karate kalyani
-
తెలుగమ్మాయి హీరోయిన్గా తారకేశ్వరి ట్రైలర్ చూశారా?
శ్రీకరన్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ మూవీ 'తారకేశ్వరి'. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్లో డైరెక్టర్ వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంతో పాటు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది. మూవీ పోస్టర్‌ను నటి కరాటే కళ్యాణి లాంచ్ చేయగా, ట్రైలర్‌ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ ఆవిష్కరించారు.ట్రైలర్ బాగుందిఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. 'తారకేశ్వరి' మూవీ ట్రైలర్ చాలా బాగా ఉంది. ఇది మంచికి, చెడుకు జరిగే పోరాటాన్ని చక్కగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సినిమాలను అందరూ ఆదరించాలి. ఇందులో తెలుగు హీరోయిన్లు ఉన్నారు. తెలుగు వారికే డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం అభినందనీయం" అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో..హీరో శ్రీకర్ మాట్లాడుతూ.. "తెలుగు ఇండస్ట్రీ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ సంపాదిస్తుండటం మనందరికి గర్వకారణం. డైరెక్టర్ వెంకట్ రెడ్డిగారు ఎంతో శ్రమించి అందరికి నచ్చే విధంగా సినిమాను తెరకెక్కించారు. మా సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని తెలిపారు. హీరోయిన్ అనుష మాట్లాడుతూ.. "నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కు కృతజ్ఞతలు. దూరపు కొండలు నునుపు.. దగ్గరికి వెళితే గరుకు.. తెలుగమ్మాయిలకు అవకాశం ఇస్తున్న ఇలాంటి సినిమాలను ఆదరించండి" అని అన్నారు. ట్రైలర్లో కనిపిస్తోందినటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "హీరో శ్రీకర్‌కు మంచి భవిష్యత్తు ఉంది. డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారి టాలెంట్ ఈ ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది" అన్నారు. డైరెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. "మా టీమ్ సభ్యులందరి కృషి వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరూ దీన్ని ఆదరించాలి. ప్రేక్షకుల నమ్మకాన్ని మేం నిలబెట్టే విధంగా సినిమా తెరకెక్కించాము. త్వరలోనే ఆడియో, ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించబోతున్నాం" అని తెలిపారు. -
రేవ్ పార్టీ.. హేమకు మెసేజ్ చేశా.. తన గొయ్యి తనే తీసుకుంది: కరాటే కల్యాణి
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ కూడా ఉందంటూ తొలుత ఆమె పేరు బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన హేమ.. తూచ్, అంతా అబద్ధం, నేను హైదరాబాద్‌లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసింది. అంతలోనే బెంగళూరు పోలీసులు తన ఫోటో మీడియాకు వదిలారు. అయినా ఒప్పుకోలేదు, ఇంట్లో బిర్యానీ వండుతున్నట్లు మరో వీడియో బయటకు వదిలింది. ఎవరినీ క్షమించేది లేదని..నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు శాంపిల్ టెస్ట్‌లో హేమ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయింది. హేమ వ్యవహారంపై నటి కరాటే కల్యాణి తీవ్రస్థాయిలో స్పందించింది. 'సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ వాడినా.. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎవరినీ క్షమించొద్దని మా అధ్యక్షుడు మంచు విష్ణు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సూచించారు. తమవైపు పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గొడవలు..ఇంతలోనే హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని వార్తలు వచ్చాయి. రేవ్ పార్టీలో తన పేరు వినిపించగానే ఏంటక్కా, ఇది నిజమేనా? అని మెసేజ్ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో శివబాలాజీని కొరకడం.. రాజేంద్రప్రసాద్‌గారిని అడ్డగించడం, నా మీద కూడా కేసు పెట్టి ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటుంది. నేను సరదాగా పేకాట ఆడితే ఎవరో ఇరికించారు. అయినా దీన్ని పెద్ద తప్పన్నట్లుగా హడావుడి చేసిన ఈమెకు దేవుడు వెంటనే శిక్ష వేశాడు.తన గోతి తనే తీసుకుందిఇప్పుడామె చేసిందే తప్పుడు పని.. తప్పుడు ప్లేస్‌లో దొరికి మళ్లీ బుకాయించడం దేనికి? హైదరాబాద్‌లో ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ సెల్ఫీ వీడియో తీసి పోలీసులను, మీడియాను తప్పుదోవ పట్టించావు. ఇది ఇంకో కేసు. నీ పాపులారిటీ ఇంకా తప్పుగా వాడుకుంటున్నావు. నీ గోయి నువ్వే తీసుకున్నావు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల -
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఐదేళ్లుగా నటితో సహజీవనంతల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్‌గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్‌లు చేశాడు.ఈ జన్మకు చాలునేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు. ఈ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: చనిపోతానని ముందే హింటిచ్చిన నటుడు.. ఐదేళ్ల నుంచి పట్టించుకోట్లేదంటూ విలపించిన తల్లి -
సూర్యకిరణ్ ఈ ఒక్క తప్పు చేయడం వల్లే మరణించారు: సీనియర్ నటి
టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన మరణించారు. నేడు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయిన సూర్యకిరణ్ మరణించడంతో ఆయన సన్నిహితులు షాక్‌కు గురయ్యారు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. అదే సీజన్లో కంటెస్టెంట్‌గా ఉన్న సీనియర్ నటి కరాటే కళ్యాణి ఆయన మృతి పట్ల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన చాలా వరకు కుంగిపోయాడని కరాటే కళ్యాణి తెలిపారు. 'భార్యతో విడిపోయిన తర్వాత ఇక తనకు జీవితంలో ఏమీ మిగలలేదని ఆయన అనుకునే వాడు.. ఈ క్రమంలో ఎక్కువగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆయన లివర్ బాగా దెబ్బతింది. ఈ క్రమంలో ఆయనకు పచ్చ కామెర్లు రావడంతో దానిని ఆయన గుర్తించలేకపోయాడు. ఆపై ప్రతి రోజూ మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినా ఉపయోగం లేకుండా పోయింది. సూర్య కిరణ్ నుంచి భార్య విడిపోయిన తర్వాత ఆమె మళ్లీ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశించాడు. అది ఎప్పటికీ జరగదేమో అనే ఆలోచనలతో రాత్రంతా మద్యం,సిగరెట్స్ తాగుతూ గడిపేవాడు. జాండిస్ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తీసుకోవడం వలనే సూర్యకిరణ్ మరణించారని కరాటే కళ్యాణి తెలిపారు. (మాజీ సతీమణి కళ్యాణితో సూర్యకిరణ్) టాలీవుడ్లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూర్యకిరణ్ 'మాస్టర్ సురేష్' పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించాడు. సూర్యకిరణ్ టి.ఎస్.మణి, రాధాలకు చెన్నైలో జన్మించారు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన సోదరి సుజిత కూడా బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో నటిగా రాణిస్తున్నారు. -
నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్
ఏదో ఒక విధంగా ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది నటి కరాటే కల్యాణి. గత కొద్ది కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్లో సంచలనంగా మారిన కళ్యాణి మరో సారి వార్తల్లో నిలిచారు. ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకున్న దివంగత ఎన్టీఆర్ విగ్రహంపై కరాటే కల్యాణి చేసిన వ్యాఖ్యల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్యాణి తనకు ప్రాణ హాని ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) ఈ మధ్యనే తన కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని, ఆ విషయాన్ని గమనించకండా అదే కారులో ప్రయాణించినట్లు తెలిపింది. ఆపై కొంత దూరం వెళ్లిన తర్వాత కారు టైర్లు పేలిపోయి స్వల్ప ప్రమాదంతో భయటపడినట్లు తెలిపింది. అదే హైవే మీద ప్రయాణించి ఉంటే తన పరిస్థితి వేరేలా ఉండేది అని వాపోయింది. అనంతరం మెకానిక్ వద్దకు వెళ్తే.. ఎవరో కావాలనే కారు టైర్లను కోసేశారని తేలడంతో ఖంగుతిన్నట్లు తెలిపింది. ఖమ్మంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం .. కృష్ణుడి రూపంలో ఉంది అని ఆమె రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. చివరకు కోర్డు నుంచి స్టే కూడా తీసుకువచ్చింది. ఈ కోపంతోనే ఎవరో కావాలని టైర్లు కోసేసి ఉంటారని ఆమె ఆరోపించింది. (ఇదీ చదవండి: ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తా, పెళ్లి తిరుపతిలోనే : ప్రభాస్) -
కరాటే కల్యాణిని ‘మా’ సస్పెండ్ చేయడం దారుణం
పంజగుట్ట: మానవుడి రూపం దేవుడికి ఇవ్వరాదని పోరాటం చేసిన కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని.. మా వెంటనే ఆ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని పలు యాదవ, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కళ్యాణి ఎన్టీఆర్‌ను, సినీ పరిశ్రమను ఎప్పుడూ కించపరచలేదని, శ్రీ కృష్ణునికి ఎన్టీఆర్ రూపం ఇవ్వరాదనే పోరాటం చేసిందన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రామచంద్ర యాదవ్, చలకాని వెంకట్ యాదవ్‌లు మాట్లాడుతూ... భగవంతునికి మానవరూపం ఇవ్వరాదని ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తే సంబంధంలేని ‘మా’ సస్పెండ్ చేయడం సరికాదన్నారు. బలహీనవర్గాలకు చెందిన ఓ మహిళను సస్పెండ్ చేయడంతో సినీ పరిశ్రమ ఒక సామాజిక వర్గానికి చెందిందిగా అర్థం అవుతుందన్నారు. వెంటనే సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోకపోతే హైదరాబాద్‌లో ఉన్న 20 లక్షల మంది యాదవులు ఐక్యమై పోరాటం చేస్తామన్నారు. త్వరలోనే మంచు విష్ణును కలిసి ఈ విషయమై చర్చిస్తామని పేర్కొన్నారు. కరాటే కళ్యాణి మాట్లాడుతూ... తాను ఎన్టీఆర్‌ను ఎప్పుడూ కించపరచలేదని, తాను కూడా ఎన్టీఆర్ అభిమానినే అన్నారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ అనే కాకుండా ఎవరు పెట్టినా ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంపై ‘మా’ షోకాజ్ నోటీసులు ఇవ్వడమే వ్యాలిడిటీ కాదు సస్పెన్షన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను ఒక యాదవ సంఘం నాయకురాలిగా మాట్లాడానన్నారు. త్వరలో సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో పోరాడతానన్నారు. సమావేశంలో మహేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్, రాధాకృష్ణ, మారుతి రామారావు, నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం రేపు ప్రభాస్ విగ్రహం నా పోరాటం మాత్రం ఆగదు..
-
మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్‌ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్) -
కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం
ప్రముఖ లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియాలో వెల్లడించింది. 'దయచేసి కారులో అయినా, బైక్‌పై అయినా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఓ శాంతి' అని కల్యాణి ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. ఈ పోస్టుపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ నటి కుమారుడి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటోంది. చదవండి: కథ వెనుక కథ టీజర్ చూశారా? -
అందరూ నన్ను వ్యభిచారిణిలా చూస్తున్నారు: కరాటే కల్యాణి ఆవేదన
సినీ నటి కరాటే కల్యాణి గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్ బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనసులో ఎంతో బాధ ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, చేదు సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతరమైంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘బతుకుదెరువు కోసమే తాను సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. చాలామంది నాలో బాబీనే చూశారు. కానీ నాలో మరో కోణం కూడా ఉంది. నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం సేవ కార్యక్రమాలకు వినియోగిస్తాను. పిల్లలను దత్తత తీసుకున్నాను. ఎంతోమందికి సాయం చేశాను. కానీ జనాలు అవేవి చూడటం లేదు. తెరపై నేను పోషించిన పాత్రలను బట్టి నిజ జీవితంలో కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తున్నారు. చెప్పాలంటే నన్ను ఓ వ్యభిచారిగా చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్ నన్ను చాలా బాధిస్తున్నాయి. అవి విన్నప్పుడు నాకు చాలా పెయిన్‌గా ఉంటుంది. నేను తెరపై నటించానంతే, నిజంగా చేయలేదు. బతుకు దెరువు కోసం అలాంటి రోల్స్ చేశాను. నాలోని మంచిని గుర్తించకుండా నాపై అసహ్యమైన కామెంట్స్ చేస్తుంటారు’ అంటూ కల్యాణి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తాను అలాంటి దాన్ని కాదని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. చదవండి: బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! రొమాంటిక్ సీన్స్‌లో హీరోలు అలా ప్రవర్తిస్తారు: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు -
నా భర్త నడిరోడ్డుపై కొట్టాడు, నాకు ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది : కరాటే కల్యాణి
సినీ నటి కరాటే కల్యాణి గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్ బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనసులో ఎంతో బాధ ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, మాజీ భర్తతో చేదు సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. బతుకుదెరువు కోసం సినిమాల్లో నటిస్తున్నాను. చాలామంది నాలో బాబీనే చూశారు. కానీ నాణానికి మరోవైపు కూడా ఉందని చాలామందికి తెలియదు. నేను రియల్‌లైఫ్‌లో ఎంతోమందికి సహాయం చేశాను. ఇక నా వ్యక్తిగత జీవితానికి వస్తే.. పెళ్లి చేసుకున్నాక ఎన్నో కష్టాలు అనుభవించాను. అతను పెట్టిన టార్చర్ మాటల్లో చెప్పలేను. ఎంత పీక్స్‌కు వెళ్లిందంటే.. బేగంపేట వద్ద నడిరోడ్డుపై నామీద బట్టలు లాగేసి దారుణంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఇంక చాలా జరిగాయి. అయినా అతడిలో మార్పు కనిపించలేదు. తర్వాత విడాకులు తీసుకున్నాం. ఇప్పటికీ నిజమైన ప్రేమకోసం తపిస్తున్నాను. మరో పెళ్లి చేసుకోవాలనుంది అంటూ చెప్పుకొచ్చింది. -
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
-
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నటి కరాటే కల్యాణితో పాటు హిందూ సంఘాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో హిందువుల మనోభావాలు కించపరిచేలా చిత్రీకరించారని వారు ఆరోపించారు. (చదవండి: దేవీశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు) ఇటీవల దేవి శ్రీప్రసాద్.. ఓ పరి అనే నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలన్నారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. -
దేవిశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు
-
దేవీశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు బుధవారం నాడు సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాయి. ఇటీవల దేవి శ్రీప్రసాద్.. ఓ పరి అనే నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లో చిత్రీకరించారని కరాటే కల్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలంది. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. మరి దీనిపై దేవిశ్రీప్రసాద్ ఎలా స్పందిస్తాడో చూడాలి! చదవండి: నా కూతురి పెళ్లికి రండి.. సీఎం జగన్‌కు ఆహ్వానం -
తేజస్వి 'కమిట్మెంట్' మూవీపై కరాటే కల్యాణి ఫిర్యాదు
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ నటించిన కమిట్మెంట్ సినిమా ట్రైలర్‌పై కేసు నమోదైంది. మూవీ ట్రైలర్లో భగవద్గీత శ్లోకాన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా వాడింది చిత్రయూనిట్. దీనిపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు కించపరిచేలా ట్రైలర్ ఉందంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బూతు సన్నివేశాలకు భగవద్గీత శ్లోకం ఎలా వాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి దీనిపై చిత్రయూనిట్ ఏమని స్పందిస్తుందో చూడాలి! కాగా కమిట్మెంట్ చిత్రాన్ని ఆగస్టు 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కిడ్నీ ఫెయిలై మహాభారత్ నటుడు మృతి -
కాళ్లు పైకెత్తి ఊపడమేంటి? బొట్టు లేదు, మెట్టెలు లేవు: కరాటే కల్యాణి
టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె రిలీజ్ చేసిన ఒకపరి పాట పెద్ద వివాదంగా మారింది. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై కరాటే కల్యాణి స్పందించింది. 'శ్రావణ భార్గవి చేసిన వీడియోలో కొన్ని తప్పులున్నాయి. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలే తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు.. శాస్త్రబద్దంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు. ముందు అవి వేసుకో.. కీర్తనలు పాడుకునేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు. కె.విశ్వనాథ్ సినిమాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే.. అప్పుడు నేను పుట్టలేదు. వాళ్లు ఇప్పుడు సినిమాలు చేసినా కూడా అందులో ఏ కీర్తన అయినా అభ్యంతరకరంగా ఉంటే కచ్చితంగా ఖండించాల్సిందే! భార్గవి పాట నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆ పాటలో కొన్ని క్లిప్పులు తొలగించేలా చిన్న చిన్న ఎడిటింగ్ చేయాల్సిందే!' అని కరాఖండిగా తేల్చి చెప్పింది కల్యాణి. మరోవైపు ఏదేమైనా సాంగ్ డిలీట్ చేయనని మంకు పట్టిన శ్రావణ భార్గవి చివరకు ఆ పాటను తొలగించడం గమనార్హం. చదవండి: నా జీవితంలో ఆనందం, ప్రశాంతత లేకుండా పోయాయి మీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను: శ్రీను వైట్ల -
20 యూట్యూబ్ ఛానెల్స్‌పై ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి
-
20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కల్యాణి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్‌లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై నిఘా పెట్టడంతో పాటు కేసు విచారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. త్వరలోనే సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి వీరిద్దరు కొట్టుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు సైతం వచ్చాయి. చదవండి: పార్టీలో మెరిసిన రష్మిక, ఎందుకలా ఫీలవుతోందని ట్రోలింగ్ Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. -
సీడబ్ల్యూసీ ఎదుట కరాటే కల్యాణి .. ‘అవమానించిన వారిని వదిలేది లేదు’
సాక్షి, హైదరాబాద్: అక్రమ దత్తత ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి కరాటే కల్యాణి బుధవారం యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాంగణంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయంలో చంటిబిడ్డతో సహా అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ అధికారులు ఆమెను ప్రశ్నించి సమాచారం రాబట్టారు. అనంతరం కరాటే కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, ఎదుగుతున్న తనను కావాలని కొందరు అసత్య ఆరోపణలతో బయటకు లాగారన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. నిరాధార ఆరోపణలు చేసి తనను అవమానించిన వారిని వదిలేది లేదని, న్యాయపరంగా వారిపై పోరాడతానన్నారు. అధికారులు తన వాదనను నమ్మారని, తాను తప్పు చేయలేదని చెప్పడానికి అది చాలన్నారు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. ఇంతవరకు తాను చంటిబిడ్డను దత్తత తీసుకోలేదని, భవిష్యత్‌లో తీసుకుంటానా లేదా అనే విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నారు. చదవండి: ఓటీటీలో సామ్, నయన్‌ల మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? నిబంధనలు పాటించాల్సిందే.. పిల్లలను దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సీడబ్ల్యూసీ అధికారులు కరాటే కల్యాణికి స్పష్టం చేశారు. ఆమె వద్ద ఉన్న పాపను చిన్నారి తల్లి స్వప్నకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారైనందున భవిష్యత్‌లో దత్తత తీసుకోవాలంటే రంగారెడ్డి వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు సమా చారం. ప్రస్తుతం కల్యాణి వద్ద ఉంటున్న 11 ఏళ్ల బాలుడికి సంబంధించిన తల్లిదండ్రుల వివరాలు కూడా సీడబ్ల్యూసీకి అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శైలజతో పాటు సభ్యులు లలిత, ప్రమోద తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైన కరాటే కల్యాణి
-
చిన్నారిని ఇంత వరకు దత్తత తీసుకోలేదు : కరాటే కల్యాణి
అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కల్యాణి హైదరాబాద్ కలెక్టర్ కార్యాయలంలో విచారణకు హాజరయ్యింది. కల్యాణీతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా సీడబ్లూసీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కరాటే కల్యాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారికి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి దత్తత జరగలేదని పేర్కొంది. ఇదే విషయాన్ని కలెక్టర్ ముందు కూడా చెప్పామని వివరించింది. 'ఆర్థికంగా చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉన్నాను. నాపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు' అంటూ కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది. కాగా యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో వివాదం, ఆ తర్వాత చిన్నారి దత్తత విషయం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నోటీసులకు స్పందిచకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల అనంతరం కరాటే కల్యాణి అఙ్ఞాతంలోకి వెళ్లడం, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం వంటి నాటకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. -
నేను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే రకం: కరాటే కల్యాణి
-
మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు
నటి కరాటే కల్యాణి అజ్ఞాతం వీడింది. యూట్యూబర్ శ్రీకాంత్‌తో వివాదం, పోలీసు కేసు అనంతరం ఆమె కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుక వచ్చింది. తాను పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది. తాను పాప తల్లిదండ్రులను తీసురావడాని వెళ్లానని చెప్పింది. అనంతరం తాను ఎవరిని దత్తత తీసుకోలేదని, తన తల్లి విజలక్ష్మి తనతో ఉండరని అందుకే ఆమెకు ఏం తెలియదు అని చెప్పింది. పిల్లలను అమ్ముకోవడం ఎవరైనా చూశారా? అని, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా? అంటూ పైర్ అయ్యింది. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రలను ఆమె మీడియాకు చూపించింది. దీంతో వారు చిన్నారి దత్తతపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, పిల్లలను పోషించలేక కరాటే కల్యాణి వద్ద ఉంచినట్లు అతడు తెలిపాడు. తన ఇంట్లోనే ఉన్నామని, స్టింగ్ ఆపరేషన్ చేసుకోండి ఆమె వ్యాఖ్యానించింది. కాగా ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి విరిద్దరు కొట్టుకోవడం చర్చ దారితీసింది. దీంతో ఇద్దరి ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణి కనిపించకుండపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆదివారం చైల్డ్వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అంతేగాక చిన్నారి పాప దత్తతపై తమకు వివరణ ఇవ్వాలంటూ గతంలో ఆమెకు నోటిసులు ఇవ్వగా తాను స్పందించలేదని అధికారులు మీడియాకు తెలిపిన విషయం విదితమే. -
చిక్కుల్లో కరాటే కల్యాణి, చిన్నారి దత్తతపై నోటీసులు
Karate Kalyani Summoned By Officials Over Child Adoption: సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రాంక్ పేరుతో ఆసభ్యకర వీడియోలు చేస్తున్నాడంటూ శ్రీకాంత్‌పై కరాటే కళ్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరిపై ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం కొసమెరుపు. ఆమె ఆజ్ఞాతంలోకి వెళ్లిందా?.. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనేది తెలియల్సి ఉంది. చదవండి: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్! మరోవైపు కరాటే కల్యాణి ఓ చిన్నారి దత్తత వ్యవహరం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఆమెకు గతంలో నోటిసులు ఇచ్చినట్లు తాజాగా అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే ఆమె ఆ నోటీసులకు స్పందించలేదని, తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నేడు సోమవారం(మే 16) ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. రేపటి వరకు ఆమె ఈ నోటీసులపై స్పందించకపోతే తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది? పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయని, దాని ప్రకారమే దత్తత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ చట్టానికి విరుద్ధంగా వెళితే మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు. కాగా కరాటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుందని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా రీసెంట్గా శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి కూడా ఉన్న విషయం తెలిసిందే. -
కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్‌బాస్ ఛాన్స్ పట్టేశాడు!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు వచ్చేసింది. అఖిల్ సార్థక్, బిందు మాధవిలలో ఎవరు ఒకరు టైటిల్ ఎగరేసుకుపోనున్నారు. టాప్ 5కి చేరుకునేవారిలో నుంచి కొందరిని బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సైతం తీసుకోనున్నారు. ఆ జాబితాలో జనాలను ఎంటర్టైన్ చేసే యాంకర్ శివ తప్పకుండా ఉండే అవకాశముంది. అలాగే ఆరో సీజన్ కోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. బిగ్‌బాస్ టీమ్ రోషన్, మంజూష అనే మరో ఇద్దరు యాంకర్లను సైతం సంప్రదించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబర్ బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంక్ వీడియోలతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొనే అవకాశాలున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇదెంతవరకు నిజం? ఒకవేళ పిలుపు వస్తే నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్తాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కల్యాణితో గొడవతో కొద్దిరోజులుగా అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లి అతడిని చితకబాదింది. దీంతో అతడు కూడా కల్యాణిపై చేయిచేసుకున్నాడు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువురిపై కేసులు నమోదవగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..? హీరోయిన్ సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది?
కరాటే కల్యాణి ఆచూకిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(ఆదివారం)నుంచి కనపించకుండా పోయిన కరాటే కల్యాణి ఇంకా అఙ్ఞాతం వీడలేదు. ఆమె ఫోన్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. దీంతో తన కూతురు ఏమైపోయిందో అని కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రీకాంత్ రెడ్డి తన కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సాక్షి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'కరాటే కల్యాణి ఫేమ్ చూసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవం. పాప విషయం గురించి నాకేమీ తెలియదు. దత్తత తెచ్చుకుందని తెలుసు. కళ్యాణి మిస్సింగ్‌పై పోలీసులకు పిర్యాదు చేస్తాను తను ఎక్కడున్నా బయటికి రావాలని టీవీ ఛానెల్స్ ద్వారా కోరుతున్నాను' అని పేర్కొంది. కాగా ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను విక్రయిస్తుందని ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పాపతో కలెక్టరేట్‌కి రమ్మని చెప్పారు. అయితే సోదాల సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయింది. దీంతో ఆమె ఎక్కడ ఉందన్నదానిపై అధికారులు విచారిస్తున్నారు. -
అజ్ఞాతంలో కరాటే కల్యాణి
-
కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..?
సాక్షి, హైదరాబాద్(వెంగళరావునగర్): ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు, పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులు తెలిపిన మేరకు.. సినీనటి కరాటే కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతుందని 1098 నెంబర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు మహేష్, సంతోష్‌కుమార్ ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో శ్రీలక్ష్మినిలయం అపార్ట్‌మెంట్స్‌కు ఆదివారం వచ్చారు. ఆ సమయంలో కల్యాణి, పిల్లలు ఇంట్లో లేరు. కల్యాణి తల్లి మాత్రమే ఉంది. తన కూతురు గుడికి వెళ్లిందని, ఎప్పుడు వస్తుందో తెలియదని సమాధానం చెప్పింది. తన కుమార్తె ఒక బాబు (12 ఏళ్లు)ను, ఐదు నెలల పాపను పెంచుకుంటోందని, అందులో తప్పేముందని ప్రశ్నించింది. అయితే వారిని ఎక్కడనుంచి తెచ్చిందనే విషయం మాత్రం తనకు తెలియదని విలేకరులతో చెప్పారు. ఇదిలా ఉండగా చైల్డ్ లైన్ అధికారులు ఇంటివద్దకు విచారణకు వస్తున్నారని తెలిసిన కరాటే కల్యాణి ఎక్కడి వెళ్లింది ? ఎప్పుడు వస్తుంది ? దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాలను అటు అధికారులు, ఇటు పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: (కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు) -
నటి కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు..
Child Welfare Officials Raid In Actress Karate Kalyani Home: నటి కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి శ్రీకాంత్‌రెడ్డి పరస్పర దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదిరి ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్ఆర్ నగర్ సీఐ సైదులుపై కల్యాణి ఫైర్ అయింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి ఉన్న విషయం తెలిసిందే. చదవండి: కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4451453475.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు
సాక్షి, అమీర్‌పేట: కరాటే కల్యాణితో తనకు ప్రాణభయం ఉందని ఓ మరో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది. వెంగళరావునగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు. నన్ను అడగడానికి నువ్వెవరంటూ ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితేష్‌పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపాడు. అయితే తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి) -
వీడియోలు చేయి డబ్బులిస్తా అన్నాడు, చెంప పగలకొట్టాను : కరాటే కల్యాణి
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేయిస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరువురు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి కరాటే కల్యాణి స్పందించింది. వీడియోల పేరుతో శ్రీకాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, గతంలోనూ అమ్మాయిలను వేధించాడని ఆరోపించింది. 'బిగ్‌బాస్‌లో ఛాన్స్ ఇప్పిస్తా, యూట్యూబ్ స్టార్స్‌ని చేస్తా అని అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులిస్తాను.. నాతో కలిసి అడల్ట్ కంటెంట్ చేస్తావా? అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చి చెంప పగలకొట్టాను. మహిళలతో ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఛానెల్‌ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి' అని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది. -
కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీ జరిగిన గొడవల ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదరింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ శ్రీకాంత్ ఫేస్బుక్లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా అతడు కరాటే కల్యాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నా పేరు శ్రీకాంత్‌రెడ్డి. మీకు తెలుసు కదా నేను వీడియోలు చేస్తుంటాను. కరాటే కల్యాణితో జరిగిన గొడవ మీకు తెలిసిందే. నిన్న రాత్రి 9 గంటల మధ్య కరాటే కల్యాణి గారు మా ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వచ్చి రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అన్నారు. దీనికి నేను నువ్వు బాబీ అంటూ సినిమాలు చేస్తావు కదా? అలాంటప్పుడు నేను వీడియోలు చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించాను’ అని అన్నాడు. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ తర్వాత ‘నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని అని చెప్పాను. దీంతో కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. పక్కన ఉన్న అబ్బాయి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేస్తాను అన్నాడు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను అనడంతో నాపై దాడి చేశారు, షర్ట్ చింపేసారు. కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా తాను ఏ తప్పు చేయలేదని, కేవలం వినోదం కోసమే వీడియోలు చేస్తుంటున్నానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. అలాగే కరాటే కల్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు. -
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి
సాక్షి, అమీర్‌పేట: యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిపై నటి కల్యాణి పడాల (కరాటే కల్యాణి) దాడికి పాల్పడింది. యూసుఫ్‌గూడ బస్తీలో ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటివద్దకు అనుచరులతో కలిసి వచ్చిన కల్యాణి డబ్బులు డిమాండ్ చేయగా నిరాకరించడంతో నలుగురు కలిసి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫ్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి ఇంటి వద్దకు అర్ధరాత్రి కరాటే కల్యాణి మరో నలుగురితో కలిసి వచ్చింది. ఇంట్లో భోజనం చేస్తుండగా గట్టిగా అరుస్తూ కిందకు రావాలని గొడవ చేయడంతో శ్రీకాంత్‌రెడ్డి కిందకు వచ్చాడు. ఫ్రాంక్ సాకుతో అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించి మహిళల గౌరవాన్ని దిబ్బ తీస్తున్నావని తలుచుకుంటే నిన్ను మూసివేస్తానని బెదిరించింది. రూ.లక్ష ఇస్తే వెళ్లిపోతామంది. ఆమె వెంట వచ్చిన ఒకరు తనను పక్కకు తీసుకుకెళ్లి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అందుకు నిరాకరించడంతో కల్యాణి అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచరులతో తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఫ్రాంక్ పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు మహిళలు చెప్పడంతో శ్రీకాంత్‌రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్తే శ్రీకాంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ నాలుగు నెలల చిన్నారితో పాటు తనపై దాడి చేశాడని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: (చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు) -
మళ్లీ పెళ్లికి సిద్ధమే, లేదంటే సహజీవనం: కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్
సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవక్కర్లేదు. సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్ బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి తన పదాలతో, వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న కల్యాణి తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యింది. చదవండి: హీరోయిన్ బాడీపై అసభ్య కామెంట్, నందిత దిమ్మతిరిగే సమాధానం ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘భార్య అంటే వంటింటికే పరిమితం. ఏం చెప్తే అది చేయాలి.. ఎదురు మాట్లాడకూడదు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ నేను అలా కాదు. ఫైర్ లాంటి దాన్ని అరచేతితో ఆపేయలేరు. నిప్పుని ఎంతసేపు అని పట్టుకుంటారు. అందుకే వదిలేశారు. నేను కరెక్ట్‌గానే ఉన్నాను అనుకున్నా.. కానీ అది వారికి తప్పు అనిపించిందేమో. అలా మనస్పర్థలతో గొడవలు, అనుమానాలు. నాకు అది నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా జీవిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమ, పెళ్లిళ్లు తనకు కలిసిరావని, ఇప్పటి వరకు తనకు నిజమైన ప్రేమ దొరకలేదంటూ కల్యాణి వాపోయింది. చదవండి: లేటెస్ట్ బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన కాజల్ ‘ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు. అందుకే ఇప్పటికీ నిజమైన ప్రేమ కోసం చూస్తున్నాను. అలాంటి ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నా. సరైనా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదా సహజీవనానికి కూడా రెడీ. ఎందుకంటే నాకు పిల్లలు అంటే ఇష్టం. ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్న. కానీ ఆ ఆశ ఇప్పటికి తీరలేదు’ అని ఆమె పేర్కొంది. అంతేగాక తన మాజీ భర్తల వల్ల చాలా కష్టాలు పడ్డానంటూ ఇలా చెప్పుకొచ్చింది. ‘తరచూ తాగోచ్చి కొట్టడం చేస్తుంటే భరించలేకపోయాను. పైగా నాపై అనుమానం. నేను చేయని తప్పుకి పడమంటే ఎలా పడతాను. చదవండి: రూ. 200 కోట్లకు పైగా లతా ఆస్తులు ఎవరికి? వీలునామాలో ఏం ఉంది.. తప్పంతా నాదే అంటే ఎలా కుదురుతుంది. అందుకే విడాకులు తీసుకున్నాను’ అంది. కానీ జనాలకు ఇవేం పట్టవు. నేను పడ్డ కష్టాలు ఏ ఆడది పడి ఉండదు. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను. ఒకానోక సమయంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలని నిర్ణయించుకుని పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఒకసారి పది నిద్రమాత్రలు తీసుకున్న. అయిన బతికి బయటపడ్డాను. దేవుడు నన్ను కాపాడాడు అంటే ఇంకా నేను చేసేదో ఎదో ఉందన్నమాట అని ఆలోచించి ధైర్యంగా నిలబడ్డాను. పది మంది సాయం చేస్తూ ఇలా ఒంటిరిగా జీవిస్తున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
Karate Kalyani: కక్షకట్టి హతమార్చాలని చూస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: తన ప్రాణానికి ముప్పు ఉందని తనకు రక్షణ కల్పించాలంటూ సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందని బయట పెడుతున్నందుకు తనపై కక్షకట్టి తనను హతమార్చాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు. చదవండి: (మరోసారి వార్తల్లోకి నయనతార, విఘ్నేష్ శివన్) -
సినీ నటి కరాటే కల్యాణిపై కేసు నమోదు
Police Case Filed On Karate Kalyani Over Saidabad Minor Girl Incident: సినీ నటి కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్ట పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేయడంపై రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన నితేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో కరాటే కల్యాణిపై జగద్గిరి గుట్ట పీఎస్‌లో కేసె నమోదైంది. -
అసభ్య వ్యాఖ్యలతో వీడియో.. కరాటే కల్యాణి, నరేశ్‌పై హేమ ఫిర్యాదు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మద్దతుదారులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రతి రోజు ఇరు ప్యానల్స్‌కు చెందిన సభ్యుల నుంచి ఎవరోర ఒకరు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న పోస్టల్ బ్యాలెట్లో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించగా.. ఓడిపోతామనే భయంతో ప్రకాశ్ రాజ్ అలాంటి ఆరోపణలు చేస్తున్నారని విష్ణు విమర్శించారు. (చదవండి: ‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు) ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన హేమ.. బుధవారం మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. తనపై కరాటే కల్యాణి , నరేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హేమ ఆరోపించారు. అసభ్య వ్యాఖ్యలతో ఓ వీడియోను విడుదల చేశారని ఆమె లేఖలో తెలిపారు. కళ్యాణి, నరేశ్‌లపై చర్యలు తీసుకోవాలని హేమ విజ్ఞప్తి చేశారు. -
సీనియర్ నటి కవిత ఇంటికి వెళ్లిన ‘మా’ సభ్యులు
సీనియర్ నటి కవిత ఇంట ఇటీవల విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే కుమారుడు స్వరూప్, భర్త దశరాథ రాజు కరోనాతో మృత్యువాత పడ్డారు. కుటుంబంలోని ముఖ్యమైన ఇద్దరూ వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కవిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మరణం మరవక ముందే భర్త మృతి వార్త ఆమెను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆమెను ఓదార్చం ఎవరి తరంగా కావడం లేదు. అయితే టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెను ఫోన్ ద్వారా పరామర్శించినప్పటకీ తాజాగా మా అసోసియేషన్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. సీనియర్ నటుడు, మా అధ్యక్షులు నరేష్‌తో పాటు కరాటే కల్యాణి, నటి పవిత్రలు కవిత, ఆమె కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. ఇక భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా తప్పకుండా అందిస్తామని నరేష్ భరోసానిచ్చారు. కాగా కవిత భర్త దశరథ రాజు నెల రోజుల కరోనా పాజిటివ్‌గా తేలింది. మధ్యలో ఓ సారి నెగిటివ్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే వారి తనయుడు స్వరూప్ కరోనాతో మృత్యువాత పడ్డాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న దశరథ రాజును కవిత ఆస్పత్రికి తరలించారు. దాదాపు 20 రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కవిత భర్త కన్నుమూశారు. కవిత 'ఓ మజ్ను' అనే తమిళ సినిమాతో 11 ఏళ్లకే వెండితెర అరంగ్రేటం చేశారు. సుమారు 50కి పైగా తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. Movie artists association (MAA) President @ItsActorNaresh, along with other artists from TFI met and conveyed their condolences to actress #kavitha on the huge loss of her husband and son due to #Covid19. pic.twitter.com/SJ5MiSTyIW — BARaju's Team (@baraju_SuperHit) July 3, 2021 -
పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో..
పావలా శ్యామల.. గుర్తుందా మీకు? అదేనండీ గోలీమార్ సినిమాలో తన అమాయకపు మాటలతో విలన్‌కు చిరాకు తెప్పించి తన యజమాని చావుకు కారణం అవుతుంది. ఆ సినిమానైనా మర్చిపోతారేమో కానీ.. ఈ సీన్‌ని మాత్రం మర్చిపోలేం. అంతలా ఆ సీన్‌ని పండించారు పావలా శ్యామల. అలాంటి శ్యామల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఒకవైపు కూతురి అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్ హోటల్, గోలీమార్ వంటి సూపర్ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతున్నారు. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల. శ్యామల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆర్టిస్ట్ కరాటే కల్యాణి తన వంతు సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. -
నటి కరాటే కళ్యాణికి పితృ వియోగం
విజయనగరం : మృదంగ విద్వాన్, హరికథా సామ్రాట్‌గా పేరుపొందిన పడాల రామదాసు (70) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌లో మృతిచెందారన్న వార్త జిల్లా సాంస్కృతిక, సాహితీ వేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన 17వ ఏట భారత రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా వెండి వీణ అందుకున్నారు. మహా రాజా సంగీత కళాశాలలో మృదంగంలో శిక్షణ పొంది, అనతికాలంలోనే పలు సంగీత కచేరీల్లో పాల్గొని పేరు తెచ్చుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో హరికథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు అందుకున్నాడు. దాసన్నపేటలో 1951 జూలై 1న పైడితల్లి దానయ్యలకు రామదాసు జని్మంచారు. ఆయనకు భార్య విజయలక్షి్మ, కుమార్తె కళ్యాణి, కుమారులు తారక రామారావు, ధీరజ్ చంద్రలు ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే కుమార్తె కరాటే కళ్యాణిగా, సినీనటిగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన మృతికి కళారంగం తీవ్ర సంతాపం తెలిపింది. కరాటే కళ్యాణి తండ్రి మృతిపై స్పందిస్తూ ఆదివారం ఫేస్బుక్ వేదికగా ఓ భావోద్వేగ ఫోస్ట్ పెట్టారు. -
'లాడ్జికి తీసుకెళ్లి..వీడియోలు తీసి'.. ఎస్పీని కలిసిన కరాటే కల్యాణి
సాక్షి, నగరంపాలెం: హరికథ గానంలో తనకు పరిచయమైన యువతి మోసపోయిందని, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ సినీ సహాయ నటి కరాటే కల్యాణి, బాధితురాలు బుధవారం గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించారు. బాధితురాలి కథనం మేరకు.. గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్‌కు చెందిన యువతి 2018లో హరికథ విద్య నిమిత్తం తిరుపతి వెళ్లింది. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్ తషీఫ్ ఆమెకు పరిచయమయ్యాడు. 2019లో లాడ్జికి తీసుకెళ్లి ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయిన యువతిపై లైంగిక దాడి చేసి, వీడియోలో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత యువతి వయోలిన్ విద్య నేర్చుకునేందుకు హైదరాబాద్ వెళ్లగా, అక్కడకు తషీఫ్ వచ్చి మాయమాటలు చెప్పి ఆర్య సమాజంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొద్దిరోజులకు కర్నూల్ జిల్లాలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. యువతికి ఇష్టం లేకుండానే ముస్లిం సంప్రదాయంలో మళ్లీ వివాహం చేశారు. అత్తింటివారు బలవంతంగా మత మార్పిడి చేసుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. చదవండి : (వామ్మో.. మాయలేడి ఎంతపనిచేసింది!) (రాసలీలల కేసు: ఎవరి ఖాతాలో ఎంత ఉంది?!) -
నగ్న వీడియోలతో వేధింపులు: కరాటే కల్యాణి అండతో ఫిర్యాదు
సాక్షి, కంబాలచెరువు (తూర్పు గోదావరి): ఆల్కాట్ గార్డెన్స్ ప్రాంతంలోని ఒలీవల మందిరం పాస్టర్ షారోన్ కుమార్ తనను మోసం చేశాడని కడియం మండలం రెడ్డిపడల్లి గ్రామానికి చెందిన మద్దుకూరి ప్రింయాక మంగళవారం రెండోపట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంక ఏడేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి ఒలీవల చర్చికి వెళ్తోంది. అక్కడ పాస్టర్ షారోన్ కుమార్ ఏకాంత ప్రార్థనలను ప్రోత్సహించేవాడు. తన భార్యతో విడాకులు అయిపోతున్నాయని, నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. నగ్నంగా వీడియోలు తీసి తనవద్ద ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ ఫొటోలను బహిర్గతం చేస్తానని భయపెడుతున్నాడు. దీంతో కొందరి సహకారంతో సినీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణిని కలిసి తన బాధ చెప్పుకున్నానని, ఆమె ధైర్యంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశానని ప్రియాంక తెలిపారు. చదవండి: దారుణం: కాలిన గాయాలతో నగ్నంగా రోడ్డుపై విద్యార్థిని వరకట్నం వేధింపులు.. అల్లుడ్ని చెట్టుకు కట్టేసి.. -
బిగ్‌బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే
అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 16 మందితో మొదలైన షోలో మరో మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చేరాయి. కానీ ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా ఫినాలేకు చేరుకోలేకపోయింది. కొందరు మెరుపు తీగల్లా వచ్చి వెళ్లిపోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన మరికొందరు మాత్రం ఉనికిని కూడా చాటుకోలేక అభిమానులను నిరుత్సాహానికి గురి చేశారు. అలాంటి కంటెస్టెంట్లు ఎవరెవరే చూద్దాం... సూర్యకిరణ్ తన కోపమే తన శత్రువు అన్న వాక్యం దర్శకుడు సూర్య కిరణ్ విషయంలో అక్షరాలా నిజమైంది. ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా, ప్రతిదానికి చిర్రుబుర్రులాడేవాడు. అందుకే షోలో అడుగు పెట్టిన మొదటి వారమే షో నుంచి నిష్క్రమించాడు. కానీ తను హౌస్‌లో ఉండాల్సిన వ్యక్తి అని, ఇలా ఎలిమినేట్ అయిపోతాననుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఊహించినదానికన్నా పది రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. (చదవండి: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు) కరాటే కల్యాణి అప్పుడే కోప్పడుతూ అప్పుడే ఏడుస్తూ కల్యాణి ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. చిన్నచిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసేది. అలా ఆమె పెద్దపెద్దగా కేకలేస్తూ అందరి మీద నోరు పారేసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. చాలామందితో కయ్యం పెట్టుకుని చివరికి రెండో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ ఆమె అమ్మ రాజశేఖర్‌తో కలిసి అందరినీ తెగ ఎంటర్టైన్ చేసేది. (చదవండి: అభిజిత్ బిగ్‌బాస్‌కే గర్వకారణం) స్వాతి దీక్షిత్ ఇంట్లో మూడో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ స్వాతి దీక్షిత్. ఆమె ఎంట్రీ, ఎలిమినేషన్ రెండూ అందరినీ సర్ప్రైజ్ చేశాయి. ఇంట్లోకి వెళ్లగానే ఆమెను ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు పోటీపడ్డారు. చివరికి ఆమె అభిజిత్‌తో కనెక్ట్ కావడం, అభిజిత్-హారిక మధ్య గ్యాప్ రావడం, ఇంతలో ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయాయి. (చదవండి: స్వాతిలో అది నాకు నచ్చలేదు: లాస్య) యాంకర్ లాస్య లాస్య అనగానే గుర్తొచ్చేది చీమ-ఏనుగు జోకులు. ఆమె వేసే జోకులకు ఎవరూ నవ్వకపోయినా ఆమె మాత్రం పడీపడీ నవ్వేది. కానీ ఈ నవ్వే ఆమెకు నానాపేర్లు తెచ్చిపెట్టింది. ఫేక్ స్మైల్, కవరింగ్ స్మైల్ అంటూ మిగతావాళ్లు లాస్య గురించి ఎన్నో అన్నారు. ఇది పక్కన పెడితే ఈ యాంకర్ నుంచి ఆమె అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవకుండా ఆమె కిచెన్లోనే ఉండిపోయి వంటలక్కగా మారిపోయింది. టాస్కుల్లోనూ వెనకబడిపోయింది. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?) జోర్దార్ సుజాత తెలంగాణ యాసలో మాట్లాడే ఈ యాంకర్ కిలకిలా నవ్వుతూనే ఉండేది. ఎప్పుడు చూసినా లాస్యతో కలిసి ఇంట్లో జరిగే విషయాల గురించి గుసగుసలు పెట్టేది. అలా ఆమెకు గాసిప్ క్వీన్ అన్న ముద్ర పడిపోయింది. అయితే వ్యాఖ్యాత నాగార్జునను పట్టుకుని ఆమె బిట్టూ అని పిలవడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఐదోవారంలోనే ముల్లెమూట సర్దుకుని ఇంటిబాట పట్టింది. బయటకు వచ్చాక సుజాత మాట్లాడుతూ తనను బిట్టూ అని బిగ్‌బాస్ యూనిటే పిలవమని చెప్పిందంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) కుమార్ సాయి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన మొట్ట మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు. ఎవరితోనూ కలవలేక, క్లారిటీ లేని సమాధానాలతో కన్ఫ్యూజన్ మాస్టర్‌గా నిలిచాడు. కొన్ని టాస్కుల్లో బాగా ఆడి కెప్టెన్ అయినప్పటికీ హౌస్‌లో ఉన్నానా? లేనా? అన్నట్టుగా ఉండటంతో అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హౌస్‌లో కూడా ఇంటిసభ్యులు కుమార్‌ను తమలో ఒకరుగా ఫీల్ అవలేదు. దీంతో అతడు ఏకాకిగా మారిపోయాడు. చివరికి ఏడో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ నాగార్జున స్క్రిప్ట్ చెప్పాలన్న కోరికకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు. -
బిగ్‌బాస్: ఒకరు సేఫ్, మరొకరు నామినేట్
లీకు వీరులు చెప్పినదానికి అటూఇటుగా బిగ్‌బాస్ షోలో నేడు ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. కాకపోతే హారికను సీక్రెట్ రూమ్‌లోకి పంపించకుండా ఇంట్లోనే కొనసాగించారు. నిన్న ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణి హౌస్‌లో ఒకరిని నామినేషన్లోకి పంపించింది. వెళ్లిపోయే ముందు చివరిసారిగా హరికథ చెప్పి మొదటిసారి ఔరా అనిపించింది. ఇంకా బిగ్‌బాస్ షోలో ఏమేం జరిగాయో చదివేసేయండి.. టాప్‌లో హారిక, లాస్ట్‌లో సోహైల్: కల్యాణి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కల్యాణితో నాగ్ ఓ గేమ్ ఆడించారు. అందులో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లో హారిక, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, అభిజిత్ టాప్ 5లో ఉంటారని తెలిపింది. అయితే మోనాల్ చుట్టూరా ముగ్గురు కట్టప్పలు ఉన్నారని జాగ్రత్త చెప్పింది. చివరి ఐదు స్థానాల్లో గంగవ్వ, కుమార్ సాయి, అరియానా, సుజాత, సోహైల్ ఉంటారని కల్యాణి చెప్పుకొచ్చింది. మిగిలినవారి గురించి మాట్లాడుతూ.. దేవి బ్రిలియంట్ అని ఆమెను తక్కువ అంచనా వేయకండని సూచించింది. అవినాష్- అమాయక చక్రవర్తి, మెహబూబ్- ఇంటిలిజెంట్, లాస్య - ఇన్నోసెంట్, అయోమయమని తెలిపింది. అఖిల్‌కు తనలాగే ఆవేశమెక్కువని, కొందరిని దూరంగా ఉంచాలని హితబోధ చేసింది. తర్వాత ఓ హరికథ చెప్పింది. అనంతరం దేవిని తర్వాత వారానికి నామినేట్ చేస్తున్నట్లు బిగ్‌బాంబ్ వేసింది. హౌస్‌లో కట్టప్పలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని కల్యాణి చెప్పుకొచ్చింది. పచ్చి మిరపకాయ తిన్న మాస్టర్ తర్వాత అభిజిత్, కుమార్ సాయి సేఫ్ అయ్యారు. అనంతరం ఇంటి సభ్యులను జంటలుగా విడికొట్టి బోన్ గేమ్ ఆడించారు. ఇందులో గుండంలో ఉన్న ఎముకను పాట ఆగిపోగానే ఎవరు ముందు తీసుకుంటే వాళ్లే గెలిచినట్లు. మొదటగా వెళ్లిన జంటలో అఖిల్ గెలవగా ఓడిపోయిన అభిజిత్ పుషప్స్ చేశాడు. గెలిచిన మోనాల్‌ను హారిక రెండు పెదాలు కలపకుండా మాట్లాడుతూ పొగిడింది. అనంతరం మెహబూబ్ గెలవగా ఓడిన సోహైల్ పచ్చి ఉల్లిపాయ తిన్నాడు. దేవి గెలవగా అమ్మ రాజశేఖర్ పచ్చి మిర్చి కరకరా నమిలేశాడు. ఆ క్షణమే మాస్టర్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. తర్వాత సుజాత గెలవగా, ఓడిన లాస్య చిన్నపిల్లలా నటించింది. దివి గెలవగా, ఓడిన అరియానా అతి కష్టం మీద పోల్ డ్యాన్స్ చేసింది. గంగవ్వ గెలవగా, ఓడిన కుమార్ సాయి నోట్లో నీళ్లు పోసుకుని పాట పాడేందుకు ప్రయత్నించాడు. గెలిచిన అవినాష్ ఓడిన నోయల్కుపెదాలకు మాత్రమే కాకుండా ముఖమంతా లిప్‌స్టిక్ రుద్దాడు. అనంతరం సోహైల్, నోయల్ సేఫ్ అయ్యారు. (షటప్ లాస్య: టెంపర్ లూజైన దివి) హారికను హౌస్‌లోకి ఎత్తుకొచ్చేశారు నామినేషన్లో లేని ఏడుగురిలో అఖిల్, మెహబూబ్, లాస్య, సుజాత.. హారిక ఎలిమినేట్ కావాలని కోరుకోగా.. దేవి, అరియానా, దివి.. మోనాల్ వెళ్లిపోవాలని కోరుకున్నారు. దీంతో మెజారిటీ ప్రకారం హారిక ఎలిమినేట్ అయినట్లు తేలిపోయినప్పటికీ మోనాల్ కన్నీళ్ల కుళాయి ఆన్ చేసింది. అనంతరం హారిక అందరికీ గుడ్‌బై చెప్తూ గేట్ దగ్గరకు వెళ్లింది. ఇంటి సభ్యులు కూడా ఆమెకు భారంగా వీడ్కోలు చెప్తున్న సమయంలో నాగ్.. ఆగండి అంటూ ఆమెను ఇంట్లోకి రావాలని చెప్పారు. దీంతో ఇది ఫేక్ ఎలిమినేషన్ అని గుర్తించిన హౌస్మేట్స్ సంతోషంతో గంతులేశారు. మరోవైపు ఆనందం పట్టలేని అభిజిత్, నోయల్.. హారికను ఎత్తుకుని మరీ లోపలికి తీసుకొచ్చారు. ఇంకోసారి సెల్ఫ్ నామినేషన్ అవకూడదని, ఇది హెచ్చరిక మాత్రమేనని నాగ్.. ఇంటి సభ్యులకు సూచించారు. ఇక దేశంలోనే ఏ బిగ్‌బాస్ షోకు రానంత టీఆర్పీ ఈ సీజన్ మొదటి వారానికి వచ్చిందని నాగ్ వెల్లడించడంతో ఇంటి సభ్యులు ఎగిరి గంతేశారు. (బిగ్‌బాస్ మాయ గుట్టు విప్పిన వితికా) -
బిగ్‌బాస్: హారిక అవుట్! కానీ..
బిగ్‌బాస్ నాలుగో సీజన్లో రెండో ఎలిమినేషన్ జరిగిపోయింది. వచ్చీరాగానే ఎదుటివాళ్లను మాట్లాడనీయకుండా, తనమాటే కరెక్ట్ అంటూ చీటికిమాటికీ గొడవలు పడి అప్రతిష్ట మూట గట్టుకున్న కరాటే కల్యాణిని బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఇక్కడితో ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిపోలేదు. డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగ్ ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి నేడు మరో కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి వెళ్లగొట్టనున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నేడు ఫేక్ ఎలిమినేషన్ జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేత్తడి హారికను ఎలిమినేట్ చేసి, ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపించనున్నారని లీకువీరులు చెప్తున్నారు. మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ను ఎలిమినేట్ అని చెప్పి, తర్వాత సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు. అతడి రీఎంట్రీ బాగా హిట్టయింది. మరీ ఈ సీజన్లో ఫేక్ ఎలిమినేషన్ ఎంతమేరకు పండుతుందో చూడాలి. (డబుల్ ఎలిమినేషన్; కళ్యాణి అవుట్) కల్యాణికే గుబులు పట్టించిన బిగ్ బాంబ్! ఇదిలా వుంటే నిన్న ఎలిమినేట్ అయిన కల్యాణితో పాటు, అటు ఇంటి సభ్యులందరితోనూ నాగ్ గేమ్స్ ఆడించినట్లు తెలుస్తోంది. తద్వారా గంభీరంగా ఉన్న వాతావరణాన్ని కూల్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక కల్యాణి.. అవినాష్‌ను అమాయక చక్రవర్తిగా పేర్కొంటూ, అతడు ఇంట్లో బలవుతాడని జాలి చూపించింది. దీంతో అవినాష్ 'నాకన్నా ముందు నువ్వే బలయ్యావుగా అక్కా' అంటూ ఉన్నమాట బయటపెట్టాడు. దేవి నాగవల్లిని తక్కువ అంచనా వేయకండని ఆమె సూచించింది. తర్వాత నాగ్.. కల్యాణికి కూడా కంగారు పుట్టించే బిగ్‌బాంబ్‌ను ఆమెతో వేయించారు. అదేంటో తెలియాలటే మరికొన్ని గంటలు వేచి చూడాలి. (హౌస్‌లో మంట పెట్టిన శ్రుతి మించిన కామెడీ) -
దివి, నోరు అదుపులో పెట్టుకో: లాస్య వార్నింగ్
వైల్డ్ కార్డ్ కంటెస్టెంటుగా అడుగు పెట్టిన కుమార్ సాయి ఏకాకిగా మారాడన్న విషయం నేడు మరోసారి స్పష్టమైంది. ముందుగా ఊహించినట్టుగానే కళ్యాణి బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పింది. హీరో-జీరో గేమ్‌లో అమ్మ రాజశేఖర్ ఏడ్వడం, అందుకు కారణమైన లాస్యను దివి టార్గెట్ చేయడం, దీంతో ఖంగు తిన్న లాస్య దివిని నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇవ్వడం జరిగాయి. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి. గంగవ్వను చెల్లెలని పిలిచిన నాగ్ ఇప్పుడు ఆరోగ్యం మంచిగైంది కాబట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోనని గంగవ్వ స్పష్టం చేసింది. తిరిగి ఎప్పటిలాగే జోష్‌గా ఉంటూ అవినాష్‌ను బర్రె ముక్కు అని వెక్కిరించింది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన గంగవ్వను నాగ్ చెల్లెలు అని పిలవడం గమనార్హం. అవ్వ అనడం మానేసి గంగమ్మ అని పిలిచారు. తర్వాత ఫొటో పోటీ జరిగింది. దీనికోసం మోనాల్.. అభికి ముద్దులిస్తూ ఫొటోకు పోజిచ్చింది. మెహబూబ్, దివి కూడా రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు క్లిక్‌మనిపించారు. అనంతరం అసలు సీన్ ప్రారంభమైంది. ఇంటి సభ్యులు ఎవరూ గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని నాగ్ మండిపడ్డారు. (బిగ్‌బాస్: గంగవ్వకు కరోనా టెస్ట్) రియల్ గేమ్ ఆడేవాళ్లకే ఓట్లు: నాగ్ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చేదే గెలవడానికని నామినేట్ అయిన కంటెస్టెంట్లకు నాగ్ గడ్డి పెట్టారు. నామినేషన్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోమంటే దానిపై కూడా జోకులు పేల్చుతూ పాట పాడుకున్నారని గరమయ్యారు. గంగవ్వను నామినేట్ అయేలా చేసినందుకు నోయల్‌ను తిట్టిపోశారు. మంచివాళ్లు అని మార్కులు కొట్టేసేందుకు త్యాగాలు చేస్తున్నారు, కానీ ప్రేక్షకులు నిజంగా గేమ్ ఆడేవాళ్లకు మాత్రమే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. తర్వాత గంగవ్వ సేఫ్ అయినట్లు వెల్లడించారు. అనంతరం హీరో-జీరో గేమ్ ఆడించారు. హీరో అనుకున్నవాళ్లను కుర్చీ మీద కూర్చోబెట్టాలి. జీరో అనుకున్నవాళ్లను మెడబట్టి అక్కడ ఏర్పాటు చేసిన ద్వారం గుండా బయటకు గెంటేయాలని తెలిపారు. బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుంది: దేవి ఫైర్ నోయల్.. హీరోగా మాస్టర్‌ను, జీరోగా కుమార్ సాయిగా తెలిపారు. సుజాత.. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను, జీరోగా కళ్యాణిని, సోహైల్.. హీరోగా నోయల్‌ను, జీరోగా కళ్యాణిని, దేవి.. హీరోయిన్గా అరియానాను, జీరోగా అమ్మ రాజశేఖర్ పేరు చెప్పింది. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుందని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా అని అమ్మ రాజశేఖర్‌ను దుమ్ము దులిపింది. నామినేషన్ ప్రక్రియ తర్వాత నుంచి తనను వేరు చేసి చూస్తున్నారని ఆవేదన చెందింది. తర్వాత మెహబూబ్.. హీరోయిన్గా లాస్యను, జీరోగా కుమార్‌ను, కుమార్.. హీరోగా అభిజిత్‌ను, జీరోగా నోయల్‌ను, హారిక.. హీరోగా అభిజిత్‌ను, జీరోగా కుమార్ సాయిని, లాస్య.. హీరోయిన్గా గంగవ్వను, జీరోగా అమ్మ రాజశేఖర్ పేరును వెల్లడించింది. (రొమాంటిక్ డ్యాన్స్; కళ్లు మూసుకున్న అరియానా) పంపించేయండంటూ కన్నీళ్లు పెట్టుకున్న మాస్టర్ శ్రుతి మించిన కామెడీ నచ్చలేదని లాస్య చెప్పింది. దివి గర్భవతిగా నటించాల్సి వచ్చినప్పుడు మాస్టర్ వెళ్లి ఆమెకు పిల్లో సర్దడం నచ్చలేదని చెప్పింది. దీంతో హర్ట్ అయిన మాస్టర్ 'నేను వెళ్లిపోతాను, అసలు కామెడీనే చేయను, నన్ను పంపించేయండి' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. షూటింగ్లో అవన్నీ సాధారణమేనని, తప్పేమీ కాదని, మాస్టర్ ఉండవల్సిందేనని గంగవ్వ బల్లగుద్ది చెప్పింది. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదంటూ నాగ్ మాస్టర్‌ను ఊరడించారు. తర్వాత కళ్యాణి.. హీరోయిన్గా గంగవ్వను, జీరోగా సుజాతను, అరియానా.. హీరోయిన్గా గంగవ్వను, జీరోగా కళ్యాణిని, అఖిల్, మోనాల్.. హీరోగా గంగవ్వను, జీరోగా కుమార్ సాయిని, అవినాష్, గంగవ్వ.. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను, జీరోగా కుమార్ సాయి పేర్లు చెప్పారు. దివి, లాస్య మధ్య రాజుకున్న గొడవ అభిజిత్.. హీరోగా గంగవ్వను, జీరోగా అరియానా, అమ్మ రాజశేఖర్.. హీరోగా నోయల్‌ను, జీరోగా దేవి నాగవల్లి, దివి.. హీరోగా అమ్మ రాజశేఖర్, జీరోగా సాయి కుమార్ పేర్లను చెప్పారు. దివి మాట్లాడుతూ.. మాస్టర్ హౌస్‌లో లేకపోతే అందరికీ మెంటలెక్కిపోతుందని చెప్పుకొచ్చింది. అతని ప్రవర్తన ఎవరికీ తప్పు అనిపించలేదని పేర్కొంది. తన ఫొటో కోసం అతను పిల్లో పెట్టడం తప్పు కాదని తేల్చి చెప్పింది. తన విషయం గురించి అందరి ముందు మాట్లాడినందుకు లాస్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షటప్, నీతో మాట్లాడనవసరం లేదు అని ముఖం మీద చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన లాస్య నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అనంతరం కళ్యాణి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగ్ ప్రకటించగా ఇంటి సభ్యులు ఆమెను సాగనంపారు. (బిగ్‌బాస్: ఎక్కువ పారితోషికం అవినాష్‌కే) -
డబుల్ ఎలిమినేషన్; కళ్యాణి అవుట్!
బిగ్‌బాస్ రెండో వారంలోనే డబుల్ ఎలిమినేషన్ అంటూ పెద్ద బాంబ్ పేల్చాడు. దీంతో నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లకు ముచ్చెమలు పట్టాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఒకరిని నేటి ఎపిసోడ్‌లోనే పంపించేసినట్లు తెలుస్తోంది. ఆమె ముందుగా ఊహించిన కంటెస్టెంట్.. కరాటే కళ్యాణిగా కనిపిస్తోంది. నిజానికి ఈ మధ్య ఆమె అందరితో బాగానే ఉంటూ నవ్విస్తోంది. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు హౌస్‌లో అడుగు పెట్టిన మొదట్లోనే కాస్త ఎక్కువ నటించేస్తూ, గొడవలు పెట్టుకుంటూ నెగెటివిటీ సంపాదించుకుంది. అదే ఆమెకు వెన్నుపోటు పొడిచింది. ఇక అమ్మ రాజశేఖర్ వేసే జోకులకు ఇంటి సభ్యులు అందరూ హాయిగా నవ్వుకుంటారు. కానీ ఈ సారి మాత్రం వీకెండ్లో నాగార్జున ముందు మాత్రం ఆ జోకులపై సీరియస్ అవుతున్నారు. దీంతో బాధపడ్డ మాస్టర్ తాను వెళ్లిపోతానంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ప్లీజ్ పబ్లిక్, పంపించేయండి అని మోకాళ్లపై మోకరిల్లి దండం పెట్టి మరీ అభ్యర్థించాడు. మరి డబుల్ ఎలిమినేషన్‌కు బలయ్యేది మాస్టరా? లేక వేరేవారా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. కాగా కళ్యాణికి ఓట్లు వేయని నెటిజన్లు కొందరు ఇప్పుడు బాధపడుతున్నారు. ఆమె వెళ్లిపోతే ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ రాజశేఖర్‌ను పంపిస్తే మాత్రం బిగ్‌బాస్‌లో వినోదమే ఉండదని అభిప్రాయపడుతున్నారు. (అమ్మాయి పేరు కనిపించినా వదలడు) -
బిగ్‌బాస్: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ రెండో వారం ముగింపుకు వచ్చింది. ఇప్పుడు మరో కంటెస్టెంటును ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సూర్యకిరణ్ హౌస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతడి ఎలిమినేషన్‌ను అందరూ ముందుగానే ఊహిస్తూ వచ్చారు. కానీ రెండో వారానికి వచ్చేసరికి మాత్రం ఎవరు వెళ్లిపోతారనేది ఉత్కంఠగా మారింది. పైగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెడితే ఈ వారానికి గానూ అభిజిత్, గంగవ్వ, నోయల్, హారిక, అమ్మ రాజశేఖర్, సోహైల్, కళ్యాణి, కుమార్ సాయి, మోనాల్ ఇలా తొమ్మిది మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. మంచిగనే ఉన్న: గంగవ్వ వీరిలో గంగవ్వకు అందరికన్నా ఎక్కువ అభిమానులు ఉండటంతో ఆమె బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఈ మధ్య ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో బిగ్‌బాస్ బయటకు పంపిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడప్పుడే అలాంటి నిర్ణయం తీసుకునేటట్లు కనిపించడం లేదు. మరోవైపు ఆమె ఆరోగ్యంపై స్పందించిన గంగవ్వ టీం ఆమె మంచిగనే ఉందని, టెన్షన్ పడకుర్రి అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వారం గంగవ్వ బయటకు రాదని తేలిపోయింది. (చదవండి: బిగ్‌బాస్: అనారోగ్యంతో ఏడ్చేసిన గంగవ్వ) నోయల్ సేఫ్ అనవసరమైన వాటి కోసం అతిగా స్పందించడం, ఇతరుల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ నోయల్ కొంత చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. కానీ ఈ మధ్య అలాంటి విషయాల్లో తలదూర్చడం తగ్గించేసుకున్నాడు. తన పనేదో తాను చేసుకుంటూ ఉన్న అభిమానులను కాపాడుకుంటున్నాడు. దీంతో నోయల్ కూడా సేఫ్ జోన్లో ఉన్నాడు. అభిజిత్, సోహైల్, మోనాల్, హారిక కూడా ఈ వారం గండం గట్టెక్కినట్లు తెలుస్తోంది. వీరి తర్వాత స్థానంలో తక్కువ ఓట్లు సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్ ఉన్నాడు. (చదవండి: బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి: నోయల్) డేంజర్ జోన్లో కళ్యాణి ఇక మొదట్లో పెద్ద గొంతేసుకుని, కయ్యానికి కాలు దువ్విన కళ్యాణి తర్వాత సైలెంట్ అయిపోయింది. అయినప్పటికీ ఆమె డేంజర్ జోన్లో ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్టుగా ఉంది. అతడికి కూడా తక్కువ ఓట్లే పడ్డట్టు తెలుస్తోంది. మొత్తానికి కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే కళ్యాణి, అమ్మ రాజశేఖర్లో ఎవరు వెళ్లిపోయినా ఎంటర్టైన్మెంట్కు గండి పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మాస్టర్‌కు హౌస్‌లో కొనసాగేందుకు ఛాన్సిచ్చే అవకాశం కనిపిస్తోంది. కళ్యాణిని బయటక పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (చదవండి: గత సీజన్లను వెనక్కునెట్టిన బిగ్‌బాస్) -
అమ్మాయి పేరు కనిపించినా వదలడు
అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గవ సీజన్.. మొదటి వారం నీరసంగానే సాగింది. హౌస్‌లో కోపానికి చిరునామాగా మారిపోయిన సూర్యకిరణ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో కాస్త ప్రశాంతత చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. కానీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వచ్చిన సాయి కుమార్ కాస్త తత్తరపాటుకు లోనవుతున్నట్లుగా ఉంది. దీంతో హౌస్‌లో అడుగు పెట్టిన తర్వాత రోజే నామినేట్ అయ్యాడు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్నాళ్లకు గొడవలు పక్కనపెట్టి కాస్త వినోదాన్ని పంచుతున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: నేను చనిపోయాననుకున్నారు: సూర్యకిరణ్.) #AmmaRajasekhar and #KarateKalyani dance lo anukunnadi okkati ayindi okkati 😂 ??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/FEwhFICoV2 — starmaa (@StarMaa) September 15, 2020 ఈ మేరకు స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో నోయల్.. కుళ్లు జోకులతో కామెడీ పండించే అమ్మ రాజశేఖర్‌ను రొమాంటిక్ డ్యాన్స్ చేయమన్నాడు. అది కూడా అతిగా ఆవేశపడే కరాటే కల్యాణితో. ఇంకేముంది.. ఇద్దరూ ఒకరికొకరు సరిపోయారు. వామ్మో, ఈ ఘోరాన్ని చూడలేను అన్నట్లుగా అరియానా కళ్లు మూసేసుకుంది. మరోవైపు మాస్టర్ కళ్యాణి చేయి పట్టుకుని లేపబోయి అతడే బొక్క బోర్లా పడ్డాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ పగలబడి నవ్వలేక చచ్చారు. (చదవండి: బిగ్‌బాస్: ఊరమాస్ స్టెప్పులేసిన దేవి) మరోవైపు ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు సరికొత్త అవతారాలతో దర్శనమిచ్చారు. దేత్తడి హారిక ఐటమ్ సాంగ్‌తో రెచ్చిపోనున్నట్లు కనిపిస్తోంది. రోజుకో టాలెంట్‌ను బయటపెడ్తూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న దేవి నాగవల్లి.. "అబ్బాయి చూడటానికి అలా ఉన్నాడు. కానీ, పేపరు మీద అమ్మాయి అని పేరున్నా వదలడు" అంటూ నేటి ఎపిసోడ్లో కామెడీ పంచ్‌లు విసురుతోంది. వీరి స్కిట్లు నేడు ఏ మేరకు పేలుతాయో చూడాలి. (చదవండి: జిగిరీ దోస్త్ నోయల్‌కే సపోర్ట్: రాహుల్) BB TV show shoot lo special entertainment 📹 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/3tBKM2PQmr — starmaa (@StarMaa) September 15, 2020 -
ఫైర్ బ్రాండ్.. కరాటే కల్యాణి
శ్రీకాకుళంలో పుట్టిన కరాటే కల్యాణి విజయనగరంలో పెరిగింది. కృష్ణ సినిమాలోని బా..బీ.. డైలాగ్‌తో ఆమె ఫేమస్ అయ్యారు. ఆ డైలాగ్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. కానీ తాను ఆ టైపు కాదని సాంప్రదాయ మహిళ అని చెప్తోంది. ఇక సీమంతం చేసుకోవాలన్నది తన కోరిక అంటోంది. అందరూ తనను మోసం చేశారని, వాడుకోడానకే చూశారని చేదు సంఘటనలను గుర్తు చేసుకుంది. పిల్లల కోసం ఆరాటపడుతున్న ఆ సమయంలో 'ఓ బాబును కోళ్ల గూడులో పడేసారు, మీరు పెంచుకుంటారా?' అని ఆమెకు వచ్చిన ఫోన్ కాల్ ఆమె బాధలకు ముగింపు పలికింది. మరో ఆలోచనే చేయకుండా వెంటనే బాబును దత్తత తీసుకుని అతడే సర్వస్వంగా ఆలనాపాలనా చూసుకుంటోంది. బిగ్‌బాస్‌లో ఉంటే తనను తాను అద్దంలో చూసుకోవడమేనని అంటోంది. మరి అద్దంలో తనకు తనే కొత్తగా కనిపిస్తారా? తన చుట్టూ ఉండే వారికి కొత్తగా దర్శనమిస్తారా? పనిలో పనిగా కోపమొస్తే తన కరాటే ప్రదర్శనను కూడా బయటపెడతారా చూడాలి. -
శ్రీరెడ్డి కేసు.. డ్యాన్స్ మాస్టర్‌కు వింత చిక్కు..
సాక్షి, సిటీబ్యూరో: తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుర్భాషలాడుతూ రూపొందించిన వీడియోను నటి శ్రీరెడ్డి ఆమె ఫేస్బుక్లో పోస్టు చేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో నిందితురాలిగా పరిగణిస్తూ శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వీటిని తీసుకుని చెన్నై వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం ఆమెకు అందించింది. 2018లో ఓ ఛానల్లో జరిగిన చర్చ నేపథ్యంలో కరాటే కళ్యాణి, శ్రీరెడ్డి పరస్పరం గొడవ పడ్డారు. దీనికి సంబంధించి శ్రీరెడ్డి హుమాయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇటీవల కళ్యాణికి నోటీసులు జారీ చేశారు. దీంతో మధ్య మరోసారి వివాదం రేగింది. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి, కళ్యాణిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ, కించపరిచేలా 20 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియోను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. దీనిని చూసిన కళ్యాణి సదరు వీడియోతో పాటు దానికి సంబంధించిన యూఆర్ఎల్ను పొందుపరుస్తూ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నేను పట్టించుకోను, నన్ను అరెస్ట్ చేసినా సరే అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. గత నెల్లో సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసిన కళ్యాణి తన ఫిర్యాదుతో పాటు, వీడియోతో కూడిన సీడీని అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు కేసు దర్యాప్తు చేపట్టారు. శ్రీరెడ్డిని సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, ఆమె చెన్నైలో ఉన్నట్లు తెలియడంతో గురువారం అక్కడికి వెళ్లిన బృందం శుక్రవారం ఆమెకు నోటీసులను అందించింది. మరోపక్క ఈ కేసులో సాక్షిగా ఉన్న ఓ డ్యాన్స్ మాస్టర్‌కు వింత చిక్కు వచ్చిపడింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన యాంకర్ ప్రశ్నకు బదులిస్తూ తన జీవితంలో చూసిన మేటి డ్యాన్సర్ అంటూ ఓ యువ హీరో పేరు చెప్పారు. దీన్ని యూట్యూబ్‌లో చూసిన మరో యువహీరో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. డ్యాన్సు యూనిట్ ఏర్పాటు కోసం ఆయన సోషల్‌మీడియాలో తన ఫోన్ నెంబర్ పోస్టు చేశారు. దీని ఆధారంగా సదరు డ్యాన్స్ మాస్టర్‌కు ఫోన్లు చేస్తున్న సదరు అభిమానులు తీవ్రంగా బెదిరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసిన ఆయన శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. -
హత్యా బెదిరింపులు.. శ్రీరెడ్డి ఫిర్యాదు
పెరంబూరు: సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఇంతకు ముందు లైంగిక ఆరోపణలతో తెలుగు, తమిళ సినీపరిశ్రమల్లో కలకలం సృష్టించిన ఈ అమ్మడు తాజాగా తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే... అసభ్యకర పోస్ట్‌లు పెట్టారంటూ శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి, నృత్యదర్శకుడు రాకేశ్ మాస్టర్ తెలంగాణా రాష్ట్ర క్రైమ్‌బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. (కారు ధ్వంసం చేశారని శ్రీరెడ్డి ఫిర్యాదు) ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి... నటి కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్ మాస్టర్‌పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో వారిద్దరూ తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తానిప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నానని, తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు తెలిపారు. అయితే కరాటే కల్యాణి, రాకేశ్ మాస్టర్ తన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను చెన్నైలో కారు, ఇల్లు కొనుక్కున్నానని, దీని గురించి వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసభ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నట్లు చెప్పారు. తనను పెట్రోల్ పోసి తగల పెడతామని హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి తెలిపారు. (‘శ్రీరెడ్డి దొరికిపోయింది’) -
శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ శ్రీరెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, న్యూస్ చానల్లో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రెండేళ్ల క్రితం కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి హుమయున్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరించిన కల్యాణిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో శ్రీరెడ్డి కోరారు. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమిళ సినిమాల్లో అవకాశాలు రావడంతో ఆమె చెన్నైలో మకాం పెట్టారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. ప్రముఖ దర్శకులు ఏఆర్ మురుగదాస్, సుందర్.సి, నటులు రాఘవ లారెన్స్, శ్రీరామ్, హీరో విశాల్‌లపై కూడా ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీంతో శ్రీరెడ్డిపై చాలా మంది కేసులు పెట్టారు. (చదవండి: విలన్‌గా యాంకర్ అనసూయ..!) -
‘అశ్లీల వీడియో పంపుతూ వేధిస్తున్నారు’
సాక్షి, హైదారాబాద్ : తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అశ్లీల వీడియోలు పంపుతున్నారని వేధిస్తున్నారంటూ సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. గుర్తుతెలియన వ్యక్తులు కొద్ది రోజులుగా ఈ పనులు చేస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయాన్నే లేచి ఫోన్ చూడాలంటేనే భయమేస్తుందని ఆమె పోలీసులతో తన బాధను చెప్పుకున్నారు. కొన్ని నంబర్లు బ్లాక్ చేసినా.. వేరే నంబర్ల నుంచి అశ్లీల వీడియోలు పంపుతూ, తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. కల్యాణి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ చేపట్టారు. -
వివరాలు తర్వాత చెబుతాం: జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆత్మీయ సమావేశం ఎట్టకేలకు ముగిసింది. త్వరలోనే మరోసారి అందరూ సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. ‘మా’లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు. సినీ పెద్దల సూచనలు, సలహాలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించింది. కాగా సమావేశం ముగిసిన అనంతరం మా అసోసియేషన్ కార్యదర్శి రాజశేఖర్, ఆయన భార్య జీవిత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, వివరాలు తర్వాత చెబుతామని తెలిపారు. కాగా నరేశ్ అధ్యక్షతన ఏర్పడిన మా కొత్త కార్యవర్గం సభ్యుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కాకముందే రెండు వర్గాలుగా ఏర్పడటంతో విభేదాలు పొడచూపాయి. అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయని వార్తల నేపథ్యంలో.... ఆదివారం మా’ సభ్యుల సమావేశంఉందంటూ జీవితా రాజశేఖర్ మెస్సేజ్ ఇవ్వడం నరేశ్ కార్యవర్గానికి షాక్‌కు గురిచేసింది. అయితే కోర్డు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్ తెలిపారు. ఆ వార్తల్లో వాస్తవం లేదు: కరాటే కల్యాణి త్వరలోనే ‘మా’ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం కూడా జరుగుతుందని మా ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి తెలిపారు. ఆమె ఆదివారమిక్కడ మాట్లాడుతూ...‘ ఈ రోజు జరుగుతున్న సమావేశం ఆత్మీయ సమ్మేళనం మాత్రమే. అసోసియేషన్‌లో రెండు గ్రూలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అందరం ఒక్కటిగా కూర్చొని మా సమస్యలు పరిష్కరించుకుంటాం.’ అని అన్నారు. పెద్దలు జోక్యం చేసుకోవాలి.. సినీ నటుడు మాణిక్ మాట్లాడుతూ... మా అసోసియేషన్‌లో చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి. జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ల మధ్య చిన్న గొడవలున్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి మరోసారి భేటీ అవుతాం. సినీ పెద్దలు చిరంజీవి, వెంకటేశ్, కృష్ణంరాజు, బాలకృష్ణ తదితరులు కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలి’ అని కోరారు. చదవండి: నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తా : పృథ్వీ ‘మా’లో మరో కొత్త వివాదం.. -
శ్రీరెడ్డిపై మరో బాంబు పేల్చిన కల్యాణి
హైదరాబాద్: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వ్యతిరేక ఉద్యమం కాస్తా వ్యక్తిగత వివాదాలకు దారితీస్తున్నది. మొన్న పవన్ కల్యాణ్ తల్లిని ఉద్దేశించి నటి శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు కోరడం తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించి నటి కరాటే కల్యాణి బహిర్గతం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఇటీవల ఓ టీవీ చానెల్ చర్చలో శ్రీరెడ్డి వాదనతో విబేధించిన కల్యాణి.. లైవ్‌లోనే చేయిచేసుకోవడం విదితమే. శ్రీరెడ్డికి కూతురు, కోట్ల ఆస్తులు: ‘కల్యాణి లీక్స్ మొదలయ్యాయి. పెళ్లి కాని విమలకు(శ్రీరెడ్డి అసలు పేరును చెబుతూ) ఇంటర్ పూర్తిచేసిన కూతురుంది. గడిచిన 10 ఏళ్ల నుంచి తల్లిదండ్రులతో సంబంధాలు లేవని శ్రీరెడ్డి చెప్పింది. కానీ కొంతకాలం కిందట కూకట్‌పల్లిలో కోట్ల విలువైన ఫ్లాట్‌లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఆమె వెంట తల్లికూడా ఉన్నారు. ఇదికాకుండా తను ఖరీదైన కార్లలో తిరుగుతుంది. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయో ఆమెకే తెలియాలి. మరికొన్ని లీక్స్ నాకు నచ్చినప్పుడు బయటపెడతా.. నా లీక్స్ నా ఇష్టం’’ అని నటి కరాటే కల్యాణి అలియాస్ కల్యాణి పడాల వెల్లడించారు. ఫొటోలపై మండిపాటు: కాగా, నటి కరాటే కల్యాణి పోస్ట్ చేసిన ఫొటోల్లో శ్రీరెడ్డి కూతురిగా పేర్కొన్న పాప ఫొటోను కూడా ఉంచడం వివాదానికి దారితీసింది. ‘‘మీ గొడవల్లోకి కుటుంబ సభ్యులను, అందులోనూ పిల్లలను, వారి ఫొటోలను లీక్ చెయ్యడం ఎంతవరకు సబబు?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కల్యాణి లీక్స్‌పై శ్రీరెడ్డి స్పందన వెలువడాల్సిఉంది. -
ఆ శిశువును దత్తత తీసుకుంటా..
‘సాక్షి’కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సినీనటి కరాటే కల్యాణి సిరిసిల్ల రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ముళ్లపొదల్లో పడేసిన ఆడశిశివును పత్రికల్లో, సోషల్ మీడియాలో చూసిన సినీ నటి కరాటే కల్యాణి స్పందించారు. ‘సాక్షి’కి ఫోన్ చేసి పాప వివరాలు తెలుసుకున్నారు. ఆ పాపను తనకిస్తే దత్తత తీసుకుంటానని, ఇందుకోసం కలెక్టర్‌తోనూ మాట్లాడతానని పేర్కొన్నారు. -
చిట్‌ఫండ్ కార్యాలయంలో కరాటే కళ్యాణి హల్చల్
హైదరాబాద్ : సినీనటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఆమె ఈసారి నగరంలోని ఓ ప్రముఖ చిట్‌ఫండ్స్ కార్యాలయంలో హల్చల్ చేసింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ కరాటే కళ్యాణి శనివారం అబిడ్స్‌లోని చిట్‌ఫండ్స్ ఆఫీస్‌లో నిరసన చేపట్టింది. తనకు రావాల్సిన 1.20వేల రూపాయలు చెల్లించాలని ఆమె కార్యాలయంలో ఆందోళనకు దిగింది. అయితే చిట్‌ఫండ్ కంపెనీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కరాటే కళ్యాణి సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.