
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రధాని మోదీని విమర్శిస్తే.. కేసీఆర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా.. గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి.. వీటిపై చర్చకు వస్తారా రండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25 ఏళ్లు కొట్లాడినాం.. మూత వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం... తెరిచింది బీజేపీ ప్రభుత్వం. కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది
అధికారం చేతిలో ఉన్న పని చేసే దమ్ము రేవంత్ కు లేదు.. కానీ కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు ఎలా ముందుకు వెళ్తాయి. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర బస్టాప్ కట్టలేని దుస్థితి. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పనులు చూసి రావాలని రేవంత్‌కు సూచన.
మోదీ గురించి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయారో రేవంత్‌కు అదే గతి పడుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది.. సిగ్గు అనిపించడం లేదా? అని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment