సాక్షి, హైదరాబాద్: వరుస ప్రమాదాలతో సతమత మవుతున్న రైల్వే శాఖ ఇప్పుడు దీపావళి పండుగ అనగానే తీవ్ర ఆందోళనకు గురవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా బ్యాగుల్లో బాణసంచా పెట్టు కుని కొందరు ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రతీ దీపావళి సంద ర్భంలో రైల్వే ఉద్యోగులు తనిఖీలు చేస్తుంటారు. అయినా వాటిని పూర్తిగా నియంత్రించ లేకపోతు న్నారు.
కొంతకాలంగా రైల్వే భద్రతపై మళ్లీ విమ ర్శలు వస్తున్నాయి. ఇటీవల తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రయా ణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరస్పరం రెండు రైళ్లు ఢీకొంటుండటంతో పాటు అగ్ని ప్రమా దాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈసారి దీపావళి సందర్భంగా రైళ్లలో బాణసంచా తరలించకుండా మరింత పకడ్బందీగా వ్యవహరించాలని రైల్వే శాఖ జోన్లను ఆదేశించింది.
రంగంలోకి స్నిఫర్ డాగ్స్..
నిత్యం కిటకిటలాడే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయా ణికుల తనిఖీ రైల్వే సిబ్బందికి సవాల్‌గా ఉంటోంది. వందలాది మంది ఒకేసారి వస్తుండటంతో వారి ని క్రమపద్ధతిన లోనికి పంపుతూ చెక్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటం కుదరటం లేదు. స్టేషన్‌కు వెళ్లేందుకు నాలుగైదు దారులు ఉండటంతో, ఏదో ఓ దారి నుంచి లోనికి చేరుతున్నారు. వారి లగేజీలో బాణాసంచా ఉందో లేదో తనిఖీ చేసే పరిస్థితి లేకుండాపోయింది.
ఈ నేపథ్యంలో స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు)తో కూడిన క్విక్ రియాక్షన్ బృందాల ను రైల్వే రంగంలోకి దింపుతోంది. ఈ సిబ్బంది సాధారణ దుస్తుల్లో ఉండి తనిఖీ చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో.. రెండు చోట్ల జాగిలాలతో తనిఖీ చేసి బాణాసంచాను సులభంగా గుర్తించాలని అధికారులు నిర్ణయించారు.
బాణ సంచా తరలిస్తే మూడేళ్ల జైలు శిక్ష
ప్రస్తుతం ఉన్న సీసీటీవీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్నింటిని ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. వాటి ద్వారా పర్యవేక్షించేందుకు ప్రత్యే కంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. రైళ్లలో బాణసంచా తరలిస్తే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.వేయి జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందంటూ రైల్వే సిబ్బంది ప్రచారం ప్రారంభించారు. ఎవరైనా బాణ సంచా సహా మండే స్వభావం ఉన్న ఇతర వస్తు వులను రైళ్లలో తరలిస్తున్నట్టు దృష్టికొస్తే 139కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠిన చర్యలు
రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇలాంటి పేలుడు పదార్థాల వల్ల ప్రయాణికుల భద్రత, రైళ్లు, రైల్వేస్టేషన్‌లు, రైల్వే ఆస్తుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment