నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్దన్ 2018లో మరోసారి గెలిచారు. ఆయన అంతకుముందు ఒకసారి ఆర్మూరులోను, మరోసారి బాన్స్‌వాడలోను విజయం సాదించారు. బాజిరెడ్డి మొత్తం నాలుగుసార్లు గెలిచినట్లయింది. 2014 ఎన్నికల ముందు అనూహ్యమైన రీతిలో బాజిరెడ్డి గోవర్దన్ టిఆర్‌ఎస్‌లో చేరి కాంగ్రెస్ ఐ ప్రముఖ నేత డి.శ్రీనివాస్‌ను ఓడిరచారు. తిరిగి మరోసారి ఇక్కడే ఆయన కాంగ్రెస్ ఐ సమీప ప్రత్యర్ది భూపతి రెడ్డిపై 25655 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భూపతి రెడ్డి టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతో కాంగ్రెస్ ఐలోకి మారి ఓటమి చెందారు.
బాజిరెడ్డి గోవర్ధన్‌కు 87756 ఓట్లు రాగా భూపతి రెడ్డికి 57911 ఓట్లు వచ్చాయి. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన కేశుపల్లి ఆనందరెడ్డికి పదహారువేల పైచిలుకు ఓట్లు లభించాయి. బాజిరెడ్డి గోవర్ధన్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. గతంలో డిచ్ పల్లి నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం నేతలు అత్యధికసార్లు గెలిచినా, ప్రస్తుతం మున్నూరు కాపు వర్గం నేతలకు అవకాశం వచ్చింది. ఈ నియోజకవర్గం పునర్విభజన జరిగిన తర్వాత నిజామాబాద్ రూరల్‌గా మారింది. అంతకుముందు డిచ్‌పల్లి పేరుతో ఉండేది.
రద్దయిన డిచ్‌పల్లి, ఇప్పటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏడుసార్లు కమ్మ సామాజికవర్గం నేతలు గెలుపొందితే, రెండుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసి(మున్నూరుకాపు) నేతలు ఎన్నికయ్యారు. సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఐదుసార్లు విజయం సాధించారు. రద్దు అయిన డిచ్‌పల్లిలో ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐ రెండుసార్లు, టిడిపి ఐదు సార్లు, సోషలిస్టు పార్టీ మరోసారి గెలిచాయి.1983 నుంచి 2009 వరకు ఒక ఉప ఎన్నికలో తప్ప కాంగ్రెస్ ఎన్నడూ గెలవలేకపోయింది.
మండవ వెంకటేశ్వరరావు గతంలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. టిఆర్‌ఎస్ పక్షాన 2004లో గెలిచిన గంగారెడ్డి అంతకుముందు టిడిపి తరుఫున మూడుసార్లు ఎమ్.పి.గా నెగ్గారు. 1991లో టిడిపి ఎమ్.పిగా గెలిచిన ఈయన పి.వి. ప్రభుత్వాన్ని రక్షించడానికి ఆయనకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ఐలోకి వెళ్లారు. 1998లో తిరిగి టిడిపిలోకి వచ్చి మరో రెండుసార్లు ఎమ్‌పి అయ్యారు. 2004 నాటికి టిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఈ పార్టీకి కూడా దూరం అయ్యారు. 2008 ఉప ఎన్నికలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన ఆకుల లలిత గెలిచారు. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో ఆమె ఆర్మూరులో పోటీచేసి ఓడిపోయారు. తదుపరి ఆమె టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు.
నిజామాబాద్ రూరల్‌లో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment