అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేస్తున్న బాధితురాలు, పక్కన సినీ నటి కరాటే కల్యాణి
సాక్షి, నగరంపాలెం: హరికథ గానంలో తనకు పరిచయమైన యువతి మోసపోయిందని, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ సినీ సహాయ నటి కరాటే కల్యాణి, బాధితురాలు బుధవారం గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించారు. బాధితురాలి కథనం మేరకు.. గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్‌కు చెందిన యువతి 2018లో హరికథ విద్య నిమిత్తం తిరుపతి వెళ్లింది. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్ తషీఫ్ ఆమెకు పరిచయమయ్యాడు. 2019లో లాడ్జికి తీసుకెళ్లి ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయిన యువతిపై లైంగిక దాడి చేసి, వీడియోలో చిత్రీకరించాడు.
అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత యువతి వయోలిన్ విద్య నేర్చుకునేందుకు హైదరాబాద్ వెళ్లగా, అక్కడకు తషీఫ్ వచ్చి మాయమాటలు చెప్పి ఆర్య సమాజంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొద్దిరోజులకు కర్నూల్ జిల్లాలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. యువతికి ఇష్టం లేకుండానే ముస్లిం సంప్రదాయంలో మళ్లీ వివాహం చేశారు. అత్తింటివారు బలవంతంగా మత మార్పిడి చేసుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
చదవండి : (వామ్మో.. మాయలేడి ఎంతపనిచేసింది!)
(రాసలీలల కేసు: ఎవరి ఖాతాలో ఎంత ఉంది?!)
Comments
Please login to add a commentAdd a comment