madhu yashki goud
-
‘ప్రాణానికి హాని ఉందన్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు’
జగిత్యాల, సాక్షి: ప్రాణానికి హాని ఉందని గంగారెడ్డి ముందే చెప్పినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిజామాబాద్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఆయన శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే హత్యకు గురి కావడం విచారకరం. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా భావంతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకున్నాం. 2014లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే జీవన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ పార్టీలోకి వెళ్ళలేదు’’అని అన్నారు.‘‘ నాకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగింది. కనీసం నాకు చెప్పలేదనేది నా ఆవేదన. గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది. గంగారెడ్డిని వాట్సాప్‌లో బెదిరించినా గానీ పోలీసులు పట్టించుకోలేదు. 100 డయల్ ఫోన్ చేసినా నో రెస్పాన్స్. దసరా పండుగ రోజు డీజేలు పగులగొట్టినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కుట్రలను, వాస్తవాలని వెలికి తీయలేకనే పాత కక్షలు అని పోలీసులు చెబుతున్నారు. నా కుటుంబ సభ్యుణ్ని కోల్పోయా. ఒక నేరస్థుడు పోలిసు స్టేషన్లో రీల్స్ తీస్తే పోలీసుల ఏం చేశారు. ఫిరాయింపులతో మేము ఆత్మస్థైర్యం కోల్పోయాం. మా ప్రత్యర్థులు రెచ్చిపోయారు’’అని అన్నారు. -
ఈ ఇద్దరిలో ఎవరో?
మంత్రివర్గ విస్తరణపై అస్పష్టత రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజా భేటీలో మంత్రివర్గ కూర్పుపై అభిప్రాయ సేకరణకు పరిమితమైన అధిష్టానం.. దానిపై మరోమారు చర్చిద్దామంటూ వాయిదా వేసినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడి నియామకమయ్యాక దీనిపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయంటూ.. వీరికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదనను హైకమాండ్ ముందు రాష్ట్ర నేతలు ఉంచినట్లు తెలిసింది. దీనికి హైకమాండ్ అంగీకరించినట్లు సమాచారం. సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించాలనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చి నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్.. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలైన మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్‌లలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ పార్టీ ముఖ్యులతో జరిగిన చర్చల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని, ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణలు, పారీ్టలో పనిచేసిన అనుభవం ఆధారంగా కొత్త మంత్రులపై నిర్ణయం ఉంటుందని సమాచారం. సుదీర్ఘ చర్చలు..: కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు ప్రభుత్వంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేబినెట్ పదవుల భర్తీపై గత నెల రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో చర్చలు జరిపారు. మరోవైపు అధిష్టానం కూడా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది.తాజాగా ఆయా అంశాలపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌లు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్‌గాం«దీ, కేసీలతో మరోమారు భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధిష్టానం ముఖ్య నేతలతో విడివిడిగా కూడా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చర్చకు వచ్చిన ఆరు పేర్లు పీసీసీ పదవికి ప్రధానంగా ఆరుగురు నేతల పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గం నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రి శ్రీధర్‌బాబుల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష పారీ్టలను ధీటుగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతతో పాటు సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని బీసీ సామాజికవర్గ నేతలకే పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.ముఖ్యంగా బీసీ నేతలకు కేంద్ర ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారిని మచ్చిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పరిగణనలోకి తీసుకుని బీసీ వర్గ నేతలవైపే హైకమాండ్ పెద్దలు మొగ్గు చూపినట్లు తెలిసింది. వారిలో పార్టీ కార్యకలాపాల్లో మొదటినుంచీ చురుగ్గా ఉన్న మహేశ్‌గౌడ్ వైపు మెజార్టీ నేతలు మొగ్గు చూపగా, ఆయన ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండటంతో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దృష్ట్యా, మధుయాష్కీ పేరును పరిశీలించాలని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.అయితే దీనిపై నిర్ణయాధికారం తమకు అప్పగించాలని, ఎవరి పేరును ప్రకటించినా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఓసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సైతం ప్రాధాన్యం ఇచ్చేలా ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనే దానిపై భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. -
టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీకీ దక్కే అవకాశం
-
నాకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పా
సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి తనను పోటీ చేయాల్సిందిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారని, గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని ఆయన చెప్పినా తనకు పోటీ చేయడం ఇష్టలేదని స్పష్టం చేశానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజకీయంగా వెనుకబడి పోతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్నుద్దేశించి సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడితే ఎగిరెగిరి పడిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలకు, ఆయన భాషకు ఏం చెప్తారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు ముసళ్ల పండుగ ముందుందని, బీఆర్ఎస్ ఆరిపోయే దీపమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వెనక కేటీఆర్ ఉండి ఉంటారని అభిప్రాయపడ్డ మధుయాష్కీ.. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు ఎ1, ఎ2 అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని మాత్రమే తప్పు పట్టామని, కేజ్రీవాల్‌పై విచారణను ఏఐసీసీ తప్పు పట్టలేదని మధుయాష్కీ స్పష్టం చేశారు. -
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తామని కాంగ్రెస్ మాజీఎంపీ మధుయాíష్కీగౌడ్ అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌పై దాడి చేస్తే వందల కోట్ల రూపాయలు బయటపడతాయని, అక్కడ ఆయన నోట్ల కట్టలపైనే పడుకుంటారని, అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని ఆరోపించారు. దానిపై ఏ వి«ధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మధుయాష్కి మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటకు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి అధికారినీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం వదిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య తెరవెనుక ఉన్న వ్యాపారం, అవినీతి బంధాన్ని బయటకు తీయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్ చుట్టూవున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మాజీమంత్రి కేటీఆర్ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని అమెరికా, దుబాయ్‌లో పెట్టారని ఆరోపించారు. కల్ల»ొల్లి మాటలు, అహంకారంతో మాట్లాడుతున్న కేటీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కనీసం 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదని తెలిపారు. -
TS Elections: బరిలో ఎన్నారైలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తమ ప్రత్యేకతను చాటుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీతారెడ్డి, చెన్నమనేని రమేష్ లాంటి ఎన్నారై బ్యాక్‌డ్రాప్ ఉన్న సీనియర్లు పూర్తిగా పోటీకి దూరం కాగా.. ఇప్పుడు కొత్తగా బరిలోకి దిగుతూ చర్చనీయాంశంగా మారారు కొందరు. మామిడాల యశస్వినీరెడ్డి అమెరికాలో స్థిరపడిన ఝాన్సీరెడ్డి.. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాలకుర్తి(జనగామ) నుంచి పోటీ చేయాలనుకున్నారు. అందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం చొరవ చూపి.. టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అమెరికా పౌరసత్వ కారణంతో అది వీలుపడలేదు. బదులుగా తన కోడలు యశస్వినిరెడ్డి(26)ని పోటీలో నిలిపాలనుకోగా.. కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఒప్పుకుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత యువ అభ్యర్థి యశస్వినే కావడం విశేషం. ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీరెడ్డి పాలకుర్తిలో పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. పాలకుర్తిలో సేవాకార్యక్రమాల ద్వారా ఝాన్సీరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆ కార్యక్రమాలనే తన కోడలి ప్రచారం కోసం ఝాన్సీరెడ్డి ఉపయోగించుకుంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. గెలుపుపై యశస్విని ధీమాతో ఉంది. చల్లా శ్రీలత బీజేపీ హుజూర్ నగర్ అభ్యర్థిని చల్లా శ్రీలతారెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఆమె స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించి.. ఆపై వివాహ తదనంతరం యూఏఈ వెళ్లిపోయారు. ఆమె భర్త విజయ భాస్కర్‌రెడ్డి అక్కడి ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. లాయర్‌గానే కాకుండా.. 2009 సమయంలో అబుదాబిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు కార్యక్రమాలు శ్రీలత నిర్వహించారు. ఉద్యమానికి మద్దతుగా యూఏఈలో ఎన్నారై కమ్యూనిటీని కూడగట్టి సంఘీభావ కార్యక్రమాలు రూపొందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. స్వస్థలానికి వచ్చిన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గానూ ఆమె పని చేశారు. ప్రస్తుతం ఆమె నేరేడుచర్ల వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఈ మధ్య చేరిన ఆమె.. ఈసారి హుజూర్నగర్ బరిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్), సైదిరెడ్డి(బీఆర్ఎస్)లతో పోటీ పడుతున్నారు. స్థానికతే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారామె. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి గతంలో విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి వచ్చి రాజకీయ రంగప్రవేశం చేశారు. భూక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్(నిర్మల్) బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్. ఈయన చదివింది నిజాం కాలేజీలో. ఆ సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈయన క్లాస్మేట్. అంతేకాదు.. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. అప్పటికే అక్కడ కంపెనీ నడుపుతున్న జాన్సన్ నాయక్ ఆతిథ్యం ఇచ్చారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త.. జాన్సన్‌ను రాజకీయాల్లోకి రప్పించింది. అలా.. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రేఖా నాయక్‌ను(సీటు రాలేని ఆమె కాంగ్రెస్‌లో చేరారు) కాదని బరిలోకి దించారు. ఈ సారి ఎన్నికల్లో తన ప్రియ మిత్రుడిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో కేటీఆర్ ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారం సైతం చేశారు. మధుయాష్కీ గౌడ్ ఎన్నారైల లిస్ట్‌లో సీనియర్ మోస్ట్ లీడర్. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన మధు యాష్కీ తొలిసారిగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎల్బీ నగర్(రంగారెడ్డి) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. గతంలో రెండుసార్లు(2004, 2009) నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలు ఈయన్ని ఎన్నుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించిన మధు యాష్కీ.. న్యూయార్క్‌లో లాయర్‌గా పని చేశారు. ఆయనకు న్యూయార్క్, అట్లాంటాలో లీగల్ కన్సల్టెన్సీలు ఉన్నాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల పరిణామాలు తనను సొంత దేశానికి రప్పించాయని తరచూ చెప్తుంటారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత అయినప్పటికీ.. ఎల్బీ నగర్ ఓటర్లను ఆయన ఏమేర ప్రభావితం చేస్తారనేది తెలియాలంటే కౌంటింగ్ దాకా ఆగాల్సిందే. ఈసారి తెలంగాణ ఎన్నికల కోసం 2,780 ఎన్నారైలు ఓటేయబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. 2014లో ఎన్నారై ఓటర్ల సంఖ్య కేవలం 05గా ఉంది. అదే 2018లో ఈ సంఖ్య 244కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. -
తెలంగాణలో 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత నేత మధు యాష్కీ స్పందించారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. కాగా, మధు యాష్కీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు పరీక్షలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. కేసీఆర్, కేటీఆర్ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకు అయ్యియి. ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువతను మోసం చేస్తున్నారు. తిరిగి పరీక్షలు పెట్టినప్పుడు.. ఏజ్ రియాక్సేషన్ ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అభ్యర్థులు తిరిగి పరీక్ష రాయాలంటే ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలి. కోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్పీఎస్సీ రూల్స్ పాటించలేదని, పరీక్షను సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడింది. ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని తెలిపింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి? -
రెండుసార్లు ఎంపీ.. కానీ ఈసారి విముఖత..!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తన తదుపరి రాజకీయ రంగస్థలంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ శాసనసభ స్థానాన్ని ఎంచుకున్నారు. ఎల్బీనగర్ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏడాదిన్నర కాలం నుంచే మధుయాష్కీ ఎల్బీనగర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ పార్టీ శ్రేణుల్లో చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులు సైతం ఈ విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు. ఈ కారణంగానే యాష్కీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లా వైపు చూడడం లేదంటూ జిల్లా నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. పార్టీ నాయకత్వం నాలుగు సార్లు ఎంపీ టిక్కెట్టు ఇవ్వగా రెండుసార్లు గెలిచిన యాష్కీ, జిల్లా విషయమై ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ఇక్కడి నాయకులు, కార్యకర్తలు వివిధ సమావేశాల్లోనే విమర్శలు చేయడం గమనార్హం. మధుయాష్కీ ఎల్బీనగర్ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ ‘సాక్షి’ పత్రికలో 2022 ఏప్రిల్ 3వ తేదీనే కథనం ప్రచురితమైంది. కష్టకాలంలో వదిలేసి వెళ్తే ఎలా.. బీసీలకు ప్రాధాన్యత కోరుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం సైతం తగిన సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇలాంటి సమయంలో రెండుసార్లు ఎంపీగా, జాతీయ నాయకుడిగా రాహుల్‌గాంధీ వద్ద గుర్తింపు తెచ్చుకున్న మధుయాష్కీ ఈ విధంగా తరలివెళ్లడ మే మిటని నాయకు లు, కార్యకర్తలు అంటున్నారు. ఈ ఆలోచనతోనే ముందునుంచే నిజామాబాద్ జిల్లాకు పూర్తిగా దూరమయ్యారంటూ పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐగా వచ్చిన యాష్కీని జిల్లా నుంచి వరుసగా రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినప్పటికీ జిల్లా ప్రజలు, పార్టీ కార్యకర్తలతో అంతగా మమేకం కాకపోవడంతో తరువాత వరుసగా రెండు సార్లు గెలిచే అవకాశాలను దూరం చేసుకున్నారంటున్నారు. అధిష్టానం ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తే, కష్టకాలంలో జిల్లా పార్టీ కార్యకలాపాల విషయంలో ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించారని, తా జాగా ఆర్మూర్ నుంచి బీసీ నాయకుడిగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎల్బీనగర్ వెళ్లడమేమిటని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో సభ్యత్వ కార్యక్రమంతో పాటు మీ నాక్షీ నటరాజన్ పాదయాత్రకు సైతం యాష్కీ దూ రంగా ఉన్నారని పార్టీ నాయకులు అసహనంగా ఉ న్నారు. కీలకమైన నిజాం షుగర్స్, పసుపు బోర్డు అంశాలపై చేసిన పోరాటాల్లో యాష్కీ తనకేమీ ప ట్టనట్లు ఉండడంతోనే గత ఎన్నికల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకతను కాంగ్రెస్‌కు అనుకూలంగా మలచుకో లేని దుస్థితి నెలకొందని కార్యకర్తలు చెబుతున్నా రు. గతంలో మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్ యాష్కీపై బహిరంగ సభలో తీవ్ర విమర్శలు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే యగా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ముక్తకంఠంతో మద్దతు తెలపడం గమనార్హం. ఆర్మూర్‌లో పోటీ అవసరమైనప్పటికీ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు నుంచి మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీలో డిమాండ్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లు బీసీలకు కేటాయించే అవకాశాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటివరకు ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగకపోగా, అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన, ఇప్పటివరకు నాలుగు సార్లు ఎంపీగా పోటీచేసి రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీ ఇటువైపు ఆలోచన చేయకపోవడమేమిటని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లో ప్లాన్ మార్చిన మధు యాష్కీ.. వారిద్దరే కారణమా?
తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల డిమాండ్ బాగా కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల అభ్యర్థులే కనిపించడంలేదట. ఎంపీ సీట్ల విషయంలో ఈ అయోమయం కొనసాగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఓ సెగ్మెంట్లో నాలుగు సార్లు పోటీ చేసిన నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారట. రెండుసార్లు గెలిచి, రెండు సార్లు ఓడిన ఆ నేత వలస వెళ్ళాలని అనుకుంటున్నట్లు టాక్. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎక్కడకు వెళ్లబోతున్నారు.. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి.. రెండు సార్లు లోక్‌సభలో అడుగుపెట్టిన మధుయాష్కీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా?. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు ఎవరూ కనిపించడంలేదట నిజామాబాద్ కాంగ్రెస్‌లో. అయితే, యాష్కీ పోటీ చేయాలని అక్కడి కేడర్ భావిస్తున్నా.. ఆయన చాలాకాలం నుంచి నిజామాబాద్‌లో పర్యటించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మధుయాష్కీ ఈసారి పోటీ చేస్తారా? లేక వేరే మరెక్కడైనా పోటీ చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఏదైనా హామీ లభించిందా? అనే ప్రశ్నలు పార్టీ కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. కవిత, అర్వింద్ చేతిలో ఓటమి.. ఇక, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో రెండుసార్లు వరుసగా నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మధుయాష్కీ 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత చేతిలో ఓటమి చెందారు. అలాగే 2019 ఎన్నికల్లో మరోసారి కాషాయ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఒకనాడు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడైన అరవింద్ విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతర్గతంగా పనిచేశాయని అప్పుడు ప్రచారం జరిగింది. రెండుసార్లు ఓటమి చెందడంతో కొంతకాలంగా మధు యాష్కీ నిజామాబాద్ జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు సీటుపై ఆసక్తి తగ్గిందనే ప్రచారం కాంగ్రెస్‌లోనే జరుగుతోంది. రాహుల్ గాంధీకి సన్నిహితుడి పేరున్న మధు యాష్కీకి మరోచోట సీటు హామీ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్గొండ లేదా రంగారెడ్డి జిల్లాల నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. తెరపైకి ఎన్ఆర్ఐ!.. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం మహారాష్ట్ర బోర్డర్ బోధన్‌లో మొదలై.. జగిత్యాల నియోజక వర్గం వరకూ విస్తరించి ఉంది. మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం అంతా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ అరవింద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎవరూ ఈ పార్లమెంట్ సీటు గురించి పట్టించుకున్నవారు కనిపించడంలేదు. మధుయాష్కీ పోటీ చేయకపోతే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లేదా ఎవరైనా ఎన్ఆర్ఐతో పోటీ చేయిస్తారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. మొత్తానికి రెండుసార్లు ఓటమితో మధుయాష్కీ నిజామాబాద్‌ను వదిలేశారనే ప్రచారం అయితే జిల్లాలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: ప్లాన్ మార్చిన కేసీఆర్.. కొత్త నేతకు లైన్ క్లియర్! -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి ఇంటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సందేశాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్రంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే వెల్లడించారు. భారత్‌జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీన మేడారంలో జోడో యాత్రలను ప్రారంభిస్తామని, రెండు నెలలపాటు ఈ పాదయాత్రలు కొనసాగుతాయని చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్లతో సమావేశమైన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. యాత్రల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రలు ఒకేసారి ప్రారంభమవుతాయని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ తదితర ముఖ్యనేతల ఆధ్వర్యంలో ఈ యాత్రలు నిర్వహిస్తామని చె ప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడుతూ ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతసహా ఇతర ముఖ్య నేతలు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నెల 24, 25, 26 తేదీల్లో యాత్రకు విరామం ఉంటుందని చెప్పారు. 1999–2004 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, విద్యుత్‌రంగాల్లో సంక్షోభం ఏర్పడిందని, ఇప్పుడు అవే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని రేవంత్ చెప్పారు. రైతుల రుణమాఫీ కాలేదని, 2014–17 మధ్య కాలంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో, 2017 నుంచి మూడో స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి దృష్టి మరల్చేందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండూ ఒకే తానులోని ముక్కలని అభివర్ణించారు. ఎనిమిదేళ్లపాటు అన్ని అంశాల్లో కలిసి పనిచేసిన ఆ రెండు పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి కాంగ్రెస్ వైపు చూస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇరుపార్టీలు నాటకాలకు తెరలేపాయని విమర్శించారు. పచ్చిఅబద్ధాలు ఆడిన గవర్నర్ కేసీఆర్‌ను కాపాడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ భ్రమల నుంచి తెలంగాణ సమాజం బయటపడాలని కోరారు. రాహుల్‌గాంధీని విమర్శించేస్థాయి కేటీఆర్‌కు లేదని, ఆయనకు క్యాట్ వాక్, డిస్కో డ్యాన్స్, పబ్‌ల గురించి మాత్రమే తెలుసని విమర్శించారు. -
‘ఆపరేషన్ బొగ్గు’.. సాక్ష్యాలివిగో.. వివరాలు వెల్లడించిన మధుయాష్కీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జార్ఖండ్‌లోని చంద్రగుప్త బొగ్గు గని ప్రాజెక్ట్ దక్కించుకునేందుకు తల్లిలాంటి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారని టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం పెద్దాయపల్లి గేట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి తన వ్యాపార విస్తరణ కోసం మునుగోడు ప్రజలను మోసం చేశాడనడానికి సాక్ష్యాలివిగో అంటూ ప్రతులు చూపిస్తూ వివరాలు వెల్లడించారు. ‘ఆపరేషన్ బొగ్గు’అంటూ మధుయాష్కీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. చంద్రగుప్త బొగ్గుగని ప్రాజెక్ట్‌ను రూ.3,437 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్‌తో దొడ్డిదారిన రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశి ఇన్ఫ్రాటెక్ సంస్థ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ఐదురెట్లకిపైగా రూ.18 ,264 కోట్ల లాభం వస్తుంది. వాస్తవానికి 2019లో కోల్‌కతా హైకోర్టు సుశి ఇన్‌ఫ్రాటెక్‌ను బ్యాంక్ డిఫాల్టర్‌గా ప్రకటించింది. అలాంటి కంపె నీకి చంద్రగుప్త ప్రాజెక్ట్‌ను బీజేపీ కేటాయించడంలో మతలబేంటో అందరికీ తెలుసు. కోల్ కమిషన్ ఆఫ్ ఇండియా 2020 జూన్ 30న జార్ఖండ్‌లోని చంద్రగుప్త కోల్ ప్రాజెక్ట్‌కు మొదటి టెండర్ ప్రకటించింది. ఇందులో రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశి ఇన్ఫ్రాటెక్ పాల్గొనలేదు. మొదటి టెండరు అదానీ గ్రూప్‌నకు దక్కినా.. దాన్ని రద్దుచేస్తూ 2021 జనవరిలో రెండోసారి టెండర్ ప్రకటించింది. అదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అనుకూలంగా ప్రకటనలిస్తూ లాబీయింగ్ చేశాడు. రెండో టెండరులో పాల్గొ న్న సుశి ఇన్‌ఫ్రాటెక్‌కు 2021 ఫిబ్రవరి 3న చంద్రగు ప్త ప్రాజెక్ట్ కేటాయించారు. టెండర్ అలాటైనా ప్ర భుత్వం ఆ కంపెనీకి గని కేటాయించలేదు. దీంతో 2021 మార్చిలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా ఆయన బీజేపీ నేతలతో చర్చలు మొదలుపెట్టారు. ఫలితంగా 2021 డిసెంబర్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌తో జారీ జరిగింది. సుశి ఇన్‌ఫ్రాటెక్‌కు కోల్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఇచ్చినా.. ఒప్పందంలో జాప్యం జరుగుతుండగా ఈ ఏడాది మార్చి 17న బీజేపీలో చేరనంటూ రాజగోపాల్‌రెడ్డి ప్రకటించి పరోక్షంగా ఒత్తిడి తెచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారు. పథకం ప్రకారం జరిగిన అగ్రిమెంట్.. ‘ఈ బొగ్గు కుంభకోణంలో చర్చల పర్వం జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు జరిగింది. కాంట్రాక్ట్ వచ్చినంక ఒప్పందం ఆలస్యం అవుతుంటే జనవరి 2022 నుంచి జూలై 2022 వరకు మరో పర్వం కొనసాగింది. చివరకు జూలై 27న బీజేపీలోకి చేరుతున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. క్విడ్‌ప్రోకో కిందనే జార్ఖండ్‌లోని చంద్రగుప్త దక్కించుకున్నారు. గతంలో సుశి ఇన్‌ఫ్రాటెక్‌కు, తనకు సంబంధం లేదని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఆయన భార్య, కూతురుకు 99.09శాతం షేర్లు ఉన్నాయి. అటువంటోడు ఆత్మగౌరవ పోరాటమంటడు.. మునుగోడు, తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి’ అని మధుయాష్కీ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. -
ఆపరేషన్ బొగ్గు.. డాక్యుమెంట్ విడుదల చేసిన మధుయాష్కీ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ బొగ్గు పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ చంద్రగుప్త బొగ్గు గనుల టెండర్ ఇచ్చిందని సెటైర్లు వేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తన కంపెనీ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. ఆయన రాజకీయమంతా బ్యాక్‌డోర్ లాబీయింగ్ అని విమర్శలు గుప్పించారు. చదవండి: సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు -
అసలు కేసీఆర్‌ను అక్కడ నమ్మేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పెడతానని చెప్పడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఎద్దేవా చేశారు. తన కుటుంబ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ రాగం ఆలపిస్తున్నారని, అయినా కేసీఆర్‌ను నమ్మే నేతలు జాతీయ స్థాయిలో ఎవరూ లేరని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ల లోపాయికారీ ఒప్పందాల్లో భాగమే కేసీఆర్ జాతీయ పార్టీ అని అన్నారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై స్పందించిన మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఆ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదు. నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. చదవండి: ‘ఫీజు విషయంలోనే వివాదం.. ప్రిన్సిపాల్ వెనక్కి తగ్గకపోవడంతో’.. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పొరేట్ కాలేజీలు దోచుకుంటున్నాయని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మండల కేంద్రాల్లోకి సైతం నారాయణ, చైతన్య కాలేజీలు విస్తరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో సైతం ఇవి లేవు. మండల కేంద్రాలకు సైతం నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వచ్చి.. ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు... తగిన చర్యలు తీసుకోలేదని మధుయాష్కీ మండిపడ్డారు. -
‘కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని భయపడుతున్నారు’
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్, బీజేపీలు భయపడుతున్నాయని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. వరంగల్‌లో రాహుల్‌గాంధీ సభ తర్వాత యువత కాంగ్రెస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితమవుతోందన్నారు మధుయాష్కీ. గురువారం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన మధుయాష్కీ గౌడ్.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ-టీఆర్ఎస్లు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ‘మొన్నటి వరకు ముందస్తు ఎన్నికల హడావిడి మీరు చూశారు.. ఉన్నట్టుండి మునుగోడు ఉప ఎన్నికను తీసుకువచ్చారు. మునుగోడు ఎన్నికల మీద చర్చించాము. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని గమనించి బీజేపీ, టీఆర్ఎస్ అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీ రాగానే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడం జరిగితే.. వెంటనే ఆమోదించడం జరిగింది. బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ కుట్రలకు టీఆర్ఎస్ సహకరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్తారు. అక్కడ ఎవరిని కలవరు. ఆయన హైదరాబాద్ వచ్చిన వెంటనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారు. ఉప ఎన్నికల తేదీ కూడా వాళ్లే ప్రకటిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉందా లేదా అన్నదే నా ప్రశ్న. కేవలం ఐదు నిమిషాల్లోనే రాజీనామాను ఆమోదించడం జీవో విడుదల చేయడం జరిగింది.కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై కొట్లాడుతున్నట్టు నాటకాలాడారు. పార్లమెంట్ లో విద్యుత్ సంస్కరణల బిల్లు వచ్చిప్పుడు సభోల ఒక్క టీఆర్ఎస్ ఎంపీ లేడు.. ఇదే చెబుతుంది.. ఇద్దరూ ఒక్కటేనని. కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం వల్లే విద్యుత్ సంస్కరణ బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు వెళ్ళింది. ఈ నెల 13న మునుగోడు లో పాద యాత్ర .. 16నుంచి మండలాల వారిగా సమావేశాలు ఉంటాయి. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి.. మునుగోడు లోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ నేతల పర్యటన ఉంటుంది. రాష్ట్ర నేతలంతా మునుగోడు లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు’ అని మధుయాష్కీ తెలిపారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం: మధు యాష్కీ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వరదాయినిలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తే.. దానిని నిట్టనిలువునా చంపేసి కాళేశ్వరం అనే ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి ప్రాజెక్టును కల్వకుంట్ల కుటుంబం తీసుకువచ్చిందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. కాళేశ్వరంతో పారిన ఎకరాలు లెక్కలు లేవుకానీ.. కాళేశ్వరం కల్వకుంట్ల అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందన్నారు. చదవండి: నవ్వుతూ త్వరగా కోలుకునేందుకు ఈ సినిమా చూడండి: ఆహా ఉమ్మడి రాష్ట్రంలోనే పబ్లిక్ అండ్ ప్రయివేట్ భాగస్వామ్యం కింద ప్రాణహిత ప్రాజెక్ట్‌ను 33 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులను నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై 13 వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. మిగిలిన మరో 20 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసుంటే సుమారు 16 లక్షలా 40 వేల ఎకరాలకు నీళ్లు పారడంతో పాటు.. హైదరాబాద్ మహానగరానికి తాగు నీటి సమస్య, పరిశ్రమల అవసరాలకు నీళ్లు ఉండేవన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షల కోట్ల రూపాయలకు పెంచి రాష్ట్ర సంపదను మేఘా కృష్ణారెడ్డికి దోచి పెట్టాడు.. మిషన్ భగీరథ పేరుతో మరో రూ.50 వేట కోట్లను కూడా మేఘాకే సమర్పించారని దుయ్యబట్టారు. కాళేశ్వరం - మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాలు సొమ్ముతో కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉండేది. ప్రతి జిల్లాకో ప్రభుత్వ ఇంజనీరింగ్, వైద్య కళాశాల ఏర్పాటయ్యేదని మధు యాష్కీ అన్నారు. -
అవి అహంకారపూరిత వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ చేసిన సర్వేలో తెలంగాణలో తమ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని, మంత్రి కేటీఆర్‌కి కళ్లు నెత్తికెక్కి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. శ్రీలంకలో కుటుంబ పాలన వల్ల రాజపక్సేకు పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో గెలవబోతోందని, 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తంచేశారు. గోదావరి వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి కాంగ్రెస్ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. 2014లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని విమర్శించారు. 12 లక్షల మంది విద్యార్థులకు రూ.3,270 కోట్ల బకాయిలు చెల్లించడం లేదన్నారు. 2014 తర్వాత 850 జూనియర్, 350 డిగ్రీ, 150 పీజీ, వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు మూతపడ్డాయని, ఫీజు కట్టలేక 30 శాతం విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది. మన ఊరు–మన బడి కోసం 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేశారు. ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి’అని ఉత్తమ్ విమర్శించారు. సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, గీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వంద తరాలు తిన్నా కేసీఆర్‌కు తరగని ఆస్తి
పంజగుట్ట: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర నిజం లాంటి అబద్ధమని, ఉద్యమం ముసుగులో ఆయన తన పార్టీని విస్తరించుకుని ఆర్థికంగా వంద తరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పుడు కేసీఆర్ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అనే విషయాలను ప్రజలకు వివరించాలని, అప్పుడే ఉద్యమకారులెవరో, ద్రోహులెవరో తెలిసిపోతుందన్నారు. నిజమైన ఉద్యమకారులెవరూ ఆస్తులను కూడబెట్టుకోరన్నారు. ఆదివారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఎసీ) ఆధ్వర్యంలో టీజేఎసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం రచించిన దాలి, చేదునిజం పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దాలి పుస్తకాన్ని రేవంత్ ఆవిష్కరించగా, చేదునిజం పుస్తకాన్ని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. నిజమైన ఉద్యమకారుల చరిత్ర బయటకు రాకుండా, చావు అంచులదాకా వెళ్లి తెలంగాణ తెచ్చానని వక్రీకరించిన చరిత్రను ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కవులు, కళాకారులు స్ఫూర్తిని ఇచ్చారని, ప్రస్తుతం కవులు, కళాకారులు గడీల్లో బందీగా ఉన్నారని, ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదని రేవంత్ అన్నారు. మేధావులతో సలహామండలి ఏర్పాటు చేస్తామని సలహామండలి అభిప్రాయాలతోనే నిర్ణయాలు తీసుకుంటామని ఎన్నికల హామీలో పెట్టారని, కానీ కుటుంబాల నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయని పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు ఎప్పుడైనా భోజనం పెట్టారా.. 1,200 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో అధికారం చెలాయిస్తూ నాలుగు పదవులు అనుభవిస్తున్న కేసీఆర్ కుటుంబసభ్యులు ఎప్పుడైనా అమరవీరుల కుటుంబాలకు పదవులు కట్టబెట్టారా.. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున వారికి ఒకసారైనా భోజనం పెట్టారా అని రేవంత్ ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలోనూ అవినీతి జరగడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ 10 వేల కోట్లు ఉన్న ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని రూ.36 వేల కోట్లకు పెంచుకున్నారని, తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చారని, గ్యాంగ్ రేప్‌లకు, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏమాత్రం కేసీఆర్‌ను భరించేస్థితిలో తెలంగాణ సమాజం లేదని, కేసీఆర్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు కవులు, కళాకారులు, ఉద్యమకారులు తమ కలాలకు, గళాలకు పదును పెట్టాలని పిలుపునిచ్చారు. మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ శ్రీలంకలో రాజపక్స కుటుంబానికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాక కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ కాటేసే నక్క అని అప్పుడెవ్వరూ గ్రహించలేకపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, పాత్రి కేయులు పాశం యాదగిరి, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ సి.కాశీం, కవి, గాయకుడు వరంగల్ రవి, రచయిత వేముల ఎల్లన్న పాల్గొన్నారు. -
‘కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార ఆర్భాటం కోసం కోట్ల రూపాయల ప్రజాధన వృధా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. తాజాగా హైదరాబాద్‌లోనూ కల్వకుంట్ల చేసుకుంటున్న సొంత ప్రచారానికి కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వాడుకుంటున్నారని ఆరోపించారు మధుయాష్కీ గౌడ్. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోక ప్రజల సొమ్మును తన సొంత ప్రచారాలకు ఖర్చు చేస్తున్నారు. మౌలిక వసతులు లేక మొన్న బాసర విద్యార్థులు చేసిన ధర్నాలు చూశాము.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాల్లోనూ అదే పరిస్థితులు ఉన్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ప్రచార యావ కోసం పెడుతున్న ఖర్చును రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసమో, లేక ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలల మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తే కొంతలో కొంతైనా ప్రజలకు మేలు జరిగేది. మీడియాకిస్తున్న ప్రకటనల ప్రజలసొమ్మును ప్రజా అవసరాల కోసం, పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొసం ఖర్చు చేస్తే పేదలకు ఆసరా దొరికేది. ప్రజలకట్టిన పన్నుల ద్వారా ఖజానాకు వచ్చిన సొమ్మును కేసీఆర్ తన ప్రచార సోకుల కోసం ఖర్చు పెట్టడాని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వ కళశాలల్లోనూ, యూనివర్సిటీల్లోనూ మౌలిక వసతుల కల్పన కోసం వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా’ అని మధుయాష్కీ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. -
అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి
హైదరాబాద్: దేశ భద్రతకు వెన్నుముకలా నిలిచిన మిలటరీని ప్రైవేటీకరించే సన్నాహాల్లో భాగంగా తీసుకువస్తున్న అగ్నిఫథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాంఢ్ చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన యువకుల ఆందోళనల్లో భాగంగా పోలీసులు కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మరణించడం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందని, రాకేష్ మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలన్నారు. మధు యాష్కీ గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. ➖ఒన్ ర్యాంక్ ఒన్ ఫెన్షన్ పథకానికి మంగళం పాడేలా నో ర్యాంక్.. నో ఫెన్షన్ పథకం అమలు చేయడంలో భాగంగా అగ్నిపథ్ కేంద్రం తీసుకువస్తోంది. మిలట్రీని ప్రైవేటీకరించడంతో పాటు, సైనిక విభాగాల్లో జీతభత్యాలు, ఇతర ఖర్చలు తగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనతోన కేంద్రం ఈ పథకం తీసుకువస్తోంది. దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ➖కరోనా కాలంనుంచి ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం యువత ఎదురుచూస్తోంది. రెగ్యులర్ రిక్రూట్ మెంట్ చేయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అగ్నిపథ్ పేరుతో రిక్రూట్ మెంట్లు చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ➖సికింద్రాబాద్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీఛార్జీ, కాల్పులు జరపడం అత్యంత అమానుషం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ➖కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువకుల సహనాన్ని ఇంకా పరీక్షించకుండా వెంటనే రిక్రూట్ మెంట్ మొదలు పెట్టాలి. -
రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూలవిధానాలకు వ్యతిరేకమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, అవి పార్టీకి, రేవంత్‌రెడ్డికి నష్టం చేకూరుస్తాయని తెలిపారు. ఈ మేరకు గురువారం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగలేఖ రాశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఆ వ్యాఖ్యలపట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయని, అన్ని అంశాలను నివృత్తి చేస్తూ వెంటనే వివరణ ఇవ్వాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. దేశ నిర్మాణంలో చరిత్రాత్మక పాత్ర పోషిస్తూ అగ్రకులాలకు, బహుజనులకు, ఏఐసీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని పేర్కొన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్ సభ స్థానాలకుగాను 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2023లో అధికారం సాధిం చేందుకు దకొత్తగా వచ్చిన మీకు (రెడ్డి సామాజిక వర్గానికి) పీసీసీ పదవి, సీఎల్పీ పదవి దళితవర్గానికి, ప్రచార కమిటీ చైర్మన్‌గా బీసీని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నియమించారని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్‌పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాలు తిరుగుబాటు చేస్తామని అంటున్నాయని తెలిపారు. రేవంత్ మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా, అవమాన పర్చేలా ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడికి పర్సనల్, పబ్లిక్ అంటూ ఏమీ ఉండదని, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడి మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. -
రేవంత్‌రెడ్డికి మధుయాష్కీ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఈ మేరకు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉద్యమ స్ఫూర్తిగా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల సాక్షిగా బానిస సంకెళ్లు తెంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. దేశంలో, రాష్ట్రంలో ఉన్న వనరుల్లో వారి త్యాగం, భాగస్వామ్యం ఉంది. నేడు ఆ వర్గాలన్నీ మేల్కొన్నాయి. సమాన అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. అణచివేతకు, అవమానాలను సహించమని చెబుతున్నాయి. సాధించుకున్న సగం తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ సాధించాలని ఆయా వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో.. అన్ని పార్టీలకు రెడ్ల మాత్రమే నాయత్వం వహిస్తే మనుగడ ఉంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి. వ్యక్తిగతంగా మీకు .. పార్టీకి ఈ వ్యాఖ్యలు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాలు తీవ్రంగా రగులుతున్నాయి. మీ వ్యాఖ్యలపై తిరుగుబాటు చేస్తామని ఆ వర్గాలు అంటున్నాయి. బహుజన వర్గాలన్ని మీ వ్యాఖ్యలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.. ఖండిస్తున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మేమెంతో.. మాకంతా అంటూ ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి’ అని లేఖలో ప్రస్తావించారు మధుయాష్కీ గౌడ్. ‘కాంగ్రెస్ పార్టీ 2004-2009లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది సోనియాగాంధీ నాయకత్వం, రెడ్డి-బీసీల కలయిక అనే విషయన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇది అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2023 లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు కొత్తగా వచ్చిన మీకు (రెడ్డి సామాజిక వర్గానికి) పీసీసీ పదవి, సీఎల్పీ పదవి దళిత వర్గానికి, ప్రచార కమిటీ ఛైర్మన్ గా బీసీని, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీగా మరో దళితుడికి, కన్వీనర్లుగా ఇద్దరు మైనార్టీలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కొత్త కార్యవర్గాన్ని రూపొందించారు. అన్నికులాలను, వర్గాలను కలుపుకుపోవాలన్న లక్ష్యంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గారు ముందుకు వెళుతున్నారు’ అని అన్నారు. ‘మీరు మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను సోనియాగాంధీ, రాహుల్ గాధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా అవమాన పర్చేలా కించపర్చేలా ఉంది. బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదు. పీసీసీ అధ్యక్షుడిగా మీకు పర్సనల్, ప్రవేట్, పబ్లిక్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడు మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచనతో కూడా ఉండాలి. మీరు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. దీనిని నివారించడానికి మీరు వెనువెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వడంతో పాటు, అధినాయకత్వానికి విధేయత ప్రకటించాలి. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ్డ ఆందోళనను, గందరగోళాన్ని నివృత్తి చేయాలని అడుగుతున్నా’ అని లేఖ ద్వారా ప్రశ్నించారు మధుయాష్కీ గౌడ్. -
‘దరఖాస్తుల తీసుకోవడమే తప్పా పరిష్కరించింది లేదు’
హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై మరొకసారి ప్రశ్నలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇస్తున్న 200 రూపాయల పింఛన్‌ను 1000 రూపాయలకు పెంచుతామమని కేసీఆర్ ప్రకటించారని, ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆసరా పింఛన్ 65 ఏళ్లు పూర్తయిన వాళ్లు మాత్రమే అర్హులుగా ప్రకటించారని మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. అంతేకాకుండా భార్యభర్తల్లో ఒకరికి మాత్రమే ఆసరా పింఛన్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఆదివారం ప్రెస్‌నోట్‌ను విడుదల చేసిన మధు యాష్కీ గౌడ్.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో 65 సంవత్సరాలు అర్హతను 57కు తగ్గిస్తామని ప్రకటించాడు. ‘ఎన్నికలు పూర్తయి మళ్లీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సారాలు అవుతున్నా ఇప్పటివరకు ఆసరా పెంక్షనర్ల వయసు తగ్గింపుపై కల్వకుంట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పింఛన్‌దారుల అర్హత వయసు తగ్గింపుపై ఇప్పటివరకూ కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 57 సంవత్సారాలు నిండిన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని మాత్రమే.. అది కూడా పత్రికా ముఖంగా ప్రకటించారు.. అంతకుమించి మరేమీ చేయలేదు.రాష్ట్రంలో కొత్త పెంక్షన్ల కోసం దాదాపు 11 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆసరా పించన్లకోసం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్దులు దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వడం ఆపేసింది. కేవలం హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో మాత్రమే కొత్తగా పింఛన్లు ఇచ్చారు. మిగిలిన రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలేదు. ప్రస్తుత రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది.. ఆసరా పింఛన్లు వస్తున్న వాళ్లకు కూడా నెలాఖరుకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి.2021 - 2022 కు పెట్టిన భారీ అంకెల బడ్జెట్ చివరకు లోటు బడ్జెట్ గా మిగిలింది.. మొత్తంగా 10 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఏర్పడింది. ప్రతిపాదిత పథకాలకు కూడా డబ్బులు లేవు. కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అన్ని పథకాలకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప వాటిని పరిష్కరించింది లేదు. ఇప్పటివరకు ఆసరా పింఛన్ కోసం 13.07 లక్షల దరఖాస్తులు, ధరణి సవరణలకోసం 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్సిడీ లోన్ల కోసం 8.20 లక్షలు, రేషన్ కార్డుల కోసం 3.90 లక్షలు, పోడు పట్టాల కోసం 2.50 లక్షలు, గొర్రెల పంపిణీ కోసం 3.63 లక్షల దరఖాస్తులను ప్రభుత్వ తీసుకుంది. వీటిలో వేటికి ప్రభుత్వం పరిష్కారం చూపలేదు’ అని మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. -
‘టీఆర్ఎస్ వణుకు.. బీజేపీకి భయం’
హైదరాబాద్: ఇటీవల వరంగల్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభను చూసి అధికార టీఆర్ఎస్ వణుకు మొదలైతే, బీజేపీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సభ ప్రతీ రైతు కుటుంబాన్ని తట్టిలేపిందన్న మధుయాష్కీ గౌడ్.. రైతు డిక్లరేషన్‌పై రాష్టంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. మంగళవారం గాంధీ భవన్లో ప్రెస్‌మీట్ నిర్వహించిన మధుయాష్కీ గౌడ్..‘రైతు డిక్లరేషన్ లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల అధ్యక్షులు ప్రెస్ మీట్ లు పెట్టి రైతు డిక్లరేషన్ ప్రచారం చేయాలి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని రైతు డిక్లరేషన్ ను నెల రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాము. రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపి.కి భయంపట్టుకుంది. రాహుల్ గాంధీ సభ చూసి టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోంది. రాహుల్ గాంధీ సభ ప్రతీ రైతు కుటుంబాన్ని తట్టి లేపింది. విగ్గుగాళ్ళకు, పెగ్గుగాళ్ళకు రాహుల్ గాంధీ గూర్చి మాట్లాడే స్థాయి లేదు. రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటేనే మోసం దగా. కల్వకుంట్ల కుటుంబం అంటే ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబం. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అని అసెంబ్లీ సాక్షిగా చంద్రశేఖర్ రావు చెప్పాడు. కాంగ్రెస్ రైతాంగాన్ని కాపాడటానికి రైతు డిక్లరేషన్‌ను తీసుకుంది. నిరుద్యోగులు, ఆదివాసులు , మైనారిటీలని ఏకం చేస్తూ మరో బహిరంగ సభ ఉంటుంది. సోనియాగాందీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే ఎమ్మెల్యేకి బంగ్లాలు, వజ్ర వైడూర్యాలు ఎట్లా వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీకి 884 కోట్ల రూపాయల ఫండ్ ఎలా వచ్చింది?, రాహుల్ గాంధీ వచ్చిన తరువాత తెలంగాణ మేలుకుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆర్ఎస్ నేతలు మొహంజ మార్కెట్ లో గులాబీ పూలు అమ్ముకుంటు బతికేవారు. టీఆర్ఎస్ పతనం మొదలైంది’ అని మండిపడ్డారు. -
‘24 గంటల్లో ఏర్పాటు చేయాలి.. కేసీఆర్‌కు ఇదే మా అల్టిమేటం’
హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు ఎవరూ లేని సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో వరి దీక్ష పేరుతో దొంగ డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ.. ‘పన్ను నొప్పితో పది రోజులపాటు ఢిల్లిలో ఉన్న చంద్రశేఖర్ రావు పట్టు వస్త్రాలతో తిరిగిండు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు కలిసే అవకశముంది. చుట్టూ ఎయిర్ కండీషన్లు పెట్టుకుని ఫైవ్ స్టార్ హోటళ్లలో పందికొక్కుల్లా మెక్కుతూ టీఆర్ఎస్ నాయకులు రైతు నిరసన దీక్షల పేరుతో మరో కొత్త నాటకానికి తెరతీశారు. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ 24 గంటల్లో కేంద్ర వరి కొనాలని అల్టిమేటం ఇచ్చాడు. తెలంగాణ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేస్తున్నాం.24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ - ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అందులో భాగంగా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడం, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వెనువుంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎస్సీఐ ఇచ్చే మొత్తాన్ని సంచులకు, తాళ్లకు, హమాలీ, ట్రాన్స్ పోర్ట్, ఛార్జీలకు చెల్లించడం జరిగేది. ఐకేపీ సెంటర్ల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లుకు ఇచ్చి రైతులను కాపాడడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధర రావడం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చినంక కల్వకుంట్ల చంద్రశేఖర్ కథ మొదలు పెట్టినాడు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కొత్త నాటకానికి తెరతీశాడు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కుల్లా తిని బలిసి గజదొంగల్లా ఏసీలు పెట్టుకుని దొంగ దీక్షలు చేస్తున్నారు.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజదొంగ రూపాన్ని, ద్రోహాన్ని తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకోవాలి. గత రబీ పంటలోనే కేంద్రానికి ఇవ్వాల్సిన 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పటి వరకూ ఇయ్యలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వలేదని చెబుతున్నారు. అంతేకాక రైస్ మిల్లర్ల దగ్గర ఉండాల్సిన బియ్యం కొన్ని వేల టన్నులు కనపడకుండా పోయిందని వార్తలు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ.300 నుంచి రూ. 400 వరకూ రైతులకు మద్దతు ధర తగ్గించి మిల్లర్లు కొంటున్నారు. ఎకరానికి రూ.7 వేల నుంచి 10 వేల వరకూ రైతులకు నష్టం కలుగుతోంది. ఇతను ఇచ్చే బోడిరూ. 5వేలతో రైతులకు ఏం మేలు జరుగుతుంది. దీనిపైన పూర్తి వివరాలోతో 13వ తేదీన గవర్నర్ ను కలుస్తాం. 2014 నుంచి తెలంగాణలో ఎలా మోసం జరుగుతుందో మొత్తం వివరిస్తాం.కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే దీనిపై సీబీఐ విచారణ జరపాలి. కేసీఆర్ ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తాడు. మోదీ పార్టీ ఏమో హైదరాబాద్ లో ధర్నా చేస్తుంది. సమస్యను పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రి ధర్నాలు చేస్తుంటే కొనుగోలు ఎవరు చేయాలి?, సమస్యల పరిష్కారం పక్కన పెట్టి రైతులకు పంగనామాలు పెడ్తున్నారు. దరిద్రపుగొట్టెంగాళ్ల వేషాలతో రైతుల ప్రాణాలను ఫణంగా పెడ్తున్నారు. ముఖ్యంగా ఫెసిలిటేటర్ గా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై బాధ్యత ఉంటుంది.. కొనుగోలు చేసి రైతులును ఆదుకోవాలి. ఎగుమతులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి.. రైతులకు ఒక శాపంగా మారాడు. కల్వకుంట్ల కుటుంబం మిల్లర్లతో కుమ్మక్కై దోపిడీ చేస్తోంది’ అని ఆరోపించారు.