
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్ తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. పన్ను బకాయిలు చెల్లించని నేపథ్యంలో సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ తాజ్ బంజారాను జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. గత రెండేళ్లుగా హోటల్ యాజమాన్యం పన్నులు బకాయిలు చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. రూ.1.40కోట్లు పన్ను బకాయిలు ఉన్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు. గడిచిన రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు పన్ను బకాయలు చెల్లించలేదు. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ క్రమంలో సీజ్ చేసినట్టు తెలిసింది.
ఇక ఈ ఘటనపై తాజ్ హోటల్ యాజమాన్యం స్పందించింది. సీజ్‌చేసి వారెంట్ ఇష్యూ చేయడంతో హుటాహుటిన హోటల్ నిర్వాహకులు స్పందించారు. జీహెచ్‌ఎంసీకి బకాయి పడిన కోటీ 43 లక్షల రూపాయల పన్నులో సగం చెల్లించినట్టు తెలిపారు. మిగతా బకాయిలను వారంలోగా చెల్లించేందుకు ఒప్పుకున్నట్టు స్పష్టం చేశారు. అయితే తాజా బంజారానే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్‌లో భాగంగా డిఫాల్టర్స్ అందరికీ నోటీసులు పంపింది జీహెచ్‌ఎంసీ. మూడేళ్లుగా పన్ను చెల్లించనివాళ్లకు వారెంట్స్ ఇష్యూ చేశారు. అందులో భాగంగానే తాజ్ బంజారాకి కూడా నోటీసులు ఇచ్చారు. రెడ్ నోటీస్ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితుల్లో సగం పన్ను చెల్లించింది తాజ్ బంజారా యాజమాన్యం.
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా కూడా ఒకటి. ఈ హోటల్‌కు సెలబ్రెటీలు ఎక్కువగా వస్తుంటారు. క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్‌లోనే ఎక్కువగా బస చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయనేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది దీని వైపు మొగ్గుచూపుతారు.

Comments
Please login to add a commentAdd a comment