Seeking
-
మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి..
జన సంచారం తక్కువగా ఉన్న ఒక వంతెన పైన రెండు కుక్కలు ఆడుకుంటూ ఉండగా ఒక కుక్క పొరపాటున పక్కనే ఉన్న సంపులో పడిపోయింది. దీంతో రెండో కుక్కకు ఏమి చెయ్యాలో పాలుపోక, తన సోదరుడిని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక సహాయం కోసం చుట్టూ చూసింది. సంయమనంతో అలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మనిషిని సాయం కోరింది. అటుగా వెళ్తోన్న ఒక వ్యక్తిని అడ్డుకుని మొరుగుతూ.. తోక ఆడిస్తూ.. తన సమస్యని చెప్పే ప్రయత్నం చేసింది ఆ శునకం. మొదట అదేమీ పట్టించుకోని ఆ వ్యక్తి అలాగే ముందుకు నడుచుకుంటూ పోతుండగా ఆ కుక్క మాత్రం పట్టిన పట్టు విడవకుండా అతడిని వెంబడించింది. దీంతో ఎదో జరిగిందని గ్రహించిన ఆ వ్యక్తి అక్కడే ఆగి వెనక్కు చూశాడు. వెంటనే ఆ కుక్క అతడిని ఆ సంపు వద్దకు తీసుకుని వెళ్లగా మానవత్వంతో ప్రమాదంలో చిక్కుకున్న కుక్కని బయటకు తీసి రక్షించాడు. అనంతరం సంపు పైన మూతను అమర్చి తన దారిన వెళ్తున్న ఆ వ్యక్తిని రెండు కుక్కలు కృతఙ్ఞతలు చెబుతూ వెంబడించాయి. థాంక్ యూ మనిషి.. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. "తన సోదరుడిని కాపాడుకునేందుకు మనిషి సాయం కోరిన కుక్క.. మీరు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు.. థాంక్ యూ మనిషి.. " అని మూగజీవాల ధృక్కోణంలో కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. Dog seeks help from a random person to rescue his brother. They were happy and grateful for the help. Thank you, hooman...🙏❤️ pic.twitter.com/v0FHIIgZXd — 𝕐o̴g̴ (@Yoda4ever) June 30, 2023 ఇది కూడా చదవండి: వాగ్నర్ గ్రూపులోని 21000 మందిని మట్టుబెట్టాం.. జెలెన్స్కీ -
జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలి
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సామాజిక న్యాయం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు బీసీ సంక్షేమ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని సీజేఐ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసన శంకర్రావుల ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం జస్టిస్ ఎన్వీ రమణను కలిసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. సీజేఐను కలిసిన వారిలో బీసీ నేతలు యుగేందర్ గౌడ్, క్రాంతికుమార్, శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, శ్యామ్, నరేశ్, శ్రీనివాస్‌గౌడ్, రంగనాథ్, విజయ్, సాయితేజ తదితరులున్నారు. అనంతరం ఢిల్లీలోని రోహిణిలో బీసీ పెడరేషన్ జాతీయ కార్యాలయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ప్రారంభించారు. -
ప్రత్యేక హోదా కోరుతూ విద్యార్ధులు జలదీక్ష
-
అరెస్టు ఆపేయాలంటూ సుప్రీం కోర్టుకు..
న్యూఢిల్లీ: అక్కడా ఇక్కడా తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ భారతీ చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తనను అరెస్టు చేయకుండా రక్షించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనను చిత్ర హింసలకు గురిచేశారని, హత్య చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించారని సోమనాథపై ఆయన భార్య లిపికా మిత్రా కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, తొలుత వారిమధ్య సయోద్య కుదిర్చేందుకు ప్రయత్నించినా విఫలం అవడంతో చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆయన ఢిల్లీలో కిందిస్థాయి కోర్టు ఆ తర్వాత హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్లగా ఆ కోర్టులు నిరాకరించాయి. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు కదిలినా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. తాజాగా ఆయన తరుపు న్యాయవాది మాత్రం సోమనాథ తరుపున సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశామని, ఆ బెయిల్ వ్యవహారం ఉన్నత న్యాయస్థానంలో తేలేంత వరకు పోలీసులు ఆయన బంధువులను, స్నేహితులను సోమనాథ అరెస్టు కోసం ఇబ్బందులు పెట్టవద్దని న్యాయవాది విజయ్ అగర్వాల్ కోరారు. -
లక్ష గొంతుకలను ఢిల్లీకి వినిపిద్దాం..
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఈ నెల 30న తలపెట్టిన లక్షగొంతుల ఆకాంక్షను ఢిల్లీకి వినిపించాలని అఖిలపక్ష కమిటీ తీర్మానించింది. మంగళవారం స్థానిక షాదీఖానాలో లక్ష గొంతుకల ఉద్యమంపై కులసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు హాజరై కార్యక్రమం విజయవంతంపై దశాదిశను నిర్ధేశించారు. 30న వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి ఉంచాలన్న నిర్ణయాన్ని వ్యాపారులు సమావేశంలో ప్రకటించారు. లక్సెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి రోడ్లు దిగ్బంధించాలని నిర్ణయించారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం వరకు లక్ష మందితో ఎక్కడికక్కడే తమ గళాన్ని వినిపించాలని తీర్మానం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యమంలో భాగస్వాములు అవుతారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణవాదులుగానే కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ జెండాలను ఎవరూ తీసుకరావద్దని వక్తలు కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు మంగీలాల్సోమాని, ఆర్.కృష్ణారావు, వ్యాపార సంస్థల ప్రతినిధి గురిజాల రాధాకిషన్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జగన్మోహన్రావు, టీడీపీ జిల్లా కన్వీనర్ గాజుల ముకేశ్‌గౌడ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ ప్రతినిధులు బాలాజీ, ప్రవీణ్, కళాశాలల ప్రతినిధు లు భూమేశ్, మల్లారెడ్డి, డీటీఎఫ్ నాయకుడు కె.రాంరెడ్డి, టీయూటీఎఫ్ ప్రతినిధి ఆగాచారి, కమ్యూనిస్టు పార్టీ కన్వీనర్, కో కన్వీనర్ నైనాల వెంకటేశ్వర్లు, జయరావు, న్యాయవాది చుంచు సదానందం, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొగరి సుధాకర్, నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.