Dog Seeks Help From A Man To Save Trapped Sibling - Sakshi
Sakshi News home page

మనిషిని సాయం కోరిన మూగజీవి.. 

Published Sun, Jul 2 2023 1:16 PM | Last Updated on Sun, Jul 2 2023 2:28 PM

Dog Seeks Help From A Man To Save Trapped Sibling - Sakshi

జన సంచారం తక్కువగా ఉన్న ఒక వంతెన పైన రెండు కుక్కలు ఆడుకుంటూ ఉండగా ఒక కుక్క పొరపాటున పక్కనే ఉన్న సంపులో పడిపోయింది. దీంతో రెండో కుక్కకు ఏమి చెయ్యాలో పాలుపోక, తన సోదరుడిని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక సహాయం కోసం చుట్టూ చూసింది. సంయమనంతో అలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మనిషిని సాయం కోరింది.   

అటుగా వెళ్తోన్న ఒక వ్యక్తిని అడ్డుకుని మొరుగుతూ.. తోక ఆడిస్తూ.. తన సమస్యని చెప్పే ప్రయత్నం చేసింది ఆ శునకం. మొదట అదేమీ పట్టించుకోని ఆ వ్యక్తి అలాగే ముందుకు నడుచుకుంటూ పోతుండగా ఆ కుక్క మాత్రం పట్టిన పట్టు విడవకుండా అతడిని వెంబడించింది. దీంతో ఎదో జరిగిందని గ్రహించిన ఆ వ్యక్తి అక్కడే ఆగి వెనక్కు చూశాడు. 

వెంటనే ఆ కుక్క అతడిని ఆ సంపు వద్దకు తీసుకుని వెళ్లగా మానవత్వంతో ప్రమాదంలో చిక్కుకున్న కుక్కని బయటకు తీసి రక్షించాడు. అనంతరం సంపు పైన మూతను అమర్చి తన దారిన వెళ్తున్న ఆ వ్యక్తిని రెండు కుక్కలు కృతఙ్ఞతలు చెబుతూ వెంబడించాయి. 

థాంక్ యూ మనిషి.. 
ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. "తన సోదరుడిని కాపాడుకునేందుకు మనిషి సాయం కోరిన కుక్క.. మీరు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు.. థాంక్ యూ మనిషి.. " అని మూగజీవాల ధృక్కోణంలో కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.            

ఇది కూడా చదవండి: వాగ్నర్ గ్రూపులోని 21000 మందిని మట్టుబెట్టాం.. జెలెన్స్కీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement