సదస్సులో పాల్గొన్న న్యాయమూర్తులు అర్పితమారంరెడ్డి, భవాని
మాడ్గుల: న్యాయవ్యవస్థ, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నేరాలపై అవగాహన పెంచుకుంటే తప్పులు చేయడానికి వెనకాడతారని కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి సర్పంచ్ వై.వెంకటేశ్వర్లుగౌడ్ అధ్యక్షతన న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ విజ్ఞాన సదస్సులో జడ్జి అర్పితమారంరెడ్డి, అదనపు జడ్జి భవాని, పలువురు న్యాయవాదులు చట్టం, న్యాయం, ధర్మం, బాల్య వివాహాల నిõషేధం, ప్రమాదాల నివారణ, ఇన్సూరెన్స్, రైతులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ఆస్తి తగాదాలు, రిజిస్ట్రేషన్లు, చెక్కులు, ప్రామిసరీ నోటు, జనన, మరణాలపై ప్రజలకు సుదీర్ఘంగా అవగాహన కల్పించారు.
ఏ నేరం చేస్తే ఏ శిక్ష పడుతుంది..శిక్షల వల్ల కుటుంబాల జీవన పరిస్థితి ఎలా మారుతుంది..అనే అంశాలపై పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు వెంకట్‌నారాయణగౌడ్, న్యాయవాదులు ఏర్పుల రామకృష్ణ, భాస్కర్‌రెడ్డి, జానకిరాములు, వెంకట్‌రెడ్డి, యాదిలాల్, మహేశ్,మల్లేష్, జయంత్, వెంకట్‌రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment