‘టీఆర్ఎస్-బీజేపీలవి పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు’ | Madhu Yashki Goud Slams On KCR And TRS Govt Over BJP Friendship | Sakshi
Sakshi News home page

‘టీఆర్ఎస్-బీజేపీలవి పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు’

Published Mon, Nov 15 2021 10:47 AM | Last Updated on Mon, Nov 15 2021 10:48 AM

Madhu Yashki Goud Slams On KCR And TRS Govt Over BJP Friendship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ గురించి కేసీఆర్‌కే చెబుతారా? అంటే ప్రెస్మీట్లలలో ఫైర్ అయ్యే కేసీఆర్‌కు అసలు తెలంగాణ గురించి ఏ మీ తెలియదని.. రాష్ట్రానికి ఏమి కావాలో అసలు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో.. తెలంగాణ విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన వాటి గురించి ప్రస్తావన అయినా కేసీఆర్ ప్రభుత్వం చేసిందా? అని సూటిగా ప్రశ్నించారు.

చదవండి: రూ.10 వేల కోట్లతో వడ్లు కొనలేరా?

ఐటీఐఆర్ పార్క్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలే.. వీటిపైనా ఈ ఏడేళ్లలో ఏనాడైనా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసిందా.. కనీసం అడిగిందా? అని నిలదీశారు. మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లుగా పార్లమెంట్‌లో అండగా నిలిచిన కేసీఆర్.. ఇప్పుడు గల్లీల్లో నాటకాలకు అండగా నిలిచాడని మండిపడ్డాచరు. కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా.. ఇప్పుడు కేటీఆర్ కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు పెద్దపెద్ద డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని అంటున్నాడు.. అంటే ఇన్నేళ్లనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తీసుకురాలేకపోయాని నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించినట్లేనని దుయ్యబట్టారు.

కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీతో కుస్తీ డ్రామాలు ఆడేందుకు సమయం ఉంటుంది కానీ.. ధరలు తగ్గి అయోమయంలో ఉన్న పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సమయం ఉండదని మండిపడ్డారు. కేవలం వారం రోజుల్లోనే క్వింటాలు పత్తికి రూ.1000 తగ్గింది. వరంగల్ జిల్లా సహా ఎనుమాముల మార్కెట్ సహా ఇదే పరిస్థితి ఉందని పత్రికల్లో వస్తోందని అన్నారు. దీనిపై సంబంధిత మంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీఆర్ఎస్-బీజేపీలు ఇప్పటికైనా పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు ఆపి ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement