
సాక్షి,హైదరాబాద్ : ప్రతిపక్షంతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ ప్రభుత్వంలోని పలు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కీలక అధికారులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని రాజకీయపరిణామాలపై మధుయాష్కీ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ బాగోతం ఇంకా బయటపడాలి. సోమేష్ కుమార్ అండతోనే జీఏస్టీ కుంభకోణం జరిగింది. దోచిపెట్టిన ,దాచి పెట్టిన అధికారుల పై విచారణ జరగాలి. అభయ్ కుమార్ లాంటి వారి పై చర్యలు అవసరం. విచారణలో వేగం లేనందునే కాంప్రమైజ్ అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.
విచారణ చేయాల్సిన అధికారులే దోషులు కావడంతో విచారణ ముందుకు సాగడం లేదు. సింగరేణిలో కవిత కు అన్ని రకాలుగా సహాకరించిన అధికారి ..మా ప్రభుత్వం లో ఉన్నత స్థానంలో ఉన్నారు. సంధి కాలం ముగిసింది.. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టాలి. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారు’అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment