ravindra reddy
-
కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా?
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పోలీసుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చూపారు? ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వాలని పోలీసు లను ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారంటూ మండిపడింది. రవీంద్రరెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే కింది కోర్టు ముందు హాజరుపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇలాంటి తీరును సహించేదే లేదని తేల్చి చెప్పింది. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా అంటూ పోలీసులను నిలదీసింది. ఎస్పీ తీరు చూస్తే అలాగే అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసు తీవ్రత అర్థమవుతున్నట్లు లేదని, ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులను హెచ్చరించింది. ఆరోపణ లున్నా స్పందించడంలేదంటే ఏమనుకోవాలంటూ నిలదీసింది. రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.పోలీసులు కోర్టునూ తప్పుదోవ పట్టిస్తున్నారుతన భర్తను అక్రమంగా నిర్బంధించారని వర్రా రవీంద్రరెడ్డి భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కళ్యాణి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల అన్యాయాలు, అక్రమ నిర్బంధాలకు అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. అవాస్తవాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. నవంబర్ 8న రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారా? లేదా? అన్న విషయంపై పోలీసులు మాట్లాడటంలేదన్నారు. చట్టం కన్నా, కోర్టుల కన్నా తామే ఎక్కువ అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు.ముఖ్యంగా కడప ఎస్పీపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశామని, ఆయన ఇప్పటివరకు కౌంటర్ వేయలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. అన్నమయ్య జిల్లా ఎస్పీ కౌంటర్ దాఖలు చేశారని, ఆయనే ఇప్పుడు కడప జిల్లాకు ఇన్చార్జి ఎస్పీగా ఉన్నారని తెలిపారు. రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని నిరంజన్‌రెడ్డి కోరగా.. ఆ పని తాము చేయలేమని ధర్మాసనం చెప్పింది. అలా అయితే సంబంధిత జిల్లా జడ్జికి ఆ బాధ్యతలు అప్పగించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. -
హైకోర్టులో వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ
-
వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ భారతి రెడ్డి పీఏ అంటూ టీడీపీ నేతల విషప్రచారం
-
ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు
కడప అర్బన్: తాము చెప్పినట్టు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి మేజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని రవీంద్రారెడ్డి తరఫు న్యాయవాదులు నాగిరెడ్డి, ఓబులరెడ్డి మీడియాకు మంగళవారం తెలిపారు. న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్రా రవీంద్రారెడ్డిని ఈ నెల 4న రాత్రి పోలీసులు కడప తాలూకా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి 41ఏ నోటీసు ఇచ్చారు. తరువాత తనతో వచి్చన న్యాయవాది హరినాథరెడ్డి, స్నేహితుడు మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీంద్రారెడ్డి హైదరాబాద్ వెళ్లారు.కాగా.. ఈ కేసు విషయమై జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు, సీఐని సస్పెండ్ చేశారని తెలిసి అతడు స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు స్నేహితులైన వెంకటసుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిసి కారులో కడప వస్తుండగా.. ఈ నెల 8న కర్నూలు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఓ ఇంట్లోకి రవీంద్రారెడ్డిని తీసుకెళ్లి పోలీసులు విచారించారు. ఆ సమయంలో ఎన్కౌంటర్ చేసేందుకు వెనుకాడబోమని పోలీసులు అతడిని బెదిరించారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వకపోతే భార్యను, కుమార్తెను అథోగతి పాల్జేస్తామని రవీంద్రారెడ్డిని హెచ్చరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, అతడి పీఏ రాఘవరెడ్డి ప్రోద్బలంతోనే వైఎస్ విజయమ్మ, వైఎస్ షరి్మల, వైఎస్ సునీతపై పోస్టింగ్‌లు చేశానని ఒప్పుకోవాలంటూ బలవంత పెట్టారు. తాము చెప్పినట్టు వినకపోతే ఎక్కువగా కేసులను పెట్టి జీవితాంతం జైలులో ఉండేలా చూస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించారు. థర్డ్ డిగ్రీ కారణంగా తన శరీరంపై అయిన గాయాలను మెజిస్ట్రేట్‌కు రవీంద్రారెడ్డి చూపించారు. ఆలస్యంగా వైద్య పరీక్షలు కాగా.. వర్రా రవీంద్రారెడ్డితో పాటు అరెస్టు చేసిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రిమ్స్‌కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అనంతరం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో కడపలోని పులివెందుల కోర్టు ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.మిగిలిన ఇద్దరు నిందితులకు 41ఏ నోటీసులు అందజేసి బెయిల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వర్రా రవీంద్రారెడ్డిని రిమాండ్ నిమిత్తం కడప కేంద్ర కారాగారంలోకి తీసుకెళ్లిన తరువాత రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కడప కేంద్ర కారాగారానికి వర్రాను తరలించారు. కాగా అధికారులు మంగళవారం సాయంత్రం వరకు అతడిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లకపోవడం గమనార్హం. వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌లను అరెస్ట్ చేశాంసాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలను అరెస్ట్ చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఈ ముగ్గురిలో రవీంద్రారెడ్డికి కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిందని తెలిపారు. మిగిలిన ఇద్దరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించిందన్నారు. ఈ వివరాలను హైకోర్టు రికార్డ్ చేసింది. ఇదిలావుంటే.. వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారణ సందర్భంగా గాయపరిచిన విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై రాతపూర్వకంగా అఫిడవిట్ వేయాలని, దానిని పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే రవీంద్రారెడ్డి నిర్బంధానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై అతని భార్య కళ్యాణి, సుబ్బారెడ్డి, ఉదయభాస్కర్‌రెడ్డి నిర్బంధంపై వారి సంబంధీకులు హైకోర్టులో వేర్వేరుగా హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
వర్రా రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకొని టార్చర్ చేశారు
-
సోషల్ మీడియా యాక్టివిస్టులు వర్రా, ఇంటూరి అరెస్ట్
కడప అర్బన్/రాజమహేంద్రవరం రూరల్: అసభ్యకర పోస్టులు పెట్టారనే నెపంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు వర్రా రవీంద్రారెడ్డిని, ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవీంద్రారెడ్డికి సహకరించారనే కారణంతో సుబ్బారెడ్డి, ఉదయ్ అనే వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వర్రా అరెస్ట్‌కు సంబంధించి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, వైఎస్సార్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మీడియాకు వెల్లడించారు. వర్రా రవీంద్రారెడ్డి ఆరేడేళ్ల నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ద్వారా వైఎస్సార్సీపీ వ్యతిరేకులైన వివిధ పార్టీల నాయకులపై తప్పుడు సమాచారం, ఫొటోలు పోస్ట్ చేశాడని చెప్పారు.ఈ మేరకు ఈ నెల 8న పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్ నంబరు 409/24, అండర్ సెక్షన్ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్‌విత్ 3(5) బిఎన్ఎస్ 2023 సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్మెంట్ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న రవీంద్రారెడ్డి కోసం గాలిస్తుండగా ఆదివారం రాత్రి 11.35 గంటలకు ప్రకాశం జిల్లా కుంట– ఆత్మకూరు రహదారిలో దొరికాడని చెప్పారు. రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.అనంతరం వారిని కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తరలించి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెప్పారు. కోర్టులో పిటిషన్ వేసి వర్రాను పోలీసు కస్టడీలోకి తీసుకుంటామని డీఎస్పీ మురళి తెలిపారు. ఇదిలా ఉండగా తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని వారం రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈ నెల 4వ తేది అర్ధరాత్రి వేముల మండలం కొండ్రెడ్డిపల్లెలోని తమ ఇంట్లోకి చొరబడి దౌర్జన్యంగా తన భర్తను తీసుకెళ్లారని చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి తమ అదుపులో లేడని పోలీసులు నాటకమాడారని ఆరోపించారు. పోలీసులు సోమవారం సాయంత్రం వర్రాను మీడియా ఎదుట హాజరు పరిచారు. ఇంటూరి విషయంలో హైడ్రామా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ప్రకాష్‌నగర్ పోలీసులు విశాఖపట్నం వెళ్లి అక్కడ మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న ఆయన్ను అరెస్టు చేసి రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. రవికిరణ్ అరెస్టుపై ఆయన భార్య సుజనకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఎవరి సంతకం లేని ఒక పేపర్ చూపించి రాజమహేంద్రవరం తరలించారు. దీంతో ఆందోళన చెందిన ఆమె హుటాహుటిన సోమవారం తెల్లవారుజామున ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తన భర్త రవికిరణ్ ఆచూకీ తెలపాలని కోరారు. హార్ట్ పేషెంట్ అయిన తన భర్త మందులు వేసుకోవాలని పోలీసుల్ని బతిమాలారు.12 గంటలపాటు స్టేషన్లోనే ఉన్న ఆయన్ని తనకు చూపించాలని కోరారు. అయినా పోలీసులు కనికరించలేదు. సెంట్రల్‌జోన్ డీఎస్పీ రమేష్‌బాబు ప్రకాష్‌నగర్ స్టేషన్‌కి రాగానే ఇన్స్పెక్టర్ బాజీలాల్ ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు. అనంతరం రవికిరణ్ భార్య సుజనను సంతకం చేసేందుకు పిలిచారు. ఏ నేరం చేశారని తన భర్తను అరెస్టు చేశారంటూ సుజన పోలీసులను నిలదీశారు. చివరకు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రవికిరణ్‌కు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టుకు తరలించారు.చెప్పని మాటలను చెప్పినట్లు రాశారు..ఆస్పత్రి ఆవరణలో రవికిరణ్ గద్గదస్వరంతో మీడియాతో మాట్లాడారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లు రిపోర్టులో రాసి, తనతో సంతకాలు తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల సమక్షంలో రాయలేదని, టీడీపీకి పోలీసులు అమ్ముడుపోయారని మండిపడ్డారు. అనంతరం రవికిరణ్‌ను రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు ముందు పోలీసులు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, రవికిరణ్ బెయిల్‌పై బయటకు వస్తే వెంటనే అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు గుంటూరు పట్టాభిపురం, పల్నాడు జిల్లా మాచర్ల పోలీసులు పోలీస్‌స్టేషన్ వద్ద, కోర్టు వద్ద మాటు వేశారు.ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా వెంటనే స్పందిస్తూ.. తను స్థానికంగా లేకపోయినా.. న్యాయవాదులను, పార్టీ నేతలను పోలీస్ స్టేషన్ వద్దకు పంపించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సుజనకు ధైర్యం చెప్పారు. రవికిరణ్‌కు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రీజినల్ కో ఆర్డినేటర్ సాదిక్ హుస్సేన్ తెలిపారు.ఎఫ్ఐఆర్లో బలవంతంగా ఆరుగురి పేర్లుఎఫ్ఐఆర్లో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, దొంతిరెడ్డి ఈశ్వరరెడ్డి, దొంతిరెడ్డి అమర్‌రెడ్డి, సుమారెడ్డి, జైరెడ్డి పేర్లను ఉద్దేశ పూర్వకంగా చేర్చిన ప్రకాష్‌నగర్ ఇన్స్పెక్టర్ బాజీలాల్.. నా భర్త ఇంటూరి రవికిరణ్‌తో దానిపై బలవంతంగా సంతకం చేయించారు. ఈ విషయాన్ని నా భర్త ప్రభుత్వాస్పత్రిలో చెప్పారు. ఇన్స్పెక్టర్ తీరు అసలు బాగోలేదు. నా భర్తపై పెట్టిన తప్పుడు కేసులతో గతనెల 21 నుంచి స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అయినా కేసులకు భయపడేది లేదు. – ఇంటూరి సుజన -
YSR జిల్లా సీకే దిన్నె పీఎస్ లో వర్రా రవీంద్రారెడ్డి
-
వర్రా రవీంద్రారెడ్డి ఆచూకీ చెప్పాలని వర్రా కళ్యాణి డిమాండ్
-
వర్రా రవీంద్రారెడ్డికి టీడీపీ నుండే ప్రాణహాని...?
-
వారిని భయపెట్టాలనుకుంటున్నారు.. హైడ్రా కూల్చివేతలపై ఈటల ఫైర్
సాక్షి, వికారాబాద్: హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను, మధ్యతరగతి వారిని భయపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. 40, 50 ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో పట్టా భూములకు ప్రభుత్వ అనుమతులతో సామాన్యులు ఇళ్లు కట్టుకున్నారు. సాహెబ్‌నగర్, సరూర్ నగర్, ఫాక్స్‌సాగర్ వద్ద ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఇళ్లు కట్టింది’’ అని ఈటల పేర్కొన్నారు.పెద్దవాళ్లవి కూల్చితే మంచిదే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే పుట్టలేదు. వందల ఏళ్ల నుంచి ఉన్న పార్టీ. ఇప్పుడు ఏదో నాలుగు రోజులు హీరో అన్నట్లు హైడ్రామా చేస్తున్నారు. గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేసి కేసీఆర్ ఫోజులు కొట్టారు’’ అంటూ ఈటల ఎద్దేవా చేశారు. -
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ...
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ఘన విజయం సాదిస్తే ఎల్లారెడ్డిలో మాత్రం టిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి ఓడిపోవడం విశేషం. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్ధి జాజుల సురేందర్ 35148 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సురేందర్‌కు 91510 ఓట్లు రాగా, రవీంద్ర రెడ్డికి 56362 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి టి.బాలరాజుకు 9600 పైచిలుకు ఓట్లు వచ్చాయి. సురేందర్ తొలిసారి గెలు పొందారు. ఆయన మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇ.రవీంద్ర రెడ్డి నాలుగుసార్లు గెలిచిన నేతగా నమోదయ్యారు. రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన 2004లో టీఆర్ఎస్ పక్షాన గెలిచి, ఉద్యమంలో బాగంగా 2008లో పార్టీ ఆదేశాల ప్రకారం పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేశారు. కాన ఓటమి చెందారు. ఆ తర్వాత 2009లో తిరిగి గెలిచారు. మళ్లీ ఉద్యమంలో 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. 2014 సాదారణ ఎన్నికలలో కూడా గెలుపొందినా, 2018లో ఓటమి చెందారు. ఎల్లారెడ్డిలో ఆరుసార్లు రెడ్డి నేతలు గెలుపొందితే, మరో ఆరుసార్లు బిసిలు గెలిచారు. వారిలో నలుగురు మున్నూరు కాపు వర్గం వారు కాగా, ఇద్దరు గౌడ వర్గం వారు. మూడుసార్లు ఎస్. సిలు ప్రాతినిధ్యం వహించారు. 1983 తరువాత ఒకే ఒక ఉప ఎన్నికలో 2018లో కాంగ్రెస్ ఐ గెలిచింది. మిగిలిన అన్నిసార్లు టిడిపి, టిఆర్ఎస్లు విజయం సాధించాయి. టిఆర్ఎస్ 2004లో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంటే, 2009లో టిడిపికి మిత్రపక్షం అయింది. 2014 నుంచి ఒంటరిగానే పోటీచేస్తోంది. ప్రముఖ దళితనేత టి.ఎన్.సదాలక్ష్మి ఒకసారి ఇక్కడ, మరోసారి కామారెడ్డిలో గెలిచారు. ఎల్లారెడ్డిలో రెండుసార్లు విజయం సాధించిన జె.ఈశ్వరీబాయి, మాజీ మంత్రి గీతారెడ్డి తల్లీ, కూతుళ్లు, 1978లో ఇక్కడ గెలిచిన బాలాగౌడ్ కొంత కాలం జడ్పి ఛైర్మన్‌గా, నిజామాబాద్ ఎమ్.పిగా కూడా పనిచేశారు. ఇక్కడ గెలిచినవారిలో టిఎన్ సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, బాలాగౌడ్ 1981 తరువాత అంజయ్య, భవనం క్యాబినెట్లలో ఉన్నారు. నేరెళ్ల ఆంజనేయులు కొద్దికాలం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఎల్లారెడ్డిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
టీడీపీ కట్టల్లోకి వైఎస్సార్సీపీ ఓట్లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్‌లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్ అధికారి కేతన్‌గార్గ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు. ఇంతమంది కౌంటింగ్‌లో ఉన్నప్పుడే ఇలా తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపేయడం దారుణమన్నారు. తొలి, రెండో రౌండులో వెయ్యి ఓట్లకు పైగా మెజారిటీ వస్తే, మూడో రౌండు నుంచి 20, 30 ఇలా తూకమేసినట్టు మెజారిటీ రావడంపైనా అనుమానాలున్నాయన్నారు. కాగా, ఒకసారి కౌంటింగ్ పూర్తయి బండిల్స్‌ను కలిపేస్తే తిరిగి లెక్కించడం కుదరదని, అభ్యంతరం వ్యక్తం చేసిన ఏ బాక్స్ అయినా తిరిగి లెక్కిస్తామని రిటర్నింగ్ అధికారి చెప్పారు. -
నమ్మాం.. హిట్ టాక్ వచ్చింది : నటుడు
రవీంద్ర రెడ్డి, వినయ పాణిగ్రాహి, త్రినాథ్ వర్మ, భావన సాగి, స్వాతి మండాది ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ధ్వని’. నాగ దుర్గారావు సానా దర్శకత్వంలో పరమకృష్ణ, సాధన నన్నపనేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో దర్శకుడు దుర్గారావు మాట్లాడుతూ – ‘‘ధ్వని’ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. బాగా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, కష్టపడ్డ సాంకేతిక నిపుణులకు ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మాతలు రాజీ పడకుండా నిర్మించారు’’ అన్నారు. ‘‘ధ్వని సినిమా విడుదలై మంచి టాక్‌తో ముందుకెళుతోంది. సినిమాకు రెస్పాన్స్ రావడంతో స్క్రీన్స్ పెంచాం. సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన పెద్ద సపోర్ట్ ఇది. ఈ సక్సెస్ మా కష్టాన్ని మరచిపోయేలా చేసింది. మేము సినిమా కంటెంట్‌ను నమ్మి విడుదల చేశాం. అందుకు తగ్గట్టుగానే బాగా ఆడుతోంది’’ అన్నారు రవీంద్ర రెడ్డి. -
జర్మనీ గడ్డపై గుజ్జుల రవీంద్రారెడ్డి
ఎర్రెర్రని భావాలతో ఎరుపెక్కిన కళ్లతో తెలుగు నాట రక్తపు చుక్కలు చిందించి జర్మనీలో ఎర్ర కపోతాన్ని ఎగరేశాడు ఓ తెలుగు తేజం. పదిహేనేళ్ల వయస్సులో పోరాటాల భూమిలో అడుగెట్టి జైలు జీవితం గడిపిన చరిత్ర ఆయనది. ఆ అడుగులు దేశాన్ని దాటి విదేశాల్లో ఓ ప్రభంజనం సృష్టించాయి. ‘పనిచేసే వాడే పాలకుడు’ అన్న నినాదంతో పాతకేళ్లుగా జర్మనీలో తిరుగులేని కమ్యూనిస్టు లీడర్‌గా కొనసాగుతున్న మన కనిగిరి నిప్పు కణిక గుజ్జుల రవీంద్రారెడ్డిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ప్రజలు ఓ నాయకుడిని మళ్లీ మళ్లీ ఎన్నుకుంటున్నారంటే.. దానికి కారణం కేవలం ఆ నాయకుడు ప్రజలకు చేస్తున్న సుపరిపాలనే. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ప్రజలకు చేసిన మంచి పనులే మళ్లీ మళ్లీ నన్ను ఎన్నుకునేలా చేశాయని నేను అర్థం చేసుకున్నాను. – గుజ్జల రవీంద్రారెడ్డి సాక్షి, పీసీపల్లి: పోరాట ప్రతిమతో ప్రపంచాన్ని ఈదొచ్చని నిరూపించాడు మన కనిగిరి విప్లవ కెరటం గుజ్జుల రవీంద్రారెడ్డి. తెలంగాణలోని భద్రాచలంలో పుట్టిన గుజ్జల రవీంద్రారెడ్డి స్వస్థలం పీసీపల్లి మండలంలోని ఓ మారుమూల గ్రామమైన నేరేడుపల్లి గ్రామం. రవీంద్రారెడ్డి పెరిగింది, ప్రాథమిక విద్యాభ్యాసం సాగిందంతా కనిగిరిలోనే. ఆయన తండ్రి ప్రముఖ కమ్యూనిస్టు నేత గుజ్జుల యలమందారెడ్డి, తల్లి సరళాదేవి ఓ మహిళా కార్యకర్త. రవీంద్రారెడ్డి 1 నుంచి 7వ తరగతి వరకు కనిగిరి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియట్‌ను హైదరాబాద్‌లోని న్యూ సైన్స్ కాలేజీలో పూర్తి చేశాడు. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం.. రవీంద్రారెడ్డి తండ్రి గుజ్జుల యలమందారెడ్డి సీపీఐ తరఫున కనిగిరి ఎమ్మెల్యేగా మూడు సార్లు, ఒంగోలు ఎంపీగా ఒకసారి గెలుపొందారు. తండ్రి ప్రభావం రవీంద్రాపై బలంగా పడింది. ఎలానైనా సోషలిస్ట్ ఐడియాలజీతో సోషలిస్ట్ దేశాల్లో ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని భద్రుకా కాలేజీలో ఏడాదిపాటు బీకాం చదవాడు. బీకాం వదిలేసి జర్మనీలో మెడిసిన్ చేయాలని నిర్ణయించుకుని 1973 డిసెంబర్లో జర్మనీ వెళ్లాడు. ఏడాదిపాటు జర్మనీ భాషను నేర్చుకుని ఆ తర్వాత అక్కడ మెడిసిన్‌లో చేరాడు. మెడిసిన్ చదువుతున్న రోజుల నుంచే సోషలిస్ట్ భావాలు ఆయన్ను నిరంతరం కదిలిస్తూ ఉండేవి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా ఉద్యమాలు కొనసాగించేవాడు. పదిహేనేళ్ల వయస్సులోనే జైలుకు.. చిన్నతనం నుంచే రవీంద్రారెడ్డి ప్రగతిశీల భావాలతో, సమసమాజం కోసం నిరంతరం పోరాటం చేశాడు రవీంద్రారెడ్డి. పదిహేనేళ్ల వయస్సులో దున్నేవాడిదే భూమి అంటూ నినదించి ఆ పోరాటంలో జైలుకు వెళ్లాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో హైదరాబాద్‌లో అమూల్ బేబీ ఫుడ్ బ్లాక్ మార్కెట్ అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి మరోసారి జైలుకు వెళ్లాడు. జర్మనీలో మెడిసిన్ చేసే సమయంలో పలువురు విదేశీ విద్యార్థులతో కలిసి పోరాటాలు చేశాడు. ఆఫ్రికాలో రోడీషా నల్లవారికి హక్కుల కోసం ఉద్యమించాడు. పాలస్తీనా ప్రత్యేక దేశం కోసం చేసిన పోరాటంలో పాల్గొన్నాడు. వియత్నాంపై అమెరికా యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. ఉద్యమాల్లో ఉంటూనే బెర్లిన్‌లో మెడిసిన్ పూర్తి చేసి తన సేవలు కొనసాగించాడు. జర్మనీలో సంప్రదాయ దుస్తుల్లో ఏనుగు వద్ద రవీంద్రారెడ్డి రాజకీయాల్లో తొలి అడుగే మేయర్‌గా.. 1990వ సంవత్సరం వరకు ఇండియన్ సిటిజన్‌షిప్ ఉండటంతో రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ రవీంద్రా పోటీ చేయలేకపోయాడు. 1993లో జర్మనీ సిటిజన్‌షిప్ రావడంతో ఏకంగా అల్టాండ్స్బర్గ్కి మేయర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాడు. వరుసగా ఐదుసార్లు మేయర్‌గా విజయాన్ని అందుకుని 2019 వరకు అక్కడి ప్రజల మన్ననలు పొందాడు. జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఓ భారతీయుడు ఏకంగా 25 సంవత్సరాల పాటు మేయర్‌గా ఉండి రవీంద్రారెడ్డి చరిత్ర సృష్టించాడు. మేయర్‌గా కొనసాగుతూనే 2004 నుంచి 2009 వరకు జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో జర్మన్ ప్రభుత్వం సాయంతో ఆయన కృష్ణాజిల్లా అవనిగడ్డలో స్కూల్స్, షెల్టర్స్, వంతెనలు, మరుగుదొడ్లు, జాలర్లకు భవనాలు నిర్మించి ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని సముద్రపు ఒడ్డున జాలర్లకు కట్టించిన 220 ఇళ్ల ఓ కాలనీకి రవీంద్రనగర్ అని పేరు పెట్టడం విశేషం. -
వైఎస్సార్సీపీలోకి ‘కనుమూరు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఈయనతోపాటు ఆయన సోదరుడు కనుమూరు హరిచంద్రారెడ్డి, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన బచ్చు నారాయణమూర్తిలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు.. ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్.. టీడీపీతో కుమ్మక్కై పనిచేస్తున్నాయని రవిచంద్రారెడ్డి ఆరోపించారు. ఒక రహస్య ఎజెండాతో కాంగ్రెస్, టీడీపీలు ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. 60–70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల చొప్పున చీల్చడానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అవినీతిని ఎండగట్టి, వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి సర్కారుపై పోరాడాల్సిన కాంగ్రెస్ ఈ తరహా విధానాలు తనకు ఏమాత్రం నచ్చలేదని చెప్పారు. సీఎం చంద్రబాబు రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఆశయాల కోసం పనిచేస్తామని హరిచంద్రారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య, నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, పార్టీ సీఈసీ మెంబర్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'ఆయనను విమర్శించే నైతికత పయ్యావులకు లేదు'
అనంతపురం: వైఎస్ జగన్‌ను విమర్శించే నైతికత టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు లేదని అనంతపురం జడ్పీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల జడ్పీ సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని రవీంద్రారెడ్డి విమర్శించారు. -
క్షీణించిన రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, కడప: ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి త్వరిత గతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని నాలుగు రోజులుగా వైఎస్ఆర్ జిల్లా వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బుధవారం సాయంత్రానికి బాగా నీరసించిపోయారు. రక్తంలో చక్కెర నిల్వలు 54కు పడిపోయినట్లు స్థానిక ప్రభుత్వ వైద్యుడు అనిల్‌కుమార్ తెలిపారు. పరీక్షల అనంతరం బిపీ 160/90, పల్స్ రేట్ 52, బరువు 71 కిలోలు ఉన్నట్లు తెలిపారు. ఫ్లూయిడ్స్ తీసుకోవాలని, లేదంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని సూచించారు. పరిస్థితిని దగ్గరుండి చూస్తున్న కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయనతోపాటు దీక్షలో ఉన్న కమలాపురం మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి బ్లడ్ షుగర్ 53కు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి బ్లడ్ షుగర్ 51కి పడిపోయింది. దీక్షలో ఉన్న నేతల ఆరోగ్యం క్షీణించడంపై నేతలు, కార్యకర్తలు వీరపునాయునిపల్లెలో రాస్తారోకో నిర్వహించారు. -
సోమిశెట్టి హరికృష్ణ కోసం గాలింపు
మారేడుపల్లి(హైదరాబాద్): బాలికపై లైంగికదాడి ఘటనలో నిందితుడిపై నిర్భయ చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు, నిందితుడిని పట్టుకొనేందుకు రెండు ప్రత్యేక బృందాలను బెంగళూరు, కర్నూలుకు పంపినట్టు మారేడుపల్లి ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. వెస్ట్‌మారేడుపల్లిలోని శివఅరుణ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తమ్ముడి కుమారుడైన సోమిశెట్టి హరికృష్ణ ఈనెల 11వ తేదీన అత్యాచారం జరిపినట్లు బాధితురాలు మారేడుపల్లి పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సోమిశెట్టి హరికృష్ణ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అయితే మారేడుపల్లి పోలీసులు ఫిర్యాదును గోప్యంగా ఉంచారు. ఈ వార్తను సాక్షి బుధవారం ప్రచురించింది. దీంతో మారేడుపల్లి పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరిగింది. చేసేదిలేక పోలీసులు నిందితుని కోసం ప్రత్యేక బృందాలను పంపారు. ఇదిలా ఉండగా సోమిశెట్టి హరిక్రిష్ణను ఈ కేసును తప్పించడానికి మాజీ మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఇప్పటికే పోలీసు బాస్‌పై వత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. -
జగన్ పాలనలో మరింత ‘సంక్షేమం’
తండ్రి ఆశయాలకోసం పాటుపడుతున్న జననేత తిరుపతిలో వైఎస్ సోదరుడు రవీంద్రారెడ్డి ప్రచారం తిరుపతి, న్యూస్‌లైన్: పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణపాలన చూశారని, తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతూ మరిన్ని సంక్షేమ పథకాలను అందించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలననూ ఒకసారి చూడండంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ రవీంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎంవీ ఎస్.మణి, మోహన్, శేఖర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ తమ అన్న రాజశేఖరరెడ్డి నిరంతరం పేదల సంక్షేమం కోసమే పాటుపడేవారని గుర్తుచేశారు. డాక్టర్‌గా ఒక రూపాయి ఫజుతోనే పేదలకు వైద్యం అందించారన్నారు. పేదలకు నిరంతరం ఎనలేని సేవలందించాలన్న సంకల్పంతో అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి ఏ నాయకుడూ చేయలేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. పేదల సమస్యలను తెలుసుకుని మరిన్ని సంక్షేమ పథకాలను అందించాలన్న లక్ష్యంతో జోరు వానను సైతం లెక్కచేయకుండా హెలికాప్టర్లో బయలుదేరి తిరిగిరాని లోకాలకు వె ళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేసిన వారిని ఎప్పుడూ ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారన్నారు. వైఎస్ మరణానంతరం టీడీపీ, కాంగ్రె స్ కుమ్మక్కు రాజకీయాలతో రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఎంతగా హింసపెట్టాయో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. తండ్రి ఆశయం కోసం కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే సీమాంధ్ర అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. తిరుపతిలో ఇల్లిల్లూ తిరిగి ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఒక కరుణాకరరెడ్డి మాత్రమేనన్నారు. తిరుపతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దగల సత్తా కరుణాకరరెడ్డికి మాత్ర మే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చాంద్‌బాషా, శివ, మహిళలు పాల్గొన్నారు. -
పొలిటికల్ ఎండ్
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల వ్యూహంలో దిట్టగా పేరుగాంచిన మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పడింది. మైదుకూరు నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన పలు మార్లు మంత్రిగా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అంతటి నేతకు సైతం రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వెరసి రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1978లో ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ వ్యూహాల్లో ఆరితేరారు. తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 335 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గంలో రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ జిల్లా గ్రూపు రాజకీయాల్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గీయుడిగా డీఎల్ రవీంద్రారెడ్డికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. అయితే పదవి కోసం దివంగత నేత వైఎస్సార్‌ను తూలనాడటంతోనే రాజకీయ ఉన్నతి నుంచి క్రమేపి కనుమరుగు అవుతూ వచ్చారని పరిశీలకుల అంచనా. రాజకీయంలో ఎత్తు పల్లాలు... 1978 ఎన్నికల్లో 335 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన డీఎల్ తన రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనే చెప్పవచ్చు. 1994 ఎన్నికల్లో ఓటమి అంచులకు వెళ్లిన ఆయన స్వల్పంగా 28 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అత్యధికంగా 1989లో 33,358 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మైదుకూరులో ప్రతి ఎన్నికల్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభావం డీఎల్‌కు కలిసి వచ్చేదని విశ్లేషకులు పేర్కొనేవారు. అయితే 2009 సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆకస్మికంగా మృతి చెందారు. అనంతరం ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన ఆయన ప్రతి సందర్భంలోను విమర్శిస్తూ వచ్చారు. ఈ పరిణామం రాజకీయంగా జవసత్వాలు కోల్పోవాల్సిన స్థితికి తీసుకొచ్చిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అందులో భాగంగానే 2011 మే8న కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన డిపాజిట్ లాస్ అయ్యారు. ఈ అంశం డీఎల్ రాజకీయ జీవితంలో చెరగని మచ్చగా పలువురు పేర్కొంటున్నారు. అవకాశం వస్తే కూకట్‌పల్లిలో పోటీ... మరో ఛాన్సు దక్కితే హైదరాబాద్‌లోని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి డీఎల్ తన అనుచరులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే కూకట్పల్లి నుంచే పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నిర్వహిస్తానని వివరించినట్లు తెలుస్తోంది. మరో అవకాశం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి... ఇంతకాలం పరస్పర సహకారంతో పయనించాం. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. ఇకపై నా మనుగడ కష్టసాధ్యం. మీ సహకారానికి కృతజ్ఞతలు. రాజకీయంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ మంగళవారం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు సమాచారం. ఖాజీపేటలో ఈనెల 5న కార్యకర్తల సమావేశం పెట్టిన ఆయన అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఖాజీపేటకు చేరుకోవడంతో పలువురు అనుచరులు వెళ్లి కలిశారు. ఇకపై మైదుకూరులో పోటీ చేసేది లేదంటూ తేల్చి చెప్పినట్లు తెలిసింది. మీరంతా మీ రాజకీయ ఉన్నతికి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపండని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఎవరి రాజకీయదారులను వారు ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా దువ్వూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుడిపాడు బాబు, మాజీ సర్పంచ్‌లు వెంకటేశ్వరరెడ్డి (భీమునిపాడు), రామచంద్రారెడ్డి (జొన్నవరం), రామసుబ్బారెడ్డిలతో బాటు మరో 10 పంచాయతీల్లో కాంగ్రెస్ నేతలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు పొందిన డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ చాప్టర్‌కు తెర పడిందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన సిమెంట్ డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సిమెంట్ ధరల్లో పెరుగుదల కనిపిస్తున్నా, రాష్ట్రంలో ఆ మేరకు పెరగడం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సిమెంట్ వినియోగమూ తగ్గిపోయింది. గతేడాది ఇదే కాలంలో నెలకు సుమారు 20 లక్షల టన్నుల సిమెంట్‌ను వినియోగిస్తే ఇప్పుడది 11-12 లక్షల టన్నులకు పడిపోయిందని సిమెంట్ కంపెనీ ప్రతినిధులు వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్రాండెడ్ సిమెంట్ బస్తా ధర రూ.290 పలుకుతోంది. కానీ గతేడాది ఇదే కాలానికి ధర రూ.300పైన పలికేది. కనిష్ట స్థాయిల నుంచి ధరలు కొద్దిగా పెరిగినా గతేడాదితో పోలిస్తే ఇప్పటికీ తక్కువ ధరలోనే ఉన్నాయని భారతీ సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీంద్ర రెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా దీపావళి పండుగ తర్వాత సిమెంట్‌కి డిమాండ్ పెరుగుతుందని, కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదని పేరు రాయడానికి ఇష్టపడని ఇంకొక కంపెనీ ప్రతినిధి తెలిపారు. రాష్ట్ర విభజనకు తోడు, తుపాన్లు, వర్షాలు కూడా ఈ సారి సిమెంట్ డిమాండ్‌ను దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం 60% కూడా వినియోగించకపోవడం పరిస్థితికి నిదర్శనం. కానీ దీనికి భిన్నంగా ఉత్తర, పశ్చిమ భారత దేశంలో సిమెంట్ ధరలు రెండు నెలల్లో బస్తాకి రూ.40-60 వరకు పెరిగాయి. సాధారణంగా హైదరాబాద్ ధర కంటే తక్కువ రేట్లు ఉండేవని, కానీ ఇప్పుడు ముంబైలో బస్తా రూ.320 వరకు పలుకుతోందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇక్కడ కంపెనీలు 80-90% వరకు సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి 4 లక్షల టన్నులకు ఆర్డర్లు ఇవ్వడంతో డిసెంబర్ తర్వాత డిమాండ్ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. రూ. 325 దాటితేనే లాభాలు పెరిగిన విద్యుత్ టారిఫ్‌లు, ముడిసరుకుల ధరలతో సిమెంట్ కంపెనీల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో సిమెంట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాది క్యూ2 లో రూ.49 కోట్లు లాభాలు ప్రకటించిన ఇండియా సిమెంట్స్ ఈ ఏడాది రూ.22 కోట్ల నష్టాల్లోకి జారింది. రామ్‌కో సిమెంట్స్ లాభాలు 86% క్షీణించి రూ.18.3 కోట్లకు పడిపోయాయి. విద్యుత్ టారిఫ్‌లు పెరగడం, పెరిగిన వడ్డీరేట్లు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బస్తా సిమెంట్ ధర కనీసం రూ.325 దాటితే కానీ లాభాలు వచ్చే పరిస్థితి లేదని సిమెంట్ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ధర పలకడం కష్టంగా ఉండటంతో ఈ ఏడాదీ సిమెంట్ కంపెనీలకు నష్టాలు తప్పవని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
అనుమానం.. ఆస్తి తగాదాలే కారణం
నాగోలు, భానుపురి, న్యూస్‌లైన్: కిరాయి హంతకులతో కలిసి భార్యను, కుమారుడిని హత్య చేసిన కేసులో భర్తతో పాటు కిరాయిహంతకుడిని ఎల్బీనగర్ పోలీసులు గురువారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం, ఆస్తిని అమ్మకుండా అడ్డుకుందనే కక్షతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు భర్త వెల్లడించాడు. ఎల్బీనగర్ క్రైం సీఐ రవీంద్రారెడ్డి కథనం ప్రకారం... సూర్యాపేట కుడకుడకు చెందిన గుర్రం శశిధర్‌రెడ్డి(40)కి నార్కట్‌పల్లి మండలం నెమ్మానికి చెందిన విజయలక్ష్మి(38)తో 1996లో పెళ్లైంది. వీరికి కు మారుడు సాకేత్‌రెడ్డి(13) సంతానం. వీరు సూర్యాపేట అంజనాపురికాలనీలో ఉండేవారు. విజయలక్ష్మి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో శశిధర్‌రెడ్డి ఆమెను తరచు వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. మే నెలలో సూర్యాపేటకు చెందిన విజయను శశిధర్‌రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతనిపై మొదటి భార్య విజయలక్ష్మి సూర్యాపేట ఠాణాలో కేసుపెట్టింది. పోలీసులు శశిధర్‌రెడ్డి రిమాండ్‌కు తరలించారు. సూర్యాపేటలో శశిధర్‌రెడ్డికి సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులున్నా యి. వాటిని అమ్మడానికి యత్నించగా విజ యలక్ష్మి అడ్డుకుని కోర్టులో కేసు వేసింది. ఈనేపథ్యంలో గొడవలు జరుగుతుండడం తో విజయలక్ష్మి కుమారుడు సాకేత్రెడ్డిని తీసుకుని నగరానికి వచ్చేసింది. నాగోలు సాయినగర్‌లోని సాయిమిత్ర అపార్ట్మెం ట్లో ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఉంటోంది. కొడుకును నారాయణ పాఠశాలలో 8వ తరగతి చదివిస్తోంది. ఆస్తి విషయంలో తనకు అడ్డుగా ఉన్న విజయలక్ష్మిని చంపేయాలని శశిధర్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన అక్కలు విజయ, సుజాత, విమల, పెద్దమ్మ సునందలకు చెప్పగా.. వా టరు విజయలక్ష్మిని చంపేయని, నీకు అం డగా ఉంటామన్నారు. దీంతో అతను తుం గతుర్తి మండలం గరుడవెల్లికి చెందిన మాజీ రౌడీషీటర్, మూడు హత్య కేసులలో ప్రధాన నిందితుడైన పోనుగంటి మధుసూదన్‌రావును సంప్రదిం చాడు. తన భార్యను చంపితే రూ.4 లక్షలు సుపారీ ఇస్తానని చెప్ప గా అతను అంగీకరించాడు. ప్రస్తుతం వరంగల్జిల్లా బేతవోలులో ఉంటున్న మధుసూదన్‌రావు అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ భుజంగరావుకు విషయం చెప్పగా.. అతను నాలుగు వేటకొడవళ్లను సిద్ధం చేశాడు. తర్వాత రామంతాపూర్‌కు చెందిన మోహన్, సూర్యాపేటకు చెందిన కనకరత్నంతో కలిసి విజయలక్ష్మి హత్యకు పథకం పన్నారు. ఈనెల 22న శశిధర్‌రెడ్డితో పాటు ఐదుగురూ కలిసి వనస్థలిపురంలోని మనోహర్ లాడ్జిలో దిగారు. -
నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించిన ఉపాధ్యాయుల సస్పెన్షన్
ఖమ్మం, న్యూస్‌లైన్: విద్యాశాఖలో పనిచేస్తున్న వారి ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును ఆసరాగా తీసుకుని నకిలీ మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించి బిల్లులు కాజేసిన ఏడుగురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై వేటుపడింది. వారిని సస్పెండ్ చేస్తూ బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి రవీంద్రనాధ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై క్రిమినల్చర్యల కోసం పోలీస్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు డీఈవో తెలిపారు. అక్రమార్కులకు సహకరించిన నలుగురు ఉన్నతాధికారులపై చర్యల కోసం ఆర్జేడీకి సిఫారసు చేసినట్లు కూడా తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో బి.వెంకటరత్నం-ఎస్జీటీ, యూపీఎస్ నందిపాడు.., పి.వెంకటేశ్వరరావు-స్కూల్ అసిస్టెంట్, జడ్పీఎస్ఎస్ కందుకూరు.., వి.నగేష్- ఎస్జీటీ, పీఎస్ నాచారం.., టి.వెంగళరావు- ఎస్జీటీ, పీఎస్ నార్లవరం.., ఎం.వెంకటేశ్వర్లు- ఎస్జీటీ, పీఎస్ తిర్లాపురం.., చలమారావు-ఎస్జీటీ, పీఎస్ యర్రబోడు.., పి.జానీ- గ్రేడ్-2 హిందీపండిట్, ముత్తగూడెం.., ఎం.వెంకటేశ్వర్లు- స్కూల్ అసిస్టెంట్, ప్రభుత్వ పాఠశాల, చర్ల ఉన్నారు. -
6వ రోజుకు చేరుకున్న YSRCP నేతల దీక్ష