సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సామాజిక న్యాయం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు బీసీ సంక్షేమ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని సీజేఐ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసన శంకర్‌రావుల ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం జస్టిస్ ఎన్వీ రమణను కలిసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. సీజేఐను కలిసిన వారిలో బీసీ నేతలు యుగేందర్ గౌడ్, క్రాంతికుమార్, శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, శ్యామ్, నరేశ్, శ్రీనివాస్‌గౌడ్, రంగనాథ్, విజయ్, సాయితేజ తదితరులున్నారు. అనంతరం ఢిల్లీలోని రోహిణిలో బీసీ పెడరేషన్ జాతీయ కార్యాలయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment