సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. ఎవరు నిబంధనలు అతిక్రమించినా హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయన్నారు.
In view of maintaining public order, peace & tranquility in the limits of Cyberabad @CPCyberabad hereby notify for the information of the general public that Bursting of Fireworks/Crackers on Public roads & public places is strictly prohibited during the celebration of Deepavali. pic.twitter.com/miNJERiaOW
— Cyberabad Police (@cyberabadpolice) October 31, 2024
Comments
Please login to add a commentAdd a comment