కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తాం | Madhu yashki Goud Sensational Comments On KCR FarmHouse | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తాం

Published Mon, Jan 29 2024 1:21 AM | Last Updated on Mon, Jan 29 2024 1:21 AM

Madhu yashki Goud Sensational Comments On KCR FarmHouse - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తామని కాంగ్రెస్‌ మాజీఎంపీ మధుయాíష్కీగౌడ్‌ అన్నారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌పై దాడి చేస్తే వందల కోట్ల రూపాయలు బయటపడతాయని, అక్కడ ఆయన నోట్ల కట్టలపైనే పడుకుంటారని, అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని ఆరోపించారు. దానిపై ఏ వి«ధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మధుయాష్కి మీడియాతో మాట్లాడారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటకు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి అధికారినీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వదిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య తెరవెనుక ఉన్న వ్యాపారం, అవినీతి బంధాన్ని బయటకు తీయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ చుట్టూవున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో మాజీమంత్రి కేటీఆర్‌ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని అమెరికా, దుబాయ్‌లో పెట్టారని ఆరోపించారు. కల్ల»ొల్లి మాటలు, అహంకారంతో మాట్లాడుతున్న కేటీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కనీసం 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తున్నదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement