ఎల్లారెడ్డి నియోజకవర్గం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టిఆర్‌ఎస్ ఘన విజయం సాదిస్తే ఎల్లారెడ్డిలో మాత్రం టిఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి ఓడిపోవడం విశేషం. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్ధి జాజుల సురేందర్ 35148 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సురేందర్‌కు 91510 ఓట్లు రాగా, రవీంద్ర రెడ్డికి 56362 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి టి.బాలరాజుకు 9600 పైచిలుకు ఓట్లు వచ్చాయి. సురేందర్ తొలిసారి గెలు పొందారు. ఆయన మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరిపోవడం విశేషం.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇ.రవీంద్ర రెడ్డి నాలుగుసార్లు గెలిచిన నేతగా నమోదయ్యారు. రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన 2004లో టీఆర్‌ఎస్ పక్షాన గెలిచి, ఉద్యమంలో బాగంగా 2008లో పార్టీ ఆదేశాల ప్రకారం పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేశారు. కాన ఓటమి చెందారు. ఆ తర్వాత 2009లో తిరిగి గెలిచారు. మళ్లీ ఉద్యమంలో 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. 2014 సాదారణ ఎన్నికలలో కూడా గెలుపొందినా, 2018లో ఓటమి చెందారు. ఎల్లారెడ్డిలో ఆరుసార్లు రెడ్డి నేతలు గెలుపొందితే, మరో ఆరుసార్లు బిసిలు గెలిచారు. వారిలో నలుగురు మున్నూరు కాపు వర్గం వారు కాగా, ఇద్దరు గౌడ వర్గం వారు. మూడుసార్లు ఎస్. సిలు ప్రాతినిధ్యం వహించారు. 1983 తరువాత ఒకే ఒక ఉప ఎన్నికలో 2018లో కాంగ్రెస్ ఐ గెలిచింది.
మిగిలిన అన్నిసార్లు టిడిపి, టిఆర్‌ఎస్‌లు విజయం సాధించాయి. టిఆర్‌ఎస్ 2004లో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంటే, 2009లో టిడిపికి మిత్రపక్షం అయింది. 2014 నుంచి ఒంటరిగానే పోటీచేస్తోంది. ప్రముఖ దళితనేత టి.ఎన్.సదాలక్ష్మి ఒకసారి ఇక్కడ, మరోసారి కామారెడ్డిలో గెలిచారు. ఎల్లారెడ్డిలో రెండుసార్లు విజయం సాధించిన జె.ఈశ్వరీబాయి, మాజీ మంత్రి గీతారెడ్డి తల్లీ, కూతుళ్లు, 1978లో ఇక్కడ గెలిచిన బాలాగౌడ్ కొంత కాలం జడ్‌పి ఛైర్మన్‌గా, నిజామాబాద్ ఎమ్.పిగా కూడా పనిచేశారు. ఇక్కడ గెలిచినవారిలో టిఎన్ సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, బాలాగౌడ్ 1981 తరువాత అంజయ్య, భవనం క్యాబినెట్‌లలో ఉన్నారు. నేరెళ్ల ఆంజనేయులు కొద్దికాలం చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.
ఎల్లారెడ్డిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment