బాన్స్ వాడ నియోజకవర్గం చరిత్ర ఇది
సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోసారి విజయం సాదించి 2018లో స్పీకర్ పదవిని అదిష్టించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. బాన్స్‌వాడలో 2009 నుంచి వరసగా గెలుస్తున్న పోచారం 1994,99లలో కూడా గెలిచారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రి వర్గంలో ఆయన పనిచేశారు. పోచారం తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది కామల బాలరాజ్‌పై 18485 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. పోచారానికి 77343 ఓట్లు రాగా, బాలరాజ్‌కు 59458 ఓట్లు వచ్చాయి. టిడిపితో రాజకీయ జీవితాన్ని ఆరంబించిన పోచారం 2009లో టిడిపి పక్షాన గెలిచి, ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన ప్రకాష్ నాయిడుకు మూడువేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి.
బాన్స్‌వాడలో గెలిచిన పోచారం రెడ్డి సామాజికవర్గం వారు. బాన్స్‌వాడలో ఏడుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు విజయం సాధిస్తే, మూడుసార్లు బిసి నేతలు, నాలుగు సార్లు కమ్మ సామాజికవర్గం నేతలు, ఒకరు ఎస్.టి కాగా ఒకరు ఇతర వర్గాల నుంచి ఎన్నికయ్యారు. 1952లో ఏర్పడిన బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిపి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి ఆరుసార్లు, టిఆర్‌ఎస్ మూడుసార్లు విజయం సాధించాయి. 1983లో టిడిపి ఆవిర్భావం తరువాత ఒకసారి తప్ప రెండువేల తొమ్మిది వరకు ఆ పార్టీనే గెలిచింది ఒక్క 2004లోనే ఇక్కడ ఓడిపోయింది. ఆ తర్వాత టిఆర్‌ఎస్ కైవసం అయింది.
1967 నుంచి ఇక్కడ కాంగ్రెస్ తరుఫున శ్రీనివాసరావు మూడుసార్లు గెలిచారు. ఆయన బోధన్ నుంచి కూడా ఒకసారి గెలిచారు. శ్రీనివాసరావు కొంతకాలం అంజయ్య మంత్రివర్గంలో ఉన్నారు. పరిగి శ్రీనివాసరెడ్డి రెండుసార్లు చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అప్పట్లో స్టేషనరీ కుంభకోణానికి న్కెతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసారు. 1952, 57లలో ఇక్కడ మహిళా అభ్యర్దులు గెలుపొందగా, 1957లో సీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004లో బాన్స్ వాడలో గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ అంతకుముందు 1999లో ఆర్మూరులో నెగ్గారు. 2014,2018లలో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీచేసి గెలుపొందారు.
బాన్స్ వాడలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment