సాక్షి, హైదరాబాద్: దీపావళి నేపథ్యంలో టపాసులు విక్రయించే దుకాణాదారులు అనుమతి తీసుకోవాలని పోలీసు విభాగం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ పోలీసు విభాగం ప్రకటన విడుదల చేసింది. దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు ఈ నెల 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు సమర్పించాల్సిన వెబ్‌సైట్లు: www.tspolice.gov.in https://eservices.tspolice.gov.in/
అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు
► డివిజినల్ ఫైర్ ఆఫీసర్ నుంచి ఎన్‌ఓసీ. ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేసే వాళ్లు జీహెచ్‌ఎంసీ నుంచి తీసుకున్న అనుమతి పత్రం.
► ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసే వాళ్లు స్థల యజమానుల నుంచి ఎన్‌ఓసీ.
► గతంలో దుకాణాలు ఏర్పాటు చేసి ఉంటే ఆ లైసెన్స్ ప్రతి. పక్కా భవనంలో దుకాణం ఏర్పాటు చేస్తున్నట్‌లైతే చుట్టు పక్కల వారి నుంచి ఎన్‌ఓసీ.
► దుకాణం బ్లూ ప్రింట్ కాపీ గన్‌ఫౌండ్రీ ఎస్బీఐలో చెల్లించిన రూ.600 లైసెన్స్ రుసుము ఒరిజినల్ రసీదు.
► ఈ పత్రాలు లేకుండా వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment