లోక్‌సభ పోలింగ్ సరళి తమకే అనుకూలం అంటున్న ప్రధాన రాజకీయ పక్షాలు
మెజారిటీ సీట్లను సాధిస్తామంటూ ఎవరికి వారే ధీమాగా చెప్తున్న తీరు
ప్రజాపాలన వైపే ఓటర్లు మొగ్గుచూపారంటున్న అధికార కాంగ్రెస్
పోలింగ్ శాతం పెరిగింది కూడా అందుకేఅనే ధీమాలో గాం«దీభవన్ వర్గాలు
త్రిముఖ పోటీలో తమకు మంచి ఫలితాలు వస్తాయంటున్న గులాబీ నేతలు
కేసీఆర్ బస్సుయాత్రతో పోలింగ్ తీరే మారిపోయిందని వ్యాఖ్య
ట్రెండ్స్ అన్నీ తమవైపే ఉన్నాయంటున్న కమలదళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పారీ్టలన్నీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటుండటం, అన్ని పార్టీలూ తమకే ఎక్కువ సీట్లు వస్తాయని గట్టిగా వాదిస్తుండటంతో.. ఆసక్తి మరింత పెరుగుతోంది. సోమవారం జరిగిన పోలింగ్ సరళిని విశ్లేíÙంచుకున్నాక కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు పార్టీలు తమ అంచనాలను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు.
పైగా మరిన్ని స్థానాలు అదనంగా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పెరిగిన పోలింగ్ శాతాన్ని ఎవరికి వారే తమకు అనుకూలమని అంచనా వేసుకుంటుండటం గమనార్హం. అయితే అన్ని పారీ్టలు మహిళలు, గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో అన్నది తేల్చుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి.
పెరిగినది పాజిటివ్ ఓటింగేనంటున్న కాంగ్రెస్..
ఐదు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పాజిటివ్ ఓటింగ్ జరిగిందని.. ప్రస్తుతం పెరిగిన ఓటింగ్ శాతం కూడా ప్రభుత్వ అనుకూల ఓటేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని అంటున్నాయి. ప్రధానంగా మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్లుతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఎన్నికలకు ముందే రైతుభరోసా నిధులు వెళ్లడం, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఒట్టు వేసి మరీ ప్రకటించడం వంటివి పాజిటివ్ టాక్ తెచ్చాయని.. అవి ఓట్ల రూపంలో కాంగ్రెస్‌కే దక్కాయని నేతలు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కంటే.. లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనిచి్చన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో లేకుండా పోయిందని చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న ప్రచారం బాగానే ప్రభావం చూపిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు పన్నెండు నుంచి 13 సీట్లు లభిస్తాయని పేర్కొంటున్నారు.
బాగా బలోపేతం అయ్యామంటున్న బీజేపీ..
లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్రంలో మరింతగా బలోపేతం అయ్యామని, ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని మోదీపై అభిమానం, కేంద్రం గత పదేళ్లుగా అందించిన నీతివంతమైన పాలనకు తగిన ప్రతిఫలం తమకు లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని అంటున్నారు.
పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తాము రాజ్యాంగం జోలికి కానీ, రిజర్వేషన్ల జోలికి కాని వెళ్లని విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని వివరిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో మోదీ మేనియా బాగా వర్కౌట్ అయిందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అమిత్ షా సహా జాతీయ నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడం.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడం కలసి వచి్చందని అంటున్నారు. ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు ఖాయమని ధీమాగా చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌కు బీజేపీకి అనుకూలంగా ఉందని.. అసెంబ్లీ ఎన్నికల్లోకు ఓటేయని వర్గాలు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వచ్చి తమకు ఓటు వేశాయని అంటున్నారు.
కేసీఆర్ బస్సుయాత్ర ఊపుతో..
లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తమకు లాభిస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో విశేష స్పందన లభించిందని ఆ పార్టీ ముఖ్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, జిల్లాల రద్దు వంటి అంశాలతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచిందని అంటున్నారు.
ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే బాగుండేదన్న అభిప్రాయానికి వచ్చారని, ఇది తమకు సానుకూలంగా మారిందని అంటున్నారు. రెండు జాతీయ పార్టీలకు నేరుగా తమతోనే పోటీ జరిగిందని చెప్తున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ స్థానం ఎక్కడికీ పోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించామని పేర్కొంటున్నారు. ఆ రెండు పారీ్టలు పారాచూట్ లీడర్లకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం కూడా.. కార్యకర్తలు, నేతల్లో అసంతృప్తిని రగిలించిందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment