సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వరదాయినిలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తే.. దానిని నిట్టనిలువునా చంపేసి కాళేశ్వరం అనే ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి ప్రాజెక్టును కల్వకుంట్ల కుటుంబం తీసుకువచ్చిందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. కాళేశ్వరంతో పారిన ఎకరాలు లెక్కలు లేవుకానీ.. కాళేశ్వరం కల్వకుంట్ల అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందన్నారు.
చదవండి: నవ్వుతూ త్వరగా కోలుకునేందుకు ఈ సినిమా చూడండి: ఆహా
ఉమ్మడి రాష్ట్రంలోనే పబ్లిక్ అండ్ ప్రయివేట్ భాగస్వామ్యం కింద ప్రాణహిత ప్రాజెక్ట్‌ను 33 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులను నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై 13 వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. మిగిలిన మరో 20 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసుంటే సుమారు 16 లక్షలా 40 వేల ఎకరాలకు నీళ్లు పారడంతో పాటు.. హైదరాబాద్ మహానగరానికి తాగు నీటి సమస్య, పరిశ్రమల అవసరాలకు నీళ్లు ఉండేవన్నారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షల కోట్ల రూపాయలకు పెంచి రాష్ట్ర సంపదను మేఘా కృష్ణారెడ్డికి దోచి పెట్టాడు.. మిషన్ భగీరథ పేరుతో మరో రూ.50 వేట కోట్లను కూడా మేఘాకే సమర్పించారని దుయ్యబట్టారు. కాళేశ్వరం - మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాలు సొమ్ముతో కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉండేది. ప్రతి జిల్లాకో ప్రభుత్వ ఇంజనీరింగ్, వైద్య కళాశాల ఏర్పాటయ్యేదని మధు యాష్కీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment