
సాక్షి, వికారాబాద్: హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను, మధ్యతరగతి వారిని భయపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. 40, 50 ఏళ్ల క్రితమే ఎఫ్‌టీఎల్‌లో పట్టా భూములకు ప్రభుత్వ అనుమతులతో సామాన్యులు ఇళ్లు కట్టుకున్నారు. సాహెబ్‌నగర్, సరూర్ నగర్, ఫాక్స్‌సాగర్ వద్ద ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఇళ్లు కట్టింది’’ అని ఈటల పేర్కొన్నారు.
పెద్దవాళ్లవి కూల్చితే మంచిదే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే పుట్టలేదు. వందల ఏళ్ల నుంచి ఉన్న పార్టీ. ఇప్పుడు ఏదో నాలుగు రోజులు హీరో అన్నట్లు హైడ్రామా చేస్తున్నారు. గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేసి కేసీఆర్ ఫోజులు కొట్టారు’’ అంటూ ఈటల ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment