
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
లక్డీకాపూల్ (హైదరాబాద్) : ఆస్తి పన్ను(Property Tax) సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి(GHMC Commissioner) తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు (ఆర్పీఎస్) ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా/ఆరీ్టజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్‌లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్‌ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ అసెస్ మెంట్) తదితరాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఈ నెల 22న, మార్చి 1, 8, 15, 22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలలో నిర్వహించే ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment