Etela Rajender
-
మీరు లెక్క చూపించండి.. తల వంచుకొని క్షమాపణలు చెబుతా ..
-
భూములు లాక్కోడానికి నీ అయ్య జాగీరు కాదు: రేవంత్‌పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారని తెలిపారు. ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేసిందన్న ఈటల.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ రద్దు చేసి.. రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారని ప్రస్తావించారు. అయితే ఫోర్త్ సిటీ పేరుతో ఆ 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.కొడంగల్‌లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా.. బెదిరించి సెకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈటల రాజేందర్. స్వయంగా కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పారని గుర్తు చేశారు. లగచర్ల చుట్టూ పక్కల గ్రామాల సమస్య మాత్రమే కాదని, ప్రతీ రైతు తమ దగ్గరకు సమస్య వస్తుందని భయపడుతున్నారని తెలిపారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. రైతులు నక్సలైట్లు కాదని, వాళ్లు వేరే వాళ్ళ భూములు అడగడం లేదని పేర్కొన్నారురేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారని ఈటల పేర్కొన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. రేవంత్‌లా ప్రజలను ఇంతగా ఎవరు హింసించలేదని తెలిపారు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓవైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా.. ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.రేవంత్.. నీ స్థాయి ఎంత?రేవంత్. నీ స్థాయి ఎంత?. హారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో ఒకలా, ఢిల్లీ వెళ్లి మోదీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నావు. ఈ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు. నాలుగు వేల రూపాయలు నెలనెలా ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు. కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుంది. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని స్వయంగా కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలి. చట్టాన్ని మరిచిపోయి బాసుల మాట వింటే తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూములు లాక్కోవడానికి నీ అయ్య జాగీరు కాదు. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గతంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా పనిచేసిన వారు బిల్లుల కోసం పోతే పది శాతం కమిషన్ తీసుకుంటున్నారు సవాల్ స్వీకరిస్తున్నా..హామీల చర్చపై రేవంత్ సవాలును స్వీకరిస్తున్నా. నీ హామీల అమలుపై చర్చకు మోదీ ఎందుకు? ఇక్కడ మేము ఉన్నాం. రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు. మేము సిద్దంగా ఉన్నాం. నీ ఆరు గ్యారంటీలే కాదు.. 420 హామీలపై చర్చిద్దాం.’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
బీజేపీ నేతల లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
-
లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో ములాఖత్ అయిన ఈటల, డీకే అరుణ
-
రేవంత్ సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయి: ఎంపీ ఈటల
సాక్షి, సంగారెడ్డి: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించి, థర్డ్ డిగ్రి ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన బాధిత రైతులను సెంట్రల్ జైలులో సోమవారం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు కలిసి పరామర్శించారు.ఈ ఘటనకు స్కెచ్ వేసింది కాంగ్రెస్ వాళ్లే..ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని.. దీనిపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని చెప్పారు.రైతులకు సంకెళ్లు వేయడం కరెక్ట్ కాదు..‘సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయి. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతులకు సంకెళ్లు, తర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోం’ అని ఈటల హెచ్చరించారు.కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారు: ఎంపీ డీకే అరుణలగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని తెలిపారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకి రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు.పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని, భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని ఆరోపించారు.ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని.. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని తెలిపారు.సీఎం సోదరుడు వెళ్లొచ్చు గానీ మేము వెళ్లొద్దా?భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారు. జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా?సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్? కొడంగల్ వాసులు కాదు.. సీఎం వలస వచ్చారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలి. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణం. సీఎం రేవంత్ అహంకారం వీడాలి.. ఒప్పించి భూములు తీసుకోండి’ అని డీకే అరుణ పేర్కొన్నారు. -
ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి: రేవంత్‌కు ఈటల సవాల్
సాక్షి, నిజామాబాద్: గ్రూప్-1 విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గ జీవో ఇచ్చిందని, 29ని సడలించాలని నిరుద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరి ఏడాది కావస్తోందని.. ఇప్పటి వరకు ఇచ్చినా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు.‘ఏ రైతు అయినా రుణ మాఫీ కాకపోతే రెండు లక్షల రుణం తీసుకోండి రేవంత్ అన్నారు. నేను సీఎం కాగానే మాఫీ చేస్తామని అన్నారు. సూటిగా ఒకటే మాట అడుగుతున్నా. ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు భావిస్తున్నారు. పెంచిన పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లు ఎత్తేస్తున్నారు. దేవుళ్ళ మీద ఒట్లు వేశారు. గట్టు మీద పెట్టేశారు. రిటైర్డ్ అయ్యిన ఉద్యోగులకు సెటిల్ మెంట్లు చేసే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారు.’ అని ఈటల పేర్కొన్నారు. -
రేవంత్ చేస్తున్న పిచ్చి పని.
-
హైడ్రా ఒక డ్రామా.. అవన్నీ అక్రమ నిర్మాణాలు కావు: ఈటల
సాక్షి, హైదరాబాద్: హెడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌పై మరోసారి మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. బఫర్ జొన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేవి మొత్తం ప్రభుత్వ భూములు కావని, పట్టా భూములు కూడా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తున్నవి అన్ని అక్రమ నిర్మాణాలు కావని, హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.కాగా గతంలోనూ బుల్డోజర్లతో ఇళ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు. చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు భూములు లెక్కించాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయని, అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదన్నారు. చెరువులు, వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈటల భేటీ
ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కరోనా సమయంలో పనిచేస్తూ దాదాపు 100 మందికి పైన పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకాలు చేపట్టాని కోరారు.కారుణ్య నియామకాలు ఐదు శాతం మించకూడదన్న నిబంధనను సడలించి , ఈ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
మాల్స్ కట్టి పెద్దలకు ధారాదత్తం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బ్యూ టిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డీపీఆర్ ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? రూ. కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్‌కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు రూ. లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని ఈటల సీఎంను డిమాండ్ చేశారు.స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధమన్నారు. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు తన ప్రతిఘటన ఉంటుందని తెలిపారు. -
రూ. ఐదు కోట్ల భూమికి పరిహారం ఐదు లక్షలేనా?.. కాంగ్రెస్‌పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోర్త్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను తాము అడ్డుకోవడంలేదని క్లారిటీ ఇచ్చారు. నల్లగొండ ప్రజలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ ఈటల గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళన వద్దు అని మేము చెప్పడం లేదు. మూసీ కంపును కడగమని మేమే చెబుతున్నాం. నల్లగొండ ప్రజలు మూసీలో స్వచ్చమైన నీరు పారాలని కోరుకుంటున్నారు. నల్లగొండకు మూసీ కంపు ఉండవద్దని మేము ఆశిస్తున్నాం. హుస్సేన్‌సాగర్ పక్కన జలవిహార్, ఐమ్యాక్స్, పెద్దపెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారు. ఇదే తరహాలో మూసీ బాధితులకు కూడా మంచి స్థలం ఇవ్వాలి.ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ప్రభుత్వం అంటే మీ అయ్య సొత్తు కాదు. ఐదు కోట్ల రూపాయల ఇళ్లు కూలగొట్టి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తారట. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా?. రెండు ఎకరాల భూమి తీసుకుని రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు పరిస్థితి ఏంటి?. గజ్వేల్‌లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ప్రజలు అడ్డామీది కూలీలుగా మారారు. భూమి ఉంటే భద్రత, భరోసా.భూమి లాక్కోని రోడ్డుమీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు.. రజాకార్ సర్కార్ కూడా కాదు. రైతులు దగా పడుతుంటే చూస్తే ఊరుకునేది లేదు. ఫోర్త్ సిటీలో రైతుల నుంచి భూములు లాక్కొని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రైతుల పొట్టకొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి కేవలం మీకు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కొండా సురేఖ కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి -
ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చడమా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్‌కు తప్పకుండా తగులుతుందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమా? అంటూ ప్రశ్నించారు. అలాగే, ప్రభుత్వం ఇప్పడికైనా హైడ్రాపై సమీక్ష చేయాలన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి రాగానే హైడ్రాపై బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తాం. పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. బుల్డోజర్లు ముందుగా మామీద నుండి వెళ్లాలి. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వెళ్తాయి. తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్‌కు తగులుతుంది. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన అధికారులతో మీడియా సమావేశం పెట్టి తప్పును కప్పి పుచ్చుకుంటున్నారు. ఇందిరా రాజ్యం అంటే పేదల ఇళ్ళు కూల్చడమా?. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. భూమి పట్టాలు, లింకు డాక్యుమెంట్స్, గ్రామా పంచాయితీ అనుమతి ఉన్న వారి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. అందులో ఉన్న వాళ్లంతా పేదలే. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. ఇప్పటికైనా హైడ్రాపై ప్రభుత్వం సమీక్ష చేయాలి’ అంటూ కామెంట్స్ చేశారు.మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేక పిల్లి గంతులు వేస్తున్నారు. బ్యాంకులు 73 లక్షల మందికి రుణాలు ఇచ్చామని చెబుతున్నారు.. 48 లక్షల మందికి అని రేవంత్ రెడ్డి చెప్పారు. 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. మేడ్చల్‌లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు బీజేపీ దీక్ష చేపట్టింది. అప్పులపాలై రుణమాఫీ కానీ రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలి. రైతు బంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది. రేవంత్ వాలకం చూస్తుంటే ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచడానికి కలిసికట్టుగా పోరాటం చేద్దాంబీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.. రేపు ధర్నా చౌక్‌లో రైతు దీక్ష చేపడుతున్నాం. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నాం. రైతు హామీల సాధన దీక్షను విజయవంతం చేయడానికి ప్రతీ రైతు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: కూల్చివేతలపై హైడ్రా మరోసారి ఆలోచించాలి: దానం నాగేందర్ -
నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిజాం సర్కార్ కంటే దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శని, ఆదివారాలు చూసుకుని పేదల ఇళ్లను కూల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందిస్తోందా? అని ప్రశ్నించారు.హైడ్రా బాధితులు శుక్రవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిశారు. ఈ సందర్బంగా అక్రమంగా తమ ఇళ్లను కూల్చివేసినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీ ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. రేవంత్ పాలన నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా ఉంది. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారు. శని, ఆదివారాలు చూసుకొని ఇళ్లను కూలగొడుతున్నారు.సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతీ కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు. ఆయనకు వారి ఉసురు తగిలింది అంటారు. పేదల కళ్ళలో నీళ్లు చూసేవారికి ఎప్పుడు మంచి జరగదు. పోయేకాలం వచ్చినట్టుంది కాబట్టే ఎలా ప్రవర్తిస్తున్నారు. పేదలతో పెట్టుకున్న ప్రభుత్వం బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ.. లక్ష కోట్లు పెట్టి మూసీ సుందరీ కరణ చేస్తారట. బట్టలు లేవు కానీ బంగారం కొనిపిస్తా అన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల తీరు. మేక వన్నె పులులు ఎన్నికలప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ఓట్లు అడిగారు. ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దు. నేను ఉన్నంత వరకు మీ పక్షాన కొట్లాడుతాను’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు -
హైడ్రా అంటే ఒక డ్రామా: ఎంపీ ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: హైడ్రా అంటే ఒక డ్రామా అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. పేదల జోలికి వచ్చిన ప్రభుత్వం ఏదీ చరిత్రలో నిలిచిన దాఖలులేవని రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట బోయిన చెరువు చుట్టూ ఇల్లు కట్టుకున్న పేదలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లి.. ఆ ప్రాంతాన్ని ఈటల గురువారం పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా అంటే ఒక డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాలనపై కనీస అవగాహన లేదు. పేదల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వాలు నిలవలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలకు వారికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడెందుకు హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారు.ఒక మంత్రిగానో, ఐదేళ్ల పాటు సరైన ఎంపీగానో పనిచేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేదోళ్ల బాధ తెలిసేది. బఫర్ జోన్లో ఉన్నారంటూ 40 ఏళ్ల తరువాత పేదోళ్ల ఇండ్లకు నోటీసులు ఎలా ఇస్తారు. రేవంత్ ఏదో ఉద్దరిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు పొగడటం సరైన పద్దతి కాదు. పేదల జోలిక వస్తే ఊరుకునేది లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
వారిని భయపెట్టాలనుకుంటున్నారు.. హైడ్రా కూల్చివేతలపై ఈటల ఫైర్
సాక్షి, వికారాబాద్: హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను, మధ్యతరగతి వారిని భయపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. 40, 50 ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో పట్టా భూములకు ప్రభుత్వ అనుమతులతో సామాన్యులు ఇళ్లు కట్టుకున్నారు. సాహెబ్‌నగర్, సరూర్ నగర్, ఫాక్స్‌సాగర్ వద్ద ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఇళ్లు కట్టింది’’ అని ఈటల పేర్కొన్నారు.పెద్దవాళ్లవి కూల్చితే మంచిదే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే పుట్టలేదు. వందల ఏళ్ల నుంచి ఉన్న పార్టీ. ఇప్పుడు ఏదో నాలుగు రోజులు హీరో అన్నట్లు హైడ్రామా చేస్తున్నారు. గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేసి కేసీఆర్ ఫోజులు కొట్టారు’’ అంటూ ఈటల ఎద్దేవా చేశారు. -
రేవంత్ తప్పుల చిట్టా రెడీ.. హైడ్రా ఓ హైడ్రామా: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న తప్పులపై చిట్టాపద్దు సిద్ధం చేస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ పెద్ద బోగస్ అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, మాల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ తప్పులను అవసరం వచ్చినప్పుడు ప్రజల ముందు లెక్కలతో సహా బయటపెడతాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ బోగస్. రుణ మాఫీ చేయని రైతులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నాను. ఎఫ్టీఎల్ భూములు ప్రభుత్వ భూములు కావు.హైడ్రా పేరుతో చేస్తున్న ప్రభుత్వ హైడ్రామా చేస్తోంది. కట్టిన ఇళ్లను ఎందుకు కూల్చివేస్తున్నారు. ఎఫ్టీఎల్లో భూములున్న వారికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలి. బీజేపీలో స్తబ్ధత లేదు.. ఎన్నికల సమయంలో చూపించాల్సిన దూకుడు చూపిస్తాం. సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పెద్ద అబద్ధం. ఇదంతా తప్పుడు ప్రచారం. బీజేపీలో అలాంటి చర్చ జరగలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రేవంత్ పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు:ఈటల
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పాలనలో మరోసారి మోసపోయామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, ఈ ప్రభుత్వం ప్రజల్ని దండుకోవడం తప్ప పరిపాలన చేయడం లేదని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. .. రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి(రాజకీయ పార్టీలు, నేతలు... ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని గతంలో రేవంత్ చెప్పిన మాటల వీడియోను ఈటల ప్రదర్శించారు). ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడుతుంది. విశ్వసనీయత లేని పార్టీలను, మోసం చేసినవాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు అని అన్నారాయన. తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదు. రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్లు. మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదు. పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంతో.. 69 లక్షల మంది రైతులకు నిరాశ ఎదురవుతుంది. రుణ మాఫీ చేస్తానని రేవంత్ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. రూ. 34 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్... ఇప్పుడు నిబంధనల పేరిట రైతులకు సున్నం పెడుతున్నారు. ఇదేకాకుండా.. వరి ధాన్యంకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారు. రైతులను మోసం చేసిన రాజ్యం బాగుపడదు.కాంగ్రెస్ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానం. రైతుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తప్పవు. అప్పుల పేరిట.. శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారు. 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న దొమ్మరోళ్ళ, బిచ్చగాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారు’’ అని ఈటల అన్నారు. ఇక.. తాజా ప్రొటోకాల్ వివాదంపైనా ఈటల స్పందించారు. కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమానికి ఈటలకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఇంతకు ముందే ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు. అయితే తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ.. ‘‘ రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు. కానీ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధుల్ని ఆహ్వానించాలి. కానీ, అధికారులు అలా చేయలేదు. ప్రభుత్వం పిలవలేదు. రేవంత్ తీరును ప్రజలు రికార్డు చేసుకుంటున్నారు’’ అని అన్నారాయన. -
కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ గతే.. మంత్రులకు కాల్ చేస్తే తీయలేదు: ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేటర్ కాంగ్రెస్‌లో చేరడంలేదని అక్రమంగా పేదల ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం అంటూ కామెంట్స్ చేశారు.కాగా, ఈటల రాజేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేస్తోంది. ఫిరోజ్‌గూడలో సాయిప్రియ ఎన్‌క్లేవ్‌లో ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారు. స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్‌లో చేరడంలేదని ఇళ్లను కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చేశారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం.అవి అక్రమ భూములు అయితే ఇన్ని రోజులు ఎందుకు కూల్చివేయలేదు. ప్రభుత్వ అధికారులు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలి. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం హింసకు గురిచేయడం సరైన పద్దతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా పేదలు రోడ్డున పడ్డారు. కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే అధికారం కోల్పోయారు. ఈ సమస్యపై మాట్లాడటానికి అధికారులు, మంత్రులకు ఫోన్ చేస్తే వారు మాట్లాడటం లేదు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటికి ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయలేదు. ప్రభుత్వ చర్యలను కచ్చితంగా అడ్డుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
బీజేపీలో ఏం జరుగుతోంది.. ఈటల Vs రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అదే పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.కాగా, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ స్పందిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవిని అగ్రెసివ్‌గా ఉండే వ్యక్తికి కేటాయించాలని.. అలాంటి వ్యక్తే పార్టీ చీఫ్‌గా ఉండాలన్నారు. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలకు ఈటల కౌంటరిచ్చారు. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు.అలాగే, తాను ఇప్పటికే ఐదుగురు ముఖ్యమంత్రులతో కోట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. సందర్భంగా వస్తే జేజమ్మతో కొట్లాడేటోల్లం అని అన్నారు. ఇంతకన్నా దమ్మున్న వాళ్లు ఎవరు ఉంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ బీజేపీలో ఈటల వర్సెస్ రాజాసింగ్
-
తెలంగాణ BJP కొత్త సారథి ఎవరు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్నదెవరు?
సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్‌రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్‌రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్‌ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్‌కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. -
అమిత్ షాను కలిసిన ఈటల.. బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు?
బీజేపీ నేత, మల్కాజ్గిరి లోక్ సభ ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో తెలంగాణ నుంచి ఎద్దరు ఎంపీలకు మంత్రి పదవులు వరించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయికిషన్రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చని కథనాలు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వంలో పదవిని ఆశించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆశాభంగం తప్పలేదు. ఆయన్ని బుజ్జగించేందుకుగానూ కాషాయపార్టీ బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవిని ఈటలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన అమిత్ షాను కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. -
ఈటల చేతికి తెలంగాణ బీజేపీ పగ్గాలు
-
కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మొదటి దశలో గ్రేటర్ నుంచి మంత్రి పదవి దక్కేదెవరికి? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్న నేపథ్యంలో నగరం నుంచి మోదీతో పాటు ప్రమాణం చేసే అదృష్టవంతుడెవరన్నది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. రాజధాని నగరమైన హైదరాబాద్ పరిసరాల నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురిలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయంగా తెలుస్తోంది. అయితే.. అది ఎవరిని వరించనుందన్నదే ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీలుగా గెలుపొందడం తెలిసిందే. వీరిలో కిషన్‌రెడ్డి రెండో పర్యాయం గెలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయన పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికే కేంద్ర మంత్రివర్గంలో తొలి దశలోనే అవకాశం లభించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కిషన్‌రెడ్డికి ఈసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి లభించనుందనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. అయినప్పటికీ.. తొలుత మంత్రి పదవి అయితే ఇస్తారని, అంతే కాకుండా అధ్యక్ష పదవి కంటే మంత్రిగానే ఆయనకు ప్రాధాన్యమిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ జట్టులో ఆయనతో పాటు ప్రమాణం చేసే మంత్రుల జాబితాలో కిషన్‌రెడ్డి పేరు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టేట్ బాస్‌గా ఈటల? దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం, ప్రస్తుతం సీఎంగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానంలో గెలిచిన ఈటల రాజేందర్‌కు తగిన గుర్తింపునిచ్చేందుకు మంత్రిపదవి ఇస్తారనే అభిప్రాయాలున్నా, తొలిదశలో కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, ఈటలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించలరన్న అభిప్రాయాలు ఉన్నాయి. కిషన్‌రెడ్డి కంటే ముందు పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న బండి సంజయ్ బీసీ కావడంతో త్వరలో నియమించే కొత్త అధ్యక్ష పదవి కూడా బీసీలకే ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఈటలకు ఆ అవకాశం కలి్పస్తారని చెబుతున్నారు. ఏ పారీ్టలో ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యటనలు, కేడర్‌ను కలుపుకుపోవడం, సమన్వయం చేయడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించే అవకాశాలు ఎక్కువని రాజకీయ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. -
మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం
మల్కాజిగిరి: మల్కాజిగిరిలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్‌రెడ్డిపై 3.86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింంది. గత ఎన్నికల్లో స్థానంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.