kavitha
-
సంధి ముగిసింది.. చర్యలు తీసుకోవడమే ఆలస్యం : మధుయాష్కీ
సాక్షి,హైదరాబాద్ : ప్రతిపక్షంతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ ప్రభుత్వంలోని పలు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కీలక అధికారులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని రాజకీయపరిణామాలపై మధుయాష్కీ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ బాగోతం ఇంకా బయటపడాలి. సోమేష్ కుమార్ అండతోనే జీఏస్టీ కుంభకోణం జరిగింది. దోచిపెట్టిన ,దాచి పెట్టిన అధికారుల పై విచారణ జరగాలి. అభయ్ కుమార్ లాంటి వారి పై చర్యలు అవసరం. విచారణలో వేగం లేనందునే కాంప్రమైజ్ అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.విచారణ చేయాల్సిన అధికారులే దోషులు కావడంతో విచారణ ముందుకు సాగడం లేదు. సింగరేణిలో కవిత కు అన్ని రకాలుగా సహాకరించిన అధికారి ..మా ప్రభుత్వం లో ఉన్నత స్థానంలో ఉన్నారు. సంధి కాలం ముగిసింది.. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టాలి. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారు’అని మండిపడ్డారు. -
ఇలాంటి భాగస్వామిని భరించడం కష్టమే!
కవిత హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. కుమార్‌తో పెళ్లయి రెండేళ్లవుతోంది. కవిత కలుపుగోలు మనిషి, కుమార్ కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు. దీంతో ‘నీ పని నువ్వు చూసుకోక అందరితో మాట్లాడతావెందుకు?’ అని దెప్పుతుంటాడు. చిన్న చిన్న పనులకు కూడా తప్పు పడుతుండేవాడు. ‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్‌ను కలువు’ అని తరచు అనేవాడు. కొన్నాళ్లకు కవిత కూడా కుమార్ మాటలు నిజమేనేమో అనుకోవడం మొదలుపెట్టింది. ‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే కుమార్ ఎందుకలా అంటాడు’ అని అనుకునేది. తనకేదో సమస్య ఉందనే ఆలోచనలతో ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. నిరంతరం ఆందోళనగా ఉంటోంది. ఒంటరితనం, భయం, నిస్సహాయత. ఎవరితోనూ మాట్లాడాలనిపించడంలేదు. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ దగ్గరకు వెళ్లి అన్నిరకాల టెస్టులు చేయించుకుంది. శారీరకంగా ఎలాంటి సమస్య లేదని, ఒకసారి సైకాలజిస్ట్‌ను కలవమని సూచించారు. దాంతో కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన ఇంటి వాతావరణం గురించి, భర్త ప్రవర్తన గురించి వివరంగా చెప్పింది. మెల్లగా మంటపెడతారు... కవిత చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్‌కు గురవుతుందని అర్థమైంది. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోవడానికి కొందరు చేసే మానిప్యులేషన్‌ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తాము గ్యాస్ లైటింగ్‌కు గురవుతున్న విషయాన్ని బాధితులు గుర్తించలేరు. అసలా దిశగా ఆలోచించలేరు. అందుకే భర్త మానిప్యులేషన్ గురించి కవితకేం చెప్పలేదు.మూడునెలల్లో పరిష్కారం... మొదట కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆందోళన తగ్గించుకునేలా సహాయం అందించాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. తాను గ్యాస్ లైటింగ్‌కు గురవుతున్నానని అప్పుడు అర్థం చేసుకుంది. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్సైజ్లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను.స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ కవిత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. కుమార్ మాటలను పట్టించుకోవడం మానేసింది. కవిత ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న కుమార్ కూడా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది. గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు» నువ్వు ప్రతిదానికీ ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావ్. » అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. · నీకోసమే అలా చేశాను. » నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?» నేను నీకు చెప్పాను, గుర్తులేదా? » అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. » నీపట్ల నాకెప్పుడూ నెగటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగటివ్ గా చూస్తున్నావ్.మాయ మాటలు నమ్మొద్దు» గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. » గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా, చేసే పనులపై దృష్టి పెట్టాలి. » ‘నీకు పిచ్చి’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. » ‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకు గుర్తుందో అదే నిజమని గుర్తించాలి. »గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్‌కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. » గ్యాస్ లైటర్‌తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. » మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి. -
ఆమె కథ
సిటీలోనే అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ అది. ఆరు నెలల ముందుగా బుక్ చేసుకుంటేనే గాని, అందులో పెళ్ళి చేసుకునే అవకాశం రాదు. సుధీర్, రేవతిల పెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లోనే అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళికీ మొదటిరాత్రికీ మధ్యలో ఒకరోజు గ్యాప్ రావడంతో సుధీర్, రేవతిలకు కాస్త విశ్రాంతి దొరికింది. శోభనం రోజు మధ్యాహ్నం నుంచే రేవతి ఇంట్లో హడావుడి మొదలైంది. ‘రేవతి! టైమ్ మర్చిపోకమ్మా! సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు మీరిద్దరూ కలవాలి. నువ్వే వాడి తలకెక్కేలా చెప్పు’ అని ఉదయం నుంచి లెక్కలేనన్నిసార్లు చెబుతూనే ఉంది సుధీర్ తల్లి కవిత స్నానానికి వెళ్ళే రేవతిని ఆపి మరీ. ‘సాయంత్రం గదిలోకెళ్ళిన వెంటనే ముందుగా టైం చూపించి మరీ వాడి పక్కన కూర్చోవాలి నువ్వు’ వివరంగా చెప్పింది కవిత.‘రేవతీ! స్నానం చేశావా?’ అంటూ గదిలోకి వచ్చింది రేవతి చిన్న వదిన దేవకి. ‘ఏంటీ, అప్పుడే అత్తా కోడళ్ళు సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు. మేం వినకూడదా?’ అంటూ రేవతి, కవితల మధ్యలోకి చొరవగా వచ్చింది దేవకి.‘అలాగేం లేదమ్మా! నువ్వు నా అల్లరి కూతురివి, నీ దగ్గర దాపరికాలు ఉంటాయా చెప్పు, నా కోడలికి జాగ్రత్తలు చెబుతున్నానంతే!’ అంది కవిత. ‘టైమ్ చూసుకుని కలవమంటోంది అత్తయ్య!’ తన వదిన చెవిలో చిన్నగా చెప్పింది రేవతి సిగ్గుపడుతూ.‘అది చాలా ముఖ్యం రేవతి! మా పిన్నమ్మ ఆ పంతులుతో మంచి ముహూర్తం పెట్టమని చాలా గట్టిగా చెప్పింది. నువ్వు ఆ టైమ్ పాటించకపోతే మీ అత్తయ్య, మా పిన్ని కష్టం వృథా అయిపోతుంది’ అంది కవితనుద్దేశించి. రేవతి స్నానానికి వెళ్ళింది.‘మీకు ముహూర్తాలంటే ఎందుకు పిన్నీ అంత గట్టి నమ్మకం?’ ఆసక్తిగా కవితను అడిగింది దేవకి. ‘ఈ నమ్మకాలు మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి, మా అమ్మ నుండి నాకు వంటపట్టాయి’ చెప్పింది కవిత. ‘అలా వచ్చిందా! మీది పెద్ద చరిత్రే’ అంది దేవకి. ‘ముందు తెలియని వయసులో వాళ్ళలా ఉండాలని పాటించేదాన్ని. నా పెళ్ళయి పిల్లలు పుట్టాక వాళ్ళకు జరిపించే అన్నప్రాశనలు, నామకరణాలు, ఇంట్లో ఆడపడుచుల ఫంక్షన్లు జరుగుతూ ఉంటే అప్పుడు నా నమ్మకం బాగా బలపడింది’ అని చెప్పింది కవిత. ‘ఏంటమ్మా! పిన్ని, కూతుళ్ళు తీరిగ్గా ముచ్చట్లు పెట్టారు. అక్కడ శోభనం గదిలో పనేంలేదా?’ అంటూ వచ్చింది దేవకి తోటికోడలు మీనా.‘నా పెద్ద కూతురు కూడా ఇటే వచ్చేసింది. ఇంక మాకా గదిలో పనేముంటుంది చెప్పు!’ అంది కవిత. ‘పిన్ని! మిమ్మల్ని బాబాయ్ పిలుస్తున్నారు’ అని కబురు తెచ్చింది మీనా. ‘ఎందుకు తల్లీ! కొడుక్కి శోభనం అయితే ఈయన కంగారేంటి?’ అంటూ వెళ్ళింది, కవిత. మీనా, దేవకి నవ్వుకున్నారు. ‘చాలా సరదాగా ఉంటుందే పిన్ని. మన రేవతి అదృష్టవంతురాలు. మంచి అత్త దొరికింది’ అంది మనస్పూర్తిగా మీనా. ‘హలో అక్కగారు! ఆమె మంచిదిలా కనిపిస్తుందా నీకు? ఆవిడను ఒకవైపే చూశావు, రెండోవైపు పూర్తిగా తెలియదు. ఈ కాలం మనిషి కాదు. కొత్త విషయం ఏంటంటే, పూజ గది, ఈవిడగారుండే గది పనిమనుషులు శుభ్రం చెయ్యరట! ఇంటి కోడళ్లే ఆ పని చెయ్యాలట! ఇప్పుడున్న ఇద్దరూ కోడళ్లూ అలాగే చేస్తున్నారట! బయట హాల్లో సోఫాలో కూర్చున్న ఇద్దరు కోడళ్ళ మొహాలు చూశావా, ఈమెపై కోపంతో తెగ మెరిసిపోతున్నాయ్! ఇంట్లో ఆవిడ పర్మిషన్ లేకుండా చీపురు కట్ట కూడా కొనకూడదట! చీపురు, చేట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట! ఏ రోజు ఏ రంగు చీరకట్టాలో ఆవిడే ముందు రోజు నైట్ చెబుతుందట! ఇంట్లో పనివాళ్ళు ఆమెకు ఐదడుగుల దూరంలో నడవాలట! కాని, ఇక్కడ మాత్రం అలాంటివేవీ కనబడకుండా తిరుగుతోంది. ఇంకో గొప్ప సంగతి. ఇద్దరు కోడళ్ళకు సుఖప్రసవం జరుగుందని డాక్టర్లు చెబితే, ఈవిడ మాత్రం మంచి రోజు, మంచి ఘడియలని చెప్పి రెండు మూడు రోజులు ముందే సిజేరియన్ ఆపరేషన్ చేయించి, బిడ్డలను బయటకు తీయించిందట!’ అని చెప్పింది దేవకి. ‘అమ్మ బాబోయ్! ఈవిడకింతుందా?’ అని అమాయకంగా అడిగింది మీనా.‘ఆవిడ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. నీకు శాంపిల్‌గా కొన్నే చెప్పాను’ చెప్పింది దేవకి. ‘అవును చెల్లి! ఆవిడ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలుసు?’ అడిగింది మీనా. ‘మెల్లగా వాళ్ళ పనిమనిషి దగ్గర నుంచి రాబట్టాను’ చెప్పింది దేవకి. ‘ఈ లెక్కన చూస్తే, మన అత్తగారే నయమనిపిస్తుంది’ అంది మీనా. ‘అవును. ఆవిడ కంటే మన అత్తగారు వందరెట్లు మంచిది’ నిజాయితీగా ఒప్పుకుంది దేవకి. ‘మరి మన రేవతి ఆమెను తట్టుకోగలదా?’ రేవతి భవిష్యత్తు గురించి జాలిపడింది మీనా. ‘మన రేవతి మంచిది, అమాయకురాలు. ఆమె నవ్వుతూ సంసారం చేసుకున్నంత వరకు నేను, మా ఆయన వాళ్ళను గౌరవిస్తాం! రేవతి ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే, ఊరుకునే ప్రసక్తే లేదు’ చెప్పింది దేవకి. ‘మేము మాత్రం ఊరుకుంటామా? తేడా వస్తే అడిగి, కడిగి పారేస్తాం!’ అంది మీనా. తోటికోడళ్ళ సంభాషణలు గది బయట ద్వారబంధం పక్కన చాటుగా ఉండి విన్న రేవతి తల్లి, మీనా, దేవకిల అత్తగారు జానకి ‘నా కోడళ్ళు బంగారం, నా అంత అదృష్టవంతురాలైన అత్త ఇంకొకరు ఉండరు’ అని మనసులోనే అనుకుంది.రేవతి స్నానం చేసి బయటకు వచ్చింది. ‘రేవతి, నీదే లేటు. నువ్వు రెడీ అయితే మిగతా ఏర్పాట్లు చేసుకుంటాము‘ అంది మీనా.‘అక్కా! నువ్వు రేవతిని రెడీ చెయ్యి, ఈలోపు నేనెళ్ళి వంట పనులు చూసుకుంటాను’ అని బయటకు నడిచింది దేవకి. ఆమె రావడం గమనించిన జానకి గదిలోకి ప్రవేశించి, ‘అమ్మా దేవకి! అక్కడ రేవతి అత్తగారు కంగారుగా ఉంది. కాస్త నువ్వెళ్ళి చూసుకోమ్మా’ అంది జానకి. ‘అలాగే అత్తయ్యా! మీరు మన రేవతికి అన్నీ చెప్పండి, ఆ పిన్నిగారు టైమ్, టైమ్ అని తెగ ఆరాటపడుతోంది’ అని చెప్పి దేవకి బయటకు వెళ్ళింది. సమయం ఏడు నలభై నిమిషాలవుతోంది. మీనా రేవతిని ముస్తాబు చేస్తోంది. కవిత హాల్లో కోడళ్ళతో ముచ్చట్లు చెబుతోంది. మగాళ్ళు పెంటహౌస్లో సురాపానంలో నిమగ్నమై ఉన్నారు. దేవకి వంటల దగ్గర ఉంది. శోభనం గది పూల పరిమళాలతో నిండిపోయింది. పెళ్ళి కొడుకు సుధీర్‌ను తన ఇద్దరన్నలూ వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు. సుధీర్‌తో ఇంకో పదిమంది స్నేహితులు ఉండటంతో ఆ గది మొత్తం సందడిగా ఉంది. సమయం ఎనిమిది రెండు నిమిషాలైంది. కవిత పెద్ద కొడుకు శ్యామ్ భార్య నీరజ పెళ్ళికొడుకు గది దగ్గరికి వచ్చి, ‘సుధీర్ రెడీ అయ్యాడా?’ అనడిగింది.‘హా! రెడీ!’ అని, ‘రేయ్ తమ్ముళ్లూ! మీరంతా కాస్త వాడికి దారిస్తే, పంజరంలోకి పంపుదాం!’ అన్నాడు. చుట్టూ చేరి జోకులేస్తూ నవ్విస్తున్న సుధీర్ స్నేహితులు వెంటనే ‘ఆల్ ది బెస్ట్ రా సుధీర్!’ అని గట్టిగా అరిచారు. సుధీర్ రాజకుమారుడిలా కదిలాడు. సరిగ్గా సుధీర్ ఎనిమిది గంటల పదకొండో నిమిషంలో గదిలోకి వెళ్ళాడు. రేవతి దేవకన్యలా ముస్తాబై ఎనిమిది గంటల పదహారో నిమిషంలో గదిలోకి ప్రవేశించింది. ఆ అద్భుతమైన తంతును కళ్ళారా చూస్తూ చాలా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంది హాల్లో కూర్చున్న కవిత. ‘పిన్నిగారు! అంతా మీరనుకున్నట్టు చాలా అందంగా జరిగింది. రండి భోజనం చేద్దాం!’ అని సంతోషంగా చిరునవ్వుతో పిలిచింది దేవకి. ‘ఇప్పుడు ఆకలేస్తుంది. పద తిందాం!’ అని దేవకి వెనుకే నడిచింది సంతోషంగా కవిత. కుటుంబసభ్యులు, కొంతమంది బాగా దగ్గర బంధువులు అందరూ కలిసి ఆనందంగా భోంచేస్తున్నారు.సందడిగా ఉంది ఆ ప్రాంతం! సమయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలవుతోంది. సరిగ్గా అప్పుడే దేవకి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన శబ్దం విని, ఓపెన్ చేసి చూసింది దేవకి. రేవతి ఫోన్ నుండి, ‘వదినా! నాకు డేట్ వచ్చింది. ప్లీజ్ హెల్ప్ మీ!’ అని వచ్చిన ఆ మెసేజ్ చూసి, దేవకి మొహంలో చిరునవ్వు మాయమై, కంగారు మొదలై చెమటలు పట్టాయి.‘వెంటనే నీ రూమ్‌కి రా!’ అని రిప్లై చేసి, మెల్లిగా తన కళ్ళు కవిత వైపు తిప్పింది. బంధువులతో ముచ్చటిస్తూ భోంచేస్తుండటం చూసి, ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకుని, ‘అక్క! నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తా, కాస్త చూసుకో!‘ అని మీనాకి చెప్పి, లోపలికి వెళ్ళింది.‘ఏంటి రేవతి! ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా! ఇప్పుడెలా? మా తమ్ముడికి చెప్పావా?’ అని అడిగింది దేవకి టెన్షన్‌గా. ‘చెప్పాను. వెళ్ళి రెస్టు తీసుకో’ అని చెప్పారు. ‘సరే,నువ్వు కంగారు పడకు. అయినా, ఇంకా టైముంది కదా?’ కంగారుగానే అడిగింది దేవకి. ‘రేపు కానీ, ఎల్లుండు కానీ రావాలి’ అమాయకంగా చెప్పింది రేవతి. ‘సరే సరే, ఈ రూమ్‌లోనే ప్రశాంతంగా పడుకో, రేపు చూసుకుందాం!’ అని చెప్పి, ‘ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమౌతుందో, ఏంటో’ అంటూ టెన్షన్‌గా వెనక్కి తిరిగేసరికి, ఎదురుగా కవిత నిలబడి ఉంది. ఆమెను చూసి దేవకి పెద్ద షాకే తిని రాయిలా నిలబడిపోయింది. రేవతి కవితకు, దేవకికి ఒకేసారి మెసేజ్ పెట్టింది. అందువల్ల ఈ విషయం కవితకు తెలిసింది. ‘అసలు మీరు ఆడవాళ్లేనా? నోటికి అన్నమే తింటున్నారా? ముందుగా టేబ్లెట్స్ వేసుకోవాలని తెలియదా? మీ కంటే లేబరోళ్ళే బెటర్ కదా!’ అని పిచ్చ కోపంగా తిట్టి, హాల్లో కొచ్చి, ‘నీరజా! శ్యామ్! అందరూ రండి ఇంటికి పోదాం!’ అంటూ గేటువైపు దారి తీసింది కవిత. ‘ఇప్పుడేమైందని అంత కోపం తెచ్చుకుని పోదామంటున్నావమ్మా!’ అన్నాడు సుధీర్ గట్టిగా. ‘ఏమైందా? అప్పుడే పెళ్ళానికి సపోర్టా? ఇంత అరెంజ్మెంట్ చేయిస్తే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా?’ కోపంగానే అంది కవిత. ‘మనం స్వచ్ఛమైన నీళ్ళు తాగి ఎంతకాలమైంది? పొల్యూషన్ లేని గాలి పీల్చి ఎన్నేళ్ళైంది? రోగం లేని మనిషెవడైనా ఉన్నాడా?’ సూటిగా అడిగాడు సుధీర్. ‘దానికి, దీనికి సంబంధమేంటి? నువ్వేం మాట్లాడుతున్నావ్?’ అర్థం కానట్టు అడిగింది కవిత. ‘అమ్మా! సంబంధం ఉంది. మంచి ముహుర్తం కాబట్టి, నెలసరి రాకుండా టేబ్లెట్స్ వేసుకుని ఉండొచ్చు కదా! అనేగా నీ కోపం, బాధ? తప్పు. సృష్టికి విరుద్ధమైనది నీ ఆలోచన. ఇంకెంత కాలం మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు హాఫ్ నాలెడ్జ్ తో! ఇకనైనా కళ్ళుతెరవండి. మీ ఆడవాళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేసేవాళ్ళని గొప్పగా చెప్పుకునే ముందు, కొంత మూర్ఖత్వాన్ని, కొంత చాదస్తాన్ని తగ్గించుకుని మీ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. దేవుడు మనకన్నీ కల్తిలేనివే అందించాడు. మనమే అతి తెలివితో కల్తీగా మారిపోతున్నాము’ అని చెప్పడం ఆపి, ‘నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే, రేపు మనింట్లో పూజ గదనేది ఉండదు’ అని తన గదివైపు వెళ్ళిపోయాడు. సుధీర్ మాటలు కవితను ఆలోచించేలా చేశాయి. రేవతికి, దేవకికి సారీ చెప్పింది కవిత. ‘భయపడకు. ఈ మూడు రోజులూ నువ్వు నాతో ఉండు. నీకు మొత్తం తగ్గాకే కార్యం పెట్టుకుందాం!’ అని రేవతిని కౌగిలించుకుని ధైర్యం చెప్పింది కవిత. ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ప్రవేశించింది. -
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి14) గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. సర్టిఫికెట్లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు. అన్నీ తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నా. కేంద్రానికి సవాల్ చేస్తున్నా.. జనగణనతో పాటు కులగణన చెయ్యాలి. కేంద్రం లెక్కలు మా ప్రభుత్వం చేసిన లెక్కలను సరిపోల్చుదాం. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్,కేటీఆర్,హరీష్ లను బహిష్కరణ చెయ్యాలి.బహిష్కరణ కోసం మీ సమక్షంలో తీర్మానం చేస్తున్న. ప్రభుత్వ సర్వే తప్పుల తడక అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. భారత్ జోడో యాత్రలోనే రాహుల్ గాంధీ స్పష్టం గా కులగణన చేస్తాం అని హామీ ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని జాతులకు వారి ఫలాలు అందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.డోర్ టు డోర్ వెళ్లిన సిబ్బంది ముందే డేటా ఎంట్రీ చేశాం. కేసీఆర్ సర్వే..కాకిలెక్కల సర్వే.తెలంగాణ సమాజంలో తిరిగే హక్కే కేసీఆర్, కేటీఆర్,సంతోష్ రావ్ లకు లేదు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కేసీఆర్ ఇచ్చి ఉంటే మాట్లాడే హక్కు ఉండేది.కులగణన సర్వేలో డేటా ఇవ్వని లిస్టులో ముందు వరుసలో కేసీఆర్ కేటీఆర్,సంతోష్ రావ్ గ్యాంబ్లింగ్ శ్రీనివాస్‌లు ఉన్నారు.కేసీఆర్ లెక్క తేలితే..వార్డు మెంబర్ పదవి కూడా ఆ కుటుంబానికి రాదుగొప్పగొప్ప నేతలు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లే. చంద్రబాబు,కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. యూత్ కాంగ్రెస్ శక్తి ఏంటో మాకు తెలుసు. అనిల్‌యాదవ్,బల్మూరి వెంకట్ సేవలను గుర్తించి వారికి పదవులు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.డబ్బుతో రాజకీయాలు సాధ్యాం కాదు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్నవారికే టికెట్లిస్తాం. ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి వారికే పదవులు వస్తాయి. పదేళ్లు కేసీఆర్ తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి కేసీఆర్ అబద్ధాలు చెప్పాడు. లిక్కర్ కేసు ద్వారా కేసీఆర్, కేజ్రీవాల్‌ను ఓడగొట్టిన కవిత ఇప్పుడు మాట్లాడుతోంది. కేసీఆర్‌నే గట్టిగా ఓడగొట్టాం నువ్వొచ్చి చేసేదేముంది. కేసీఆర్ గట్టిగా కొడతా అంటున్నాడు. కొట్టాలనుకుంటే నీ కొడుకు కేటీఆర్‌ను పిచ్చిపిచ్చిగా కొట్టు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడగొట్టినందుకు నీ అల్లుడిని కొట్టు. డబ్బుతో గెలవాలనుకుంటే కేసీఆరే గెలిచేవాడు. కేసీఆర్,కేటీఆర్, కవిత దగ్గర వేల కోట్లున్నాయిప్రభుత్వ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.ప్రజలకు అండగా ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తాం.సామాన్యులకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా అవకాశాలు కల్పిస్తాం. డబ్బుతో ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు’అని రేవంత్‌రెడ్డి అన్నారు. -
పింక్ బుక్‌లో రాస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం.: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జనగామ జిల్లా: పింక్ బుక్‌లో అన్ని రాసుకుంటున్నాం.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింత చెల్లిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కలు తీస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు. పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం’’ అని కవిత దుయ్యబట్టారు.‘‘కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి నిధులు పారాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001లో ఆగమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారు. 95 పూర్తయిన సమ్మక్క, సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని కవిత నిలదీశారు.అవకాశవాదం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముంది. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. రూ. 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు మాయమయ్యాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే. ఆడ బిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. రైతు భరోసా పేరిట రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు.రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడతాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. -
‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ పారిపోయారు’
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.అదే వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదు. వరంగల్ డిక్లరేషన్‌పై రైతులు ప్రశ్నిస్తారని ఆయన భయపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చే వరకు వెంటబడతామని’ కవిత వ్యాఖ్యానించారు. భద్రతా పరమైన ఇబ్బందులు.. రాహుల్ పర్యటన రద్దురాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్‌లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
‘చెల్లెల్ని చూసి నేర్చుకో’.. కేటీఆర్‌కు కొండా సురేఖ కౌంటర్
సాక్షి, హైదరాబాద్ : సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్, ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలి. సర్వే అంటున్న కేటీఆర్.. చెల్లి కవితను చూసి నేర్చుకోవాలి. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలి. ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది నాకు తెలీదు..నేను ఎవరిని ఎంకరేజ్ చేయడంలేదు.దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది.అడ్మినిస్ట్రేషన్‌కు ఇబ్బంది అవుతుంది. రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. లీగల్ లిటికేషన్స్లో లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని అదేశించాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంభాభిషేకాలు చేయాలో లిస్ట్ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చాం.కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుంది. ఫారెస్ట్‌లలో సర్వేయర్ల ప్రొటెక్షన్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు. గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయి. గత ప్రభుత్వంలో నాయకులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్‌పై త్వరలోనే విచారణ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల సర్వేతో మాకు పేరు వస్తుందనే విమర్శలు. బీసీ రిజర్వేషన్ల వ్యాల్యూ ఇప్పుడే అర్థం కాదు. ఉద్యోగాలు,ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతల భేటీ
-
ఎమ్మెల్సీ కవితతో బీసీ, జాగృతి నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను వెల్లడించిన నేపథ్యంలో ఎమ్మె ల్సీ కవితతో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతలు భేటీ అయ్యారు. కవితను ఆమె నివాసంలో కలసిన నేతలు పలు అంశాలపై చర్చించారు.సర్వే గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు పెరుగుతాయన్న అంశంపై కవిత వారితో చర్చించారు. బీసీలకు స్థానిక ఎన్నిక ల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. -
తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్తుందా?: కవిత
సాక్షి, నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయని.. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది?. చేతిలో ఎర్రబుక్కు పట్టికొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదంటూ కవిత ప్రశ్నించారు.‘‘కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడింది. అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అబద్దం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుంది. గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్దీదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారు’’ అని కవిత దుయ్యబట్టారు.‘‘కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉంది. తాము చెప్పినవాళ్లకే పథకాలు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలించలేరు. అలవిగాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. యూరియా కోసం రైతులు మళ్లీ లైన్లు కట్టే పరిస్థితి వచ్చింది. కరెంటు ఎప్పుడొస్తుందా? ఎప్పుడు పోతుందా? అన్నది తెలియని దుస్థి తి ఏర్పడింది. చెరువులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు...కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులు పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం. పెన్షన్ మొత్తాన్ని పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లే ఇంకా ఇస్తున్నారు. పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలను స్కూటీలు ఏమయ్యాయి?. తెలంగాణను ఆంధ్రతో కలిసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర, దగా చరిత్ర. కేసీఆర్ అర్హులైన అందరికీ పారదర్శకంగా పథకాలను అందించారు. కేసీఆర్ హయాంలో నేరుగా లబ్దీదారులకే కోట్లాది రూపాయలు వెళ్లాయి..కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులను తామే చేశామని చెప్పడమే తప్పా ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. ఎల్లారెడ్డి పాఠశాలలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థ్యతకు గురికావడం బాధాకరం. కేసీఆర్ పెట్టిన గురుకులాలను కూడా నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు. పసుపు పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించడానికి బీజేపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్ చేశారు. -
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు, నటులు మోహన్‌బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ తదితరుల వద్ద వందకుపైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా చేసిన ధర్మ ‘సంహారం’ చిత్రంతో డైరెక్టర్‌గా మారారు. ఆదిత్య, కవిత జంటగా ధర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘సంహారం’ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో ధర్మ మాట్లాదుతూ– ‘‘తనకు, తన అక్కకు అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌తో ఓ అమ్మాయి దుష్టులను ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ సినిమా తీశాం. మహిళలు తమని తాము కాపాడుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఆవశ్యకమని ఈ చిత్రంలో చూపించాం’’ అని చెప్పారు. -
పెళ్లింట్లో భారీ చోరీ
అనంతపురం: పెళ్లింట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో బుధవారం వేకువజామున ఈ భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి చెందిన కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి నగరంలో స్థిరపడ్డారు. భూములు అధికంగా ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన బుసిరెడ్డి ఆదినారాయణరెడ్డి కుమారుడితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 7న అనంతపురం ఎంవైఆర్ కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కుమార్తెకు బహుమతిగా ఇవ్వనున్న బంగారం, వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు చెందిన బంగారంతో పాటు వెంకట శివారెడ్డి అత్త, మామ, వియ్యంకుల బంగారు ఆభరణాలు కలిపి సుమారు 5 కిలోల బంగారాన్ని ఇంట్లోని లాకర్లో ఉంచారు. కాగా.. శివారెడ్డి దంపతులు తెలంగాణలో ఉన్న తమ బంధువుల్ని పిలిచేందుకు వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం వేకువజామున 4 గంటలకు ఇంట్లోకి చొరబడ్డారు. ఊచలు తొలగించి ఇంట్లోకి వెళ్లి తొలుత బీరువా తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న లాకర్ తాళం తీసుకుని.. లాకర్లోని సుమారు ఐదు కిలోల బంగారాన్ని, బీరువాలోని రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం ఐదుగురు దొంగల ముఠా చోరీలో పాల్గొన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు లేనప్పటికీ ఎదురింటి సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. మరో రెండు ఇళ్లలోనూ చోరీ కాగా.. వెంకటశివారెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న డిప్యూటీ కమిషనర్ ఇంట్లో రూ.75 వేలు, మిస్టర్ ఛాయ్ నిర్వాహకుడు ఇంట్లోనూ చోరీ జరిగింది. వీరు ఇంకా ఇళ్లకు చేరుకోకపోవడంతో అందులో ఎంత మొత్తం చోరీ జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఈ చోరీ వెనుక తెలిసిన వారి హస్తం ఉందా? లేక రాటుదేలిన దొంగల ముఠా పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్‌కు ఏటీఎంగా ‘మూసీ’: కవిత
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా:కాంగ్రెస్ తమ పార్టీ నేతలపై రౌడీ మూకలతో దాడులు చేయిస్తోందని,తాము తల్చుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడ తిరగలేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. యాదగిరిగుట్టలో బుధవారం(జనవరి22) కవిత మీడియాతో మాట్లాడారు.‘మూసీ నది కాలుష్యానికి కారణం కాంగ్రెస్. మూసీ నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ ఆనాడే నడుం బిగించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు మూసీని ఏటీఎంగా మార్చుకున్నారు. మూసీ పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నారు.లూటీ చేసిన దాంట్లో నుంచి ఢిల్లీకి కప్పం కట్టే కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. అన్ని పథకాల్లో కోతలు పెట్టారు.ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ చేశారు. నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పజెప్పారు.ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన పప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేత చేపట్టినపుడు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు.కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలో పలు చోట్ల ధర్నాలు చేశారు. మూసీ ప్రక్షాళన కంటే తెలంగాణలో ప్రాధాన్యమైన పనులు ఎన్నో ఉన్నాయనేది బీఆర్ఎస్ వాదన. దీంతో పాటు ఈ ప్రాజెక్టులో భాగంగా పేదల ఇళ్లు కూల్చవద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదీ చదవండి: మేయర్‌పై అవిశ్వాసం -
పసుపు @ 11 వెరైటీలు
పసుపు అంటే సాధారణంగా సేలం.. దుగ్గిరాల వంటి వంగడాలు గుర్తుకు వస్తుంటాయి. అరుదుగా పండే 11 రకాల దేశీ పసుపు రకాలను పండిస్తున్నారు మహిళా రైతు నడింపల్లి కవిత. కస్తూరి.. లకడాండ్.. నల్ల పసుపు.. రోమ్.. తెల్ల పసుపు.. చింతపల్లి.. సోనియా.. రాజాపూరి.. ప్రతిమ.. వీఐపీ(848), వీఐపీ (849) వంటి ప్రత్యేక పసుపు రకాలను ఆమె పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో తనకున్న ఐదెకరాల వ్యవసాయక్షేత్రంలో మామిడిలో అంతర పంటగా ఈ రకాలను ఆమె సాగు చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా కవిత వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం సమీపంలోని మొగల్లుకు చెందిన కవిత కుటుంబం హైదరాబాద్ గచ్చిబౌలిలో స్థిరపడ్డారు. వ్యవసాయంపై మక్కువ కలిగిన కవిత సంగారెడ్డి జిల్లాలో ఐదెకరా సొంత భూమిలో ఈ ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి చింతపల్లి రకం, మేఘాలయ, అస్సాం, డెహ్రాడూన్ తదితరప్రాంతాల నుంచి మరికొన్ని పసుపు రకాలను సేకరించిన కవిత గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. పసుపులో రారాజు కస్తూరి.. కస్తూరి రకం పసుపులో రారాజుగా పేరుంది. పసుపు నాణ్యతకుప్రామాణికమైన కర్క్మిన్ ఈ కస్తూరి రకంలో సుమారు 15 శాతం వరకు ఉంటుందన్నారామె. దీన్ని ఔషధాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. సుమారు 3 సంవత్సరాలు పెరిగిన కస్తూరి రకం పసుపునకు క్యాన్సర్‌ను కూడా నయం చేయగల ఔషధ సామర్థ్యం ఉంటుందని ఆమె చెబుతున్నారు. లకడాంగ్ రకం పసుపు ముఖ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి ఉపయోకరమన్నారు. పండించిన పసుపు కొమ్ములను ఉడికిస్తే ఔషధ గుణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పసుపు కొమ్ములను సోలార్ డ్రయ్యర్లో ఎండబెడుతున్నారు. పసుపును ΄÷డితో పాటు ద్రవ రూపంలోకి, ట్యాబ్లెట్ల రూపంలోకి కూడా మార్చుతున్నారు. పసుపు ఉత్పత్తులను అమెరికా, దుబాయ్ వంటి విదేశాల్లో నివాసం ఉండే పరిచయస్తులకు ఆమె ఇస్తున్నారు. వ్యవసాయం అంటే ఇష్టం.. ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. అరుదైన పసుపు రకాలను సాగు చేయాలని అనుకొని సేకరిస్తున్నాను. ఇప్పటి వరకు 11 వెరైటీల పసుపును పండిస్తున్నాను. అస్సాం రకాన్ని కూడా సాగు చేయాలనుకుంటున్నాను. దేశీ ఆవులను పెంచుతూ పాలేకర్ పద్ధతిలో నేను చేస్తున్న వ్యవసాయానికి మా కుటుంబసభ్యులు ఎంతో సహకరిస్తున్నారు.– నడింపల్లి కవిత (76809 67818), పసుపు రైతు– పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
నిజామాబాద్ లో పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత
-
పసుపు బోర్డు.. ఎంపీ అర్వింద్‌పై కవిత సెటైర్లు
నిజామాబాద్ : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి చాటు బిడ్డంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. బీఆర్ఎస్ చేసిన కృషి వల్లే నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ ప్రారంభమైందని కవిత అన్నారు.జనవరి 16న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లతో కలిసి నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు.పసుపు బోర్డ్ ప్రారంభ కార్యక్రమంపై ఎమ్మెల్సీ కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం. ప్రారంభ కార్యక్రమంపై మాకు అభ్యంతరం ఉంది. పసుపు బోర్డ్ ప్రారంభోత్సవం ఒక పార్టీ కార్యక్రమంలా ఉంది. మేం స్థానిక ప్రజా ప్రతినిధులం. మాకు ఆహ్వానాలు అందలేదు. 2014 నుంచి 2018 వరకూ పసుపు బోర్డు కోసం నేను పార్లమెంట్ వేదికగా పోరాటం చేశాను. పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాకపోతే దిగుమతులు ఆపాలి. రూ. 15 వేల మద్దతు ధర పసుపు రైతులకు ఇవ్వాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెల్పూరులో ఉన్న 40 ఎకరాల స్పైసెస్ బోర్డు స్థలంలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.జక్రాన్ పల్లి వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ ఎయిర్ పోర్ట్ తీసుకురావాలి. కంబోడియా మలేషియా లాంటి దేశాల నుంచి తక్కువ క్వాలిటీ ఉన్న పసుపు దిగుమతులు అవుతున్నాయి.. ఇంకా డబుల్ అయ్యింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను రెండు సార్లు కలిశాను. బోర్డుతో పాటు మద్దతు ధర ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుందని గతం నుంచి డిమాండ్ చేస్తున్నాను. ధర్మపురి అరవింద్ తండ్రి చాటు కొడుకుగా ఉండే వారు. అలాంటి వ్యక్తి తన వల్లే పసుపు బోర్డు వచ్చిందనడం హాస్యాస్పదం. స్పైసెస్ రీజినల్ కార్యాలయం తీసుకొచ్చి ఆనాడు తాను అంబాసిడర్ కారు అడిగితే ప్రధాని మోదీ బెంజ్ కారు ఇచ్చారని అన్నారు. మరి ఇప్పుడు ఏం అంటారు. పసుపు బోర్డు ఒక్కటే కాదు త్రిముఖ వ్యూహం ఉండాలి’ అని కవిత సూచించారు. -
‘మీరెన్ని కేసులు పెట్టినా మేం భయపడం’
సాక్షి,హైదరాబాద్ : ప్రజల పక్షాన గళం విప్పే వారిపై రేవంత్‌రెడ్డి (revanth reddy) ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఆరోపించారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ (brs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం ఉదయం కేటీఆర్ తన లీగల్ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ హైడ్రామా నడింది. ఈ తరుణంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవ్వడంపై కవిత స్పందించారు. ‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మాపై పెట్టిన కేసులకు మేం భయపడం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ. 15,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు ఆమొత్తాన్ని రూ.12,000 రూపాయలకు తగ్గించింది. ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా చెల్లించాలనే మా డిమాండ్’ అని కవిత అన్నారు. BRS MLC K Kavitha says "The Revanth Reddy Govt is filing illegal cases against those who raise their voices on behalf of the people. The government is acting vengefully against our party’s Working President KTR with false cases. We are not afraid of cases filed against us. Our… https://t.co/QPEa6zAEhC pic.twitter.com/bQTbdODpVF— ANI (@ANI) January 6, 2025 -
MLC Kavitha: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..!
-
అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కవిత
సాక్షి, హైదరాబాద్: జనగణనలో భాగంగా కుల గణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర బీసీ మహా సభలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలేదు. మండల్ కమిషన్ రిపోర్ట్‌ను బీరువాలో పెట్టారు. మండల్ కమిషన్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలి?. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ బీసీలకు అన్యాయమే జరిగింది. అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని కవిత సవాల్ విసిరారు.‘‘దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలి. కులం ఆధారంగా రాజ్యంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారు. బీసీల కోసం పని చేసిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టింది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు’’ అని కవిత చెప్పారు.‘‘కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయి. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు’’ అని కవిత అన్నారు. -
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కవితకు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ధర్నా చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలకు న్యాయంగా అందాల్సిన నిధులు అందించకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలికన్నీరు కారుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు‘‘బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు బీసీలు గుర్తుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్లో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోని ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమం’’ అంటూ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం నన్ను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమే. అంతేకాక రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. గత మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో బహిరంగ రహస్యమే. మీ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది’’ అంటూ మహేష్ కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు.‘‘కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా.?..బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?..జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్‌ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?..గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?. ఎమ్‌బీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?..గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూళ్లు నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా.?’’ అంటూ బీఆర్ఎస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నలు సంధించారు. -
బాబు శిష్యుడు కాబట్టే.. విగ్రహం రూపు మార్చారు
నిజామాబాద్ నాగారం: ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి.. అందుకే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే తెలంగాణ తల్లి ఉండకూడదన్న ఉద్దేశంతో విగ్ర హం రూపు రేఖలు మార్చేశారు. కాంగ్రెస్ తల్లి విగ్రహాలను సెక్ర టేరియట్‌లో ఉంచారు. ఇక మ నం ఆమెనే కొలవాలట’ అంటూ ఎమ్మెల్సీ కవిత ధ్వజమె త్తారు. ‘తెలంగాణ తల్లి మాదిరా.. కాంగ్రెస్ తల్లి మీదిరా’ అంటూ నినదించారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత తొలిసారి ఆదివారం నిజామా బాద్ పర్యటనకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆమె పట్టణంలోని సుభాష్‌నగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేసి తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్‌రెడ్డి అవమానించాడన్నారు.గురుకులాలను నడపడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే 57 మంది పిల్లలు చనిపోయారని తెలి పారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, ఇక రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లు పెంచాకే ‘స్థానిక’ ఎన్నికలు జరపాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని అమలు చేయకుంటే ఉద్యమిస్తామన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో జనవరి 3న ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. 40కి పైగా బీసీ సంఘాల నాయకులతో శుక్రవారం కవిత తన నివాసంలో భేటీ అయ్యారు.బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఆమె బీసీ సంఘాల నాయకులతో చర్చించారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాతో పంచుకున్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు’అని కవిత పేర్కొన్నారు.జనవరి 3న సినిమా చూపిస్తాం ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతాం. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పణ, బీసీల జనాభా సంఖ్యను వెల్లడించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తంగా బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో జనవరి 3న జరిపే సభ ద్వారా ప్రభుత్వానికి సినిమా చూపిస్తాం’అని కవిత ప్రకటించారు. -
’రేవంత్ సర్కార్ మహిళల్ని నమ్మించి మోసం చేసింది‘
సాక్షి,హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దెవా చేశారు.మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలకు ఆశించారు. కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం రూ. 30 వేలు బాకీ పడింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కవిత డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి. నేరాల పెరుగుదల.. ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదు. మహిళలు చూస్తూ ఊరుకోబోరు.. కచ్చితంగా ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టింది. తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దు. కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదని కవిత పేర్కొన్నారు. -
ఈ-రేసు కేసులో కేటీఆర్‌పై కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు
-
పేదల నుంచి భూములు బలవంతంగా లాక్కుంటున్నారు
-
చేనేత కార్మికులు, మల్బరీ సాగు రైతుల సమస్యలపై గళమెత్తిన కవిత
-
ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు?: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారంటూ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అధికార పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్ వాదం అంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వారికి పార్టీ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ ధ్వజమెత్తారు.రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రేపు(శనివారం) మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి పై దాడి జరిగింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలను సమానంగా చూశాం. ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు?. విగ్రహం తయారు చేసే వరకు ఎందుకు రహస్యంగా ఉంచారు’’ అంటూ కవిత నిలదీశారు.జాగృతి తరపున మేము ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాము. మేధావుల అభిప్రాయం తీసుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్తాం. సీఎం రేవంత్ సంకుచిత తత్వంతో వ్యవహరిస్తున్నారు. మేము అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాము. సోనియా దగ్గర మార్కుల కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. కాంగ్రెస్ కొత్తగా చేసింది ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇది పిరికి ప్రభుత్వం. కార్యకర్తల నుంచి నేతల వరకు అక్రమ కేసులు పెడుతోంది. మేము అక్రమ కేసులకు భయపడం’’ అని కవిత చెప్పారు.ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ కామెంట్స్ -
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా?
సాక్షి,హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని బీఆర్ఎల్సీ కవిత డిమాండ్ చేశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై లోక్ సభలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై కీలక వ్యాఖలు చేశారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. The Bayyaram Steel Plant is not merely a promise; it is a constitutional commitment made during the formation of Telangana. The BJP’s blatant refusal to fulfill this commitment exposes their neglect of the backward and tribal communities in Khammam District, Telangana.It is… https://t.co/uuTMbcH1oB— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 12, 2024 ‘బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు’ అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారు. లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయి. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన.బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే. 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తోంది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలిఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరం. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయం. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదు. బీజేపీ కేంద్రంపై, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
తెలంగాణ తల్లి మాకొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు
-
‘హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దు’
సాక్షి,తెలంగాణ భవన్ : హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అధినేత కేసీఆర్ పిలుపుతో తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు కోరుకున్నారు.ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదు. తెలంగాణ అని మేం హృదయాల్లో రాసుకుంటే రేవంత్ రెడ్డి గన్నులు ఎక్కుపెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాను ఎవరైనా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే కేసులు పెడతామని అంటున్నారు. అయినా సరే హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దు. రేవంత్ పెట్టిన విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉంది’అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసిన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లోతెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదు. తెలంగాణ తల్లి మన ఉద్యమాల కేతనం, మన స్వాభిమాన సంకేతం. తెలంగాణ తల్లి మన అస్తిత్వ ప్రతీక. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమే. తెలంగాణ ఆత్మగౌరవంగా నిలిచి స్వరాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లిని… pic.twitter.com/SlpI3W7rc9— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 10, 2024 -
తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ రగడ
-
కేసీఆర్ మొక్క కాదు.. వేగు చుక్క
సాక్షి, హైదరాబాద్: ‘పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు, వేగు చుక్క. రేవంత్‌రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో నిధులు పారితే రేవంత్ పాల నలో తిట్లు పారుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పోటీపడి తిట్ల దండకం చదువు తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం తన నివా సంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కవిత భేటీ అయ్యారు.‘బీఆర్ఎస్ కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఉ ద్యమ కాలంనుంచి అనేక కష్టాలను తట్టుకుని కార్యకర్తల బలంతో బీఆర్ఎస్ నిలబడింది. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసే వారే నిజమైన కా ర్యకర్తలు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు అమ లు చేయని తీరును ప్రజల్లో ఎండగట్టాలి’ అని కవిత దిశానిర్దేశం చేశారు. మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం దుర్మార్గమని అన్నారు. అఖిల భార త పద్మశాలి సంఘం నాయకులు కవితను కలిసి కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి జాగృతి సమీక్షలు...ఉమ్మడి జిల్లాల వారీగా ఈనెల 4 నుంచి తెలంగాణ జాగృతి సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు. 4న వరంగల్, నిజామాబాద్, 5న కరీంనగర్, నల్లగొండ, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు ఉంటాయి. 7న హైదరాబాద్, ఖమ్మం, 8న మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ జాగృతి ముఖ్య నేతలతో కవిత సమావేశమవుతారు. -
అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?.. మోదీకి కవిత సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: జైలు నుంచి విడుదలయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ట్వీట్ చేసిన కవిత.. అదానీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు.‘‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా?. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??’’ అంటూ కవిత సూటిగా ప్రశ్నించారు.అఖండ భారతంలో అదానికో న్యాయం...ఆడబిడ్డకో న్యాయమా ?ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 21, 2024 కాగా, లిక్కర్ కేసులో.. మార్చి 15వ తేదీన తన నివాసంలో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో ఐదు నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు. ఆగస్టు 27న సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను.. ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్జీ సుమారు గంటన్నరపాటు ఇవాళ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతంరం జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత తాజాగా.. ట్విట్టర్ వేదికగా సత్యమేవ జయతే అని కామెంట్స్ చేస్తూ ఓ పోస్టు చేశారు. తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత, సిసోడియా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం(అక్టోబర్ 4) విచారణ జరిపింది. ఈ విచారణకు హాజరయిన ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 19కి వాయిదా వేసింది. కాగా, లిక్కర్ కేసులో కవిత, మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రధాన నిందితులకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణకు కోర్టు ఆదేశాల ప్రకారం వీరంతా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్ -
బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై తాను చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచి్చన కథనాలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందని, కోర్టు భావనను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆగస్టు 29, 2024న పలు పత్రికల్లో నా పేరిట వచి్చన వార్తల ఆధారంగా గౌరవ న్యాయస్థానం విచక్షణను నేను ప్రశ్నించినట్టుగా కోర్టు భావించడాన్ని అర్థం చేసుకోగలను. న్యాయ ప్రక్రియ పట్ల నాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని మరోమారు తెలియజేస్తున్నాను. పత్రికల్లో ఆ వ్యాఖ్యలను అసందర్భంగా నాకు ఆపాదించారు. న్యాయవ్యవస్థ, ఆ వ్యవస్థకున్న స్వతంత్రతపై నాకు అపార గౌరవం ఉంది. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే నేను న్యాయ వ్యవస్థ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాను..’ అని సీఎం పేర్కొన్నారు. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం..
-
కవిత బెయిల్ పై బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
-
కేసీఆర్ ను కలిసిన కవిత.. కాళ్లకు నమస్కరించి భావోద్వేగం
-
సీఎం హోదాలో ఉండి సుప్రీం తీర్పుపై వ్యాఖ్యలా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరుపై స్పందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారంటూ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనల వల్ల ప్రజల్లో భయాందోళనలు కలగొచ్చని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు హైదరాబాద్ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ, బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్, మొహమ్మద్ అలీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ గవాయి, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మార్పు అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిలు వచ్చిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు ఘాటుగా స్పందించారు.మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం‘సుప్రీంకోర్టు తీర్పులపై వచ్చే విమర్శలు పట్టించుకోబోం. మాకెలాంటి ఇబ్బందీ లేదు. మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం. ఇష్టం ఉన్నా లేకపోయినా మా విధులు మేం నిర్వర్తిస్తాం. కానీ న్యాయమూర్తులను అవమానించేలా ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. ఆ తరహా ప్రకటనలు ఎలా చేయగలరు? రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలా? రాజకీయ సంప్రదింపుల వరకూ వేచి ఉండాలా? సుప్రీంకోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటే, మా తీర్పులపై గౌరవం లేకుంటే.. కేసు విచారణ సుప్రీంకోర్టులో కాకుండా మరెక్కడైనా జరగనివ్వండి..’ అంటూ జస్టిస్ గవాయి ఘాటుగా వ్యాఖ్యానించారు. పదే పదే అలాంటి వ్యాఖ్యలా?‘ఆ తరహా వ్యాఖ్యలు..మళ్లీ గురువారం ఉదయం కూడా! బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలి వంద రోజుల్లోనే ఈ తరహా స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. కోర్టుపై ఆక్షేపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చేసే బాధ్యతాయుతమైన ప్రకటనేనా ఇది? న్యాయవ్యవస్థకు ఆమడ దూరంలో ఉండడమే కార్యనిర్వాహకుల ప్రాథమిక విధి. విమర్శించండి.. కానీ ఆక్షేపణలు వద్దు..’ అని జస్టిస్ విశ్వనాథన్ స్పష్టం చేశారు.అలాగైతే న్యాయాధికారులపై విశ్వాసం లేనట్లే అవుతుంది..‘ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్లు విచారణకు స్వీకరిస్తే న్యాయాధి కారులపై కోర్టుకు విశ్వాసం లేనట్లే అవుతుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తారు. చట్టసభల్లో జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెబుతుంటాం. వారికీ ఇది వరిç్తÜ్తుంది..’ అని జస్టిస్ గవాయి పేర్కొన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం లేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాదివ్యాఖ్యల సవరణకు ప్రయత్నిస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అయితే జరగా ల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, అటువంటి వ్యాఖ్యలు న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకు రావడంతోపాటు దిగువ కోర్టులకూ వ్యాపించే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సి.సుందరం పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రస్తుతం సీఎం కావడంతో పాటు ఏసీబీని కూడా తన అధికార పరిధిలో ఉంచుకున్నారని, దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం ఉండదని అన్నా రు. దర్యాప్తు అధికారులు కూడా మారారని చెప్పా రు. గతంలో దాఖలు చేసిన కౌంటరుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పోలీసులపై కూడా రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అని, ఏ వ్యక్తీ తన సొంత విషయంలో న్యాయ మూర్తి కాకూడదనే సహజ న్యాయసూత్రం గుర్తుచేశారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలిఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మా సనం.. స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తే దర్యాప్తుపై విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో దర్యాప్తుపై స్టే ఇచ్చిన అంశం, సీబీఐకి బదిలీ తదితర అంశాలపై ఆరా తీసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై తెలంగాణకు చెందిన సహచరులను సంప్రదిస్తామని తెలిపింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని, అయితే ప్రస్తుత పిటిషన్‌ను కొట్టివేస్తామని పేర్కొంది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచాలని, అందరికీ విశ్వాసం కలిగేలా నియామకం చేపడతామని జస్టిస్ గవాయి చెప్పారు. ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్రరావుతో పాటు మరో న్యాయవాది ఉమా మహేశ్వరరావు ఉత్తమమని భావిస్తున్నామ న్నారు. అయితే తమకు పోలీసు అధికారుల విషయంలో ఆందోళన ఉందని పిటిషనర్ల తరఫు మరో సీనియర్ న్యాయవాది శేషా ద్రినాయుడు చెప్పారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
165 రోజుల తర్వాత కేసీఆర్ తో కవిత భేటీ
-
కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ కు కవిత
-
హైదరాబాద్‌లో కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆమె వెంట భర్త, అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్‌కు కవిత వచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదున్నర నెలలు తిహార్ జైలులో ఉన్న ఆమె మంగళవారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.ఎయిర్పోర్ట్, కవిత ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతల కోలాహలం నెలకొంది. కవితకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసానికి కవిత చేరుకున్నారు. కవితకు దిష్టి తీసి ఇంట్లోకి కుటుంబ సభ్యులు ఆహ్వానం పలికారు. ఆమె బంధువులు, అభిమానులు పూలవర్షం కురిపించారు.కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా..ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. ‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి.. కచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుంది. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా’’ అని కవిత పేర్కొన్నారు.నోటీసులు, అరెస్టు నుంచి విడుదల దాకా..⇒ 08–03–2023న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు సమన్లు జారీ చేసింది ⇒ 11–03–2023న ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరు ⇒ 15–03–2023న ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 21–03–2023న తన ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత ⇒ 14–09–2023న కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ ⇒ 15–09–2023న సమన్ల జారీని పదిరోజులు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ⇒ 15–03–2024న లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ ⇒ 16–03–2024న ఢిల్లీలోని కోర్టులో హాజరు, రిమాండ్ ⇒ 05–04–2024న కవి తను విచారించేందుకు సీబీఐ పిటిషన్ ⇒ 08–04–2024న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ట్రయల్ కోర్టు ⇒ 11–04–2024న తీహార్ జైల్లో కవితను అరెస్టు చేసిన సీబీఐ ⇒ 12–04–2024న సీబీఐ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఆ పిటిషన్‌పై తీర్పు రిజర్వు ⇒ 15–04–2024న కవితకు 9 రోజులు జ్యుడీషియల్ కస్టడీ ⇒ 16–04–2024న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ⇒ 23–04–2024న మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ⇒ 14–05–2024న జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు ⇒ 03–06–2024న జూలై 3 వరకు రిమాండ్ కొనసాగింపునకు ఆదేశం ⇒ 01–07–2024న కవిత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ⇒ 03–07–2024న జ్యుడీషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు ⇒ 22–07–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ వాయిదా ⇒ 05–08–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ మళ్లీ వాయిదా ⇒ 07–08–2024న సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 12–08–2024న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా ⇒ 20–08–2024న బెయిల్ పిటిషన్ వి చారణ మళ్లీ వాయిదా ⇒ 22–08–2024న కవితకు అస్వస్థత.. తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు ⇒ 27–08–2024న కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. -
హైదరాబాద్ కు కవిత
-
తెలంగాణలో కవిత బెయిల్ పై రాజకీయ యుద్ధం
-
కవిత అరెస్టుకు కారణం ఏంటి ?
-
వడ్డీతో సహా చెల్లిస్తా..
-
నేను అసలే మొండిదాన్ని.. జైలుకు పంపి జగమొండిని చేశారు
-
వడ్డీతో సహా తిరిగి ఇస్తా..!
-
కేసీఆర్ బిడ్డ తప్పు చేయదు : కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు భర్త, కుమారుడు ,బీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావుతో పాటు పలు సీనియర్ నేతలు తీహార్ జైలు బయట స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులను చూసిన కవిత భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను. కేసీఆర్ బిడ్డ ఎలాంటి తప్పు చేయదు. తప్పు చేసే ప్రసక్తే లేదు అంటూ కవిత భావోద్వేగానికి గురయ్యారు.Delhi: BRS leader K Kavitha walks out of Tihar Jail.She was granted bail in the Delhi excise policy case by the Supreme Court today. pic.twitter.com/s3OQOJ1gqH— ANI (@ANI) August 27, 2024 చాలా రోజుల తర్వాత మీ అందరిని కలవడం సంతోషం. 18 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నా. నేను మొండిదాన్ని.. నన్ను అనవసరంగా జైలుకు పంపి జగమొండిదాన్ని చేశారు. ఒక తల్లిగా ఐదున్న నెలల పిల్లల్ని వదిలి ఉండటం చాలా బాధాకరం. ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉండడం ఇబ్బందికరమైన విషయం. నన్ను,నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆ సమయం అతి త్వరలోనే రాబోతుంది. చట్టబద్ధంగా నా పోరాటం కొనసాగిస్తా. క్షేత్ర స్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తాం’ అని కవిత అన్నారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపారు.#WATCH | Delhi: BRS leader K Kavitha says "I want to thank all of you. I became emotional after meeting my son, brother and husband today after almost 5 months. Only politics is responsible for this situation. The country knows that I was put in jail only because of politics, I… pic.twitter.com/VVbunxb9qk— ANI (@ANI) August 27, 2024 -
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎందుకొచ్చిందంటే? : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్లోనే బెయిల్ వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కవితకు బెయిల్ రావడంపై జగ్గారెడ్డి స్పందించారు.‘‘లిక్కర్ స్కామ్ లో కవిత మెయిన్ విలన్. మోదీ, అమిత్ షా డైరెక్షన్ లోనే కవితకు బెయిల్ వచ్చింది. రాజకీయ చీకటి ఒప్పందంలో భాగమే కవితకు బెయిల్ వచ్చింది. అదే మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు..15నెలలు వరకు సిసోడియకు బెయిల్ ఇవ్వలేదు ..ఐదు నెలలకే కవితకు ఎందుకు బెయిల్ ఇచ్చారు’’ అని ప్రశ్నించారు.‘కేసీఆర్ రాజకీయంగా కాంగ్రెస్‌ను ఢీకొనలేక బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ,బీఆర్ఎస్ అలయన్స్గా పోటీ చేస్తాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోయే భాగంగానే మద్యం పాలసీ కేసులో కవిత జైలు నాటకం’అని వ్యాఖ్యానించారు.బెయిల్ రాక ముందే మూడు రోజుల నుండి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.తీర్పు వెలువరించక ముందే కేసీఆర్ ,కేటీఆర్,హరీష్ రావు,బెయిల్ వస్తుందని లీక్ ఇస్తున్నారు.కేసీఆర్ కుటుంబంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి.కవిత బెయిల్ అంశం దేశ రాజకీయాలలో కొత్తగా అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించింది. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులను న్యూట్రల్ చేసి బీజేపీకి ఓటు వేయించారు. ట్రబుల్ షూటర్ అంటున్న హరీష్ రావు ఇలాకాలో బీఆర్ఎస్ మూడవ స్థానంలో ఉంది. మోదీ తన బలం పెంచుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. బీజేపీ వెనుక ఉందనే ధైర్యంతో హరీష్ రావు, కేటీఆర్‌లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇవాళ కవితకి బెయిల్ రావడం BRS - BJPలో విలీనమా.?వచ్చే ఎన్నికల్లో BJP BRS పొత్తా?ఇదే కేసీఆర్, మోడీకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్..17 నెలల వరకు సిసోడియాకి బెయిల్ రాలేదు,ఐదు నెలలకే కవితకి బెయిల్ ఎలా వచ్చింది..తెలంగాణలో కాంగ్రెస్ నీ దెబ్బతీసే కుట్ర జరుగుతుంది..#jaggareddy #congress pic.twitter.com/nKH58h8iJJ— Jayaprakash Reddy(OFFICIAL ) (@ImJaggaReddy) August 27, 2024 -
తీహార్ జైలు నుంచి కవిత విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సందర్భంగా ఆమె భర్త, కుమారుడు ,బీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావుతో పాటు పలు సీనియర్ నేతలు కవితకు తీహార్ జైలు బయట స్వాగతం పలికారు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీం కోర్టులో కవితకు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆమె మంగళవారం(ఆగస్ట్27) తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.దాదాపూ 165 రోజులు జైలులో ఉన్న ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో కవిత తీహార్ జైలు నుంచి విడుదల కావడం సుగమమైంది. #WATCH | Delhi: Supreme Court grants bail to BRS leader K Kavitha in the excise policy irregularities case.BRS MP Ravi Chandra says, "Today is a very good day for us...A wrong case was filed against her and they have no proof against her...Our party believes in judiciary and… pic.twitter.com/d0UjoFQ8Fn— ANI (@ANI) August 27, 2024 తీహార్ జైలు నుంచి విడుదల చేసేందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టుకు కవిత భర్త అని ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో రిలీజ్ వారెంట్‌తో తీహార్ జైలుకు కవిత తరుఫు న్యాయవాదులు వెళ్లారు. తీహార్ జైల్లో కవితను విడుదల చేసేందుకు సంబంధిత పత్రాలను సమర్పించారు. కాగా, మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ కేసు విచారణ కొనసాగుతుండగానే అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. కాగా, దాదాపు ఐదు నెలలుగా రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు.తీహార్ జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులుతీహార్ జైలు నుంచి విడుదలతో కవితను పరామర్శించేందుకు తిహార్ జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ముత్తిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్ గౌడ్ వచ్చారు. -
కవిత బెయిల్‌పై బీఆర్ఎస్ VS బీజేపీ.
-
కవితకు బెయిల్.. బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్,సాక్షి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఎక్స్ వేదికగా పొలిటికల్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దానికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న్యాయ స్థానం తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టును కోరారు.You’re a union minister incharge of Home Affairs & casting aspersions on Supreme Court !! Highly unbecoming of your position I respectfully urge the Hon’ble Chief Justice of India & the respected Supreme Court to take cognisance of these comments and initiate contempt… https://t.co/171Bl4ZIiH— KTR (@KTRBRS) August 27, 2024 కవితకు బెయిల్ రావడంపై అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాంకాంక్షలు చెప్పారు. అటు బీఆర్ఎస్ వ్యక్తికి బెయిల్. ఇటు కాంగ్రెస్ వ్యక్తికి రాజ్యసభ సీటు ఒకేసారి వచ్చాయని పేర్కొన్నారు. కవిత బెయిల్ కోసం వాదనలు వినిపించిన వ్యక్తిని రాజ్యసభకు ఏకగ్రీవంగా నామినేట్ చేయడంలో కేసీఆర్ రాజకీయ చతురత చూపించారని విమర్శించారు.వైన్ అండ్ డైన్ నేరగాళ్లకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్.అయితే బండి సంజయ్ ట్వీట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తే సుప్రీం కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల్ని కోర్టు ధిక్కరణగా భావించి చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఎక్స్ ద్వారా కోరారు కేటీఆర్. -
కవిత బెయిల్‌పై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. మంగళవారం సుప్రీం కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై కవిత సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘థాంక్యూ సుప్రీంకోర్టు. ఊరట లభించింది.. న్యాయం గెలిచింది’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.Thank You Supreme Court 🙏Relieved. Justice prevailed— KTR (@KTRBRS) August 27, 2024రాత్రికి ఢిల్లీలోనే.. రేపే హైదరాబాద్‌కు కవిత రాక మరోవైపు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవిత విడుదలకు సంబంధించిన ప్రక్రియను ఆమె తరుఫు లాయర్లు ప్రారంభించారు. ట్రయల్ కోర్టుకు షూరిటీ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జైలు సమయానికి ఈ ప్రక్రియ పూర్తయితే సాయంత్రమే కవిత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. జైలు నుంచి విడుదలైతే కవిత రాత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు ఢిల్లీ నుంచి కేటీఆర్,హరీష్ రావుతో కలిసి కవిత హైదరాబాద్‌కు రానున్నారు. -
కవితకు బెయిల్ సుప్రీం కోర్టు ఆంక్షలు
-
2 కేసుల్లో బెయిల్.. ఈడీపై న్యాయమూర్తి ఆగ్రహం
-
కవితకు గుడ్ న్యూస్
-
సుప్రీంకోర్టులో కాసేపట్లో కవిత బెయిల్ - పిటిషన్‌పై విచారణ
-
బెయిల్‌పై ఉత్కంఠ.. ఢిల్లీకి KTR
-
కవితకు బెయిల్ వచ్చేనా?
-
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ 27 (మంగళవారం ) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే ఇదే ధర్మాసనం మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ఈసారి తమ నాయకురాలికి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, మద్యం పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసింది. అయితే ఈ రెండు సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణకు రానుంది. -
కవితకు హైబీపీ
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో ఆరోపణ లను ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత హైబీపీతో సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట ఎ యిమ్స్ ఆసుపత్రిలో ఆమె కు జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గైనిక్ టెస్టులతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ టెస్టులను చేశారు. బీపీ పరీక్షించగా, 186/103 ఉన్నట్లు తెలిసింది. జైలులోకి వెళ్లిన రెండు రోజులకే కవిత హైబీపీకి గురి అయినట్లు సమాచారం.జైలు అధికారులు రెండు పూటలా బీపీ ట్యాబ్లెట్లు ఇస్తున్నా రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంపై ఆమె కుటుంబీకుల్లో ఆందోళన నెలకొంది. మరోపక్క జ్వరం కూడా తగ్గకపోవడం, ఒకేసారి పది కేజీల బరువు తగ్గడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైలులోకి వెళ్లే ముందు కవిత 70 కేజీల బరువు ఉండగా, ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన పరీక్షల సందర్భంలో ఆమె బరువు 59.5 కేజీలు ఉన్నట్లు సమాచారం. వీటికి తోడు దీర్ఘకాలికంగా ఆమెకు ఉన్న గైనిక్ సమస్యలు రోజు రోజుకూ ఎక్కువ అవడం వలన మరింత అనారోగ్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు.హరీశ్‌రావు పరామర్శ: తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరామర్శించారు. ఆ కేసులో దర్యాప్తు సంస్థలు కావాలనే కవితను ఇబ్బంది పెడుతున్నాయని హరీశ్ ఆరోపించారు. బెయిల్ విషయంలో దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, వచ్చే మంగళవారం కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని హరీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కవితకు మరోసారి అస్వస్థత
-
బెయిల్ అంశాల్లో ఆలస్యమెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: బెయిల్ అంశాల్లో కౌంటర్ల దాఖలుకు ఆలస్యమెందుకో అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ కేవీ.విశ్వ నాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాద నలు వినిపిస్తూ.. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలు అని తెలిపారు. కేసులో సహ నిందితు డైన సిసోడియాకు బెయిల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా, ఈడీ కౌంటర్ దాఖలు చేయ లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ.రాజు ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. బెయిల్ అంశాల్లో కౌంటర్ల దాఖ లుకు ఆలస్యమెందుకు? కోర్టులో కేసు డైరీతోనే నిర్ణయం ఉంటుందంటూ ఈడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45లో కఠిన నిబంధనల నుంచి మహిళగా కవితకు మినహాయింపు ఉందని ముకుల్ రోహత్గి ప్రస్తావించగా... పీఎంఎల్ఏ కఠిన నిబంధనలు ఎందుకెలా వర్తి స్తాయో కింది కోర్టుల న్యాయమూర్తులు వివరణా త్మక కారణాలు తెలిపారని ధర్మాసనం వ్యాఖ్యాని ంచింది. కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వలేదో హైకోర్టు కారణాలు వివరించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమయంలో కవితకు మధ్యంతర ఊరట కల్పించాలని ముకుల్ రోహత్గి కోరగా. ధర్మాసనం నిరాకరించింది. ఈడీ బుధ వారం కౌంటర్ దాఖలు చేస్తే శుక్రవారం వాద నలు వినిపిస్తామని రోహత్గి తెలిపారు. దీంతో, ఈడీ తరఫు కౌంటర్ దాఖలు చేయడానికి గురు వారం వరకూ సమయం ఇవ్వాలని రాజు కోరగా, అదేరోజు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని, శుక్రవారం రిజాయిండర్ దాఖలు చేయా లని పిటిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. కాంగ్రెస్సే కవితకు బెయిల్ ఇప్పిస్తోందిఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ కుమ్మక్కు: బండి సంజయ్ మహేశ్వరం: కేసీఆర్ కూతురు కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందుకు సంబంధించిన కేసును కాంగ్రెస్ నుంచి కాబోయే రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీయే కోర్టులో వాదిస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాలలో మంగళవారం నిర్వహించిన సూర్యగిరి రేణుక ఎల్లమ్మ ఉత్సవాలకు హాజరైన సంజయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. కేసీఆర్ సూచించిన వారికే రాష్ట్రంలో మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ సీట్లు వస్తున్నాయని తెలిపారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫాంహౌస్‌కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యానించారు. అభిషేక్ సింఘ్వీ అనుభవజ్ఞుడైన న్యాయవాది అని, ఆయన తెలంగాణ నుంచి ఎంపీ అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కోర్టుల్లో, పార్లమెంట్లో గట్టిగా వాదిస్తారనుకుంటే .. లిక్కర్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం వాదిస్తున్నారని ఎద్దేవా చేశారు. -
కవితకు మళ్లీ నిరాశే!
-
కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్‌కు సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా. ఈడీ దాఖలు చేయలేదు. దీంతో.. శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం.ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. దీంతో.. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. దీంతో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.Supreme Court posts the hearing for August 27 on the plea of BRS leader K Kavitha seeking bail in corruption and money laundering cases linked to the alleged Delhi excise policy scam. pic.twitter.com/0Klk3lvDJV— ANI (@ANI) August 20, 2024మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు ఢిల్లీకి చేరుకున్నారు.ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ,ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు..ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణను వాయిదా వేసింది. -
కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ మంగళవారం (ఆగస్ట్20న) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టీస్ బీఆర్ గవాయి, జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్‌పై విచారించనుంది.ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది ముకుల్ రోహత్గి మధ్యంతర బెయిల్ కోరారు. ‘అయిదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ.. మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని కోరారు.కవిత తరపున వాదనలు విన్న అనంతరం.. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. దీంతో రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
-
కవిత బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. వారి వాదనలు విన్న తర్వాతే తీర్పు!
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. మద్యం పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది ముకుల్ రోహత్గి మధ్యంతర బెయిల్ కోరారు. ‘అయిదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ.. మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని కోరారు. కవిత తరపున వాదనలు విన్న అనంతరం.. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. Supreme Court issues notice to CBI and ED on BRS leader K Kavitha's plea seeking bail in the excise policy case. pic.twitter.com/GmKe5CjgCy— ANI (@ANI) August 12, 2024గతవారం సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవితఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ (ఆగస్ట్12) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసో డియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది. కాగా, తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలను పరిగణలోకి తీసుకొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆమె బెయిల్ పిటిషన్లను కొట్టేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో ఉన్న ఏకైక మహిళ అని, తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసి, ఢిల్లీకి తరలించింది. ఆమె నాటి నుంచి తిహార్ జైలులో ఉన్నారు. -
Hyderabad: భార్య చూస్తుండగా భర్త, ఇద్దరు కుమార్తెల దుర్మరణం
మేడ్చల్: మేడ్చల్ మండలం గౌడవెల్లి రైల్వే స్టేషన్లో రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన తోగరి కృష్ణ (42) తన భార్య కవిత (37), కుమార్తెలు వర్షిత (12), వరిణి (8)లతో కలిసి అత్వెల్లి పరిధిలోని రాఘ వేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. కృష్ణ రైల్వేలో ట్రాక్‌మన్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజులుగా మేడ్చల్ –మనోహరాబాద్ రూట్లో ట్రాక్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కాగా, ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్లో కృష్ణకు డ్యూటీ ఉంది. తన స్వగ్రామం లింగారెడ్డిపేటలో బోనాల పండుగ ఉండటంతో తన భార్య, ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకుని డ్యూటీ ముగిశాక లింగారెడ్డిపేట వెళ్దామని కారులో గౌడవెళ్లి స్టేషన్‌కు మధ్యాహ్నం 3గంటల సమయంలో చేరుకున్నారు. భార్య, పిల్లలను స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ప్లాట్ ఫాంపై కూర్చోబెట్టి కృష్ణ స్టేషన్ చివరిలో ట్రాక్‌పైకి పనిచేసేందుకు వెళ్లాడు. ఆయన అక్కడ పనిచేసుకుంటున్న సమయంలో చిన్న కూతురు వరిణి ట్రాక్‌పై దిగి తండ్రి వైపు వస్తోంది. ఈ క్రమంలోనే పెద్ద కూతురు, కవితకూడా ట్రాక్‌పై దిగి కృష్ణ పనిచేస్తున్నవైపు నడుస్తున్నారు. 3.45 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు గౌడవెల్లి స్టేషన్‌కు చేరింది. అక్కడ స్టాప్ లేకపోవడంతో రైలు వేగంగా వస్తుండటం, కూతుళ్లు ట్రాక్‌పైన ఉన్న విషయం గమనించిన కృష్ణ కేకలు వేసుకుంటూ పిల్లల వైపు పరిగెత్తాడు. ప్రమాదాన్ని తప్పించుకునేందుకు పెద్ద కూతు రును పట్టుకుని ట్రాక్‌కు ప్లాట్ ఫాంకు మధ్యలో గోడవైపు నిలబడ్డాడు. అయితే అప్పటికే చిన్న కూతురును రైలు ఢీకొట్టింది. కవిత మరో ట్రాక్‌పైకి వెళ్లింది. ఈ క్రమంలో గోడ మధ్యలో ఇరుక్కుపోయిన తండ్రీకూతుళ్లను కూడా రైలు వేగంగా ఢీకొనడంతో ముగ్గురూ మృతి చెందారు. ట్రాక్‌పై వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. కవితకు విషయం అర్థమయ్యేలోపే ముగ్గురూ అనంతలోకాలకు వెళ్లిపోయారు. స్టేషన్లో ఉన్న వారు కవిత చిరునామా తెలుసుకుని బంధువు లకు, అపార్ట్మెంట్ వాసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
నేడు కవిత బెయిలుపై సుప్రీంకోర్టు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బెయిలు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటి షన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖ లు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కు కూడా బెయిలు దక్కుతుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. సిసోడియాకు బెయి లు ఇచ్చిన సమయంలో.. సత్వర విచారణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిలు అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. -
లిక్కర్ కేసు విచారణకు కవిత వర్చువల్ హాజరు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ మీద ఢిల్లీ కోర్టులో శుక్రవారం(ఆగస్టు9) విచారణ జరిగింది. విచారణకు కవిత సహా లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. సీబిఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేజినేషన్ సరిగ్గా లేదని నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 14 వరకు ఛార్జ్‌షీట్‌లో సరిగ్గా పేజినేషన్ చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అనంతరం కేసును న్యాయమూర్తి కావేరి బవేజా ఆగస్టు 21కి వాయిదా వేశారు. -
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం.. వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఇదే పిటిషన్‌పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ తన తరుఫున వాదించే సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో మరో రోజు విచారణ చేపట్టాలని కోరారు. కానీ అనూహ్యంగా ఈ రోజు పిటిషన్‌ను ఉప సంహరించుకున్నారు.అయితే పిటిషన్ విత్‌డ్రాలో కవిత బెయిల్ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం సుప్రీం కోర్టును ఆశ్రయించి.. అక్కడి నుంచి బెయిల్ పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.కవితకు దెబ్బ మీద దెబ్బమరోవైపు మద్యం పాలసీ కేసులో సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కావాలని కోరుతూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ తిరస్కరించింది. విచారణ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వకూడదని దర్యాప్తు సంస్థలు కోర్టులో తమ వాదనలు వినిపించాయి. ఆమె ప్రభావవంతమైన వ్యక్తి కాబట్టి సాక్ష్యాలు,సాక్ష్యుల్ని తారుమారు అయ్యే అవకాశం ఉందని, బెయిల్ ఇవ్వొద్దని తెలిపాయి. ఈ అంశాలను పరిణగలోకి తీసుకున్న కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది.చివరి అస్త్రంగా డీఫాల్ట్ బెయిల్ పిటిషన్.. అంతలోనే ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కవితకు చుక్కెదురైంది. దీంతో న్యాయ బద్దంగా బెయిల్ పొందేందుకు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. సీబీఐ ఛార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని జులై 6న కవిత దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ ఛార్జ్‌షీట్‌లో తప్పులు లేవని సీబీఐ తరుఫు లాయర్లు కోర్టులో వాదించారు. ఇప్పటికే సీబీఐ ఛార్జ్ షీట్‌ను జులై 22న పరిగణలోకి కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం విచారణ జగింది. సుప్రీం కోర్టుకు కవితవిచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని ఆమె తరఫు న్యాయవాది రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజాకు విన్నవించారు. దాంతో న్యాయమూర్తి ఈ కేసును చివరిసారి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. బుధవారం విచారణ సమయంలో వాదనలు వినిపించకపోతే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని న్యాయవాదికి సూచించారు. ఈ కేసు విచారణ ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. ఆగస్ట్ 9కి వాయిదా వేశారు. రేపు కోర్టులో విచారణ జరగనుండగా.. అనూహ్యంగా డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. -
కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా!
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణ ఇవాళ జరిగింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు. మరోవైపు ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు బీఆర్ఎస్ నేతలు ధైర్యం చెప్పనున్నారు. రేపు తీహార్ జైల్లో ఉన్న కవితతో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ములాఖత్ కానున్నారు.ములాఖత్‌లో భాగంగా కవితను కలిసి ధైర్యం చెప్పనున్న బీఆర్ఎస్ నేతలు. Delhi Excise policy case | The Rouse Avenue court adjourned the hearing on the bail plea of BRS leader K Kavitha till August 7.Counsel sought time to argue. She has sought a default bail in CBI case linked to Delhi excise policy.— ANI (@ANI) August 5, 2024 -
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?
ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను మార్చి 15న తొలుత ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. ఈ రెండు దర్యాప్తు సంస్థలు పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలని గతంలోనే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయల్ కోర్టు) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఢిల్లీ మద్యం పాలసీలో కవిత ముఖ్యపాత్ర పోషించారని, బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐలు తమ వాదనల్ని వినిపించాయి. అందుకు తగిన ఆధారాల్ని కోర్టు ముందుంచాయి. దీంతో ట్రయల్ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై జూలై 22న ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కేసును సోమవారానికి (ఆగస్టు 5)కి వాయిదా వేశారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది తీవ్ర ఉత్కంఠంగా మారింది. -
ముగిసిన జ్యుడిషియల్ కస్టడీ.. నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యూడిషయల్ కస్టడీ నేటితో ముగియనుంది. జ్యుడియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు నేడు హాజరుకానున్నారు. మరోసారి కవితకు సీబీఐ కేసులో జ్యూడిషియల్ కస్టడి పొడిగించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కవితను అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జ్వరం, గైనిక్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు. -
కవిత ఆరోగ్య పరిస్థితి.. ఢిల్లీకి కేటీఆర్..?
-
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థత కు గురయ్యారు. మంగళవారం ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో జైలు అధికారులు ఢిల్లీలోని హరినగర్ లో ఉన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ప్రభుత్వ ఆస్ప త్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రక్త పరీక్షలు, గైనిక్ సంబంధ సమస్యల టెస్టులు చేయించి.. తిరిగి జైలుకు తరలించారు. నిజానికి కవితకు మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొన్నాళ్లుగా గైనిక్ సమస్యతో సతమతంఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు మార్చి 15న కవితను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె జ్యు డీషియల్ కస్టడీపై జైలులో ఉన్నారు. ఇటీవల ఆమె పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రా థోడ్ తదితరులు జైలులో కవితను పరామర్శించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. అయితే కవిత గైనిక్ (స్త్రీ సంబంధిత) సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. మంగళవారం దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు సంబంధిత వైద్య పరీక్షలు చేశారని.. బుధవారం ఉదయానికల్లా రిపోర్టులను జైలు అధికారులకు పంపనున్నారని సమాచారం. తనకు గైనిక్ సమస్య ఉందని, బెయిల్ ఇవ్వాలని కవిత గతంలోనే పిటిషన్లు వేసినా.. కోర్టుల నుంచి సానుకూల తీర్పురాలేదు.ఇంటి ఫుడ్ తినట్లేదంటున్న బీఆర్ఎస్ వర్గాలుతిహార్ జైలులో ఉన్న కవితకు ఇంటి భోజనం అందించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నాలుగైదు రోజులపాటు ఇంటి భోజనం చేసిన కవిత.. తర్వాత భోజనం తీసుకురావొద్దని కుటుంబ సభ్యులకు, తమ న్యాయవాదికి చెప్పారు. జైలులో అందరు ఖైదీలకు పెట్టే ఆహారాన్నే కవిత తీసుకుంటున్నారు.కవిత కోసం ఇంటి నుంచి తీసుకొస్తున్న భోజనాన్ని తనిఖీ పేరుతో నలుగురైదుగురు చేతులు పెట్టి పరిశీలిస్తున్నారని.. అలా చేస్తే రోగాల బారిన పడే ప్రమాదం ఉండటంతోనే ఆమె ఇంటి భోజనం వద్దన్నారని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. ఇంటి భోజనం తినకపోవడం, గతంలో ఉన్న గైనిక్ సమస్యల కారణంగా.. కవిత అస్వస్థతకు గురైనట్టు బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.