help
-
శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తాడు: వేణుస్వామి
-
ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి
జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని మాట తప్పారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బాబు ఆస్పత్రి చికిత్స కోసం ఆర్థికసాయం చేయలేదంటూ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలైంది. ఆమె చేసిన కామెంట్స్‌తో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆరోగ్యంపై ఎన్టీఆర్ టీమ్ ఆరా తీసింది.క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు ఎన్టీఆర్ టీమ్.. అంతేకాదు అతని చికిత్సకు అయిన ఖర్చును మొత్తం చెల్లించారు. దీంతో తమను ఆదుకున్న ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా కౌశిక్ తల్లి ధన్యవాదాలు తెలిపింది.(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లిఅయితే తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆమె తెలిపింది. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నా కుమారుడు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడని పేర్కొంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నామని ఆమె వెల్లడించింది. మా కుటుంబం అంతా ఎన్టీఆర్‌కు అభిమానులు అని.. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
25న పేదింటి యువతి వివాహం
ఎలిగేడు(పెద్దపల్లి): ఓ పేదింటి యువతి వివాహం ఈనెల 25న నిశ్చయం కాగా.. చేతిలో చిల్లి గవ్వ లేక దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన చీకటి లక్ష్మి–కీ.శే.రామస్వామిల చిన్న కూతురు ప్రత్యూష వివాహం నరసింహులపల్లి గ్రామానికి చెందిన బుర్ర సతీశ్‌తో ఈనెల 25న బుధవారం జరగనుంది. ప్రత్యూష తండ్రి రామస్వామి పేగు క్యాన్సర్‌తో పదేళ్ల క్రితం మృతిచెందగా.. తల్లి లక్ష్మికి మతిస్థిమితం సరిగా లేదు. అన్న, వదినలు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు. వీరి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యూషను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన పెళ్లి కుమారుడు ఆదర్శంగా నిలిచాడు. ఐతే పెళ్లికి కనీసం పుస్తెలు, మట్టెలు, పెళ్లి కానుకలు, ఖర్చులకు చిల్లి గవ్వ లేక ఆ కుటుంబం దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు.ఇదీ చదవండి: సొంత తమ్ముడే సూత్రధారి! -
తప్పక నేర్చుకోవాల్సిన 7 నైపుణ్యాలు
వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో టీనేజర్లు సంతోషంగా ఉండాలంటే, సక్సెస్ సాధించాలంటే కేవలం మార్కులు, ర్యాంకులు, సోషల్ మీడియా లైకులు, ఫాలోయింగ్లు మాత్రమే సరిపోవు. వాటికి మించి ఏడు నైపుణ్యాలు అవసరం. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం.ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తన భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం, అలాగే ఇతరుల భావాలను అంగీకరించడం. కౌమారంలో భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఈక్యూ అవసరం. తమ బంధాలను నిలబెట్టుకోవడంలో, ఒత్తిడిని నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈక్యూను అభివృద్ధి చేసుకున్న టీనేజర్లు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.టైమ్ మేనేజ్మెంట్స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా వరకు టీనేజర్లను పక్కదారి పట్టించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ డిస్ట్రాక్ష¯Œ ్స నుంచి తప్పించుకుని చదువుపై, కెరీర్ పై ధ్యాస నిలపాలంటే టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. తమ పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ప్రణాళికలను రూపొందించుకుని, లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న టీనేజర్లు తమ బాధ్యతలను బ్యాలె¯Œ ్స చేసుకుంటారు. ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.క్రిటికల్ థింకింగ్ఈ రోజుల్లో సమాచారం సులువుగా లభిస్తోంది. అందులో ఏది నమ్మదగినదో, ఏది కాదో చెప్పలేం! అందుకే క్రిటికల్ థింకింగ్ అవసరం. ఇది టీనేజర్లలో స్వతంత్రతను పెంచుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అనుసరించకుండా, విశ్లేషించి, వివిధ కోణాలను అంచనా వేసి, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టీనేజర్లు ఈ స్కిల్‌ను అలవరచుకోవడం చాలా ముఖ్యం, అవసరం. దీనివల్ల వారు చదువులో, జీవితంలో మెరుగైన అవకాశాలను ఎంచుకుంటారు.కమ్యూనికేషన్ స్కిల్స్ మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, సక్సెస్ సాధించడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇతరులు చెప్పేది సరిగా వినడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఉపయుక్తమైన సంభాషణలు నెరపడం వంటివి నేర్చుకోవడం టీనేజర్లకు అత్యవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీనేజర్లు మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. గ్రూప్ డిస్కషన్స్‌లో బెరుకులేకుండా పాల్గొనగలుగుతారు. ఇది బడి, పని లేదా సామాజిక వాతావరణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.ఫైనాన్షియల్ లిటరసీఆర్థిక సాక్షరతను టీనేజర్లే కాదు పెద్దలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ఆర్థిక చిక్కుల్లో పడతారు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను మేనేజ్‌చేయడం వంటివి టీనేజ్లోనే నేర్చుకుంటే ఆ తర్వాత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకునేవారు త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.రెజిలియెన్స్ అండ్ అడాప్టబులిటీ జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా జరగదు, ఎత్తుపల్లాలు ఉంటాయి. టీనేజ్‌లో ఇవి మరీ ఎక్కువ. చదువుల ఒత్తిడి, రిలేషన్షిప్ సవాళ్లు, వ్యక్తిగత పరాభవాలను ఎదుర్కొంటారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలగడం అవసరం. ఫెయిల్యూర్ ముగింపు కాదని, విజయానికి మొదటి అడుగని అర్థం చేసుకోవడం ద్వారా సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటారు. మార్పుకు అనుకూలంగా ఉండటం, అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్చుకోవడం మానసిక శక్తిని పెంచుతుంది.సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, తాత్కాలిక టెంప్టేషన్స్‌ను అర్థం చేసుకుని నియంత్రించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడం, వ్యక్తిగత విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇది అకడమిక్ సక్సెస్‌కు మాత్రమే కాదు, వ్యక్తిగత వికాసానికీ అనివార్యమైన నైపుణ్యం. స్వీయ నియంత్రణ ఉన్న టీనేజర్లు అవరోధాలను సులువుగా అధిగమిస్తారు. పరీక్షల కోసం చదవడం, లేదా స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి పనులు సులవుగా నిర్వహించగలుగుతారు. -
అనన్య నాగళ్ల గొప్పమనసు.. అలాంటి వారికోసం తానే స్వయంగా!
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవలే పొట్టేల్ మూవీతో అభిమానులను అలరించింది. సాహిత్ మోత్కూరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మూవీలో అనన్య నటిస్తోంది. ఎస్డీటీ18 వర్కింగ్ టైటిల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.అయితే తెలుగమ్మాయి అయిన అనన్య సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో అభాగ్యులకు అండగా నిలిచారు. అసలే చలికాలం.. రోడ్లపై ఎక్కడపడితే ఎంతోమంది నిరాశ్రయులు నివసిస్తున్నారు. అలాంటి వారికోసం తానే స్వయంగా దుప్పట్లు అందించింది. బస్టాండ్‌లో నిద్రిస్తున్న వారికి తన వంతుసాయంగా వారికి దుప్పట్లు అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ అనన్య చేసిన మంచిపనికి అభినందిస్తున్నారు. కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అనన్య ప్రధాన పాత్రలో తంత్ర మూవీతో ఆకట్టుకుంది. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍Truly Heartwarming #Humanity 💫#AnanyaNagalla 🫶🏻pic.twitter.com/JQQsbxaYWU— #𝐒𝐫𝐢𝐧𝐢𝐯𝐚𝐬 (@srinureddypalli) November 12, 2024 -
మా ఇంటి ‘మహాలక్ష్మి’ని నిలబెట్టండి..
టేకుమట్ల: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తండ్రి ఆటోడ్రైవర్, తల్లి దినసరి కూలీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసుకుంటున్నారు. ఉన్నట్టుండి వారి కూతురు అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా పెద్దరోగం వచి్చందని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన దండ్రె రమేశ్, కవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు మహాలక్ష్మి నెల రోజుల క్రితం అనారోగ్యం పాలవడంతో వివిధ ఆస్పత్రులకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. చివరకు ఆ బాలికకు ‘డికాంపెన్సటేడ్ లివర్ డిసీజ్’అని డాక్టర్లు తేల్చడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం పాప ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే అందినకాడ అప్పు చేసి వైద్యం చేయించారు. ఇంకా రూ.22 లక్షల మేర ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపడంతో ఆ తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కూలీ పని చేసుకుని జీవించే తమ బతుకుల్లో పెద్దకష్టం వచి్చందని, పాపకు వైద్యం చేయించేందుకు దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేసేవారు ఈ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని (97013 29434) కోరుతున్నారు. -
అపుడు భిక్షాటన...ఇపుడు డాక్టరమ్మగా! ఇంట్రస్టింగ్ జర్నీ
అదృష్టం కలిసి వస్తే.. ఏ స్థితిలో ఉన్నా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అందివచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుంటే ఆకాశమంత ఎత్తు ఎదగవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మురికి వాడలో పుట్టిన పింకీ ప్రేరణాత్మక కథ చదివితే ఈ మాటలు అక్షరాలా నిజం అనిపిస్తుంది.స్టోరీ ఏంటీ అంటే: పండుగ సీజన్లో కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలోని మెక్లియోడ్గంజ్లోని బుద్ధ దేవాలయం దగ్గర తన తల్లి కృష్ణతో కలిసి పింకీ హర్యాన్ అనే బాలిక భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేది. అయితే 2004లో ఆమె అదృష్టవశాత్తూ టిబెటన్ బౌద్ధ సన్యాసి జమ్యాంగ్ కంటపడింది. జమ్యాంగ్ ఆమెను ఆదరించి సాయం చేశాడు. విద్యాబుద్ధులు నేర్పించాడు. చివరికి చైనీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ధర్మశాలకు తిరిగి వచ్చింది.#WATCH | Dharamshala: "I was 4.5 years old when I came to the hostel and before that, my mother and I used to beg...In 2004 Guru ji selected me and I am grateful for that...I am also grateful to my parents that they gave me a chance to get my education...," says Pinki Haryan,… https://t.co/czbhOFjfHB pic.twitter.com/HTQEg7HsoE— ANI (@ANI) October 4, 2024అయితే ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. బిచ్చమెత్తుకుంటూ కనిపించిన బాలిక కోసం వెదికి, చరణ్ ఖుద్ వద్ద ఉన్న మురికివాడను సందర్శించి బాలికను గుర్తించాడు. ఆమెను చదివిస్తానని చెప్పాడు. కానీ ఇందుకు ఆమె తండ్రి మొదట్లో ఇష్టపడలేదు. ధర్మశాలలోని దయానంద పబ్లిక్ స్కూల్‌కు పంపమని పింకీ హర్యాన్ తల్లిదండ్రులను ఒప్పించాడు. చివరికి పింకీ తండ్రి కాశ్మీరీ లాల్ అంగీకరించి, కొత్తగా ప్రారంభించిన టోంగ్లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ హాస్టల్‌కు పంపడంతో అసాధారణ ప్రయాణం మొదలైంది. పింకీ హర్యాన్ చదువులో బాగా రాణించింది. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి తర్వాత నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కానీ ఇక్కడ ఫీజులు చాలా ఎక్కువ కాబట్టి 2018లో చైనాలోని ప్రతిష్టాత్మకమైన వైద్య విశ్వవిద్యాలయంలో చేరింది. ఆరేళ్ల ఎంబీబీఎస్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ధర్మశాలకు తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా "నా తండ్రి చెప్పులు కుట్టేవాడు , బూట్లకు పాలిష్ చేయడం ద్వారా జీవనం సాగించేవాడు అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. తన విజయానికి తాను టిబెటన్ సన్యాసి జమ్యాంగ్కు రుణపడి ఉన్నానని, ఇప్పుడు పేదరికం కారణంగా చదువుకునే స్థితిలో లేని ఇతర పేద పిల్లలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పింకీ చెప్పింది. చిన్నప్పుడు, మురికివాడలో నివసించాను కాబట్టి నా నేపథ్యమే అతిపెద్ద ప్రేరణ అని తెలిపింది. అంతేకాదు పింకీ ప్రేరణతో ఆమె సోదరుడు, సోదరి అదే ఎన్జీవో పాఠశాలలో చేరడం విశేషం. కాగా డబ్బు సంపాదించే యంత్రాలుగా మారడానికి బదులుగా మంచి మానవులుగా మారడానికి పిల్లలను మార్చడమే సన్యాసి జమ్యాంగ్ లక్ష్యమని, గత 19 సంవత్సరాలుగా ఎన్జీవో టోంగ్లెన్ ట్రస్ట్‌తో అనుబంధం కలిగి ఉన్న సిమ్లాలోని ఉమంగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆయన తన జీవితమంతా ధర్మశాల, మురికివాడల పిల్లలకు అంకితం చేశాడన్నారు. జమ్యాంగ్ దత్తత తీసుకున్న పిల్లలంతా ఒకప్పుడు అడుక్కునేవారు లేదా చెత్తను ఏరేవారే. కానీ ఇప్పుడు వాళ్లంతా డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, హోటల్ మేనేజర్లుగా మారారని చెప్పారు. జమ్యాంగ్ 1992లో టిబెట్ నుండి తప్పించుకుని నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చాడు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పేదరికం ఆయనను కదిలించింది. పేదలకు సాయం చేయడం, ముఖ్యంగా మురికివాడల్లో పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు -
ఆస్పత్రి వద్దు.. బడికి వెళ్తానమ్మా..
గార్లదిన్నె: తన ఈడు పిల్లలతో కలసి బడికెళ్లాల్సిన ఓ చిన్నారి తలసేమియా వ్యాధి బారిన పడి ఆస్పత్రి పాలయ్యాడు. ‘అమ్మా... ఈ ఆస్పత్రి వద్దు.. నేనూ బడికి పోతా’నంటూ ఆ చిన్నారి అమాయకంగా అడుగుతుంటే నిరుపేద తల్లిదండ్రుల కంట నీరు ఆగడం లేదు. చాపకింద నీరులా కబళిస్తున్న మృత్యువు బారి నుంచి తమ బిడ్డను దక్కించుకునేందుకు ఆ నిరుపేద తల్లిదండ్రులు పడుతున్న వేదన మాటల్లో వర్ణించలేం. తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు.కూలికెళితేనే పూట గడుస్తుంది..గార్లదిన్నె మండలం పాత కల్లూరులో నివాసముంటున్న సురేంద్ర, సుజాత దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఆదాయం అరకొరగా ఉన్నా... ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు శ్రీకాంత్ అరుదైన వ్యాధిబారిన పడి మృత్యువుతో పోరాడుతున్నాడు.15 రోజులకోసారి రక్తమార్పిడిఏడేళ్ల వయసున్న శ్రీకాంత్... నెల రోజుల క్రితం జ్వరం బారిన పడడంతో సమీపంలోని పామిడిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మరో ప్రైవేట్ వైద్యుడికి చూపించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిలో ఎర్ర రక్తకణాలు క్షీణిస్తున్న విషయాన్ని పసిగట్టిన సదరు వైద్యుడి సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైద్యులు వెంటనే రక్తం ఎక్కించారు. అయినా మార్పు కనిపించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని హయ్యర్ ఇన్స్టిట్యూట్కు రెఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు... హైదరాబాద్ లేదా బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నేరుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తలసేమియా వ్యాధితో శ్రీకాంత్ బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని, ఇందుకు రూ.18 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆపరేషన్ చేసే వరకూ ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. దీంతో కుమారుడి వద్ద తన భార్యను ఉంచి సురేంద్ర స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబపోషణ కోసం తన వద్ద ఉన్న రెండు గేదెలు అమ్మడంతో పాటు ఇతరుల వద్ద అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని బెంగళూరుకు వెళ్లాడు. ఇప్పటి వరకూ వైద్యం కోసం దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇన్‌పేషెంట్‌గా ఉంటే ఆస్పత్రి ఖర్చులు భరించలేని దుస్థితికి చేరుకోవడంతో అదే ఆస్పత్రి బయట ఓ గదిని అద్దెకు తీసుకుని రోజూ వెళ్లి చికిత్స చేయించుకుని వస్తున్నారు. ఈ క్రమంలో సురేంద్ర అక్కడే కూలి పనులకు వెళుతుండగా.... తల్లి సుజాత కుమారుడి బాగోగులు చూసుకుంటోంది.బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి ...రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తున్న కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు నిరుపేద తల్లిదండ్రులు మొక్కని దేవుడంటూ లేడు. రక్తం ఎక్కించాల్సిన ప్రతిసారీ రూ.20 వేలు ఖర్చు వస్తోంది. ప్రస్తుతం చేతిలో నయా పైసా లేదు. బెంగళూరులోనే సురేంద్ర కూలీ పనుల ద్వారా సంపాదిస్తున్న అరకొర డబ్బు రోజు వారి అవసరాలకు సరిపోతోంది. స్వశక్తితో కుమారుడికి నయం చేయించుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. ఇలాంటి పరిస్థితిలో తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు.బ్యాంక్ వివరాలు...ఖాతాదారు పేరు : కె.సుజాతబ్యాంక్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కల్లూరు శాఖ, గార్లదిన్నె మండలంఖాతా నంబర్ : 3879 010 6265ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0002737ఫోన్‌పే నంబర్లు : 90145 15056,81067 51483 -
అసలే పేద... ఆపై కేన్సర్
పొదలకూరు: ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వా రి కుటుంబంలో కేన్సర్ మహమ్మారి అలజడి రేపింది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబంపై పెద్ద ఉపద్రవమే వచ్చి పడింది. ఏడాది నుంచి వివిధ పరీక్షలు, మందుల పేరుతో రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం కానరాలేదు. ఇటీవల బయాప్సీ ద్వారా చర్మ కే న్సర్ అని తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కు ప్పకూలింది. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక దాతల కోసం నిస్సహాయంగా ఎదురుచూస్తోంది.టైలర్ వృత్తే జీవనాధారంమండలంలోని అయ్యగారిపాళెం గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు టైలర్ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య మాధవి(32), కుమార్తె వెంకట రోషిణి(10) సంతానం. పేద కుటుంబానికి చెందిన శ్రీనివాసులు పేరున్న టైలర్ వద్ద పనిచేస్తూ దాని ద్వారా వచ్చే కూలి డబ్బులతో జీవిస్తున్నాడు. గతేడాది సెప్టెంబరులో మాధవికి చర్మంపై మచ్చలు వచ్చాయి. నెల్లూరు డాక్టర్ల వద్దకు వెళ్లి పలుమార్లు పరీక్షలు చేయించి మందులు వాడారు. మచ్చలు వస్తూపోతూ ఉండడంతో నెల్లూరు వైద్యానికే రూ.2 లక్షల వరకు ఖర్చుచేశారు. ఎలాంటి గుణం కనిపించకపోవడం వల్ల ఇటీవల చైన్నె విజయ మెడికల్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి బయాప్సీకి చర్మాన్ని పంపారు. నివేదికలో లింపోమా (తెల్ల రక్తకణాల కేన్సర్)గా నిర్ధారించారు. తెల్లరక్త కణాల జన్యుమార్పులు సంభవించి అవి నియంత్రణ లేకుండా విభజించడం వల్ల చర్మ కేన్సర్ వస్తుందని వెల్లడించారు. ఈ పరీక్షలు, తాత్కాలిక వైద్యానికి శ్రీనివాసులు సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇందుకోసం తనకున్న కొద్దిపాటి నిమ్మచెట్లు, గేదెలను కూడా అమ్మాల్సి వచ్చింది. వైద్యం చేయించిన తర్వాత మాధవికి కొద్దిరోజులు నయమైనట్లు కనిపించినా మళ్లీ వ్యాధి తిరగబెట్టి మెడ, చంకలు, గజ్జలు, మోకలి పక్కన కాలిన మచ్చలు ఉన్నట్టుగా వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల దురద, ఆకలి లేకపోవడం, జ్వరం, బరువు తగ్గడం వంటి దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. ఉన్నదంతా ఊడ్చి పెట్టినా మాధవికి నయం కాకపోవడంతో నిస్సహాయంగా వారి కుటుంబం మిగిలింది. పోషణ కూడా కష్టంగా మారడంతో పొదలకూరులోని మాధవి తల్లిదండ్రుల ఇంట్లో తలదాచుకుంటున్నారు.దాతలు దయతలిస్తే..ఆర్థికంగా చితికిపోయిన శ్రీనివాసులు కుటుంబాన్ని దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటే మాధవికి వచ్చిన జబ్బు నయం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. రూ.లక్షలు వెచ్చించాల్సి రావడంతో వారు వైద్య పరీక్షలు కూడా చేయించుకోని స్థితిలో ఉన్నారు. రెండో పర్యాయం బయాప్సీ రిపోర్టు ఎలా వస్తుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకుంటే తన కుమార్తెకు తల్లిలేని లోటు లేకుండా ఉంటుందని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు స్పందిస్తే 9347142240 ఫోన్‌పేకు నగదు వేయాల్సిందిగా వేడుకుంటున్నారు. -
ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ?
ఆఫ్రికా దేశాలపై చైనా ఎన్నో వరాలు కురిపించింది. 51 బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం, పది లక్షల ఉద్యోగాలు, సైనిక శిక్షణ... ఇలా అనేక హమీల వరదను పారించింది. ఒక వైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోంది. మరో వైపు అమెరికా సహా పశ్చిమ దేశాలతో భౌగోళిక, రాజకీయ ఘర్షణలు, వ్యాపార ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ కుంచించుకుపోతోంది. చైనా దౌత్యానికి, ఆర్థిక వ్యవస్థకు ఊపు తేవటానికి ఆఫ్రికా దోహదకారి అవుతుందని భావించింది. ఈ పూర్వరంగంలో ‘బీజింగ్ సమ్మిట్ ఆఫ్ ది ఫోరమ్ ఆన్ చైనా–ఆఫ్రికా కోఆపరేషన్’ (ఎఫ్ఓసీఏసీ) అనే సదస్సును మూడు రోజుల పాటు (2024,సెప్టెంబర్ 4–6) చైనాలో నిర్వహించింది. కోవిడ్ అనంతరం చైనా నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమం ఇదే.ఈ సదస్సు ద్వారా ప్రధానంగా రెండు లక్ష్యాలను సాధించాలని భావించింది. మొదటిది గ్లోబల్ సౌత్‌లో తన ప్రభావాన్ని పెంచుకోవటం. రెండోది చైనా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చూసుకోవటం. గ్లోబల్ సౌత్ లో ఆఫ్రికా అత్యంత ముఖ్యమైంది. అందుకే ఈ ఖండం మనసు గెలుచుకోవటానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సర్వశక్తులు వెచ్చించారు. ఆఫ్రికాలో మొత్తం దేశాలు 54 ఉంటే 53 దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. 2023 నాటికి, అమెరికాను అధిగమించి 282 బిలి యన్ డాలర్లతో చైనా ఆఫ్రికాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఆఫ్రికా మినరల్స్, ఫ్యూయల్స్, మెటల్స్ చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు ఆఫ్రికా రుణదాతల్లో చైనా అగ్రగామిగా ఉంది. గత 20 ఏళ్లలో అది అందించిన రుణం 696 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రకటించిన 51 బిలియన్ డాలర్లు (360 బిలియన్ యువాన్లు) పెద్ద ఎక్కువేం కాదు అంటున్న వాళ్లూ ఉన్నారు. ఇందులో రుణాలుగా కొంత (210 బిలి యన్ల యువాన్లు), సహాయంగా కొంత (80 బిలియన్ల యువాన్లు), పెట్టుబడులుగా కొంత (70 బిలియన్ల యువాన్లు) అందించాలని బీజింగ్ నిర్ణయించింది. ఇదంతా వచ్చే మూడేళ్ల కాలంలో చేయాలనేది చైనా ఆలోచన. జిన్‌పింగ్ తన ప్రసంగంలో ఎక్కడా రుణం అన్న మాట వాడకుండా జాగ్రత్తగా ఆర్థిక సాయం అన్న పదాన్ని మాత్రమే ఉపయోగించారు. ఆఫ్రికాతో కేవలం వాణిజ్య సంబంధాలను మాత్రమే కాదు, రాజకీయంగా, ఆర్థికంగా సంబంధాలను ఉన్నతీకరించుకోవాలని భావిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ‘మనం అంతా కలిసి రైళ్లు, రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లు నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులు ఎంతో మంది ప్రజల జీవితాలను, వారి అదృష్టాన్ని మార్చి వేశాయి’ అని జిన్‌పింగ్ గుర్తు చేశారు. ఈ దఫా ఆర్థిక సాయం డాలర్లలో కాకుండా చైనా యువాన్ల రూపంలో ఉంటుందని బీజింగ్ ప్రకటించింది. చైనా కరెన్సీని అంతర్జాతీయం చేయాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తారు. ఇందుకోసం కనెక్టివిటీని పెంచేందుకు ప్రత్యే కంగా 30 ప్రాజెక్టులను చేపడతారు. మరో వెయ్యి చిన్న ప్రాజెక్టులను చేపడతారు. 140 మిలియన్ డాలర్లతో సైన్యా నికి ఆర్థిక సహకారం, శిక్షణ అందిస్తారు. ఆరువేల మంది సైనికులకు, వెయ్యి మంది పోలీసు అధికారులకు శిక్షణ అందిస్తారు. ఆఫ్రికా పారిశ్రామికీకరణకు అవరోధంగా నిలిచిన ఇంధన సమస్యను కూడా పరిష్కరిస్తామని చైనా హామీ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలుగా పేర్కొన్న 33 ప్రాంతాల్లో ఓపెన్ మార్కెట్లు ప్రారంభిస్తామని (జీరో టారిఫ్‌లతో) ప్రకటించింది. ఇవన్నీ బీజింగ్‌కు ఉపయోగపడే అంశాలు. మా సంగతి కూడా ఆలోచించండి అని అడిగారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌ఫోసా. బదులుగా ‘వాణిజ్య మిగులు 64 బిలియన్ డాలర్లు ఉంది. మీ దగ్గర నుంచి రా మెటీరియల్, డెయిరీ ప్రోడక్ట్స్ మేము కొనుగోలు చేస్తాం’ అని చైనా హామీ ఇచ్చింది. అంతే తప్ప మరే రకమైన ప్రకటనలు చేయలేదు. అప్పుల ఊబిలోకి ఆఫ్రికా దేశాలు రుణమాఫీ చేసి తమకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చాలా ఆఫ్రికా దేశాలు కోరుతున్నాయి. మైనింగ్, ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పోర్టుఫోలియోను వికేంద్రీకరించమని కోరుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ పెద్ద ప్రాజెక్టులను నిభాయించగలిగే పరిస్థితిలో లేదు. చైనా చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆఫ్రికా దేశాలను అప్పుల ఊబిలోకి లాగేస్తు న్నాయి. దాదాపు ఆరు బిలియన్ డాలర్ల అప్పుతోజాంబియా ఎగవేతదారుల్లో ఉంది. అలాగే ఘనా, ఆంగోలాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇదే విషయాన్ని సదస్సులో చెప్పారు. ‘ఆఫ్రికా రుణాలనేవి భరించలేని దశకు చేరాయి, ఆర్థిక సుస్థిరత దెబ్బతింటోంది’ అని ప్రకటించారు. బీజింగ్ మాత్రం దీనికి స్పందించలేదు. రుణామాఫీ కాదు, కనీసం రుణాలను పునర్వ్యవస్థీకరిస్తుందని ఆఫ్రికా దేశాలు ఆశించాయి. కానీ చైనాది పెట్టుబడి దారు మనస్తత్వం. అది తన వ్యాపార ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మరి తాజా హామీలు ఆఫ్రికా దేశాలపై ఏ రకమైన ప్రభావం చూపుతాయో భవిష్యత్తులో కానీ ప్రపంచానికి అర్థం కాదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
వరద బాధితులకు అండగా తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సాయం అందిస్తున్నారు. విరాళాలు సేకరించి వరద బాధతుల సహాయార్థం అందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీ, తెలంగాణ వరద బాధతుల కోసం తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. తమవంతు సాయంగా అసోసియేషన్ తరఫున విరాళాలు సేకరించి రెండు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నాయకులంతా పాల్గొన్నారు.తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు మాట్లాడుతూ' వరదల కారణంగా తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని చూస్తే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. మా అసోసియేషన్ తరపున వీలైనంత ఆర్థిక సాయం చేయాలని భావించాం. రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు మీకు తోచినంత విరాళం ఇవ్వాలని మా సభ్యులను కోరాం. వాళ్లంతా స్పందించారు. ఈ డబ్బుకు మరికొంత మా అసోసియేషన్ ఫండ్ నుంచి కలిపి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తాం' అని తెలిపారు. -
‘సాక్షి’లో చూసి సాయమందించాం
ఖమ్మం మయూరిసెంటర్: స్పందించే మనసుంటే ఎక్కడి వారికైనా సాయం చేయొచ్చని నిరూపించారు నిజామాబాద్ జిల్లా యువకులు. ఇటీవలి వరదలతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వీరి కష్టా లపై ఈనెల 6న సాక్షిలో ‘భూమి రాళ్లపాలు.. బతుకు రోడ్డుపాలు’శీర్షికన ప్రచురితమైన కథనం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్ (కె) గ్రామ యువకులను కది లించింది. దీంతో వారు బాధితులను ఆదు కునేందుకు నడుం బిగించి రూ. లక్ష విరాళాలు సేకరించారు. ఖమ్మం్లలో పరిచ యం ఉన్న వారిని తోడ్కొని బుధవారం రాకాసితండాకు వచ్చారు. దీంతో యువకులు 77 కుటుంబాలకు 77 సీలింగ్ ఫ్యాన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్నెల్ (కె) గ్రామ యువకులు అర్గుల శ్రీకాంత్, మచ్చేందర్, అనంతుల శ్రీను, డాక్టర్ సాయి, గజానంద్, జి.హనుమాను పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని తేజశ్రీకి కూడా... ఈనెల 4న ‘సరి్టఫికెట్లు మున్నేరు పాలు’.. ‘చదువుల తల్లులకు ఎంత కష్టం’శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో వచి్చన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌కు చెందిన మహిళలు స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఆధ్వర్యంలో తేజశ్రీని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. హైమావతి ట్యాబ్ అందించగా, కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మహిళలు రూ.10 వేలు, కొల్లు జ్యోతి రూ.5 వేలు, పారిజాతం కమలం ప్రసాద్ రూ.5 వేలు అందజేశారు. తేజశ్రీ మాట్లాడుతూ అండగా నిలిచిన సాక్షికి, దాతలకు ధన్యవాదాలు చెప్పారు. సాక్షిలో చూసి చలించిపోయానురాకాసితండా పజలు పడిన ఇబ్బందులను సాక్షి పత్రిక లో చూశాను. వారికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో మా కొంతమంది యువకులను సంప్రదించి, విరాళాలు సేకరించాం. ఖమ్మంలో ఉన్న మిత్రుల ద్వారా ప్రజలకు అందించాం. – అర్గుల శ్రీకాంత్ -
జైనూరు బాధితురాలికి రూ.లక్ష తక్షణ సాయం
గాంధీ ఆస్పత్రి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనలో గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం పరామర్శించారు. బాధితురాలికి తక్షణసాయంగా లక్ష రూపాయల చెక్కును అందించారు. కాగా మంత్రి వస్తున్న సమాచారం తెలుసుకున్న బీజేపీ మహిళా శ్రేణులు గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకుని మంత్రిని అడ్డుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీ బిడ్డగా నాకే ఎక్కువ బాధ్యత... ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, జైనూరు ఘటనపై కొంతమంది వ్యక్తులు, రాజకీయ పార్టీ లు చేస్తున్న విషప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలియగానే ప్రభుత్వం స్పందించిందని, నిందితునిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని, కఠినశిక్ష పడేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనలో దోషులను శిక్షించేందుకు ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా తనకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. జైనూ రు ఘటనకు మతం రంగు పూసేందుకు కొందరు యతి్నస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆదివాసీల జీవితాలతో చెలగాటం: ఏలేటి బంగ్లాదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రోహింగ్యా లు, ముస్లింలు ఏజెన్సీ ప్రాంతాలను ఆక్రమించుకుని, ఆదివాసీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనూరు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గురువారం పరామర్శించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.కేంద్ర నిబంధనల మేరకు ఆదివాసీల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఉండకూడదని, కానీ జైనూరు అటవీప్రాంతంలో వేలాది మంది ముస్లింలు, గిరిజనేతరులు స్థిరనివాసాలు ఏర్పరుకున్నారని ఆరోపించారు. -
బాధితులకు అండగా జగనన్న సైన్యం
-
వరద బాధితుల కోసం రంగంలోకి దిగిన YSRCP నేతలు
-
గొప్పమనసు చాటుకున్న టాలీవుడ్ హీరో
ఇటీవల రాయన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్. ఓ వ్యక్తి తల్లికి వైద్యపరమైన ఖర్చుల కోసం సాయమందించారు. తన వంతుగా రూ.50 వేలను పంపి గొప్ప మనసు చాటుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన విజ్ఞప్తికి స్పందించిన హీరో వెంటనే ఆర్థికసాయం అందించాడు. ఇది చూసిన సందీప్ కిషన్ ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. సందీప్ ఇప్పటికే ప్రతిరోజూ పేదలకు ఆహారం అందిస్తూ తనవంతుగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.సినిమాల విషయానికొస్తే ఇటీవల రాయన్ మూవీతో అభిమానులను మెప్పించారు. ధనుశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అతని తమ్ముడిగా నటించారు. ఈ సినిమాతో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. హీరో ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. పేదలకు ఉచితంగా ఆహారం..గతంలో రాయన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను నిర్వహిస్తున్న రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్ సైడ్ ఉండే పేదలకు రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు తెలిపారు. దీంతో నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్ తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు సందీప్ కిషన్ తెలిపాడు.Looked into this & it’s Legitimate …I have done my bit..Please trying helping in whatever you can as well ♥️ https://t.co/MnWlpmMsmY pic.twitter.com/LqIgo4CjRt— Sundeep Kishan (@sundeepkishan) September 1, 2024 -
లక్షల మందిని తరలించలేం
సాక్షి, అమరావతి: ‘వరదల్లో వంద, రెండు వంద కుటుంబాలు చిక్కుకుంటే వెంటనే తరలించగలం.. ఏకంగా 2.76 లక్షల మందిని వెంటనే తరలించలేం. సమయం పడుతుంది. కేంద్ర సాయం కోరాం. వారి నుంచి సాయం అందగానే చర్యలకు ఉపక్రమిస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. లక్షల మందికి సహాయం చేయాల్సిన పరిస్థితులున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగిస్తామన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బస చేసిన బస్సు వద్ద మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో బుడమేరు, మున్నేరు నుంచి వరద వచ్చిందన్నారు.దీంతో ఇబ్రహీంపట్నం, విజయవాడలోని సింగ్‌నగర్, కృష్ణలంకతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఉందన్నారు. సింగ్‌నగర్‌లో 16 వార్డుల్లో 2.76 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారన్నారు. చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. వరద తీవ్రతను కేంద్ర మంత్రి అమిత్‌షాకు వివరించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపుతున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి నాలుగు బృందాలు, సోమవారానికి మిగిలిన ఆరు బృందాలు చేరుకుంటాయన్నారు. అదే విధంగా 40 బోట్లు, ఆరు హెలికాప్టర్లు కూడా వస్తాయన్నారు. సీనియర్ ఐఏఎస్‌లను విజయవాడకు రప్పించాప్రభుత్వ పిలుపుతో పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం సరఫరాకు ముందుకు వచ్చాయని సీఎం చెప్పారు. సింగ్‌నగర్ 16 డివిజన్లలో 77 సచివాలయాలు ఉండగా, ప్రతి వార్డుకు ఒక సీనియర్, సచివాలయానికి జూనియర్ అధికారిని పర్యవేక్షకులుగా నియమించి సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులను విజయవాడకు రప్పించానన్నారు. వరద ఎప్పటిలోగా తగ్గుతుందో చెప్పలేమన్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని కేంద్ర పభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఇంత వర్షం.. అసాధారణంరాష్ట్రంలో భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రాణ, పశు నష్టం పెద్దగా జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ కార్యాలయంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై అధికారులతో ఆదివారం సమీక్షించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 1,11,259 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 7,360 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు.వరద బాధిత కుటుంబాలకు 25 కేజీలు చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ఇస్తున్నామన్నారు. మత్స్యకారులకు అదనంగా మరో 25 కేజీలు బియ్యం ఇస్తామన్నారు. అమరావతి రాజధాని శ్మశానం కావాలనుకునే వారే మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రధాని ఫోన్సీఎం చంద్రబాబుకు ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు.వర్షాల్లో ప్రాణ నష్టం బాధాకరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి జనసేన శ్రేణులు సాయం అందజేయాలని ఆయన కోరారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో పార్టీ డాక్టర్స్ సెల్‌తో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. -
వయనాడ్ వారియర్స్: ఈ తల్లి ఒక అద్భుతం!
ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు, గిన్నెలు తీసుకుని బయల్దేరతారు కొందరు. కానీ, తల్లిని కోల్పోయి పాలకోసం ఏడుస్తున్న చంటిపిల్లలకు తన పాలు ఇవ్వడానికి బయల్దేరింది ఆ తల్లి.ప్రకృతి ప్రకోపంతో వయనాడు తల్లడిల్లితే ఆ విషాదంలో కొందరు శిశువులు తల్లిపాలు లేక అల్లాడారు. అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కికి చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్లి తన పాలు అందించింది. నాలుగేళ్ల వయసు, నాలుగు నెలల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నారు. ఆమె భర్త సజిన్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. వయనాడ్‌లోని పసికందుల అవస్థను భార్యకు చెప్పి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు.ఇడుక్కిలోని వారి ఇంటి నుండి పికప్ ట్రక్‌లో కేరళలోని వయనాడ్ కొండలపైకి వెళ్లి మెప్పాడిలోని శిబిరాల్లో కుటుంబాలకు సేవ చేసిన తర్వాత ఇడుక్కికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. ‘మేం కొన్ని శిబిరాలు, హాస్టళ్లను సందర్శించాం. నేను ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంత మంది పిల్లలకు నా పాలు ఇచ్చాను. కొందరికి ఆహారాన్ని తినిపించాను. కొండచరియలు విరిగిపడి గాయపడిన తల్లులు కోలుకున్న వెంటనే తమ పిల్లల బాధ్యతలు స్వీకరించారు. మేం ఒక కుటుంబంగా పిల్లల్ని చూసుకున్నాం. నేను చేస్తున్న పని తెలిసి చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మా ట్రిప్‌ను స్పాన్సర్ చేస్తామన్నారు. కానీ, ఆ మాత్రం ఖర్చును భరించలేమా? నేను తల్లిని, పిల్లలకు తల్లి పాలు ఉత్తమమని నాకు తెలుసు. అందుకే, వాటిని కొందరికైనా అందించాలనుకున్నాను’ అని భావన చెప్పింది. -
నూటికో..కోటికో, ఈ అమ్మాయిల్ని చూసి నేర్చుకుందాం.. వైరల్ వీడియో
సాటి మనిషి ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో ఉన్నపుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు పక్కనుంచి వెళ్లిపోతారు చాలామంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే.. మెట్రో స్టేషన్లో ఎక్స్‌లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇది చూసి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లినాక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్సలేటర్ మీద నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చి మరీ ఆయనకు సాయం చేశారు. ‘‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనను మరిపించేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్ చేయడం విశేషం. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు. ఆర్వీసీజీ మీడియా ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. &Respect for these girls ❤️📈pic.twitter.com/bc6yeRLXl9— RVCJ Media (@RVCJ_FB) August 1, 2024 -
పొలం పనులకు వెళ్లి.. వరదలో చిక్కుకుని..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/అశ్వారావుపేటరూరల్: ఒక్కసారిగా పెద్దవాగుకు వరద పోటెత్తింది. దీంతో ఆ వరద ఉధృతిలో 28 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి 25 మందిని సురక్షిత ప్రాంతానికి చేర్చగా, మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. వాన తగ్గిందని...భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి దగ్గర పెద్దవాగుపై మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టులోకి వరద వచ్చే క్యాచ్మెంట్ ఏరియాలో కొంత ఏపీలోని బుట్టాయిగూడెం మండల పరిధిలో ఉంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులో ప్రవాహం పెరిగింది. మరోవైపు అశ్వారావుపేట మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు వాన కొంత తగ్గుముఖం పట్టడంతో స్థానికులు పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పెద్దవాగుకు అకస్మాత్తుగా వరద పెరిగి ముందుగా ఒడ్డు వెంట ఉన్న పొలాలను చుట్టుముట్టింది. దీంతో వరదలో చిక్కుకున్న వారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెరువుకట్టకు దగ్గరలో ఉన్న ఎత్తయిన ప్రదేశం వైపు వెళ్లారు. ఆ తర్వాత క్రమంగా వరద నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి బాధితుల మోకాళ్లలోతు వరకు వచ్చాయి. క్రమంగా గట్టు దాటుకొని పొలాలను ముంచెత్తింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యానికి మించి వరద రావడంతో ముందుగా ప్రాజెక్టు ఎగువ భాగం ముంపునకు గురైంది. దీంతో వెంటనే ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లు తెరిచేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి తెరుచుకోలేదు. బాధితులు ఫోన్లో సమాచారం ఇవ్వగా, వరద పరిస్థితిని తెలుసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని సహాయ కార్యక్రమాల కోసం అప్రమత్తం చేశారు. అటు అనుకుంటే ఇటు..: ఏపీలోని వేలేరు పాడు మండలం అల్లూరినగర్ దగ్గర వరద నీటిలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఐదుగురిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి నేవీ హెలికాప్టర్‌ను పంపింది. అయితే హెలికాప్టర్ రావడం ఆలస్యం కావడంతో గ్రామస్తులు ఆ కారులో ఉన్న ఐదుగురిని కాపాడారు. దీంతో నేవీ హెలికాప్టర్ సంఘటనా స్థలానికి రాకుండా ఏలూరులో ఆగిపోయింది. అయితే అదే సమయంలో పెద్దవాగు ప్రాజెక్టు ఎగువన నారాయణపురంలో 28 మంది వరదలో చిక్కుకుపోయిన విషయం వెలుగుచూసింది. దీంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడి అధికారులతో మాట్లాడి హెలికాప్టర్‌ను ఇటు పంపించారు. జాయింట్ ఆపరేషన్: ఏలూరు నుంచి హెలికాప్టర్ ఘటనా స్థలికి 6:15 గంటలకు వచ్చింది. వెలుతురు సరిగ్గా లేదు. సహా య కార్యక్రమాలు ఏమేరకు జరుగుతాయో అనే సందేహం నెలకొంది. నేవీ హెలికాప్టర్ ముందుగా ప్రభావిత ప్రాంతంలో చక్కర్లు కొట్టి బాధితులు ఉన్న లొకేషన్‌ను గుర్తించింది. ఆ తర్వాత 20 నిమిషాలకు తెలంగాణకు చెందిన హెలికాప్టర్ ఘటనా స్థలికి చేరుకుంది. 6:45 గంటలకు అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. నేవీ హెలికాప్టర్ దారి చూపిస్తూ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్లి బాధితులు ఉన్న చోటుపై లైట్ వేసింది. రెండో హెలికాప్టర్ ఆ స్థలానికి చేరుకుని బాధితులకు రోప్ అందించింది. విడతల వారీగా బాధితులను బయటకు తీసుకురా వడంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. వైకుంఠధామంలో ల్యాండింగ్..బాధితులు మధ్యాహ్నం 3 గంటలకు వరద నీటిలో చిక్కుకున్నారు. గంటగంటకూ వరద నీరు పెరుగుతూ మోకాళ్ల లోతుకు వచ్చింది. బాధితుల్లో మహేశ్ అనే యువకుడి దగ్గరే ఫోన్ ఉంది. దీంతో ప్రాణభయంతో అందరూ ఆ ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తమ ప్రాణాలు దక్కవేమోనంటూ బోరున విలపించారు. మూడు గంటలు గడిచినా రెస్క్యూఆపరేషన్ మొదలు కాకపోవడం, మరోవైపు చీకటి పడుతుండటంతో పైప్రాణాలు పైనే పోయాయని భావించారు. అయితే ఏడు గంటల సమయంలో వరద నీటి నుంచి వారిని కాపాడిన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సరైన స్థలం లేక నారాయణపురం గ్రామంలో ఉన్న వైకుంఠధామం (స్మశానం)లో వారిని దించింది. ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి వైకుంఠధామం తొలి ఆశ్రయం ఇచ్చింది.పెద్దవాగుకు గండిరైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల వద్ద....తెలంగాణలో రెండు, ఏపీలో ఏడు గ్రామాలు మునక!ముందుగానే గ్రామాలు ఖాళీ చేసిన ప్రజలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీ, తెలంగాణవాసులను గడగడలాడించిన పెద్దవాగుకు ప్రాజెక్టుకు గండిపడింది. రెండు రాష్ట్రాల పరిధి పెద్దవాగు క్యాచ్మెంట్ ఏరియాలో సుమారు 16 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో గురు వారం ఉదయం నుంచి వాగుకు వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 40,500 క్యూసెక్కులు కాగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 70 వేల క్యూసెక్కులు, సాయంత్రం 5గంటలకల్లా 90 వేల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో మధ్యాహ్నం నుంచే ప్రాజెక్టుకు ఎగపోటు మొదలైంది. సాయంత్రం 5–30 గంటలకు గేట్లు, మట్టికట్ట మీద నుంచి నీరు ప్రవహించడం మొద లైంది. రాత్రి 7.30గంటల సమయంలో 32 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అయితే ఉధృతి తగ్గకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో రైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల మేరకు గండి పడగా, అక్కడి నుంచి కొంత దూరంలో మరో 20 మీటర్ల మేరకు గండి పడింది. మొత్తంగా 150 మీటర్ల మేరకు మట్టి కట్ట బలహీనపడిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. నీట మునిగిన గ్రామాలు: పెద్దవాగు దిగువన తెలంగాణలో గుమ్మడవెల్లి, కొత్తూ రు గ్రామాలు ఉన్నాయి. గురువారం సాయంత్రం వరద ఉధృతి పెరిగిన వెంటనే ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు అధికారులు హుటా హుటిన ఖాళీ చేయించారు. గండి పడిన తర్వాత వచ్చిన వరద నలభై ఇళ్లను ముంచెత్తింది. పశువులు ఇతర ఆస్తి నష్టం వివ రాలు తెల్లవారితే కానీ తెలిసే అవకాశం లేదు. ఏపీలోని వేలేరుపాడు మండలం మేడిపల్లి, రామవరం, గుండ్లవాయి, రెడ్డిగూడెంకాలనీ, మద్దిగట్ల, పూచిరాల గ్రామాల్లోనూ వరద ప్రభావానికి లోనయ్యాయి. -
ప్రమాదం మిగిల్చిన గాయం
దకురవి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడబిడ్డ బంగారు భవిష్యత్‌ను రోడ్డు ప్రమాదం చిదిమేసింది.. కళ్లెదుట ఆడుతూ.. పాడుతూ.. చదువులో రాణిస్తున్న కన్న బిడ్డను చూసి మురిసిపోతున్న ఆ తల్లిదండ్రులకు పెద్దకష్టం వచ్చింది.. రోడ్డు ప్రమాదం కారణంగా నరాల బలహీనతతో కాళ్లు చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది ఆ పసిప్రాణం. ప్రమాదం మిగిల్చిన గాయం నరాల బలహీనతతో 14ఏళ్లకే మాటలు కూడా రాక ఆచేతన స్థితిలో పడిపోయింది. ఏడాదికి రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా.. కోలుకోలేని స్థితిలో ఉన్న బాలిక దీనగాథపై ‘సాక్షి’ కథనం.మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) శివారు గుజిలి తండాకు చెందిన జాటోత్ శంకర్– సుజాత దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అక్షయ వయసు 14 ఏళ్లు. బయ్యారం మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకులంలో చదువుకుంటుంది. ఈ క్రమంలో 2022లో భద్రాద్రి కొత్తగూడెంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. కొత్తగూడెం సమీపంలోని చుంచుపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్షయకు తీవ్రగాయాలయ్యాయి. కొత్తగూడెం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అక్షయ మెదడులోని రక్తనాళాలు పనిచేయడం లేదని, ఆపరేషన్ చేయడం కుదరదని తెలిపారు. కే వలం మందులతో నయం అవుతుందని చెప్పారు. దీంతో అక్షయను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. నరాలబలహీనత తీవ్రం కావడంతో కాళ్లు, చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది. దీంతో నెలనెలా మందుల కోసం తల్లిదండ్రులు అప్పు చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక మాట్లాడలేని పరిస్థితికి చేరుకుంది. నెలకు రూ.25వేల ఖర్చు భరించడం కష్టంగా మారిందని దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కూలి పనిచేస్తే వచ్చే డబ్బుతో బతకడం కష్టంగా మారిందని, బిడ్డ జబ్బు నయం కోసం రూ.25వేలు వెచ్చించడం పెనుభారంగా మారిందని విలపిస్తున్నారు.సాయం అందించాల్సిన ఫోన్ నంబర్ 93466 20224 -
వృద్ధాప్యం బరువై.. ఆదరణ కరువై..
సాక్షి, హైదరాబాద్: పండుటాకులకు ఎంత కష్టం.. జీవనయానం ఎంత దయనీయం.. మలిసంధ్య వేళ వెలుగురేఖల్లేక అంధకారం అలముకుంది. వృద్ధాప్యం బరువైంది.. ఆదరణ కరువైంది. వృద్ధులను నిరాదరణ, నిర్లక్ష్యం ఆవరించాయి. అనువైన జీవనం కోసం ఎక్కువ శాతం మంది వృద్ధులు సంరక్షకులపై ఆధారపడాల్సి వస్తోందని హెల్ప్‌ఏజ్ ఇండియా నివేదిక వెల్లడించింది. హెల్ప్ ఏజ్ ఇండియా ఈ ఏడాది జాతీయ నివేదిక విడుదల చేసింది. పది రాష్ట్రాల్లో 20 ముఖ్యమైన టైర్ 1, 2 నగరాల్లో 5,169 వృద్ధులు, 1,333 వృద్ధుల సంరక్షకులు, కుటుంబసభ్యులపై అధ్యయనం చేసింది. ఈ సర్వేలో భాగంగా పలు కీలక ఆరి్థక, ఆరోగ్య, ప్రాథమిక సంరక్షణ విషయాలు వెలుగుచూశాయి. ప్రతి ముగ్గురు వృద్ధుల్లో ఒకరు ఆరి్థక సమస్యల్లో ఉన్నారు. వృద్ధుల్లో ఎలాంటి ఆదాయంలేని పురుషులు 27 శాతం, మహిళలు 38 శాతం ఉన్నారు. 32 శాతం వృద్ధులు రూ.50 వేల కంటే తక్కువ వార్షిక ఆదా యం కలిగి ఉన్నారు. 29 శాతం వృద్ధులు మా త్రమే సామాజిక భద్రతా పథకాలైన వృద్ధాప్య పెన్షన్/కాంట్రిబ్యూటరీ పెన్షన్/ప్రావిడెంట్ ఫండ్లను పొందుతున్నారని సర్వే వెల్లడించింది. నిరక్షరాస్యులైన వృద్ధులు (40 శాతం) ఎలాంటి ఆదాయ వనరులు లేక అవస్థలు పడుతున్నారు. 54 శాతం మందికి వ్యాధులు 52 శాతం వృద్ధులు ఆరోగ్యపరంగా నిత్యం ఏదో ఒక ప్రాథమిక సవాలును ఎదుర్కొంటున్నారు. 54 శాతం మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నారు. 31 శాతం మంది వృద్ధులు మాత్రమే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్, ఈఎస్ఐ–సీజీహెచ్ఎస్ వంటి ఆరోగ్య బీమాలను కలిగి ఉంగా, 3 శాతం మంది మాత్రమే కమర్షియల్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లు నివేదించారు. ఆరోగ్య బీమా లేకపోవడానికి ప్రధాన కారణాలుగా అవగాహన లేకపోవడం(32%), ఆరి్థక స్థోమత లేకపోవడం (24%), దాని అవసరం లేకపోవడం (12%) అని గుర్తించారు. 1.5 శాతం మంది మాత్రమే టెలీ–హెల్త్ సేవలను ఉపయోగించారు. 79 శాతం మంది వృద్ధులు ప్రభుత్వ ఆసుపత్రులు/క్లినిక్‌లు/పీహెచ్‌సీలను సందర్శించారు. 80 ఏళ్లు పైబడిన 47 శాతం మందికి ఆసుపత్రులకు వెళ్లడానికి వ్యక్తిగత ఆదాయం లేక అవస్థలను ఎదుర్కొంటున్నారని హెల్ప్‌ఏజ్ ఇండియా పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ హెడ్ అనుపమ దత్తా వెల్లడించారు. నిరక్షరాస్యులపట్ల నిర్లక్ష్యం వృద్ధులు నిర్లక్ష్యానికి గురికావడంలో కుమారులు 42 శాతం, కోడళ్లు 28 శాతం కారణంగా ఉన్నారు. నిర్లక్ష్యం ఎదుర్కొన్నవారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కాగా, వృద్ధుల ఆదాయం తగ్గడంతో వారిపై నిర్లక్ష్యం పెరిగిందని 73 శాతం బాధితులు నివేదించారు. ఈ బాధితులు (94 శాతం మంది) కనీసం ఒక దీర్ఘకాలిక వ్యాధికి గురికావడం వల్ల కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని వెల్లడైంది. నిర్లక్ష్యానికి గురైన బాధితులు.. వారిని దూషించడం, కొట్టడం వంటి చర్యలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయగా, పరిష్కారం లభించలేదని కుమిలిపోతున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు చాలా అత్యల్పమని హెల్ప్‌ఏజ్ ఇండియా సీఈఓ రోహిత్ ప్రసాద్ పేర్కొన్నారు. మంచాన పడినప్పుడువృద్ధుల సంరక్షణలో కుటుంబసభ్యులు ప్రాథమిక పాత్ర పోషించారని సర్వే తెలిపింది. వృద్ధులు మంచాన పడినప్పుడు వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు చూసుకున్నారని, 68 శాతం మంది సంరక్షకులు వారికి బాసటగా నిలిచామని తెలిపారు. సగటున వారంలో దాదాపు 20 గంటలు వారి సేవలకే అంకితం చేశామని సంరక్షకులు తెలిపారు. అయితే సంరక్షణలో భాగంగా 10 శాతం మంది మాత్రమే సమీపంలో వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్లు, పాలియేటివ్ కేర్(ఉపశమన సేవలు) వినియోగించుకున్నారని వెల్లడైంది. జెరియాట్రిక్ హెల్త్‌కేర్ సౌకర్యాలను 15 శాతం మంది మాత్రమే అందించారు. -
జొమాటో ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ హీరోలు: గిన్నిస్ వరల్డ్ రికార్డ్
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి సాయం అందించవచ్చో ట్రైనింగ్ ఇచ్చిన.జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. తమ డెలివరీ ఏజెంట్లకు ముంబైలో ఒకే చోట ఈ శిక్షణ అందించింది. ఒకేసారి 4,300 మందికి జూన్ 12వ తేదీన ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది. అత్యవసర సమయాల్లో స్పందించేలా అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించి ఈ రికార్డు సొంతం చేసుకుంది.ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ నుంచి వచ్చిన సర్టిఫికెట్‌ను జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఎమర్జెన్సీ హీరోస్ ఆఫ్ ఇండియా’ అనే క్యాప్షన్‌తో డెలివరీ పార్ట్నర్స్ శిక్షణా ఫొటోలను ట్వీట్ చేశారు.జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కేవలం ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా ఇకపై అత్యవసర సమయాల్లో కూడా సాయం అందిస్తారని గోయల్ తెలిపారు దాదాపు 30 వేల మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిపారు. "ఒకే చోట 4,300 మందికి ఇలా ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. దాదాపు 30 వేల మంది ఈ ప్రాథమిక చికిత్సలో శిక్షణ పొందారు. ఇకపై వీళ్లంతా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడతారు. ఎమర్జెన్సీ హీరోలందరికీ నా సెల్యూట్" అని పోస్ట్ పెట్టారు. -
పేద కుటుంబానికి ఆదుకున్న హీరో.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతిలో పశుపతి పాత్రలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. అంతేకాదు.. తెలుగులో అల్లు అర్జున్ చిత్రం జులాయిలో తన నటనతో ఆకట్టుకున్నారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించారు. అయితే సోనూ సూద్ తెరపై మాత్రమే కాదు.. అభిమానుల గుండెల్లో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు.తాజాగా మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఓ పేద కుటుంబంలోని మూడేళ్ల బాలుడికి వైద్య సాయమందించారు. అత్యవసరంగా గుండెకు సర్జరీ చేయాల్సి రావడంతో సోనూ సూద్ ఆదుకున్నారు. ఆ బాలుడికి సర్జరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయించారు. ఇది చూసిన నెటిజన్స్ సోనూ రియల్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనూ సూద్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. Appointment fixed with the doctor at 11.30 am today . Will be done ❤️✔️@SoodFoundation 🇮🇳 https://t.co/O1K88v0Pl1— sonu sood (@SonuSood) June 7, 2024 -
Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
సాక్షి, యాదాద్రి : ఆరు నెలల బాబుకు అలవికాని జబ్బు వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న చిన్నారి వైద్యానికి రూ.16 కోట్లు అవసరం కాగా, విదేశాల నుంచి రూ.10 కోట్లు దాతల విరాళాలు అందాయి. మిగతా రూ.6 కోట్లు మన దేశంలోనే సమకూర్చుకోవాలని చెప్పడంతో ప్రభుత్వం, దాతలు సహకరించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన కొలను దిలీప్‌రెడ్డి–యామిని దంపతులకు ఆరు నెలల వయస్సున్న భవిక్‌రెడ్డి స్పైనల్ మస్కలర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. లక్షల్లో ఒక్కరికి వచ్చే అత్యంత ప్రాణాంతకమైన జబ్బుగా పరీక్షల్లో డాక్టర్లు గుర్తించారు. భవిక్‌రెడ్డికి నరాల కండరాల బలహీనత ఎస్ఎమ్ఏ టైప్ –1 హైరిస్క్‌గా డాక్టర్లు నిర్ధారించారు. వ్యాధిని నయం చేసే ఇంజెక్షన్ ఇవ్వకపోతే చనిపోతాడని డాక్టర్లు అంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా అమెరికాలో లభించే ఈ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు అని వైద్యం చేస్తున్న హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేశ్ కోణంకి పర్యవేక్షణలో బాబుకు వైద్యం జరుగుతోంది. రెయిన్బో ఆస్పత్రి సౌజన్యంతోనే విదేశాల నుంచి సుమారు రూ.10 కోట్ల విరాళాలు ఇప్పటికే సేకరించారు. మరో రూ.6 కోట్లు ఇక్కడే సమకూర్చుకోవాలని వైద్యులు చెప్పారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు దాతల సహకారం కోరుతున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే కోసం : 9640160506, అకౌంట్ హోల్డర్ పేరు : కొలను దిలీప్‌రెడ్డి ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0021766, బ్యాంక్ అకౌంట్ నంబర్ : 42380569990 బ్యాంకు బ్రాంచ్: ఎస్బీఐ వలిగొండ.