేక చార్జీల ప్రస్తావన లేకుండానే గతంలో తెలంగాణ జిల్లాలకు 25 శాతం, ఏపీకి వెళ్లే బస్సుల్లో 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేశారు. ఈసారి కూడా గుట్టుచప్పుడు కాకుండా సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ఆర్టీసీ రంగంలోకి దిగింది. ప్రైవేట్ బస్సుల దారిదోపిడీ...సంక్రాంతి రద్దీ కంటే ముందే ప్రైవేట్ బస్సులు దారిదోపిడీకి దిగాయి. డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇప్పటినుంచే సంక్రాంతి బుకింగ్‌లపై చార్జీలు పెంచాయి. కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు స్టేజీక్యారేజీలుగా రోడ్డెక్కి ప్రయాణికుల జేబులు లూఠీ చేసేందుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350 వరకు చార్జీ ఉంటే ప్రస్తుతం రూ.550 వరకు పెంచారు. ఈనెల 12వ తేదీ నాటికి ఇంకా పెరగవచ్చునని ట్రావెల్ ఏజెంట్లు స్పష్టం చేస్తున్నారు.విమాన చార్జీలూ భారమే..మరోవైపు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే డొమెస్టిక్ ఫ్లైట్లలో కూడా చార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పలు ఎయిర్‌లైన్స్ ఇప్పటి నుంచే చార్జీలు పెంచేశాయి. ప్రస్తుతం సంక్రాంతి రద్దీతో పాటు, శబరిమల, మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చార్జీలు పెంచాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు సాధారణంగా అయితే రూ.5,200 వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ.8,000 దాటింది.సంక్రాంతి నాటికి ఇది రూ.12 వేల వరకు చేరే అవకాశం ఉన్నట్లు ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. అన్ని రూట్లలోనూ ఇదే డిమాండ్ కనిపిస్తోంది. -
మానుకోటకు పీఓహెచ్ వచ్చేనా?
సాక్షి, మహబూబాబాద్: రైళ్ల నిర్వహణలో అత్యంత కీలకమైనవాటిలో ఒకటి పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్). రైళ్లలో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు, పాడైపోయిన పరికరాలను మార్చేందుకు ఈ షెడ్లు ఉపయోగపడతాయి. భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైనప్పటికీ, పీఓహెచ్లు దేశంలో ఆరు మాత్రమే ఉన్నాయి. భూస్వాల్, కంచరపార, చార్బాగ్, పెరంబూర్, ఖరగ్‌పూర్, దాహోడ్‌లో మాత్ర మే వీటిని ఏర్పాటుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్క్ భారీగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ ఇప్పటివరకు పీఓహెచ్ను ఏర్పాటుచేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య లో ఉన్న మహబూబాబాద్ (మానుకోట) వద్ద పీఓహెచ్ ఏర్పాటుచేయాలని గతంలో భావించినా అది అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా ఇక్కడ పీఓహెచ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అర్హత ఉన్నా..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధి కలిగిన దక్షిణ మధ్య రైల్వేలో పూర్తిస్థాయి లోకోమోటివ్ (రైలు ఇంజిన్) ఓవర్ హాలింగ్ షెడ్లు ఇప్పటివరకు లేవు. పీఓహెచ్ ఏర్పాటుచేయాలంటే జోన్ పరిధిలో కనీసం 800 లోకోలు ఉండాలి. కానీ దక్షిణ మధ్య రైల్వేలో 1,100లకు పైగా లోకోలు ఉన్నప్పటికీ పీఓహెచ్ లేదు. రైలు ప్రారంభమైన తరువాత గమ్యస్థానం చేరేలోపు తలెత్తే చిన్నచిన్న మరమ్మతులు పీఓహెచ్లో ఆలస్యం కాకుండా పూర్తిచేసే వీలుంటుంది. ఇక్కడ లోకోమోటివ్ల క్యామ్‌లా షాఫ్ట్‌లు, క్రాంక్ షాఫ్ట్‌లను శుభ్రం చేస్తారు. వాటిని పరీక్షించి కాలం చెల్లిన వాటిని తొలగించి, కొత్తవి అమరుస్తారు.పిష్టిన్లు, కనెక్టింగ్ రాడ్లు, సిలిండర్ హెడ్లను శుభ్రం చేసి దెబ్బతిన్నవాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేస్తారు. నీరు సరఫరా అయ్యే మార్గాలను పరీక్షించి పగుళ్లను గుర్తిస్తారు. వాల్్వలకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేస్తారు. లోకో సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. రోటర్ బ్యాలెన్సింగ్, కొత్త ఆయిల్ సీల్స్, సీలెంట్ గాస్కెట్లు, ఫౌండేషన్ బోల్ట్‌ను అమరుస్తారు. ఇంతటి కీలకమైన పీఓహెచ్ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లేకపోవటంతో రైళ్లలో తలెత్తే చిన్నచిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయని అధికారులు అంటున్నారు. అనువైన ప్రదేశంగా మానుకోటపీఓహెచ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా మహబూబాబాద్ ప్రాంతాన్ని రైల్వే అధికారులు గుర్తించినట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వేలో సెంట్రల్ పాయింట్‌గా ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. చెన్నై నుంచి న్యూఢిల్లీ, భువనేశ్వర్ నుంచి ముంబైని కలిపే ప్రధాన రైలు మార్గం ఈ ప్రాంతంలో ఉంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. ఇక్కడి పీఓహెచ్ సేవలు వినియోగించుకోవచ్చు. మహబూబాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న 865 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ షెడ్ నిర్మాణానికి అనువైనదిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక్కడ వర్క్‌షాప్ నిర్మిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పీఓహెచ్ కోసం గతంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు భూములను పరిశీలించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ మధ్యలోనే వదిలేశారు. రైల్వే మంత్రికి విన్నవించాం మహబూబాబాద్ పట్టణ సమీపంలో రైల్వే పీఓహెచ్ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్ర మంత్రులకు విన్నవించాం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశాం. గతంలోనే ప్రకటించిన బడ్జెట్ ఇవ్వడంతోపాటు, మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరాం. పోరిక బలరాం నాయక్, ఎంపీ విభజన చట్టం హామీ నెరవేరుతుంది తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. మానుకోటలో పీఓహెచ్ షెడ్ నిర్మిస్తే ఈ ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లా ప్రజల జీవన ప్రమానాలు మెరుగుపడతాయి. పీఓహెచ్ షెడ్ ఏర్పాటు కోసం ఎంపీ, ఇతర నాయకులు గట్టిగా ప్రయత్నించాలి. అవసరమైతే పారీ్టలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు మేం సిద్ధం. – తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీప్రజాప్రతినిధులు గట్టిగా పోరాడాలి పదివేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే రైల్వే పీఓహెచ్ షెడ్‌ను జిల్లాలో నిర్మించాలి. ఇందుకోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేయాలి. – యాళ్ల మురళీధర్ రెడ్డి, యువజన నాయకులు -
25న విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని తడి–దువ్వాడ సెక్షన్ల మధ్యలో జరుగుతున్న నాన్ ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఈ నెల 25న విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటలో తెలిపారు.విజయవాడ–విశాఖపట్నం (12718/12717), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268), గుంటూరు–విశాఖపట్నం (17239/17240), రాజమండ్రి–విశాఖపట్నం (07466/07467) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. -
పెద్దపల్లి గూడ్స్ ప్రమాదం: వందేభారత్ సహా రద్దైన రైళ్ల వివరాలివే..
పెద్దపెల్లి, సాక్షి: గూడ్స్ రైలు ప్రమాదంతో కాజీపేట-బలార్ష రూట్(ఢిల్లీ–చెన్నై) రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. వందేభారత్ సహా పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. పునరుద్ధరణకు ఒక్కరోజు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్లియరెన్స్‌కు మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రాఘవాపూర్ స్టేషన్ వద్దకు ఈ ఉదయం దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేరుకుని పునరుద్ధరణ పనులను ముమ్మరం చేయించారు.ట్రాక్స్ పునరుద్ధరణకు ప్రత్యేక మిషనరీ తెప్పించారు. బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్ నుంచి సుమారు 500 మంది సిబ్బందిని తీసుకొచ్చి రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ పనుల్లో స్పీడ్ పెంచారు. ట్రాక్స్ పై అదుపు తప్పి కిలోమీటర్ మేర చెల్లాచెదురుగా పడిన బోగీలను భారీ క్రేన్స్ సాయంతో తొలగిస్తున్నారు.రద్దు.. డైవర్షన్.. రీషెడ్యూల్ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. ప్రయాణికులంతా ఇది గమనించాలని.. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్ రైళ్లను రద్దు చేశారు.అలాగే.. రామగిరి ఎక్స్ ప్రెస్, సింగరేణి ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్ ప్రెస్, బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌లను రద్దు చేశారు.దారి మళ్లించిన రైల్వే వివరాలు జీటీ, కేరళ, ఏపీ, గోరఖ్ పూర్, సంఘమిత్ర, దక్షిణ్, పూణే, దర్భంగా ఎక్స్ ప్రెస్ SCR PR No.610 dt.13.11.2024 on "Railway Helpline Numbers provided in View of Accident Of Goods Train" @drmsecunderabad pic.twitter.com/M7pjbq4GXP— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 Bulletin No.2 SCR PR No.611 dt.13.11.2024 on "Cancellation/Diversion of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/cMrk7XTS9d— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 "Cancellation/PartialCancellation/Diversion/Reschedule of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/vfOqjCyLvR— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024ఏం జరిగిందంటే..మంగళవారం నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్–కన్నాల గేట్ మధ్యలో 282/35 పోల్ వద్ద పట్టాలు తప్పాయి. రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. దీంతో.. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. దీంతో మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటికప్పుడు.. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
వచ్చే ఆగస్టుకల్లా కాజీపేట యూనిట్
సాక్షి, హైదరాబాద్: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)ను వచ్చే ఆగస్ట్ నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ యూనిట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌హెచ్‌బీ (లింక్‌హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు, ఈఎంయూ (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్‌లను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏటా 600 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యంతో కాజీపేట యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. గురువారం దక్షిణమధ్య రైల్వే పరిధిలోని పార్లమెంట్ సభ్యుల సమావేశం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగింది.ఈ సందర్భంగా పలు పెండింగ్ సమస్యలను ఎంపీలు ప్రస్తావించారు. అనంతరం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదట్లో రూ.250 కోట్లతో కాజీపేట్‌లో ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, ప్రస్తుతం దానిని రూ.680 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు మూడువేల మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన 40 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, రూ.780 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ పునరాభివృద్ధి ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. 15 ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే దక్షిణమధ్య రైల్వేలో 15 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.50 వేల కోట్లతో 2647 కి.మీ. రైల్వేలైన్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రూ. 17,862 కోట్ల అంచనాతో 1,447 కి.మీ. డబ్లింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ తరువాత హైదరాబాద్ కేంద్రంగానే అత్యధికంగా 5 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో భూమి లభించకపోవడం వల్ల ఎంఎంటీఎస్ రెండో దశతోపాటు పలు ప్రాజెక్టుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రూ.650 కోట్లతో రాయగిరి నుంచి యాదాద్రి వరకు 31 కి.మీ. వరకు ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రైల్వేశాఖ సొంతంగా చేపట్టనుందన్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మించాలని ప్రతిపాదించిన రైల్రింగ్రోడ్డుకు సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రాధాన్యతల కోసం కసరత్తురానున్న కేంద్ర బడ్జెట్లో రైల్వే ప్రాధాన్యతలను లక్ష్యంగా చేసుకొని దక్షిణమధ్య రైల్వే నిర్వహించిన ఈ ఎంపీల సమావేశంలో తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, డీకే అరుణ, కడియం కావ్య, బలరాంనాయక్, రఘురాంరెడ్డితోపాటు సాగర్ ఈశ్వర్ ఖండ్రే (బీదర్), రాధాకృష్ణ దోడ్డమణి (కలబురిగి) పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆర్‌యూబీలు, ఆర్ఓబీలు నత్తనడకన సాగుతున్నాయని, సకాలంలో పూర్తయ్యేలా గడువు విధించాలని ఈటల సూచించారు.ఈదుల నాగులపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని, జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాస్‌ల ను పునరుద్ధరించాలని రఘునందన్‌రెడ్డి కోరా రు. ఏటా రెండుసార్లు ఎంపీల సమావేశం పెట్టి సమస్యలపై చర్చించాలని సురేశ్‌రెడ్డి సూచించా రు. దేవరకద్ర, కౌకుంట్ల, జడ్చర్ల ప్రాంతాల్లోని ఆర్‌యూబీలు, ఆర్ఓబీలను సకాలంలో పూర్తి చేయాలని డీకే అరుణ కోరారు. కాజీపేట రైల్వే ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కలి్పంచాలని కడియం కావ్య కోరారు. ఎంపీల ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఉంటుందని జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ చెప్పారు. 2023–24 ఆర్థిక ఏడాదిలో 141 మిలియన్ టన్నుల సరుకు రవాణాద్వారా అత్యధికంగా రూ.13,620 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. -
వచ్చే నెలలో చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేష్ రెడ్డి, కావ్య, రఘునందన్, డీకే అరుణ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా రైల్వే అభివృద్ధిపై చర్చించారు. రైళ్ల హోల్డింగ్, కొత్త రైల్వే లైన్లతో పాటు అండర్ పాసులు, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని.. 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు తీసుకొస్తాం. రూ.720 కోట్లతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. రూ. 430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు మరో రూ.650 కోట్లు కావాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.జంట నగరాల నుంచి యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంఎంటీస్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. రైల్వే అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసి, చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కింద సర్వీసును పొడిగిస్తున్నాం. మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే పనుల కోసం సుమారు 6 వేల కోట్లు బడ్జెట్ మంజూరు అయింది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం?
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుపై ప్రయాణికుల సంఘాలు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఏ రైలు ఎపుడొస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఎందుకు రద్దవుతుందో తెలియదు. నగరానికి లైఫ్‌లైన్‌గా నిలిచిన ఎంఎంటీఎస్‌పైన నిర్లక్ష్యమెందుకు’ అంటూ రైల్వే ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపైన దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ప్రయాణికుల సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ మార్గాల్లో నడుస్తున్న ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల రాకపోకల పట్ల వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతే కుమార్ జైన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ లోకేష్ విష్ణోయ్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు సికింద్రాబాద్‌లోని సంచాలన్‌భవన్, హైదరాబాద్ భవన్లలో ప్రయాణికుల సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ, జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్, అమ్ముగూడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, వివేకానందపురం వెల్ఫేర్ అసోసియేషన్, దక్షిణ మధ్య రైల్వే రైల్ ఫ్యాన్స్ అసోసియేషన్, తదితర సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.సకాలంలో రైళ్లు నడపాలి.. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు, మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు గతేడాది సర్వీసులను ప్రారంభించారు. కానీ ఈ రూట్లలో ప్రతి రోజు రైళ్లు రద్దవుతున్నాయి. పైగా ఏ ట్రైన్ ఎప్పుడొస్తుందో తెలియదు. మధ్యాహ్నం సమయంలో నడిపే రైళ్ల వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఉండే సమయాల్లోనే రైళ్లు అందుబాటులో ఉండడం లేదు. ఈ రూట్లో సకాలంలో రైళ్లు నడపాలని జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి నూర్ కోరారు. ఉదయం 9 గంటలకు రావలసిన ట్రైన్ 11 గంటలకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మరోవైపు మల్కాజిగిరి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది కాలనీలకు సిటీబస్సుల కంటే ఎంఎంటీఎస్ ఎంతో ప్రయోజనంగా ఉంటుందని భావిస్తే ఈ రూట్లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు రైళ్లు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయిందని అమ్ముగూడ, రాఘవేంద్రనగర్ కాలనీలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. చదవండి: హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రీ సర్వే.. రంగంలోకి సర్వేయర్లు ‘హైలైట్స్’ పునరుద్ధరించాలి... ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని అందజేసే ‘హైలైట్స్’ మొబైల్ యాప్ సేవలను పునరుద్ధరించాలని ప్రయాణికుల సంఘాలు కోరాయి. చిన్న చిన్న కారణాలతో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయడం పట్ల కూడా ప్రయాణికుల సంఘాలు అభ్యంతరం తెలిపాయి. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల దృష్ట్యా కూడా రైళ్లను రద్దుచేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సంఘాల నుంచి వచ్చిన సమస్యలను, సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల అభ్యర్ధనలను పరిశీలించిన అనంతరం, ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని దక్షిణమధ్యరైల్వే జనరల్మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. -
తమిళనాడులో రైలు ప్రమాద ఘటన.. 18 రైళ్ల రద్దు
తమిళనాడులో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్నవిషయం తెలిసిందే. మైసూర్-దర్భంగా భాగమతి ఎకస్ప్రెస్ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 19 గాయాలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో 1,360 మంది ప్రయాణికులు ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టీ ప్రభుశంకర్ తెలిపారు. 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే రైలు మెయిన్‌లైన్‌కు బదులు లూప్ లైన్‌లోనిక ప్రవేశించడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.కాగా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో క్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి-పుదుచ్చేరి మెము(16111), పుదుచ్చేరి-తిరుపతి మెము(16112), డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి ఎక్స్‌ప్రెస్(16203), తిరుపతి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16204), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16053), తిరుపతి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(16054), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16057), తిరుపతి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16058)అరక్కం-పుదుచ్చేరి మెము(16401), కడప-అరక్కోణం మెము(16402), డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి మెము(06727), , తిరుపతి-డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెము(06728), అరక్కోణం-తిరుపతి మెము(06753), తిరుపతి-అరక్కోణం మెము(06754), విజయవాడ-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్(12711), ఎంజీఆర్ సెంట్రల్-విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్(12712) సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్(06745), నెల్లూరు-సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్(06746) రైళ్లు రద్దయ్యాయి.The Following Trains are cancelled due to train accident of Train No.12578 #Mysuru – Darbhanga Bagmati Express at Kavaraipettai in #Chennai Division Passengers are requested to take note on this and plan your #travel #SouthernRailway pic.twitter.com/zhgmRo84l3— Southern Railway (@GMSRailway) October 11, 2024Bulletin No.4 PR NO.517 dt. 12-10-2024 @drmvijayawada @drmgnt @drmgtl @drmsecunderabad @drmhyb pic.twitter.com/oOAH0JBgji— South Central Railway (@SCRailwayIndia) October 12, 2024 -
ద.మ. రైల్వే ప్రాజెక్టులకు మరిన్ని నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పద్దులో దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన నిధులను రైల్వేశాఖ రూ. 1,350.26 కోట్ల మేర పెంచింది. మధ్యంతర బడ్జె ట్లో దక్షిణమధ్య రైల్వేకు రూ.14,232.84 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని 15,583.10 కోట్లకు పెంచింది. మొత్తంగా నిధులు పెంచడంతోపాటు ప్రాజెక్టులవారీగా మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తాలను కూడా సవరించింది. బైపాస్ లైన్లకు నిదుల పెంపు.. జంక్షన్ స్టేషన్ల సమీపంలో రైల్వే ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బైపాస్ లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. వేగంగా పనులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సవరించిన బడ్జెట్లో నిధులు పెంచింది.దక్షిణమధ్య రైల్వేకు తొలుత రూ. 2,905 కోట్లు కేటాయించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 3,629 కోట్లకు పెంచింది. అలాగే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ పనులకు రూ. 113.64 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసింది. ట్రాక్ సామర్థ్యం పెంపు పనులకు తొలుత రూ. 1,530 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని రూ. 1,930 కోట్లకు పెంచింది. కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు పెరిగిన నిధులు దక్షిణాది–ఉత్తరాదిని జోడించే గ్రాండ్ ట్రంక్ రూట్లో భాగంగా ఉన్న కాజీపేట–విజయవాడ మార్గంలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు రైళ్ల వేగాన్ని కూడా పెంచాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం మూడో మార్గాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఏడాదిలో పనులు ముగించేలా చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు మధ్యంతర బడ్జెట్లో రూ.310 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని రూ. 190 కోట్ల మేర పెంచి రూ. 500 కోట్ల కేటాయింపులు చేసింది. మరోవైపు నిజామాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా డోన్ వరకు రెండో లైన్‌ను నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ఇది మహారాష్ట్రలోని అకోలా నుంచి డోన్ వరకు విస్తరించిన ప్రాజెక్టు. ఇందులో సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తవగా ఎగువ ప్రాంతంలో జరుగుతున్నాయి. నిజామాబాద్–సికింద్రాబాద్ మధ్య జరగాల్సి ఉంది. ఈ పనులకు తొలుత రూ. 220 కోట్లు ప్రతిపాదించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 550 కోట్లకు పెంచడం విశేషం. బీబీనగర్–గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండటంతో ఆ మార్గంలో రైళ్ల సంఖ్య, వాటి వేగం పెంపు సాధ్యం కావట్లేదు. దీంతో ఈ మార్గంలో రెండోలైన్ నిర్మించే ప్రాజెక్టు గత బడ్జెట్లో మంజూరైంది. ఆ పనులకు మధ్యంతర బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 220 కోట్లకు పెంచారు. ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల్లో కోత.. పురోగతి అంతంతమాత్రంగానే ఉన్న భద్రాచలం–డోర్నకల్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కుదించింది. రూ. 100 కోట్ల కేటాయింపులను రూ. 50 కోట్లకు తగ్గించింది. అలాగే హైదరాబాద్‌లో కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు కేటాయించిన నిధులను రూ. 50 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు కుదించింది. -
సకాలంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి
సాక్షి, అమరావతి: మూడేళ్ల క్రితం రూ.55 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. వాటిలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు, కొత్త లైన్ల కోసం సర్వే మొదలైన ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం–నంబూరు మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణం కోసం రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వేశాఖకు సమర్పించామని ఆయన చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై ప్రతిపాదనల కోసం రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు శుక్రవారం విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం.. జీఎం మీడియాతో మాట్లాడారు. గత మూడేళ్లలో 33 రైల్వేస్టేషన్లలో 88 కొత్త లిఫ్టులు, 19 రైల్వేస్టేషన్లలో 218 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించామన్నారు. ఇక 101 మానవరహిత లెవల్ క్రాసింగ్లను తొలగించామన్నారు. 257 లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్‌యూబీలు, ఆర్ఓబీల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలో 56 రైల్వేస్టేషన్లను రూ.2,593 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, అదనపు స్టాపేజీలు, ఆర్ఓబీలు–ఆర్యూబీల నిర్మాణం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం ఎంపీలు చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు. విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్లతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌లతోపాటు ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, సీఎం రమేశ్, జీఎం హరీశ్ బాలయోగి, పుట్టా మహేశ్‌కుమార్, కేశినేని శివనాథ్, తెన్నేటి కృష్ణప్రసాద్ తదితర ఎంపీలు పాల్గొన్నారు. -
ఆయ్.. ఇంకా పట్టా‘లెక్కలేదండి’
సాక్షి, అమలాపురం: కోనసీమ రైలు బండి ఇంకా పట్టాలెక్కలేదు. కోనసీమ వాసుల చిరకాల స్వప్నం కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. రెండు పుష్కరాలు దాటుతున్నా ప్రతిపాదనలు కొలిక్కి రాలేదు. తొలి పన్నెండేళ్లు నిధుల కేటాయింపు జరక్కపోగా.. తరువాత పన్నెండేళ్లు నిధులు కేటాయిస్తున్నా పనుల వేగం పుంజుకోలేదు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలోని ఎంపీలతో శుక్రవారం విజయవాడలో రైల్వే అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఇబ్బందులు, నిధులు కేటాయింపులపై చర్చ జరగాలని జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అడ్డు తగులుతున్న టీడీపీ నేతలుగౌతమి గోదావరి పాయ వద్ద 41 పిల్లర్లపై గడ్డర్ల నిర్మాణ పనులకు గత నవంబర్‌లో టెండర్లు ఖరారయ్యాయి. 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ మొదలు కాలేదు. వైనతేయ, వశిష్ట గోదావరి పాయలపై గడ్డర్ల నిర్మాణాలు జరిగితే గాని ట్రాక్ నిర్మాణం చేయలేరు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2014–19 సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 25 శాతం వాటాలో కేవలం రూ.2 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేయగా.. ఆ నిధులూ ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత రెండో అలైన్‌మెంట్‌కు సంబంధించి రెవెన్యూ అధికారులు చేపట్టిన భూసేకరణకు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతుండటం గమనార్హం.సహస్రాబ్దిలో శంకుస్థాపన కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం మీదుగా నరసాపురం వరకూ రైల్వే లైన్ నిర్మాణానికి 2000 నవంబర్ 16న శంకుస్థాపన జరిగింది. మొత్తం 102.507 కిలోమీటర్ల పొడవైన కాకినాడ–నరసాపురం రైల్వే లైన్లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45.30 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం గతంలోనే పూర్తయ్యింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57.207 కిలోమీటర్లు నిరి్మంచాల్సి ఉండగా.. ఇందులో కోటిపల్లి నుంచి భట్నవిల్లి వరకూ 12.05 కిలోమీటర్ల మేర భూసేకరణ జరిగింది. భట్నవిల్లి నుంచి నరసాపురం వరకూ సుమారు 45.157 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాలి. దీనికి అప్పట్లో రూ.400 కోట్లు అవసరమని అంచనా వేయగా.. పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం ఏకంగా రూ.2,120.16 కోట్లకు పెరిగింది. పనులు ఇంకా ఆలస్యమైతే అంచనాలు మరింత పెరగనున్నాయి.త్వరగా పూర్తయ్యేలా నిర్ణయం ఉండాలి కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు నిధులు విడుదలైనా భూసేకరణ, ట్రాక్ పనుల విషయంలో జాప్యం జరుగుతోంది. కోనసీమలో త్వరితగతిన రైలు పరుగులు పెట్టేలా ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. భూసేకరణ, ట్రాక్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. – డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, కన్వీనర్, కోనసీమ రైల్వే సాధన సమితి, అమలాపురం గడ్డర్ల పనులకు టెండర్లు పిలవాలి వైనతేయ, వశిష్ట నదులపై వంతెనలకు గడ్డర్ల నిర్మాణాలకు టెండర్లు పిలవాలి. దీనిపై ఎంపీల సమావేశం నిర్ణయం తీసుకుని టెండర్ల ప్రక్రియ త్వరగా చేపట్టేలా చర్యలు చేపట్టాలి. మొక్కుబడి సమావేశంగా కాకుండా రానున్న నాలుగేళ్లలో కోనసీమలో రైలు నడిచేలా అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ కృషి చేయాలి. – బండారు రామ్మోహనరావు, కన్వీనర్, కోనసీమ జేఏసీ, అమలాపురంనేడు ఏపీ ఎంపీలతో సమావేశం రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్ట్‌లకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ రాష్ట్ర ఎంపీలతో శుక్రవారం సమావేశం కానున్నారు. విజయవాడలోని ఈటీటీసీ (ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్)లో ఉదయం 10.30 గంటలకు సమావేశం మొదలవుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతి, కొత్త రైల్వేలైన్లు, విశాఖ రైల్వేజోన్ తదితర అంశాలపై చర్చిస్తారు. -
‘కవచ్’కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: భారీ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న తర్వాత ఎట్టకేలకు రైల్వే శాఖ మేల్కొంది. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు అవి పరస్పరం ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక ‘కవచ్’ను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రయోగాలు, పరీక్షలు అంటూ కాలయాపన చేసిన తర్వాత ఆ పరిజ్ఞానాన్ని ట్రాక్ మీద, లోకోమోటివ్‌లలో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచింది. ఈ పరిజ్ఞానానికి సంబంధించి 4.0 వెర్షన్ ప్రయోగాలు విజయవంతం కావటంతో, దాన్ని దశలవారీగా అన్ని జోన్లలో ఏర్పాటు చేయనుంది.ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 వేల రూట్ కిలోమీటర్లలో ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. దీంతో రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో ఆ వ్యవస్థ ఉండగా, కొత్తగా మరో 1,618 రూట్ కి.మీ.లలో ఏర్పాటుకు తాజాగా రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. దక్షిణ మధ్య రైల్వేతో శ్రీకారం..: దేశంలో తొలిసారి కవచ్ పరిజ్ఞానాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఏర్పాటు చేశారు. కవచ్ పరిజ్ఞా నాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు 2014–15లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్‌నగర్–వికారాబాద్–వాడి సెక్షన్లను ఎంచుకున్నారు. 250 కి.మీ. పరి ధిలో పలు దశల్లో పరీక్షించారు. 2015–16లో ప్యాసింజర్ రైళ్లలో క్షేత్రస్థాయి ట్రయల్స్ నిర్వ హించారు. 2017–18లో కవచ్ స్పెసిఫికేషన్ వెర్షన్ 3.2ను విజయవంతంగా ముగించారు. 2018–19లో ఈ పరిజ్ఞానానికి ఆర్డీఎస్ఓ ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో, 200 లోకోమోటివ్స్‌లో ఏర్పాటైంది. ఇప్పుడు కవచ్ మేజర్ వర్షన్ అయిన 4.0 ద్వారా ఆ పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షన్ ట్రయల్స్ కోసం సనత్‌నగర్–వికారాబాద్ సెక్షన్ పరిధిలో 65 రూట్ కి.మీ.లలో ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ పరీక్షలు విజయవంతం కావడంతో ఈ పరిజ్ఞానాన్ని హై డెన్సిటీ నెట్ వర్క్ పరిధిలో ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోస బలార్షా–కాజీపేట– విజయవాడ, విజయవాడ–గూడూరు, విజయ వాడ–దువ్వాడ, వాడి–గుంతకల్–ఎర్రగుంట్ల–రేణిగుంట కారిడార్లలో ఏర్పాటు చేస్తారు. ఈ రూట్లలో మొత్తం 1,618 రూట్ కి.మీ. లలో ఏర్పాటుకు ఇటీవల టెండర్లు పిలిచారు. కవచ్‌తో ఇవీ లాభాలు» ఒకే ట్రాక్‌మీద రెండు రైళ్లు వచ్చినప్పు డు లోకోపైలట్ బ్రేక్ వేయకపోయినా, ఆ పరిజ్ఞానం వల్ల రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుంది. » ఎక్కడైనా రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు లోకోపైలట్ పట్టించుకోకుండా రైలును ముందుకు నడిపినప్పుడు లోకో పైలట్‌ను ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అప్పటికీ రైలును ఆపకపోతే తనంతట తానుగా బ్రేక్ వేస్తుంది. » అవసరమైన ప్రాంతాల్లో హారన్ మోగించనప్పుడు ఇది తనంతట తానుగా ఆ పని చేస్తుంది. -
తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో ‘కవచ్ 3.2’ రక్షణ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్ : రైళ్లు ఢీకొనకుండా ప్రయా ణికుల భద్రతకు భరోసాను కల్పించేవిధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్ 3.2’రక్షణ వ్యవస్థ పనితీరును దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆదివారం సికింద్రాబాద్– ఉందానగర్ సెక్షన్లో పరిశీలించారు. తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో కవచ్ 3.2 వెర్షన్ అమలు తీరుతెన్నులను తనిఖీ చేశారు. ఆయన వెంట దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ సౌరభ్ బందోపాధ్యాయ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేశ్ విష్ణోయ్, చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ వీఎస్ఎం.రావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా కవచ్ టవర్స్, ట్రాక్ సైడ్ పరికరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ, కవచ్‌తో ముడిపడిన వివిధ సాంకేతిక వ్యవస్థల పనితీరును జీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. ఎదురుగా వచ్చే రైలును గుర్తించినా బ్రేక్ వేయడంలో లోకో పైలట్ విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్స్ అప్లికేషన్ ద్వారా నిర్దేశిత వేగ పరిమితుల్లో రైలును నిలిపేందుకు లోకో పైలెట్‌కు కవచ్ వ్యవస్థ సహాయం చేస్తుంది. ప్రతికూల వాతావరణంలో రైలును సురక్షితంగా నడిపేందుకు కూడా ఈ వ్యవస్థ సహాయ పడుతుంది. ఈ తనిఖీల సందర్భంగా బ్లాక్ సెక్షన్లలో, స్టేషన్లలో రన్నింగ్ లైన్లలో రైళ్లు ఢీకొనడాన్ని నివారించడానికి ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్సర్ ద్వారా కవచ్ సిస్టమ్ రూపొందిందని చెప్పారు. అత్యున్నతస్థాయి సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవల్–(ఎస్.ఐ–ఎల్4) సర్టిఫికెట్ కూడా పొందిందని వివరించారు. ఇది ప్రమాదంలో సిగ్నల్ పాస్ కాకుండా నివారిస్తుందని, తద్వారా రైలు కార్యకలాపాల భద్రతకు భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో దక్షిణమధ్య రైల్వేజోన్ కవచ్ 4.0 వెర్షన్‌కు మారనున్నట్టు తెలిపారు. ఉందానగర్ రైల్వేస్టేషన్‌ను కూడా జీఎం తనిఖీ చేశారు. ప్రయాణికుల సదుపాయా లతోపాటు స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. కవచ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన భద్రతాపరమైన ఇన్సలేషన్లను తనిఖీ చేశారు. భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ మేరకు ఉందానగర్ రైల్వేస్టేషన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. -
Onam Special Trains: ఓనమ్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఓనమ్ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. కాచిగూడ–కొల్లాం (07044/07045) రైలు ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు బయల్దేరి మర్నాడు.. రాత్రి 11.20 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 16వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయల్దేరి మర్నాడు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాగా, వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నిరాశే ఎదురవుతోంది. సంక్రాంతికి నాలుగు నెలల ముందే ప్రధాన రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ రిజర్వేషన్లు శుక్రవారం ఉదయం 8 గంటలకు అందుబాటులోకి రాగా.. గోదావరి, విశాఖ, కోణార్క్, ఫలక్‌నుమా తదితర రైళ్లకు 8.05 గంటలకల్లా పూర్తిస్థాయిలో బెర్తులు నిండిపోయాయి. కేవలం ఐదు నిమిషాలలోనే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.ఇదీ చదవండి: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం యాత్రికులు -
విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఎన్ఎస్జీ–1 హోదా
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేలోనే ఎంతో ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ–1 (నాన్ సబర్బన్ గ్రూప్) హోదా సాధించి దేశంలోనే టాప్ 28 స్టేషన్లలో ఒకటిగానూ, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తరువాత రెండో స్టేషన్‌గా అరుదైన ఘనత సాధించింది. రైల్వేబోర్డు 2017–18 సంవత్సరం నుంచి ప్రతి ఐదేళ్లకోసారి స్టేషన్ల కేటగిరీ ఎంపిక విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రూ.500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్లకు ఎన్ఎస్జీ–1 హోదా వస్తుంది. అప్పట్లో విజయవాడ స్టేషన్ రెండు ప్రమాణాలలో తక్కువగా ఉండటంతో ఎస్ఎస్జీ–2 హోదాతో సరిపెట్టుకుంది. ఐదేళ్ల తరువాత 2023–24లో రైల్వేబోర్డు తాజా సమీక్షలో విజయవాడ స్టేషన్ అత్యధికంగా రూ. 528 కోట్ల వార్షిక ఆదాయం, 16.84 మిలియన్ల ప్రయాణికులను కలిగి ఉండడంతో రైల్వేశాఖ ఎన్ఎస్జీ–1 హోదా ప్రకటించింది. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ విజయవాడ డివిజన్‌కు ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ–1 హోదా రావటం గర్వకారణమన్నారు. వ్యాపార, వాణిజ్య పరంగా డివిజన్ ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
రాయనపాడు మీదుగా పలు రైళ్ల పునరుద్ధరణ
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): వరద తీవ్రత తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని రాయనపాడు స్టేషన్ పరిధిలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి పలు రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఆయా రైళ్లకు రాయపాడులో స్టాపేజీని తొలగించి నిర్దేశించిన ట్రాక్‌లపై నడుపుతున్నారు. విశాఖపట్నం–హైదరాబాద్ (12727), విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (12861), విశాఖపట్నం–నాందేడ్ (20811), తిరుపతి– సికింద్రాబాద్ (12763), గూడూరు– సికింద్రాబాద్ (12709), తాంబరం– హైదరాబాద్ (12759), యశ్వంత్‌పూర్–లక్నో (12539), చెన్నై సెంట్రల్–న్యూఢిల్లీ (12621), పుదుచ్చేరి– న్యూఢిల్లీ (22403), కొచ్చువెల్లి–గోరఖ్‌పూర్ (12512), విశాఖపట్నం–ఎల్టీటీ ముంబై (18519), విశాఖపట్నం–సాయినగర్ షిర్డీ (18503), షాలీమార్– హైదరాబాద్ (18045), షాలీమార్–సికింద్రాబాద్ (22849), బెంగళూరు–ధనాపూర్ (12295) రైళ్లను పునరుద్ధరించారు.మల్దా టౌన్–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లురానున్న దసరా, దీపావళి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ మీదుగా మల్దా టౌన్–సికింద్రాబాద్ మధ్య ఎనిమిది ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. మల్దా టౌన్–సికింద్రాబాద్ (03430) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి మంగళవారం, సికింద్రాబాద్–మల్దాటౌన్ (03429) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి గురువారం నడుస్తాయని తెలిపారు. -
కూ.. చకచకా..
సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే లైన్ల పనులను రైల్వే అధికారులు, సిబ్బంది, కార్మీకులు శరవేగంగా పూర్తి చేశారు. మొత్తంగా 52 గంటల్లో పనులు పూర్తి చేసి ట్రయల్‌రన్ నడిపించారు. అంతా సవ్యంగా ఉండడంతో బుధవారం మధ్యాహ్నం విజయవాడ– సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కదిలింది. పగలూ.. రాత్రి తేడా లేకుండా...: వరద ఉధృతి పెరిగి తాళ్లపూసపల్లి– కేసముద్రం రైల్వేలైన్‌లోని 432, 433 కిలోమీటరు మార్కు వద్ద 200 మీటర్ల మేర పట్టాల కింద కంకర, మట్టి, సిమెంట్ దిమ్మెలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 418 కిలోమీటర్ రాయి వద్ద 200 మీటర్ల మేర, మరో నాలుగు చోట్ల పాక్షికంగా లైన్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో శనివారం అర్ధరాత్రి 2 గంటల నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్మీకులను తీసుకొచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పనులు వేగంగా..: దేశంలోని ప్రధాన పట్టణాలను కలుపుతూ నడిచే రైలుమార్గం దెబ్బతినడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోగా, దీంతో మరమ్మతుల పనుల్లో అధికారులు వేగం పెంచారు. ముందుగా డౌన్‌లైన్ పనులు తాళ్లపూసపల్లి– కేసముద్రం మధ్యలో ఏడు జేసీబీలు, 300 మంది కార్మీకులు, 100 మంది సూపర్వైజర్లు, 100 మంది వివిధ కేటగిరీకి చెందిన రైల్వే ఉద్యోగులు ఇలా మొత్తంగా 500 మంది పనిచేశారు. – ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 13 జేసీబీలు, 150 మంది సూపర్వైజర్లు, 300 మంది రైల్వేస్టాఫ్, 550మంది కార్మికులు మొత్తం కలిసి 1000 మందితో పనులు ప్రారంభించారు. పనులకు వరద ప్రవాహం అడ్డురావడంతో బండరాళ్లు, ఇసుక బస్తాలతో వరదను కట్టడి చేసి పనులు వేగవంతం చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే అప్‌లైన్ (సికింద్రాబాద్–విజయవాడ) లైన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు.. కదిలిన రైళ్లు రైల్వే ట్రాక్ పనులు పూర్తి కావడంతో ముందుగా తాళ్లపూసపల్లి– మహబూబాబాద్ మధ్య ట్రయల్ రన్‌గా గూడ్సు రైలును నడిపారు. ఇంటికన్నె–కేసముద్రం మధ్య కేసముద్రం రైల్వేస్టేషన్లో నిలిచిన సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలును ట్రయల్ రన్‌గా నడిపారు. ఆ తర్వాత నాలుగు గూడ్స్ రైళ్లను అప్‌లైన్‌లో పంపించారు. ఇక ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో కేసముద్రం–ఇంటికన్నె మధ్య 418 కిలోమీటర్ మీదుగా వేగాన్ని తగ్గించి 5 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా నడిపించారు. రైల్వేట్రాక్ మరమ్మతులు చేసిన చోట కొంతవరకు కుంగిపోయింది. కాగా ట్రాక్ కుంగిపోయిన చోట జాకీలతో పైకి లేపి మరమ్మతు పనులు చేశారు. వర్షం కురుస్తున్నా, పనులను మాత్రం ఆపకుండా వేగవంతంగా చేస్తున్నారు. -
ప్రయాణికులకు అలర్ట్.. మరో 48 రైళ్లు రద్దు.. వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో రైల్వే లైన్లు పాడయ్యాయి. పలుచోట్ల రైలు పట్టాలపై వరదనీరు ప్రవహించడంతో ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందలాది రైళ్లు రద్దయ్యాయి.మంగళవారం మరో 28 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 24 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఈ మేరకు సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా 28 రైళ్లు రద్దు చేశారు. అయితే ముందుగా దారి మళ్లించిన పలు రైళ్లతోపటు మరో 18 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దు చేసిన రైళ్ల వివరాలు ఈ కింద ఉన్నాయి. గమనించగలరు.కాగా వర్షాల ప్రభావంతో ఇప్పటి వరకు దాదాపు 500కుపైగా రైళ్లు రద్దు కాగా..160 సర్వీసులను దారి మళ్లించారు. Revised -Bulletin No. 31 - SCR PR No. 359 on "Cancellation of Trains due to Heavy Rains" pic.twitter.com/OHNw9itaD7— South Central Railway (@SCRailwayIndia) September 3, 2024Bulletin No.30: SCR PR No.358, Dt.03.09.20024 on "Cancellation/diversion of Trains due to Heavy Rains" pic.twitter.com/AHcCOghiuK— South Central Railway (@SCRailwayIndia) September 3, 2024 -
SCR: వరద బీభత్సంతో వరుసబెట్టి రైళ్ల రద్దు
సాక్షి,హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. వరంగల్-మహబూబాబాద్‌లో రైల్వే ట్రాకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు సోమవారం (సెప్టెంబర్ 2) ఉదయం 96 రైళ్లను రద్దు చేశారు. వరద కారణంగా నిన్న రాత్రి రైల్వే అధికారులు 142 రైళ్లను దారి మళ్లించారు. 177 రైళ్లను రద్దు చేశారు. భారీ వరదల కారణంగా మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గం మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.భారీ వర్షాలతో దెబ్బతిన్న ట్రాకులను పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది.రైల్వే ట్రాకుల మరమ్మత్తుకోసం వెయ్యిమంది సిబ్బందిని దెబ్బ తిన్న ప్రాంతాలకు తరలించింది. ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు రెండు రోజులు పట్టే అవకాశం ఉండగా.. ప్రయాణికుల సౌకర్యార్ధం హైదాబాద్ విజయవాడ, వరంగల్‌లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. Speedy restoration works in progress in the affected section due to incessant rains in Intakanne - Kesamudram Section, Secunderabad Division, Telangana. SCR Officials monitoring the restoration works camping at the affected site. pic.twitter.com/eok1XaHHgk— South Central Railway (@SCRailwayIndia) September 1, 2024మహబూబాబాద్‌కు దక్షిణ మధ్య రైల్వే జీఎం జీఎం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్‌లో ధ్వంసమైన ఇంటికన్నె-కేసముద్రం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం జీఎం అరుణ్ కుమార్ జైన్ పరిశీలించేందుకు వెళ్లారు.మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులు నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్‌లు దెబ్బ తినడంతో సుమారు 80కి పైగా రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. రైల్ నిలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను దక్షిణ మధ్య రైల్వే జీఎం జీఎం అరుణ్ కుమార్ జైన్ పర్యవేక్షిస్తున్నారు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 432 రైళ్ల రద్దువరదల కారణంగా రైల్వే ట్రాక్‌లు దెబ్బ తిన్న ప్రాంతాల్ని ఈ రోజు ఉదయం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతానికి వెళ్లినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులపై సాక్షి టీవీ సీపీఆర్వో శ్రీధర్ని సంప్రదించింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ..దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 432 పైగా రైళ్లు రద్దు చేయగా..13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.139 రైళ్లు దారి మళ్ళించామన్న ఆయన.. ట్రాక్ పునరుద్దరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. రేపు సాయంత్రం వరకు రైళ్ళ పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందన్నారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఆరు డివిజన్లలో పరిస్థితిపై కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. -
గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు: సౌత్ సెంట్రల్ రైల్వే
సాక్షి,హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో రైళ్లు భారీగా రద్దవుతున్నాయి. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం సేవలందించాల్సిన హైదరాబాద్- విశాఖ- హైదరాబాద్ (12728/12727) గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మొత్తం 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తాజా బులిటెన్ విడుదల చేసింది. భారీ వర్షాలకు పట్టాలపై వరదనీరు చేరడంతో మరో 15 రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య సర్వీసులందించే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) రైలును ఈ సాయంత్రం 4.50 గంటలకు బదులుగా సాయంత్రం 6.50గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రైలు సర్వీసుల పునరుద్ధరణ, భద్రతాపరమైన చర్యలపై ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వద్ద అధికారులతో చర్చించారు. -
ప్రయాణికులకు గూడ్‌న్యూస్.. మరో 8 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వరుస సెలవులు రావడంతో ప్రజలంతా ప్రయాణాలు కట్టారు. సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతోపాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 8 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. -
సెలవులొచ్చాయ్.. ఛలో ఊరికి..
సాక్షి, అమరావతి : గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో ప్రజలంతా ప్రయాణాలు కట్టారు. సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతోపాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించింది. 18న నర్సాపూర్– సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్– నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్సోల్, కాచిగూడ– తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. వాటన్నింటిలోనూ ఏసీ కోచ్‌లున్నాయి. కానీ, వీటిలో ప్రయాణికులకు ఇచ్చేందుకు బెడ్ రోల్స్ లేవు. దక్షిణ మధ్య రైల్వే రోజూ నిత్యం 210 రెగ్యులర్ రైళ్లను నిర్వహిస్తోంది. ఇక ఏడాదిలో వివిధ సందర్భాలను పరిగణలోకి తీసుకుని 200 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నిర్ణీత తేదీల్లో వీటిని నడుపుతుంటుంది. రెగ్యులర్, ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు (బెడ్‌రోల్స్) ఇస్తుంది. విజయవాడ, తిరుపతి, గుంతకల్, కాచిగూడల్లో ఉన్న రైల్వే మెకనైజ్డ్ లాండ్రీల్లో వాటిని శుభ్రపరిచి, తిరిగి సరఫరా చేస్తుంటుంది. కానీ ఇప్పుడు అదనంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌ల ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు లేవు. దాంతో ఈ రైళ్లలో బెడ్ రోల్స్ అందించలేమని, ప్రయాణికులు దుప్పట్లను వారే తెచ్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ ఆర్టీసీ రాష్ట్రంలో రోజుకు 11 వేల బస్సు సర్వీసులు నిర్వహిస్తోంది. వరుస సెలవుల కారణంగా బస్సుల్లో టికెట్లు దొరకడంలేదు. రానున్న వారం రోజులకు సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దాంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆధారపడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సు చార్జీ రూ.1,200 ఉండగా ఇప్పుడు రూ.2 వేలకు పెంచేశారు. స్లీపర్ ఏసీ బస్సుల్లో రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఊళ్లకు వెళ్తుండటంతో టోల్ గేట్ల వద్ద రద్దీ భారీగా పెరిగింది. పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నందున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇవీ సెలవులు15వ తేదీ గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు16వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఐచ్ఛిక సెలవు17వ తేదీ శనివారం – సాధారణ సెలవు 18వ తేదీ ఆదివారం – సాధారణ సెలవు 19వ తేదీ సోమవారం – రాఖీ పౌర్ణమి సెలవు -
రైల్వేలో క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో యూపీఐ(యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) చెల్లింపులో భాగంగా క్యూర్ కోడ్ స్కానర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లతోపాటు టికెట్ జారీ కౌంటర్లన్నింటిలో క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉంచారు. యూపీఐ పద్ధతిలో చెల్లింపులు అతి సర్వసాధారణంగా మారిన తరుణంలో రైల్వే ఏకంగా దీనిపై ఐదునెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. అంతకు కొద్ది నెలల ముందు యూపీఐ చెల్లింపులను కొన్ని స్టేషన్లలో ప్రారంభించినా.. క్యూఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిని మాత్రం అందుబాటులోకి తేలేదు. మార్చి 21న దక్షిణ మధ్య రైల్వేలోని 14 ప్రముఖ స్టేషన్లలో క్యూఆర్‌కోడ్ పరిశీలన ప్రారంభించింది. కేవలం 31 కౌంటర్లలో స్కానర్లను ఏర్పాటు చేసింది. దాదాపు ఐదు నెలల సుదీర్ఘకాల ప్రయోగానంతరం ఎట్టకేలకు ఇప్పుడు జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రారంభించటం విశేషం. వంద శాతం డిజిటల్ చెల్లింపులు జరగాలని నినాదం ఇచ్చి.. రైల్వేస్టేషన్లలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు దాదాపు ఆరేళ్ల క్రితం దక్షిణ మధ రైల్వే ప్రకటించింది. ఇందుకోసం కాచిగూడ స్టేషన్లో ఓ అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. స్టేషన్లలోని అన్ని దుకాణాల్లో డిజిటల్ చెల్లింపు పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని, ప్రయాణికుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తరచు ఆకస్మిక తనిఖీలతో అధికారులు స్టేషన్లలోని దుకాణాలను తనిఖీ చేసి దాని అమలు తీరును పరిశీలిస్తూ వచ్చారు. ఆపై రైల్వే బోర్డుకు నివేదికలు సమర్పించింది. కానీ, తాను మాత్రం టికెట్ల విక్రయాల్లో దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డ ప్రజలు రైల్వేస్టేషన్లలో టికెట్ కొనేందుకు మాత్రం నగదు చెల్లించాల్సి రావటంతో ఇబ్బంది పడుతూ వచ్చారు. యూపీఐ చెల్లింపులు విస్తృతమైన నేపథ్యంలో చాలామంది జేబుల్లో నగదు అందుబాటులో ఉండేది కాదు. రైల్వే స్టేషన్లలో ఈ పద్ధతి అమలులో లేదని తెలియక, నగదు లేకుండా వచ్చి క్యూ లైన్లలో నిలబడి తీరా టికెట్ కొనేప్పుడు విషయం తెలిసి ఉసూరుమంటూ ఏటీఎంల వైపు పరుగుపెట్టడం సాధారణంగా మారింది. దీంతో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతూ వచ్చాయి. కొన్నేళ్లపాటు డెబిట్ కార్డు ద్వారా డిజిటల్ చెల్లింపు పద్ధతులను మాత్రం అమలు చేసింది. యూపీఐ చెల్లింపుల కోసం ఇక తప్పని పరిస్థితి ఎదురుకావటంతో క్యూఆర్‌కోడ్ స్కానర్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టి జనం ‘జేబు’ఇబ్బందులను దూరం చేసింది. -
ఆ రైళ్లలో బెడ్‌రోల్స్ లేవు...
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు నడిపే స్పెషల్ రైళ్లలో బెడ్‌రోల్స్‌కు కొరత ఏర్పడుతోంది. అందుబాటులో ఉన్న బెడ్ రోల్స్ సంఖ్య, వాటిని శుభ్రపరిచి తిరిగి అందించే లాండ్రీల సామర్థ్యానికి మించి డిమాండ్ ఏర్పడటమే దీనికి కారణం. రెగ్యులర్ రైళ్లు, సంవత్సరం పొడవునా నిర్వహించే సాధారణ స్పెషల్ రైళ్లకు ఇవి సరిపోతుండగా, ఉన్నట్టుండి వచ్చే రద్దీ ఆధారంగా నడిపే స్పెషల్ రైళ్లకు ఈ సమస్య ఏర్పడుతోంది. ఐదు రోజుల వరుస సెలవులతో.. పంద్రాగస్టు నేపథ్యంలో గురువారం దేశవ్యాప్త సెలవు ఉంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. దీంతో రాకపోకలు బాగా పెరుగుతాయి. శనివారం వారాంతం కావటంతోపాటు ఆదివారం పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో శనివారం ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉండనుంది. ఆదివారం ఎలాగూ సెలవు, ఆ రోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లున్నాయి. సోమవారం రాఖీ పౌర్ణమి.. ఇలా వరుసగా ఐదు రోజుల పాటు రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో.. మరిన్ని స్పెషల్ రైళ్లు నడపాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 15 మంది పార్లమెంటు సభ్యులు విన్నప లేఖలు పంపారు. ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్ వచ్చి0ది. దీంతో అందుబాటులో రేక్స్ తక్కువగా ఉండటంతో.. కొన్ని స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. స్పెషల్ రైళ్లు ఇవే.. 18న నర్సాపూర్–సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్–నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్సోల్, కాచిగూడ–తిరుపతి మధ్య వీటిని నడుపుతున్నారు. వీటన్నింటిలో ఏసీ కోచ్‌లున్నాయి. కానీ, వాటిల్లోని ప్రయాణికులకు బెడ్‌రోల్స్‌ను సర్దుబాటు చేయలేమని నిర్ణయించుకున్న దక్షిణ మధ్య రైల్వే, బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లలో బెడ్ రోల్స్‌ను సరఫరా ఉండదని తేల్చి చెప్పింది. ఇక ప్రయాణికులే సొంత ఏర్పాట్లతో రావాలన్నది దాని పరోక్ష సారాంశం. -
K Padmaja: సవాళ్లే పట్టాలెక్కించేది
దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్) గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారి కె.పద్మజ హైదరాబాద్ రైల్ నిలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఆర్టిఎస్ బ్యాచ్‌కు చెందిన పద్మజ ఎస్‌సిఆర్‌లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ‘ఇప్పుడంటే మహిళా అధికారులను అందరూ అంగీకరిస్తున్నారు కానీ, 30 ఏళ్ల క్రితం పురుష ఉద్యోగులు నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు..’ అంటూ నాటి విషయాలను చెబుతూనే, ఉద్యోగ జీవనంలో సవాళ్లను ఎదుర్కొన్న తీరు తెన్నులను ‘సాక్షి’తో పంచుకున్నారు.‘‘సౌత్ సెంట్రల్ రైల్వేలో మొట్టమొదటి మహిళా ఆఫీసర్‌గా ఈ పోస్ట్‌లోకి రావడం చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడంటే వర్క్‌ఫోర్స్‌లో చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, నేను జాయిన్ అయినప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. కొత్తగా వర్క్‌లో చేరినప్పుడు ఒక తరహా స్ట్రెస్ ఉండేది. నన్ను నేను చాలా సమాధానపరుచుకునేదాన్ని. ‘ఒక్కదాన్నే ఉన్నాను అని ఎందుకు అనుకోవాలి.. ఎవరో ఒకరు రూట్ వేస్తేనే ఆ తర్వాత వచ్చే మహిళలకు మార్గం సులువు అవుతుంది కదా’ అనుకునేదాన్ని.ఎదుర్కొన్న సవాళ్లుమొదట్లో డివిజనల్ ఆఫీస్ మేనేజర్‌గా జాయిన్ అయినప్పుడు ఒక మహిళను అధికారిగా అంగీకరించడానికి సహోద్యోగులకే కష్టంగా ఉండేది. నేను మొదటిసారి ఇన్స్పెక్షన్కి వెళ్లినప్పుడు స్టేషన్ మాస్టర్‌కి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మొదట వాళ్లు నమ్మలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి ‘ఇక్కడెవరో లేడీ వచ్చారు. ఆవిడేమో నేను డివిజనల్ ఆఫీస్ మేనేజర్ని అంటోంది, ఏమిటిది?’ అని అడిగారు. మా కొలీగ్ ‘ఆవిడ కూడా నాలాగే ఆఫీసర్’ అంటే అప్పుడు వాళ్లు అంగీకరించక తప్పలేదు. ఆ స్టేజ్ నుంచి ఇక్కడకు రావడానికి చాలా సవాళ్లు ఉన్నాయి. మొదట్లో గుర్తించిన మరో విషయం ఏంటంటే తోటి ఉద్యోగులు చాలామంది నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు. దీంతో ‘నేను ఎక్స్పర్ట్ అయితేనే ఈ అసమానతను తొలగించగలను’ అనుకున్నాను. అందుకు, నా పనిని ఎప్పుడూ ముందు చేసినదానికన్నా బెటర్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. పనిచేసే చోట రూల్స్ పరంగా అన్నీ క్లియర్‌గా ఉంటాయి. అయితే, మనతో ఉండే కొలీగ్స్, సీనియర్స్ విషయంలో వారి ప్రవర్తనలో తేడాలు కనిపిస్తుంటాయి. ‘ఇంత సమర్థంగా చేస్తున్నా కూడా ఇంకా వివక్షతోనే చూస్తున్నారే..’ అని అనిపించేది. ఇంటì నుంచి బయటకు వచ్చినప్పుడు వీటన్నింటినీ ఎదుర్కోకతప్పదు అన్నట్టుగా ఉండేవి ఆ రోజులు. ఇప్పటి తరంలో ఈ ఆలోచన పూర్తిగా మారిపోయింది. అయితే, ఏదీ అంత సులువైనది కాదు, కష్టమైన జర్నీయే. కానీ, నిన్నటి కన్నా ఈ రోజు బెటర్‌గా మార్చుకుంటూ రావడమే నన్ను ఇలా ఒక ఉన్నత స్థానంలో మీ ముందుంచ గలిగింది. ముఖ్యమైనవి వదులుకోవద్దుపిల్లల చిన్నప్పుడు మాత్రం తీరిక దొరికేది కాదు. ఉద్యోగం, ఇల్లు, వేడుకలు.. వీటన్నింటిలో కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. వాటిని మనం అంగీకరించాల్సిందే. అయితే, ముఖ్యమైన వాటిని వదిలేదాన్ని కాదు. నాకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు వాళ్లు వర్కింగ్ ఉమెన్. డ్యూటీ చూసుకుంటూనే పిల్లల పేరెంట్ టీచర్ మీట్, స్పోర్ట్స్ మీట్, స్కూల్ ఈవెంట్స్.. తప్పనిసరి అనుకున్నవి ఏవీ మిస్ అయ్యేదాన్ని కాదు. ఆఫీస్ పని వల్ల ఇంట్లో ముఖ్యమైన వాటిని వదులుకున్నాను ... అనుకునే సందర్భాలు రాకూడదు అనుకునేదాన్ని. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఊపిరి సలుపుకోనివ్వనంత గా పనులు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. అయితే, వర్క్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినతర్వాత అన్నీ సులువుగా బ్యాలన్స్ చేసుకో గలిగాను. మా నాన్నగారు ఐఎఎస్ ఆఫీసర్ కావడంతో తరచు బదిలీలు ఉండేవి. మా అమ్మానాన్నలు ఎంతో బిజీగా ఉండి కూడా మాతో ఎలా ఉండేవారో తెలుసు కాబట్టి, నేనే సరైన టైమ్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకున్నాను. ఏదైనా పనికి గంట సమయం కుదరకపోతే అరగంటలోనైనా పూర్తి చేయాలి. ప్లానింగ్ మన చేతుల్లో ఉన్నప్పుడు దేనినీ వదులుకోవాల్సిన అవసరం లేదు. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఇప్పటికీ రోజూ కొంతసమయం బుక్స్‌కి కేటాయిస్తాను. అలాగే, మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. పాజిటివ్ ఆలోచనలు మేలు..ముందుగా మహిళ ఇతరుల మెదళ్ల నుంచి ఆలోచించడం మానేయాలి. వాళ్లేం అనుకుంటారో, వీళ్లేం అంటారో... అనే ఆలోచన మన జీవితాన్ని నరక మయం చేస్తుంది. కెరియర్ మొదట్లోనే మన కల పట్ల స్పష్టత ఉండాలి. ఎన్ని సమస్యలు వస్తున్నా మనకంటూ ఒక స్పష్టమైన దారిని ఎంచుకోవాలి. సగం జీవితం అయిపోయాకనో, పిల్లలు పెద్దయ్యాక చూద్దాంలే అనో అనుకోవద్దు. ముందుగా అన్ని రకాలుగా స్థిరత్వం ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి అనుకోవాలి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడం సులువు అవుతుంది’’ అంటూ సొంతంగా వేసుకున్న దారుల గురించి వివరించారు ఈ ఆఫీసర్. కుటుంబ మద్దతుట్రెయిన్స్కు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ప్రమాదాలు.. వంటి సమయాల్లో నైట్ డ్యూటీస్ కూడా తప్పనిసరి. నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలి. మా పని ఈ కొద్ది గంటలు మాత్రమే అన్నట్టు ఏమీ ఉండదు. 24/7 ఏ సమయంలోనైనా డ్యూటీలో ఉండాల్సిందే. మా పేరెంట్స్, కుటుంబ సభ్యులందరూ నా బాధ్యతలను, పని ఒత్తిడిని అర్థం చేసుకొని, పూర్తి మద్దతుని, సహకారాన్ని ఇవ్వడం వల్ల నేను నిశ్చింతగా నా పనులు చేçసుకోగలిగాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: నోముల రాజేష్‌రెడ్డి -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతున్న నాన్–ఇంటర్ లాక్ పనుల కారణంగా డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్లు: తెనాలి–విజయవాడ (7630), విజయవాడ–గూడూరు (7500), నర్సాపూర్–విజయవాడ (17270), విజయవాడ–బిట్రగుంట (7978) ఆగస్టు 3 నుంచి 10 వరకు, నర్సాపూర్–గుంటూరు (7281), హుబ్లి–విజయవాడ (17329) ఆగస్టు 4 నుంచి 10 వరకు, గూడూరు–విజయవాడ (7458), విజయవాడ–మాచర్ల (7781), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఆగస్టు 4 నుంచి 11 వరకు, విజయవాడ–భద్రచలం రోడ్డు (7979), భద్రచలం రోడ్డు–విజయవాడ (7278), విజయవాడ–తెనాలి (7295), తెనాలి–విజయవాడ (7575), విజయవాడ–గుంటూరు (7464/7465), విజయవాడ–డోర్నకల్ (7756/7755), విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202), విశాఖపట్నం–కడప (17488), విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712) ఆగస్టు 5 నుంచి 10 వరకు, గుంటూరు–రేపల్లె (7784/7785), గుంటూరు–విజయవాడ (7976), విజయవాడ–నర్సాపూర్ (17269), విజయవాడ–హుబ్లి (17330) ఆగస్టు 5 నుంచి 11 వరకు, మాచర్ల–విజయవాడ (7782), విజయవాడ–తెనాలి (7629), బిట్రగుంట–విజయవాడ (7977), విజయవాడ–నర్సాపూర్ (7862) ఆగస్టు 8 నుంచి 12 వరకు, కడప–విశాఖపట్నం (17487) ఆగస్టు 6 నుంచి 11 వరకు, చెన్నై సెంట్రల్–విజయవాడ (12077/12078) ఆగస్టు 5, 7, 8, 9, 10 తేదీలలో పూర్తిగా రద్దు చేశారు. దారి మళ్లింపు: సికింద్రాబాద్–విశాఖపట్నం (12740) ఆగస్టు 2 నుంచి 10 వరకు, గాం«దీనగర్–విశాఖపట్నం (20804) ఆగస్టు 4న, నిజాముద్దిన్–విశాఖపట్నం (12804) ఆగస్టు 4, 7వ తేదీలలో, ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019) ఆగస్టు 2 నుంచి 10 వరకు, యశ్వంత్‌పూర్–టాటా (18112) ఆగస్టు 4న, హైదరాబాద్–షాలీమార్ (18046) ఆగస్టు 3 నుంచి 11 వరకు, షిర్డీ సాయినగర్–కాకినాడ పోర్టు (17205) ఆగస్టు 4, 6, 8 తేదీలలో, షిర్డీ సాయినగర్–విశాఖపట్నం (18504) ఆగస్టు 2, 9 తేదీలలో, న్యూ ఢిల్లీ–విశాఖపట్నం (20806) ఆగస్టు 2 నుంచి 10 వరకు, హైదరాబాద్–విశాఖపట్నం (12728) ఆగస్టు 3 నుంచి 11 వరకు, విశాఖపట్నం–సికింద్రాబాద్ (12739) ఆగస్టు 2 నుంచి 10 వరకు, విశాఖపట్నం–న్యూఢిల్లీ (20805) ఆగస్టు 2 నుంచి 10 వరకు, భువనేశ్వర్–ఛత్రపతి శివాజీ టెర్మినస్ (11020) ఆగస్టు 2 నుంచి 10 వరకు, కాకినాడ పోర్టు–íÙర్డీ సాయినగర్ (17206) ఆగస్టు 3, 5, 7, 10 తేదీలలో, షాలీమార్–హైదరాబాద్ (18045) ఆగస్టు 2 నుంచి 10 వరకు, విశాఖపట్నం–నిజాముద్దిన్ (12803) ఆగస్టు 5, 9 తేదీలలో, విశాఖపట్నం–సాయినగర్ షిర్డీ (18503), టాటా–యశ్వంత్‌పూర్ (18111) ఆగస్టు 8న, విశాఖపట్నం–హైదరాబాద్ (12727) ఆగస్టు 3, 11 తేదీలలో, విశాఖపట్నం–గాందీనగర్ (20803) ఆగస్టు 8న, మచిలీపట్నం–íÙర్డీ సాయినగర్ (17208), నర్సాపూర్–నాగర్సోల్ (12787) ఆగస్టు 3, 5, 6, 7, 8, 10 తేదీలలో, మచిలీపట్నం–బీదర్ (12749) ఆగస్టు 3 నుంచి 11 వరకు, లోకమన్య తిలక్ టెర్మినస్–విశాఖపట్నం (18520) ఆగస్టు 2 నుంచి 10 వరకు, షిర్డీ సాయినగర్–మచిలీపట్నం (17207) ఆగస్టు 7న, నాగర్సోల్–నర్సాపూర్ (12788) ఆగస్టు 2, 4, 6, 7, 8, 9 తేదీలలో, బీదర్–మచిలీపట్నం (12750) ఆగస్టు 8 నుంచి 10 వరకు వయా రాయనపాడు, గుణదల, విజయవాడ బైపాస్ మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
విజయవాడ రూట్లో పలు రైళ్ల రద్దు: ఎస్సీఆర్
సాక్షి,విజయవాడ: ఆగస్ట్ నెలలో ఐదు రోజుల పాటు పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు బుధవారం(జులై 3) ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మూడవ లైన్ ఏర్పాటులో భాగంగా మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ మరమ్మతుల వల్లే రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్లు తెలిపింది. ఆగస్టు 5 నుంచి ఆగస్ట్ 8 వరకు 37 రైళ్లు రద్దు చేయనుండగా 38 రైళ్లను దారి మళ్లించనున్నారు. -
కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
హైదరాబాద్, సాక్షి: దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఆసిఫాబాద్-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా.. వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. అలాగే 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నారు. వాటి వివరాలను ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రద్దయిన రైళ్లు ఇవే.. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య తిరిగే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నం.12757/12758) జూన్ 26 నుంచి జులై 6 వరకు రద్దు. పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్ (నం.22151) ఈ నెల 28, జులై 5న.. కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్ (నం.22152) జూన్ 30, జులై 7న.. హైదరాబాద్-గోరఖ్‌పుర్ (నం.02575) జూన్ 28న, గోరఖ్‌పుర్-హైదరాబాద్ (నం.02576) ఎక్స్‌ప్రెస్ జులై 30న రద్దు ముజఫర్‌పుర్-సికింద్రాబాద్ (నం.05293) జులై 2న, సికింద్రాబాద్-ముజఫర్‌పుర్ (నం.05294) జూన్ 27, జులై 4న రద్దు గోరఖ్‌పుర్-జడ్చర్ల (నం.05303) రైలు జూన్ 29న, జడ్చర్ల-గోరఖ్‌పుర్ (నం.05304) రైళ్లు జులై 1న రద్దుసికింద్రాబాద్-రాక్సల్ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్ 26, 27, 28 తేదీల్లో.. సికింద్రాబాద్-దానాపుర్ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్ 27, 28, 29, జులై 1 తేదీల్లో.. సికింద్రాబాద్-సుభేదార్‌గంజ్ మధ్య తిరిగే రైళ్లు జూన్ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.దారి మళ్లింపు..కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్-న్యూఢిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా దారి మళ్లించనున్నారు. అంటే.. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణం ఉండదు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (నం.12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్ మీదుగా నడిపిస్తారు. ఆ తేదీల్లో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్ల మీదుగా రైలు వెళ్లదు.సికింద్రాబాద్-నిజాముద్దీన్ (దిల్లీ), నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు. -
పగిడిపల్లిలో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి!
సాక్షి, హైదరాబాద్: క్రాసింగ్ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని ఈ మధ్య సీరియస్‌గా తీసుకున్న రైల్వేశాఖ.. ‘రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి’ల నిర్మాణంపై దృష్టి సారించింది. గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ సెక్షన్ పరిధిలో గూడురు–మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివితో ఇలాంటి వంతెనను నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్ సమీపంలో ఈ తరహా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు.. కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసేచోట నిర్మించనున్నారు. వంతెన ఒక్కటే కాకుండా దానికి అనుసంధానంగా కొంత మేర అదనపు ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.రెండు మూడు మార్గాల సమస్య తీరేలా..ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట మధ్య, నడికుడి మీదుగా సికింద్రాబాద్–గుంటూరు మధ్య నిత్యం 450 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 150కిపైగా గూడ్స్ రైళ్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసి మళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదైనా రైలు నడికుడి వైపు క్రాస్ చేయాలంటే.. సికింద్రాబాద్–కాజీపేట మార్గంలోని రైళ్లను ఎక్కడో ఓ స్టేషన్లో కాసేపు నిలిపేయాల్సి వస్తోంది. ఇక భవిష్యత్తులో సికింద్రాబాద్–గుంటూరు మార్గాన్ని రెండు లైన్లకు విస్తరించనున్నారు. ఆ మార్గంలో ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల సంఖ్య పెరగనుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట, సికింద్రాబాద్–గుంటూరు లైన్లను అనుసంధానించే మార్గం కావటం విశేషం. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకే పరిమితమైన ఈ మార్గంలో భవిష్యత్తులో ప్యాసింజర్ రైళ్లను తిప్పాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు పగిడిపల్లి వై జంక్షన్ వద్ద రైల్వే ట్రాఫిక్ బాగా పెరగనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. క్రాసింగ్ వద్ద రైళ్లు జామ్ కాకుండా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి (ఆర్‌ఓఆర్‌బీ)కి ప్లాన్ చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్ ఓవర్ రైలు బ్రిడ్జికి సంబంధించిన మార్గం మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో బీబీనగర్ స్టేషన్ దాటిన తర్వాత.. పగిడిపల్లి స్టేషన్‌కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుత లైన్‌కు అదనంగా మరో లైన్ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్లుతుంది. సికింద్రాబాద్–గుంటూరు లైన్‌లోని బొమ్మాయిపల్లి స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్‌కు కలుస్తుంది. ఈ ఐదున్నర కిలోమీటర్ల లైన్లో 1,400 మీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం ఉంటుంది. -
ఆధునికంగా రైల్వే ట్రాక్
వేటపాలెం/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మార్గదర్శకంగా నిలుస్తోంది. పెరుగుతున్న రైళ్ల వేగాన్ని, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రైల్వే ట్రాక్‌లను ఆధునీకరిస్తోంది. తాజాగా విజయవాడ డివిజన్లోని వేటపాలెం వద్ద వెల్డబుల్ కాస్ట్ మాంగనీస్ స్టీల్(డబ్ల్యూసీఎంసీ) క్రాసింగ్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసింది. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత రద్దీగా ఉండే విజయవాడ–గూడూరు సెక్షన్ పరిధిలోని బాపట్ల జిల్లా వేటపాలెం డౌన్‌లైన్‌లో మంగళవారం రైల్వే అధికారులు విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఈ పరిజ్ఞానాన్ని దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో మొదటి సారిగా ఉపయోగించారు. భారతీయ రైల్వేలో ఇది రెండవది. రైళ్లలో పెరిగిన వేగం, హెవీ యాక్సిల్ లోడ్‌ను అధిగమించేందుకు డబ్ల్యూసీఎంసీ క్రాసింగ్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. రైలు ఒక లైను నుంచి మరో లైను దాటే జంక్షన్ల వద్ద ట్రాక్‌లో ఉపయోగించే కీలక భాగమే డబ్యూసీఎంసీ. ఇప్పటి వరకు రెండు బ్లాక్ సెక్షన్ల మధ్య లాంగ్ వెల్డ్ రైల్స్(ఎల్డబ్ల్యూఆర్) ఉండేవి. జాయింట్ ఫ్రీ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల యార్డ్‌లలో టర్న్ అవుట్ల వెనుక ఫిష్ ప్లేట్ జాయింట్‌తో వేరు చేసేవారు. ఇప్పుడు డబ్యూసీఎంసీ అందుబాటులోకి రావడం వల్ల 130 కి.మీ వేగంతో నడిచే రైళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగదని అధికారులు చెప్పారు. ప్రయాణికులు సురక్షితంగా, కుదుపులు లేకుండా ప్రయాణించేందుకు ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. డబ్యూసీఎంసీ క్రాసింగ్ ఏర్పాటు విజయవాడ డివిజన్లో చారిత్రాక మైలురాయిగా నిలుస్తుందన్నారు. డివిజన్ సీనియర్ డీఈఎన్ వరుణ్‌బాబు, ఇతర అధికారులను ఆయన అభినందించారు. -
ఇంటర్సిటీల మధ్య వందే మెట్రోలు!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే!హైదరాబాద్ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్–కర్నూలు, కాచిగూడ–కర్నూలు, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–విజయవాడ వంటి రూట్లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టొచ్చు. అనంతరం దశలవారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమైన స్టేషన్లలోనే హాల్టింగ్.. వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్‌లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్‌లతో ప్రారంభించి డిమాండ్‌కు అనుగుణంగా ఆ తరువాత 16 కోచ్‌ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్‌గా తలుపులు తెరుచుకొని మూసుకొనే ఏర్పాటు ఉంటుంది. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు ముఖ్యమైన స్టేషన్లలోనే ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్పుల్ రైళ్లకు ఉన్నట్లుగానే ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్ లైన్లకు తరలించాల్సిన అవసరంలేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ఉండవు... ఈ రైళ్లన్నీ సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు కొనుక్కొని బయలుదేరొచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనుకొనే వారికి ఈ రైళ్లలో ప్రయాణం లాభదాయకం. వివిధ మార్గాల్లో నడిచే ఇంటర్ సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్సిటీ ట్రైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది. -
వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మండ్రూప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ 07234) ఈ నెల 28నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచి వరకు నడుస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో రాత్రి 11.40 బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపూర్, కుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, బద్రాక్, ఖరగ్‌పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచి చేరుతుందన్నారు. ఈ ట్రైన్ (నంబర్ 07235) తిరిగి ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. విజయవాడకు బుధవారం ఉదయం 8.45కు వస్తుంది. 18 బోగీలతో నడిచే ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం ఉండదన్నారు. స్టేషన్లలో బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు పొందవచ్చునని తెలిపారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. -
ఔటర్ రింగ్ రైల్ సర్వే షురూ!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ నిర్మించబోయే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు అలైన్మెంట్ రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పనులకు శ్రీకారం చుట్టింది. స్థూలంగా లైన్ మార్గం ఎలా ఉండాలో డెస్‌్కటాప్ స్టడీ మొదలుపెట్టింది. ఇది పూర్తి కాగానే, హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే ప్రారంభించనుంది. దీని ద్వారా అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్మెంట్ సిద్ధమవుతుంది. హైదరాబాద్‌కు అన్నివైపులా విస్తరించి ఉన్న ఔటర్ రింగురోడ్డు చుట్టూ 50 కి.మీ. నుంచి 70 కి.మీ.దూరంలో రీజినల్ రింగురోడ్డును నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 158 కి.మీ. నిడివి గల ఉత్తర భాగానికి కేంద్రప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవబోతోంది. ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఇక దాదాపు 182 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంటును రూపొందించి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. త్వరలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే దానికి ఆమోదముద్ర పడనుంది. ఈ రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ ఔటర్ రింగ్ రైల్ పేరుతో రైల్వే లైన్ నిర్మించేందుకు కూడా కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. గతేడాది ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ రూ.13.95 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడు ఆ పనులు మొదలయ్యాయి. ఆ అలైన్‌మెంటు కోసం ఎన్హెచ్ఏఐని కోరిన రైల్వే ఉత్తర భాగం రింగురోడ్డు అలైన్‌మెంటు ఇప్పటికే ఖరారైంది. కానీ, దక్షిణ రింగురోడ్డు అలైన్‌మెంటు ఖరారు కాలేదు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐని కోరిన రైల్వే అధికారులు అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రాథమిక అలైన్‌మెంటు సిద్ధం చేసుకుని, వెంటనే ఏరియల్ లైడార్ సర్వే ప్రారంభిస్తారు. హెలికాప్టర్లో లైడార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని.. 300 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంటు కోసం 3డీ మ్యాపింగ్ చేస్తారు. నీటి వనరులు, కాలువలు, గుట్టలు, నిర్మాణాలు.. ఇలాంటి వాటిని గుర్తించి తదనుగుణంగా మార్గాన్ని ఖరారు చేస్తారు. గ్రేడియంట్ ఆధారంగా స్టేషన్ల పాయింట్లను కూడా గుర్తిస్తారు. అక్షాంశరేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్‌మెంటు ఖరారు చేస్తారు. దాన్ని 3డీ మ్యాపింగ్ చేస్తారు. భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున, దీని వల్ల ఆదాయం ఎంత ఉంటుందని తేల్చే రేట్ ఆఫ్ రిటర్న్స్ (ఆర్ఓఆర్) ట్రాఫిక్ సర్వే కూడా చేయనున్నారు. ఆదాయం బాగా ఉంటుందని తేలితే రెండో లైన్ కోసం కూడా ప్రతిపాదిస్తారు. ముందుగా ఒక్క లైన్‌ను మాత్రమే నిర్మిస్తారు. లైన్‌తోపాటు విద్యుదీకరణ పనులను కూడా సమాంతరంగా చేపట్టనున్నట్టు తెలిసింది. సరుకు రవాణా రైళ్లకూ ప్రాధాన్యం రింగురోడ్డును ఆసరా చేసుకుని రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మించటం దేశంలోనే తొలిసారి. దీన్ని కూడా సరుకు రవాణా రైళ్లకు ఎక్కువగా ఉపయోగపడేలా చూస్తున్నారు. ప్రస్తుతం గూడ్సు రైళ్లు సికింద్రాబాద్ లాంటి రద్దీ స్టేషన్ల గుండా సాగాల్సి వస్తోంది. అయితే ఔటర్‌రింగ్ రైల్ కారిడార్ పలు రైల్వే మార్గాలతో అనుసంధానమై ఉండటంతో సరుకు రవాణా రైళ్లు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే గమ్యం వైపు పరుగుపెట్టే వీలు కలుగుతుంది. ఇది రైల్వే ట్రాఫిక్‌కు కూడా రిలీఫ్ క ల్పిస్తుంది. 536 కి.మీ... రూ.12 వేల కోట్లు.. ♦ రీజినల్ రింగురోడ్డు దాదాపు 343 కి.మీ. నిడి వి ఉండనుండగా, దాని చుట్టూ విస్తరించే రైల్వే లైన్ మాత్రం దాదాపు 536 కి.మీ. నిడివితో ఉండనుంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.12వేల కోట్లుగా అంచనా. ♦ వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన రైల్వే లైన్లను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. రైల్వే ట్రాక్ మీదుగా రోడ్డును నిర్మించినట్టుగానే ఆయా ప్రాంతాల్లో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జిలను నిరి్మస్తారు. అక్కన్నపేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో ఆ తరహా వంతెనలు నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ♦ ఈ రైలు మార్గంలో దాదాపు 50 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు. ♦ 75 మీటర్ల వెడల్పుతో ఈ మార్గం సిద్ధమవుతుంది. స్టేషన్ ఉండే చోట రెండు కి.మీ. పొడవుతో 200 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. ♦ ఈ ప్రాజెక్టులో ప్రతి కి.మీ.కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుంది. భూసేకరణలో సగం మొత్తాన్ని కేంద్రం భరించనుంది. -
త్వరలో చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 రైళ్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు కొనసాగుతున్న దృష్ట్యా కూడా ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి టెర్మినల్‌ను వినియోగంలోకి తేవాలని నిర్ణయించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యాధునిక సదుపాయాలతో, ఆరులైన్లతో స్టేషన్‌ను విస్తరించారు. రైళ్లను శుభ్రం చేసేందుకు, నిలిపి ఉంచేందుకు వీలుగా పిట్లైన్లను ఏర్పాటు చేశారు. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే పలు రైళ్లు సికింద్రాబాద్ వెళ్లకుండా ఇక్కడినుంచే నడుస్తాయి. ఇక్కడినుంచి ప్రతి రోజూ 60 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని అధికారవర్గాలు చెపుతున్నాయి. చర్లపల్లి ప్రారంభమయ్యాక ఇకనుంచి ఈ రైళ్లు అక్కడినుంచే.. ► కాజీపేట్ నుంచి సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్ల మీదుగా వెళ్లే ముంబై–భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం–షిరిడీ వీక్లీ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–షిరిడీ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచే నడిపించే అవకాశం ఉంది. ► అలాగే బీదర్ నుంచి మచిలీపట్నం వరకు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–లింగంపల్లి మధ్య నడిచే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాజీపేట – హడప్సర్ (పూణే) ట్రైవీక్లీ, లింగంపల్లి–కాకినాడ మధ్య నడిచే కోకనాడ ట్రైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, టాటానగర్ నుంచి యశ్వంత్‌పూర్ వరకు నడిచే వీక్లీఎక్స్‌ప్రెస్, షాలిమార్–హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ► జమ్ముతావి–తిరుపతి మధ్య నడిచే హమ్‌సఫర్ వీక్లీ, గోరఖ్‌పూర్ నుంచి వచ్చే యశ్వంత్‌పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ఎక్స్ ప్రెస్, నిజాముద్దీన్ ఢిల్లీ– బెంగళూరు సిటీ మధ్య నడిచే రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లను కూడా చర్లపల్లి నుంచి నడిపించే ప్రతిపాదనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ► ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నిర్మించిన మౌలాలి–సనత్‌నగర్ మార్గం ఇప్పటికే పూర్తయింది. ఈ రూట్లో ప్రస్తుతం గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ఈ రూట్లో నడిపించే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి మీదుగా ముంబై, ఢిల్లీ వైపు రాకపోకలు సాగించే రైళ్లు సికింద్రాబాద్‌కు వెళ్లకుండా చర్లపల్లి నుంచి మౌలాలి, సనత్‌నగర్, లింగంపల్లి మీదుగా నడుస్తాయి. సిటీ స్టేషన్లపై తగ్గనున్న ఒత్తిడి.. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైన ఒత్తిడి తగ్గనుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.86 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ వినియోగంలో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లపైన ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని రైళ్లను నగర శివార్లలోనే నిలిపివేయవలసి వస్తోంది. దీంతో ఉదయం వేళల్లో స్టేషన్‌కు రావలసిన రైళ్లు సకాలంలో చేరుకోవడం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సిటీ శివార్లలోనే పడిగాపులు కాయవలసి వస్తోంది. చర్లపల్లి ప్రారంభమైతే సిగ్నల్ కోసం ఇలా ఎదురుచూడవలసిన అవసరం లేకుండా చర్లపల్లి నుంచే రాకపోకలు సాగించవచ్చు. అలాగే కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపైన కూడా ఒత్తిడి తగ్గుతుందని చెపుతున్నారు. -
గరీబ్‌రథ్ జాడేది?
♦ హైదరాబాద్–విశాఖపట్నం మధ్య నిత్యం తిరిగే గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 12 గంటల 35 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1395 ♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వారంలో మూడురోజులు తిరిగే దురొంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 10 గంటల 15 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1630 ♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రోజూ తిరిగే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 11 గంటలే. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1085 మాత్రమే. ♦ గోదావరి, దురొంతో ఎక్స్‌ప్రెస్‌లతో పోలి స్తే గరీబ్రథ్కు డిమాండ్ ఎక్కువ. కానీ, ఆ శ్రేణి రైళ్ల సంఖ్య పెంచేందుకు కేంద్రప్ర భుత్వం ససేమిరా అంటోంది. కేవలం రంగు మార్పు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఏర్పాటుకే పరిమితమవుతున్నట్టు తెలుస్తోంది. సాక్షి, హైదరాబాద్: పేదలు కూడా తక్కువ ధరతో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో 17 ఏళ్ల క్రితం రైల్వేశాఖ గరీబ్‌రథ్ కేటగిరీ రైళ్లు ప్రారంభించింది. లాలూప్రసాద్‌యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇవి పట్టాలెక్కాయి. సులభంగా ప్రజలకు తెలిసేలా పూర్తి ఆకుపచ్చ రంగుతో ఈ రైళ్లు ఉన్నాయి. వీటిల్లో అన్నీ ఏసీ మూడో శ్రేణి కోచ్‌లే. గరిష్ట వేగం గంటకు దాదాపు 130 కిలోమీటర్లు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకంటే ఇవి వేగంగా పరుగుపెడతాయి. అందుకే వాటితో పోలిస్తే ఇవి కొంత తొందరగా గమ్యం చేరుతాయి. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మూడోశ్రేణి ఏసీ కోచ్‌లలో ఉండే టికెట్ ధర కంటే దాదాపు 15 శాతం తక్కువ ధరకే గరీబ్‌రథ్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ♦ 2008 ఫిబ్రవరిలో సికింద్రాబాద్–యశ్వంతపూర్ మధ్య, అదే సంవత్సరం అక్టోబరులో సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రెండు రైళ్లను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు వారంలో కొన్ని రోజులు మాత్రమే తిరు గుతాయి. ఒక్క విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే నిత్యం తిరుగుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అందులో టికెట్ దొర కటం గగనమే. ♦ గతేడాది సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. 16 కోచ్‌లతో తిరుగుతున్న ఆ రైలులో ఆక్యుపెన్సీ రేషియో 114– 120 శాతంగా ఉంటోంది. దీంతో ఇటీవలే అదే రూట్లో 8 కోచ్‌లుండే మరో వందేభారత్‌ను ప్రారంభించారు. కానీ, దీనికంటే ఎక్కువ డిమాండ్ ఉన్నా.. ఆ మార్గంలో రెండో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం కేటాయించటం లేదు. ♦ ఇతర నగరాలకు కూడా గరీబ్‌రథ్ రైళ్లు నడపా లని కోరుతున్నా పట్టించుకోవటం లేదు. సాధా రణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ కోచ్ టికెట్ ధరలను కూడా పేదలు భరించలేరన్న ఉద్దేశంతో గరీబ్‌రథ్ రైళ్లను ప్రారంభించారు. అలాంటిది వందేభారత్ కేటగిరీ రైలు టికెట్ ధరలను అసలే భరించలేరు. కానీ, వాటి సంఖ్యను మాత్రం పెంచుతూ, 17 ఏళ్లు గడుస్తున్నా రెండో గరీబ్‌రథ్‌ను ప్రారంభించలేదు. త్వరలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రస్తుతం గరీబ్‌రథ్ రైళ్లు సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లతో తిరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వీటితో తీవ్ర ప్రాణనష్టం జరుగుతోందన్న ఉద్దేశంతో.. అన్ని రైళ్లకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. వేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు గరీబ్‌రథ్ కేటగిరీ రైళ్లకు మాత్రం వాటిని ఏర్పాటు చేయలేదు. త్వరలో వాటన్నింటికి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని తాజాగా రైల్వే నిర్ణయించింది. తొలినుంచి ఆకుపచ్చ రంగు కోచ్‌లే ఉన్నందున, ఇప్పుడు వాటి రంగు మార్చాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎరుపురంగు వేయాలని భావిస్తున్నట్టు అనధికార సమాచారం. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేసినప్పుడు, 3 ఏసీ ఎకానమీ నమూనా కోచ్‌లు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వీటిల్లో బెర్తుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం గరీబ్‌రథ్‌లో ఒక్కో కోచ్‌లో 78 మంది ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఆ సంఖ్య 83కు చేరుతుందని సమాచారం. -
మేడారం జాతరకు 30 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్, కాజీపేట రూరల్: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 జన్ సాధా రణ్ ప్రత్యేక రైళ్ల సర్విస్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మేడారం జాతర చేరుకోవడానికి, తిరుగు ప్రయాణానికి అత్యంత సురక్షితమైన వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు ఆయా రూట్ల నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించినట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ► సికింద్రాబాద్–వరంగల్, వరంగల్–సికింద్రాబాద్ మధ్య 10 రైళ్లు, సిర్పూర్కాగజ్నగర్–వరంగల్, వరంగల్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య 8 రైళ్లు, నిజామాబాద్–వరంగల్, వరంగల్–నిజామాబాద్ మధ్య 8 రైళ్లు, ఆదిలాబాద్–వరంగల్, వరంగల్–ఆదిలాబాద్ మధ్య 2 రైళ్లు, ఖమ్మం–వరంగల్, వరంగల్–ఖమ్మం మధ్య 2 రైళ్లు నడుపుతారు. ► 21 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్–వరంగల్ (07014), ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వరంగల్–సికింద్రాబాద్ (07015) ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 6:20 గంటలకు చేరుతుంది. ► 21వ తేదీన వరంగల్–ఆదిలాబాద్ (07023) వెళ్లే ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది. ► 22వ తేదీన ఆదిలాబాద్–వరంగల్ (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్‌లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12:45 గంటలకు వరంగల్ చేరుతుంది. ► 23 తేదీన ఖమ్మం–వరంగల్ (07021) వెళ్లే రైలు ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి వరంగల్‌కు 12:20 గంటలకు చేరుతుంది. ► 24న వరంగల్–ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుంది. భక్తుల సౌకర్యార్ధం రైళ్లు: కిషన్‌రెడ్డి మేడారం సమ్మక్క, సారక్క జాతరకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక రైళ్లను వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3 కోట్లను కేటాయించింది’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతర నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది’’అని ఆయన తెలిపారు. -
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్‌కు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. నిజామాబాద్– వరంగల్ స్పెషల్ ట్రైన్ నిజామాబాద్– వరంగల్ (07019) ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్‌లో ఉదయం 7:05 గంటలకు బయలుదేరి వరంగల్‌కు మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుతుంది. అదే విధంగా వరంగల్–నిజామాబాద్ (07020) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి రాత్రి 10:30 గంటలకు నిజామాబాద్‌కు చేరుతుంది. వరంగల్– నిజామాబాద్ మధ్య ఈ రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట జంక్షన్, పెండ్యాల్, ఘన్పూర్, రఘునాథపల్లి, జనగామ, ఆలేరు, వంగపల్లి, భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్, చర్లపల్లి, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, బొల్లారం, మేడ్చల్, మనోహరబాద్, వదిరాం, మిర్జాపల్లి, అక్కన్నపేట, కామారెడ్డి రైల్వే స్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ స్పెషల్ ట్రైన్ సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ ప్రత్యేక రైలు (07017) సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 10 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా వరంగల్ టు సిర్పూర్ కాగజ్‌నగర్ (07018) రైలు సాయంత్రం 4 గంటలకు వరంగల్‌నుంచి బయలుదేరి రాత్రి 12 గంటలకు కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది. సిర్పూర్కాగజ్నగర్–వరంగల్ మధ్య కాజీపేట టౌన్, హసన్‌పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్, కొత్తపల్లి, ఓదెల, కొలనూరు, కొత్తపల్లి, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట్, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్డు, రేపల్లెవాడ, ఆసిఫాబాద్, రాళ్లపేట్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఇదీ చదవండి: TS: రవాణాశాఖలో భారీ ఎత్తున బదిలీలు.. ఉత్తర్వులు జారీ -
చర్లపల్లి టెర్మినల్ నుంచి త్వరలో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నాలుగో రైల్వే టెర్మినల్‌గా చర్లపల్లి స్టేషన్ సేవలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే రూ.221 కోట్లతో చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్‌ను విస్తరించారు. సరుకు రవాణాకు పార్శిల్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను నియంత్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే చర్లపల్లి స్టేషన్ విస్తరణ పూర్తి కావడంతో మార్చి నుంచి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని మోదీతో ప్రారంభం! ప్రధాని మోదీతోనే త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. అదే రోజు రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ► షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045/18046) త్వరలో సికింద్రాబాద్‌కు బదులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడిచే చార్మి నార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604) చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. మరో 6 రైళ్లకు హాల్టింగ్... ► హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్‌ప్రెస్ రైళ్లను మార్చి నుంచి చర్లపల్లి స్టేషన్లో నిలుపనున్నారు.ఈ మేరకు రైల్వేబోర్డు అనుమతులను ఇచ్చింది. -
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చిల్లర కష్టాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల బాధను అర్థం చేసుకుని రైల్వేస్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద చిల్లర ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం.. ప్రయాణికులు సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ పేమెంట్స్‌కు సౌకర్యం కల్పించనుంది. దీంతో, ప్రయాణికుల చిల్లర కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టినట్టు అయ్యింది. ఇక, దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
TS, AP: రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు
సాక్షి, కాజీపేట: రైలు ప్రయాణికులకు అలర్ట్. మౌలాలీ - సనత్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో, ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్(ప్రతీరోజు నడిచే) నుండి రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ వెళ్లే ప్రయాణికులకు పలు రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఇంటర్ సిటీ(17011/12), కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ (12757/58), సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ(12705/06) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- గుంటూరు శాతవాహన ఎక్స్‌ప్రెస్(12714/13), కాకతీయ ఎక్స్‌ప్రెస్(17659/60) పూర్తిగా రద్దు చేశారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్(17233/14)ను, సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కాజీపేట నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని తెలిపారు. -
గోదావరి ఎక్స్‌ప్రెస్.. కోట్ల మంది ఎమోషన్!
ఏరా రామినాయుడూ.. ఐడ్రాబాడ్ నుంచి ఎప్పుడొచ్చావు.. ఎలా వచ్చావు.. ఆ పొద్దున్నే గొడావరికి దిగాను.. మళ్ళీ ఎల్లుండి గొడావరికి వెళ్లిపోతున్నా.. ఒరేయ్ నరేషూ అక్కాబావ పండక్కి గొడావరికి వస్తున్నారట స్టేషనుకు వెళ్లి ఆటోలో తీసుకొచ్చేరా.. బావా నువ్వెళ్లు.. అక్కను వారం తరువాత గొడావరికి ఎక్కిస్తాలే.. నువ్వొచ్చి రిసీవ్ చేసుకో.. అబ్బా.. ఏ ట్రైనుకు అయినా టిక్కెట్స్ దొరుకుతాయి కానీ గొడావరికి దొరకవండీ.. ట్రైన్ అంటే ట్రైన్ గొడావరి.. షార్ప్.. విమానం కన్నా పర్ఫెక్ట్ టైమింగ్.. అదీ.. అదీ గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న పాపులారిటీ. యాభయ్యేళ్ళ క్రితం హైదరాబాద్ డెక్కన్.. విశాఖ మధ్య ప్రారంభమైన ఈ ట్రైన్ మామూలు ఇనుప యంత్రం కాదు.. ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఇంటికీ ఉన్న ఒక ఎమోషనల్ బంధం.. అసలు గోదావరి అంటేనే ఒక ఎమోషన్. ఈ యాభయ్యేళ్లలో ఎన్నో కోట్లమందిని కలిపిన ఆత్మీయ బంధం.. అన్నిటికీ మించి అది ఒక వీఐపీ ట్రైన్. రాష్ట్రానికి ఈ చివరనున్న ఉత్తరాంధ్ర నవదంపతులను పొందిగ్గా అత్యంత జాగ్రత్తగా పూల పల్లకీలో ఊరేగించినంత భద్రంగా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వచ్చినా.. అప్పుడే బీకామ్.. బీఎస్సీ చదివిన సింహాచలానికి ఉద్యోగం కావాల్సి వచ్చినా.. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రులు.. నాయకులను ఇక్కడి కార్యకర్తలు కలవాలన్నా.. ఉపాధి కోసం వెళ్లాల్సిన కూలీలకు.. అందరికీ గోదావరి అంటే ఒక హృద్యమైన అనుబంధం. దానిలో ప్రయాణం ఒక ఆత్మీయ అనుభూతి. హైదరాబాద్‌లో కొత్తకాపురం పెట్టిన కూతుర్ని విశాఖ స్టేషన్లో దిగబెడుతూ కిటికీ ఇవతల నుంచి కన్నీళ్ల మాటున తల్లి జాగ్రత్తలు చెబుతూ.. కాసింత దూరాన నిలబడి తండ్రి బెంగతో చూసే చూపులు.. రెణ్ణెల్ల తరువాత ఆషాఢానికి బయల్దేరిన భార్యను హైద్రాబాదులో ఎక్కిస్తూ 'నువ్వు ఒంటరిగా పోవచ్చుగా.. నా మనసును.. ప్రాణాన్ని కూడా తీసుకుపోవాలా' అంటూ భావుకత్వంతో భర్త చెప్పే మాటలు విని లోలోన మురిసిపోయే నవయవ్వని అంతరంగం.. ఇవన్నీ గోదావరికి మాత్రమే సొంతం.. ఐడ్రాబాడ్లో చిన్న ఉద్యోగం చేస్తున్న కొడుకు సన్యాసి దగ్గరకు బయల్దేరిన నారాయణమ్మ, బంగార్రాజు దంపతులు స్టీల్ కేరేజిలో పులిహోరా.. పాత పెప్సీ బాటిల్లో నీళ్లు పట్టుకుని ఎక్కితే మళ్ళా సికింద్రాబాదు వరకూ ఏమీ కొనేది లేదు.. దడదడా చప్పుడు చేస్తూ రాజమండ్రి వంతెన రాగానే గోదారమ్మ గోదారమ్మా అంటూ పిల్లా పెద్దా గోదాట్లో కాయిన్లు వేయడం.. అదో నమ్మకం.. గోదారిలో దిగలేకపోయినా పైసలు నివేదించడం ద్వారా భక్తిని చూపడం.. అదో గొప్ప సంస్కృతి. విశాఖలో ప్యూర్ ఉత్తరాంధ్ర యాస భాషలతో బయల్దేరే గోదారి.. రెండున్నర గంటల తరువాత స్టయిల్ మార్చేస్తుంది.. యాండీ.. మీది ఆ సీటు కదండీ.. ఇక్కడ ఉన్నారేంటీ.. వెళ్లిపోండి.. ఆయ్.. అంటూ గదమాయించే ఆడపిల్ల మాట వినిపించగానే ఓహో ట్రైన్ రాజమండ్రి చేరిందని తెలిసిపోతుంది. ఆత్రేయపురం పూతరేకులూ, నేతి పూతరేకులూ అని అరుపులు వినిపిస్తే ఓ.. ఇంకా విజయవాడ చేరలేదా అని అర్థం. ఏమిరా భాయ్.. ఇంకెంతసేపు ఆపుతాడు మల్ల.. ఈ ఫుడ్ మస్తుందిరా.. మనూళ్ళో ఇలా ఉండదేందిరా అని మల్లేశం చెప్పే కామెంట్లు.. ఆయన భోనగిరిలో దిగుతాడని చెప్పేస్తాయి.. ఇలా వేర్వేరు సంస్కృతులు.. పద్ధతులు.. ఎన్నో.. ఎన్నెన్నో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కనిపిస్తాయి. అదొక ఆత్మీయ బంధం.. మరువలేని అనుబంధం. -సిమ్మాదిరప్పన్న -
ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో చేపట్టనున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి, కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ శనివారం తెలిపారు. ఈ నెల 29– ఫిబ్రవరి 25 వరకు గుంటూరు–విశాఖ (17239/17240), కాకినాడ పోర్టు–విశాఖ (17267/17268), మచిలీపట్నం–విశాఖ (17219/17220), గుంటూరు–రాయగఢ్ (17243/ 17244), బిట్రగుంట–విజయవాడ (07977/ 07978) రైళ్లు రద్దయ్యాయి. బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) రైళ్లు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు, 5 నుంచి 9 వరకు, 12 నుంచి 16 వరకు, 19 నుంచి 23 వరకు రద్దు చేశారు. అలాగే, ఈ నెల 29– ఫిబ్రవరి 25 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు రామవరప్పాడు నుంచి బయలుదేరి, తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్టేషన్ వరకే నడవనున్నాయి. -
ఏపీలో 3 రైళ్ల గమ్యస్థానాల పొడిగింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఏపీలోని పలు గమ్యస్థానాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను రైల్వేశాఖ పొడిగించింది. వీటిలో గుంటూరు– విశాఖ (22701/22702) రైలు విశాఖ, విజయవాడ,గుంటూరు మీదుగా ప్రయాణిస్తోంది. మిగిలిన 2 రైళ్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. వాటిలో నర్సాపూర్–హుబ్లీ (17225/17226) రైలు గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. నంద్యాల–రేణిగుంట (07285/07284) రైలు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, కంభాలపల్లె స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. ఈ రైళ్ల సర్వీసులను శుక్రవారం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రజాప్రతినిధుల సమక్షంలో గుంటూరు రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు శుక్రవారం నుంచే ప్రయాణికుల సేవల్లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. -
Sankranti 2024 Special Trains: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. మరో ఆరు ప్రత్యేక రైళ్లును ప్రకటించింది. సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 10 నుంచి 15 తేదీల్లో ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడవనున్నాయి. ఆరు స్పెషల్ ట్రైన్స్ ఇవే.. జనవరి 10న రాత్రి 8:25 కి తిరుపతి - సికింద్రాబాద్ జనవరి 11న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ జనవరి 12న రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ జనవరి 13న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ జనవరి 14న ఉదయం 10 గంటలకు కాకినాడ టౌన్ - తిరుపతి జనవరి 15న తెల్లవారుజామున 5:30 గంటలకు తిరుపతి - కాచిగూడ SCR to run Sankranti Special Trains#Sankranti #Sankranti2024 pic.twitter.com/uOlQ5VukaT — South Central Railway (@SCRailwayIndia) January 9, 2024 ఇదీ చదవండి: ఆ చాక్లెట్లు తిని మత్తులోకి జారి! -
వికారాబాద్–కృష్ణారైల్వే లైన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో సీఎంను అరుణ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరముందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని, పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందని చెప్పారు. అలాగే వివేక్ కె.టంకా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. బృందంలో రాజ్యసభ సభ్యుడు వందన చవాన్, కనకమేడల రవీంద్రకుమార్, దర్శన సింగ్, విల్సన్, లోక్‌సభ సభ్యుడు వీణాదేవి, జస్బీర్సింగ్ గిల్, రఘురామ కృష్ణరాజు ఉన్నారు. -
SCR: సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. కాకినాడ, తిరుపతి..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్‌ను అనౌన్స్ చేయగా తాజాగా మరో ఐదు స్పెషల్ రైళ్లను ప్రకటించింది. తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడ-సికింద్రాబాద్, కాకినాడ-తిరుపతి మధ్య నడవనున్నాయి. వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగ నేపథ్యంలో ఈనెల 10, 11, 12, 13 తేదీల్లో స్పెషల్ ట్రైన్ ప్రయాణించనున్నాయి. ఐదు స్పెషల్ ట్రైన్స్ ఇవే.. జనవరి 10: 07065.. తిరుపతి-సికింద్రాబాద్. జనవరి 11: 07066.. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ జనవరి 12: 07067.. కాకినాడ టౌన్-సికింద్రాబాద్ జనవరి 12: 07250.. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ జనవరి 13: 07249.. కాకినాడ టౌన్-తిరుపతి. SCR to run 05 #Sankranti Special Trains pic.twitter.com/T1NfM0ZpTE — South Central Railway (@SCRailwayIndia) January 5, 2024 -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ద.మ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడుపనున్నారు. ► సికింద్రాబాద్–బ్రహ్మపూర్ (07089) ఈ నెల 7, 14 తేదీలలో సాయంత్రం 7.45 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. ► బ్రహ్మపూర్–వికారాబాద్ (07090) ఈ నెల 8, 15 తేదీలలో మధ్య రాత్రి 12.30 గం.లకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.30 గం.లకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07091) 9, 16 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. ► బ్రహ్మపూర్–సికింద్రాబాద్ (07092) రైలు 10, 17 తేదీలలో మధ్య రాత్రి 12.30 గంటలకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 6.30 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► విశాఖపట్నం–కర్నూలు సిటీ (08541) 10, 17, 24 తేదీలలో సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08542) 11, 18, 25 తేదీలలో మధ్యాహ్నం 3.30 గం.లకు కర్నూలులో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ► శ్రీకాకుళం–వికారాబాద్ (08547) 12, 19, 26 తేదీలలో సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గం.లకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08548) 13, 20, 27 తేదీలలో రాత్రి 8.25 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మ«ద్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (02764) 10, 17 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.45 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) 11, 18 తేదీలలో సాయంత్రం 5.15 గం.లకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07271) 12న రాత్రి 9 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07272) 13న రాత్రి 8.10 గం.కు కాకినాడ టౌన్లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–బ్రహ్మపూర్ (07093) 8, 15 తేదీలలో సాయంత్రం 7.45 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 11.15 గం.లకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07094) 9, 16 తేదీలలో మధ్యాహ్నం 12.30 గం.లకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► నర్సాపూర్–సికింద్రాబాద్ (07251) 10న సాయంత్రం 6 గం.లకు నర్సాపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 4.50 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07252) 11న ఉదయం 8.30 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 11.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. -
సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు 32 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే.. మరో 4 ప్రత్యేక రైళ్లను నడపనునట్లు వెల్లడించింది. సికింద్రాబాద్- కాకినాడ, కాకినాడ-సికింద్రాబాద్, హైదరాబాద్- కాకినాడ, కాకినాడ-హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆయా రైళ్ల వివరాలిలా.. ► సికింద్రాబాద్–బ్రాహ్మణ్‌పూర్–వికారాబాద్ (07089/07090) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ► వికారాబాద్–బ్రాహ్మణ్‌పూర్–సికింద్రాబాద్ (07091/07092) స్పెషల్ ట్రైన్ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► విశాఖపట్టణం–కర్నూల్ (08541/08542) ప్రత్యేక రైలు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ► శ్రీకాకుళం–వికారాబాద్ (08547/08548) స్పె షల్ ట్రైన్ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–కాకినాడ (07271/07272) ప్ర త్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లు పూర్తిగా, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్లు ♦ ఈ నెల 19, 20, 22, 23, 24, 26, 27 తేదీల్లో విజయవాడ–విశాఖపట్నం (22702/222701) ♦ ఈ నెల 19 నుంచి 28 వరకు గుంటూరు–విశాఖపట్నం (17239) ♦ ఈ నెల 20 నుంచి 29 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240) ♦ ఈ నెల 19 నుంచి 28 వరకు బిట్రగుంట–విజయవాడ (07977/07978) ♦ ఈ నెల 22 నుంచి 26 వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు ♦ ఈ నెల 15 నుంచి 28 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863/07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (078661) రైళ్లను రెండు మార్గాల్లో రామవరప్పాడు–విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు ఈ నెల 15, 22 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (22643), ఈ నెల 20, 29 తేదీల్లో భావ్‌నగర్–కాకినాడ టౌన్ (12756), ఈ నెల 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు గౌహతి (12509), ఈ నెల 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019) రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా ఈ నెల 15 నుంచి 28 వరకు ధనబాద్–అలెప్పి (13351), ఈ నెల 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111), ఈ నెల 17, 24 తేదీల్లో జసిదిహ్–తాంబరం (12376), ఈ నెల 15, 22 తేదీల్లో హథియా–ఎర్నాకుళం (22837), ఈ నెల 15, 24 తేదీల్లో హథియా–బెంగళూరు (18637), ఈ నెల 20, 27 తేదీలలో హథియా–బెంగళూరు (18637), ఈ నెల 16, 21, 23, 28 తేదీలలో హథియా–బెంగళూరు (12835), ఈ నెల 19, 26 తేదీల్లో టాటా–బెంగళూరు (12889) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా మళ్లించారు. -
పట్టాలపై పొగమంచు
రామగుండం/ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బల్లార్షా సెక్షన్ల మధ్య బుధవారం రైలు పట్టాలపై పొగమంచు కమ్ముకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు విఘాతం కలిగింది. ప్రధానంగా సికింద్రాబాద్–బల్లార్షా–న్యూఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల వేగం తగ్గించి నడిపించారు. సిగ్నల్స్‌ను పొగమంచు కమ్మేయడంతో లోకో పైలట్లు అప్రమత్తమయ్యారు. వేగం బాగా తగ్గించి నడపడంతో రైళ్లు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపైకి వచ్చేవరకూ రైళ్లు కనిపించక ప్రయాణికులు సైతం తికమకపడ్డారు. కాజీపేట– బల్లార్షా సెక్షన్ల మధ్య పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్, బిజిగిరిషరీఫ్, హసన్‌పర్తి మధ్య ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. ఉదయం 11 గంటల తర్వాత సూర్యుడు రావడంతో రైల్వేసిగ్నలింగ్ వ్యవస్థ, పట్టాలు యథాతథస్థితికి చేరుకున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
ప్రగతి పథంలో దక్షిణమధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో, అత్యుత్తమ సేవలను అందజేయడమే ఈ ప్రగతికి కారణమని చెప్పారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన 68వ రైల్వే వారోత్సవాలలో జీఎం అరుణ్‌కుమార్ జైన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలందించిన 77 మంది అధికారులు, ఉద్యోగులకు విశిష్ట రైల్ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..ఈ ఏడాది 383.85 కి.మీ. కొత్త ట్రాక్‌లతో కొత్త ప్రాంతాలకు రైల్వే సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’ సాధించే దిశగా రికార్డు స్థాయిలో 1,017 రూట్ కి.మీ.ని విద్యుదీకరించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 21,635.49 కోట్ల అత్యధిక ఆదాయాన్ని ఆర్జించామన్నారు. అందులో 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.13,051.09 కోట్ల ఆదాయం లభించిందన్నారు. అదనపు జనరల్ మేనేజర్ ఆర్.ధనుంజయులు, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరవింద్ మల్ఖేడే, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎ.శ్రీధర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు. -
లింగంపల్లి నుంచి ‘దేవగిరి’కాచిగూడ నుంచి ‘అజంతా’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించే దేవగిరి ఎక్స్‌ప్రెస్ 17058/17057 ఇక నుంచి సికింద్రాబాద్‌కు బదులు లింగంపల్లి నుంచి దేవగిరికి రాకపోకలు సాగించనుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అజంతాకు వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్(17064/17063) ఇక నుంచి మల్కాజిగిరి స్టేషన్లో అదనపు హాల్ట్‌తో కాచిగూడ స్టేషన్ నుంచి అజంతాకు రాకపోకలు సాగించనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ రెండు రైళ్ల టర్మినళ్లను మార్చినట్లు సీపీఆర్వో తెలిపారు. నగరంలోని పశి్చమ ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణ, ప్రముఖ వ్యాపారసంస్థల ఏర్పాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని లింగంపల్లి నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించేవిధంగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. లింగంపల్లి స్టేషన్‌కు పొడిగించడం వల్ల ముంబైకి మాత్రమే కాకుండా నిజామాబాద్, బాసర్, నాందేడ్, మన్మాడ్, నాసిక్ వంటి ముఖ్యమైన పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు సదుపాయంగా ఉంటుంది. అజంతా ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ స్టేషన్‌కు మార్చడం వల్ల కాచిగూడ నుంచి షిర్డీ(నాగర్సోల్ స్టేషన్) మధ్య రోజువారీ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలుకు అదనంగా ఒక 2 టైర్ ఏసీని జతచేయనున్నారు. -
పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగాను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. పూర్తిగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219/17220), విజయవాడ–విశాఖపట్నం (22702/22701), గుంటూరు–విశాఖపట్నం (17239/17240), బిట్రగుంట–విజయవాడ (07977/07978), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07576/07500), విజయవాడ–గూడూరు (12744/12743) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), విజయవాడ–భీమవరం టౌన్ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు రామవరప్పాడు–విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి. దారి మళ్లించిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 25 వరకు యర్నాకుళం–పాట్నా (22643), ఈ నెల 23 నుంచి 30 వరకు భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756), ఈ నెల 20, 22, 27, 29 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఈ నెల 18, 20, 22, 23, 25, 27, 29, 30 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019), ఈ నెల 18 నుంచి 31 వరకు ధన్‌బాద్–అలెప్పి (13351), ఈ నెల 23, 30 తేదీల్లో హతియా–బెంగళూరు (18637), ఈ నెల 19, 24, 26, 31 తేదీల్లో హతియా–బెంగళూరు (12835), ఈ నెల 22, 29 తేదీల్లో టాటా–బెంగళూరు (12889), ఈ నెల 21, 28 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111), ఈ నెల 18, 25 తేదీల్లో హతియా–యర్నాకులం (22837) రైళ్లు రెండు మార్గాల్లో వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
శబరిమలకు 22 అదనపు రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 22 అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు.. సికింద్రాబాద్–కొల్లాం (07111/07112) ప్రత్యేక రైలు ఈ నెల 27, జనవరి 3, 10, 17 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, జనవరి 5, 12, 19 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్–కొట్టాయం (0713/0714) ప్రత్యేక రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30, జనవరి 6, 13, 20 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు జామున కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07117/07118) స్పెషల్ ట్రైన్ జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 4వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07009/07010) స్పెషల్ ట్రైన్ జనవరి 6, 13 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.05 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8, 15 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. -
రైళ్లు, విమానాల రాకపోకలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాన్ ప్రభావంతో మంగళవారం కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రూట్లలో పరిమితంగా సర్విసులను పునరుద్ధరించారు. ముంబయి మీదుగా చెన్నైకి వెళ్లే కొన్ని రైళ్లను ఇతర మార్గాల్లో మళ్ళించారు. ఈ నెల 8వ తేదీ వరకు వివిధ మార్గాల్లో సుమారు 120 రైళ్లను రద్దు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తుపాన్ తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకొంటే రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, భువనేశ్వర్, కోల్‌కతా, తదితర ప్రాంతాలకు వెళ్లే రైలు మార్గాల్లో వరదల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలపై వరదనీటిని తొలగించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రాత్రింబవళ్లు విధులను నిర్వహిస్తున్నారని వివరించారు. రాకపోకలు నిలిచిన రైళ్ళు ఇవే: కాచిగూడ–చెంగల్పట్టు, హైదరాబాద్–తాంబరం, సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి. సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె. చెన్నై–హైదరాబాద్, సింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రమ్ తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ రూట్లో రైలు సర్విసులు పునరుద్ధరణ: తిరుపతి–సికింద్రాబాద్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–గూడూరు రూట్లలో కొన్ని సర్విసులను పునరుద్ధరించినట్లు అధికారులు పేర్కొన్నారు. తుపాన్ కారణంగా రద్దయిన రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు బుక్ చేసుకొన్న ప్రయాణికులు రైళ్ల పునరుద్ధరణకు అనుగుణంగా తిరిగి తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 20 విమాన సర్విసులు రద్దు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 20 దేశీయ విమాన సర్విసులు నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, చెన్నై, రాజమండ్రి, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు బయలుదేరే విమానాలను వాతావరణ ప్రభావం కారణంగా అధికారులు రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావలసిన విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి. తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు రైళ్లతో పాటు విమానాలు కూడా రద్దవడంతో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. -
రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్
మిచాంగ్ తుపాను కారణంగా భారీగా రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఈ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్: 040–2778666, 040–27801112 నాంపల్లి: 9676904334 కాచిగూడ: 040–27784453 సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. దక్షిణమధ్య రైల్వే నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 150 రైళ్లను అధికారులు ఇప్పటికే రద్దు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నై వెళ్లే రైళ్లకు కూడా బ్రేక్ పడింది. కాచిగూడ–చెంగల్పట్టు, హైదరాబాద్–తాంబరం, సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. అటు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగనుందని అధికారులు తెలిపారు. పలుచోట్ల ఇప్పటికే వరదలు మొదలు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురిసి, వరదలు పారుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ ప్రాంతాల్లో రైల్వేలైన్ల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వరదలు, నీటి ప్రవాహం కారణంగా పట్టాలపై నీరు నిలిచి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటికే పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టడంతోపాటు ఎప్పటికప్పుడు వరద నీటిని తొలగించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రయాణాలను వాయిదా వేసుకోండి హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో కొన్నింటిని ప్రధాన స్టేషన్లకే పరిమితం చేశారు. అత్యవసరమైతే తప్ప తుపాను ప్రభావిత ప్రాంతాల దిశగా ప్రయాణాలు వద్దని, ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నవారు వాయిదా వేసుకోవడం మంచిదని ప్రయాణికులకు సూచిస్తున్నారు. తుఫాన్ కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకొనే వారికి పూర్తిస్థాయిలో చార్జీలను తిరిగి చెల్లించనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలోని బుకింగ్ కేంద్రాల్లో టికెట్లను రద్దు చేసుకోవచ్చు. అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు తుపాను కారణంగా హైదరాబాద్ నుంచి కొల్లాం వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి శబరిమలకు రైళ్లు తక్కువగా ఉన్నాయని, రద్దు కారణంగా వేరే రైళ్లలో టికెట్లు దొరికే పరిస్థితి లేదని చెప్తున్నారు. వాహనాల్లో అంతదూరం ప్రయాణించడం ఇబ్బందికరమేనని అంటున్నారు. రైల్ నిలయం నుంచి పర్యవేక్షణ తుపాను ప్రభావం ఉండే ప్రాంతాలకు వెళ్లే రైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ రైళ్లను నడపాలని పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు రైల్‌నిలయం నుంచి తుపాను పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వారు డివిజనల్ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. తుపాను పరిణామాలను ఎదుర్కొనేందుకు అవసరమైన సామాగ్రిని, యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. వంతెనలు, వరద పోటెత్తే ప్రదేశాల్లో వాచ్మన్లను ఏర్పాటు చేశారు. పట్టాలపై నిలిచే వరదనీటిని తొలగించేందుకు డీజిల్ పంపులను సిద్ధం చేశారు. -
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా గరిష్ట స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తూ తన పాత రికార్డులు అధిగమిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరో ఘనతను సాధించింది. నవంబర్ నెలకు సంబంధించి రైల్వే శాఖ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఇటు ప్రయాణికుల రైళ్ల ద్వారా, అటు సరుకు రవాణా రైళ్ల ద్వారా నవంబర్‌లో రూ.1,600.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది నవంబర్‌లో గరిష్ట ఆదాయం రూ.1,454 కోట్లు మాత్రమే కాగా, ప్రయాణికుల రైళ్ల ద్వారా రైల్వే ఈ సంవత్సరం నవంబర్‌లో 469.40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రయాణికుల అవసరాల మేరకు 342 అదనపు ట్రిప్పులను నడిపింది.ఇది 64 రైళ్లకు సమానం. వీటిల్లో 3.39 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే రైల్వే శాఖ ఈ నవంబర్‌లో 11.57 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. దీని ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది గతేడాది నవంబర్ ఆదాయం కంటే పది శాతం ఎక్కువ. కొత్త క్లైంట్లతో ఒప్పందాలు చేసుకోవటం, సరుకు రవాణా చేసే కొత్త గమ్యస్థానాలను జోడించటం, కొత్త ట్రాక్‌ను అందుబాటులోకి తేవటం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమైందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదాయాన్ని భారీగా పెంచడానికి కృషి చేసిన ఉద్యోగులు, ఇతర సిబ్బందిని జోన్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి కూడా ఇదే తరహా రికార్డును సాధించాలని ఆయన సూచించారు. -
ప్రయాణికులకు అలర్ట్: మిచాంగ్ తుపాన్ ఎఫెక్ట్.. 142 రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విభాగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దాదాపు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేసినట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం శుక్రవారం వాయుగుండంగా మారి.. ఆదివారానికి తుపానుగా బల పడనున్నది. ఈ తుఫాన్‌కు మిచౌంగ్ అని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో ఆదివారం, సోమవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. Passengers Please Note: Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/RjI1X4hXAg — South Central Railway (@SCRailwayIndia) December 2, 2023 ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అలర్ట్ జారీ చేసింది. మిచాంగ్ తుపాన్ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధిలో 142 రైళ్లు రద్దు చేశామని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు. (3/3) Passengers Please Note: Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/qKREufE9R1 — South Central Railway (@SCRailwayIndia) December 2, 2023 Cancellation / Partial Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/LHKg9gExjD — South Central Railway (@SCRailwayIndia) December 2, 2023 -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతోన్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు కాకినాడ పోర్టు–విశాఖ(17267/17268), రాజమండ్రి–విశాఖ (07466/07467), మచిలీపట్నం–విశాఖ (17220/17219), గుంటూరు–రాయగడ (17243/17244), గుంటూరు–విశాఖ (17239/17240), బిట్రగుంట–విజయవాడ (07977/07978), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/07576), విజయవాడ–గూడూరు (07500/07458) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దైనవి: ఈ నెల 20 నుంచి 26 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896), విజయవాడ–మచిలీపట్నం (07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లను విజయవాడ–రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు: ఈ నెల 25న భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756), ఈ నెల 22, 24 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఈ నెల 22, 24, 25 తేదీల్లో ఛత్రపతి శివాజీ టర్మి నల్–భువనేశ్వర్ (11019), ఈ నెల 21 నుంచి 26 వరకు ధన్‌బాద్–అలిప్పి (13351), ఈ నెల 25న హతియా–బెంగళూరు (18637) 26న హతియా–బెంగళూరు (12835), 24న టాటా–బెంగళూరు (12889), ఈ నెల 23న టాటా–యశ్వంత్‌పూర్ (18111) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం జంక్షన్, నిడదవోలు స్టేషన్ల మీదుగా దారి మళ్లించారు. శబరిమలకు ప్రత్యేక రైళ్లు: శబరిమలకు ఈ నెల 26, డిసెంబర్ 3న సికింద్రాబాద్–కొల్లం (07129), ఈ నెల 28, డిసెంబర్ 5న కొల్లం–సికింద్రాబాద్ (07130), ఈ నెల 26, డిసెంబర్ 3న నర్సాపూర్–కొట్టాయం (07119), ఈ నెల 27, డిసెంబర్ 4న కొట్టాయం–నర్సాపూర్ (07120), ఈ నెల 22, 29, డిసెంబర్ 6న కాచిగూడ–కొల్లం (07123), ఈ నెల 24, డిసెంబర్ 1, 8 తేదీల్లో కొల్లం–కాచిగూడ (07124), ఈ నెల 23, 30న కాకినాడ టౌన్–కొట్టాయం (07125), ఈ నెల 25, డిసెంబర్ 2న కొట్టాయం–కాకినాడ టౌన్ (07126), ఈ నెల 24, డిసెంబర్ 1న సికింద్రాబాద్–కొల్లం (07127), ఈ నెల 25, డిసెంబర్ 2న కొల్లం–సికింద్రాబాద్ (07128) రైళ్లను నడపనున్నారు. -
రైల్వేలో ఎలక్ట్రిక్ విప్లవం
సంప్రదాయ డీజిల్ ఇంజిన్లను రైల్వే శాఖ వేగంగా వదిలించుకుంటోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది. భారతీయ రైల్వేలో కీలక జోన్లలో ఒకటిగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే, ఏకంగా వేయి కరెంటు ఇంజిన్లను వినియోగంలోకి తెచ్చి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్ (ఐజీబీటీ) ప్రొపల్షన్ సిస్టంతో ఉన్న 1,000వ ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే పట్టాలెక్కించింది. దూరప్రాంతాలకు నడిచే దాదాపు అన్ని కీలక రైళ్లను ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంజిన్లతోనే నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ ఇంజిన్‌కు సహస్రాశ్వ అన్న పేరు పెట్టారు. దీన్ని లాలాగూడ ఎలక్ట్రిక్ లోకోషెడ్ తనిఖీలో భాగంగా జోన్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ ప్రారంభించారు. సాక్షి, హైదరాబాద్: రైలు మార్గాలను విద్యుదీకరించటం ద్వారా ఆధునికతకు శ్రీకారం చుట్టిన రైల్వే ఇప్పుడు డీజిల్ ఇంజిన్లను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించింది. వాటిని కేవలం రైలు యార్డులు, ఇతర చోట్ల కోచ్‌లను పార్క్ చేయటానికి తరలించడం లాంటి పనులకే వినియోగించబోతోంది. ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్లను సైతం కరెంటు ఇంజిన్లతోనే నడపటం ద్వారా వాతావరణ కాలుష్యానికి కళ్లెం వేస్తోంది. డీజిల్ వినియోగాన్ని తగ్గించటం ద్వారా చమురు ఖర్చుకు బ్రేక్ వేస్తోంది. డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే కరెంటు ఇంజిన్ల వినియోగం వల్ల ఖర్చు భారీగా తగ్గుతుంది. ♦ ప్రయాణికుల రైలును ఒక డీజిల్ లోకోమోటివ్‌తో నడిపితే సగటున ఏడాదికి 45 లక్షల లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. అదే గూడ్సు రైలు అయితే 15 లక్షల లీటర్లు ఖర్చు అవుతుంది. ఒక్కో ఇంజిన్ ద్వారా అంతమేర ఇంధనం ఆదా అవుతుంది. ♦ ఒక ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రయాణికుల రైలును లాగేందుకు ప్రతి కి.మీ.కు ఆరు యూనిట్ల కరెంటును ఖర్చు చేస్తుంది. డీజిల్‌తో పోలిస్తే ఇది పెద్ద ఆదా అన్నమాటే. ♦ ప్రస్తుతం ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను కూడా ఆధునికీకరించారు. సంప్రదాయ కరెంటు ఇంజిన్ బదులు తాజాగా ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్ (ఐజీబీటీ)ప్రొపల్షన్ సిస్టం ఉన్న ఇంజిన్లు వాడుతున్నారు. బ్రేక్ వేసినప్పుడల్లా ప్రత్యేక మెకానిజం వల్ల కొంత చొప్పున కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ రూపంలో 12.4 శాతం కరెంటు ఆదా అవుతుంది. దాన్ని తిరిగి గ్రిడ్‌కు పంపి.. పునర్వినియోగానికి వీలు కల్పిస్తారు. అంటే.. ఒక ఇంజిన్ సగటున సాలీనా 976 టన్నుల బొగ్గును ఆదా చేస్తుందన్నమాట. ♦ డీజిల్ వినియోగాన్ని నిరోధించటం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ప్రతి లోకోమోటివ్ సంవత్సరానికి 2.362 కిలో టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. ♦ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న వేయి కరెంటు లోకోమోటివ్‌లలో 600 ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్ (ఐజీబీటీ)ప్రొపల్షన్ సిస్టం ఉన్న ఇంజిన్లే. మిగతావి సంప్రదాయ ఇంజిన్లు. ♦సంప్రదాయ ఎలక్ట్రిక్ ఇంజిన్ 5000 హెచ్.పీ. సామ ర్థ్యం కాగా, ఆధునిక ఇంజిన్ల సామర్థ్యం 6000 హెచ్.పీ. త్వరలో అన్ని మార్గాల విద్యుదీకరణ దక్షిణ మధ్య రైల్వేలో కొత్త లైన్లు మినహా మిగతా ప్రధాన మార్గాలన్నీ విద్యుదీకరించారు. 6650 రూట్ కి.మీ.మార్గాన్ని విద్యుదీకరించగా, కేవలం 691 కి.మీ. మాత్రమే మిగిలి ఉంది. తెలంగాణకు సంబంధించి అక్కన్నపేట– మెదక్, మనోహరాబాద్–కొత్తపల్లి (సిద్దిపేట వరకు పూర్తి) మార్గాలు మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది. 695 రైళ్లు కరెంటువే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లైన్ల విద్యుదీకరణ వేగంగా పూర్తి అవుతుండటం, కరెంటు ఇంజిన్లు అందుబాటులోకి వస్తుండటంతో రైళ్లకు ఎలక్ట్రిక్ ఇంజిన్లనే ఎక్కువగా వాడుతున్నారు. జోన్‌పరిధిలో ప్రస్తుతం 874 రైళ్లను కరెంటు ఇంజిన్లతోనే నడుపుతున్నారు. మరో 695 రైళ్లకు ఇంకా డీజిల్ ఇంజిన్లు వాడుతున్నారు. వీటిల్లో విద్యుదీకరించని మార్గాల్లో నడుస్తున్న రైళ్లు ఉన్నాయి. కొత్తగా కరెంటు ఇంజిన్లు అందుబాటులోకి వచ్చే కొద్దీ డీజిల్ ఇంజిన్ల వినియోగం తగ్గనుంది. మిగతా కొత్త మార్గాలను కూడా విద్యుదీకరిస్తే ఇక డీజిల్ ఇంజిన్ల వినియోగం నామమాత్రమే అవుతుంది. -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతోన్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగాను రద్దు చేసి కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుపక్కర్ గురువారం తెలిపారు. రద్దైన రైళ్లు: ఈ నెల 13–19 వరకు కాకినాడ టౌన్–విశాఖ (17267/17268), గుంటూరు–రాయగడ (17243), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/07576), విజయవాడ–గూడూరు (07500/07458), బిట్రగుంట–విజయవాడ (07977/07978), రాజమండ్రి–విశాఖ (07466/07467), మచిలీపట్నం–విశాఖ (17219),గుంటూరు–విశాఖ (17239), 14–20 వరకు విశాఖ–మచిలీపట్నం (17220), రాయగడ–గుంటూరు (17244), 13, 14, 15, 17, 18 తేదీల్లో విజయవాడ–విశాఖ (22702/22701), విశాఖ–గుంటూరు (17240), ఈ నెల 13–17 వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238). పాక్షికంగా రద్దైన రైళ్లు: ఈ నెల 13–19 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), విజయవాడ–భీమవరం (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు విజయవాడ–రాయనపాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లింపు: ఈ నెల 13న యర్నాకులం–పాట్నా (22643), 18న భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756),15న బెంగళూరు–గౌహతి (12509), 13, 15, 17, 18 తేదీలలో ఛత్రపతి శివాజీ టర్మినల్–భువనేశ్వర్ (11019) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
బాబోయ్.. బాణసంచా
సాక్షి, హైదరాబాద్: వరుస ప్రమాదాలతో సతమత మవుతున్న రైల్వే శాఖ ఇప్పుడు దీపావళి పండుగ అనగానే తీవ్ర ఆందోళనకు గురవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా బ్యాగుల్లో బాణసంచా పెట్టు కుని కొందరు ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రతీ దీపావళి సంద ర్భంలో రైల్వే ఉద్యోగులు తనిఖీలు చేస్తుంటారు. అయినా వాటిని పూర్తిగా నియంత్రించ లేకపోతు న్నారు. కొంతకాలంగా రైల్వే భద్రతపై మళ్లీ విమ ర్శలు వస్తున్నాయి. ఇటీవల తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రయా ణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరస్పరం రెండు రైళ్లు ఢీకొంటుండటంతో పాటు అగ్ని ప్రమా దాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈసారి దీపావళి సందర్భంగా రైళ్లలో బాణసంచా తరలించకుండా మరింత పకడ్బందీగా వ్యవహరించాలని రైల్వే శాఖ జోన్లను ఆదేశించింది. రంగంలోకి స్నిఫర్ డాగ్స్.. నిత్యం కిటకిటలాడే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయా ణికుల తనిఖీ రైల్వే సిబ్బందికి సవాల్‌గా ఉంటోంది. వందలాది మంది ఒకేసారి వస్తుండటంతో వారి ని క్రమపద్ధతిన లోనికి పంపుతూ చెక్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటం కుదరటం లేదు. స్టేషన్‌కు వెళ్లేందుకు నాలుగైదు దారులు ఉండటంతో, ఏదో ఓ దారి నుంచి లోనికి చేరుతున్నారు. వారి లగేజీలో బాణాసంచా ఉందో లేదో తనిఖీ చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు)తో కూడిన క్విక్ రియాక్షన్ బృందాల ను రైల్వే రంగంలోకి దింపుతోంది. ఈ సిబ్బంది సాధారణ దుస్తుల్లో ఉండి తనిఖీ చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో.. రెండు చోట్ల జాగిలాలతో తనిఖీ చేసి బాణాసంచాను సులభంగా గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. బాణ సంచా తరలిస్తే మూడేళ్ల జైలు శిక్ష ప్రస్తుతం ఉన్న సీసీటీవీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్నింటిని ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. వాటి ద్వారా పర్యవేక్షించేందుకు ప్రత్యే కంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. రైళ్లలో బాణసంచా తరలిస్తే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.వేయి జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందంటూ రైల్వే సిబ్బంది ప్రచారం ప్రారంభించారు. ఎవరైనా బాణ సంచా సహా మండే స్వభావం ఉన్న ఇతర వస్తు వులను రైళ్లలో తరలిస్తున్నట్టు దృష్టికొస్తే 139కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠిన చర్యలు రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇలాంటి పేలుడు పదార్థాల వల్ల ప్రయాణికుల భద్రత, రైళ్లు, రైల్వేస్టేషన్లు, రైల్వే ఆస్తుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందన్నారు. -
56% యువత, ఉద్యోగులే..
పట్టాలెక్కిన కొద్ది నెలల్లోనే ప్రయాణికులను వేగంగా తనవైపు ఆకర్షించుకుంటోందివందేభారత్ రైలు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి రూట్లలో మూడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మూడింటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతానికి పైగానే నమోదవుతోంది. ఆ రూట్లలో రెండో వందేభారత్ రైలును ప్రవేశపెట్టినా, ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఈ రైళ్లలో ఎక్కువగా ప్రయాణిస్తున్న కేటగిరీలపై ఓ సర్వే నిర్వహించింది. మొత్తం ప్రయాణికుల్లో 56 శాతం మంది యువకులు, ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్టు తేలింది. –సాక్షి, హైదరాబాద్ యువకులే ఎక్కువ వందేభారత్ రైళ్లలో సగటున 29.08 శాతం యువతీయువకులే ఉన్నారు. 25–34 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నట్టు తేలింది. వేగంగా గమ్యం చేరుతుండటంతో ఈ రైలులో ప్రయాణానికే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. చదువు, ఉద్యోగ ప్రయత్నం, టూర్లు.. ఇతర పనులకు వెళ్లేందుకు ఈ రైలు వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణ సమయం తక్కువగా ఉండటంతో పనులు వేగంగా చేసుకునే వీలు ఉండటం వీరికి కలిసి వస్తోంది. భద్రత పరంగా మెరుగ్గా ఉండటంతో ఒంటరిగా వెళ్లే యువతులు ఇందులో ప్రయాణించేందుకే ఇష్టపడుతున్నారు. ఈ రైలు ఒకవైపు ఉదయం బయలుదేరి మధ్యాహ్నం వరకు, రెండో వైపు మధ్యాహ్నం బయలు దేరి రాత్రి 11 వరకు గమ్యం చేరుతోంది. దీంతో అది సురక్షిత సమయంగా యువతులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులూ ఎక్కువే వందేభారత్ రైళ్లలో 26.85 శాతం మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్లు సర్వేలో తేలింది. గరుడ ప్లస్ బస్సు చార్జీతో వందేభారత్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు ఉండటాన్ని ఉద్యోగులు పరిగణిస్తున్నారని రైల్వే అధికారులు చెబుతున్నారు. వందేభారత్ దెబ్బకు కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు టికెట్ చార్జీలను సవరించే పరిస్థితి వస్తోందంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చని అంటున్నారు. ఈ సర్వే నివేదికను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లామని, దాని ఆధారంగా వందేభారత్ రైళ్లలో మరిన్ని మార్పు చేర్పులు చేసే వీలుందని పేర్కొంటున్నారు. కాగా, 11.81 శాతం మంది వయో వృద్ధులు ఉంటున్నట్టు తేలింది. ప్రయాణాన్ని ఆస్వాదించండి వేగంగా గమ్యం చేరటంతోపాటు ప్రయాణికులు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల అవసరాలు గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు మరింత ఉన్నతీకరిస్తున్నాం. అనతికాలంలోనే లక్షల మంది వాటిల్లో ప్రయాణించారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మిగతా ప్రయాణికులు కూడా వాటి సేవలను పొందాలని ఆశిస్తున్నాం. – అరుణ్‌కుమార్ జైన్, జీఎం, దక్షిణ మధ్య రైల్వే -
దసరాకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07645/07646) స్పెషల్ ట్రైన్ ఈ నెల 20న ఉదయం 8.40కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40కి సంత్రాగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 21వ తేదీ మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–నర్సాపూర్ (07062) ఈ నెల 22వ తేదీ రాత్రి 10.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 కి నర్సాపూర్ చేరుకుంటుంది. నాందేడ్–కాకినాడ (07055/07056) స్పెషల్ ట్రైన్ 21వ తేదీ మధ్యాహ్నం గం.3.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నాందేడ్ చేరుకుంటుంది. విశాఖపట్టణం–కర్నూల్ (08585/08586) స్పెషల్ ట్రైన్ ఈ నెల 24, 31, నవంబర్ 7, 14 తేదీల్లో సాయంత్రం 5.35కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.35కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, నవంబర్ 1, 8, 15 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 కి విశాఖ చేరుకుంటుంది. -
అదే బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, సికింద్రాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మరికాసేపట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం మా ఎన్నికల స్ట్రాటజీ. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఇప్పటికే 50 శాతం పూర్తి చేశాం. ప్రధాని మోదీ రెండుసార్లు తెలింగాణకు వచ్చారు. అభ్యర్థుల ను ఎప్పుడు ప్రకటించాలన్నది మా ఇష్టం. నామినేషన్ చివరి వరకు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేకమంది బీజేపీలోకి చేరుతున్నారు. ప్రజలు బీజేపీని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము రెడీగా ఉన్నామన్నారు. కాగా, కిషన్‌రెడ్డి సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పూణే- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట వరకు, జైపూర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ కర్నూల్ వరకు, కరీంనగర్-నిజామాబాద్ (మెము)బోధన్ వరకు, నాందేడ్-తాండూరు ఎక్స్‌ప్రెస్ రాయ్‌చూర్ వరకు పొడిగిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం మరో నాలుగు రైళ్లను పొడగించి ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండాలనే సర్వీసులను ప్రారంభించాం. తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ తక్కువగా ఉంది. ప్రధాని మోదీ రైల్వే నెట్వర్క్ పెంచాలని చూశారు. అందులో భాగంగానే కొత్త రైళ్లను ప్రకటించారు. కొత్త ప్రాజెక్ట్‌లను కేంద్రం తెలంగాణకు ఇచ్చింది. రైల్వే అభివృద్ధి కోసం 5వేల కోట్లకు పెంచింది. 31వేల కోట్ల పనులు తెంగాణలో జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి కల్లా చర్లపల్లి టెర్మినల్ ప్రారంభించాలని చూస్తున్నాం. ఎంఎంటీఎస్ కొత్త ప్రోజెక్ట్‌లు కూడా కేంద్రం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు పొడిగిస్తాం. హరీష్‌రావుపై ఫైర్ కొంత మంది రాష్ట్ర మంత్రులు అయ్యి ఉండి నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. సిద్దిపేట రైల్వే స్టేషన్లో హరీష్ రావు తీరు బాగోలేదు. సిద్ధిపేట ట్రైన్ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే.. రైల్వే అధికారులను తిట్టారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఈ తీరుగా ప్రవర్తించారు. గతంలో కూడా రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే మీకు బుద్ది చెబుతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: 15 లేదా 16వ తేదీన బీజేపీ ఫస్ట్ లిస్ట్ -
పట్టాలెక్కిన విజయవాడ–చెన్నై వందేభారత్ రైలు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–చెన్నై, కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆదివారం పట్టాలు ఎక్కాయి. దేశవ్యాప్తంగా 9 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపైకి చేరుకున్న వందేభారత్ రైలుకు 1,500 మందికిపైగా విద్యార్థులతో కలసి రైల్వే అధికారులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ మాట్లాడుతూ..మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భార్ భారత్, ఇండియా ఫస్ట్ ఇనీషియేటివ్స్ ఆఫ్ ది నేషన్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును తయారు చేయడం దేశం సాధిస్తోన్న ప్రగతికి నిదర్శనమన్నారు. 9 నెలల్లోనే ఏపీకి 3 వందేభారత్ రైళ్లను కేంద్రం కేటాయించిందని చెప్పారు. రైల్వే చరిత్రలో 2023 గొప్ప మేలి మలుపుగా నిలిచిపోతుందన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు జెండాలు ఊపి రైలుకు వీడ్కోలు పలికారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కాచిగూడ– యశ్వంతపూర్ వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ రైలు ఏపీలోని కర్నూలు, అనంతపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడ–చెన్నై సెంట్రల్‌కు మొట్టమొదటి వందే భారత్ రైలును చూసేందుకు నగరవాసులు, పలు పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో స్టేషన్ సందడిగా మారింది. రైల్వేశాఖ ఆధ్వర్యంలో ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో ప్రదర్శించిన పలు నాటకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.విద్యార్థులు వందే భారత్ రైలుతో సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. -
రాజమండ్రి స్టేషన్లో రైల్వే జీఎం తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లోని రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా దువ్వాడ–రాజమండ్రి సెక్షన్ల మధ్య రియర్ విండో తనిఖీ ద్వారా ట్రాక్, సిగ్నలింగ్ భద్రత వ్యవస్థ అంశాలను పరిశీలించారు. అక్కడ నుంచి రాజమండ్రి స్టేషన్లో పర్యటించి క్రూ కంట్రోల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, అక్కడి సిబ్బంది బుకింగ్ లాబీ పనితీరును సమీక్షించారు. లోకో పైలట్లు, గార్డుల విధుల నిర్వహణకు సంబంధించిన క్రూ మేనేజ్మెంట్ పనితీరును పరిశీలించారు. ముఖ్యంగా రన్నింగ్ స్టాఫ్‌ని డ్యూటీకి తీసుకునే ముందు తగిన విశ్రాంతిని అందించడంపై దృష్టి సారించాలని, అలాగే సిబ్బందికి తగిన విశ్రాంతి ఉండేలా డ్యూటీ నిర్వహణ పద్ధతిని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మల్టిపర్పస్ స్టాల్స్, వన్ స్టేషన్– వన్ ప్రొడక్ట్ స్టాల్స్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల సౌకర్యాలపై సమీక్షించారు. స్టేషన్ ఆవరణలో త్వరలో ప్రారంభం కానున్న రైల్ కోచ్ రెస్టారెంట్‌ను కూడా ఆయన సందర్శించారు. ఆయనతో పాటు విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు జీఎం అరుణ్‌కుమార్ జైన్‌ను కలిసి పలు రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడి వినతిపత్రాలు అందజేశారు. -
ఇక ‘లెవల్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల తరహాలో క్రాసింగ్స్ లేకుండా రైల్వే లైన్లను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు మార్గాన్ని రోడ్లు క్రాస్ చేసే ప్రాంతాల్లో, వాటి మీదుగా వెళ్లే వాహనాల రద్దీ ఆధారంగా రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు, తక్కువ ఎత్తున్న అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు. ప్రాజెక్టు ప్రణాళికల సమయంలోనే ఇందుకు ఏర్పాట్లు చేసి అంచనా వ్యయాన్ని నిర్ధారించనున్నారు. ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఎక్కడా ఇతర రోడ్లు క్రాస్ చేయకుండా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో రైల్వే లైన్లను కూడా నిర్మించాలని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. నిర్ణయించటమే కాకుండా వెంటనే అమలులోకి తెచ్చింది. ఇప్పటికే మొదలైన ప్రాజెక్టుల్లో సైతం: ఈ నిర్ణయం తీసుకునేసరికే మొదలై పనులు జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో మనోహరాబాద్–కొత్తపల్లి కొత్త లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కీలక ప్రాజెక్టు. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ మొదలై గజ్వేల్, సిద్దిపేట మీదుగా కొత్తపల్లి (కరీంనగర్ సమీపం) వరకు ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం సిద్దిపేట వరకు పనులు పూర్తయ్యాయి. గజ్వేల్ సమీపంలోని కొడకండ్ల–సిద్దిపేట మధ్య ఈనెల 15న రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇది పూర్తి అయ్యాక వీలైనంత తొందరలో సిద్దిపేట నుంచి రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. ఈమేరకు అనుమతి ఇవ్వాల్సిందిగా రైల్వే బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ ప్రాజెక్టులో కీలక ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు ప్లాన్ చేసినా.. ఇంకా నాలుగు లెవల్ క్రాసింగ్స్ ఉన్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి లైన్‌లోని ఆ నాలుగులెవల్ క్రాసింగ్స్ కూడా తొలగింపు తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు, ఆ నాలుగు లెవల్ క్రాసింగ్స్‌ను కూడా తొలగించాలని నిర్ణయించటం విశేషం. గజ్వేల్ దాటిన తర్వాత ఉన్న కొడకండ్ల శివారులోని రామచంద్రాపూర్ రోడ్డు వద్ద లెవల్ క్రాసింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ 3.5 మీటర్ల ఎత్తుతో లిమిటెడ్ ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించారు. కుకునూరుపల్లి దాటిన తర్వాత కొండపోచమ్మ దేవాలయానికి వెళ్లే రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన లెవల్ క్రాసింగ్‌ను తొలగించి ఆర్యూబీ నిర్మించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లికి వెళ్లే రెండో కమాన్ రోడ్డు వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్‌ను తొలగించి దాదాపు అరకి.మీ. నిడివితో ఏడు మీటర్ల ఎత్తు గల ఆర్ఓబీని నిర్మించాలని నిర్ణయించారు. సిద్దిపేట శివారులోని రంగదామ్‌పల్లి లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించారు. ఇంకా 1,150 లెవల్ క్రాసింగ్స్... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పాత లైన్ల మీద ఇంకా 1,150 వరకు లెవల్ క్రాసింగ్స్ ఉన్నాయి. కాపలా లేని క్రాసింగ్స్‌ను పూర్తిగా తొలగించినా, కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని దశల వారీగా తొలగించే పని జరుగుతోంది. కానీ, కొత్తగా చేపట్టిన, చేపట్టబోయే ప్రాజెక్టుల్లో మాత్రం అసలు లెవల్ క్రాసింగ్స్ ఉన్న ఊసే ఉండకపోవటం విశేషం. -
15 కొత్త రైల్వే లైన్లకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 15 కొత్త రైల్వే ప్రాజెక్టులను నిర్మించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. 2,647 కి.మీ. నిడివితో నిర్మించే ఆ ప్రాజెక్టులకు రూ.50,848 కోట్లు వ్యయం కాను న్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. వీటితోపాటు రూ.32,695 కోట్లు వ్యయమయ్యే 2,588 కి.మీ. 11 డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులకు కూడా ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైనట్టు వెల్లడించింది. రీజినల్ రింగ్ రైల్, ఆదిలాబాద్–పటాన్చెరు, ఘ ట్కేసర్ – యాదాద్రి, తాండూరు–జహీరాబాద్, మ ణుగూరు – రామగుండం, ఉందానగర్ – జగ్గయ్య పేట, కరీంనగర్ – హసన్‌పర్తి, డోర్నకల్ – మిర్యా లగూడ, భూపాలపల్లి–కాజీపేట, పాండురంగాపు రం–మల్కన్‌గిరి, కొత్తగూడెం–కిరండోల్, బోధన్ – లాతూరు రోడ్ ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేలు మంజూరైనట్టు వెల్లడించింది. కీలకం.. రీజినల్ రింగ్ రైల్ నగరానికి 50 కి.మీ. నుంచి 70 కి.మీ. వెలుపల దాదాపు 338 కి.మీ. నిడివితో నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు వెలుపల దానికి సమాంతరంగా రింగ్ రైల్ ప్రాజెక్టు రాబోతోంది. రూ.12,408 కోట్ల వ్యయంతో దాదాపు 564 కి.మీ. నిడివితో ఈ ప్రాజెక్టు ఉంటుందని రైల్వే ప్రకటించింది. వికా రాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట్, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి–భువనగిరి, రామన్నపేట, చిట్యాల, షాద్‌నగర్, షాబాద్ తదితర పట్టణాలను అనుసంధానిస్తూ ఇది రూపొందనుంది. అక్కన్న పేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ల మీదుగా కొత్త లైన్లు నిర్మించనుండటం విశేషం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతి కలగటంతోపాటు సరుకు రవాణా రైళ్లకు కూడా అడ్డంకులు లేని సాఫీ ప్రయాణానికి వెసులుబాటు కలుగుతుందని రైల్వే చెబుతోంది. ఇక 317 కి.మీ. నిడివితో రూ.5,706 కోట్లతో నిర్మితమయ్యే పటాన్చెరు (నాగులపల్లి) – ఆదిలా బాద్ ప్రాజెక్టు కూడా ఇందులో కీలకం కానుంది. ఇచ్చోడ, నేరేడుగొండ, ధానూరు, నిర్మల్, బాల్కొండ, ఆర్మూరు, బోధన్, రుద్రూరు, బాన్స్వాడ, నిజాంసాగర్, సంగారెడ్డి, పటాన్చెరు తదితర ప్రాంతాలకు రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చినట్టు అవు తుంది. దీంతోపాటు హైదరాబాద్–ఢిల్లీ ప్రధాన లైన్‌తో వీటికి అనుసంధానం కూడా కలుగుతుంది. వ్యవసాయాధారిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున, ధాన్యం తరలింపునకు ప్రధాన రవాణా సాధనం అందుబాటులోకి వచ్చినట్టు కూడా అవుతుందని రైల్వే తెలిపింది. -
సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్ట్‌లకు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. మంజూరైన కేంద్ర ప్రాజెక్టుల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌కు భూమి అడిగాం. భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. చర్లపల్లి కనెక్టివిటీ రోడ్‌కు కూడా రాష్ట్రం స్పందించట్లేదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024లో ప్రారంభిస్తాం. యాదాద్రి ఎంఎంటీస్‌తో సహా పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. త్వరలో సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కొత్త రైల్వేలైన్లు ఇవే.. ► ఆదిలాబాద్ నుంచి పటాన్చెరువు వరకు కొత్త రైల్వేలైన్. ► వరంగల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వేలైన్. ► ఉందానగర్ నుంచి జగ్గయ్యపేట వరకు కొత్త రైల్వేలైన్. ► వికారాబాద్-కృష్ణా మధ్య కొత్త రైల్వేలైన్. ► ఆర్ఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్. ఇది కూడా చదవండి: టార్గెట్ కడియం.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ -
తికమక తెలుగుతో ప్రయాణికుల తకరారు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల సమాచారం తెలిపే ఎల్రక్టానిక్ డిస్ప్లే బోర్డుల్లో వినియోగిస్తున్న సరికొత్త భాష ప్రయాణికులను గందరగోళం, అయోమయానికి గురి చేస్తోంది. సహజంగా ఊరి పేరు డిస్ప్లే చేస్తారు. కానీ ఘనత వహించిన దక్షిణ మధ్య రైల్వేలో మాత్రం ఊళ్ల పేర్లకు అర్ధాలు వెదికీ మరీ ప్రయాణికుల ముందుంచుతున్నారు. అది కూడా గూగుల్‌తో అనుసంధానించి మరీ తర్జుమా చేస్తున్నారు. దాంతో ప్రయాణికులకు సమాచారం ఇవ్వటం అటుంచి.. వారిని మరింత తికమకపెట్టి అయోమయానికి గురి చేస్తున్నారు. ♦ దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ స్టేషన్లో ఈ తికమక తంతు ఎలా ఉందో కళ్లకు కట్టే ఉదాహరణ ఇది. దక్షి ణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్ నిలయానికి అతి సమీపంలో ఉన్న ఈ స్టేషన్లో నిత్యం లక్షల మంది ప్రయాణికులు కళ్లప్పగించి చూసే రైళ్ల వివరాలను తెలిపే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు ఇది. ♦ తమిళనాడులోని ఎరోడ్ పట్టణానికి వెళ్లే స్పెషల్ రైలుకు సంబంధించి వివరాలు డిస్ప్లే బోర్డు మీద కనిపిస్తున్నప్పుడు ఇంగ్లీష్, హిందీలో సరిగానే ఉంది. కానీ తెలుగులో ప్రత్యక్షమైనప్పుడు విస్తుపోవటం ప్రయా ణికుల వంతవుతోంది. ‘‘ఎరో డ్ స్పెషల్’’అన్న రెండు పదాలకు తెలుగులో ‘‘క్షీణించు ప్రత్యేక’’అని కనిపిస్తోంది. ఎరోడ్ అన్నది ఊరు పేరు అన్న విషయం కూడా మరిచి, దాన్ని ఆంగ్ల పదంగానే భావిస్తూ తె లుగులోకి తర్జుమా చేసేశారు. ఎరోడ్ అన్న పదానికి క్షీణించటం, చెరిగిపోవటం అన్న అర్ధాలుండటంతో తెలుగులో క్షీణించు అన్న పదాన్ని డిస్ప్లే బోర్డులో పెట్టేశారు. స్పెషల్ అంటే ప్రత్యేక అన్న పదాన్ని జోడించారు. తెలుగులోకి బెంగాలీ పదాలు.. ♦ ఇది స్టేషన్‌లోనికి వెళ్లే ప్లాట్‌ఫామ్ నెం.10 వైపు ప్రధాన మార్గం. ఎదురుగా భారీ ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి రైళ్ల వివరాలు ప్రద ర్శిస్తారు. అందులో నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రావటంలో ఆలస్యం జరుగుతోందని పేర్కొంటూ దాని వేళలను మార్చారు. ఆ విష యం ప్రయాణికులకు తెలిపేందుకు డిస్ప్లే బోర్డు లో ఆ వివరాలు ఉంచారు. ఇంగ్లీష్‌లో ఆ రైలు పేరు ఎదురుగా రీషెడ్యూల్ అని రాసి తర్వాత కొత్త సమయాన్ని ఉంచారు. హిందీలో పరివర్తిత్ సమయ్ అని పేర్కొన్నారు. కానీ తెలుగులో ఆ ఎక్స్‌ప్రెస్ పేరు ఎదురుగా బెంగాలీ భాష పదాన్ని ఉంచారు. తెలుగుకు, బెంగాలీకి తేడా తెలియని సిబ్బంది నిర్వాకమిది. ఇంగ్లీష్, హిందీ తెలియని తెలుగు ప్రయాణికులకు ఈ వ్యవహారం మతిపోగొడుతోంది. అర్ధం కాని తికమక వ్యవహారంతో వారికి రైళ్ల సమాచారం సరిగా చేరటం లేదు. ప్రైవేటు సిబ్బంది నిర్వాకం రైళ్ల వివరాలను వాయిస్ అనౌన్స్మెంట్ ద్వారా తెలపటం, ఎల్రక్టానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా తెలిపే పనిని రైల్లే టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఆ బాధ్యత చూసే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ గందరగోళం నెలకొంది. సాంకేతికంగా ఏదైనా తప్పు జరిగితే వెంటనే గుర్తించాల్సిన రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తికమక తెలుగు సమస్య ఇప్పటివరకు పరిష్కారమవ్వలేదు. -
సిద్దిపేటలో రైలు కూతపై హరీష్‌రావు హర్షం
సాక్షి, సిద్దిపేట: సిద్ధిపేట వాసుల రైలు కల ఎట్టకేలకు తీరబోతోంది. త్వరలోనే సిద్దిపేటకి రైలు ప్రయాణాలు ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలో నర్సాపూర్ స్టేషన్ వరకు ట్రయల్ రన్ నిర్వచించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఇక సిద్దిపేటలో రైలు కూతపై హర్షం వ్యక్తం చేశారు సిద్ధిపేట ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి హరీష్ రావు. ట్రైన్ ముందు సెల్ఫీ దిగి తన ఆనందాన్ని పంచుకున్నారయన. ఎప్పటి నుంచి అనేదానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. అది అతిత్వరలోనే అని తాజా ఫొటోతో సంకేతాలు ఇచ్చారాయన. సిద్దిపేట నుంచి సరిపడా సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని నిర్ధారించుకున్న అధికారులు.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్ పుల్ రైలు ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. సిద్దిపేట నుంచి కాచిగూడకు ఆ రైలు నడుస్తుందని చెబుతున్నారు. ఇక తిరుపతికి, బెంగళూరుకు గానీ ముంబయికి గానీ ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడా సిద్దిపేట నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతున్న కొన్ని ఎక్స్ ప్రెస్ లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే కరీంనగర్ ప్రయాణికులకు కూడా ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు యోచిస్తున్నారు.