సీనియర్ నటి కవిత ఇంట ఇటీవల విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే కుమారుడు స్వరూప్, భర్త దశరాథ రాజు కరోనాతో మృత్యువాత పడ్డారు. కుటుంబంలోని ముఖ్యమైన ఇద్దరూ వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కవిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మరణం మరవక ముందే భర్త మృతి వార్త ఆమెను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆమెను ఓదార్చం ఎవరి తరంగా కావడం లేదు.
అయితే టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెను ఫోన్ ద్వారా పరామర్శించినప్పటకీ తాజాగా మా అసోసియేషన్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. సీనియర్ నటుడు, మా అధ్యక్షులు నరేష్‌తో పాటు కరాటే కల్యాణి, నటి పవిత్రలు కవిత, ఆమె కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. ఇక భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా తప్పకుండా అందిస్తామని నరేష్ భరోసానిచ్చారు.
కాగా కవిత భర్త దశరథ రాజు నెల రోజుల కరోనా పాజిటివ్‌గా తేలింది. మధ్యలో ఓ సారి నెగిటివ్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే వారి తనయుడు స్వరూప్ కరోనాతో మృత్యువాత పడ్డాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న దశరథ రాజును కవిత ఆస్పత్రికి తరలించారు. దాదాపు 20 రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కవిత భర్త కన్నుమూశారు. కవిత 'ఓ మజ్ను' అనే తమిళ సినిమాతో 11 ఏళ్లకే వెండితెర అరంగ్రేటం చేశారు. సుమారు 50కి పైగా తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
Movie artists association (MAA) President @ItsActorNaresh, along with other artists from TFI met and conveyed their condolences to actress #kavitha on the huge loss of her husband and son due to #Covid19. pic.twitter.com/SJ5MiSTyIW
— BARaju's Team (@baraju_SuperHit) July 3, 2021
Comments
Please login to add a commentAdd a comment