Justice
-
మహా కంత్రీ కిరణ్ రాయల్! ఏకంగా పవన్నే..
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నా.. ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓ మహిళ అతని చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయమని, తనలాంటి వాళ్లెందరినో మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గప్‌చుప్‌గా ఉండిపోయారు. అయితే కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి.. ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది .పవన్ కల్యాణ్ అండ చూసుకునే కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడని లక్ష్మి(Laxmi) మరోసారి మీడియా ముందు ఇవాళ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో సంచల వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, అందుకే ఆయన తనను ఏమీ చేయడని.. ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడు. .. ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా.. చంద్రబాబు సహా ఎవరినీ తిట్టినా పవన్ కల్యాణ్ అసలు పట్టించుకోరని కిరణ్ రాయల్(kiran Royal) అనేవాడు. ఒకానొక టైంలో.. ‘పవనే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశా.. ఇక నువ్వు ఎంత అని కిరణ్ నాతో అన్నాడు’ అని లక్ష్మి మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆడవాళ్లను మోసం చేసి.. వాళ్ల సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తికి అండగా నిలబడడం సమంజసమేనా? అని పవన్ కల్యాణ్‌ను ఆమె ప్రశ్నించారు కూడా. మరి ఇంతటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అయినా.. జనసేన కిరణ్‌పై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. -
సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్.. ఆమోదించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌ను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం సంతోషంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా నాలుగు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసింది. ఇక సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మన్మోహన్ సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేస్తే.. సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది. జస్టిస్ మన్మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు. -
93 ఏళ్ల బామ్మ.. 34 ఏళ్లుగా జైల్లోనే
రాయచూరు రూరల్: క్షణికావేశంలో చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైబడి శిక్ష అనుభవిస్తున్న వృద్ధురాలికి ఉపశమనం కలిగింది. ఉప లోకాయుక్త ఆదేశాలతో ఆమెకు విముక్తి లభించింది.శిక్ష మూడేళ్లు మాత్రమేవివరాలు.. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకావాసి నాగమ్మ 1995 లో వరకట్న వేధింపుల కేసులో నిందితురాలిగా జిల్లా కేంద్ర జైలుకు వచ్చారు. ఆనాటి నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 93 ఏళ్లు. ఆమెకు విధించిన శిక్ష 3 ఏళ్లు మాత్రమే. కానీ పట్టించుకుని బెయిలు ఇప్పించేవారు లేకపోవడంతో కటకటాలే పుట్టినిల్లయింది. ఇటీవల ఉప లోకాయుక్త బి.వీరప్ప జైలును సందర్శించి ఆమె కథను విని చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టితో ఫోన్లో మాట్లాడారు. నాగమ్మకు పూర్తిగా అశక్తురాలని, ఆమెను వదిలివేయాలని ఉప లోకాయుక్త సూచించారు. జైలు సూపర్నెంటు అనిత పెరోల్ ఇవ్వడంతో బంధువులు ఆమెను తీసుకెళ్లారు.34 ఏళ్లుగా జైల్లో.. పాపం నాగమ్మ! -
పాపం నాగమ్మ!
రాయచూరు రూరల్: క్షణికావేశంలో ఏదో తెలిసీ, తెలియక చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఉప లోకాయుక్త చొరవతో కలబుర్గి చెరసాల నుంచి 93 ఏళ్లున్న వృద్ధురాలి విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమైన ఘటన చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప సందర్శించారు. వయస్సు మీరిన వారిని చెరసాలలో ఉంచరాదనే విషయం తెలుసుకున్న వీరప్ప కలబుర్గి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శ్రీనివాస నవలిని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి విడుదలకు అనుమతి కోరాలన్నారు. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకాకు చెందిన నాగమ్మపై 1995లో వరకట్నం కేసులో నిందితురాలిగా కేసు పెట్టారు. నాటి నుంచి నేటి వరకు శిక్షను అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఉప లోకాయుక్త బి.వీరప్ప చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టిని ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. పండు వృద్ధురాలు నాగమ్మకు నడవడం కూడా చేత కాదని, ఆరోగ్య సమస్యలను జైల్ అధికారులు, సిబ్బంది అంతగా పట్టించుకోవడం లేదు కనుక ఆమెను చెరసాల నుంచి విడుదల చేసి విముక్తి కల్పించాలని కోరారు. -
దివ్యాంగ చిన్నారులకు శాశ్వత సాయం
న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారులకు జీవితకాలమంతా సాయం అందాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. దివ్యాంగ చిన్నారుల హక్కుల పరిరక్షణపై 9వ వార్షిక జాతీయ సదస్సులో ఆదివారం ఆమె మాట్లాడారు. ‘‘ దేశంలో ఎంతమంది దివ్యాంగ చిన్నారులు అనే కచి్చతమైన గణాంకాలే లేకపోవడం దారుణం. దివ్యాంగ చిన్నారులందరికీ శాశ్వతంగా సహాయం, విద్య అందాలి. మనం చొరవ తీసుకుని వారిని పరిరక్షించలేకపోతే దివ్యాంగ చిన్నారులు నిరాదరణకు గురవుతారు. భిన్న ప్రాంతాల్లోని దివ్యాంగ చిన్నారుల సంక్షేమానికి విభిన్న పద్ధతుల్లో కృషి జరగాలి. అందరినీ ఒకే గాటినకడితే వారిపై వివక్ష చూపినట్లే లెక్క. ఇంతటి కీలక పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు అంగన్వాడీలకు తగు శిక్షణ ఇప్పించి, అక్కడి వనరులను పెంచాలి. నిర్బంధ విద్య అమలు అనే దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయకూడదు. కచి్చతంగా దానిని అమలుచేయాలి. తద్వారా ప్రతి ఒక్క దివ్యాంగ విద్యారి్థకి విద్య అందించాలి’’ అన్నారు. దివ్యాంగ చిన్నారులకు పెన్షన్ శాశ్వతంగా అందేలా చూడాలని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్‌కు న్యాయమూర్తి సూచించారు. -
వారికి కూడా.. మీతో సమానమైన వాటా వస్తుంది!
నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలూ తల్లి వద్దనే ఉంటారు. మా తండ్రి గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా? – శరత్ కుమార్, రాజమండ్రిమీ తండ్రి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి ఆయన స్వార్జితమై ఉండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి ఉంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కూ ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది ఉంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది.అలాకాకుండా మీ తండ్రి గారికి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయి వుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేక వాళ్ల అమ్మతోనే ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఒకవేళ మీతో΄ాటు ఇతర సంతానం అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ అమ్మగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాయనమ్మ) ఉంటే వారికి కూడా మీతో΄ాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటా అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ ΄÷ందే హక్కు ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఇవి చదవండి: సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్ -
న్యాయమూర్తులు హద్దు మీరొద్దు
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందాపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ‘‘న్యాయమూర్తులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. హద్దు మీరడం తగదు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది’’ అని హితవు పలికింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. 25న విచారణ చేపడతామని వెల్లడించింది.అసలేం జరిగింది? బెంగళూరులో ఓ ఇంటి యజమాని, కిరాయిదారుకు వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. బెంగళూరులోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని జస్టిస్ శ్రీశానందా పాకిస్తాన్‌తో పోల్చారు. అంతేగాక, ‘‘ప్రత్యర్థి వర్గంతో మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లున్నాయి. వారి లోదుస్తుల రంగు కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మహిళా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టుల్లో న్యాయమూర్తుల వ్యాఖ్యలపై మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోందని సీజేఐ పేర్కొన్నారు. ‘‘కోర్టుల కార్యకలాపాలను గమనించడంలో సోషల్ మీడియా చురుగ్గా ఉంది. కనుక న్యాయమూర్తుల వ్యాఖ్యలు చట్టాలకు లోబడి మర్యాదపూర్వకంగా ఉండాలి’’ అన్నారు. -
సీజేఐ ఇంట గణేష్ పూజలో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
‘సత్వర న్యాయం’తోనే భద్రతపై భరోసా
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వేగంగా న్యాయం చేకూర్చే పరిస్థితి ఉంటే భద్రత పట్ల మహిళలకు గొప్ప భరోసా దక్కుతుందని ఉద్ఘాటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగానికి దేశ న్యాయ వ్యవస్థను ఒక సంరక్షకురాలిగా పరిగణిస్తుంటామని చెప్పారు. సుప్రీంకోర్టుతోపాటు మొత్తం న్యాయ వ్యవస్థ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... క్రియాశీలకంగా మానిటరింగ్ కమిటీలు ‘‘దేశంలో మహిళలు, చిన్నారులపై వేధింపులు, నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం చట్టాల్లో కఠినమైన నిబంధనలు చేరుస్తున్నాం. 2019లో ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల పథకాన్ని ప్రారంభించాం. అడబిడ్డలపై జరిగే నేరాల విషయంలో తీర్పులు వేగంగా రావాలి. నేరగాళ్లకు శిక్షలు పడాలి. బాధితులకు సత్వర న్యాయం దక్కాలి. అలా జరిగితేనే జనాభాలో సగం మందికి వారి భద్రతపై ఒక భరోసా, నమ్మకం లభిస్తాయి. మహిళలపై నేరాలు అరికట్టే విషయంలో జిల్లా జడ్జి, మేజి్రస్టేట్, ఎస్పీతో కూడిన జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకం. కింది కోర్టులే మొదటి మెట్టు దేశంలో రాజ్యాంగాన్ని, చట్టాల స్ఫూర్తిని న్యాయ వ్యవస్థ చక్కగా పరిరక్షిస్తోంది. సుప్రీంకోర్టు పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలు ఏనాడూ అపనమ్మకం వ్యక్తం చేయలేదు. న్యాయ వ్యవస్థపై వారికి ఎంతో విశ్వాసం ఉంది. దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ ఒక బలమైన పునాది అనడంలో సందేహం లేదు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో కింది కోర్టులే మొదటి మెట్టు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. కోర్టులను ఆధునీకరిస్తున్నాం. పెండింగ్ కేసులను విశ్లేíÙంచడానికి, భవిష్యత్తులో రాబోయే కేసులను అంచనా వేయడానికి కృత్రిమ మేధ(ఏఐ), ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ వంటి నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’’ అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు. భారత సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని ఆవిష్కరించారు. బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరమెందుకు: కపిల్ సిబల్ ఎలాంటి సంకోచాలు, పక్షపాతానికి తావులేకుండా తీర్పులు ఇచ్చేలా ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు బలోపేతం కావాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ చెప్పారు. క్షేత్రస్థాయిలోని కింది కోర్టులు ఒత్తిళ్లను తట్టుకొని స్థిరంగా నిలవకపోతే మొత్తం న్యాయ, రాజకీయ వ్యవస్థ సమగ్రత ప్రమా దంలో పడుతుందని అన్నారు. జిల్లా కోర్టులపై సదస్సులో ఆయన మాట్లాడుతూ... బెయిల్ ఒక నియమం, జైలు ఒక మినహాయింపు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రస్తావించారు. కీలకమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. తన వృత్తి జీవితంలో కింది కోర్టులు బెయిల్ ఇవ్వగా చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పారు. బెయిల్‌ను కింది కోర్టులు ఒక మినహాయింపుగా భావిస్తుండడంతో పై కోర్టులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చెప్పారని గుర్తుచేశారు. కింది కోర్టుల్లో బెయిల్ రాకపోవడంతో నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, న్యాయమూర్తుల వేతనా లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కోర్టులే వెన్నెముక: జస్టిస్ చంద్రచూడ్ దేశంలో మొత్తం న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ వెన్నుముక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభివరి్ణంచారు. చట్టబద్ధ పాలనకు జిల్లా జ్యుడీíÙయరీ అత్యంత కీలకమని చెప్పారు. జిల్లా కోర్టులను కింది కోర్టులు అని పిలవడం ఆపేయాలని సూచించారు. జిల్లా కోర్టులపై జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయ వ్యవస్థలో కొన్నేళ్లుగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని అన్నారు. న్యాయాన్ని పొందడానికి ప్రజలకు మొదటి వేదిక జిల్లా కోర్టులేనని తెలిపారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023–24లో 46.48 కోట్ల పేజీల కోర్టు రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చామని వెల్లడించారు. 3,500 కోర్టు కాంప్లెక్స్‌లను, 22,000 కోర్టు రూమ్‌లను కంప్యూటరీకరించడానికి ఈ–కోర్టుల ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. న్యాయమూర్తులపై ఒత్తిడి అధికంగా ఉంటుందని, వారు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. -
మాలీవుడ్ ‘తెర’ వెనుక కన్నీటి చార
మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. బలం ఉన్నవాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చే మహిళా ఆర్టిస్టులను తాము చెప్పినట్టుగా వినాలని శాసిస్తున్నారు. ‘ఎస్’ అంటే మేకప్... ‘నో’ అంటే ప్యాకప్ అని బెదిరిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషనే తేల్చి చెప్పింది. మలయాళ పరిశ్రమ ఈ కమిషన్ రిపోర్టుతో కుదుపునకు లోనవుతోంది.‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ. ఉత్తమ అభిరుచి, ప్రజాదరణ ఉన్న సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మలయాళ పరిశ్రమలో తెర వెనుక కన్నీటి చారను జస్టిస్ హేమ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని స్త్రీల జీవితాలను శాసిస్తున్నారని ఈ కమిటీ పేర్కొనడం గమనార్హం. ఇదీ నేపథ్యందాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు. విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో నిన్న (సోమవారం) మధ్యాహ్నం ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.కమిటీ నివేదికలో సంచలన విషయాలు‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.ఆ 15 మందికొంతమంది హీరోలు... మరికొంతమంది దర్శకులు... ఇంకొందరు నిర్మాతలు... ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది.ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటేసర్దుకుపోండి... రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు... కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.– ఫణికుమార్ అనంతోజుకమిటీ సిఫార్సులు→ సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి.→ అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి మహిళలను న్యాయం చేయాలి.→ నేరచరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి→ షూటింగ్ జరిగే ్రపాంతాల్లో మద్యం, మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలి.→ ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలి.→ పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలి. -
ప్రవళిక కుటుంబానికి భరోసా ఏదీ?
సాక్షి, వరంగల్/దుగ్గొండి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మర్రి ప్రవళిక ఆత్మహత్య రాష్ట్రాన్నే కాదు దేశంలోనే సంచలనంగా మారింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి , బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ల నోటి వెంట రాజకీయ ఎన్నికల ప్రచారంలో ఆమె పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రవళిక కుటుంబాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదుకోవాలని, ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో రాబోయే తమ ప్రభుత్వం ద్వారా ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని బాహాటంగానే ప్రకటించాయి. అలా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపేటకు చెందిన ప్రవళిక పేరును వాడుకొని ఆయా పార్టీలు మద్దతు కూడగట్టుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండి ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం ఇప్పుడు ఆ కుటుంబంవైపు చూడకపోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగిన ప్రవళిక తండ్రి విసిగివేసారి కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వరంగల్‌కు రానున్న సందర్భంలో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.అసలేం జరిగిందంటే..వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటున్న క్రమంలో పోటీ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో విరక్తి చెందిన ఆమె 2023 అక్టోబర్ 13న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక మృతితో అక్కడే వివిధ కోచింగ్ సెంటర్లలోని నిరుద్యోగ యువతీ యువకులు నిరసనకు దిగారు. అప్రమత్తమైన అప్పటి ప్రభుత్వం ప్రవళిక మృతదేహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామం బిక్కాజిపల్లి గ్రామానికి తీసుకువచ్చి వందలాది మంది పోలీసుల పహారా మధ్య అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియల సందర్భంలో వేలాది మంది విద్యార్థ్ధులు వచ్చి ఆందోళన చేపట్టినా పోలీసులు వారిని తోసివేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం వచ్చి ఆందోళన నిర్వహించారు.ప్రియాంక గాంధీ దూత వచ్చినా..అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 45 రోజుల గడువు ఉండగా ప్రవళిక మృతిని అప్పటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు అనుకూలంగా మలచుకున్నాయి. ప్రవళిక మృతిని దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకుల మద్దతు కూడగట్టాయి. అప్పటి అధికార పక్షం, నేటి ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ప్రవళిక మృతిని పెద్దది చేయకుండా ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడి ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ఆ పార్టీ నాయకులు చేతులు ఎత్తివేశారు. ప్రవళిక మృతి సమయంలో ప్రియాంకగాంధీ దూతగా ఉత్తర్‌ప్రదేశ్ ఎంపీ డాలీశర్మ స్వయంగా అక్టోబర్ 15న బిక్కాజిపల్లికి వచ్చి ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘ప్రియాంకగాంధీ నీకు తోడుగా ఉంటానని చెప్పమని నన్ను పంపింది’అని డాలీశర్మ ప్రవళిక తల్లి విజయకు చెప్పారు. ఇదే సమయంలో పీసీసీ అధికార ప్రతినిధి, నేటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌రియాజ్ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ప్రవళిక తల్లిదండ్రులు లింగయ్య, విజయలతో మాట్లాడించారు. ‘పోయిన బిడ్డను తెచ్చి ఇవ్వలేం.. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి’అని ధైర్యం చెప్పారు. నేడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడు నెలలు దాటింది. ప్రవళిక కుటుంబం, ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా అంటూ విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. నాటి, నేటి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దూతలుగా వచ్చి మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్‌లు నేడు ప్రవళిక కుటుంబ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది. ఇప్పటికై నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు స్పందించి ప్రవళిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.కూలీ పనులకు వెళ్తున్నా..నా బిడ్డ చనిపోయి ఎనిమిది నెలలు దాటుతుంది. బిడ్డ చనిపోయినప్పుడు వేలాది మంది రోజు వచ్చిండ్లు. ఆదుకుంటామని ధైర్యం చెప్పిండ్లు. మీటింగ్లల్ల నాబిడ్డ పేరు చెప్పని నాయకుడు లేడు. ఎన్నికలు అయిపోయినయి. నన్ను ఎవళ్లూ పట్టిచ్చుకుంటలేరు. చానామంది నాయకుల దగ్గరికి తిరిగిన. కాళ్లు ఏళ్లు మొక్కినా కనికరం లేదు. అప్పడు ఇప్పుడు అంటున్నరు. బిడ్డ పోయినందుకు కొడుక్కు ఉద్యోగం ఇస్తం అన్నరు. ఇప్పుడు ఎవళూ ఏమీ చెబుతలేరు. రెక్కాడితిగాని డొక్కాడదు. అందుకు రోజు కూలీ పనులకు పోతున్న. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సారు నా కొడిక్కి ఉద్యోగం, నాకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలే.– మర్రి లింగయ్య, ప్రవళిక తండ్రినిందమోపిండ్లు.. రుజువు చేయలే.. నాబిడ్డ చదువులో చాలా తెలివిగలది. ఏనాటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తా అన్నది. ఉద్యోగం వచ్చినంకనే పెళ్లి అన్నది. పరీక్షల పేపర్లు లీక్ కాంగనే రంది పడ్డది. మళ్ల ఎప్పుడు పెడుతరో.. నౌకరి వస్తదో రాదో అని మదన పడేది. గుండె ధైర్యం చెడి ఆత్మహత్య చేసుకున్నది. చావుకు ప్రేమ కథ అల్లిండ్లు. నింద మోపిండ్లు. ఇప్పటికీ రుజువు చేయలే. కడుపు కాలుతుంది. క్షణంక్షణం బిడ్డ యాదికోస్తుంది. ఇప్పుడు మా ఇంటి వంక ఎవ్వలూ చూడటం లేదు. నా బిడ్డ పేరు చెప్పుకుని ఓట్లు సంపాదించుకున్నరు. గద్దెలు ఎక్కిండ్లు. నా బిడ్డ ఇప్పుడు ఎవ్వరికి గుర్తుకు లేదు.– మర్రి విజయ, ప్రవళిక తల్లి -
పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్‌గా పరిగణించండి’
ముంబై: పుణెలో సంచలనం రేపిన పోర్షే కారు రోడ్డు ప్రమాదం ఘటన పూర్తి నివేదికను పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు(జేజేబీ)కి అందజేశారు. పూర్తిగా విచారించేందుకు నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని పోలీసులు గతంలో జేజేబీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ అభ్యర్థనకు మద్దతుగా కేసులోని పూర్తి వివరాలు, సాక్ష్యాధారాల నివేదికను క్రైం బ్రాంచ్ పోలీసులు జేజేబీకి అందజేశారు. చదవండి: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!‘‘ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను జేజేబీకి సమర్పించాం. ఈ రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడే కీలకంగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు( మే 19) సాయంత్రం నుంచి ప్రమాదం జరిగే సమయంలో అన్ని సాక్ష్యాలు సేకరించాం. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నాం. మైనర్ బాలుడు కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షి చూశాడు. విచారణ సమయంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. కోసీ రెస్టారెంట్, బ్లాక్ క్లబ్ రెస్టారెంట్లో మద్యం సేవించినట్లు గుర్తించాము. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణానికి కారణం మైనర్ బాలుడే. ఇలా.. మైనర్ బాలుడికి సంబంధించి పూర్తి వివరాలు జేజేబీకి అందించాం’’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికైనా మేజర్‌గా పరిగణించి విచారించేందుకు సహకరిచాలని జేజేబీని క్రైం బ్రాంచ్ అధికారి కోరారు.ఈ కేసులో మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయడానికి అతని తల్లిదండ్రులు, సాసూన్ హాస్పిటల్ డాక్టర్ల సాయం తీసుకున్నారు. దీంలో విచారణలో వారి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేయగా జైలులో ఉన్నారు. బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మైనర్ బాలుడి తండ్రికి, డాక్టర్లకు మధ్యవర్తులుగా పనిచేసిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పుణె పోర్షే కేసు: ‘ నాకేం గుర్తు లేదు.. అప్పడు తాగి ఉన్నా..!’ -
జస్టిస్ రామలింగేశ్వర్రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఎ.రామలింగేశ్వర్రావు గుండె పోటు తో కన్ను మూశారు. జర్మనీలో ఉన్న కూతురును చూడడానికి వెళ్లగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రామలింగేశ్వర్‌రావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1956, మే 21న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఆయన 1982లో న్యాయవాదిగా నమోదు చేసుకు న్నారు. 1984లో జస్టిస్ ఏ.వెంకట్రామిరెడ్డి వద్ద జూనియర్‌గా చేరి 1987లో స్వతంత్ర న్యాయ వాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే ఉస్మానియాలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పీజీ విద్యార్థులకు ఇంటర్నేషనల్ లా పాఠాలు చెప్పారు. 2013లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వరకు సామాజిక న్యాయం, పర్యావరణంతోపాటు పలు విభాగాల్లో సమర్థవంతమైన న్యాయవాదిగా వాదనలు వినిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అడవుల రక్షణకు వాదించిన కేసు దేశమంతటా ‘సమత’ కేసుగా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ న్యాయవాదిగా, టీటీడీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తదితరాలకు న్యాయవాదిగా పనిచేశారు. సాహిత్యం, కళలపై ఆయనకు మక్కువ ఎక్కువ. విపరీతంగా పుస్తకాలు చదవడంతో పాటు రాయడం అలవాటు. న్యాయమూర్తిగా దాదాపు 13 వేల తీర్పులు ఇచ్చారు. వీటిలో 100కు పైగా లా జర్నల్‌లో ప్రచురితం కావడం విశేషం. 2018లో న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ఆయన్ను స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. -
తల్లి త్యాగాలను వెలకట్టలేం
సాక్షి, అమరావతి: పురుషులు కన్నా మహిళలు మానసికంగా దృఢవంతులని, తన బిడ్డలను ప్రయోజకులుగా చేసేందుకు తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసి వెంకట నారాయణ భట్టీ అన్నారు. తల్లి త్యాగాలను వేటితోనూ వెలకట్టలేమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య సంయుక్తంగా శనివారం హైకోర్టు మహిళా న్యాయమూర్తులను, మహిళా సీనియర్ న్యాయవాదులను సన్మానించింది. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ భట్టీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కలిసి హైకోర్టు మహిళా న్యాయమూర్తులయిన జస్టిస్ బి.శ్రీభానుమతి, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, ఉపలోకాయుక్త పి.రజనీరెడ్డి, సీనియర్ న్యాయవాదులు కేఎన్ విజయలక్ష్మి, ప్రేమలత, అచ్చెమ్మలను జస్టిస్ భట్టీ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు బహూకరించారు. అనంతరం జస్టిస్ భట్టీ, ఆయన సతీమణి అనుపమలను హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య, ఇతర న్యాయవాదులు గజమాలతో, శాలువాలతో వేదమంత్రోచ్చరణ మధ్య ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహూకరించారు. అలాగే హైకోర్టు ఉద్యోగుల సంఘం, న్యాయవాద పరిషత్ తదితర సంఘాలు కూడా జస్టిస్ భట్టీని సన్మానించాయి. మదనపల్లి మాణిక్యం.. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ, జస్టిస్ భట్టీని ‘మదనపల్లి మాణిక్యం’గా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో తల్లి పాత్ర కీలకంగా మారిందన్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వేస్టేషన్ గతంలో అసాంఘిక శక్తులకు చిరునామాగా ఉండేదని, ఆ స్టేషన్ బాధ్యతలను మహిళలకు అప్పగించిన తరువాత దేశంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా మారిందన్నారు. మహిళా శక్తికి ఇదో నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, మహిళా న్యాయవాదుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు భాస్కరలక్ష్మి, అధ్యక్షురాలు కె.అరుణ, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, సిబ్బంది పాల్గొన్నారు. సమర్థత వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, వృత్తిపట్ల నిబద్ధత, నిజాయితీ, సమర్థత, కష్టపడేతత్వం వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాగలిగారని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని రూపుమాపేందుకు నిర్మాణాత్మక చర్యలు అవసరమన్నారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు అధికరణలున్నాయని, అవి సమర్థవంతంగా అమలయ్యేందుకు న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు ఉత్తర్వులిస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర ఈ సందర్భంగా జస్టిస్ భట్టీ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మహిళలదే కీలక పాత్ర అని చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి తన తల్లి, సోదరి, భార్యే కారణమన్నారు. తన తల్లి ఇచ్చిన ధైర్యం, తన సోదరి ఇచ్చిన సలహాలు, తన సతీమణి ఇచ్చిన మద్దతు కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని కావడం వల్లే తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయ్యానని చెప్పారు. ఏపీ హైకోర్టుకు సదా రుణపడి ఉంటానని, ఎల్లవేళలా ఈ హైకోర్టుకు అండగా ఉంటానని చెప్పారు. ఉద్యోగాల పేరుతో అమాయక యువతులను మానవ అక్రమ రవాణా ఉచ్చులో దించుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన మహిళా న్యాయవాదుల సమాఖ్య, రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థలను కోరారు. ఇందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. -
గీతాంజలి చివరి వీడియో
-
ఆలస్యంగా దక్కిన న్యాయం
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది. యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది. అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్‌ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్‌లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్‌పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది. నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం. ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు. అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా? కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు. కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి. -
సకాలంలో నివేదికలిస్తే బాధితులకు సత్వర న్యాయం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా అధికారులు సకాలంలో నివేదికలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జస్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజి్రస్టార్(లా) సురాజిత్ బృందం బుధవారం విజయవాడలో విచారణ నిర్వహించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులతో సమావేశమయ్యారు. అనంతరం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో 30 కేసులను విచారించి, తగిన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రూ.80 లక్షల మేర పరిహారం చెల్లింపులకు సిఫార్సు చేశామని తెలిపారు. 17 కేసుల్లో తుది ఉత్తర్వులు జారీ చేశామన్నారు. లైంగిక నేరాల కేసుల్లో బాలబాలికలకు నష్టపరిహారం విషయంలో పోక్సో కోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మానసిక ఆరోగ్యం, వెట్టి చాకిరీ, ఆహార భద్రత హక్కు, జ్యుడీషియల్–పోలీసు కస్టడీలో ఆత్మహత్యల నివారణ తదితర అంశాలపై కార్యాచరణ నివేదికలను సమర్పించాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై hrcnet.nic.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దుర్గమ్మ సేవలో జస్టిస్ అరుణ్ మిశ్రా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్‌మిశ్రా బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చిన జస్టిస్ అరుణ్మిశ్రాకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ ఈవో కేఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువ్రస్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
AP : జస్టిస్ రాకేష్ వివాదాస్పద తీర్పు రద్దు
ఏపీ హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన వివాదస్పద తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ డిసెంబర్ 31, 2020న జస్టిస్ రాకేష్‌కుమార్ ఒక తీర్పు ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పులో చేర్చిన జస్టిస్ రాకేష్.. దాన్నే తీర్పుగా పేర్కొనడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాళ ప్రకటించింది. కేసు పూర్వపరాలేంటీ? ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్ 31, 2020న ఓ తీర్పు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రాకేశ్‌కుమార్. శాసనవ్యవస్థమీదా, పోలీసు యంత్రాంగంమీద, మూడు రాజధానుల అంశంమీదా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేశ్‌కుమార్ వాటన్నింటిని తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టుపైనే ఎదురుదాడి దీంతో పాటు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంపైనా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు జడ్జిలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలిజీయంనే తప్పుబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? కేసుల విచారణ జాప్యంపై, అలాగే అమరావతి భూముల కేసులో జస్టిస్ రాకేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పు అంశాలనూ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ హైకోర్టు ఆరోపించడం జరికాదని సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు జడ్జిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించలేరని, వ్యవస్థలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుపట్టే ముందు.. తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్‌కుమార్ గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొంది. జస్టిస్ రాకేష్ కుమార్ పై ఆరోపణలేంటీ? వివాదాల్లో ఇరుక్కోవడం జస్టిస్ రాకేష్‌కుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్‌కుమార్ తీరును ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్టుకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ రాకేశ్‌కుమార్ కోర్టు ధిక్కరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టంతా అవినీతిమయమయిందని నిరాధార ఆరోపణలు చేసి విమర్శల పాలయ్యారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్ -
టెక్నాలజీతో న్యాయం మరింత చేరువ: సీజేఐ
రాజ్‌కోట్: ఆధునిక సాంకేతికత సాయంతో న్యాయాన్ని అందరికీ ప్రజాస్వామ్యయుతంగా చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నూతన జిల్లా కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. కృత్రిమ మేధతో పని చేసే టెక్స్ట్ టు స్పీచ్ ‘కాల్–ఔట్’ సిస్టమ్‌ను, ఈ–ఫైలింగ్ 3.0 ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. జిల్లా కోర్టుల ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. న్యాయం కోసం ముందుగా అక్కడికే వస్తారని గుర్తు చేశారు. పౌరుల హక్కుల సాధనకు జిల్లా కోర్టులే పునాదిరాళ్లన్నారు. ‘‘ద్వారకలోని సోమ్‌నాథ్ ఆలయం, పూరీలోని జగన్నాథాలయంపై ఉండే ధ్వజం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులందరినీ కలిపి ఉంచే మానవత్వానికి ప్రతీక. అలాంటి మానవత్వానికి రాజ్యాంగమే రక్ష’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
దానం ధర్మం
దానధర్మాలు ద్వంద్వ సమాసం. జంటగా కనపడతాయి. రెండూ ఒకటే అనుకుంటారు. ధర్మంలో దానం కూడా భాగం. దానం అంటే తన కున్నదానిని ఇతరులకు ఇవ్వటం. ‘ద’ అంటే ఇవ్వటం. ఆ ప్రక్రియ దానం. దానం, ధర్మం అనే రెండింటిని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అడుక్కునేవాడు ‘‘అయ్యా! ధర్మం చేయండి.’’ అంటాడు. తనకున్న దానిని లేనివాడికి పంచటం ధర్మాచరణలో భాగం అని అర్థం చేసుకోవాలి. ‘‘నీ కిదేమైనా ధర్మంగా ఉందా?’’ అని అడిగి నప్పుడు ధర్మం అంటే న్యాయం అని అర్థం చేసుకోవాలి. రసాయన శాస్త్రంలో ఉదజని ధర్మాలు అని అంటే దాని సహజగుణాలు అని అర్థం. ‘‘సూర్యుడు తూర్పున ఉదయించును’’ అన్నది ఏ కాలం అని వ్యాకరణంలో అడిగినప్పుడు తద్ధర్మ కాలం అని సమాధానం వస్తుంది. ఇక్కడ కర్తవ్యం, విధి, తప్పక చేయవలసినది అనే అర్థం. తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ధర్మంలో భాగం కనుక దానానికి పర్యాయ పదంగా ధర్మం అని అనటం జరుగుతోంది. దానం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలో పెద్దలు మనకి చెప్పారు. ‘‘శ్రియా దేయం హ్రియా దేయం, సంవిదా దేయం’’ అని. తనదగ్గర ఉన్న సంపదకి తగినట్టుగా ఇవ్వాలట. ఒక కోటీశ్వరుడు ఒక రూపాయి దానం చేస్తే ఎంత సిగ్గుచేటు? వంద సంపాదించే రోజుకూలీ రూపాయి ఇస్తే పరవాలేదు కాని యాభై ఇస్తే తన తాహతుకి మించింది. తరవాత కష్టపడతాడు. సిగ్గుపడుతూ ఇవ్వాలట. ఇంతకన్న ఇవ్వలేక పోతున్నాను అని. తానే సిగ్గు పడుతూ ఉంటే తీసుకున్నవారు ఇంకెంత సిగ్గుపడాలో! తెలిసి ఇవ్వాలట. ‘‘గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం’’ అన్నట్టు కాకుండా మన చేతిలో నుండి జారిపోయింది దానం అనుకో కూడదు. ఇస్తున్నాను అని ఎరిగి ఇవ్వాలట. ఎవరికి ఇచ్చేది కూడా తెలిసి ఉండాలి. అంతా అయినాక వీళ్ళకా నేను ఇచ్చింది అని, ఇంత ఎందుకు ఇచ్చాను అని బాధపడకూడదు. దానాలు చాలా కారణాలుగా, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. గ్రహదోషాలు ఉన్నాయి అంటే జపాలు తాము చేయలేరు కనుక ఎవరి చేతనైనా చేయిస్తారు. ఆ గ్రహానికి సంబంధించి కొన్ని వస్తువులు, ధనం దానం చేస్తారు. ఇది ప్రతిఫలాపేక్షతో చేసేది. ఒక రకమైన వ్యాపారం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొంతమంది ఆడంబరం కోసం దానాలు చేస్తూ ఉంటారు. తాము చేసిన దానిని ప్రకటించటం, ప్రచారం చేసుకోవటం, ఫోటోలు తీయించుకుని వార్తాపత్రికలలో వేయించుకుంటూ ఉండటం చూస్తాం. తీసుకున్న వారిని చులకనగా చూస్తూ తమకు కృతజ్ఞులై ఉండాలని ఆశించటం కనపడుతుంది. కొద్దిమంది ఎదుటి వారి అవసరం ఎరిగి అడగకుండానే దానం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. పైగా ఎవరికీ చెప్పనీయరు. కుడిచేత్తో చేసినది ఎడమ చేతికి తెలియ కూడదట. ఎందుకు దానం చేశావు అంటే నా దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర లేదు... అంటారు. తీసుకున్నవారు సంతోషించినప్పుడు ఆ భావతరంగాలు ఇచ్చిన వారిని స్పృశిస్తాయి. వీరిని ఆవరించి ఉన్న ప్రతికూల తరంగాలు తప్పుకుంటాయి. ఇవ్వటానికి మా దగ్గర ఏముంది? అని సన్నాయి నొక్కులు నొక్కుతారు కొందరు. తథాస్తు దేవతలుంటారు. తస్మాత్ జాగ్రత్త! ఏమీ లేక పోవుట ఏమి? ధనం మాత్రమేనా ఇవ్వదగినది? జ్ఞానం, శరీరం, ఆలోచన, మాట .. ఇట్లా ఎన్నో! తన జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానం లేకపోతే శరీరంతో సేవ చేసి సహాయ పడవచ్చు. అదీ చేత కాకపోతే మాట సహాయం చేసి సేద తీర్చవచ్చు. ఇది ధర్మమే కదా! ఈ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి పెద్ద పీట వేశారు. ధర్మమే మనలను ఎల్లప్పుడు కాపాడుతుంది. మనం చాలా శతాబ్దాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయాము. కాని ముష్కరులు మన ధర్మం మీద దెబ్బతీయలేక పోయారు. ధర్మగ్లాని దశలో మనం ఉన్నప్పుడు సాధుసంతులు, మహాత్ములు ఉక్కుగోడలా నిల్చొని ధర్మాన్ని కాపాడారు. అదే సమయంలో కొన్ని దేశాలు, సంస్కృతులు విదేశీయుల ఆక్రమణల కారణంగా నామరూపాలు లేకుండా పోయాయి. మనకు ఇతరులు ఏమి చేయకూడదనుకుంటామో అది ఇతరులకు మనం చేయకపోవడం సర్వోత్తమ ధర్మం. మన ప్రాచీన ద్రష్టలైన మునులు లోక కళ్యాణం కొరకు నిర్వచించిన ధర్మం, దాని ఆచరణ మనకు వారసత్వంగా ఒక తరం నుంచి ముందు తరానికి వస్తూ మన తరం వరకు వచ్చింది. అంటే ధర్మచక్రం ఏ తరంలోనూ ఆగిపోలేదు. ఈ తరంలో ఆగిపోతే తరువాత తరం వారు ధర్మ భ్రష్టులవుతారు. ధర్మచక్రం ఆగిపోతే ఈ జాతి మనుగడ ఉండదు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
Electoral bonds case: పలు సమస్యలున్నాయి!
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో పలు సమస్యలున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాలు పొందేందుకు పారీ్టలన్నింటికీ అవి సమానావకాశం కలి్పంచకపోతే వివక్షే అవుతుందని అభిప్రాయపడింది. ‘అంతేగాక ఈ పథకంలో అస్పష్టత కూడా దాగుంది. బాండ్లు కొనేవారి వివరాలు ఎవరికీ తెలియకుండా సంపూర్ణ గోప్యత పాటించడమూ వీలు కాదు. వారి వివరాలను సంబంధిత బ్యాంకు (ఎస్బీఐ), దర్యాప్తు సంస్థలు తెలుసుకునే వీలుంది’ అని అభిప్రాయపడింది. అంతేగాక విపక్షాల బాండ్లను కొనేవారిపై అధికార పక్షాలు ప్రతీకారానికి దిగకుండా ఎటువంటి రక్షణా లేదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఏ పార్టీ ఎంత పవిత్రమైనదో తేల్చడం మా ఉద్దేశం కాదు. ఎన్నికల బాండ్ల పథకానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్నదానిపై మాత్రమే విచారణ జరుపుతున్నాం’’ అని స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సీజేఐ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం రోజంతా విచారణ జరిపింది. ‘‘ఎన్నికల ప్రక్రియలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న ఈ పథకం ఉద్దేశం అభినందనీయమే. కానీ ఈ పథకంలో అతి పెద్ద సమాచార లోపముంది’’ అని అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు. -
21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం!
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 2002లో 14 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు న్యాయం కోసం పరితపించింది. అయితే 2014లో ఆమెకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ఈమె పనిచేస్తున్న కేఫ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యాసిడ్ బాధితురాలితో మాట్లాడారు. ఆమె తన కథను ఏడీజీ రాజీవ్ కృష్ణకు వివరించింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై కేసు నమోదు చేయించారు. జనవరి 2023లో ఈ కేసు అలీఘర్‌లోని ఉపర్కోట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఆరిఫ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2002లో అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోరావర్ వాలీ ప్రాంతంలో ఉంటున్న బాలికపై ఆరిఫ్ అనే యువకుడు యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆరీఫ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014లో యాసిడ్ బాధితులకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగాలు ఇచ్చారు. పోలీసు అధికారి రాజీవ్ కృష్ణ 2022, డిసెంబరులో ఈ కేఫ్‌కు వచ్చారు. అలీఘర్ బాధితురాలి కథ విన్న ఆయన కేసు దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆరిఫ్ దోషి అని తేలింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని జైలుకు తరలించారు. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
రాజ్ భవన్ లో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ జి.నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
-
జస్టిస్ రాకేష్ కుమార్ రాజీనామా
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) జ్యూడిషియల్ సభ్యుడు జస్టిస్ రాకేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రిబ్యునల్ పదవిలో భాగంగా జస్టిస్ రాకేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు గత వారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్, కేంద్ర న్యాయశాఖకు అందజేశారు. ఫినోలెక్స్ కేబుల్ కేసులో కోర్టు ధిక్కారణ చర్యలు ఎదుర్కొంటున్నారు జస్టిస్ రాకేష్‌కుమార్. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) ఫలితాలపై యధాతథా సిత్థిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, ఎన్సీఎల్ఏటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై సీజేఐ జస్టిస్ డీవీ చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ రాకేష్ కుమార్‌తోపాటు ఎన్సీఎల్ఏటీ టెక్నికల్ మెంబర్ అలోక్ శ్రీవాస్తపై కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశాలిచ్చారు. కాగా జస్టిస్ రాకేష్ కుమార్ గంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఏం జరిగింది? ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన కేసులో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ అలోక్ శ్రీవాస్తవలతో కూడిన బెంచ్ ట్రిబ్యునల్ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీ ఓనర్‌షిప్‌కు సంబంధించి ఇద్దరు సోదరులు ప్రకాష్ ఛాబ్రియా, దీపక్ ఛాబ్రియా మధ్య వివాదం నెలకొనడంతో విషయం ట్రిబ్యునల్‌కు చేరింది. కేసును విచారించిన జస్టిస్ రాకేష్‌కుమార్.. తాము తీర్పు వెలువరించేంతవరకు కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఫలితాలపై స్టే విధించింది. సుప్రీంకోర్టులో ఏం జరిగింది? AGMలో ఫలితాలను వెల్లడించొద్దంటూ ట్రిబ్యునల్‌లో ఇచ్చిన తీర్పును ఫినోలెక్స్ కేబుల్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను సెప్టెంబర్ 20, 2023న తొలగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్.. ట్రిబ్యునల్ ముందు ఉంచగా.. వాటిని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టుకు తెలిపారు పిటిషనర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్‌ను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టినట్టు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు ధిక్కరణ తేలడంతో రాజీనామా సుప్రీంకోర్టులో తాము చేసింది కోర్టు ధిక్కరణ అని తేలడంతో జస్టిస్ రాకేష్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన లాయర్ PS పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదని, అయితే కోర్టు ధిక్కరణ అని తేలినందున తన పదవి నుంచి జస్టిస్ రాకేష్‌కుమార్ తప్పుకున్నారని పట్వాలియా తెలిపారు. తనపై వచ్చిన అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఇప్పటికే రాజీనామా ఇచ్చినందున ఈ కేసును మూసివేయాలని పట్వాలియా సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఏం తేల్చింది? జస్టిస్ రాకేష్ తరపున పట్వాలియా చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా స్వీకరించారు. "NCLAT పదవికి, ఆర్థిక శాఖ లా సెక్రటరీ పదవికి జస్టిస్ రాకేష్‌కుమార్ రాజీనామా చేసినట్టు ఆయన తరపు లాయర్ పట్వాలియా ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నం జరిగిందని మేం నమ్ముతున్నాం. అక్టోబర్ 13న NCLATలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను చూశాం. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తన ఆదేశాలను మార్చేందుకు ట్రిబ్యునల్ ఆసక్తి చూపలేదు. అయితే ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నాం. " అని బెంచ్ తెలిపింది. జస్టిస్ రాకేష్‌కుమార్ గతమేంటీ? జస్టిస్ రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన సమయంలో అమరావతి రాజధాని అంశంపై ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో పలు వివాదస్పద వ్యాఖ్యలు జోడించడంమే కాకుండా.. రాజ్యాంగ సంక్షోభం అంటూ కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు సరికావని సూచించింది. -
టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!
Justice for journalist Soumya Vishwanathan యువ మహిళా టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. సంచలనం రేపిన ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు దోషిలుగా నిర్ధారించింది. రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను సాకేత్ కోర్టు దోషులుగా బుధవారం తేల్చి చెప్పింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ 2008 సెప్టెంబరు 30న ఢిల్లీలో తన కారులో గాయాలతో శవమై కనిపించారు. ఇది తొలుత యాక్సిడెంట్ కేసుగా నమోదుచేశారు. కానీ తలపై తుపాకీతో కాల్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ఆ తరువాత సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. 2009 మార్చిలో నిందితులను పోలీసులు అదుపులోకి విచారించగా సౌమ్యాను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. తుపాకితో కాల్చి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్ కుమార్, అజయ్ సేథిలను దోషులుగా తేల్చింది. అంతేకాదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టంలోని నిబంధనల ప్రకారం దోపిడి కేసులోనూ దోషులుగా పేర్కొంది. వీరిలో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్లను హత్య, దోపిడీ కేసులో దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి సహకరించినందుకు ఐదో నిందితుడు అజయ్‌ను కూడా దోషిగా ప్రకటించింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విచారణను అక్టోబరు 13న పూర్తిచేసిన సాకేత్ కోర్టు అడిషినల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే.. తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఈ నెల ప్రారంభంలో తమ వాదనలను పూర్తి చేయడంతో అదనపు వాదనలు లేదా వివరణల కోసం నాలుగు రోజులు సమయం ఇచ్చారు. ఎటువంటి అభ్యర్థనలు రాకపోవడంతో తీర్పును బుధవారం వెలువరించారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) పోయిన నా బిడ్డ ఎలాగూ తిరిగి రాదు,కానీ : తల్లి ఆవేదన కోర్టు తీర్పుపై సౌమ్యా విశ్వనాథన్ తల్లి మాధవి విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు ఎలాగూ చనిపోయింది.. ఆమె తిరిగి రాదు కానీ ఈ తీర్పు నేరస్థుల్లో భయాన్ని రేపుతుంది. లేదంటే వాళ్లు మరింత రెచ్చిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఈ కేసును విచారించిన పోలీసు అధికారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం వారికి జీవిత ఖైదు విధించాలని కోరారు. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) #WATCH | Journalist Soumya Vishwanathan murder case: Soumya Vishwanathan's parents in Delhi's Saket court for verdict in the case pic.twitter.com/95wY7t6OBd — ANI (@ANI) October 18, 2023 జిగిషాను హత్యచేసిన వాళ్లే సౌమ్యాను కూడా ఇది ఇలా ఉంటే కాల్ సెంటర్ ఉద్యోగి జిగిషా ఘోష్ హత్యలో వీళ్లేనేరస్థులు కావడం గమనార్హం. జిగిషా హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతోనే విశ్వనాథన్ హత్య కేసును కూడా ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో రవి కపూర్ అమిత్ శుక్లా లను తొలుత అరెస్టు చేశారు. అనంతర బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలతో పాటు వారిపై ఛార్జ్ షీట్ (జూన్ 2010) దాఖలు చేశారు. నవంబర్ 2010లో విచారణ ప్రారంభమైంది. విచారణ జూలై 2016లో ముగిసింది. కపూర్, శుక్లాలకు మరణశిక్ష, మాలిక్‌కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, జనవరి 2018లో కపూర్, శుక్లాల మరణశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే మాలిక్ జీవిత ఖైదును సమర్థించింది. -
మూడు రోజులుగా ఇంటి ముందు భార్య పడిగాపులు.. పట్టించుకోని భర్త
సాక్షి, జగిత్యాల జిల్లా: కృష్ణానగర్‌లో దారుణం వెలుగుచూసింది. ఇంటి ముందు వేచిచూస్తున్న భార్యను ఓ భర్త ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. మూడు రోజులుగా ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న ఆమెను పట్టించుకోలేదు. కాగా వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన లావణ్యతో, జగిత్యాలకు చెందిన గంగాధర్ కు 2017లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులతో భర్త గంగాధర్‌పై భార్య లావణ్య కేసు నమోదు చేసింది. వేధింపుల కేసులో జైలుకెళ్లిన గంగాధర్.. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చిన భర్తలో మార్పు వచ్చిందేమోనని భావించిన భార్య లావణ్య తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందే నిరీక్షిస్తూ ఉండిపోయింది. లావణ్యకు గత మూడు రోజులుగా ఇరుగుపొరుగువారు అన్నపానీయాలందిస్తున్నారు. -
భూకబ్జా వ్యవహారం.. సీఐ కాళ్లపై పడిన బాధితురాలు
వెల్దుర్తి(తూప్రాన్): అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తక్కువ ధరకు తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని, న్యాయం చేయాలని బాధితురాలు సీఐ కాళ్ల మీద పడి వేడుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన బొగ్గుల భిక్షపతి, జయలక్ష్మి దంపతులకు వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో 7.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో సుమారు నాలుగెకరాల స్థలాన్ని శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి అక్రమంగా కబ్జాచేశాడని, రక్షణ క్పలించాలని బాధితురాలు సోమవారం ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తూప్రాన్ సీఐ శ్రీధర్ మంగళవారం హస్తాల్పూర్ శివారులో విచారణ చేపట్టారు. తమ వ్యవసాయ బోరుబావిని సైతం స్వాధీనం చేసుకున్నాడని, అడిగితే బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. అదే గ్రామానికి చెందిన మరో రైతు కూడా నక్ష బాటను కబ్జా చేశాడని, పొలాల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ.. సీఐ శ్రీధర్ కాళ్ళమీదపడి బాధితురాలు ప్రాధేయపడింది. -
భర్త ఇంటి ముందు రెండో భార్య దీక్ష
చేజర్ల (సోమశిల): భర్త ఇంటి ముందు అతని రెండో భార్య దీక్షకు దిగిన ఘటన అనంతసాగరం మండలం రేవూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రేవూరుకు చెందిన పోలయ్య అనంతసాగరం విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పోలయ్యకు ఇది వరకే పెళ్లి అయింది. మనస్పర్థలు కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. దీంతో మస్తాన్‌బీ అనే మహిళ అతనికి దగ్గర కావడంతో 12 ఏళ్ల నుంచి సహ జీవనం చేస్తున్నట్లు తెలిపారు. పోలయ్య మరో పెళ్లి చేసుకుని మస్తాన్‌బీని వదిలించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకుని ఆమె ఈ విషయమై రెండు నెలల క్రితం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి భర్త పోలయ్య, అతని మూడో భార్య, బంధువుల మస్తాన్‌బీపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన అక్కడే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. -
ఈ గడ్డ నుంచి గర్వించదగ్గ న్యాయకోవిదులు వచ్చారు..
సాక్షి, హైదరాబాద్: ఈ తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వపడేలా ఎందరో న్యాయకోవిదులు వచ్చారని, వారి వారసత్వాన్ని కొనసాగించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి పిలుపునిచ్చారు. తనకు 30 ఏళ్లకుపైగా ఈ కోర్టుతో అనుబంధం ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తే న్యాయవాదులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్(హెచ్‌సీఏఏ) శుక్రవారం ఆయన్ను ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ భట్టి మాట్లాడుతూ తన అన్న న్యాయవాదిగా ఎన్రోల్ అయినప్పుడు తొలిసారి ఈ కోర్టుకు వచ్చానని, అప్పుడే న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మొదటి కోర్టు హాల్లో ఎక్కువగా ఉండటంతో లభించిన గుర్తింపు కూడా హైకోర్టు జడ్జి కావడానికి దోహదపడిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పలువురు న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, పీపీ రాజేందర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు, ప్రదీప్, దేవేందర్, నాగులూరి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
కుషాయిగూడ: న్యాయం కోసం కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఆఫెల్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ డ్రాస్టిక్ కోర్టుతో పాటు ఇతర కోర్టుల సముదాయాన్ని శనివారం ఆయన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కోర్టు అడ్మిమినిస్టేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్‌కుమార్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ అరాధే మాట్లాడుతూ, సత్వర న్యాయం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. న్యాయవ్యవస్థ పనితీరు ప్రభావవంతంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడే న్యాయస్థానాలపై విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టులో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని చీఫ్ జస్టిస్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్ జడ్జి బి.ఆర్. మధుసూదన్‌రావు, జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్, రిజిస్ట్రార్ జనరల్ తిరుమలదేవి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రఘునాథ్‌రెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రామచంద్రారెడ్డి, సెక్రటరీ ఎం.రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే!
తండ్రికీ కావాలి ప్రసూతి సెలవు తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వకతప్పదని, ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాలని జస్టిస్ విక్టోరియా గౌరి సూచించారు. నిజమే. తండ్రికి సెలవు భార్యభర్తల మధ్య అనేక చికాకులను దూరం చేయగలదు. ఒక పరిశీలన. బిడ్డకు జన్మనివ్వడమంటే సమాజానికి కొత్త సభ్యుణ్ణి ఇవ్వడమే. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు సంతానం కావచ్చు కాని సమాజానికి ప్రతినిధే. బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఆ తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో సమాజానిదీ అంతే బాధ్యత. కనేందుకు ఆస్పత్రి, పెంచేందుకు తండ్రికి కనీస ఆదాయం లేకపోతే సమాజం తప్పవుతుంది. గతంలో స్త్రీ ఇంటి పట్టునే ఉండేది. ఉమ్మడి సంసారాల్లో కాన్పులకు సులువుగా సాయం దొరికేది. కాని ఇప్పుడు ఇలా తాళి కడితే అలా విడిగా కాపురం పెట్టే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల పిల్లల్ని కనడం, పెంచడం చాలా పెద్ద బాధ్యతగా మారింది తల్లిదండ్రులకు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్నా ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావడం లేదు. సమాజం ఇంకా అంత‘నాగరికం’గా ఆలోచించడం లేదు. కాని తాజా ఘటన ఈ అంశాన్ని చర్చకు తెచ్చింది. కోర్టుకెక్కిన తండ్రి తమిళనాడులోని తెన్‌కాశీలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. దానికి కారణం అతని భార్య ఐ.వి.ఎఫ్. ద్వారా గర్భం దాల్చడమే. ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చితే కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సెలవు అడిగాడు. పరిస్థితి విన్న అధికారులు శాంక్షన్ చేశారు. కాని ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు. దాంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మంది. అధికారులు 30 రోజులు సెలవు మంజూరు చేశారు. కాని డెలివరీ మే 31న జరిగింది. దాంతో మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును కోరాడు. అధికారులు సెలవును పొడిగించకపోగా చెప్పాపెట్టకుండా విధులకు హాజరుకానందున ఎందుకు చర్య తీసుకోకూడదో జూన్ 22న వచ్చి వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టేస్తూ మగవారికి కూడా ప్రసూతి సెలవలు అవసరమని అభిప్రాయపడింది. ఆందోళన లేకుండా కాన్పు సమయంలో భార్యకు ఎంత ఆందోళన ఉంటుందో భర్తకూ అంతే ఆందోళన ఉంటుంది. రెండు ప్రాణాలు పరీక్ష సమయాన్ని ఎదుర్కొనే వేళ సహజంగానే లేబర్ రూమ్ బయట పురుషుడు ఒత్తిడికి లోనవుతాడు. అదొక్కటే కాదు బిడ్డ పుట్టాక భార్యకు శక్తి వచ్చే వరకు, బిడ్డ కుదుట పడేవరకు ఇంట్లో పనులు ఎన్నో ఉంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుళ్లు ఉంటాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి నుంచి ఫోన్ రాగానే కంగారు పడుతూ భర్తలు ఆ సమయంలో వేదన అనుభవిస్తారు. మరోవైపు తోడుండాల్సిన భర్త ఇంటి పట్టున లేకపోతే, డబ్బు సంపాదన ఎంత తప్పనిసరి అయినప్పటికీ, భార్యకు నిస్పృహ రావడం సహజం. రాత్రిళ్లు చంటి పిల్లల ఏడ్పు వల్ల ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాల్సిన భర్త నిద్ర చెడి చిరాకు పడితే ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లిన కేసులెన్నో. అందువల్ల భార్యతో పాటు భర్తకు సెలవులు ఇవ్వడం ఎంతో అవసరం. ‘కనేది ఆమె అయితే ఇతనికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టమైన రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాలంటే ఇలాంటి నాగరికమైన ఆలోచనలు తప్పక చేయాల్సిందే. సమయం వచ్చేసింది మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అన్నారు. ‘పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ, పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రసూతి సమయంలో తల్లితోపాటు తండ్రికీ సెలవులు ఇస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు సరితూగకపోయినా ఏదో ఒక మేరకు ఇస్తున్నాయి. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉంది. కాని ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు’. –జస్టిస్ విక్టోరియా గౌరి, మద్రాసు హైకోర్టు (చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు) -
డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం?
దేశంలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిపై 2004లో తన తండ్రి ఢిల్లీ వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశారని, తదనంతరం ఎదురైన పరిణామాలు ఇలా ఉన్నాయంటూ స్టోరీపిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు తన్మయ్ గోస్వామి ట్విట్టర్ మాధ్యమంలో పలు వివరాల తెలిపారు. తన తండ్రి విషయంలో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ వైద్యపరంగా నిర్లక్ష్యం వహించారంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని, ఇందుకుగాను రూ. 80 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తన తండ్రి అభ్యర్థించారన్నారు. ఇది జరిగి11 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని, 2015లో తన తండ్రి చనిపోయారన్నారు. అయితే వృద్ధురాలైన తన తల్లి ఈ కేసును విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నదని, సుదీర్ఘ పోరాటం అనంతరం 19 సంవత్సరాల తర్వాత ఈ కేసులో విజయం సాధించామని తెలిపారు. తొందరపాటుతో శస్త్రచికిత్స అసోంకు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం 19 సంవత్సరాల పాటు ప్రముఖ వైద్యసంస్థతో న్యాయపరంగా పోరాడి ఎలా గెలిచిందనే వివరాలను తన్మయ్ గోస్వామి తెలియజేశారు. తన తండ్రి 2004లో ఈపీఎస్ డయాగ్నస్టిక్ స్టడీ కోసం బాత్రా ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఈపీఎస్ అధ్యయనం అసాధారణంగా ఉంటే, రోగితో చర్చించిన తర్వాత ఆర్ఎఫ్ఏ చికిత్స కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆర్ఎఫ్ఏ ప్రమాదకరం లేదా ప్రాణాంతకం కావడంతో దానిని వైద్యులు సిఫార్సు చేయరు. అయినప్పటికీ బాత్రా ఆసుపత్రి కార్డియాలజిస్టులు తన తండ్రితో లేదా మా కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఆర్ఎఫ్ఏ చేశారన్నారు. ఇది కూడా చదవండి: భర్త మృతితో కలత.. కొద్దిసేపటికే భార్య కూడా కన్నుమూత! పేస్ మేకర్ సరిగా అమర్చకపోవడంతో.. అయితే ఈ చికిత్స కారణంగా తన తండ్రి ఆరోగ్యం విషమించిందని గోస్వామి తెలిపారు. దీంతో వైద్యులు తన తండ్రిని కాపాడేందుకు అతని ఛాతీలో పేస్ మేకర్ అమర్చాలని నిర్ణయించారు. దీంతో వైద్యులు తన తల్లికి ఫోన్ చేసి, వెంటనే ఢిల్లీకి రావాలని తెలియజేశారు. వారు చెప్పిన విధంగానే తన తల్లి ఢిల్లీ వెళ్లిందన్నారు. అక్కడి చికిత్స ముగిసిన కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారని, అయితే తన తండ్రి అనారోగ్యం నుంచి కోలుకోలేదన్నారు. తన తండ్రి ఛాతీ ప్రాంతం రోజురోజుకు ఉబ్బిపోవడాన్ని గమనించి, గౌహతిలో కార్డియాలజిస్ట్‌ని సంప్రదించామన్నారు. అప్పుడు ఆయన తన తండ్రిని పరీక్షించి, పేస్ మేకర్ సరిగా అమర్చలేదనే విషయాన్ని తెలిపారన్నారు. దీంతో తండ్రి ఛాతీలోని పేస్ మేకర్‌ను సరిచేయడానికి అతనికి అత్యవసరంగా అత్యవసర ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైందన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తరువాత.. వైద్యుల సలహా మేరకు తన తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందన్నారు. అనంతరం ఆయన బలహీనంగా మారి, పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. అయినా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించేవారన్నారు. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలోని బత్రా హాస్పిటల్‌పై వినియోగదారుల ఫోరమ్‌లో కేసు నమోదు చేశారన్నారు. తమ కుటుంబ న్యాయవాది ఈ కేసును చేపట్టారన్నారు. ఇది వినియోగదారుల న్యాయస్థానానికి సంబంధించిన ఉదంతం కనుక సత్వర న్యాయం జరుగుతుందని తామంతా భావించామన్నారు. చనిపోయే వరకూ న్యాయపోరాటం 2004 నుండి 2015 వరకు.. అంటే తన తండ్రి చనిపోయే వరకు కేసులోని ప్రతి విచారణ వాయిదాకు హాజరయ్యారన్నారు. కోల్‌కతా నుండి మా న్యాయవాది ఢిల్లీకి వచ్చేవారని, అతని ప్రయాణ, బస ఖర్చులను తామే భరించామని గోస్వామి తెలిపారు. ఈ విధంగా 19 సంవత్సరాల పాటు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయన్నారు. ఈ కేసు కోసం తమకు పెద్ద మొత్తంలోనే ఖర్చయ్యిందన్నారు. కేసు విచారణ సమయంలో పలు కారణాలతో విచారణ వాయిదా పడుతూ వచ్చిందన్నారు. వీటన్నింటినీ కూడా తాము ఎదుర్కొన్నామన్నారు. తన తండ్రి చనిపోయే వరకూ అంటే 11 సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేశారన్నారు. తన తండ్రి చనిపోయాక, బాత్రా హాస్పిటల్ కాస్త ఊపిరి పీల్చుకుందేమో.. కానీ మా తల్లి మాత్రం ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ సమయంలో తాను ఈ ఉదంతంలో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవడం మొదలుపెట్టానని గోస్వామి తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం! కేసు జాప్యం వెనుక సవాలక్ష కారణాలు ఈ కేసు ఇన్ని సంవత్సరాలు కొనసాగడం వెనుక పలు కారణాలున్నాయని గోస్వామి తెలిపారు. ఇది మెడికల్ కేసు కావడంతో వాదనకు న్యాయమూర్తులు సరిపోలేదు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ పలుకుబడి కూడా కేసు జాప్యానికి కారణంగా మారింది. దీనికితోడు ఉద్దేశపూర్వక జాప్యాలు, కోర్టు నుండి సాక్ష్యాలను ఉపసంహరించుకోవడం లాంటివి ఎదురయ్యాయన్నారు. అయితే తమ న్యాయవాది వినతి మేరకు కేసు విచారణలో స్వతంత్ర వైద్య బోర్డు అవసరమని కోర్టు కోరింది. మెడికల్ బోర్డు విచారణలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. In 2004, my dad filed a case of medical negligence against one of India's most powerful hospitals viz. Batra Hospital, Delhi and Padmashree awardee cardiologist Dr Upendra Kaul. Case was filed in the state consumer court, Delhi & my dad asked for a compensation of Rs. 80 lakh.… — Tonmoy Goswami (@protonycle) August 3, 2023 ఆధారాలను చూపలేకపోయిన ఆసుపత్రి వర్గాలు అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు తన తండ్రి ఆర్ఎఫ్ఏ చికిత్స విషయంలో తమ సమ్మతి తీసుకున్నట్లు పేర్కొంటూ బెంచ్‌ను గందరగోళపరిచేందుకు ప్రయత్నించాయి. ఇందుకు సాక్ష్యం అడిగినప్పుడు, వారు తరచూ ఈపీఎస్ సమ్మతి పత్రాన్ని సాకుగా చూపిస్తూ వచ్చారు. దీంతో కేసు ఆలస్యం అవుతూ వచ్చిందేగానీ, ముందుకు కదలలేదు. పైగా పీఎస్ సమ్మతి పత్రాన్ని తమకు ఇచ్చేశామని వారు కోర్టులో బుకాయించేవారని గోస్వామి తెలిపారు. ఎంతకాలం గడిచినా బాత్రా ఆసుపత్రి వర్గాలు ఆర్ఎఫ్ఏ పత్రాలను కోర్టుకు సమర్పించ లేకపోయాయి. ఎట్టకేలకు 2018లో తాము ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్‌లో కేసును గెలిచామన్నారు. కేసు దాఖలు చేసిన తేదీ నుండి 7% సాధారణ వడ్డీతో రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం బాత్రా ఆసుపత్రి వర్గాలకు ఆదేశించింది. అయితే తన తండ్రి కోరిన విధంగా రూ. 80 లక్షల పరిహారంతో పోల్చితే ఇది ఏమీ కానప్పటికీ, తాము ఈ కేసులో గెలిచినందుకు ఎంతో సంతోషించామన్నారు. కథ మళ్లీ మొదటికి.. అయితే అప్పటితో కథ ఆగిపోలేదని బాత్రా ఆసుపత్రి వర్గాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నేషనల్ కన్స్యూమర్ ఫోరమ్‌లో అప్పీలు చేశామని గోస్వామి తెలిపారు. దీంతో కేసు మొదటికి వచ్చింది. అయితే మరో 14 ఏళ్లు పట్టినా ఈ పోరాటం కొనసాగిస్తానని తల్లికి మాట ఇచ్చానని గోస్వామి తెలిపారు. అయితే మా న్యాయవాది నెగ్వివ్ అహ్మద్ ఈ కేసు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయినా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుని, విచారణలో ఎక్కువ వాయిదాలు పడకుండా కేసు త్వరగా ముందుకు కొనసాగేందుకు ప్రయత్నించారు. ఫలితంగా 2023లో ఈ కేసులో తాము మరోమారు గెలిచామని గోస్వామి తెలిపారు. అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు వారి పరపతి నిలబెట్టుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తాము భావించామన్నారు. అయితే 19 ఏళ్లలో తాము రెండుసార్లు విజయం సాధించిన నేపధ్యంలో బాత్రా ఆసుత్రి వర్గాల సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేయలేదని గోస్వామి తెలిపారు. భవిష్యత్ న్యాయ పోరాటాలకు స్ఫూర్తి ఎట్టకేలకు ఈ కేసు ముగిసినందుకు మా కుటుంబం సంతోషించింది. అయితే ఇంతటి సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా సాధ్యం కాదని తాను అర్థం చేసుకున్నానని గోస్వామి అన్నారు. తాము సాగించిన న్యాయపోరాటం భవిష్యత్తులో మరింతమంది రోగులకు న్యాయం అందిస్తుందని భావిస్తున్నామన్నారు. బాధితులు ఎవరైనా ఇటువంటి న్యాయపోరాటం చేసేటప్పుడు వారు గోస్వామి కుటుంబాన్ని గుర్తుంచుకుంటారన్నారు. నష్టపరిహారం సొమ్ముతో మంచి పని మాకు కోర్టు నుంచి అందిన పరిహారం మొత్తాన్ని మా అమ్మ ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుందన్నారు. మొదట్లో తాను బాత్రా ఆసుపత్రిపై కోపంగా ఉండేవాడనిని, ఈ ఆసుపత్రిలో మీ సొంతపూచీ కత్తుతో చేరాలని ఆసుపత్రి ముందు బోర్డు పెట్టాలని అనుకునే వాడినని అన్నారు. అయితే అటువంటి సందర్భంలో తన తల్లి తనను శాంతపరిచేదని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది
పంజగుట్ట: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లి వార్తల్లో నిలిచిన రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడంలేదన్నారు. అల్వాల్ హిల్స్, హైటెన్షన్ రోడ్డులో తనపేరుమీద, తన భార్య, భార్య సోదరి పేరుపై మొత్తం 3.31 ఎకరాల భూమి ఉందని, దీని పక్కనే మైనంపల్లికి చెందిన 1.9 ఎకరాల భూమి ఉందని, దీన్ని ఆధారంగా చేసుకుని తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. మైనంపల్లి అనుచరులు తనను చంపేందుకు యత్నిస్తున్నారని, అందుకే తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్, డీసీపీని కలిసి తనకు ప్రాణాపాయం ఉందని వివరించినట్లు తెలిపారు. సమావేశంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వినర్ ఆర్.కె.శ్రీనివాస్, బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతా యాదవ్, బీజేపీ నాయకులు జి.కె.హనుమంతరావు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. -
World Environment Day: ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నాం
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్‌తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
రెజ్లర్లకు న్యాయం జరిగేనా? అమిత్ షాతో భేటీ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్న భారత రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమ సమస్యను వివరించగా చట్టం తన పని తాను చేస్తుందని వారికి హామీ ఇచ్చారు. తొందరగా విచారణ చేయించండి... కొద్ది రోజులుగా భారత రెజ్లర్లు భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద కొన్నాళ్లపాటు సాగిన ఈ నిరసన నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున కీలక మలుపు తీసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఎలాగైనా ఆయనకు తమ గోడు చెప్పుకుందామని అటువైపుగా వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు భారత రెజ్లర్లపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఇన్నాళ్లుగా న్యాయంకోసం పోరాడుతుంటే ఎవరూ స్పందించకపోగా కేసులు పెట్టడం దారుణమని దీన్ని అవమానంగా భావించిన రెజ్లర్లు తాము సాధించిన పతకాలను గంగలో కలిపే ప్రయత్నం చేశారు. రైతు సంఘం నాయకులు నరేష్ తికాయత్ వారిని వారించగా ఆ ప్రయత్నాన్ని ఐదు రోజులపాటు వాయిదా వేశారు. దీంతో చివరి ప్రయత్నంగా రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియాన్ లు కేంద్ర హోంమంత్రిని కలిసి రెజ్లర్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్ పై త్వరితగతిన విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. అందుకు హోంమంత్రి స్పందిస్తూ... చట్టంపై నమ్మకముంచండి. చట్టరీత్యా జరగవలసింది జరుగుతుందని హామీ ఇచ్చారు. -
రెజ్లర్ల నిరసనపై నోరు విప్పిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే!
ఢిల్లీ: భారత రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.. కానీ న్యాయ ప్రక్రియ తర్వాతే అది జరుగుతుందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆందోళన చేపట్టి నెలదాటింది. పతకాలను గంగా నదిలో కలిపేస్తామని రెజ్లర్లు బెదిరించిన కొన్ని రోజుల తర్వాత అనురాగ్ ఠాకూర్ ఇలా స్పందించారు. 'ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తును ఆమోదిస్తుంది. బాధితులకు న్యాయం జరగాలని మనమందరం కోరుకుంటున్నాము. అయితే.. అది సరైన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. పక్షపాతానికి అవకాశమే లేదు. నిందితుడు ఎంపీ అయినందున కొంత ఆలస్యమవుతుంది.' అని ఠాకూర్ అన్నారు. దర్యాప్తు వేగంగా జరగాలని అందరం కోరుకుంటున్నామన్నారు. రెజ్లర్ల ప్రతి డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 'రెజ్లర్ అయినా మహిళ అయినా.. ఏదైనా అఘాయిత్యం జరిగితే బాధితులకు సత్వర న్యాయం జరగాలి' అని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి:రెజ్లర్ల అంశంపై రైతు నాయకుల మధ్య వాగ్వాదం..అరుస్తూ..ఒకరికొకరు వేళ్లు చూపుతూ.. -
భారత రెజ్లర్లకు బీజేపీ ఎంపీ మద్దతు.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’
మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే భారత రెజ్లర్ల వివాదంపై విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా భారత రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అయినా కూడా ఈ కేసులో విచారణ నత్తనడకన సాగడం దురదృష్టకరమని ప్రీతమ్ ముండే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా కాకుండా ఒక మహిళగా విచారణ వేగవంతం చేయమని కోరుతున్నానని తెలిపారు. పెరుగుతోన్న వ్యతిరేకత... భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భారత రెజ్లర్లు చేస్తోన్న నిరసన రోజురోజుకీ ఉధృత రూపం దాల్చుతోంది. స్వయంగా సొంత పార్టీకి చెందినవారే బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా ఈ కోవలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే చేరిపోయారు. విచారణ జరుగుతున్న తీరు విచారకరం... ఓ ప్రెస్ మీట్లో ప్రీతమ్ ముండే మాట్లాడుతూ.. ‘ఒక మహిళ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ముందు విచారణ చేపట్టాలి. అలా చేయకుండా కాలయాపన చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇంతకాలం వారు కష్టపడి సాధించిన పతకాలను గంగానదిలో వేయడానికి సిద్దపడ్డారంటేనే వారు ఎంత వ్యధను అనుభవిస్తున్నారో నాకు అర్ధమవుతోంది. వారి బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నేను బీజేపీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధినే అయినా కూడా ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరు పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. దయచేసి విచారణను వేగవంతం చేసి, వీలైనంత తొందరగా నిజానిజాలు తేల్చి వారికి న్యాయం చేయండి. ఒక ఎంపీగా కాకుండా ఒక మహిళగా అభ్యర్ధిస్తున్నాను’ అని అన్నారు. చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్.. -
పతకాలు ‘గంగ’పాలు కాలేదు!
హరిద్వార్: న్యాయం కోసం పోరాడుతూ వారంతా నెల రోజులకు పైగా నిరసన ప్రదర్శించారు...కానీ ఫలితం దక్కలేదు. పైగా పోలీసులు నిర్దయగా, అగౌరవంగా వారిని లాక్కెళ్లారు...ఆపై ప్రభుత్వంనుంచి కనీస స్పందన కూడా కనిపించలేదు. దాంతో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆ అగ్రశ్రేణి రెజ్లర్లు తమ కష్టానికి ప్రతిఫలమైన పతకాలను కూడా వద్దనుకున్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి గంగా నదిలో పడేయాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ చివరకు అది జరగలేదు. సన్నిహితుల సముదాయింపుతో చివరు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. హరిద్వార్‌లో సుదీర్ఘ సమయం పాటు ఈ హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం వందల సంఖ్యలో వచ్చిన మద్దతుదారులతో కలిసి చేతిలో పతకాలతో వీరంతా హరిద్వార్ చేరుకున్నారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మలిక్, బజరంగ్ పూనియా... ప్రపంచ చాంపియన్‌షి ప్లో పతకం సాధించిన వినేశ్ ఫొగాట్, సంగీత, వీరి బంధుమిత్రులు, అభిమానులు హర్ కి పౌరి వద్దకు చేరుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందేనని నిరసన చేపట్టారు. రెజ్లర్లు పతకాలను చేత పట్టుకొని గంగపాలు చేయాలనుకున్నారు. పలువురు బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకొని పవిత్రమైన గంగానదిలో ఇలాంటి చర్యలను అనుమతించమని వాదించారు. గంటా 45 నిమిషాల పాటు ఈ హైడ్రామా నడిచింది. రెజ్లర్ల సన్నిహితులు తీవ్రమైన నిర్ణయం వద్దని వారించడంతో చివరకు వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఐదు రోజుల్లోగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. -
ఆయనో జంటిల్మన్ జడ్జి
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ‘జెంటిల్‌మ్యాన్ జడ్జి’అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. 2019లో సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్ల కు పైగా సేవలందించిన జస్టిస్ మహేశ్వరి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ‘అలహాబాద్ హైకోర్టులో ఉన్నప్పటి నుంచి జస్టిస్ మహేశ్వరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం అలహాబాద్, లక్నో బెంచ్‌ల్లో ఉండేవాళ్లం. లక్నోలో ఆయన నా సీనియర్. జస్టిస్ మహేశ్వరి జెంటిల్‌మ్యాన్ జడ్జి, ఫ్రెండ్లీ జడ్జి’అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.‘విధుల్లో ఉండగా చివరిసారిగా నిగ్రహాన్ని ఎప్పుడు కోల్పోయారనే విషయం ఆయనకు కూడా గుర్తులేదని కచ్చితంగా చెప్పగలను. టెంపర్ అనేది జస్టిస్ మహేశ్వరి డిక్షనరీలోనే లేదు. ఆయన అంతటి సహనం, ప్రశాంతతలతో ఉంటారు’అని కొనియాడారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి ప్రసంగించారు. ‘ఇతరుల సహకారం లేకుండా ఏ వ్యక్తి ఈ విధులను నిర్వహించలేడు. మనమంతా కలిసి పనిచేశాం’అంటూ ఉద్విగ్నభరితమయ్యారు. సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జిల్లో జస్టిస్ మహేశ్వరి ఆరోవారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న సుప్రీంకోర్టులో జస్టిస్ మహేశ్వరి రిటైర్మెంట్తో జడ్జీల సంఖ్య 33కు తగ్గనుంది. ‘ఈ–ఫైలింగ్ 2.0’ ప్రారంభం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ–ఫైలింగ్ 2.0 సదుపాయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. దీనిద్వారా న్యాయవాదులు ఏ సమయంలోనైనా కేసులు ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయొచ్చన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ–ఫైలింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కేసులు ఫైల్ చేయడంతోపాటు తర్వాత వాటి స్థితిగతులను ఇతర కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల స్టేటస్‌ను సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు. -
మోదీ జీ "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!"
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే సుప్రీం కోర్టు జోక్యంతోనే బీజేపీ నేత శరణ్‌సింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ భారత రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద తమ నిరసనను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ..న్యాయం మీ అంగీకారం కోసం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ.. శరణ్ సింగ్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ కోరితే తాను రాజీనమా చేస్తానని శరణ్ సింగ్ చెప్పారు. కాబట్టి మోదీ ఇప్పుడైన ఆ ఎంపీని రాజీనామా చేయాలని ఆదేశించండి అని ప్రియాంక్ గాంధీ అన్నారు. మీరు అందుకు అంగీకారం తెలిపండి అని ప్రియాంక్ గాంధీ మోదీని కోరారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ జంతర్‌మంతర్ నుంచి నిరసనలు చేసిన ఏ ఒక్కరు ఇప్పటి వరకు న్యాయం పొందలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు కావాలంటే కోర్టు తలుపులు తట్టాలని అన్నారు. 90% మంది అథ్లెట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని విశ్వసిస్తున్నారు. హర్యానాలోని కొన్ని కుటుంబాలకు చెందినవారు ఆరోపణలు చేస్తున్నారని, వారంతా ఒకే ప్రాంతానికి(హర్యానాకి) చెందని వారని అన్నారు. హర్యానా నియోజకవర్గం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా దీనికి కారణమని ఆయనే వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ రెజ్లర్లు రోజుకో డిమాండ్‌తో ముందుకు వస్తున్నారంటూ విమర్శించారు. మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. తర్వాత పదవికి రాజీనామా, జైలుకి పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తాను పదవికి రాజీనామ చేస్తే రెజ్లర్లు చేసిన ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందన్నారు. అందువల్ల తానను చేయనని కరాకండీగా చెప్పారు. అయినా తాను ప్రజల వల్ల తన నియోజకవర్గానికి ఎంపీ అయ్యానని, వినేష్ ఫోగట్ వల్లకాదని అన్నారు. కేవలం ఆ ఒక్క రాష్టానికి చెందిన కొన్ని కుటుంబాల అమ్మాయిలు మాత్రమే ఎందుకు నిరసనలు చేస్తున్నారని నిలదీశారు. మిగతా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హర్యానాకు చెందిన 90 శాతం మంది ఆటగాళ్లు తనతోనే ఉన్నారని శరణ్ సింగ్ చెప్పారు. కాగా, రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత శరణ్‌సింగ్‌పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: మన్ కీ బాత్ మొత్తం ఎపిసోడ్లకు రూ. 830 కోట్లు! ట్వీట్ దుమారం) -
1998లో డీఎస్సీ రాశారు.. ఎన్నో ట్విస్ట్ ల తర్వాత .. కథ శుభం
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్పీ– 1998 అభ్యర్థుల కల ఫలిచింది. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అధికారం వచ్చిన వెంటనే క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాల్లో వెలుగు నింపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు రాసి, అర్హత సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో, మంచి మనసున్న ఏ ముఖ్యమంత్రి తమ గోడు ఆలకించకపోతారా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పిస్తున్నట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా జిల్లాల వారీగా క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలు సేకరించింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఈనెలలోనే దానిని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఈనెల 13లోపు పోస్టింగ్స్ కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా విద్యాశాఖాధికారులు చర్యలు ప్రారంభించారు. కాగా ఉద్యోగ నియామక పరీక్షలు రాసిన 25 ఏళ్ల తరువాత ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంపై అభ్యర్థులు ఆనందోత్సాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యాశాఖాధికారులు గతేడాది అక్టోబర్‌లో గుంటూరు నగరంలో క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 229 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ఈనెల 12వ తేదీలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన దృష్ట్యా, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మినిమం టైం స్కేల్‌పై ఉపాధ్యాయులుగా నియమితులైన అభ్యర్థులను అవసరమైన పాఠశాలల్లో నియమిస్తామని చెప్పారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితాను htts://doefnt.bofrpot.com సైట్లో ఉంచినట్లు చెప్పారు. అభ్యర్థులు ఈనెల 12న ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఐదు పాస్‌పోర్ట్ ఫోటోలు, డీఎస్సీ–1998 హాల్ టిక్కెట్‌ను తీసుకుని గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న డీఈవో కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. -
క్యాపిటల్ దాడులకు సపోర్ట్ చేస్తూ..'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ ట్రంప్ పాట
అమెరికాలోని జనవరి 6న క్యాపిటల్‌పై జరిగిన దాడులకు మాజీ అధ్యోడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. నాటి అల్లర్లకు పాల్పడిన దోషులుకు సపోర్ట్ చేస్తూ 'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ పాటను ఆలాపించారు. దీన్ని స్పూటీఫై,యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ వంటి వాటిల్లో స్ట్రీమింగ్ పాటగా అందుబాటులో ఉంచారు. దీంతో ట్రంప్‌కి ఈ పాటను స్వరపరిచిన ఘనతను కూడా లభించింది. వాస్తవానికి ఇది క్యాపిటల్ దాడులకు సంబంధించిన ఆరోపణలపై జైలులో ఉన్న ట్రంప్ మద్దతుదారుల కుటుంబాలను ఆదుకోవాడనికి నిధులు సేకరించే ప్రయత్నంలో భాగంగా ఈ పాటను రికార్డు చేశారు. ఈ మేరకు ట్రంప్ నాటి అల్లర్లుకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల బృందం స్వచ్ఛంద సంస్థకు సహకరించారు. ఆ పాట చివర్లో ఖైదీలు యూఎస్ఏ అని ఉంటుంది. ఈ పాట విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. ఐతే నేఈ పథ్య పాట ఖైదు చేయబడిన వారి కుటుంబాల కోసం డబ్బును సేకరించడానికి ఉద్దేశించిందే కావచ్చు గానీ పోలీసు అధికారిపై దాడి చేసిన కుటుంబాలకు మాత్రం ప్రయోజనం చేకూరదని అని ఫోర్బ్స్ మ్యాగ్జైన్ పేర్కొంది. అంతేగాదు ట్రంప్ ఈ పాటను ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో రికార్డ్ చేశారు. ఖైదీలు తమ పాటలను జైలు ఫోన్లో రికార్డ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా, నాటి దాడిలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లలో గాయపడిన పోలీసులు, ఇతరులు ఆయనపై దావా వేయవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. అతేగాదు ట్రంప్ వైట్‌హౌస్ నుంచి బయలుదేరడానికి రెండు వారాల ముందే ఈ అల్లర్లు జరిగాయి. (చదవండి: స్కిన్ క్యాన్సర్ నుంచి విజయవంతంగా బయటపడ్డ బైడెన్..ఇక ఎలాంటి..) -
ఎన్.ఆర్.ఐ భర్తల మోసం చెల్లదు
పంజాబ్‌లో‘హనీమూన్బ్రైడ్స్’ అనే మాట వినిపిస్తూ ఉంటుంది.అంటే పెళ్లి చేసుకున్న ఎన్.ఆర్.ఐలుకాపురానికి తీసుకెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగాకాపురం చేసి ఆ తర్వాత పెళ్లికూతుళ్లను పుట్టింటికి తరిమేస్తారు.సత్వీందర్ కౌర్ కూడా అలాంటి బాధితురాలే.కాని ఆమె ఊరికే ఉండలేదు.లూధియానాలో ఒక సంస్థ స్థాపించిఎన్ఆర్ఐ బాధితమహిళలకు న్యాయం జరిగేలా చూసింది.న్యాయం జరగాలంటే ఏం చేయాలో కూడా చెబుతోంది. పంజాబ్, హరియాణాలలో ఎన్.ఆర్.ఐ భర్తలు మోసం చేసిన భార్యల సంఖ్య ప్రస్తుతం ఎంత ఉంటుందో ఊహించండి. 32,000. పెళ్లి చేసుకుని ఉద్యోగాలు విదేశాలలో తెచ్చుకుని మాయమైన ఎన్.ఆర్.ఐలు కొందరైతే విదేశాల్లో ఉంటూ ఇక్కడకు వచ్చి పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కాపురం చేసి ఆ తర్వాత ఉడాయించిన వాళ్లు కొందరు. వీరి గురించి ఆరా తీస్తూ, ఎదురు చూస్తూ, వారిని శిక్షించాలని ప్రయత్నిస్తూ పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే ఈ వివాహితులను అక్కడ ‘హనీమూన్ బ్రైడ్స్’ అంటూ ఉంటారు. విషాదం ఏమంటే వీరి సగటు వయసు 22 నుంచి 65 వరకూ ఉండటం. ముప్పై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని విదేశాలకు పా రిపోయిన భర్తల కోసం ఎదురు చూస్తున్న మహిళలు ఇంకా అక్కడ ఉన్నారు. వారందరికీ ఒక ఓదార్పు లూధియానాలో ‘అబ్ నహీ’ సంస్థను నడుపుతున్న 41 ఏళ్ల సత్వీందర్ సింగ్. స్వయంగా బాధితురాలు లూధియానాకు చెందిన సత్వీందర్ సింగ్ టీచర్‌గా పని చేసేది. టీచర్ సంబంధమే వస్తే 2009లో వివాహం చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత భర్త విదేశాలలో ఉద్యోగం వచ్చిందని జార్జియా వెళ్లాడు. అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్లాడు. సత్వీందర్ అత్తారింటిలోనే ఉండిపోయింది. ఐదేళ్ల తర్వాత 2015లో తిరిగి వచ్చిన భర్త ఆమెను అత్తారింటి నుంచి ఒక అద్దె ఇంటికి మార్చి ఒక నెల ఉండి మళ్లీ ఉక్రెయిన్‌కు వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళతాను అనే దొంగ హామీ మీద. కాని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతోటే ‘ఇక నీకూ నాకూ సంబంధం లేదు’ అని ఫోన్ చేసి చెప్పేశాడు. సత్వీందర్ వెంటనే అత్తామామల దగ్గరకు వెళితే వాళ్లు ముఖాన తలుపులు వేసేశారు. ఒక సంవత్సరం పా టు చేష్టలుడిగి ఉండిపోయిన సత్వీందర్ ఆ నిద్ర నుంచి మేల్కొని న్యాయం కోసం గట్టిగా పట్టుబట్టింది. భర్త మీద, అత్త మామల మీద సెక్షన్ 406, 498ల కింద కేసు పెట్టింది. కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేస్తే నెలకు 10 వేలు మంజూరయ్యాయి. 2018లో భర్త పా స్పోర్ట్ సీజ్ అయ్యేలా చూసింది. ఇవన్నీ చిన్న విజయాలు కావు. తనలాంటి వారి కోసం ఆ సమయంలో కోర్టు దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర తన లాంటి వివాహితలు మరికొంత మంది కనిపించేవారు సత్వీందర్‌కు. ‘ఇంతమంది ఉన్నారా... వీరందరి కోసం ఏదైనా చేయాలి’ అని ‘అబ్ నహీ’ సంస్థ స్ధాపించింది. చిన్న చిన్న సమావేశాలు పెట్టి ఇలాంటి బాధిత మహిళలను సమీకరించడం మొదలెట్టింది. ఈమె చేస్తున్న పని ఆ నోటా ఈ నోటా తెలిసి బాధితులు రావడం మొదలెట్టారు. అయితే ఇది అంత సులభం కాదు. పా రిపోయిన కుర్రాళ్ల కుటుంబాలు ఈమె చేసే నిరసన కార్యక్రమాలకు, పెడుతున్న కేసులకు ఆగ్రహించేవి. శాపనార్థాలు పెట్టేవి. తన్నబోయేవి. అయినా సత్వీందర్ జంకకుండా తన పోరాటాన్ని కొనసాగించింది. ఎన్.ఆర్.ఐ సెల్స్ ద్వారా మహిళా కమిషన్ ద్వారా బాధితులకు మద్దతు దొరికేలా చేసేది. అంతేకాదు, జాతీయ గురుద్వారా కమిటీ ద్వారా విదేశాలలో ఉన్న గురుద్వారాలకు ఇలా పా రిపోయిన వరుల వివరాలు తెలుపుతూ తాకీదులు అందేలా చేసింది. అంటే అక్కడ ఉన్న వారి గురించి కనీసం అక్కడ ఉన్న పంజాబీలకు తెలిసేలా చేయగలిగింది. కొందరు భర్తలు ఏ దేశాల్లో అయితే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడి లీగల్ సెల్స్‌కు అదే పనిగా ఈ మెయిల్స్ పంపి ఫిర్యాదు చేస్తుంది. విదేశాంగ శాఖకు పదే పదే వినతి చేయడం వల్ల ఆ శాఖ కూడా రంగంలో దిగి ఇలాంటి కేసులు నమోదైన భర్తల పా స్పోర్ట్ల వివరాలను సేకరించి అవసరమైతే సీజ్ చేసే చర్యలు చేస్తోంది. ఇప్పటికి 700 మంది సత్వీందర్ సింగ్ ఇప్పటికి 700 మంది వివాహితలకు ఏదో ఒక మేర న్యాయం అందేలా చేసింది. అలాగే భర్తలను విడిచిపెట్టి ఉడాయించిన భార్యల బాధితులైన 40 మంది భర్తలకు కూడా న్యాయం అందడానికి పోరాడుతూ ఉంది. ‘భార్యను విడిచి వెళ్లిపోయిన భర్తల కేసుల్లో ఇరుపక్షాలను కూచోబెట్టి సమస్య కనుక్కుంటే చాలా కేసులు విడిపోయే దాకా వెళ్లకుండా ఆపొచ్చు. కొన్నింటిలో మాత్రం మోసగాళ్లు ఉంటారు. వారికి శిక్ష పడేలా చేయాలి.’ అంటుంది సత్వీందర్. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా బాధితులను గుర్తించి వారికి సహాయం అందేలా చేయడానికి ప్రయత్నిస్తోందామె. ‘మన పోలీసులు దేశంలో లేకుండా పోయిన వారంటే ఏమీ చేయలేము అన్నట్టు చూస్తుంటారు. కాని అలా విదేశాలకు పారిపోయిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది అనే విధంగా చర్యలు ఉంటే ఎన్.ఆర్.ఐల ఆగడాలు ఆగుతాయి’ అంటుంది సత్వీందర్. పంజాబ్, హరియాణాలలో అయితే సత్వీందర్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు ఎందరు ఉన్నారో తెలియాల్సి ఉంది. వారి కోసం సత్వీందర్లాంటి వాళ్ల అవసరం తప్పక ఉంటుందని వేరే చెప్పాలా? -
పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయండి: కాంగ్రెస్
హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకపు పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు తీర్పు ప్రకారం అభ్యర్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ పోలీసు బోర్డులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సమర దీక్ష నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతలు విచ్చేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు మాట్లాడుతూ బోర్డు నిర్ల క్ష్యం కారణంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య ర్థులు నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శివసేనా రెడ్డి మాట్లాడుతూ... బోర్డు ఇచ్చిన తప్పుడు ప్రశ్నల వల్ల ఏడు మల్టిపుల్ ప్రశ్నల మార్కులను అభ్యర్థులకు కలపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. హైకోర్టు తీర్పు అమలు చేస్తే దాదాపు 70 వేల మంది అభ్యర్థులకు న్యాయం జరిగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, నేతలు ప్రవళిక నాయక్, శివకుమార్ రెడ్డి, వెంకట్, మాతం ప్రదీప్, సునీత, దివ్య పాల్గొన్నారు. -
గట్టివాళ్లే చట్టానికి గౌరవం
నాటి పాలకులు దేశంలో ‘ఎమర్జెన్సీ విధించి, న్యాయవ్యవస్థకే సవాలుగా పరిణమించినప్పుడు... జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా ఒక్కరు మినహా మొత్తం సుప్రీంకోర్టు యావత్తూ అచేతనంగా ఉండిపోయిందన్న విమర్శలు వచ్చాయి. అలాంటి రోజులు ‘మళ్లీ ఇప్పుడు దాపురించాయా అనిపిస్తోంది’ అని జస్టిస్ ఎ.పి. షా తన తాజా వ్యాసంలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత పాలకులు ఇందిరాగాంధీలా సూటిగా తలపడినట్టు కన్పించకపోవచ్చుగానీ, ప్రజాస్వామ్య సంస్థలను నర్మగర్భంగా శక్తిహీనం చేస్తూ పౌరహక్కులకు భంగం కలిగించడం చూస్తున్నామని ఆ వ్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో.. ఇటీవల కొందరు గట్టివాళ్ళ హయాంలలో కోర్టు తన వాణిని బలంగా వినిపించగలగడం న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఆర్థిక నేరాలను, దొంగచాటు ద్రవ్య లావాదేవీలను, సంబంధిత నేరాలను పసిగట్టి సాధికారికంగా బహిర్గతం చేసి.. దేశాలను, ప్రభుత్వాలను హెచ్చరించడానికి ప్రసిద్ధ న్యాయ నిపుణు లతో ప్యారిస్ కేంద్రంగా ఏర్పడి పనిచేస్తున్న ఫ్రెంచి ఎన్జీవో సంస్థ ‘షెర్పా’! యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండాలలోని పౌర సమాజాల సాంఘిక సంస్కరణోద్యమాలకు ఈ సంస్థ బాసటగా నిలుస్తోంది. ఇదే నిపుణుల సంస్థ రాఫెల్ కొనుగోలు వ్యవహారంలోని చీకటి కోణాలను కూడా వెలికి తెచ్చింది. 2015 నుంచీ పనిచేస్తున్న ‘రిలయెన్స్ డిఫెన్స్ లిమిటెడ్’ కంపెనీ.. ‘దస్సాల్ట్’ అనే ఫ్రెంచి విమాన కంపెనీతో అనుసంధానమై 36 రాఫెల్ జెట్ విమానాలను భారత ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసింది. రిలయెన్స్ కంపెనీ అధిపతి అనిల్ అంబానీ 2019లో ప్రకటించిన లెక్కల ప్రకారం అప్ప టికి అతనికున్న అప్పులు రూ. 93,000 కోట్లు. కాగా, 2020లో ఒక కేసు సందర్భంగా లండన్ కోర్టులో ఆయన వెల్లడించిన తన ఆస్తి విలువ ‘సున్న’ (జీరో)! అలాంటి ‘జీరో’ ఆస్తిపరుడి కంపెనీ ద్వారా ఫ్రెంచి దస్సాల్ట్ విమాన కంపెనీ 36 రాఫెల్ జెట్ విమానాలను ఎలా అమ్మగలిగిందన్న అంశం బట్టబయలు కావడంతో, రిలయెన్స్ కంపెనీ లావాదేవీలతో ముడిపెట్టుకున్న భారతపాలకుల మెడకు చుట్టుకొంది. ప్రభుత్వం ఈ క్షణం దాకా రాఫెల్ కుంభకోణం నుంచి బయట పడకపోగా భారతదేశ ప్రయోజనాలకు హానికరమైన అంతర్జాతీయ లావాదేవీలలో కూరుకుపోయిందని ‘షెర్పా’ బహిర్గతం చేసింది. ‘షెర్పా’ సంస్థ విఖ్యాతికి రెండే రెండు ఉదాహరణలు ఒకటి: సిరియా మాజీ వైస్–ప్రెసి డెంట్ రిఫాత్ అల్ అసాద్ ‘మనీ లాండరింగ్’ కుంభకోణాలను ‘షెర్పా’ బట్టబయలు చేయడంతో అసాద్‌కు ప్యారిస్ కోర్టు నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష వేసింది. రెండు: ఫ్రాన్స్‌లో టెర్రరిస్టు లకు భారీగా చందాలిచ్చి ప్రోత్సహిస్తున్న పెద్ద కంపెనీ లఫార్గే కార్య కలాపాల్ని 2018లో బహిర్గతం చేసి కంపెనీ ఉద్యోగుల ప్రయోజనాల్ని షెర్పా రక్షించగల్గింది. రాఫెల్ విమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీలకు బదులుగా.. అప్పటికే దేశీయంగా అత్యుత్తమ నాణ్యతా సేవలందిస్తున్న భారీ ప్రభుత్వరంగ విమాన సంస్థ ‘భారత హిందు స్థాన్ లిమిటెడ్’ సేవలను పాలకులు ఎందుకు వినియోగించుకో లేదన్నది ప్రధాన ప్రశ్న. దీంతోనే షెర్పా ఈ రిలయెన్స్ ఒప్పందం వెనుక ఏం జరిగిందన్నదానిపై దృష్టి సారించింది. ఈ కాంట్రాక్టులో ఎలాంటి అనుమానానికి తావులేని అవినీతి జరిగిందని, కాంట్రాక్టుపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాల్సిందేనని రాహుల్ గాంధీ కోరిన విషయమూ తెలిసిందే. కానీ, ప్రభుత్వం విచారణకు నిరాకరించడంతో, రిలయెన్స్ కంపెనీ ద్వారా కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగింది. తద్వారా అనుమానాలు ధ్రువపడ్డాయి. అందుకే ‘షెర్పా’ సంస్థ స్వతంత్రమైన న్యాయమూర్తి ద్వారానే బీజేపీ– రిలయెన్స్ సంబంధాల లోతుపాతుల్ని పరిశీలించడం దేశ ప్రయోజ నాల దృష్ట్యా అవసరమని చాలాకాలంగా కోరుతోంది. అంతేగాదు, రిలయెన్స్ ద్వారా ప్రస్తుత పాలకులు కుదుర్చుకున్న ‘రాఫెల్’ ఒప్పం దంలో అవినీతిని కనిపెట్టే ఏ క్లాజుకూ అవకాశం లేకుండా జాగ్రత్త పడటం జరిగిందని ‘హిందూ’ పత్రిక కూడా రాసిందని ‘షెర్పా’ పేర్కొంది. ఒక్క ముక్కలో ‘భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే అంతర్జాతీయ అవినీతి శక్తులకు ప్రతిబింబమే రాఫెల్ ఒప్పందమ’ని షెర్పా ప్రకటించింది. షెర్పాకు ఇంత బలాన్ని చేకూర్చింది ఆ సంస్థ లోని న్యాయ నిపుణులేనన్నది ఇక్కడ గమనించాలి. ఈ పరిణామాల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, భారత లా కమిషన్ మాజీ అధ్యక్షులు, ఢిల్లీ, మద్రాసు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అజిత్ ప్రకాష్ షా తాజా హెచ్చరికను కూడా భారత రాజ్యాంగ మౌలిక నిబంధనలను, సత్యాలను రక్షించుకోగోరే వారంతా పరిగణనలోకి తీసుకోవాలి. ఇటీవల నూతనంగా దేశ ఉపరాష్ట్రపతి పదవిలోకి వచ్చిన జగదీప్ ధంకర్, కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజూ భారత సుప్రీం కోర్టుపైన, కొలీజియం వ్యవస్థ పైన అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరికి భారత మౌలిక రాజ్యాంగ వ్యవస్థ రక్షణకు దోహదం చేసిన సూత్రాలను కూడా విస్మరించి దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినే ప్రశ్నించే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని జస్టిస్ షా ఖండించాల్సి వచ్చింది. ‘‘ఈ ధోరణి 2014 నుంచీ సాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు అనేది రాజ్యాంగ పరిరక్షకురాలు, చట్టాన్ని శాసించే శక్తి అని మరువరాదు’’ అని జస్టిస్ షా పేర్కొన్నారు. దేశంలో ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ విధించి, దేశ న్యాయ వ్యవస్థకే సవాలు విసరడానికి పూనుకున్నప్పుడు, పౌర హక్కులు తుడిచిపెట్టుకు పోతున్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా ఒక్కరు మినహా మొత్తం సుప్రీంకోర్టు అలా చూస్తూ ఉండిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి రోజులు మళ్లీ ఇప్పుడు దాపురించాయా అనిపిస్తోంది’’ అని జస్టిస్ షా గుర్తు చేయవలసి వచ్చింది. ప్రస్తుత పాలకులు ఇందిరా గాంధీలా సూటిగా తలపడినట్టు కన్పించకపోవచ్చుగానీ, ప్రజాస్వామ్య సంస్థలను నర్మగర్భంగా శక్తిహీనం చేస్తూ పౌరహక్కులకు భంగం కలిగించడం చూస్తున్నామని జస్టిస్ షా తాజా వ్యాసంలో పేర్కొన్నారు. ‘‘2014 తర్వాత దేశంలో ‘లోక్‌పాల్’ వ్యవస్థ కనుమరుగు అయి పోయింది. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ నేడు కనపడదు. ఉన్న విచారణ సంస్థలు పేరుకే! పైగా వాటిని ఇప్పుడు ప్రభుత్వ చర్యలను విమర్శించి లేదా నిరసన తెలిపే ప్రజా కార్య కర్తలు, జర్నలిస్టులు, విద్యార్థులు, రాజకీయ ప్రత్యర్థులపైన ప్రయోగి స్తున్నారు’’ అని జస్టిస్ షా పేర్కొన్నారు. రానురాను కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజీపడే దుఃస్థితికి చేరిందని, ఇక సమాచార కమిషన్ కూడా జీవచ్ఛవం అయిందనీ, ఇలా బాధ్యతలు చాలించుకున్న సంస్థల జాబితా పెరిగిపోతోందని, చివరికి పత్రికలు, పౌర సంస్థల కార్యకలాపాల్ని కూడా బలహీన పరిచి విశ్వవిద్యాలయాల్ని నిర్వీర్యం చేయడం జరుగుతోందనీ జస్టిస్ షా ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా దేశ పాలక వర్గ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జస్టిస్ ఎ.పి. షా ఘాటుగా విమర్శించారు. ఎటుతిరిగీ ఇటీవల ప్రధాన న్యాయమూర్తులుగా పదవులు స్వీకరించిన జస్టిస్ ఎన్.వి. రమణ, లలిత్, డి.వై. చంద్రచూడ్‌ల హయాంలలో కోర్టు తన వాణిని బలంగా వినిపించగల్గుతోందని జస్టిస్ షా చెబుతూ తన నమ్మకాన్ని ఇలా ప్రకటించారు: ‘‘నేడు సుప్రీంకోర్టు మంచి న్యాయ మూర్తుల చేతులలో ఉంది. పాలకుల ఒత్తిళ్లకు లొంగకుండా వారు పనిచేస్తున్నారు. అప్పటికీ పాలకులు దారికి రాకపోతే, దేశ చట్టాన్ని గౌరవించి తీరాలని వారికి తెలియచెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికీ ఇదే మార్గం’’ అని జస్టిస్ షా దిశానిర్దేశం చేశారు. ఈ సదవగాహన దృష్ట్యా చూస్తే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించిన మరుక్షణం నుంచీ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, ఆయన సోదర న్యాయమూర్తులు.. ‘దేశంలో పౌరుల స్వేచ్ఛ, తదితర హక్కులకు న్యాయ స్థానాలే రక్ష అని పురుద్ఘాటించారని భావించాలి. ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ వచ్చి భారత ప్రజలు పోరాటాల ద్వారా సాధించుకున్న సమాచార హక్కు చట్టాన్ని గత ఎనిమిదేళ్లుగా పాలకులు చాపచుట్టి పక్కన పడేశారన్న విమర్శ ఉంది. ఆ చట్టాన్ని తు.చ. తప్పక సద్వినియోగం చేసిన పర్యవ సానంగా పాలకుల ఒత్తిళ్లను ఎదుర్కొన్న ఒక జాతీయ కమిషనర్.. ‘సమాచార హక్కు కోసం’ ప్రజలు జరిపిన పోరాటాలు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా తన బాధ్యతను కాపాడుకుంటూనే ఉన్నారు. ఈ సందర్భంలో.. యాభై ఏళ్ల క్రితం ఒక సన్మాన సభలో మహాకవి కృష్ణశాస్త్రి అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘‘మనిషితో ఎడతెగని సావాసమూ, ప్రేమిస్తే ఆనందం, దూరమైతే బాధతో కొట్టుకు పోవడం – ఇవే నాకు తెలుసు. ఇది నా మతం, నాకిక వేరే మతం లేదు, కులం అసలే లేదు. నేను మనిషిని’’ అని ఈ లోకంలో ఎంతమంది చాటుకోగలరు?! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు
పుణె: 43 ఏళ్ల వ్యక్తి ప్రియురాలికి న్యాయం చేయాలంటూ ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ప్రభత్వ ప్రధాన కార్యాలయం అయిన మంత్రాలయ భవనం వద్ద చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు సదరు వ్యక్తి సేఫ్టి నెట్లో పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపన కథనం ప్రకారం....బీడు జిల్లాకు చెందిన బాపు నారాయణ మోకాషి తన గర్లఫ్రెండ్‌కి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం పై నుంచి దూకేశాడు. అతని గర్లఫ్రెండ్ అత్యాచారానికి గురైందని, ఆ తర్వాత ఆమె అవమానంతో 2018లో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి సదరు వ్యక్తి తన ప్రియురాలికి న్యాయం జరగాలంటూ పోలీస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఐతే పోలీసులు సరిగా దర్యాప్తు జరపకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. అదీగాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్‌ని కలిసి ఈ విషయం చెప్పి న్యాయం చేయాలని అభ్యర్థించేందుకు నవంబర్ 17 గురువారం మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. ఐతే క్యాబినేట్ సమావేశం ఉండటంతో బాపుకి షిండేని కలిసే అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై అతను మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయం ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. అక్కడ సేఫ్టి నెట్ ఉండటంతో అతను స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #Maharashtra: प्रेमिका को न्याय दिलाने के लिए प्रेमी ने लगाई छठी मंजिल से छलांग, नेट पर गिरने से बची जान#Mantralaya #Mumbai #WATCH #viralvideos2022 pic.twitter.com/c8dsn5Aufd — VDTV Bharat (@vdtv_bharat) November 18, 2022 (చదవండి: కాలేజీ ర్యాగింగ్‌లో వికృతక్రీడ.. స్టూడెంట్ పైశాచికత్వం!) -
సముచిత న్యాయానికి...
నిత్య జీవనంలో న్యాయపరమైన సమస్య ఏదైనా వస్తే తమ దగ్గరి వాళ్లకి చెప్పుకొని, ఉపశమనం పొందుతుంటారు. అన్యాయం చేసినవారిని తిట్టుకుంటూ విలువైన సమయాన్ని, డబ్బును పోగొట్టుకుంటుంటారు. కానీ, న్యాయవ్యవస్థను సంప్రదించాలంటే మాత్రం భయపడతారు. లాయర్లకు బోలెడంత డబ్బు ఫీజుగా ఇచ్చుకోలేమనో, కోర్టు చుట్టూ తిరగలేమనో అనుకుంటారు. నేడు అంటే నవంబర్ 9న నేషనల్ లీగల్ సర్వీస్ డే. ఈ సందర్భంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. పూర్ణకు పెళ్లయ్యి ఏడాదిన్నర అవుతోంది. ఆర్నెల్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. తండ్రి కట్నంగా ఇస్తానన్న డబ్బు తీసుకునే ఇంటికి రావాలని అత్తింట్లో షరతు పెట్టారు, కూలి పనులు చేసే తండ్రి అంత డబ్బు ఇచ్చుకోలేడు. తనకు న్యాయం జరిగేదెలాగో పూర్ణకు తెలియడం లేదు. నీతు ఇంజనీరింగ్ చదువుతోంది. నెల రోజులుగా తెలియని వారు తన గురించి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ఇంట్లో పెద్దలకు చెబితే తననే తప్పు పడతారేమో, పోలీసులను సంప్రదిస్తే ఇంటి పరువు పోతుందేమో అని భయం. ఎవరి నుంచి ఎలాంటి సాయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ‘ప్రతి మనిషికి న్యాయపరమైన అవసరం ప్రతి దశలోనూ ఉంటుంది. అందుకు ముందుగా పోలీసులు సంప్రదించలేకపోవచ్చు. కానీ, న్యాయపరమైన సలహా తీసుకుంటే మాత్రం సరైన పరిష్కారం లభిస్తుంది’ అంటారు అడ్వకేట్ రాజేశ్వరి. ‘పెద్ద పెద్ద నేరాలు జరిగితే తప్ప అలాంటి చోటుకి మనకేం పని అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తారు. అంతేకాదు, న్యాయం పొందాలంటే చేతిలో దండిగా డబ్బు ఉండాలని కూడా భావిస్తారు. అయితే అవన్నీ పొరపాటు భావనలేనని, ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్‌కి వెళ్లినట్టే ఏదైనా న్యాయపరమైన అవసరం ఏర్పడితే లీగల్ సర్వీస్ సెల్‌ని సంప్రదించవచ్చు’ అనేది న్యాయ నిపుణుల మాట. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి అన్ని అర్హతలు ఉండి, బ్యాంకు లోన్‌కు నిరాకరించినా అందుకు తగిన న్యాయ సలహా తీసుకోవడం అవసరం. వినియోగదారుడు ఏదైనా వస్తువును కొని మోసపోయినా అందుకు సంబంధించిన న్యాయం పొందడానికి అవగాహన తప్పనిసరి. గ్రామాల్లో పది మంది మహిళా సంఘ సభ్యులు కలిసి ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా న్యాయపరమైన అవసరం ఉంటుంది. మన నిత్యజీవితంలో ప్రతి చిన్న విషయానికి ‘న్యాయం’అవసరం గుర్తించాలి. అంతేకాదు ప్రతీ చిన్న విషయానికి డబ్బు చెల్లిస్తేనే న్యాయం పొందుతామనే ఆలోచనను దూరం పెట్టాలి. సరైన పరిష్కారానికి.. సమస్య వచ్చినప్పుడు స్థానికంగా మండల లేదా జిల్లా లేదా రాష్ట్ర స్థాయిల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి, సలహా తీసుకోవచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానెల్లో సివిల్, క్రిమినల్.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో లాయర్ ఉంటారు. రాష్ట్రస్థాయి లీగల్ ప్యానెల్లో హైకోర్టు జడ్జి కూడా ఉంటారు. వీరిలో ఎవరిని సంప్రదించినా పరిష్కారం ఎక్కడ లభిస్తుందో అందుకు సంబంధించిన సమాచారం తప్పక తెలుస్తుంది. ఏ కేసులు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయనే విషయంలోనూ ఈ సెల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. వీటితోపాటు మధ్యవర్తిగా సమస్యలను పరిష్కరించే లోక్ అదాలత్ అనే మీడియేషన్ టెక్నిక్ కూడా అందుబాటులో ఉంది. మహిళలు.. పిల్లలు అత్యాచారం, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక–శారీరక హింస, లైంగిక వేధింపులు మొదలైన వాటి నుంచి మహిళలు న్యాయ పొందడానికి లీగల్ సర్వీస్ సెల్‌ను ఆశ్రయించవచ్చు. అంతేకాదు సైబర్ బుల్లీయింగ్, మహిళా సాధికారతకు అవరోధం కలిగించే అంశాలేవైనా న్యాయపరమైన సలహా తీసుకోవచ్చు. కాలేజీలు.. పాఠశాలలు ఇటీవల యువతలో బాగా వినిపిస్తున్న మాట మాదకద్రవ్యాల వినియోగం. కాలేజీల్లో లీగల్ అడ్వైజ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావాలి. లీగల్ సర్వీస్ అథారిటీ కూడా లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతుంది. వీటికి హాజరై అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పారా లీగల్ వాలెంటీర్లు వీళ్లు పూర్తిస్థాయి లాయర్లు కాదు. న్యాయ సమాచారం తెలుసుకుని, జనాలకు స్వచ్ఛందంగా అందిస్తుంటారు. జనాల మధ్యన తిరుగుతూ, ఎవరికైనా న్యాయపరమైన సాయం చేసేవారుంటారు. ఎవరైనా ఆసక్తి గలవారు ‘న్యాయం’ కు సంబంధించిన సమాచారం తెలుసుకొని, ప్రజలకు స్వచ్ఛందంగా అవగాహన కలిగించవచ్చు. ఇది కూడా సామాజిక సేవలో భాగమే అవుతుంది. – నిర్మలారెడ్డి ఉచితంగా న్యాయ సేవ పేద పౌరుల కేటగిరీ కిందకు వచ్చే ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సేవలను అందుకోవడానికి అర్హులు. 9–9–1995 నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అమల్లోకి వచ్చింది. ఇందులో అర్హులైన వ్యక్తులు తమ తరపున కేసులను దాఖలు చేయడానికి లేదా ఏదైనా కోర్టులో తమకు వ్యతిరేకంగా దాఖలైన కేసులలో తమను తాము రక్షించుకోవడానికి న్యాయ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఉచిత న్యాయ సహాయం గురించి, దీనితోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీలు అందించే అనేక సేవలను ప్రజలకు తెలియజేయడానికి ప్రతియేటా ప్రచారాలు నిర్వహిస్తారు. చట్టపరమైన సహాయం కోరుకునే వ్యక్తి న్యాయ సేవల కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోనూ సంప్రదించవచ్చు. అవగాహన తప్పనిసరి ఈ నవంబర్ నెల అంతా స్కూల్స్, కాలేజీల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చదువుకునే విద్యార్థులకు న్యాయవ్యవస్థకు సంబంధించిన ప్రాథమికాంశాల పట్ల అవగాహన ఉండాలనేది మా థీమ్. అమ్మాయిలకైతే శారీరక, మానసిక, లైంగిక హింసలు, గృహహింస, ఆస్తి హక్కుల గురించిన పూర్తి సమాచారం తెలిసుండాలి. వీటికి సంబంధించిన విషయాల మీద లీగల్ సర్వీస్ అథారిటీ కూడా మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంటుంది. – రాజేశ్వరి, అడ్వకేట్ -
కోర్టుల సంఖ్య పెంచాలి.. ఎందుకంటే!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోకసభలో, దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలు, పొలీసు కస్టడీలోని నిందితులు 2016 నుండి 2022 వరకు 11,656 మంది మరణించినట్లు వెల్లడించారు. ఇందులో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో, చివరి స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. పొలీసు కస్టడీలో 7 శతం, జైళ్లలో 93 శతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1184 మరణాలకు ప్రభుత్వాలు బాధ్యతవహించి సంబంధిత కుటుంబాలకు 28.5 కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. భాద్యులైన అధికారులపై, పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సంబంధిత మరణాలు సహజ, అసహజ, అనారోగ్య, పొలీసు ఎన్కౌంటర్లు, పోలీసుల చిత్ర హింసలు, జైళ్లలో తోటి ఖైదీలు చంపడం వంటి మొదలగు కారణాలని తెల్పింది. ఆధునిక భారతావనిలో దినదినం పెరుగుతున్న కస్టోడియల్ మరణాలు కల్లోలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 672 న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు విచారణ దశలో పెండింగులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో సుప్రీమ్ కోర్టులో 71 వేలు, హైకోర్టుల్లో 59 లక్షలు మిగితావి క్రింది స్థాయి కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో పెండింగులో ఉన్నాయి. దేశంలో న్యాయమూర్తుల సంఖ్యను దేశ జనాభాతో పోల్చిచూసినప్పుడు ప్రతి 50 వేలమంది పౌరులకు కేవలం ఒక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. దేశంలో ప్రభుత్వాలు మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్య 25 వేలు ఇందులో, ఎప్పుడూ సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటాయి. 1987లో లాకమీషన్ ప్రతీ 20 వేలమంది పౌరులకు ఒక్క న్యాయమూర్తిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ దేశాల న్యాయవ్యవస్థను పోల్చిచూసినప్పుడు చైనాలో ప్రతీ 3500 మంది పౌరులకు ఒక్క న్యామూర్తి, అమెరికాలో ప్రతీ 7,000 మంది పౌరులకు ఒక్క న్యాయ మూర్తి చొప్పున నియమించారు అందుకే, ఆయా దేశాల్లో పౌరులకు సత్వర న్యాయం లభిస్తుంది. దేశంలోని 1350 జైళ్లలో సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు, శిక్షలు ఖరారైన వాళ్లు మరియు విచారణలో కొనసాగుతున్న వాళ్లు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారు కాకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని, ఇటీవల సుప్రీంకోర్టు సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మధ్య జరిగిన కేసు తీర్పులో, నేరాలను నాలుగు రకాలుగా విభజించి పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేస్తూ, నిందితులు చేసిన నేరానికి విధించే శిక్షలో 50 శాతం జైళు జీవితాన్ని పూర్తిచేసి జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలను వెంటనే బేయిలుపై విడుదల చెయ్యాలని అన్ని మేజిస్ట్రేట్, జిల్లా, హైకోర్టులను ఆదేశించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించింది. కానీ, దురదృష్టవశాత్తు మనదేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అనేక క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ, కొంత మంది పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, బ్రిటిష్ కాలంనాటి మూస పద్ధతిలోనే పనిచేస్తున్నారు. పోలీసులు నిందితులను, నిందితులుగా చూడకుండా నేరస్తులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి క్రిమినల్ చట్టాల ప్రకారం ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను/అనుమానితులను గుర్తించి, విచారించి సదరు నిందితులను కోర్టు ముందు హాజరపరిచి విచారణలో, వారు నేరం చేసినట్లుగా తగు సాక్ష్యాధారాలతో న్యాయమూర్తుల ముందు పోలీస్ యంత్రాంగం చూపించవలసి ఉంటుంది. అంతిమంగా న్యాయస్థానాలు నిందితులను నేరస్తులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసి జైలుకు పంపిస్తాయి. దేశంలో సుమారు 4 లక్షల 88 వేలకు పైగా విచారణ ఖైదీలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయి జైలు జీవితం గడుపుతున్నారు. న్యాయస్థానాలు వీరిలో కొందరిని నిర్దోషులుగా తేల్చినప్పుడు, వీరు కోల్పోయిన జీవితానికి ఎవరు బాధ్యులు?. వీరిలో నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా పేదవారే ఉండడం గమనించతగ్గ విషయం. భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కును కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం, న్యాయస్థానాలకు కావలసిన భవన సముదాయాలు, వసతులు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడమే. దేశంలో జైళ్ల సంఖ్యను పెంచి, జైళ్లలో కనీస వసతులతో ఖైదీలకు పౌష్ట ఆహారం, మెరుగయినా వైద్య సదుపాయాలు అందించాలి. అప్పుడే కస్టోడియల్ మరణాలు తగ్గి, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛగా జీవించే హాక్కును రక్షించనివారిగా పాలకులు చరిత్రలో నిలిచిపోతారు. అదే సమయంలో దేశంలోని పౌరులకు విద్యార్థి దశ నుండి పోలీసు, జైళ్ల వ్యవస్థలపై, నేరాలపై, కేసుల నమోదు ప్రక్రియ నుండి న్యాయవ్యవస్థ విచారణ వరకు ప్రాథమిక అంశాలను విద్యా బోధనలో నేర్పించాలి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్న పోలీసులపై, అవే క్రిమినల్ చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే స్థాయికి యువకులు, ప్రజలు ఎదుగవలసి ఉంది. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!) – కోడెపాక కుమార స్వామి, హైదరాబాద్ -
పాక్ నేతల ఆడియో సంభాషణలు లీక్ కలకలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం. అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్ సాదిఖ్‌లు గత తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. -
Sri Lanka: రుణ ఉపశమనం కాదు.. రుణ న్యాయం కావాలి
శ్రీలంక పార్లమెంటులో జూలై 20న అధ్యక్షుడిగా విక్రమసింఘె ఎన్నిక, కొత్త ప్రధాని గుణవర్దనె నియామకం, ప్రధాని మోదీ వారిని అభినందించటం ఇటీవలి వార్తలు. విక్రమ సింఘె గెలుపు ఖాయమని ముందు రోజునే తేలిపోయిందనీ, గెలుపునకు భారత ప్రభుత్వ సహాయ సహకా రాలున్నాయనీ, ఆ ఇద్దరూ అమెరికా, యూరప్, ఇండియాలకి ఆమోదయోగ్యులే అని విశ్లేషణలు వెలువడ్డాయి. జూలై 19నే కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక ప్రభుత్వానికి పూర్తి సహకారం, ఐఎంఎఫ్ రుణం పొందటానికి తగిన సాయం చేస్తామని విదే శాంగమంత్రి జయశంకర్ చెప్పారు. పనిలోపనిగా ఇక్కడి రాష్ట్రాల రుణాలను, సబ్సిడీలను ఈ సందర్భంగా తప్పుపట్టే రీతిలో వివరించారు. ఇది అప్రస్తుతమనీ, శ్రీలంక ‘దేశం’ అప్పులను ‘రాష్ట్రాల’ అప్పులతో పోల్చి గందర గోళం సృష్టిస్తున్నారనీ, ఆ పేరుతో ఇక్కడ ‘రాజకీయాలు’ చేయటం, పరోక్షంగా రాష్ట్రాలను నిందించటం తగదనీ వివిధ పార్టీలు నిరసన తెలిపాయి. శ్రీలంకకు చెందిన 30 మంది ఆర్థిక, సామాజిక శాస్త్రాల నిపుణులు; మాజీ అధికారులు, విద్యార్థి కార్మిక రైతాంగం మత్స్యకారుల సంఘాల నేతలు అధ్యక్ష ఎన్నిక తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి ముఖ్య కారణం ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్ సావరీన్ బాండ్ (ఐఎస్బీ), అమెరికా, యూరపు దేశాల, ‘బ్లాక్ రాక్’ వంటి కమర్షియల్ రుణాలూ, వారి షరతులే. 2022 మే నెలలో శ్రీలంక రుణాలు 5 వేల కోట్ల డాలర్లు కాగా అందులో సగానికి పైగా పైన పేర్కొన్న రుణ సంస్థల వాటాయే. నిజానికి ఈ ఏడు కట్టాల్సిన రుణం 500 కోట్ల డాలర్లే. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం, వాటివల్ల భారాలు పెరిగి, టీ వంటి ఎగుమతులూ, టూరిజం ఆదాయం తగ్గి, అనేక దేశాల్లాగే శ్రీలంకా దెబ్బతిన్నది. స్వతంత్రం వచ్చాక శ్రీలంకలో బాకీలు తీర్చలేని స్థితికి చేరడం ఇదే మొదటిసారి. కాగా అతిశయోక్తులతో, తప్పుడు సమాచారంతో పై పాశ్చాత్య శక్తులు, వారి మీడియా విదేశీమారకం (డాలర్ల) కొరతనీ ‘దివాళా స్థితిగా చిత్రించి’ రుణదిగ్బంధనం వంటిది చేశారు. మానవాభివృద్ధి సూచికలో పైకి వచ్చిన శ్రీలంకని ప్రస్తుత రుణ సంక్షోభంతో ఇప్పుడు ‘అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం’గా (ఎల్డీసీ) పునర్వర్గీకరించ చూస్తున్నారు. అలాంటి దేశాలకు ఆర్థిక విదేశాంగ వ్యవహారాల్లో అటానమీ, సార్వభౌమాధికారం నిరాకరించబడుతుంది. ఇది నిజంగా దివాళా కాదు, ఇది వారు ‘సృష్టించిన డిఫాల్ట్’. తమ వ్యూహా నికి తగినట్టుగా వారు శ్రీలంక వనరులను, ఆస్తులను, పెట్టుబడులను తగ్గించి చూపి, ఆర్థిక–ద్రవ్య లెక్కలనూ, సూచికలనూ, అల్గారిథమ్స్– మ్యాట్రిసెస్నూ తారుమారు చేస్తున్నార’’నేది ఆ ప్రకటన సారాంశం. శ్రీలంకలో ‘ఆర్థిక ప్రజాస్వామ్య సమష్టి వేదిక’ పేరిట ఉన్న ఈ ప్రకటనలో ఐఎంఎఫ్‌తో కొద్దివారాల క్రితమే మొదలైన చర్చలలో పారదర్శకత బొత్తిగా లేదని ఆరోపించారు. ప్రపంచ సముద్ర రహదారుల్లో కీలక స్థావరంగా ఉన్న శ్రీలంక ‘క్వాడ్’లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ‘కోవిడ్–19 బెయిల్ అవుట్ ఫండ్’ పేరిట అమెరికా ప్రభుత్వం అనేక పేద దేశాలకు రుణాలు ఇచ్చి ఆయా దేశాల సంపదల్ని కాజేయటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్నీ, ప్రాజెక్టుల్నీ... చౌకగా, చాటుగా అమ్మేసే, ప్రైవేటీకరించే రీతిలో స్థానిక వనరుల ఆస్తుల విలువను తగ్గించి చూపుతున్నారనీ; దేశ ఇంధనం, ఆహార భద్రతలనూ, సార్వభౌమత్వాన్నీ బలిపెడుతున్నారనీ ఆరోపించారు. ‘యుగ ఘనవి పవర్ ప్లాంట్’ని ఇప్పటికే అమె రికాకు చెందిన కంపెనీ ‘న్యూఫోర్ట్రెస్’కు కారుచౌకగా కట్ట బెట్టారని ఉదహరించారు. ‘ఇప్పుడు కావల్సింది రుణ ఉపశమనం కాదు, రుణ న్యాయం’ అన్నారు. అర్జెంటీనా, గ్రీస్, లెబనాన్ దేశాల్ని ఉదహరించి, ‘సంక్షోభానికి ఐఎమ్ఎఫ్ కారణమే కాని పరిష్కారం కాజాలదు’ అని చెప్పారు. డాలరు ఏకచ్ఛత్రాధిపత్యాన్ని రద్దు చేసి, వివిధ కరెన్సీల బాస్కెట్‌తో లావాదేవీలు జరపాలనీ... కుబేరులపై పన్నులు వేసి వసూలు చేయాలనీ, ‘స్థానిక ఉత్పత్తుల్ని కొనాలి’ అన్న ఉద్యమాన్ని ప్రోత్సహిం చాలనీ వారు కోరారు. రాజపక్స కుటుంబాల వంటి వాటికాజేసిన ఆస్తులను రాబట్టడం అవసరమే కానీ అంతకు మించి రుణ న్యాయం, రుణాల రద్దు అవసరమని అన్నారు. మొత్తం మీద ఈ ప్రకటన శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితినీ, ప్రజల ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తోంది. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) - డా. ఎమ్. బాపూజీ సీఎస్ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త -
సుప్రీంకోర్టు జడ్జికి గుండెపోటు.. బాగానే ఉన్నానంటూ మెసేజ్
ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా గుండెపోటుకు గురయ్యారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా.. గురువారం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఎయిర్ ఆంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించారు. షా అస్వస్థత వార్త తెలియగానే.. సుప్రీంకోర్టు అధికార వర్గాలు హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఎయిర్‌ఆంబులెన్స్‌లో హుటాహుటిన తరలించాయి. అయితే తాను బాగానే ఉన్నానని, రేపో ఎల్లుండో పూర్తిగా కోలుకుంటానని ఆయన చెప్తుండగా.. ఓ షార్ట్ వీడియో బయటకు వచ్చింది. జస్టిస్ షా గతంలో గుజరాత్ హైకోర్టు జడ్జిగానూ పని చేశారు. ఆపై పాట్నా హైకోర్టు సీజేగా విధులు నిర్వహించారు. 2018లో ఆయన్ని సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేశారు. మే 15, 2023న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. I am stable. There is nothing to worry. I will be reaching Delhi soon. By day after tomorrow, I will be better: Justice MR Shah (Source: Justice Shah's office) pic.twitter.com/zpH6xTInhc — ANI (@ANI) June 16, 2022 -
చెల్లెని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు పయనం
-
చెల్లిని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు..
సాక్షి, ఖమ్మం: చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేసిన భర్త, ఆయన కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి ఎడ్ల బండిపై ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానానికి బయలుదేరాడు. ఈమేరకు ఆయన మంగళవారం సాయంత్రం బోనకల్‌కు చేరుకోగా వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లకు చెందిన నేలవెల్లి నాగదుర్గారావు చెల్లి నవ్యతను అదే మండలంలోని చందాపురానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. కట్నంగా నగదు, ఆభరణాలు, భూమి ఇచ్చారు. అయితే ఆమెను సరిగా చూసుకోకపోవడమే కాక నరేంద్రనాథ్, కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని గెంటేశారు. ఈ విషయమై చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, నరేంద్రనాథ్ కుటుంబ సభ్యుల ఫొటోలతో ఎడ్లబండిపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారని నాగదుర్గారావు తెలిపారు. ఈమేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు నాగదుర్గారావు చెల్లెలితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ బయలుదేరగా, బోనకల్లో పలువురు సంఘీభావం ప్రకటించారు. చదవండి: కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. -
పెరరివాళన్.. ఇప్పటికే ఆలస్యమైంది.. పెళ్లి చేసుకో
చెన్నై: సుదీర్ఘ కారాగారవాసం తర్వాత జీవితఖైదీ ఏజీ పెరరివాళన్ జైలు నుంచి విడుదలయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలతో ఆయనకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. జైలు నుంచి విడుదలైన పెరరివాళన్‌ను తాను కలవాలనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ చెప్పారు. అతడు సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. 1999లో ఏజీ పెరరివాళన్‌కు మరణశిక్ష విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి జస్టిస్ కేటీ థామస్ నేతృత్వం వహించారు. ‘పెరరివాళన్‌ను నేను చూడాలనుకుంటున్నాను. మీకు సమయం దొరికితే, దయచేసి నన్ను కలవండి’ అంటూ కేరళలోని కొట్టాయంలో ఉన్న తన నివాసం నుంచి ఆయన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడారు. ‘సుదీర్ఘ కారాగారవాసం తర్వాత 50 సంవత్సరాల వయస్సులో జైలు నుంచి విడుదలైన అతడితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అతను త్వరలో పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రేమను మాత్రమే పొందాడు. వైవాహిక జీవితాన్ని అతడు గడపలేదు. తన ప్రియమైన వారితో అతడు సంతోషంగా జీవించాలి. పెరరివాళన్‌ను జైలు నుంచి బయటకు తీసువచ్చిన ఘనత అతడి తల్లి (అర్పుతం అమ్మాల్)కి దక్కుతుంది. ఈ ఘనతకు ఆమె సంపూర్ణంగా అర్హురాల’ని జస్టిస్ కేటీ థామస్ పేర్కొన్నారు. (చదవండి: ఇది అమ్మ విజయం, పెరారివాలన్ భావోద్వేగం) రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు 23 ఏళ్ల తర్వాత మరణశిక్ష అమలు చేయాలన్న నిర్ణయాన్ని 2013లో జస్టిస్ కేటీ థామస్ వ్యతిరేకించారు. దీంతో 2014లో ముగ్గురు దోషుల మరణశిక్షలను మారుస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడిపిన వారిని ఉరితీయడం అంటే ఒక నేరానికి రెండు శిక్షలు అమలు చేసినట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన గట్టిగా వాదించారు. అంతేకాదు దోషుల పట్ల ఉదారత చూపాలని అప్పట్లో సోనియా గాంధీని వేడుకున్నారు. దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు మంత్రివర్గ ప్రతిపాదనను గవర్నర్ పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. యావజ్జీవ కారాగార శిక్ష మొత్తం జీవితకాలానికి సంబంధించిదైనప్పటికీ.. భారత రాజ్యాంగం ఉపశమనాన్ని అనుమతిస్తుంది అని జస్టిస్ థామస్ అన్నారు. మహాత్మా గాంధీ హత్య కేసులో గోపాల్ గాడ్సేకు 14 సంవత్సరాల తర్వాత ఉపశమనం లభించిందని.. అతనితో పాటు జీవిత ఖైదులో ఉన్న ఇతర దోషులందరినీ కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. ‘జైలు నుంచి విడుదలైన తర్వాత గోపాల్ గాడ్సే జీవితాన్ని చూడండి. అతడు పూర్తిగా మారిపోయాడు. పుస్తకాలు కూడా రాశాడు. మహాత్మా గాంధీ హంతకులను విడుదల చేసి.. వారిలో పరివర్తన తేవడానికి అనుమతించారు. మరి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను ఎందుకు సంస్కరించకూడద’ని థామస్ ప్రశ్నించారు. పెరరివాళన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును మిగిలిన ఆరుగురు దోషులకు కూడా వర్తింపజేయాలని అన్నారు. (చదవండి: పెరరివాళన్ పెళ్లి ఏర్పాట్లు షురూ) -
నిందితులు చిక్కినా న్యాయం జరగట్లే!
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’... ఇన్సూరెన్స్ ఫాడ్స్ర్ చేసిన త్రయం విషయంలో ఈ ఆంగ్ల నానుడి సరిగ్గా సరిపోతుంది. నగరానికి చెందిన ఇద్దరు వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్న ముగ్గురు నిందితులు రూ.6.74 కోట్లు కాజేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు తొలి కేసు నమోదైన మూడు రోజుల్లోనే ముగ్గురు నిందితులనూ అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు మోసం సొత్తుతో స్థిర, చరాస్తులు ఖరీదు చేసినట్లు గుర్తించారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోవాల్సి వస్తోంది. ఈ రెండు కేసులూ మోసాన్ని సూచించే ఐపీసీలోని 420 తదితర సెక్షన్లతో నమోదు కావడంతో ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. పక్కాగా స్కెచ్ వేసి స్వాహా... కుత్భుల్లాపూర్‌లో నివసిస్తున్న పుల్లేటి సుబ్రహ్మణ్యం, బీరంగూడ వాసి ఉడుత మనోజ్‌కుమార్, గుర్రంగూడకు చెందిన బండారి మహేష్ గౌడ్లతో కూడిన ముఠా ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పథకం వేసింది. వివిధ కంపెనీలకు చెందిన పాలసీ హోల్డర్ల ఫోన్ నంబర్లు సేకరించి ప్రధానంగా వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని వారికి నమ్మకం కలిగించి నిండా ముంచింది. నగరానికి చెందిన ఇద్దరి నుంచి వేర్వేరుగా రూ.6.74 కోట్లు నగదు రూపంలో తీసుకుని నకిలీ బాండ్లు అంటగట్టి మోసం చేసింది. తన కుమారుడు విదేశాల నుంచి వచ్చి గుర్తించే వరకు ఒక బాధితుడు, వీరి అరెస్టు విషయం పత్రికల్లో చూసే వరకు మరో బాధితుడు తాము మోసపోయినట్లు గుర్తించలేకపోయారు. కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి... మొదటి బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు గత నెల ఆఖరి వారంలో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆపై న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే మోసం సొమ్మును ముగ్గురూ పంచుకున్నట్లు తేలింది. ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యం తన స్వస్థలమైన గుడివాడలోని ఎస్ఎన్ పురంలో రూ.60 లక్షలు వెచ్చించి ఇల్లు నిర్మించాడని, కుత్భుల్లాపూర్‌లో రూ.కోటితో ప్లాట్ కొన్నాడని, తన కుమార్తె పేరుతో రూ.1.5 లక్షలు పోస్టాఫీస్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడని తెలుసుకున్నారు. మనోజ్‌కుమార్ బీరంగూడలో రూ.70 లక్షలతో ఫ్లాట్ ఖరీదు చేయగా, మహేష్ తన వివాహానికి డబ్బు ఖర్చు చేయడంతో పాటు భార్యకు పది తులాల బంగారం, తమ కోసం ఓ కారు ఖరీదు చేసుకున్నట్లు గుర్తించారు. స్వాధీనానికి ఆస్కారం లేకపోవడంతో... విలాసాలకు అలవాటుపడిన వీరు భారీ మొత్తాన్ని ఖర్చు చేసి విహారయాత్రలకు వెళ్లి వచ్చారు. వృద్ధుల నుంచి కొట్టేసిన సొమ్ముతోనే ఇవన్నీ చేశామంటూ వారు అంగీకరించినా... పోలీసులకు ఆధారాలు లభించినా వాటి జోలికి వెళ్లే ఆస్కారం లేకుండా పోయింది. ఈ కేసును పోలీసులు ఐపీసీలోని 420 తదితర సెక్షన్ల కింద నమోదు చేశారు. కేవలం డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద నమోదైన వాటిలోనే ఆస్తుల స్వాధీనానికి ఆస్కారం ఉంది. ఈ చట్టం వర్తించాలంటూ నిందితులు బాధితుల నుంచి డబ్బును డిపాజిట్ల రూపంలో తీసుకుని ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ నేరం ఆ తరహాకు చెందినది కాకపోవడంతో అలా చేసే వీలులేదు. దీంతో ఈ వివరాలతో పాటు స్థిరచరాస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు న్యాయస్థానానికి అప్పగించాలని నిర్ణయించారు. కోర్టు నిర్ణయం మేరకే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రెండో కేసులో వీరిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. అనివార్యంగా మారిన చట్ట సవరణ... కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు అనేక మోసాల కేసుల్లో బాధితుల పరిస్థితి ఇలానే ఉంటోంది. నిందితులు అరెస్టు అయినా వారికి న్యాయం అందడం లేదు. ఒకప్పుడు రూ.వేలు, రూ.లక్షలతో ముడిపడి ఉన్న మోసాల కేసుల ‘విలువ’ ఇప్పుడు రూ.కోట్లకు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే చట్ట సవరణతోనే బాధితులకు న్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్. కేవలం పోలీసు విభాగంలోనే కాకుండా ఆయన డిప్యుటేషన్‌పై పని చేసిన ఎక్సైజ్, పౌరసరఫరాల శాఖల్లోనూ అనేక సంస్కరణలు తీసుకువచ్చి తన మార్కు చూపించారు. ఈ విషయంలోనే ఆయన స్పందించి భారీ మొత్తాలతో ముడిపడి ఉన్న మోసం కేసుల్లోనూ ఆస్తులు స్వాధీనం చేసుకునేలా సవరణకు ప్రతిపాదించాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే మోసగాళ్లకు కళ్లెం పడటంతో పాటు బాధితులకు పూర్తి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. (చదవండి: పోలీసునంటూ బెదిరింపులు...నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే జంటలే టార్గెట్) -
వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ పుష్ప రాజీనామా
ముంబై: బాలలపై లైంగిక దాడికి వివాదాస్పద నిర్వచనమిచ్చి వార్తల్లోకెక్కిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ అదనపు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా గురువారం రాజీనామా చేశారు. దానికి వెంటనే ఆమోదం లభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మైనర్ చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్పు విప్పడం లైంగిక దాడి కావంటూ 2021 ఫిబ్రవరిలో పుష్ప తీర్పు ఇచ్చారు. లైంగికపరమైన కోరికతో నేరుగా శరీరాన్ని తాకితే మాత్రమే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద లైంగిక దాడిగా పరిగణనలోకి వస్తుందన్నారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలన్న సిఫార్సులను అప్పట్లో సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కు తీసుకుంది. ఏడాది పాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగించింది. అది శుక్రవారంతో ముగియనున్నా పొడిగింపు గానీ, పదోన్నతి గానీ ఇవ్వలేదు. ఆమె పదవిలో కొనసాగితే శుక్రవారం నుంచి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా పని చేయాల్సి వచ్చేది. -
Yogita Bhayana: కింగ్‌ఫిషర్ టూ పరి..బాధితుల కోసం ‘భయనా’
ఢిల్లీకి చెందిన యోగిత భయనా అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడం కోసం ఏవియేషన్ కెరీర్ నుంచి బయటకు వచ్చి ‘పరి (పీపుల్ అగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా)’ అనే ఎన్జీవో స్థాపించింది. వాళ్లకు పునరావాసం, పోషణ, న్యాయపోరాటంతోపాటు చదువు కూడా చెప్పిస్తోంది. వినడానికి ఇది రెండు వాక్యాల విషయం లాగానే అనిపిస్తుంది. కానీ...ఈ ప్రస్థానంలో ఆమె దరి చేర్చిన జీవితాల సంఖ్య ఎంత పెద్దదంటే ఓ వెయ్యికి పైగానే. అంతమంది బాధితుల జీవితాలను గాడిన పెట్టడంలో నిమగ్నమైన యోగిత తనకు అత్యంత పెద్ద సవాల్ న్యాయవ్యవస్థలో నెలకొన్న జాగు అని చెప్తోంది. నిర్భయ పోరాటంలో నిర్భయ తల్లికి అండగా నిలిచిన యోగిత జీవిత ప్రస్థానం ఇది. చిన్నప్పటి నుంచి యాక్టివ్ యోగిత పద్నాలుగేళ్ల నుంచే సామాజిక సేవలో చురుగ్గా ఉండేది. ట్యూషన్లు చెప్పి ఆ డబ్బును వార్ధక్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ఆర్థిక సహాయం చేసేది. స్కూల్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోపాటు సామాజకి కార్యకర్తగా ఎదిగింది. ఆ తర్వాత ఉమెన్ యాక్టివిస్ట్‌గా ఒక స్పష్టమైన దారిని ఎంచుకుంది. కెరీర్ పరంగా ఏవియేషన్ రంగం మీద ఏర్పడిన క్రేజ్‌తో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో చేరింది. కానీ ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయిందామె. జీవితంలో గొప్ప రిలీఫ్ పొందిన క్షణం ఏదంటే ఉద్యోగం మానేసినరోజేనంటోంది యోగిత. తన జీవితాన్ని సామాజిక సేవలో నిర్బంధించిన సంఘటనను గుర్తు చేసుకుంటారామె. కట్టిపడేసిన సంఘటన ‘‘ఓ రోజు రోడ్డు మీద నా కళ్ల ముందే ఓ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. గాయపడిన వ్యక్తిని కాపాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను, నా ఫ్రెండ్ ధైర్యం చేసి అతడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. ఆ ప్రభుత్వ వైద్యశాలలో గాయపడిన వ్యక్తికి వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు కూడా సరిగ్గా లేవు. అన్నీ సమకూర్చుకుని వైద్యం మొదలుపెట్టేలోపు ఆలస్యం అయిపోయింది. అతడు దక్కలేదు. అతడి భార్య, బిడ్డలు దిక్కులేని వాళ్లయిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ సంఘటన వెంటాడుతూనే ఉండేది. నిద్రపోవడానికి కళ్లు మూసుకుంటే ఆ కుటుంబమే కళ్ల ముందు మెదిలేది. ఆలోచించే కొద్దీ పేదరికం ఎంత నరకమో అర్థం కాసాగింది. నిజానికి నన్ను మేల్కొలిపిన సందర్భం అది. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. కోర్టులో సాక్ష్యం చెప్పాను. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం లభించే వరకు వారికి సహాయంగా ఉన్నాను. ఆ సంఘటన రగిలించిన ఆవేదనతో 2007లో దాస్ చారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించాను. రోడ్డు ప్రమాదాల పట్ల చైతన్యవంతం చేయడం, కళ్ల ముందు ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలనే అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాం. సేవామార్గంలో మలుపు నా కార్యకలాపాలు ఇలా కొనసాగుతుండగా 2012 లో నిర్భయ ఘటన జరిగింది. దేశరాజధానిలో ఒక యువతి అమానవీయంగా అత్యాచారానికి గురి కావడం, ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస వదలడం గుర్తుండే ఉంటుంది. దేశాన్ని కుదిపేసిన ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ న్యాయపోరాటంలో తీర్పు రావడానికి ఏళ్లు పట్టింది. ఆంత కాలం నిర్భయ తల్లికి అండగా ఉన్నాను. ఆ సమయంలో నాకు ఎంతోమంది నుంచి వినతులు వస్తుండేవి. ‘మాకు కూడా ఇలాగే జరిగింది. న్యాయపోరాటం చేయాలంటే మాకు తోడుగా ఎవరూ రావడం లేదు’ అంటూ తమకు సహాయం చేయమని అడిగేవాళ్లు. తరచూ కోర్టుకు వెళ్లాల్సి రావడంతో మరికొన్ని సంగతులు కూడా తెలిశాయి. నిర్భయ కేసు... సామాన్యుల నుంచి పాలకుల వరకు అందరి దృష్టిలో పడింది కాబట్టి అప్పటికైనా విచారణ పూర్తి చేసుకుని తీర్పుకు నోచుకుంది. పదిహేనేళ్లు దాటినా కూడా అతీగతీ లేకుండా కాగితాల్లో మూలుగుతున్న కేసులు లెక్కకు మించి ఉన్నాయని తెలిసింది. ఒక యాక్టివిస్టుగా నేను చేయల్సిన పని చాలా ఉందనిపించి పరి ఎన్జీవోను స్థాపించాను. ఈ వేదిక ద్వారా సహాయం పొందిన బాలికలు, యువతులు, మహిళల వివరాలను చెప్పలేను. కానీ వెయ్యికి పైగా జీవితాలు గాడిలో పడ్డాయని చెప్పగలను. వాళ్ల తరఫున న్యాయపోరాటం చేయడం, పునరావాసం కల్పించడం, చదువుకునే వాళ్లను చదివించడం వంటివన్నీ చేస్తున్నాను. అత్యాచార బాధితులతోపాటు ఒంటరి మహిళలకు కూడా మా దగ్గర కారు డ్రైవర్, కారు క్లీనర్, హౌస్ కీపింగ్ వంటి పనుల్లో శిక్షణ తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు’’ అని చెప్పింది యోగిత. छात्रों की समस्या का समाधान किया जाए. पिछले एक साल से सिर्फ एक मौके की मांग कर रहे छात्रों के साथ न्याय जरूरी है. #UPSCExtraAttempt EXTRA ATTEMPT FOR ALL pic.twitter.com/C9Umb146jp — Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) December 1, 2021 -
యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..
ఈ సినిమా చూసిన చాలామంది యువత న్యాయవృత్తిని చేపడతామని బాధితులకి న్యాయం చేకూరేలా తమ వంతు కృషి చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. చెన్నైకి చెందిన శ్రవణ్ అనే కామర్స్ విద్యార్థి ఈ సినిమా చూసిన తర్వాత తాను న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు తనకు న్యాయ రంగం నచ్చిందని, పైగా ఈ చిత్రంలో సూర్య తీసుకున్న తుది నిర్ణయం తనకు బాధితులకు న్యాయం చేయడానికి ఉపకరించేలా ఉందని అన్నాడు. (చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!) అయితే శ్రవణ్ లైంగిక వేధింపుల బాధితులు తమ తప్పు లేకుండానే వారు శిక్షించబడుతున్నారని వారికి న్యాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎంబీఏ చేస్తున్న శ్రవణ్ సత్యనారాయణ అనే మరో విద్యార్థి ఈ సినిమా అట్టడుగు వర్గాలకు సహాయం చేయడానికి, సాధికారత కోసం ఏదైనా చేయాలనే సందేశాన్ని ఇస్తోందని అందువల్ల తాను వారికి ఉద్యోగాలు పొందేలా సాయం చేయాలనుకున్నట్లు చెప్పాడు. అయితే టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ లీగల్ సినిమా 1993లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారన్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాలో జస్టిస్ కే. చంద్రు పోరాడిన కేసు తాలుకా ఇరులర్ తెగకు చెందిన ఒక జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ చిత్రం సమాజంలోని అసమానతలు అణగారిన వర్గాల అణచివేతకు సంబంధించిన ఇతి వృత్తాలను స్పృశిస్తూనే, న్యాయవాది శక్తితో మానవ హక్కులను కాపాడేలా వారి బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె. చంద్రు ఈ చిత్రాన్ని "అర్ధవంతమైన సినిమా"గా అభివర్ణించారు. అంతేకాదు దిద్దుబాటు యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయనే అంశాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒక న్యాయవాది సునిశితమైన న్యాయవ్యవస్థ సాయంతో బాధితులకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేయడంలో సహాయపడగలరంటూ కె. చంద్రు విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
పంజాబ్ యువతికి న్యాయం చేయించండి.. పవన్‌కల్యాణ్‌కు గుడి కడతా
హైదరాబాద్: పంజాబ్‌కు చెందిన ఓ యువతి తెలుగు సినిమాలో అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి చెప్పారు. ఆ ప్రముఖ వ్యక్తి ఆమెకు అబార్షన్ చేయించి, ఎవరికి చెప్పవద్దని బెదిరించి రూ.5 కోట్లు ఇచ్చారట.. అని తెలిపారు. సినీనటుడు పవన్‌కల్యాణ్ ఏపీ సీఎం జగన్, మంత్రులపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ వ్యక్తి చేతిలో మోసపోయిన పంజాబ్ అమ్మాయి పేరు పవన్‌కల్యాణ్ చెవిలో చెబుతానన్నారు. ఆ అమ్మాయి పేరు మీడియాకు చెప్పి, ఆ ప్రముఖ వ్యక్తిపై పోరాటం చేసి ఆమెకు న్యాయం చేస్తే ఆయనకు గుడి కడతానని చెప్పారు. ఆ పిల్ల జీవితాన్ని బాగుచేస్తే పవన్ ముందు జగన్ కుడా పనికిరారని పేర్కొన్నారు. ఆ అమ్మాయికి అండదండలు అందించకపోతే పవన్‌కల్యాణ్‌కు ఎవరినీ ప్రశ్నించే అర్హతలేదని చెప్పారు. పోసాని ఇంకా ఏమన్నారంటే.. జగన్‌తో పోల్చుకోవద్దు పవన్ అంటే ప్రపంచానికి తెలుసు, ఇండస్ట్రీకి తెలుసు. పవన్.. మీరు జగన్‌తో పోల్చుకోవద్దు. జగన్ రాకముందు గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఏమిటి. పవన్ ఏ పార్టీతో సరిగ్గా ఉన్నావు. ఏ పార్టీని మిగిల్చావు. చిరంజీవి సంస్కారవంతుడు, గొప్ప మానవతావాది. ఆయన నోట ఎప్పుడైనా బ్యాడ్ మాట విన్నారా? చిరంజీవిగారి ఇంట్లో ఆడవారిని అసభ్యకరంగా మాట్లాడితే నువ్వు ఎక్కడ ప్రశ్నించావు? నీకు ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించాలో తెలియదు. పవన్ తనే ప్రశ్నిస్తాడు, తానే జవాబు చెబుతాడు. జగన్‌ని, మంత్రుల్ని తిట్టాల్సిన అవసరమేంటి? రిపబ్లిక్ ఫంక్షన్‌కు వచ్చి సీఎం జగన్‌ని, మంత్రులను తిట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నీకు ఏ క్వాలిటీస్ ఉన్నాయని జగన్‌ను తిడుతున్నావు? ఆన్లైన్లో టికెట్ల అమ్మకంతో నీకేంటి సంబంధం. జగన్‌కు మత, కుల పిచ్చి ఉందని నిరూపించగలవా? ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లకపోయినా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మీరు రెండు నియోజకవర్గాల్లో నిలబడి గెలిచారా. బాధ్యతతో మెలుగు చంద్రబాబు పరిపాలనలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుమీదకు లాగారు. అప్పుడు ఎవరైనా మాట్లాడారా? చంద్రబాబుకు కాపుల మీద ప్రేమ ఉందా? ఎస్సీలుగా ఎవరూ పుట్టాలనుకోరు.. నాయీబ్రాహ్మణుల తోకలు కట్‌చేస్తా.. అని అన్న చంద్రబాబును నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు పవన్‌కల్యాణ్. ఎమ్మార్వో వనజాక్షిని అవమానించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు..’అని పోసాని కృష్ణమురళి నిలదీశారు. చంద్రబాబు మంచి చేస్తే చేశాడని, చెడుచేస్తే చెడు అని తాను చెప్పానన్నారు. మోదీని కూడా మిమిక్రీ చేసిన పవన్‌కల్యాణ్ మళ్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ బీజేపీతో కలిశాడని చెప్పారు. హిందూ నాయకులను తిడతారన్నారు. ఒక కులం గురించి రాజకీయాలకు రాలేదన్న పవన్ మొన్న కాపుల గురించి ఎందుకు అడిగాడని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్ నువ్వు మారవని తెలుసు.. బాధ్యతతో మెలుగు.. అని పేర్కొన్నారు. -
న్యాయమూర్తులకు నైతికతే కీలకం
న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తులు అత్యున్నత నైతిక స్థలాన్ని ఆక్రమిస్తారని, న్యాయ కల్పనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో వీరు ఎంతదూరమైనా వెళ్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏస్థాయిలోని న్యాయమూర్తైనా అత్యున్నత ప్రమాణాలను ఆచరించాలని తెలిపింది. సివిల్ జడ్జిగా నియమించేందుకు తాను అనర్హుడినంటూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు న్యాయమూర్తి, నైతికతపై వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్‌పై కొన్ని ఎఫ్ఐఆర్లు దాఖలైనట్లు, కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకున్నట్లు గమనించామని కోర్టు తెలిపింది. ఏ కేసులో శిక్ష పడనందున ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను పక్కనబెడుతున్నట్లు తెలిపింది. సివిల్ జడ్జి పోస్టుకు సరైనవారిని ఎంపిక చేయడం హైకోర్టు బాధ్యతని, కానీ ఈ సందర్భంలో హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. చదవండి: ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ -
పోలీసుల నుంచి ప్రాణహాని
సాక్షి, హైదరాబాద్/మక్తల్: ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2019, డిసెంబర్ 6న జరిగిన ఎన్కౌంటర్ ముందు, తర్వాతి సమయంలో చోటు చేసుకున్న ఘటనల గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు అధికారిని కమిషన్ వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా విచారించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ దర్యాప్తు అధికారి సురేందర్‌రెడ్డిని త్రిసభ్య కమిటీ లోతుగా ప్రశ్నించారు. ‘దిశ’సోదరిని కూడా విచారణ కమిషన్ చైర్మన్, సభ్యులు విచారించారు. ‘దిశ’ఫోన్ సంభాషణ, ఇతరత్రా వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. అలాగే ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆరీఫ్ తండ్రి హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తల్లి జయమ్మ, భార్య రేణుక.. శుక్రవారం త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో వారిని హైకోర్టు ఆవరణలోకి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులను విచారించిన కమిషన్.. వారి నుంచి సమాచారాన్ని, సాక్ష్యాలను సేకరించింది. ఊర్లో ఉన్నా.. హైదరాబాద్‌లో ఉన్నా.. తమకు పోలీసుల నుంచి ప్రాణహాని, బెదిరింపులు వస్తున్నాయని నిందితుల కుటుంబ సభ్యులు అఫిడవిట్ రూపంలో కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. లాడ్జ్ నుంచి బలవంతంగా.. వాస్తవానికి కమిషన్ విచారణ ఈనెల 26 (గురువారం)న ఉండటంతో నిందితుల కుటుంబసభ్యులు బుధవారం రోజునే హైదరాబాద్‌కు చేరుకొని కాచిగూడలోని ఓ లాడ్జ్‌లో దిగారు. ‘దిశ’కేసు నిందితుల తల్లిదండ్రులు లాడ్జ్‌లో ఉన్నా రని తెలుసుకుని కొందరు పలుమార్లు అక్కడికి వచ్చారని శివ తండ్రి రాజప్ప విలేకర్లకు తెలిపారు. హోటల్ యజ మాని తనకు తెలియదని పలుమార్లు చెప్పినా వినకుండా రాత్రి సమయంలో ఫోన్ చేసి బెదిరించారన్నారు. భయాం దోళనకు గురైన హోటల్ యజమాని గురువారం రాత్రి తమను బలవంతంగా ఖాళీ చేయించారని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఓ న్యాయవాది ఇంట్లో తలదాచుకున్నామని చెప్పారు. కాగా, విచారణ అనంతరం నిందితుల కుటుంబ సభ్యులను బందోబస్తు మధ్య నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు తీసుకెళ్లి వారి వారి ఇళ్లలో పోలీసులు విడిచిపెట్టారు. -
దిశ ఎన్‌కౌంటర్‌పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్/మక్తల్: సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ నేడు విచారించనుంది. గురువారమే విచారణ జరగాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నిందితుల కుటుంబసభ్యులకు సమన్లు జారీ చేశారు. త్రిసభ్య కమిటీ 18 మంది సాకులను విచారించనుంది. ఇదిలాఉండగా..తమకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని నిందితుల కుటుంబసభ్యులు బుధవారం కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో వారికి రక్షణ కల్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లో మృతి చెందిన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్‌కుమార్, శివల కుటుంబసభ్యుల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో.. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆరీఫ్ తండ్రి హుస్సేన్, నవీన్‌కుమార్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రా జప్ప, చెన్నకేశవులు తల్లి జయమ్మ, భార్య రేణు కలు బుధవారమే ఇళ్ల నుంచి వెళ్లిపోయారని.. రెం డురోజుల నుంచి హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది. అయితే వీరిని విచారణకు హాజరుకావొద్దని పోలీసులు బెదిరిస్తున్నారని జొళ్లు రాజప్ప ‘సాక్షి’కి తెలిపారు. ఈనెల 21న ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు దేవరకద్ర రోడ్ వద్ద బస్సుకోసం నిలబడగా..నంబరుప్లేటు లేని ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చి ఢీకొట్టేందుకు ప్రయత్నించగా..రోడ్డు కిందికి దిగిపోవటంతో దగ్గరకొచ్చి బెదిరించారని తెలిపారు. కేసువాపసు తీసుకోకపోతే చింతకుంట కుర్మప్ప (చెన్నకేశవులు తండ్రి)కు పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించారని ఆరోపించారు. -
జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలి
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సామాజిక న్యాయం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు బీసీ సంక్షేమ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని సీజేఐ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసన శంకర్రావుల ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం జస్టిస్ ఎన్వీ రమణను కలిసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. సీజేఐను కలిసిన వారిలో బీసీ నేతలు యుగేందర్ గౌడ్, క్రాంతికుమార్, శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, శ్యామ్, నరేశ్, శ్రీనివాస్‌గౌడ్, రంగనాథ్, విజయ్, సాయితేజ తదితరులున్నారు. అనంతరం ఢిల్లీలోని రోహిణిలో బీసీ పెడరేషన్ జాతీయ కార్యాలయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ప్రారంభించారు. -
ఇది ఘోరం, దారుణం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన సెక్షన్ ప్రకారం.. కేసులు నమోదు కావడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సోమవారం ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి నెటిజన్ల స్వేచ్ఛను హరించేదిగా ఉన్న ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ఏను అప్పట్లో కోర్టు తప్పుబట్టింది. అలాంటి సెక్షన్ మీదే ఇప్పుడు వెయ్యి దాకా కేసులు నమోదు కావడం పట్ల కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66-ఎను ఆరేళ్ల కిందటే సుప్రీం కోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే మార్చి 10, 2021నాటికి ఈ సెక్షన్‌కు సంబంధించి 745 కేసులు నమోదు అయ్యాయని, కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులకు సంబంధించి నిందితులు శిక్షలు అనుభవిస్తున్నారని ఓ ఎన్జీవో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ సెక్షన్‌కు సంబంధించి దేశంలోని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్రానికి సూచించింది కూడా. ‘‘ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. అది దాదాపుగా రద్దు చేయబడిన సెక్షన్. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. కేంద్రానికి నోటీసులు జారీ చేస్తాం’’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక జస్టిస్ నారీమణ్ ఈ వ్యవహారాన్ని ‘ఘోరం.. దారుణం’ అని పేర్కొన్నారు. పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో ఈ మేరకు పిటిషన్ దాఖలుచేయగా.. పరిశీలించిన ధర్మాసనం తప్పకుండా నోటీసులు జారీ చేస్తాం అని పేర్కొంది. సెక్షన్.. దుమారం సోషల్ మీడియాలో నెటిజన్స్‌ను నియంత్రించే పేరుతో 2008లో చట్టాన్ని సవరించి 66ఎ సెక్షన్ చేర్చారు. ఐటీయాక్ట్‌లోని సెక్షన్-66 ఎ కింద ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా అరెస్ట్ చేయొచ్చు. ఈ సవరణ చట్టానికి 2009 ఫిబ్రవరి 5న రాష్ట్రపతి ఆమోదించారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు మనోభావాల్ని, అభిప్రాయాల్ని సాధారణంగా వ్యక్తం చేసినా అరెస్ట్‌లు చేశారు. దీంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే 2012లో ముంబైలో ఇద్దరు యువతుల అరెస్ట్ ఈ అంశంపై విస్తృత చర్చకు దారితీసింది. 2012లో శివసేన చీఫ్ బాల్‌థాక్రే మరణం తర్వాత ముంబై బంద్ పాటించడాన్ని తప్పుబడుతూ.. పాల్గఢ్కు చెందిన ఓ అమ్మాయి పోస్ట్ చేయగా, దానికి మరో యువతి లైక్ కొట్టింది. దీంతో ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగంలో పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రాణ రక్షణకు, సమానత్వానికి హామీ ఇస్తున్న 14, 19, 21 అధికరణాలకు 66 (ఎ) సెక్షన్ భంగకరంగా ఉందంటూ 21 ఏళ్ల ఢిల్లీ న్యాయ విద్యార్థిని శ్రేయ సింఘల్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మార్చి 24, 2015 నాడు పౌరుల భావ ప్రకటనను నిరోధించే ఐటీ చట్టంలోని సెక్షన్ 66 A, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. -
ఏపీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజన్
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు. చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది.. స్మార్ట్ కిల్లర్స్.. రక్తం చుక్క బయట పడకుండా.. -
కెనడా సుప్రీంకోర్టుకు భారత మూలాలున్న వ్యక్తి నామినేట్
టొరంటో: కెనడా సుప్రీంకోర్టుకు భారత మూలాలున్న న్యాయమూర్తి జస్టిస్ మొహ్మద్ జమాల్‌ను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నామినేట్ చేశారు. కెనడా సుప్రీం కోర్టుకు నామినేట్ అయిన మొదటి శ్వేతేతర వ్యక్తి జమాల్ కావడం విశేషం. ప్రస్తుతం పదవీ విర మణ చేయనున్న రోసాలీ సిలబెర్ మాన్ అబెల్లా స్థానంలో జమాల్ తన విధులు నిర్వర్తి స్తారని ట్రూడో స్పష్టం చేశారు. దేశ ఉన్నత న్యాయస్థానంలో జమాల్ తన విధు లను చక్కగా నిర్వర్తిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. ఆయన్ను నామినే ట్ చేయడం కూడా సంతోషంగా ఉందని చెప్పారు. జమాల్ 1981లో కెన్యాలో పుట్టినప్పటికీ, ఆయన మూలాలు భారత్‌లో ఉన్నాయి. చదవండి: ఇరాన్లో ఎలక్షన్.. హైదరాబాద్‌లో ఓటింగ్ -
'లాడ్జికి తీసుకెళ్లి..వీడియోలు తీసి'.. ఎస్పీని కలిసిన కరాటే కల్యాణి
సాక్షి, నగరంపాలెం: హరికథ గానంలో తనకు పరిచయమైన యువతి మోసపోయిందని, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ సినీ సహాయ నటి కరాటే కల్యాణి, బాధితురాలు బుధవారం గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించారు. బాధితురాలి కథనం మేరకు.. గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్‌కు చెందిన యువతి 2018లో హరికథ విద్య నిమిత్తం తిరుపతి వెళ్లింది. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్ తషీఫ్ ఆమెకు పరిచయమయ్యాడు. 2019లో లాడ్జికి తీసుకెళ్లి ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయిన యువతిపై లైంగిక దాడి చేసి, వీడియోలో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత యువతి వయోలిన్ విద్య నేర్చుకునేందుకు హైదరాబాద్ వెళ్లగా, అక్కడకు తషీఫ్ వచ్చి మాయమాటలు చెప్పి ఆర్య సమాజంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొద్దిరోజులకు కర్నూల్ జిల్లాలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. యువతికి ఇష్టం లేకుండానే ముస్లిం సంప్రదాయంలో మళ్లీ వివాహం చేశారు. అత్తింటివారు బలవంతంగా మత మార్పిడి చేసుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. చదవండి : (వామ్మో.. మాయలేడి ఎంతపనిచేసింది!) (రాసలీలల కేసు: ఎవరి ఖాతాలో ఎంత ఉంది?!) -
సుప్రీంకోర్టు: నాటి త్రిమూర్తులు ఒక్కరై మిగిలారు..
న్యూఢిల్లీ: జస్టిస్ ఇందు మల్హోత్రా తాజాగా పదవీ విరమణ పొందడంతో సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఒకే ఒక మహిళా జడ్జి మిగిలారు! మూడేళ్ల క్రితం ఇందిరా బెనర్జీ చేరికతో సుప్రీం కోర్టులో ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు (అప్పటికే ఉన్న జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కలిపి) ఉండటం పెద్ద విశేషం అయింది. గత ఏడాది జూలైలో జస్టిస్ భానుమతి రిటైర్ అయ్యారు. ఇప్పుడు జస్టిస్ ఇందు మల్హోత్రా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం జస్టిస్ ఇందిర ఒక్కరే ఉన్నారు! నాటి త్రిమూర్తులు ఒక్కరై మిగిలారు. అరుదైన ఖగోళ అద్భుతంగా మూడేళ్ల క్రితం ఒక విశేషం వార్తల్లోకి వచ్చింది. ‘జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అడుగు పెట్టడంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లయింది’ అన్నది ఆ విశేషం. 2018 ఆగస్టున సుప్రీం కోర్టుకు వచ్చారు జస్టిస్ ఇందిర. మిగతా ఇద్దరు జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా. గత జూలైలో భానుమతి, మొన్న శనివారం ఇందూ మల్హోత్రా రిటైర్ అయ్యారు. ఇక మిగిలింది ఇందిరా బెనర్జీ ఒక్కరే. జస్టిస్ మల్హోత్రా పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘యంగ్ లాయర్స్ ఫోరమ్’ ఆమెకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య పెరగవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాజాగా పదవీ విరమణ పొందిన జస్టిస్ ఇందూ మల్హోత్రా బార్ కౌన్సిల్ నుంచి నేరుగా జడ్జి అయిన తొలి మహిళా జస్టిస్. సుప్రీంకోర్టులో ఆమె 30 ఏళ్లు పాక్టీస్ చేశారు. ప్రస్తుతం మిగిలిన ఏకైక మహిళా జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీం కోర్టులో చరిత్రలో 8 వ మహిళా న్యాయమూర్తి. వచ్చే సెప్టెంబరులో జస్టిస్ ఇందిర పదవీ విరమణ పొందేలోపు కొత్త మహిళా న్యాయమూర్తి రాకపోతే ఆమె తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులే కనిపించని పరిస్థితి ఉంటుంది. భారత సుప్రీంకోర్టు ఏర్పాటైన (1950) నలభై ఏళ్లకు 1989 అక్టోబరులో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టుకు తొలి మహిళా జడ్జిగా వచ్చారు. 1992 ఏప్రిల్ వరకు ఉన్నారు. జస్టిస్ ఫాతిమా తర్వాత జస్టిస్ సుజాత మనోహర్ (1994–1999), జస్టిస్ రుమాపాల్ (2000–2006), జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా (2010–2014), జస్టిస్ రంజనా దేశాయ్ (2011–2014), జస్టిస్ భానుమతి (2014–2020), జస్టిస్ ఇందూ మల్హోత్రా (2018–2021) సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తులుగా సేవలు అందించారు. ప్రస్తుతం ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలోనే సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన అనేక కమిటీలలో పనిచేశారు. -
కట్టుకున్నోడే పుస్తేలు తెంపేశాడు!
కోరుట్ల: తాళి కట్టిన భర్త పుస్తెల తాడు లాక్కెళ్లడంతో మనస్తాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించి కెనాల్ వద్ద కళ్లు తిరిగిపడిపోయిన ఘటన మహిళా దినోత్సవం రోజు కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన ఎన్నమనేని హర్షిత అలియాస్ నాగరాణి(25)కి ఆరు నెలల క్రితం కొడిమ్యాల మండలం కోనాపూర్‌కు చెందిన ఎన్గందుల రాజేందర్(41)తో వివాహమైంది. రాజేందర్‌కు రెండో వివాహం కాగా కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. ప్రతీరోజు రాజేందర్ తాగి వచ్చి హర్షితను కొట్టడం, తిట్టడం చేసేవాడు. దీంతో విసిగిపోయిన హర్షిత కొన్ని రోజుల క్రితం గంభీర్‌పూర్‌కు వచ్చింది. శనివారం రాత్రి గంభీర్‌పూర్‌కు వచ్చిన రాజేందర్ మళ్లీ హర్షితతో గొడవపడి ఆదివారం ఉదయం పుస్తెలతాడు లాక్కెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత గంభీర్పూర్ నుంచి కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు వెళ్లింది. అక్కడ నీటి ప్రవాహాన్ని చూసి కళ్లు తిరిగిపడిపోయింది. చుట్టుపక్కల రైతులు ఆమెను గమనించి వివరాలు తెలుసుకుని వెంటనే బంధువులకు సమాచారమిచ్చారు. కోరుట్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే హర్షిత పెద్దమ్మ కారంగుల శ్యామల కెనాల్ వద్దకు వచ్చి ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించింది. హర్షిత ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. తనకు న్యాయం చేయాలని హర్షిత కోరుతోంది. -
చట్ట పరిమితులు దాటిన ‘న్యాయం’
తనపై సంవత్సరాలుగా అత్యాచారం సాగిస్తూ వచ్చిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చిన వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అత్యంత అసహ్యకరమైనదిగానే భావించాల్సి ఉంటుంది. సాక్షాత్తూ అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనమే అత్యాచార నేర చర్యను చట్టవిరుద్ధంగా మాఫీ చేయవచ్చని, రాజీ కుదుర్చవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు, తాము అత్యాచారం చేసిన మహిళలను పెళ్లి చేసుకుంటే చాలు తమకు క్షమాభిక్ష లభిస్తుందనే ప్రమాదకర సంకేతాలు లైంగిక నేరస్తులకు అందటం ఖాయం. మైనారిటీ తీరని బాలికపై అత్యాచారం చేసిన సీరియల్ రేపిస్టుకు ఆమెను పెళ్లాడతావా అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ప్రతిపాదించిన క్షణంలో మన దేశంలో కొనసాగుతున్న పితృస్వామిక దురభిప్రాయాలు, స్త్రీ ద్వేషం పూర్తి స్థాయిలో ప్రదర్శితమయ్యాయనే చెప్పాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించింది ఎవరినో కాదు.. లైంగిక దాడుల నుంచి పిల్లల పరిరక్షణ చట్టం 2012, భారతీయ శిక్షా స్మృతిలోని 376, 417, 506 సెక్షన్ల కింద అత్యాచారం, నేరపూరితంగా బెదిరించడం వంటి ఆరోపణలపై కేసులున్న నిందితుడికి సుప్రీం చీఫ్ జస్టిస్ ఈ విధమైన ప్రతిపాదన చేశారు. తన సమీప బంధువైన బాధితురాలి ఇంట్లోకి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవేశించిన నేరస్థుడు ఆమె కాళ్లు చేతులను కట్టివేసి తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పుడు ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతూ ఉండింది. ఆమె 12వ తరగతిలోకి వచ్చేంతవరకు ఆమెను అతగాడు పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. తనకు, తన కుటుంబానికి హాని కలిగిస్తానని బెది రించి మరీ ఈ పనికి పాల్పడ్డాడు. పైగా ఈ ముష్కరుడు మోటార్ సైకిల్లో పెట్రోల్ క్యాన్ పెట్టుకుని మరీ ఆమెను అనుసరిస్తూ సజీవ దహనం చేస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఈ భయానక నేరం ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు గానీ ఆమె తల్లిదండ్రులకు తెలీలేదు. చదువులేని ఆ బాధితురాలి తల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని వెళితే, ఆమె నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి బదులుగా ఆమె కుమార్తెకు, నిందితుడికి మధ్య పరస్పర సమ్మతితోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్లు స్టాంప్ పేపర్‌పై కన్నతల్లి చేత సంతకం పెట్టించుకున్నారు. పైగా ఆ అమ్మాయికి మైనారిటీ తీరాక తన కొడుకు ఆమెను పెళ్లాడతాడని నిందితుడి తల్లి హామీ ఇచ్చింది. కానీ హామీని నింది తుడు భంగపరిచిన తర్వాతే పోక్సో చట్టం కింద అతగాడిపై ఫిర్యాదు నమోదు చేశారు. అదనపు సెషన్స్ జడ్జి మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్‌ని బాంబే హైకోర్టు కొట్టివేశాక నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సెషన్స్ జడ్జి అహేతుకంగా, యథేచ్ఛగా, చంచలత్వంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేశారని బాంబే హైకోర్టు పేర్కొనడమే కాకుండా, న్యాయవ్యవస్థ తనపై పెట్టిన బాధ్యతను విస్మరించారంటూ సెషన్స్ జడ్జిని అభిశంసించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యంలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమక్షంలో నిందితుడితో చీఫ్ జస్టిస్ చేసిన సంభాషణను పరిశీలించవలసి ఉంటుంది. ఈ కేసులో నిందితుడి తరపు లాయర్‌తో మాట్లాడిన చీఫ్ జస్టిస్ ‘బాధితురాలిని పెళ్లాడాలనుకుంటే మేము నీకు సాయం చేస్తాం. అలా కాకుంటే నీ ఉద్యోగాన్ని పోగొట్టుకుని జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నీవు ఆ అమ్మాయిని వేధించావు, అత్యాచారం చేశావు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం చేయడానికి ముందు నీవొక ప్రభుత్వ ఉద్యోగివి అనే విషయం ఆలోచించాల్సి ఉండిందని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. దానికి నిందితుడు స్పందిస్తూ, ప్రారంభంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆమె వ్యతిరేకించిందని, ఇప్పుడు తనకు పెళ్లయింది కాబట్టి ఆమెను పెళ్లాడలేనని సమాధానమిచ్చాడు. అప్పుడు సుప్రీంకోర్టు నిందితుడు తన పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అతడిపై విధించిన అరెస్టు ఆదేశంపై నాలుగువారాల పాటు స్టే విధించింది. పెళ్లి-సాంత్వన, శిక్ష, మినహాయింపు తనపై సంవత్సరాలుగా అత్యాచారం సల్పిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చడమే కాకుండా, ఆ వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా రాజ్యాంగంపై, లైంగిక సమానత్వం అనే మానవ విలువపై విశ్వాసం ఉంచుకున్న ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అసహ్యకరమైనది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలు అంతకాలం అనుభవించిన బాధ, మానసిక అఘాతం, అవమానం, ఆగ్రహం వంటివన్ని మంత్రించినట్లుగా మాయమైపోతాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భావిస్తున్నారా? నిందితుడి తల్లి తన కుమారుడితో పెళ్లికి ఒప్పుకోవాలని బాధితురాలి తల్లికి చేసిన ప్రతిపాదనను ఆమె ఆమోదించాల్సి వచ్చింది అంటేనే దాన్ని మహిళను నియంత్రిం చడానికి పితృస్వామిక ఆధిపత్యపు విషాద వ్యక్తీకరణగానే చూడాల్సి ఉంటుంది. దెబ్బతిన్న మహిళను లొంగదీయడానికి పరువు, అవమానాలను మన సమాజం నేటికీ ఆయుధాలుగా ఉపయోగి స్తోంది. ఈ కేసులో బాధితురాలు ఆనాటికి మైనర్‌గా ఉంటున్నందున ఆమె సమ్మతి తీసుకోవడం అనేది సమస్యే కాదు. కన్నకూతురిని బలాత్కరించిన వ్యక్తితో పెళ్లికి కన్నతల్లి ఆమోదం తెలపడం మన దేశ అమ్మాయిలపై తల్లిదండ్రులకు ఉన్న ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది. మహిళ శరీరంపై అధికారం ఎవరిది? తనపై అత్యాచారం చేసిన నిందితుడిని పెళ్లాడాల్సిందిగా బాధితురాలిని తాను బలవంతపెట్టలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలి మానసిక స్థితిని అంచనా వేయడానికి ముందే నిందితుడికి ఇలాంటి ప్రతిపాదన చేయడమే వింత. ఒకవేళ నిందితుడు బాధితురాలిని పెళ్లాడటానికి అంగీకరించి ఉంటే, తర్వాతైనా బాధితురాలి అభిప్రాయాలను, సమ్మతిని న్యాయస్థానం తెలుసుకుని ఉండేదా? తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తితో సంబంధంలోకి వెళ్లడం అనే భావననే బాధితురాలు సహించలేదని, తిరగబడుతుందని న్యాయమూర్తులకు తెలీదా? అందులోనూ శారీరకంగా, భావోద్వేగపరంగా తనపై దాడిచేసిన వ్యక్తికి సంబంధించిన విషయం ఇది. బాధితురాలికి రేపిస్టుతోనే పెళ్లి చేయడం ద్వారా ఆమెకు కనీస ప్రమాణాలతో కూడిన పవిత్రతను కలిపించడం అంటే తనపై లైంగిక దాడిచేసిన వ్యక్తితో జీవితకాల సంబంధాన్ని వ్యవస్థాగతంగా ఏర్పర్చడంలోని భయానకమైన స్థితిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాదా? దెబ్బతిన్న మహిళలకు ఉత్తమ ప్రయోజనాలు కలిగించడానికే తాను పనిచేస్తున్నానని ఉన్నత న్యాయస్థానం నిజంగా నమ్ముతోందా? దీన్ని మరోలా చూద్దాం. నీ శరీరంపై నీ హక్కును ఉల్లంఘించారు. కానీ నీ సొంత ప్రయోజనం కోసమే నీ శరీరాన్ని నీ సమ్మతి లేకుండా పాశవికంగా, బలవంతంగా తాకి బలాత్కరించిన వ్యక్తే నీ గౌరవాన్ని పునరుద్ధరించగలడని నేను హామీ ఇవ్వగలను, నిన్ను తన భార్యగా స్వీకరించి దయదల్చడం ద్వారా నిందితుడు నీకు కలిగిన నష్టాన్ని పూడ్చగలడు అనే అంశాన్ని న్యాయస్థానం ఈ కేసులో సూచిస్తోందా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం ప్రకటించిన వేలాదిమంది లైంగిక సమానత్వ ఉద్యమకారులు చీఫ్ జస్టిస్ బాబ్డేకి బహిరంగ లేఖ రాస్తూ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, దేశంలోని మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని, అంతేకాకుండా ఆయన వెంటనే తన పదవినుంచి దిగిపోవాలని కూడా డిమాండ్ చేశారు. న్యాయస్థానాల్లో తమ విధులను నిర్వర్తిస్తున్న సమయంలో జడ్జీలు స్వేచ్ఛగా ఇలాంటి అసంబద్ధ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నప్పుడు, లైంగిక న్యాయం, సమానత్వానికి సంబంధించి రాజ్యాంగపరమైన విలువలను పాటించే, అమలు చేసే శక్తి మన న్యాయమూర్తులకు ఉందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎస్. దేవిక, న్యాయవాది, చెన్నై (ది వైర్ సౌజన్యంతో) -
కులాంతర వివాహం..మనస్తాపంతో ఆత్మహత్య!
జమ్మికుంట(హుజూరాబాద్): భర్త ఆత్మహత్య చేసుకోగా కూతురికి న్యాయం చేయాలని ఓ వివాహిత తన అత్తింటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణ కాలనీకి చెందిన దాస్యపు సాయిచైతన్య, మునిగంటి మమత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. సాయిచైతన్య కులాంతర వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ అతన్ని వదిలేసి కరీంనగర్లో ఉన్నారు. ఈ క్రమంలో చిన్నచిన్న గొడవలు జరిగి, మమత కూడా సాయిచైతన్యను వదిలేసి, కూతురిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఒంటరైన అతను గత డిసెంబర్లో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి మృతుడి తల్లిదండ్రులు కృష్ణ కాలనీలోని తమ ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా తాను భర్త ఇంట్లోనే ఉంటానని, తన కూతురికి న్యాయం చేయాలంటూ మమత కుటుంబసభ్యులతో కలిసి సోమవారం వారి ఇంటి ఎదుట బైఠాయించింది. సాయిచైతన్య తల్లిదండ్రులు స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై ప్రవీణ్‌రాజ్ తన సిబ్బంది కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని సూచించినా ఆమె వినలేదు. దీంతో సాయిచైతన్య తండ్రిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయిచైతన్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేసు నమోదు చేశామని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విచారణ చేపట్టి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. -
వివాదాస్పద తీర్పులు: ప్రమోషన్‌కు ఎసరు
న్యూఢిల్లీ: బాలికలపై లైంగికదాడి కేసులో వివాదాస్పద తీర్పులు ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం రేపారు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేదివాలా. ఆ తీర్పులే ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. ఆమెకు పదోన్నతి కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప మరో ఏడాదిపాటు అదనపు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఈ మేరకు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సాధారణంగా అదనపు న్యాయమూర్తి పదవీకాలం రెండేళ్లు. ఈ లెక్కన జస్టిస్ పుష్ప అదనపు న్యాయమూర్తి పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఈ పదవీకాలం ముగిసిన తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా ఆమెకు పదోన్నతి కల్పించాలి. కానీ పదోన్నతి కల్పించకుండా కేంద్ర న్యాయశాఖ ఆమెకు షాకిచ్చింది. జస్టిస్ పుష్పకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించకుండా.. మరో ఏడాది కాలం పాటు ఆమె అదనపు న్యాయమూర్తిగానే కొనసాగుతారని కేంద్రం తెలిపింది. దీనికి గల కారణాలు ఆమె గతనెలలో ఇచ్చిన తీర్పులేనని బహిరంగ రహాస్యం. ఆమె వివాదాస్పద తీర్పులు ఇవ్వడంతోనే సుప్రీంకోర్టు వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. ఆమె గతనెలలో ఇచ్చిన వివాదాస్పద తీర్పులు ఇవే.. ‘నేరుగా బాలిక శరీరాన్ని తాకనప్పుడు ఆ కేసు పోక్సో కిందకు రాదు’ అని జస్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ‘బాలిక చేతిని పట్టుకుని, అతను ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రాన పోక్సో చట్టం కింద దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేం’ మరో కేసులో జస్టిస్ పుష్ప తెలిపారు. ఈ రెండు తీర్పులను గత నెలలో జస్టిస్ పుష్ప ఇచ్చారు. గతంలో జస్టిస్ పుష్ప బ్యాంకులు, బీమా కంపెనీలకు న్యాయవాదిగా పని చేసేవారు. దీంతో పాటు కొన్ని కళాశాలల్లో అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. 2007లో జిల్లా జడ్జిగా ఆమె నియమితులు కాగా ఫిబ్రవరి 13, 2019లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదోన్నతి వచ్చి ఉంటే శాశ్వత న్యాయమూర్తిగా ఆమె నియమితులయ్యే వారు. -
ఎనిమిదేళ్ల బాలికపై దారుణం.. ‘జస్టిస్‌ఫర్‌ఖుషి’
కోల్‌కతా: నాలుగు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల చిన్నారిని పాడుబడిన బిల్డింగ్‌లోకి తీసుకెళ్లి అత్యంత పాశవీకంగా అత్యాచారం చేసి.. హత్య చేశారు దుండగులు. బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక గత బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దాంతో చిన్నారి బంధువులు తన కోసం వేతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బాలిక బంధువుల ఇంటికి సమీపంలోని ఓ పాడుపడిన బిల్డింగ్‌లో చిన్నారిని గుర్తించారు. బాలికకు ఒంటి మీద బట్టలు సరిగా లేవు.. గొంతు కోశారు.. చిన్నారి పళ్లు ఉడిపోయాయి. బాధితురాలిని ఈ స్థితిలో గమనించిన పోలీసులు.. చిన్నారి మృగాళ్ల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఎంతో పెనుగులాడి ఉంటుందన్నారు. ఇక ఈ దారుణానికి ఒడిగట్టిన వారు బాధితురాలికి తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక తమను గుర్తుపడుతుందనే ఉద్దేశంతోనే నిందితులు చిన్నారిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇక దారుణంపై నెటిజనులు విపరీతంగా మండిపడుతున్నారు. బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్లో ‘‘జస్టిస్‌ఫర్‌ఖుషి’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందించకపోవడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మమత రాజ్యంలో ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది’’.. ‘‘సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడుకునే రోజులు పోవాలని కోరుకుంటున్నాం’’.. ‘‘మనం ఎటువైపు వెళ్తున్నాం.. హింసకు ముగింపు లేదా’’.. ‘‘ఈ దేశంలో మహిళలకు భద్రత లభించాలంటే ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలి.. ఎంత మంది ఆడకూతుళ్లు బలవ్వాలి’’ అంటూ నెటిజనులు విరుచుకుపడుతున్నారు. చదవండి: అత్యాచారం: టీచర్ ఒత్తిడి వల్లే అలా చెప్పాను -
అందరికీ న్యాయం.. డబ్బే అడ్డంకి: కోవింద్
న్యూఢిల్లీ: అందరికీ న్యాయాన్ని అందించడంలో ప్రధాన అడ్డంకి డబ్బేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్వహించిన 71 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో కూడా అందరికీ న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ, బార్‌కౌన్సిల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కృషి చేశాయన్నారు. ఉన్నత న్యాయస్థానం తమ తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవడం అభినందించదగిన విషయమని చెప్పారు. ఉన్నత ప్రమాణాలూ, ఆదర్శాలూ, కీలక తీర్పులతో న్యాయవ్యవస్థ బలోపేతం అయ్యిందని, సుప్రీంకోర్టు ప్రతిష్ట పెరిగిందని అన్నారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను సాధించడం గురించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమణ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యంత్ దావేలు కూడా ఉపన్యసించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పాల్గొన్నారు. -
అమెరికాలో సుశాంత్ బిల్ బోర్డులు తొలగింపు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన బిల్ బోర్డులను తొలగించడానికి అమెరికా మీడియా సంస్థ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్‌కు తెలిపింది. ఈ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను శ్వేత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో కొన్ని బిల్ బోర్డులను అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రచారం ద్వారా ఆయనతో సంబంధం ఒక మహిళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆ మీడియా సంస్థ మెయిల్లో తెలిపింది. ఆ కారణంగానే ఆ బిల్ బోర్డులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. It seems the paid PR has it’s reach everywhere. Hollywood Billboard company reached out telling they will not keep the Billboard any longer! The wordings on the billboard only demanded fair trial and justice! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR pic.twitter.com/YrMrLH3eIX — shweta singh kirti (@shwetasinghkirt) September 3, 2020 దీనిపై శ్వేత సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పెయిడ్ పీఆర్ ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తోంది. ఈ కారణంగానే హాలీవుడ్ బిల్‌బోర్డు సంస్థ సుశాంత్ బిల్బోర్డును తొలగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. బిల్‌బోర్డు ద్వారా న్యాయమైన విచారణ, న్యాయం మాత్రమే కోరుతున్నాము! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR అని ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 వ తేదిన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తరువాత ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రచారం సాగుతోంది. View this post on Instagram Thanks Chicago! 🙏❤️🙏 Lets Stay United and keep demanding justice for Sushant. #JusticeForSushantSinghRajput #GlobalParyerForSSR A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 1, 2020 at 12:38pm PDT చదవండి: సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ -
ఏఆర్ లక్ష్మణన్ ఇక లేరు!
సాక్షి, చెన్నై: భార్య మీనాక్షి మరణంతో తీవ్ర మనోవేదనలో ఉన్న జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ (78) గుండెపోటుతో గురువారం మృతిచెందారు. ఈ సమాచారంతో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. తమిళనాడు, కేరళ, రాజస్తాన్, ఆంధ్రా హైకోర్టులలోనే కాదు సుప్రీంకోర్టులోనూ అనేక కీలక కేసులకు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తి ఏఆర్ లక్ష్మణన్. పదవీ విరమణ అనంతరం చెన్నైలో భార్య మీనాక్షితో కలిసి ఉంటున్నారు. గతవారం మనుమడి వివాహం నిమిత్తం చెన్నై నుంచి శివగంగై వెళ్లారు. ఈ వేడుక అనంతరం హఠాత్తుగా ఆయన సతీమణి మీనాక్షి అనారోగ్యం బారినపడి మంగళవారం మృతిచెందారు. భార్య మరణంతో ఏఆర్ లక్ష్మణన్ తీవ్ర మనోవేదనలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. తొలుత శివగంగై జిల్లా కారైక్కుడి, ఆ తర్వాత తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ లక్షణన్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబీకులు తీవ్ర మనోవేదనలో పడ్డారు. ఈ సమాచారంతో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, డీఎంకే అధ్యక్షుడు , ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. దేవకోట్టై నుంచి ఢిల్లీ వరకు.. శివగంగై జిల్లా దేవకోట్టైకు చెందిన ఏఆర్ లక్ష్మణన్ చిన్నతనం నుంచి న్యాయశాస్త్రం అభ్యషించాలని ఆశించారు. పట్టుదలతో ముందుకు సాగారు. శివగంగైలో ప్రాథమిక, తిరుచ్చిలో ఉన్నత విద్యను అభ్యసించారు. చెన్నై న్యాయ కళాశాలలో లా చదివారు. చెన్నైకు చెందిన న్యాయవాది జీవానందం వద్ద జూనియర్‌గా చేరి ముందుకు సాగారు. 1988లో మద్రాసు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా అవతరించారు. 1990లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 1997లో కేరళ హైకోర్టు ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తర్వాత రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో పనిచేశారు. 2002 నుంచి 2007 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ సమయంలో అనేక కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. ఇందులో పబ్లిక్ స్థలాల్లో ధూమపానం నిషేధం అన్నది కీలకం. పదవీ విరమణ అనంతరం న్యాయ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ముల్లై పెరియార్ జలవివాదం వ్యవహారంలో తమిళనాడు ప్రతినిధిగా కీలక పాత్రను పోషించారు. -
జస్టిస్ ఫర్ సుశాంత్.. నిజాలు బయటపెట్టాలి
సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో న్యాయం చేయాలని కోరుతూ సుశాంత్ సోదరి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ నిజాలు బయటపడవు. జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో గత కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజేంద్రనగర్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రియాతోపాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్ ఆత్మహత్యకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విమర్శలు చేయని.. సుశాంత్ కుటుంబం ఇప్పుడు రియాపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తికి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. (సుశాంత్ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు నమోదు) సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్లో పెను ప్రకంపనలు సృష్టించింది. నెపోటిజంపై బాహాటంగానే విమర్శలు చేసిన నటి కంగనా రనౌత్ బీటౌన్‌లో పెద్ద చర్చను లేవనెత్తారు. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా సుశాంత్‌ను బెదిరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఛైర్మన్ ఆదిత్య చోప్రా వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ నిర్మాణ సంస్థ సుశాంత్‌తో మూడు సినిమాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నా రెండు మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్ పై కూడా కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం సీఈఓ అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఒకవేళ అవసరమైతే కరణ్ జోహార్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని మహారాష్ర్ట హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సైతం ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనౌను కూడా విచారణకు పిలవగా ప్రస్తుత కరోనా నేపథ్యంలో తాను ముంబై రాలేనని, తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అధికారుల బృందాన్ని మనాలికి పంపాలని, లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని పేర్కొంది. కాగా సుశాంత్ ఆత్మహత్య కేసుసు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటివరకు 42 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. (‘కంగనపై ఈర్ష్య, అసూయతోనే విమర్శలు’) View this post on Instagram If truth doesn’t matter, nothing ever will! #justiceforsushantsinghrajput A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 28, 2020 at 12:51pm PDT -
ముచ్చటైన బండి.. సరదా తీర్చేనండి !
నాగపూర్: అత్యంత ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైక్ అంటే ముచ్చటపడని వారు ఉంటారా? ఒక్కసారైనా దానిపై కూర్చోవాలని ఆశ పడుతుంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే్డ సైతం ఆ ముచ్చట తీర్చుకున్నారు. నిత్యం విధి నిర్వహణలో తీరిక లేకుండా గడిపే ఆయన తన సొంత ఊరు మహారాష్ట్రలోని నాగపూర్‌లో హార్లీ డేవిడ్సన్ బైక్‌పై కాసేపు కూర్చొని సరదా పడ్డారు. సీవీఓ 2020 అనే ఈ లిమిటెడ్ ఎడిషన్ బండి భారతీయ జనతా పార్టీ నాయకుడు సోన్బా ముసాలే కుమారుడికి చెందినది. అయితే, యజమాని ఎవరనే విషయం జస్టిస్ బాబ్డేకు తెలియదు. నాగపూర్‌లోని ఓ వాహన డీలర్ ఈ బైక్‌ను జస్టిస్ బాబ్డేకు చూపేందుకు తీసుకొచ్చారు. తన పదవీ విరమణ తర్వాత ఇలాంటి బైక్‌ను కొనుక్కోవాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే చెప్పారు. మోటార్ సైకిళ్లంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. -
జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్
హీరోయిన్ ఒక హత్య చూస్తుంది. కెవ్వున అరుస్తుంది. పోలీసులకు చెప్పడానికి పరుగెడుతుంది. హీరో ఒక హత్య చూస్తాడు. కెవ్వున అరవబోయిన.. హీరోయిన్ నోటిని చేత్తో మూసేస్తాడు. అతడి రియాక్షన్ తర్వాతెప్పుడో ఉంటుంది. అమె స్పందన మాత్రం వెంటనే ఉంటుంది. తమిళ పోలీసుల ‘బ్రూటాలిటీ’ పై ఇప్పుడు హీరోయిన్లే ముందుగా స్పందించారు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్’ అని నినదిస్తున్నారు. స్త్రీలో ఉండే సహజ గుణమే ఇది.. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించడం. ప్రియాంక చోప్రా శాడ్ అండ్ యాంగ్రీ. నేరం ఏదైనా, చనిపోయేంతగా నిందితుల్ని కొట్టడం అమానుషం. ఆ తండ్రీకొడుకుల కుటుంబాల పరిస్థితిని ఊహించలేకపోతున్నాను. మనమంతా వారికి సపోర్ట్‌గా నిలవాలి. వారి తరఫున మాట్లాడాలి. కరీనా కపూర్ ఇంతటి దుర్మార్గాన్ని సహించకూడదు. కాఠిన్యంపై నోరు తెరవడం మన సామాజిక బాధ్యత. మళ్లీ మళ్లీ ఇలాంటివి జరగకుండా పోరాడాలి. బాధితులకు న్యాయం జరిగేవరకు వారికి మద్దతుగా నిలవాలి. ఖష్బూ జయరాజ్ బెనిక్స్‌ల విషయంలో చట్టం తన పని తను చేసుకుపోయి దోషులైన పోలీసులకు శిక్ష విధిస్తుందని మనం ఆశించవచ్చా? వాళ్ల కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాజల్ అగర్వాల్ నా మనసును మెలిపెట్టింది. సిక్ అయ్యాను. దీనిపై మౌనం వహించకూడదు. అందరం మన నిరసనను వినిపించాలి. ఆ తండ్రీకొడుకుల కుటుంబ సభ్యులకు అండగా ఉండాలి. తాప్సీ పన్ను తరచు జరుగుతుండే వాటిలో ఇదొకటి కావచ్చు. కానీ ఈ ఒక్కటీ ఇక ముందు ఇలాంటివి జరక్కుండా ఉండేందుకు దోహదం అవ్వాలి. వాళ్లెవరో తెలియని వారు కావచ్చు. కానీ వారిపై జరిగిన అమానుషం భీతినిగొల్పింది. నరాలను మెలితిప్పింది. హన్సిక వింటేనే భీతిగొల్పుతోంది! పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే అవమానం. దేశానికి కూడా. దోషుల్ని ఉపేక్షించకూడదు. వారిని చట్టం ముందు నిలబెట్టి తీరాలి. జెనీలియా నిశ్చేష్టురాలిని అయ్యాను. ఆ ఘటన గురించి విని నా మనసు గాయపడింది. ఇలాంటిది జరగవలసింది కాదు. గుండె పగిలిపోయింది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రకుల్ ప్రీత్‌సింగ్ గుండె బద్ధలైపోయింది. మనసు చెడిపోయింది. ఈ క్రూరత్వం అమానుషమైనది. కడుపులో తిప్పేసింది. వారి కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి. ‘సింగం’ వన్, టు, త్రీ.. సినిమాల డైరెక్టర్ హరి గోపాలకృష్ణన్ ‘డీప్ షాక్’లో ఉన్నారు. పోలీసుల్ని తనెంతో ఉన్నతంగా, గొప్పగా చూపించాడు! కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. తమిళనాడులో ఇద్దరు తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురై మరణించిన ఘటనను డైరెక్టర్ హరి మరచిపోలేకపోతున్నారు. పోలీసులను హీరోలుగా చూపించినందుకు ప్రాయశ్చిత్తంగా ఇక ఆయన సింగమ్ 4ను తీయాలన్న తన ప్రయత్నాలను విరమించుకోవచ్చనే అనిపిస్తోంది. అయితే ‘సింగమ్’ సిరీస్ హీరో సూర్య ఇంతవరకు ఆ తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై నేరుగా ఏమీ వ్యాఖ్యానించలేదు! బహుశా ఇవాళో, రేపో ఏమైనా ఖండన వంటిదేమైనా ట్వీట్ చేస్తారేమో. వాస్తవానికి ఇప్పటికే ఆయన ఒక ‘పోలీస్ హీరో’గా తన అభిప్రాయాన్ని వెల్లడించవలసింది. ఆయన ఒక్కరనే కాదు, మిగతా స్టార్ హీరోలు కూడా! ఘటన జరిగి నేటికి వారం. చప్పుడు లేదు. ఉండవలసినంత లేదు. యు.ఎస్.లో గత నెల జార్జి ఫ్లాయిడ్ ఏ విధంగానైతే ఒక పోలీసు చేతిలో చనిపోయాడో.. అదే విధంగా తమిళనాడు, తూత్తుకుడి సమీపంలోని శంతన్కుళంలో తండ్రి జయరాజ్ (58), కొడుకు బెన్నిక్స్ పోలీస్ కస్టడీలో చనిపోయారు. లాక్డౌన్ పని వేళల ఆంక్షల్ని ఉల్లంఘించి తమ సెల్‌ఫోన్ దుకాణాన్ని నడుపుతున్నారన్న ఆరోపణపై ఈ నెల 19 ఆ తండ్రీకొడుకులను పోలీస్‌లు ఆరెస్ట్ చేసి తీసుకెళ్లారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తీవ్ర రక్తస్రావంతో జూన్ 22 సాయంత్రం కొడుకు, 23 ఉదయం తండ్రి చనిపోయారు. ఏడు రోజులైంది. మానవ హక్కుల సంఘాల వాళ్లింకా పూర్తిగా బయటికి రాలేదు! తమిళ ప్రముఖులెవరూ ఖండనలు ఇవ్వలేదు! హర్హా భోగ్లే, శిఖర్ ధావన్, రితేశ్ దేశ్‌ముఖ్, రాజ్‌దీప్ సర్దేశాయ్, హీరో విశాల్, రాహుల్ గాంధీ, జయం రవి, జీవా.. మరి కొందరు మాత్రం పోలీసుల ‘బ్రూటల్ యాక్ట్’ తమను నిర్ఘాంతపరిచిందని సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు. తమిళనాడు సీయం స్పందించి, కేసును సీబీఐకి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టును కోరబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. అందరికంటే ముందుగా, ఎక్కువగా బాలీవుడ్ నటీమణులు ఈ ఘటనపై మాట్లాడ్డం, న్యాయం జరగాలని కోరడం, పోలీసుల దౌర్జన్యానికి నిరసన తెలియజేయడం విశేషం. మునుపెన్నడూ ఇంతమంది హీరోయిలు ఇలా బయటికి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నీ’ అంటూ ప్రియాంకా చోప్రా లాజ్ ఏంజెలిస్ నుంచి ట్వీట్ చేశాక.. సింగర్ సుచిత్ర.. పోలీసుల రాక్షసత్వం పై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆ తండ్రీ కొడుకులను ఎలా చిత్రహింసలు పెట్టి చంపిందీ తమిళ్లో, ఇంగ్లిష్‌లో వివరించారు. ఇంకా.. హన్సిక, ఖుష్బూ, ఐశ్వర్యా రాజేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, పరిణీతి చోప్రా, ఈషా రెబ్బా, రమ్యా సుబ్రహ్మణ్యన్, తమన్నా భాటియా, కైరా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్, జెనీలియా, కాజల్ అగర్వాల్, తాప్సీ, కరీనా కపూర్.. ఆ ఘటన తమను ఎంతగానో నిర్ఘాంత పరిచిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. మౌనంగా ఉండటం సేఫ్ అనే భావన సాధారణంగా సెలబ్రిటీలలో ఉంటుంది. ఏమాట అంటే ఎటుపోయి వస్తుందోనన్న భయం కూడా ఉంటుంది. వీళ్లేం చేశారో, వాళ్లకెందుకు అంత కోపం వచ్చిందో అని ఆలోచించేవారూ ఉంటారు. అయితే హీరోయిన్లు అలా అనుకోవడం లేదు. నిజమైన హీరోల్లా తమ కోపాన్ని, తమ ఆవేదనను, తమ మనసులోని మాటను ధైర్యంగా బయటికి చెబుతున్నారు. -
వారి మరణం ఆమోదయోగ్యం కాదు: సునీల్ ఛెత్రి
న్యూఢిల్లీ: తమిళనాడులో పోలీసుల కస్టడీలో మరణించిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్‌లకు న్యాయం జరగాలని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఇప్పటికే వారి మరణానికి న్యాయం జరగాలంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. తాజాగా సునీల్ ఛెత్రి ట్వీట్ చేస్తూ.. జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదు. తిరిగి వారి ప్రాణాలను ఏదీ తిరిగి ఇవ్వలేదు. కనీసం వారి మరణానికైనా న్యాయం జరగాలి. అది ఒక బలమైన ఉదాహరణగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం స్పందిస్తూ ‘‘రక్షకులే అణచివేతదారులుగా మారినప్పుడు’’ అంటూ ట్వీట్ చేశారు. (‘సెల్’ కోసమే దాష్టీకమా?) తమిళనాడు తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సాత్తాన్‌కులానికి చెందిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్‌లు సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తుండేవారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళలో విధించిన లాక్డౌన్లో పరిమిత సమయానికి మించి షాపును తెరిచారనే ఆరోపణతో జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వారు ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. పోలీసులు అడిగిన సెల్‌ఫోన్ ఇవ్వలేదనే జయరాజ్, బెనిక్స్లను అరెస్టు చేశారని, ఆ కక్ష్యతోనే లాఠితో అమానుషంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని దుకాణదారులంతా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. (తండ్రీకొడుకుల అనూహ్య మరణం!)