
హైదరాబాద్, సాక్షి: ఉద్యోగులకు జీహెచ్ఎంసీ దీపావళి శుభవార్త చెప్పంది. ఈరోజు సాయంత్రం వరకు జీతాలు విడుదల చేయనున్నట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ రూ.120 కోట్ల నిధులను విడుదల చేయనుంది. అయితే.. జీహెచ్ఎంసీ గత నెల వారం రోజుల ఆలస్యంగా జీతాలు ఇచ్చింది.
దసరాకు ఐదు రోజులు ఆలస్యంగా జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు రోజులు ముందుగానే జీహెచ్ఎంసీ జీతాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment