Srinivasa Reddy
-
ఫామ్‌హౌజ్‌కి పోయి 8 ఏళ్లు అవుతోంది: పోచంపల్లి
సాక్షి, హైదరాబాద్: ఫామ్‌హౌస్ వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు.ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫామ్‌కు యజమానికిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా కూడా చేర్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
అక్కరలేని మనిషి
ఆడవాళ్ళు ఆయన్ని ‘బాబాయిగారు’ అని పిలుస్తారు. మగవాళ్ళలో కొందరు ‘రెడ్డిగారు’ అని పిలిస్తే, మరికొందరు రావుగారు అని, ఇంకొందరు మూర్తిగారు అని పిలుస్తారు. కుర్రాళ్లు ‘అంకుల్’ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా, ఆయన అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ, వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోతాడు .ఆయన అసలు పేరు ఎవరికీ తెలియక పోయినా, ఆయన మొబైల్ నెంబరు మాత్రం ఆ అపార్టుమెంటు వాసులందరికీ సుపరిచితమే!ఆ ఒక్క అపార్టుమెంటే కాదు, అక్కడ ఉన్న నాలుగైదు అపార్టుమెంట్లలో కరెంటు రిపేర్లు, నీళ్ళ ట్యాపులు, సెప్టిక్ టాంకులు, బాత్రూమ్ కమోడ్లు, చెక్క పనులు– ఇలా ఒకటేమిటి, సమస్త రిపేర్లకు ఎవరైనా సరే పిలిచేది ఆయన్నే! ఇంత పెద్ద నగరంలో ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరా అని మీకు అనుమానం రావచ్చు. రిపేర్లు ఎవరైనా చేస్తారు. కాని, అడిగిన వెంటనే రావటం; సకాలంలో పని పూర్తి చెయ్యటం; డబ్బులు డిమాండు చెయ్యకుండా ఎవరు ఎంతిచ్చినా చిరునవ్వుతో ‘పర్లేదులెండి’ అంటూ తీసుకోవటం వల్ల అందరూ వాళ్ళ ఇళ్ళలో ఏ రిపేరు పని వచ్చినా ఆయన్నే పిలుస్తారు.కొంతమంది ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని, పని చేయించుకుని కూడా డబ్బులిచ్చే వాళ్ళు కాదు. ఆయన కూడా, ‘అలాగేనండి, మీ దగ్గర డబ్బులెక్కడికి పోతాయి’ అంటూ నవ్వేసి వెళ్ళిపోయేవాడు .‘అదేమిటండీ వాళ్ళు అలా మీ చేత పని చేయించుకుని, డబ్బులు తరువాత ఇస్తామంటే ఊరుకుంటారు’ అని అడిగితే, ‘ఏమోలే సార్! వాళ్ళకే ఇబ్బంది వుందో! వాళ్ళకు వీలైనప్పుడు ఇస్తారు లెండి’ అనేవాడు. నాకు మాత్రం ఇతరుల కష్టం ఉంచుకోవటం ఇష్టం వుండదు. ఏ చిన్న పని చేసినా, మా ఇంట్లో ఆయన అడక్క ముందే డబ్బులిచ్చేసేవాడిని. ఆయనే , ‘ఎందుకు సార్, నేనేం పెద్ద పని చేశానని ఇంత పెద్దమొత్తం ఇచ్చారు’ అంటూ తిరిగి ఇవ్వబోయే వాడు. ఆయన మంచితనాన్ని నేనేనాడూ అలుసుగా తీసుకోలేదు. ఆయనంటే నాకు మా ఇంట్లో మనిషి అనే భావన వుండేది. మా నాన్నది ఆయనది ఒకటే వయసు. నాన్న లేకపోవటం వల్ల అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడితే నాన్నతో మాట్లాడినట్లే వుండేది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన హాజరు తప్పనిసరి. భోజనానికి రమ్మని, వాళ్ళ ఆవిడని కూడా తీసుకు రమ్మని మా ఆవిడ మరీ మరీ చెప్పేది. కాని ఆయన మాత్రం ఒక్కడే, సిగ్గుపడుతూ వచ్చేవాడు, ఆ రోజు మా ఇంట్లో ట్యాపు రిపేరు చేసి వెళ్తు వెళ్తూ, ‘సార్, ఓ సెకండ్ హ్యాండ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు చౌకగా అమ్మకానికి వచ్చింది’ అన్నాడు.‘మరింకేం బాబాయిగారు, తీసుకోక పోయారా?’ మా ఆవిడ ప్రోత్సహించింది.‘అదేనమ్మా! తీసుకుందామనే వుంది. కాకపోతే, ఓ యాభైవేలు తగ్గాయి’ నసుగుతూ నావంక చూశాడు.‘యాభై వేలే కదండి, సర్దుతాలెండి’ పెద్దాయనకు భరోసా ఇచ్చాను. ‘సంతోషం సార్! మీ బాకీ చిన్నగా తీర్చుకుంటాను, వుంటాను‘ అంటూ నిష్క్రమించాడు.‘ఆయన గుమ్మం దాటి వెళ్ళాడని నిర్ధారించుకుని, ‘ఏమిటి, నన్నడగకుండా అలా మాట ఇచ్చేయటమేనా?’ మా ఆవిడ నిలదీసింది. ‘నువ్వే కదోయ్, బాబాయిగారు! తీసుకోండి అన్నావు. నీకు ఇష్టమేనని మాట ఇచ్చాను’ చిన్నగా గొణిగాను. ‘ఎదో మాటవరసకు అంటాము. అన్నంత మాత్రాన ఉళ్ళోవాళ్ళకి ఊరికినే డబ్బులిచ్చేస్తామా, ఏమిటి?’ అంది మా ఆవిడ.‘ఆయన మనకు ఎప్పటినుండో తెలుసు. ఆయన్ని చూస్తే మా నాన్నను చూసినట్టే వుంటుంది. మా నాన్నకు సాయం చేశాను అనుకో’ అన్నాను. ఆ మాటలతో, ఆవిడ చల్లబడింది. ‘ఔను, మనల్ని ఉబ్బులడుగుతున్నాడు, ఆయనకు పిల్లలు లేరా?’ అనుమానంగా అడిగింది. ‘లేకేం, వున్నాడులే ఓ సుపుత్రుడు. హైదరాబాద్‌లో ఏదో పని చేస్తుంటాడు. వాడికే ఈయన నెలనెలా ఉబ్బులు పంపిస్తుంటాడు. ఇంక వాడేం సాయం చేస్తాడు?’ తేల్చి పారేశాను‘పెళ్ళయిందా?’‘ఆ అవ్వకేం, అయ్యింది. ఒక పిల్లాడు కూడా. వాడే సరిగ్గా వుంటే, ఆయనకు ఈ తిప్పలెందుకు చెప్పు?’ శ్రీమతికి అంతా వివరంగా చెప్పిన తరువాత ఇంక ఆవిడ మౌనంగావుండిపోయింది.‘అంతా కలిపి ఒకేసారి ఇస్తాం లెండి‘ ఎదురింటి ఆవిడ ఏమి రిపేరు చేయించుకుందో ఏమో, ఆయనతో అంటూ వుంటే, వరండాలో కూర్చున్న నా చెవిన బడింది ‘లేదమ్మా, కాస్త అవసరం పడింది. ఈమధ్యే ఓ ఇల్లు కొనుక్కున్నాను. అప్పలున్నాయి, తీర్చాలి’ ఆయన మాటలు ఆవిడకే కాదు, నాకు ఆశ్చర్యం అనిపించినా, నా అప్పు తీరబోతుందని సంతోషం వేసింది. ‘అదేమిటండీ. మేమిచ్చే పది, ఇరవైతోనే మీ అప్పులన్నీ తీరతాయా?’ నిష్ఠూరంగా అందావిడ. ‘లేదండి, పాతబాకీ, ఇప్పటిదీ అన్నీ కలిపి రెండువేల దాకా అయ్యిందండీ మీ బిల్లు’ చెప్పాడు పెద్దాయన.‘రెండువేలా? అంత ఎందుకు అవుతుందండి?’ అంటూ రుసరుస లాడింది.‘లేదమ్మా, ఇదిగో మీకు ఏమేం పనులు చేశానో, వాటికి సామాన్లు ఎంతయ్యాయో అన్నీ వివరంగా రాశాను’ అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఆవిడకిచ్చాడు పెద్దాయన.ఓ క్షణం ఆ కాగితం వంక ఎగాదిగా చూసి, ‘ఇవన్నీ మేము చేయించుకున్నామా?’ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘అవునమ్మా! మీరు చేయించుకున్నవే! పక్కన తారీఖులు కూడా వేశాను’ అన్నాడు పెద్దాయన.ఇక తప్పదన్నట్టు, ‘సరేనండి, ఇంట్లో మావారు లేరు. సాయంత్రం రండి’ అంటూ తలుపేసుకుంది.ఇక చేసేదేమీలేక పెద్దాయన చిన్నగా నిట్టూరుస్తూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడని నిర్ధారించుకుని, బయటకొచ్చి, ఒకసారి అటూ ఇటూ చూసి పక్కింటివాళ్ళ తలుపు కొట్టింది. పక్కింట్లో నుంచి బయటకొచ్చిన మరో పెద్దావిడతో ‘చూశారా పిన్నిగారు! ఆయనేదో మంచివాడు అనుకున్నామా’ అంటూ ఆగింది. ‘ఇప్పుడేమైంది’ అన్నట్టు ఆవిడ మొహం పెట్టింది.‘మనకేదో ఉచితంగా సాయం చేస్తున్నాడనుకున్నాం కాని, ఈరోజు రెండువేలు బిల్లంటూ పట్టుకొచ్చాడు’ అంది కాస్త నీరసంగా. ‘అవునమ్మ, మాకూ వేశాడు, ఎప్పుడో మా తాతలకాలం నుండి రిపేర్లు చేస్తున్నాడట! మూడువేలు అంటూ వసూలు చేసుకెళ్ళాడు’ అంది పక్కింటి పెద్దావిడ మరింత నీరసంగా.ఇద్ద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే, అది ప్రపంచం మొత్తం పాకిపోతుంది అన్నట్టు ఆ వార్త ఆగమేఘాల్లో అపార్టుమెంటు మొత్తం పాకిపోయింది. ప్రతి ఒక్కళ్ళూ ఆయన్ని తిట్టు కోవటమే! దాదాపు ఓ యాభై ఇళ్ళవాళ్లైనా పెద్దాయనకు బాకీ వుండి వుంటారు. ఇంటికి రెండువేలు వేసుకున్నా, లక్ష అవుతుంది. అంటే నా బాకీ త్వరగా తీరబోతుంది అని ఆనందంగా వున్నా, అందరూ ఆయన్ని తిట్టుకోవటం కాస్త బాధ అనిపించింది. ఈ మనుషుల మనస్తత్వమే అంత. ఉచితంగా సేవలు చేస్తే రాముడు, దేవుడు అంటూ పొగుడుతారు. అదే చేసిన పనికి డబ్బు అడిగితే రాక్షసుడిలా చూస్తారు. ఆరోజు నుంచి అపార్టుమెంట్‌లోని వాళ్ళు తమ పనులకు ఆయన్ని పిలవటం తగ్గించారు. అసలు నన్నడిగితే తప్పు వాళ్ళది కాదు, పెద్దాయనదే! పని చేసినప్పుడు ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకునుంటే ఎవ్వరికీ ఏ బాధ వుండేది కాదు. అంతా కలిపి ఒక్కసారి కట్టమని అడిగితే, ఇప్పుడు అందరూ ఆయన్ని ఓ అప్పులోడి కింద చూస్తున్నారు. బహశా అసలు డబ్బులు అడగడులే అనుకున్నారో ఏమో!ఎవరిదో అన్నోన్ నంబరు అదే పనిగా రింగ్ అవుతుంది. ఎవరై వుంటారబ్బా అని అనుకుంటూ ఎత్తాను.‘సార్ శ్రీనివాసరావుగారేనా? ‘అవతలి నుంచి ఎవరో ఆడగొంతు.‘అవునండి!’ సమాధానం ఇచ్చాను. ‘ఉదయ్ హాస్పిటల్స్ నుంచండి, మీ బంధువు ఒకాయన రాత్రి గుండెనొప్పితో హాస్పిటల్లో చేరారు. ఎవరన్నా వున్నారా అని అడిగితే మీ నంబరు ఇచ్చారు’ చెప్పుకు పోతోంది ‘నా బంధువా? గుండెనొప్పితో హాస్పిటల్లో చేరాడా? ఎవరై వుంటారు?’ అప్పటి దాకా ప్రశాంతంగా వున్న నా మనసులో ఆందోళన మొదలైంది.వెంటనే బయలుదేరి, పది నిమిషాల్లో ఉదయ్ హాస్పటల్ రిసెప్షన్ కౌంటర్ ముందు వాలాను. వాళ్ళను అడిగితే, ‘పేషంట్ పేరేమిటండి?’ అనడిగింది రిసెప్షనిస్టు. నిజమే! పేషంట్ పేరేమిటి? గాభరాలో అడగటం మర్చిపోయాను.‘తెలియదండి, మీ దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది’ సమాధానం ఇచ్చాను. నా సమాధానానికి నా వంక విచిత్రంగా చూస్తూ, రిజిస్టరులో వెతకటం ప్రారంభించింది. ఓ రెండు నిమిషాల తరువాత, ‘ఐసీయూలో వున్నారు వెళ్ళండి’ అంది. ఆ జవాబు విన్న నేను ‘ఐసీయూలోనా!’ మనసులో మరింత ఆందోళనతో ఐíసీయూ వైపు నడిచాను. అప్పుడు కూడా పేషంట్ పేరు అడగటం మర్చిపోయాను.ఐసీయూ లోపలకు వెళ్ళి అడిగితే, వాళ్ళు కూడా పేషంట్ పేరేమిటి అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక, ‘రాత్రి చేరారు’ అన్నాను. ఎదురుగా వున్న బెడ్ వంక చూపించింది అక్కడ వున్న నర్సు. కర్టెన్ వేసి వుండటంతో పేషంటు కనపడట్లేదు నాకు. మెల్లిగా రెండడుగులు వేసి, కర్టెన్ పక్కకు తోసి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా పెద్దాయన, బెడ్ మీద, ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వుంది, ఛాతీ నిండా ఈసీజీ వైర్లు బిగించి వున్నాయి. పక్కన ఈసీజీ మెషిన్ బీప్.. బీప్.. అంటోంది. బహుశా, నిద్రపోతున్నాడు అనుకుంటా కళ్ళు మూసి వున్నాయి. దగ్గరకు వెళ్ళి నిలబడ్డా, అలికిడికి కళ్ళు తెరిచాడు పెద్దాయన. ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాని, ముఖానికి ఆక్సిజన్ మాస్క్ వుండటం వల్ల సాధ్యం కాలేదు. కాని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ళు మాత్రం మాట్లాడతున్నాయి.‘ఉళ్ళో అందరికీ సహాయం చేసే నాకెందుకు ఇలా అయ్యింది’ అని అడుగుతున్నట్టు వున్నాయి పెద్దాయన చూపులు. ఇంతలో ఒక పెద్దావిడ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసింది, నావంక చూస్తూ. బహుశా, ఆయన భార్య అనుకుంటా! ‘బాబుగారు! రాత్రి గుండెల్లో బాగా నొప్పిగా వుంది అంటే, వెంటనే హాస్పిటల్లో చేర్చాను. ఆ వెంటనే మీకు కబురు పెట్టమంటే పెట్టాను’ అంది గద్గద స్వరంతో ‘డాక్టర్లు ఏమన్నారు?’ అడగలేక అడిగాను.‘స్టెంట్ వెయ్యాలి, ఓ లక్షదాకా అవుతుంది అన్నారు’ సమాధానమిచ్చింది ‘మీ అబ్బాయికి కబురు పెట్టారా?’ ఓ క్షణం మౌనంగా వుండి పోయిందావిడ.‘ఏమ్మా, మీ అబ్బాయికి ..’ మాట పూర్తయ్యే లోపు ‘చెప్పాను బాబు, నే వచ్చి చేసేదేముంది అన్నాడు’ తలదించుకుని జవాబిచ్చింది.బహుశా ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా అని సిగ్గుపడుతోంది కాబోలు. ఆవిడ చెప్పిన జవాబుకి నా మనసంతా ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టు అనిపించింది.ఇంతలో పెద్దాయన మెల్లగా నా చెయ్యి మీద చెయ్యి వేసి, నా వంకే చూడటం మొదలు పెట్టాడు. ఆ చూపులలో భావం నాకు అర్థమయ్యింది.‘ఫరవాలేదమ్మా, అధైర్యపడకండి. నేను డాక్టరుతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను’ అన్నాను.నా మాటలకు ఇద్దరి కళ్ళల్లో మెరుపులు మెరవటం స్పష్టంగా చూశాను. ‘అంతదాకా ఇది వుంచండి’ అంటూ, నా పర్సు తీసి రెండువేలు ఆవిడకిచ్చాను. ఆవిడ వాటిని అందుకుంటూ, నాకు నమస్కారం చేసింది కృతజ్ఞతతో. ‘మరి నేను వెళ్ళి వస్తాను, భయపడకండి. సాయంత్రం మళ్లీ వస్తాను’ అంటూ అక్కడి నుంచి బయట పడ్డాను. ‘లక్ష రూపాయలా, మొన్నే కదండీ యాభైవేలు ఇచ్చారు. అవే ఇంకా తీర్చలేదు. ఆయనేమన్నా మనకు చుట్టమా పక్కమా? పోనీ ఏమన్నా దూరపు బంధువా?’ అంది కాస్త చిరాగ్గా మా ఆవిడ. నేను మాట ఇచ్చి తప్పు చేశాను అన్నట్లు నావంక చూసింది. ‘ఆయన మనకు చేస్తున్న సహాయం ముందు ఇదెంత చెప్పు?’ అన్నాను కాస్త శాంతపరుస్తూ.‘మనకొక్కళ్ళకేనా? ఊళ్ళో అందరికీ చేస్తున్నాడు. అయినా ఎప్పటికప్పుడు డబ్బులిచ్చేçస్తూనే ఉన్నాముగా’అంది లెక్క లేస్తూ. ‘ఇచ్చామనుకో, మనిషిని అలా చూస్తూ చూస్తూ వదిలెయ్య లేక’.. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అని మనసులో అనుకుంటూ గొణిగాను ‘అసలు కొడుక్కే పట్టనప్పుడు మనకెందుకండీ?’మా ఆవిడ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థంకాక మౌనంగా వుండిపోయాను. ఓ నిమిషం తరువాత, మా ఆవిడే, ‘పోనీ అపార్ట్ట్మెంట్లో వాళ్ళందరినీ తలా కొంత సాయం చెయ్యమని అడుగుదాము’ అని సలహా ఇచ్చింది. ఆ సలహా ఏదో బాగుందనిపించి, వెంటనే అపార్ట్మెంట్ సెక్రటరీకి ఫోన్ చేసి విషయం చెప్పాను. వెంటనే ఆయన అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసి, విషయం అందరి ముందు వుంచాడు.‘దీనికా మీరు అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసింది? నేను ఇంకా ఏదో అనుకున్నా’ వాళ్ళలో ఓ వ్యాపారస్థుడు వెకిలి నవ్వు నవ్వుతూ అన్నాడు.‘మేం ఇవ్వాల్సింది ఇచ్చేశాం. ఇంకేమీ బాకీలేదు’ ఎదురింటాయన కుండ బద్దలు కొట్టాడు.‘అపార్ట్మెంటు సర్వీసు చార్జీలే కట్టటం కష్టంగా వుంది. ఇంకా దానాలు, ధర్మాలు ఎక్కడ చేస్తాం’ అంటూ పక్కింటాయన లేచి వెళ్ళి పోయాడు.‘డబ్బులు లేనప్పుడు, ప్రైవేటు హాస్పిటల్లో చేరటం దేనికి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే సరిపోయేది కదా, ఆరోగ్యశ్రీ కుడా వస్తుంది’ ఓ ఉచిత సలహా పడేశాడు ఆఫీసర్ కేడర్‌లో పనిచేసే ఒకాయన.‘మెన్ననేగా ఇల్లు కొన్నాడు. అది తాకట్టు పెట్టుకుంటే సరి, ఇలా మనల్ని దేబిరించటం ఎందుకు’ మరో రిటైర్డ్ ఆఫీసర్.ఇలా తలా ఒక మాట విసిరి అక్కడి నుంచి అందరూ నిష్క్రమించారు. ఇంతకాలం పెద్దాయన చేత సేవలు చేయించుకున్న వీళ్ళకు ఇప్పుడు ఆయన అక్కరలేని మనిషి అయ్యాడు. ఏ మనిషైనా అంతే అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరగానే అక్కరలేని మనుషులుగా మారిపోతారు. వాళ్ళ మాటలు, ప్రవర్తనతో నాకు మనుషులంటేనే అసహ్యం వేసింది. తోటి మనిషి ఆపదలో వుంటే సాయం చెయ్యకపోగా, ఇలాగేనా మాట్లాడేది అని నాలో నేనే మనిషిగా పుట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. నా పరిస్థితి అర్థమయిన వాడిలా, ‘సార్! అపార్టుమెంట్ వెల్ఫేర్ ఫండ్ నుండి ఓ పదివేలు ఇవ్వగలను’ అన్నాడు సెక్రటరీ. ‘దానికైనా వీళ్ళందరూ ఒప్పుకోవాలిగా!’ అన్పాను అనుమానంగా.‘గణేశ్ నవరాత్రుల ఖాతాలో రాసేస్తాను, ఫరవాలేదు లెండి’ అన్నాడుగణేశ్ నవరాత్రులంటే, కిక్కురుమనకుండా వేలకు వేలు చందాలిస్తారు. ఓ మనిషి ప్రాణం పోతోంది సాయం చెయ్యండి అంటే, ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఏం మనుషులో ఏమో! ఎక్కడికి పోతోంది ఈ లోకం అనుకుంటూ, సెక్రటరీ ఇచ్చిన పదివేలు తీసుకుని అక్కడి నుంచి కదిలాను.నేను ఎదురుపడగానే, ‘ఏమైంది?’ అంటూ అడిగింది మా ఆవిడ. జరిగింది మొత్తం చెప్పాను.‘మరి ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నారు?’ ప్రశ్నించింది. ‘అదే అర్థం కావట్లేదు. తొందరపడ్డానేమో!’ అన్నాను. ఆవిడ నా మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికెళ్లింది. ఏం చెయ్యాలి, లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి, అనవసరంగా మాట ఇచ్చానా? అని నన్ను నేను తిట్టుకుంటూ సోఫాలో జారగిలపడి కళ్ళు ముశాను. రెండు నిమిషాల తరువాత ఏదో అలికిడి అయితే కళ్ళు తెరిచా. ఎదురుగా మా ఆవిడ చేతిలో డబ్బుతో.. ఓ క్షణం అర్థంకాక, ఆమెవంక ఆశ్చర్యంగా చూశాను. ‘మీరు హాస్పిటల్‌కు వెళ్ళిన తరువాత నాన్న వచ్చి వెళ్ళారు. నా పేరున రాసిన పొలం పంట తాలుకు కౌలు డబ్బులు ఇచ్చి వెళ్ళారు’ అంటూ నా చేతిలో డబ్బులకట్ట పెట్టింది.‘వీటితో నగలు చేయించుకుంటానన్నావు’ ‘పరవాలేదు లెండి ఓ మనిషి ప్రాణం కన్నా, నా నగలేమీ ఎక్కువ కాదు. మరోసారి చూద్దాం నగల సంగతి’ అంటూ ఓ చిన్న నవ్వు నవ్వింది.ఆ నిమిషాన మా ఆవిడని చూస్తుంటే, మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి వుంది అనిపించింది. ఆనందంతో శ్రీమతి నుదుట ముద్దాడి, హాస్పిటల్లో డబ్బు కట్టుడానికి బయలుదేరాను.ఓ నెల రోజుల తరువాత పెద్దాయన వాళ్ళ ఆవిడతో మా ఇంటికి వచ్చాడు. ఈ నెల రోజులు ఎక్కడా కనపడకపోతే విశ్రాంతి తీసుకుంటు న్నాడేమో అని సరిపెట్టుకున్నాను. వాళ్లని చూడగానే, ‘ఎలా వున్నారు? రండి కూర్చోండి’ అంటూ లోపలికి ఆహ్వానించింది మా ఆవిడ. ‘కాఫీ తెస్తాను..’ అని లోపలికెళుతుంటే ‘వద్దమ్మా, ఒక్క నిమిషం ఇలా కూర్చో’ అంది పెద్దాయన భార్య. ఆవిడ మాటలు అర్థం కాక వాళ్ల ఎదురుగా కూర్చుంది మా ఆవిడ.‘అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు’ అని నాలో నేను అనుకుంటూ వాళ్ళ వంక చూస్తూ వుండిపోయాను. ఇంతలో పెద్దాయన తనతో తెచ్చిన సంచిలో నుండి కొన్ని కాగితాలు తీసి, ‘అమ్మా! ఇవి మా ఇంటి కాగితాలు, మా తదనంతరం నీ పేరున రాయించాను’ అంటూ మా ఆవిడ చేతిలో పెట్టాడు.ఆ పరిణామానికి ఇద్దరం ఆశ్చర్యపోయాము. ముందుగా తేరుకున్న మా ఆవిడ, ‘ఏంటండి, ఇదంతా, మేం ఏం సాయం చేశామని? ఆ లక్ష చిన్నగా వాయిదాల్లో చెల్లిస్తే పోయేదిగా!’ అంది.ఆవిడ మాటల్లో ఆర్ద్రత నాకు అర్థమయ్యింది. ‘లేదమ్మా! డాక్టరుగారు కాస్త పని తగ్గించుకుని, విశ్రాంతి తీసుకోమన్నారు. మీ డబ్బు చెల్లించే దారి నాకు కనపడటం లేదు. అయినా నా ప్రాణాలు కాపాడిన మీ కన్నా నాకెవరూ ఎక్కువ కాదు. నా కూతురుకి ఇస్తున్నాను అనుకో అమ్మా!’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.వాళ్ళను చూసి మా ఆవిడ కూడా కళ్ళల్లోనుండి వస్తున్న కన్నీళ్ళను ఆపుకోలేక పోయింది. నిన్నటి దాకా వాళ్ళు ఎవరో, ఊళ్ళోవాళ్ళు అన్న మా ఆవిడను వాళ్ళు సొంత కూతురిలా భావించటంతో మా ఆవిడ మనసులో నుండి పెల్లుబికిన ప్రేమబాష్పాలవి. ఆ నిమిషాన మనుషుల మీద అప్పటిదాకా ఏర్పడిన అసహ్యం పోయి, మళ్ళీ నమ్మకం ఏర్పడటం మొదలయ్యంది. మనిషికి మనిషి సాయం చెయ్యటానికి స్నేహితుడో, బంధువులో కానక్కరలేదు. కాస్తంత గుండెల్లో తడి ఉంటే చాలు. అలా గుండెల్లో తడి ఉన్న మనుషులే నిజమైన ఆత్మబంధువులు అనుకుంటూ మా ఆవిడ వంక చూశాను, తను కూడా ఆనందంతో నా వంకే చూస్తోంది. ‘కాగితాలు తీసుకోవద్దు’ అన్నట్టు సైగ చేశాను. అలాగే అంటూ తల ఆడించింది. -
సొసైటీ గుమస్తా కుటుంబానికి న్యాయం చేస్తాం
నరసరావుపేట: టీడీపీ నేతలు, బ్యాంకు సిబ్బంది వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా అన్నవరం పీఏసీఎస్ ఉద్యోగి ఓరుగుంటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని జీడీసీసీ బ్యాంకు అధికారులు హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో జీతం బకాయిలు చెల్లించడంతో పాటు అతని కుమారుడు లక్ష్మీప్రసన్నకుమార్‌రెడ్డికి తండ్రి ఉద్యోగం ఇస్తామన్నారు. అది కూడా పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. వివరాలు.. పల్నాడు జిల్లా అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఓరుగంటి శ్రీనివాసరెడ్డి గుమాస్తాగా పనిచేస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఉద్యోగం మానుకోవాలంటూ అతనిని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. టీడీపీ నేత, అన్నవరం సొసైటీ సీఈవో దొప్పలపూడి శ్రీనివాసరావు బ్యాంకు స్పెషల్ ఆఫీసర్ సురేంద్రబాబుతో కలిసి మూడు నెలలుగా జీతం కూడా నిలిపివేయించాడు. వారిద్దరి వేధింపులు తట్టుకోలేక శ్రీనివాసరెడ్డి శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైఎస్సార్సీపీ నేత, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో శాంతి భద్రతల అదనపు ఎస్పీ సీహెచ్.లక్ష్మీపతి బ్యాంకు అధికారులతో మాట్లాడారు. చీఫ్ మేనేజర్ రమాదేవి ప్రభుత్వాస్పత్రికి వచ్చి శ్రీనివాసరెడ్డి భార్య రామసీతమ్మ, కుమారుడు లక్ష్మీప్రసన్నకుమార్‌రెడ్డి, కుమార్తె దేవికకు హామీలు ఇవ్వటంతో ఆందోళన విరమించారు. వెంటనే హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి బ్యాంకు అధికారులకు సూచించారు. కాగా, తన చావుకు టీడీపీ నేత దొప్పలపూడి శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ సురేంద్రబాబు కారణమంటూ శ్రీనివాసరెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను కుమారుడు లక్ష్మీప్రసన్నరెడ్డి మీడియాకు చూపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
వైఎస్సార్సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ముగ్గురు మృతి
వెల్వడం(మైలవరం)/మధురానగర్(విజయవాడసెంట్రల్)/ఉయ్యూరు: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన అయిలూరి శ్రీనివాసరెడ్డి(35) వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి స్థానికంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బలంగా నమ్మాడు. కానీ, పార్టీ ఓడిపోవడంతో శ్రీనివాసరెడ్డి తీవ్ర మనోవేదనతో కుమిలిపోతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదేవిధంగా విజయవాడలోని 27వ డివిజన్ బావాజీపేటకు చెందిన వైఎస్సార్సీపీ గృహసారథి నామా శ్రీను(55) గత 12 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోయినప్పటి నుంచి బాధపడుతున్న శ్రీను గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నామా శ్రీను మృతికి మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. కాగా, కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త, లారీ డ్రైవర్ జె.కొండలరావు (56) కూడా పార్టీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర వేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వారం రోజుల కిందట గుండెపోటు రావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. కొండలరావు భౌతికకాయం వద్ద సర్పంచ్ మంగినేని సుధారాణి, పార్టీ నాయకులు నివాళులర్పించారు. -
యువత.. తన కాళ్లపై తాను నిలవాలి!
మనుషులు తప్ప జీవ ప్రపంచంలోని ఏ జీవి అయినా పెరిగి పెద్దదైన తరువాత తల్లితండ్రులపై ఆధారపడటం తగ్గిస్తుంది. తన కాళ్లమీద తాను స్వతంత్రంగా నిలబడడానికి ప్రయత్నిస్తుంది. మనుషుల్లో కూడా చాలా సమాజాల్లో యువత టీనేజ్ దాటే సమయానికి బతకడం నేర్చుకుంటుంది. మన భారతీయుల్లోనే తల్లి తండ్రులపై ఎక్కువకాలం ఆధారపడుతున్నారు.అమెరికాలో ఒకవ్యక్తికి 15 ఏళ్లు వచ్చాయంటే, తల్లి తండ్రులకు అతన్ని ఇక పెంచి పోషించాల్సిన బాధ్యతల నుండి విముక్తి లభించినట్లే. ఒకసారి కళాశాలలో అడుగు పెడితే, వారి ఖర్చులకు డబ్బు వారే సంపాదించుకోవాలి. చదువుకుంటూ, పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకోవటం విదేశాలలో చూస్తుంటాము. కానీ మన దేశంలో ఉద్యోగం వచ్చేంత వరకు తల్లి తండ్రులే పోషించాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వృద్ధులైన తల్లి తండ్రులను పోషిస్తూ, ఇటు ఎదిగి వచ్చిన పిల్లలను కూడా పోషించటం వల్ల మధ్యతరగతి వర్గం చితికి పోతున్నారన్నది వాస్తవం. అదే ఎదిగి వచ్చిన పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం నేర్చుకుంటే, కొంతైనా భారం తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు అమెరికా వంటి దేశాలకు ఉన్నత చదువుకై వెళ్లే యువత అక్కడ చిన్న చిన్న ఉద్యాగాలు చేసుకుంటూ... తమ ఖర్చులకు తాము సంపాదించుకుంటూ చదువుకునే వాళ్ళు. అక్కడి యువతను చూసి మనవాళ్లూ అదే దారిలో నడిచేవాళ్లు. కాని, ఇప్పుడు అక్కడ కూడా తల్లితండ్రుల మీద ఆధారపడే యువత ఎక్కువ అవుతోంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా తల్లి తండ్రుల మీద ఆధారపడే యువత సంఖ్య పెరిగిపోతోంది. జంతువుల్లో కంగారూలు పిల్లల్ని చాలా కాలం మోస్తూ ఉంటాయి. అటువంటి తల్లి తండ్రులు మన దేశంలో ఎక్కువ ఆవుతున్నారు. దీనికి కొంత కారణం మన సంస్కృతిలో భాగమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అనుబంధాలు కారణం. ఎదిగి వచ్చినా బతకలేని బిడ్డలను నెత్తి మీద మోస్తూ అప్పుల పాలవుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనీసం పెళ్ళి చేస్తేనన్నా బాధ్యతలు తెలిసివస్తాయని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసినా వీరి ధోరణిలో మార్పు రావటం లేదు. పైపెచ్చు కొడుకుతో పాటు కోడలిని కూడా పోషించాల్సి వస్తోంది. ఒకప్పుడు 1970వ దశకంలో చదువు లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే వాళ్ల సంఖ్య ఎక్కువగా వుండేది. లండన్, జపాన్ వంటి దేశాల్లో సైతం వీరి సంఖ్య ఎక్కువగా వుండేది. వీళ్ళను ‘ఫీటర్’ అని పిలిచే వాళ్ళు. ఎప్పుడు అయితే కంప్యూటర్ సెన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరిగాయో వీరి సంఖ్య తగ్గుతూ వచ్చింది. కాని, మళ్ళీ ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నత చదువులు చదువుతున్న వారి సంఖ్య పెరిగినంతగా ఉద్యోగాలు పెరగకపోవటం, చదివిన చదువులు బతకటం ఎలాగో నేర్పక పోవటం, విలాస జీవనానికి అలవాటు పడటం, ధరల పెరుగుదల వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. చిన్నదైనా పెద్దదైనా సిగ్గుపడకుండా ఏదో ఒక పనిలో చేరి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. ‘శ్రమ విలువ తెలిసిన వాళ్ళు తాము కష్టపడి సంపాదించిన డబ్బులతో బతకాలని కోరుకుంటారు. కాని, పరాన్న జీవులే వయసు మీద పడుతున్నా తల్లితండ్రుల దగ్గర చెయ్యి చాస్తూవుంటారు. నేటి ఇంటర్నెట్ యుగంలో... సామాజిక మాధ్యమాలు, చలన చిత్రాల వల్ల చెడు అలవాట్లకు గురై తమ శ్రమ విలువను గుర్తించ లేకపోతున్నారు. ఇటువంటి వాళ్లు మధ్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువగా కనబడుతుంటారు. దేశంలో అంత కంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగం కూడా దీనికి కారణమే. ప్రభుత్వాలు ఉపాధి కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేకపోత మనదేశానికి వరంగా భావిస్తున్న యువశక్తి శాపంగా మారి పరాన్న జీవుల సమాజంగా తయారవుతుంది అనటంలో ఏ సందేహం లేదు.ఈదర శ్రీనివాస రెడ్డి వ్యాసకర్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ -
కణతపై తగిలి ఉంటే ప్రాణాపాయం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి ఆయన తలలో అత్యంత సున్నిత ప్రాంతంలో గాయమైందని.. గాయమైన చోటు నుంచి సుమారు ఒకటిన్నర – రెండున్నర సెంటిమీటర్లు వెనుక భాగాన అదే దెబ్బ తగిలి ఉంటే ఊహకు అందని రీతిలో ప్రాణాపాయం సంభవించేదని గుంటూరు జీజీహెచ్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కపాలం(తల) ప్రధానంగా నాలుగు భాగాలైన ఎముకలతో కూడి ఉంటుందన్నారు. ఇందులో నుదురు భాగం (Frontal Bone), వెనుక భాగం (Parietal Bone).. మెడను కలుపుతూ దిగువ భాగాన టెంపోరల్ బోన్ (Temporal Bone).. ఈ మూడింటికి మధ్యలో అన్నింటిని కలుపుతూ స్పెనాయిడ్ బోన్ ( Sphenoid Bone) ఉంటాయని తెలిపారు. మొత్తం కపాలంలో కల్లా బలహీనమైంది.. టెరియన్ (Pterion) అని వివరించారు. ఈ భాగాన్నే వాడుకలో కణతగా పిలుస్తుంటారన్నారు. ఇక్కడే మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే అతి ముఖ్యమైన ప్రధాన రక్తనాళం ఉంటుందన్నారు. దీన్నే మిడిల్ మెనింజియల్ ఆర్టిరీ (Middle Meningeal Artery) అంటారని వివరించారు. ఇక్కడ ఒక మోస్తరు దెబ్బ తగిలినా.. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళానికి ప్రమాదం సంభవిస్తుందన్నారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరుగుతుందని చెప్పారు. మెదడులోనూ రక్తస్రావం అవుతుందన్నారు. దీన్నే ఎపిడ్యూరల్ హెమటోమా (Epidural Hematoma) అంటారని తెలిపారు. ఇలా జరిగితే మెదడుకు రక్తప్రసరణ ఆగిపోతుందని.. కణత వద్ద దెబ్బ తగిలితే వెంటనే స్పృహ కోల్పోయి కోమాలోకి జారుకోవచ్చన్నారు. ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు. సీఎం జగన్‌కు గాయమైన చోట నుంచి కేవలం ఒకటిన్నర– రెండున్నర సెంటిమీటర్ల వెనకభాగాన కణత వద్ద అదే దెబ్బ తగిలి ఉంటే ప్రమాద తీవ్రత అంచనాకు అందకుండా ఉండేదని వివరించారు. ఎందుకంటే సాధారణంగా నుదిటి భాగాన చర్మం బిగుతుగా ఉంటుందన్నారు. ఆ ప్రాంతంలో ఎముక తప్ప కండ ఉండదని చెప్పారు. అక్కడే అంత లోతున రక్తగాయం అయ్యిందంటే.. అదే దెబ్బ కణత వద్ద తాకి ఉంటే పెద్ద ప్రమాదం తలెత్తేదని వివరించారు. -
హత్య చేసింది ‘తమ్ముడే’
సాక్షి, పుట్టపర్తి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగినా.. రాజకీయ రంగు పూసి సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలే హత్య చేసినా.. బురద మాత్రం అధికారపార్టీపై వేసి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలియడంతో ప్రజల్లో అభాసుపాలు అవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కుటాలపల్లిలో జరిగిన హత్య విషయంలోనూ టీడీపీ నేతల దుష్ప్రచారం బట్టబయలైంది. కుటాలపల్లిలో ఈ నెల 24వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగినట్లు అదే రోజున పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదేమీ పట్టించుకోకుండా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శవ రాజకీయానికి తెర లేపారు. దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పల్లె రఘునాథరెడ్డితో పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సైతం అసత్య ప్రచారం చేశారు. ఈ హత్య ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్టు చేశాయి. వివాహేతర సంబంధం కారణంగానే దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని ఎస్పీ మాధవరెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. అమరనాథ్‌రెడ్డి సమీప బంధువైన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఈ హత్య చేశారని వెల్లడించారు. అతనితో పాటు నిందితులుగా ఉన్న గుండ్రా వీరారెడ్డి, మల్లెల వినోద్‌కుమార్, రమావత్ తిప్పేబాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. నిందితుడు టీడీపీ కార్యకర్త దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో కూడా కుటాలపల్లిలో చిన్న చిన్న ఘర్షణల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఇవన్నీ తెలిసినా కూడా పల్లె రఘునాథరెడ్డి అధికార పార్టీ వైపు కేసును తోసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ పెద్దలు చేసిన కుట్రలను చూసి స్థానికులు మండిపడుతున్నారు. హత్యకు కారణాలివీ.. కుటాలపల్లికి చెందిన తిప్పేబాయితో కొన్నేళ్లుగా దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అమరనాథ్‌రెడ్డితో ఆమె సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఆమెను ప్రశ్నించాడు. తనకు ఆర్థిక సాయం చేశాడు కాబట్టి అతన్ని వదలలేనని తేల్చి చెప్పింది. దీంతో అమరనాథ్‌రెడ్డిని చంపేయడానికి శ్రీనివాసరెడ్డి పథకం రచించాడు. తనకు సన్నిహితంగా ఉండే వీరారెడ్డితో పాటు చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన మల్లెల వినోద్‌కుమార్ సాయం కోరాడు. గత ఆదివారం రాత్రి అమరనాథ్‌రెడ్డి పొలం వద్దకు వెళ్లగా.. మల్బరీ ఆకులు కోసే కత్తితో మెడ, ముఖం, తలపై నరికి చంపేశారు. మరుసటి రోజు ఉదయమే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. -
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలంతో పాటు హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. శనివారం ఆయన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA) ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహించిన హెల్త్ కార్డ్, డైరీ, ఐడికార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం తనకు నమ్మకం ఉందని, కచ్చితంగా అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ‘తెలంగాణలో 23వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి సంస్థలోనూ ఫిల్మ్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా అక్రిడేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఎలిజెబుల్ పీపుల్‌కి కచ్చితంగా అక్రిడేషన్ ఇప్పిస్తాం. ప్రభుత్వాల నుంచి ఏ సౌకర్యాలు పొందాలన్నా అందరిలోనూ యూనిటీ ఉండాలి. అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే. మన ప్రొఫెషన్ విలువ, స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం, ఎథిక్స్ ని ఎథిక్స్ ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. జూన్ 6 తర్వాత ఎలిజిబుల్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తాం.ప్రభుత్వాల నుంచి కూడా ఏదీ ఫ్రీగా ఎక్స్ పెక్ట్ చేయొద్దు. భూములనో, ఫ్లాట్‌లనో మార్కెట్ రేటు కాకుండా, మనకంటూ ఓ రేటుకి ఇస్తే దాన్ని కట్టుకుందాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, ఆర్.నారాయణమూర్తి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టీఎఫ్‌జెఎ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్ సురేంద్ర నాయుడు సహా అసోసియేషన్ సభ్యులు.. జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. -
హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్ ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు సీపీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. సైబరాబాద్ జాయింట్ సీపీ అడ్మిన్‌గా పనిచేస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతికి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జి సు«దీర్‌బాబు రాచకొండ సీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించారు. ఇప్పటి వరకు సైబరాబాద్, రాచకొండ సీపీలుగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర, దేవేంద్రసింగ్ చౌహాన్లను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మల్టీజోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం మరో ఉత్తర్వును జారీ చేశారు. ఒకేసారి భారీ మార్పులపై సీఎం కసరత్తు! కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంగళవారం జరిగిన ఐపీఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఒకేసారి బదిలీ చేయడం అందులో భాగమని చర్చ జరుగుతోంది. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి తన మార్క్ టీంను సెట్ చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సహా భారీ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తకోటకు చాలాకాలం తర్వాత కీలక పోస్టింగ్ హైదరాబాద్ సీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి చాలా ఏళ్ల తర్వాత అత్యంత కీలక పోస్టింగ్ దక్కింది. గతంలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన ఆయన తర్వాత అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ అయ్యారు. గత కొన్ని నెలలుగా అక్కడ పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం అత్యంత కీలక పోస్టింగ్‌లోకి బదిలీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను తప్పించిన సర్కార్ ఆయన స్థానంలో అవినాశ్ మహంతికి బాధ్యతలు అప్పగించింది. సైబరాబాద్ సీపీ పోస్టు ఐజీ ర్యాంకు అయినా..డీఐజీ ర్యాంకులో ఉన్న అవినాశ్ మహంతికి అనూహ్యంగా ఆ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇక రాచకొండ పోలీస్ కమిషనర్‌గా డిసెంబర్ 2022లో బాధ్యతలు తీసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ కేవలం పదకొండు నెలలకే బదిలీ అయ్యారు. ఇదే కమిషనరేట్‌లో గతంలో సుదీర్ఘ కా లంపాటు పనిచేసిన సు«దీర్‌బాబుకు కొత్త ప్రభు త్వం పోలీస్ కమిషనర్‌గా అవకాశం కలి్పంచింది. శాండిల్యకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయంతో హైదరాబాద్ సీపీగా అసెంబ్లీ ఎన్నికల ముందు బాధ్యతలు చేపట్టిన సందీప్‌శాండిల్యను సైతం ప్రభుత్వం తప్పించింది. సమర్థవంతమైన అధికారిగా పేరున్న సందీప్శాండిల్యకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండడంతో నిక్కచ్చిగా వ్యవహరించే సందీప్శాండిల్యకు నార్కోటిక్స్ బ్యూరో బాధ్యతలు అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. -
గ్రహాంతరవాసీ... నీవున్నావా?
విశ్వాంతరాళాల్లో గ్రహాంతరవాసుల ఉనికి, గుర్తుతెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో)ల జాడకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయని కొందరు ఔత్సాహికులు ఆరోపిస్తుంటే తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయంలో పారదర్శకత అవసరమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వివిధ దేశాల పార్లమెంటరీ కమిటీలూ ఈ విషయమై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసులు, యూఎఫ్‌వోలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏమిటి, వాటి నిజానిజాలు ఎంత అన్నది పరిశీలిద్దాం. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఇటీవల మెక్సికో కాంగ్రెస్‌లో ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. అయితే అనూహ్యంగా సమావేశ మందిరంలో ప్రదర్శించిన వింత ఆకారంలోని రెండు భౌతికకాయాలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ప్రముఖ జర్నలిస్టు, యూఎఫ్‌వో పరిశోధకుడు జైమీ మౌసాన్ ప్రదర్శనకు పెట్టిన ఆ భౌతికకాయాలు 45 ఏళ్ల క్రితం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్పీల్బర్గ్ గ్రహాంతరవాసులపై కల్పిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఈటీ (ఎక్స్ట్రా టెరె్రస్టియల్)లో చూపిన గ్రహాంతరవాసిని పోలినట్లుగా ఉన్నాయి. అవి పెరు దేశంలోని కుస్కో ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయని, వాటిని కార్బన్ డేటా ద్వారా పరీక్షించగా దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తేలిందని జైమీ మౌసాన్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షలోనూ ఈ దేహాల్లో 30 శాతానికిపైగా గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు తేలిందని, ఆ భౌతికకాయాలు భూమిపై జన్మించిన జీవులు కాదని, ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారివేనని ఆయన వాదించారు. అయితే ఈ వాదనపై ‘నాసా’అనుమానాలు వ్యక్తం చేసింది. తమ వద్ద ఉన్న అపారమైన సమాచారం మేరకు ఇంతవరకు గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఏమైనా అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వస్తే వాటిని శాస్త్రవేత్తల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని కోరింది. అమెరికాలోనూఇదే తంతు... యూఎఫ్‌వోలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ కూడా ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అందులో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్గ్రుస్ అమెరికా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని, కూలిపోయిన యూఎఫ్‌వోలు వాటితోపాటు వచ్చిన గ్రహాంతరవాసుల భౌతికకాయాలు అమెరికా అదీనంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. అమెరికా ప్రభుత్వం ఈ గ్రహాంతర వాహనాలను రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మళ్లీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన పరిశోధనలో తెలిసిందని కూడా డేవిడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికా నౌకాదళ మాజీ పైలట్ ర్యాన్గ్రేవ్స్ మాట్లాడుతూ గతంలో తాను విమానం నడుపుతున్నప్పుడు రెండు సందర్భాల్లో యూఎఫ్వోలను చూశా నని వాంగ్మూలం ఇచ్చారు. అయితే అమెరికా రక్షణశాఖ ఈ వాదనలను తిరస్కరించింది. గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదని పెంటగాన్ ప్రతినిధి సూగ్రౌఫ్ ప్రకటన విడుదల చేశారు. ఊహాగానాలకు నెలవుగా ఏరియా 51 అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఉన్న నిషేధిత ఏరియా 51 ప్రాంతం అనాదిగా వాదవివాదాలకు, ఊహాగానాలకు కేంద్రంగా నిలిచింది. ఈ నిషేధిత ప్రాంతంలో గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై అనేక పుస్తకాలు, టీవీ సీరియల్స్ సైతం వచ్చాయి. కొందరు ఔత్సాహికులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టేందుకు విఫలయత్నాలు చేశారు. గ్రహాంతరవాసుల కథనాలతోపాటు అమెరికా చంద్రునిపై కాలుపెట్టిన ఉదంతం వాస్తవానికి ఏరియా 51లో కృత్రిమంగా రూపొందించారన్న ప్రచారం కూడా ఉంది. యాభైయ్యవ దశకంలో ఈ ప్రాంతంలో గ్రహాంతర వాహనాలు తరచూ కనిపించడం వల్లే ఏరియా 51కి అమెరికా అంతటా ఆసక్తి రేకెత్తింది. 2013లో సీఐఏ బహిర్గతం చేసిన రహస్య పత్రాల్లో అసలు విషయం బయటపడింది. యాభైయ్యవ దశకంలో ప్రయాణికుల విమానాలు 10 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో మాత్రమే పయనించగలిగేవి. కొన్ని రకాల యుద్ధవిమానాలు 40 వేల అడుగుల ఎత్తు వరకు పయనించేవి. 1955లో అప్పటి అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ మరింత ఎత్తులో ఎగిరే యుద్ధవిమానాలు యు–2ల నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ విమానాలు 60 వేల అడుగుల ఎత్తులో పయనించగలిగేవి. సాధారణ విమాన ప్రయాణికులకు ఈ విషయం తెలియక వాటిని గ్రహాంతర వాహనాలుగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వైమానికదళ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తరువాతి కాలంలో అత్యాధునిక యుద్ధవిమానాలను ఏరియా 51లో పరీక్షించేవారు. అల్లంత దూరాన చిగురిస్తున్న ఆశలు... జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన సమాచారాన్ని విశ్లేíÙంచిన ‘నాసా’భూమికి సుదూరంగా ఉన్న కే2–18బీ అనే గ్రహంలో నీటితో నిండిన సముద్రాలు, అందులో జీవచరాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించింది. భూమికి కనీసం 8.6 రెట్లు పెద్దదైన ఈ గ్రహం మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం వాతావరణంలో అత్యధిక స్థాయిలో హైడ్రోజన్ ఉండటమే కాకుండా అదే స్థాయిలో మీథేన్, కార్బన్ డయాక్సైడ్, స్వల్ప పరిమాణంలో అమ్మోనియా వాయువులు ఉండటం వల్ల అక్కడ సముద్రజలాలు ఉండే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది. అంతకుమించి కే2–18బీ గ్రహ వాతావరణంలో డిమిౖథెల్ సల్ఫైడ్ (డీఎంఎస్) అణువులు కూడా ఉన్నట్లు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొంది. భూమిపై ఈ డీఎంఎస్ను సముద్రంలో వృక్షజాతికి చెందిన నాచులాంటి మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. దాంతో కే2–18బీపై కూడా జీవం ఉండే ఆస్కారం మెండుగా ఉందని నాసా భావిస్తోంది. శుక్రుడిపైనా జాడలు... తాజాగా శుక్రగ్రహంపై జీవం ఉండే ఆస్కారం ఉందనడానికి తగిన ఆధారాలు లభించాయి. యూకేలోని వేల్స్లో ఉన్న కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధనల్లో శుక్రుడిపై వాతావరణంలో ఫాస్ఫైన్ వాయువులు ఉన్నట్లు బయటపడింది. కార్టిఫ్ బృందానికి చెందిన గ్రీవ్స్ అనే శాస్త్రవేత్త ఇటీవల రాయల్ ఆ్రస్టానామికల్ సొసైటీ జాతీయ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫాసై్పన్ వాయువుపై ఇంత ఆసక్తి ఎందుకంటే భూమిపై ఈ వాయువు కేవలం జీవజాలాల నుంచే వెలువడుతుంది. భూమిపై స్వచ్ఛమైన హైడ్రోజన్ తక్కువ పరిమాణంలో ఉన్న చోట జీవజాలం గుండా ఫాస్పైన్ ఉత్పత్తి జరు గుతుంది. శుక్రుడు వాతావరణంలో దిగువ భాగంలోనే ఈ ఫాసై్పన్ మేఘాలు ఆవరించి ఉండటంతో అక్కడ జీవం ఉండే ఆస్కారం అత్యధికంగా ఉందనేది కార్డిఫ్ బృందం అభిప్రాయం. మూడేళ్ల క్రితం ఈ విషయం బయటపడ్డా అప్పట్లో శాస్త్రవేత్తలు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం ఫాస్పైన్ ఉన్నంత మాత్రాన జీవం ఉందని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ ఇటీవల జరిగిన మరిన్ని పరిశోధనల ఫలితంగా ఇప్పుడు శుక్రుడిపై జీవం జాడలు కనుగొనేందుకు ఆసక్తి పెరిగింది. ఆధారాలను కనుగొనే దిశగా... గ్రహాంతరవాసులపట్ల మనిషికి అనాదిగా ఆసక్తి ఉంది. వాటి కోసం నిరంతర అన్వేషణ జరుగుతూనే ఉంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రోదసిలో ఈ గ్రహాంతర జీవుల కోసం వెదుకుతూనే ఉన్నాం. అయినా ఇంతవరకూ కచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన భౌతికకాయాలపై జరుగుతున్న పరీక్షలు వాటిని గ్రహాంతరవాసులుగా తేలిస్తే అవే మనకు మొదటి ఆధారాలు కాగలవు. అంగారకుడిపై ఎప్పుడైనా జీవం ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంతోపాటు అంగారకుడిపై జీవం మనుగడకు అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి నాసా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. నాసాకు చెందిన ప్రిసర్వేరన్స్ రోవర్ గత జనవరిలో అంగారకుడిపై అనేక ట్యూబ్ లను వదిలింది. ఇవి అక్కడి మట్టి, రాళ్లను సేకరిస్తాయి. వాటిని తిరిగి భూమిపైకి తేవడానికి మార్స్ శాంపిల్ రిటర్న్ (ఎంఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాసా అంచనా ప్రకా రం ఇది 2030 నాటికి పూర్తవుతుంది. విశ్వంలో జీవానికిమెండుగా అవకాశాలు... అసలు గ్రహాంతరవాసులు ఉన్నాయా లేక కేవలం భూమిపైనే జీవం ఉందా అనే ప్రశ్నకు శాస్త్ర ప్రపంచం ఇచ్చే సమాధానం ఒక్కటే. అనంతకోటి విశ్వంలో భూమిని పోలిన పరిస్థితులు ఉన్న గ్రహాలు ఇంకా ఉండేందుకు అవకాశం మెండుగా ఉంది. విశ్వం మొత్తంలో కోటానుకోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన పాలపుంత (మిల్కివే) గెలాక్సీలోనే 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇన్నింటి మధ్య భూమిలాంటి వాతావరణం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఆస్కారం ఉంది. అలాంటిచోట జీవం ఆవిర్భవించే అవకాశాలూ ఉన్నాయి. ఏమో ఏదో రోజు మనకు ఈ గ్రహాంతర వాసులతో ములాఖత్ జరిగే అవకాశమూ ఉంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
ప్రతీకార జ్వాలతో..
అంజలి టైటిల్ రోల్లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలి సీన్‌కి రామచంద్ర క్లాప్ ఇవ్వగా, స్క్రిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
బాబు గుండెల్లో ఐటీ భయం
ఒంగోలు: ప్రజాబాహుళ్యంలో దొరికిన దొంగ చంద్రబాబు అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఆయన ఆదివారం ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు.నోటీసులు చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. ఎటువంటి నోటీసులు ఇచ్చినా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం పరిపాటేనన్నారు. తాజాగా ఐటీశాఖ నోటీసులు జారీచేయడంతో బాబు గుండెల్లో భయం పట్టుకుందని చెప్పారు. దీంతో బీజేపీ పంచన చేరి ఏదో ఒక విధంగా గట్టెక్కాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ వెళ్లి చేతులు కట్టుకుని మరీ వినయాన్ని నటిస్తున్నారని విమర్శించారు. చివరికి పురందేశ్వరి ద్వారా ఢిల్లీ పెద్దల ప్రాపకం కోరుతున్నారన్నారు. -
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే రాజకీయాలకు గుడ్‌బై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల విడుదలను కళ్లారా చూశాకే రాజకీయాల నుంచి విరమిస్తానని... ఆ కోరిక నెరవేర్చుకునేందుకే ఎన్నికల్లో నిలబడుతున్నానని , ప్రజల కోరిక మేరకే నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి తుమ్మలను ఖమ్మంలోని ఆయన స్వగృహంలో కలిశారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ హోదాలో పొంగులేటి తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చారన్నారు. తన రాజకీయ లక్ష్యమైన సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యాక అధికారికంగా నీళ్లు వదిలి అదే వేదికపై అందరికీ ధన్యవాదాలు తెలిపి రాజకీయాల నుంచి విరమించాలనేది తన జీవిత కోరిక అని వ్యాఖ్యానించారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పతనం మొదలైంది: శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి, రెండు శాతం ఓట్లు కూడా లేని సమయాన కేసీఆర్ ఆహ్వానం మేరకు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరి జిల్లాను అభివృద్ధి పథాన నడిపించారని చెప్పారు. అయితే, బీఆర్ఎస్లో కొన్ని శక్తులు ఆయ న్ను అవమానాలు, అవహేళనలకు గురిచేసి బయటకు వెళ్లేలా చేశాయన్నారు. కాంగ్రెస్ పక్షాన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం
కర్నూలు (లీగల్): సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం సాధ్యమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పనిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, తాజాగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా చేరిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని, న్యాయవాదులు దీనిని బాగా వినియోగించుకోవాలన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌కు జి.భూపాల్‌రెడ్డి చైర్మన్‌గా, ట్రిబ్యునల్ మెంబర్లుగా నాగేశ్వరరావు, అబ్దుల్ మజీద్ వ్యవహరిస్తారన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నలు, ఇతర విషయాలపై వక్ఫ్ ఆస్తుల నిర్ధారణ హక్కులు, ప్రయోజనాలను సమర్థించేందుకు ట్రిబ్యునల్ కోర్టు పని చేస్తుందని చెప్పారు. విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టులో 213 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ జి.సృజన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభాదేవి, జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కల్యాణి పాల్గొన్నారు. -
అధికారం ఇచ్చినా ఏమీ చేయని అసమర్థులు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఒక్కసారి అధికారం ఇవ్వండి అని కాంగ్రెస్ అడుగుతోంది. ఇప్పటి వరకు పది పదకొండు మార్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేని అసమర్థులు కాంగ్రెస్ నేతలు. వారు ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా వ్యవహరిస్తూ, పేదల కోసం పనిచేసే కేసీఆర్‌ను తిడుతున్నారు. ఎవరి వల్ల మంచి జరుగుతుందో చూడండి. ఎవరైనా డబ్బులు ఇస్తే ఏం చేయాలో ఆలోచించుకుని ఓటు మాత్రం కేసీఆర్‌కు వేయండి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో గురువారం మంత్రి సమక్షంలో కాంగ్రెస్ నేత డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్న తెల్లం వెంకట్రావు, నెల రోజుల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా, గురువారం తిరిగి బీఆర్ఎస్లో చేరిన వెంకట్రావుకు, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. కాంగ్రెస్ పార్టీతో వెళ్లడం అంటే కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో అపార ఆదరణ లభిస్తోంది. రోజుకో పార్టీ విలీనంతో జాతీయ స్థాయిలో కేసీఆర్ శక్తిమంతమైన నేతగా ఎదుగుతున్నారు. బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో పునాది పడాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో 90 నుంచి 95 సీట్లు ఇవ్వడం ద్వారా మన నాయకుడికి కొత్త శక్తి, ఉత్సాహం ఇవ్వాలి. ఇక్కడి తీర్పు మహారాష్ట్రలో ప్రతిధ్వనించేలా మీ నిర్ణయం ఉండాలి. రేపటి రోజున కేంద్రంలో మనం లేకుండా ఎవరూ ప్రధాన మంత్రి అయ్యే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు గెలిచేలా మద్దతు ఇవ్వండి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో ముందుకు గిరిజన పోరాట యోధుడు కొమురం భీం కోరుకున్న జల్ జంగల్ జమీన్ నినాదం స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా కేసీఆర్‌తోనే సాధ్యమైందని, పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో మిషన్ భగీరథ, పోడు భూములకు పట్టాలు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు, నక్సలైట్లు గతంలో చెప్పిన సమ సమాజ స్థాపన ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోందని, పెరుగుతున్న సంపదతో పట్టణాలు, పల్లెల మధ్య అంతరం తగ్గుతోందని పేర్కొన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నా, రూ.200 పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పడు రూ.4 వేలు ఇస్తామని చెపుతోందని, అయితే కాంగ్రెస్ నాయకులు రూ.40 వేలు ఇచ్చినా ప్రజలు నమ్మబోరని కేటీఆర్ అన్నారు. యాదాద్రి ఆలయ స్థాయిలో భద్రాచలం ఆలయా న్ని అభివృద్ధి చేస్తామని, భద్రాచలానికి వరద ముప్పును తప్పించేందుకు కరకట్ట నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నాయకులు ఇప్పుడు తెలంగాణ అమరవీరులు, ఉద్యమం గురించి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు తాతా మధు, మధుసూదనాచారి, ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరారు. -
Pudami Sakshiga : భూమ్మీద ఆక్సిజన్ శాశ్వతం కాదా? ఆ తర్వాత అంతమేనా?
ఆక్సిజన్..ప్రాణాలు నిలబెట్టే వాయువు. ఐ–కొలి లాంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు మినహా భూమ్మీద సమస్త జీవజాలాల మనుగడకు ఈ ఆక్సిజన్ అవసరం. అయితే ఈ ప్రాణవాయువుకు జన్మనిచ్చింది ఓ బ్యాక్టీరియా అంటే వింతగా అన్పించినా వాస్తవం. కోటాది కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఆక్సిజన్ అనేది లేదు. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం వాయువులు, దుమ్ము, ధూళి ఒకచోట స్థిరపడి భూగోళం ఏర్పడింది. ఆ తరువాత మరో వంద కోట్ల సంవత్సరాలకు భూమిపై ఏకకణ జీవితో జీవం ఆవిర్భవించింది. అప్పటికి ఇంకా భూమి మీద ఉన్న అనేక రకాల వాయువుల్లో ఆక్సిజన్ లేదు. ఆ కాలంలో ప్రోక్లొరోకాకస్ అనే బ్యాక్టీరియా తన మనుగడ కోసం నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్‌ల ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరిగించి అవసరమైన శక్తిని పొందడం మొదలుపెట్టింది. సముద్రంలో ఉండే ఈ బ్యాక్టీరియా నిర్వహించిన కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ వాతావరణంలో కలవడం మొదలయ్యింది. సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఓ మోస్తరు ఆక్సిజన్ లభించడం మొదలయ్యింది. దీన్నే శాస్త్రవేత్తలు గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్‌గా అభివర్ణించారు. అలా మొదలైన ఆక్సిజన్ ఇప్పటికి భూమిపై ఉన్న వాతావరణంలో 21 శాతానికి పెరిగింది. కోటాను కోట్ల జీవరాశుల జన్మకు, మనుగడకు కారణమయ్యింది. నైట్రోజన్దే రాజ్యం భూ వాతావరణంలో అత్యధికంగా నైట్రోజన్ 78 శాతం ఉంది. అంటే ఆక్సిజన్, నైట్రోజన్ కలిసి గాలిలో 99 శాతం ఉన్నాయన్నమాట. ఇక ఆగాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులన్నీ కలిపి ఒక్క శాతం ఉన్నాయి. సౌర కుటుంబంలోని మిగతా గ్రహాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దాదాపుగా లేదు. ఒకవేళ ఉన్నా ఇతర వాయువుల సంయోగంలో మాత్రమే ఉంది. ఉదాహరణకు వీనస్ (శుక్రుడు), మార్స్ (అంగారకుడు) గ్రహాల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ కలిసి 98 శాతం ఆక్రమిస్తున్నాయి. ఈ కారణంగానే ఇతర గ్రహాలతో పాటు వీటిల్లోనూ జీవావిర్భావానికి అనుకూలమైన వాతావరణం లేదు. కిరణాలే జన్మదాతలు భూమ్మీద లభించే ఆక్సిజన్ దాదాపుగా కిరణజన్య సంయోగక్రియ (ఫొటోసింథసిస్) సృష్టించిందే. అయితే కేవలం భూమ్మీది వృక్ష జాతుల్లో జరిగే ఫొటోసింథసిస్ వల్లే మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందనుకుంటే పొరపాటే. సగం సముద్రంలో కూడా పుడుతోంది. సముద్రంలో ఉండే మొక్కలు, నాచు వంటి వృక్ష సంబంధమైనవి కూడా తమకు కావలసిన శక్తి కోసం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి మాదిరిగానే ప్రోక్లోరొకాకస్ బ్యాక్టీరియా కూడా ఫొటోసిం«థసిస్ ద్వారా ఆక్సిజన్‌ను సృష్టిస్తోంది. అయితే సముద్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో భూ వాతావరణంలో కలిసేది అత్యల్పమనే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్ చాలావరకు సముద్ర జీవజాలాల మనుగడకే సరిపోతుంది. కాబట్టి భూమ్మీద మనకు లభ్యమయ్యే ఆక్సిజన్ దాదాపుగా వృక్ష జాతుల పుణ్యమే. ఎంత చెట్టుకు అంత.. ఎదిగిన చెట్టుకు ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు ఉంటాయి. అయితే చెట్టులో ఐదు శాతంగా ఉండే ఆకులు మాత్రమే ఆక్సిజన్‌ను తయారు చేస్తాయి. వేర్ల నుంచి వచ్చే నీరు, సూర్యరశ్మి, వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్‌ను ఆకులు గ్రహించి కిరణ జన్య సంయోగక్రియ ద్వారా చెట్టు ఎదుగుదలకు కావలసిన గ్లూకోజ్‌ను తయారుచేస్తాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదిలేస్తాయి. చెట్లు కూడా కొంత ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయి కానీ విడుదల చేసే ఆక్సిజన్‌తో పోల్చుకుంటే అది అతిస్వల్పం. ఇలా వాతావరణంలో ఆక్సిజన్ చేరుతూ ఈ రోజు మొత్తం గాలిలో 21 శాతాన్ని ఆక్రమించింది. సమయం, కాలం ఇతర వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఒక చెట్టు ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే చెట్టు లేదా మొక్క రకాన్ని బట్టి ఆక్సిజన్ ఉత్పత్తి పరిమాణం మారుతూ ఉంటుంది. చాలావరకు మొక్కలు, చెట్లు పగలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తా యి. కొన్ని అరుదైన వృక్ష జాతులే 24 గంటలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు చాలామంది ఇంట్లో పెంచుకునే తులసి చెట్టు రోజులో 20 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తూనే ఉంటుంది. అలాగే అరెకాపామ్గా పిలిచే పోకచెట్టు 24 గంటల పాటూ ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతూనే ఉంటుంది. ఆరేడు చెట్లు = ఓ మనిషి మనుగడ ఒక అంచనా ప్రకారం ఒక ఆకు గంటకు ఐదు మిల్లీలీటర్ల ఆక్సిజన్‌ను తయారుచేస్తుంది. వంద అడుగుల భారీ వృక్షం ఏడాదికి 6,000 పౌండ్ల ఆక్సిజన్‌ను ఉత్తత్తి చేయగలదు. చిన్నా పెద్ద చెట్లు సగటున 260 పౌండ్లు అంటే సుమారు 120 కిలోల ఆక్సిజన్ని ఏడాదికి సృష్టిస్తాయి. మనిషి సగటున ఏడాదికి 9.5 టన్నుల గాలిని పీల్చుకుంటాడు. అయితే ఇందులో ఆక్సిజన్ 21 శాతమే ఉంటుంది. మనిషి పీల్చుకునే ఆక్సిజన్‌లో కూడా మూడోవంతు మాత్రమే దేహం ఉపయోగించుకుని మిగతాది గాలిలోకి వదిలేస్తుంది. ఈ లెక్కన మనిషి ఏడాదికి 740 కిలోల ఆక్సిజన్‌ను వాడుకుంటాడు. అంటే సగటున ఆరు నుంచి ఏడు చెట్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ఓ మనిషి మనుగడకు సరిపోతుందన్నమాట. భూమ్మీద శాశ్వతం కాదా? ఆక్సిజన్ భూమ్మీద శాశ్వతంగా ఉంటుందా అన్నది సందేహాస్పదమేనంటున్నారు సైంటిస్టులు. ఒకప్పుడు భూమిపై ఆక్సిజన్ లేదు కాబట్టి భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చునన్నది వారి అభిప్రాయం. నాసాకు చెందిన కజుమి ఒజాకి, క్రిస్టఫర్ రైన్హర్ట్ అనే శాస్త్రవేత్తలు.. ఓ ప్రయోగం ద్వారా ఇంకో వంద కోట్ల సంవత్సరాల తరువాత భూమ్మీద ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతుందనే అంచనాకు వచ్చారు. వంద కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు మరింత వేడిగా మారడం వల్ల భూమిపై కార్బన్ డైఆక్సైడ్ స్థాయి విపరీతంగా పెరిగి, ఆక్సిజన్ వెళ్లిపోయేలా చేస్తుందనేది వారి అంచనా. 20 వేల టన్నుల సామర్థ్యం కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక రోగులు పడిన అవస్థలు గుర్తుండే ఉంటాయి. భారతదేశం కోవిడ్ కాలానికి ముందు రోజుకి 6,900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేది. అందులో 1,000 టన్నులు మాత్రమే వైద్య అవసరాలకు అందుబాటులో ఉండేది. మొదటి విడత కోవిడ్ సమయంలో దీని అవసరం 3,095 టన్నులకు, రెండో విడత అంటే 2021లో 5,500 టన్నులకు పెరిగిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ప్రస్తుతం మనదేశంలో రోజుకు 20,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ వైద్య పరంగా ఇప్పుడు మనకు సగటున రోజుకు 1,250 టన్నుల ఆక్సిజన్ సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ద్వారా 7,054 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
బాన్స్వాడ నియోజకవర్గం చరిత్ర ఇది
బాన్స్ వాడ నియోజకవర్గం చరిత్ర ఇది సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోసారి విజయం సాదించి 2018లో స్పీకర్ పదవిని అదిష్టించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. బాన్స్వాడలో 2009 నుంచి వరసగా గెలుస్తున్న పోచారం 1994,99లలో కూడా గెలిచారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రి వర్గంలో ఆయన పనిచేశారు. పోచారం తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది కామల బాలరాజ్‌పై 18485 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. పోచారానికి 77343 ఓట్లు రాగా, బాలరాజ్‌కు 59458 ఓట్లు వచ్చాయి. టిడిపితో రాజకీయ జీవితాన్ని ఆరంబించిన పోచారం 2009లో టిడిపి పక్షాన గెలిచి, ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన ప్రకాష్ నాయిడుకు మూడువేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. బాన్స్వాడలో గెలిచిన పోచారం రెడ్డి సామాజికవర్గం వారు. బాన్స్వాడలో ఏడుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు విజయం సాధిస్తే, మూడుసార్లు బిసి నేతలు, నాలుగు సార్లు కమ్మ సామాజికవర్గం నేతలు, ఒకరు ఎస్.టి కాగా ఒకరు ఇతర వర్గాల నుంచి ఎన్నికయ్యారు. 1952లో ఏర్పడిన బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిపి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి ఆరుసార్లు, టిఆర్ఎస్ మూడుసార్లు విజయం సాధించాయి. 1983లో టిడిపి ఆవిర్భావం తరువాత ఒకసారి తప్ప రెండువేల తొమ్మిది వరకు ఆ పార్టీనే గెలిచింది ఒక్క 2004లోనే ఇక్కడ ఓడిపోయింది. ఆ తర్వాత టిఆర్ఎస్ కైవసం అయింది. 1967 నుంచి ఇక్కడ కాంగ్రెస్ తరుఫున శ్రీనివాసరావు మూడుసార్లు గెలిచారు. ఆయన బోధన్ నుంచి కూడా ఒకసారి గెలిచారు. శ్రీనివాసరావు కొంతకాలం అంజయ్య మంత్రివర్గంలో ఉన్నారు. పరిగి శ్రీనివాసరెడ్డి రెండుసార్లు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అప్పట్లో స్టేషనరీ కుంభకోణానికి న్కెతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసారు. 1952, 57లలో ఇక్కడ మహిళా అభ్యర్దులు గెలుపొందగా, 1957లో సీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004లో బాన్స్ వాడలో గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ అంతకుముందు 1999లో ఆర్మూరులో నెగ్గారు. 2014,2018లలో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీచేసి గెలుపొందారు. బాన్స్ వాడలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
టెక్ బుడగ పేలుతోందా?
ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు... అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అనేక దిగ్గజ ఐటీ కంపెనీల తాజా పరిస్థితి సైతం ఇదే. వరుసగా ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఒక్కసారిగా వేలాది మందిని తొలగిస్తున్నాయి. కోవిడ్ కాలంలో శరవేగంగా విస్తరించిన ఐటీ, ఆన్లైన్ సేవలతో లాభాలు పిండుకున్న టెక్ కంపెనీల అభివృద్ధి బుడగ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉందా? బేజారెత్తిన టెక్ కంపెనీల పరిస్థితికి కారణం ఏమిటి? భవిష్యత్తులో వాటి పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందా? ‘‘రెండో డిజిటల్ విప్లవానికి నాంది పడింది. ప్రతి కంపెనీ, ప్రతి పరిశ్రమ ఆన్లైన్ సేవల వైపు మొగ్గుతోంది. ఇది మా కంపెనీకి లాభాలను ఒనగూర్చుతోంది’’ – ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షల వేళ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల్ల వ్యాఖ్య ‘‘కోవిడ్ తర్వాత పరిస్థితులను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వస్తోంది’’ - కోవిడ్ వ్యాప్తి తగ్గిన ప్రస్తుత తరుణంలో సత్య నాదెళ్ల చేసిన తాజా ప్రకటన ఉద్వాసనల పర్వం.. కోవిడ్ కాలంలో అనుకోకుండా వచ్చి పడిన అవకాశంతో అభివృద్ధి పుంతలు తొక్కిన టెక్ సంస్థలు శరవేగంగా విస్తరణపర్వం మొదలుపెట్టాయి. ప్రపంచం నలుమూలలకు విస్తరించే క్రమంలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. అమెజాన్ ఒక్కటే 2022 సెప్టెంబర్ నాటికి ఏడాది మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పించాయి. గతేడాది చివరికి వచ్చే సరికి పరిస్థితులు మారడం మొదలైంది. లాభాల్లో కోత పడతుండటంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఒక్క 2022లోనే టెక్ కంపెనీలన్నీ కలిపి 1,64,411 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు లేఆఫ్స్ ఎఫ్‌వైఐ అనే సంస్థ సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 658 టెక్ కంపెనీలు 1,91,416 మంది ఉద్యోగులను తొలగించాయి. కేవలం టెక్ స్టార్టప్ కంపెనీలకు మాత్రమే నిధులు సమాకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ఈ ఏడాది మార్చిలో కుప్పకూలడం ఐటీ కంపెనీలకు మరో శరాఘాతంగా పరిణమించింది. నిధుల కొరతతో అనేక కంపెనీలు మూతపడటమో, ఉద్యోగాలను తొలగించడమో చేశాయి. గతేడాది నవంబర్‌లో 11,000 ఉద్యోగాల కోతపెట్టిన మెటా... మళ్లీ ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మందిని తొలగించింది. అమెజాన్ 2022 నవంబర్‌లో 10,000 మంది, 2023 జనవరిలో 8 వేల మంది, మార్చిలో 9 వేల మంది ఉద్యోగులను తొలగించింది. యాక్సెంచర్ ఈ ఏడాదిలో ఇప్పటికే తన ఉద్యోగుల్లో 2.5 శాతం అంటే దాదాపు 19 వేల మందిని తొలగించింది. ట్విట్టర్‌ను కైవశం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని 80 శాతం మంది ఉద్యోగులను తొలగించామని ఎలాన్ మస్క్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే దాదాపు 6 వేల మంది ఉద్యోగులను తొలగించారు. కాగ్నిజెంట్ ఈ నెల 4న 3,500 మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్ గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్లో అత్యల్ప ఆదాయం ఆర్జించింది. అమ్మకాలు 14 శాతం పడిపోయినట్లు సత్య నాదెళ్ల వెల్లడించారు. (వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?) ఎందుకీ పరిస్థితి టెక్ కంపెనీల తిరోగమ నానికి ఒక్కసారిగా వచ్చిపడ్డ అనేక పరిణామాలు కారణం. కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఒక కారణమైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం, డాలర్ విలువ పెరగడం, అధిక వడ్డీలు, స్థాయికి మించిన ఉద్యోగుల సంఖ్య వంటి కారణాలు టెక్ ప్రపంచాన్ని ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఆర్థిక మాంద్యం ఛాయలు క్రమేణా విస్తరిస్తూ ద్రవ్యోల్బణానికి ఆపై అధిక వడ్డీలకు దారితీశాయి. ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలోనే కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఉప్పెనలా వచ్చిపడి టెక్నాలజీ సంస్థల అభివృద్ధికి గండికొడుతున్నాయి. ఏఐ అత్యంత నాణ్యమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయాలను సృష్టిస్తూ శరవేగంగా అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఇంతవరకు మానవ సంపదపై ఆధారపడి పనిచేస్తున్న టెక్ కంపెనీల ఉత్పాదనలను కృత్రిమ మేధ క్షణాల్లో అతిచౌకగా రూపొందిస్తుడటంతో ఆయా కంపెనీల ఆదాయంపై దెబ్బపడుతోంది. దాంతో గత్యంతరం లేక కంపెనీలు ఉద్యోగులను భారీగా తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. టెక్ ప్రపంచాన్ని వేధిస్తున్న మరో కారణం ద్రవ్యోల్బణం. ప్రస్తుత ధరల స్థాయి గత 40 ఏళ్లలోనే అత్యధికం. పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలతో వినియోగదారులు టెక్ కంపెనీల ఉత్పాదనలు, సేవలను భరించలేని స్థాయికి చేరుకుంటున్నారు. ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వాలు వడ్డీ రేట్లను పెంచుతుండటం టెక్ కంపెనీలకు దెబ్బమీద దెబ్బగా పరిణమిస్తోంది. అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోతుండటం కంపెనీలు నడపడానికి రుణాలు తీసుకోలేక ఉద్యోగుల ఉద్వాసనకు ఉపక్రమించాయి. కరోనా వేళ మార్కెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక, తమ అభివృద్ధి శాశ్వతమని భావించి అడ్డగోలుగా ఉద్యోగులను తీసుకున్నామని మెటా అధిపతి జుకర్‌బర్గ్, సేల్స్‌ఫోర్స్ అధినేత మార్క్ బెన్యాఫ్ ఒప్పుకున్నారు. టెక్ దిగ్గజాలకు భిన్నంగా యాపిల్ కంపెనీ మాత్రం ఉద్యోగ నియామకాల్లో సంయమనం పాటించింది. కోవిడ్ కాలంలో ఉద్యోగుల సంఖ్యను కేవలం 20 శాతమే పెంచుకుంది. దాంతో ఇంతవరకు ఉద్యోగులను తొలగించని టెక్ దిగ్గజం యాపిల్ ఒక్కటే. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు పాతికేళ్ల నాటి డాట్‌కామ్ బుడగను గుర్తుచేస్తోందని నిపుణులు అంటున్నారు. ఏమిటీ డాట్‌కామ్ బుడగ? గత శతాబ్దం చివర్లో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తరుణంలో దాని ఆధారంగా పుట్టుకొచ్చిన కంపెనీలు ఊహించని రీతిలో వృద్ధి చెందాయి. పేరు చివర డాట్‌కామ్ ఉన్న ప్రతి కంపెనీ విలువ వేలం వెర్రిగా పెరిగిపోయింది. 1995 నుంచి 2000 వరకు ఆన్లైన్ సేవల పేరిట వెలిసిన కంపెనీలన్నీ ఇబ్బడిముబ్బడిగా పెరిగి శతాబ్దం చివరికి వచ్చే సరికి గాలిబుడగలా పేలిపోయాయి. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) ముందున్న కాలమంతా డాట్‌కామ్ కంపెనీలదే అని నిమ్మన వ్యక్తులు, సంస్థలు ఆయా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఉదాహరణకు 1994లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పడిన నెట్‌స్కేప్ అనే సంస్థ 1995లో అంటే కేవలం ఏడాది తరువాత పబ్లిక్ ఫండింగ్‌కు వెళ్తే ఒక్క రోజులోనే దాని మార్కెట్ క్యాప్ 278 కోట్ల డాలర్లకు చేరుకుంది. జనరల్ మోటార్స్‌కు ఈ విలువ సాధించడానికి 40 ఏళ్లు పట్టింది. 2001 వచ్చే సరికి ఈ డాట్‌కామ్ కంపెనీల విలువ కేవలం ఊహాజనితమని అర్థమై అందరూ పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో ఈ కంపెనీలన్నీ కుప్పకూలిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ‘నాస్డాక్’లో 1995 నుంచి 2000 వరకు క్రమేపీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 800 శాతం పెరిగితే 2002 వచ్చే సరికి పెరిగిన మొత్తంలో 790 శాతం పడిపోయి దాదాపు మొదటికి వచ్చింది. దాంతో డాట్‌కామ్ బుడగ పేలిపోయింది. (ఇలాంటి టెక్ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్) - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
కృత్రిమ మేధ కళలకు వధ?
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు క్లౌడిమోనెట్ ‘వాటర్ లిల్లీస్’ పేరిట రూపొందించిన 250 చిత్రాలు పూర్తి చేయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. తన ఇంటి దగ్గర ఉన్న సరస్సులో లిల్లీపూల స్ఫూర్తిగా ఆయన వీటిని చిత్రించారు. వాటర్ లిల్లీస్లోని ఒక చిత్రం 2007లో సోత్బే వేలంలో 1.85 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. తరువాతి సంవత్సరం లండన్ క్రిస్టీ వేలంలో మరో చిత్రం 4.1 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. మోనెట్ చిత్రించిన వాటర్ లిల్లీస్ను ఓ మంచి ఫొటోగ్రాఫర్ అంతే అందంగా కొన్ని క్షణాల్లో కెమెరాలో బంధించగలడు కానీ వాటికి ఉండే విలువెంత? దొడ్డ శ్రీనివాసరెడ్డి : 19వ శతాబ్దంలో లాండ్ స్కేప్ ఆర్టిస్టులకు, ఫొటోగ్రాఫర్లకు మధ్య వివాదం చెలరేగింది. ఫొటోలను సృజనాత్మక కళగా గుర్తించగలమా అన్నది నాటి కళాకారుల ప్రశ్న. కానీ తదుపరి కాలంలో ఫొటోగ్రఫీ కూడా కళగా అవతరించింది. ఫొటోలు కూడా వందల కోట్ల డాలర్లు ఆర్జించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కళాకారుల మనుగడనే ప్రశ్నించే మరో ముప్పు కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో వచ్చి పడింది. ఏళ్లకు ఏళ్లు చేసిన సాధన ద్వారా కళాకారులు సాధించిన నైపుణ్యాన్ని కృత్రిమమేధ క్షణాల్లో అనుకరిస్తోంది. నమూనాలను సృష్టిస్తోంది. కృత్రిమమేధ ఇకముందు కళలకు సమాధి కడుతుందా? మనిషి సృజనాత్మకతతో పోటీపడుతుందా? కారుచౌకగా ఏఐ కళారూపాలను సృష్టిస్తుంటే అసలు కళలకు ఆదరణ ఉంటుందా? ఏఐ రూపొందించే కళలకు విలువ ఉంటుందా? అన్నవి ఇప్పుడు కళా ప్రపంచంలో తలెత్తుతున్న ప్రశ్నలు. ఇప్పటికే అనేక రంగాలను ఆక్రమించుకుంటున్న కృత్రిమమేధ ఇక సృజనాత్మక కళారంగాలనూ కబ్జా చేస్తుందని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమమేధ ఆధారంగా చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ సృష్టించిన సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన మరో ప్లాట్‌ఫామ్ డాల్–ఇ. ప్రఖ్యాత ఫ్రెంచ్ సర్రియలిస్ట్ పెయింటర్ సాల్వడార్ డాలీ పేరును పోలినట్లుగా ఉండే ఈ డాల్–ఇ ప్లాట్‌ఫామ్ కృత్రిమమేధను ఉపయోగించి అద్భుతమైన డిజిటల్ పెయింటింగ్స్‌ను సృష్టిస్తోంది. డాల్–ఇ మాదిరిగానే మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ లాంటి మరికొన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు కూడా చిత్ర కళారంగంలో చొరబడి సంచలనం సృష్టిస్తున్నాయి. హేగ్ మ్యూజియంలో ఉన్న జొనెస్ వెర్మర్ అద్భుత కళాఖండం ‘గర్ల్ విత్ ఎ పెరల్ ఇయరింగ్’ స్ఫూర్తిగా జులియన్ వాన్ డైకెన్ అనే ఆర్టిస్టు మిడ్ జర్మీ ప్లాట్‌ఫామ్‌పై కృత్రిమమేధను వినియోగించి రూపొందించిన ‘ఎ గర్ల్ విత్ గ్లోయింగ్ ఇయరింగ్స్’ చిత్రాన్ని ఆమ్స్టర్డామ్లోని ఓ ప్రముఖ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టినప్పుడు చిత్ర కళారంగంలో అలజడి రేగింది. కంప్యూటర్ సృష్టించిన చిత్రాన్ని కళాఖండంగా ఎలా పరిగణిస్తారని ఆర్టిస్టులు ముక్తకంఠంతో ప్రశ్నించారు. ప్రింటింగ్, పబ్లిషింగ్ పరిశ్రమ కూడా ఇప్పుడు కృత్రిమమేధను ఆశ్రయించి కవర్ డిజైన్స్ రూపొందిస్తోంది. ప్రముఖ పత్రిక ‘ది ఎకనామిస్ట్’ ఇప్పుడు తన కవర్ డిజైన్ల సృష్టికి కృత్రిమమేధపై ఆధారపడుతోంది. అనేకమంది రచయితలు తమ నవలలు, పుస్తకాల కవర్ డిజైన్ల కోసం కృత్రిమమేధను ఉపయోగిస్తున్నారు. ఆర్కిటెక్ట్‌లు కూడా అద్భుతమైన కట్టడాలు, డామ్లు, స్టేడియాలు, గార్డెన్ల డిజైన్ల రూపకల్పనకు కృత్రిమమేధను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలోకీ కృత్రిమమేధ అడుగుపెట్టింది. ది ఫ్యాబ్రికెంట్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అనూహ్యమైన వ్రస్తాలు, ఆభరణాల డిజైన్లను ఏఐతో సృష్టిస్తున్నాయి. ఇవి ధరించడానికి పనికి రావు కానీ డిజిటల్ రూపంలో వర్చువల్‌గా వీటిని ధరించి ఆనందించవచ్చు. అయితే వీటిని పొందడానికి మాత్రం ‘నిజమైన’ ధర చెల్లించాల్సిందే. కొన్ని వ్రస్తాల డిజైన్లు పదివేల డాలర్ల వరకు ఉన్నాయి. ఇటీవల బీచ్‌లో సర్ఫింగ్ చేస్తున్న వారి ఫొటో ఒకటి ఆ్రస్టేలియాలో ప్రతిష్టాత్మకమైన ఫొటోగ్రఫీ పోటీల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫొటో కృత్రిమమేధ ఆధారంగా తయారుచేసిందని తెలిసి ప్యానెల్ జడ్జిలు ఈ చిత్రాన్ని తొలగించి వేరే ఫొటోను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చెలరేగిన వివాదం ఫలితంగా పోటీలను రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి కంప్యూటర్ సృష్టించే ఫొటోలకు, మరొకటి కెమెరా ద్వారా తీసిన ఫొటోలకి. కదం తొక్కుతున్న కళాకారులు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, నిపుణులు ఏళ్ల తరబడి కృషితో సాధించిన నైపుణ్యాన్ని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తున్న కృత్రిమమేధపై కదం తొక్కుతున్నారు. కళా నైపుణ్యాన్ని కూడా ఆటోమేషన్ చేస్తే తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టిస్టులు, డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, రచయితలు, మ్యుజీషియన్లు తమ మనుగడను అంధకారంలోకి నెడుతోందని కృత్రిమమేధపై విరుచుకుపడుతున్నారు. కృత్రిమమేధ చొరబాటును అడ్డుకునేందుకు రకరకాల ఆయుధాలు సన్నద్ధం చేస్తున్నారు. శాన్ఫ్రాన్సికోకి చెందిన కార్టూనిస్టు సరా అండర్సన్, ఇల్ల్రస్టేటర్ కార్లో వోర్టిజ్ కాపీరైట్ చట్టం కింద న్యాయ పోరాటం చేస్తున్నారు. తమ బొమ్మలను అనుకరిస్తూ నకలు సృష్టిస్తున్న ఏఐ వేదికలు డ్రీమ్ అప్, మిడ్ జర్నీ, స్టేబుల్ ప్యూజన్పై వీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, పరిహారం చెల్లించకుండా తమ బొమ్మలను వాడుకుంటున్నందుకు కాపీరైట్ చట్టం కింద శిక్షించాలని కోరారు. గుర్తింపు కావాలి ఏఐ ఆధారిత కంప్యూటర్ ప్రోగ్రాంలు సొంతంగా ఏమీ సృష్టించలేవు. అవి సృష్టించే నకలుకి ఏదో ఒక అసలైన చిత్రమో, కళాకారులు లేదా రచయితల శైలి ఆధారం కావాలి. ఎలాంటి చిత్రం, ఫొటో, రచన కావాలన్నా ఎవరిశైలిలో కావాలన్నా కమాండ్ ఇస్తే వాటిని అనుసరించి కృత్రిమమేధ నకలును సృష్టించగలుగుతుంది. అలాంటప్పుడు వాటికి ఆధారమైన కళాకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లకు తగిన రీతిలో పరిహారం చెల్లించడం, గుర్తింపు ఇవ్వాలనేది వారి వాదన. క్రిస్ కస్టనోవా అనే రచయిత్రి ‘జోర్యా ఆఫ్ ద డాన్’ పేరిట ప్రచురించిన కామిక్ నవలకు అమెరికా కాపీరైట్ ఆఫీసు తొలుత ఆమోదం తెలిపింది. అయితే ఈ కామిక్‌లో ఉపయోగించిన బొమ్మలు మిడ్‌జర్నీ ప్లాట్‌ఫామ్ ద్వారా సృష్టించినట్లు తరువాత వెల్లడైంది. దీనిపై వివాదం చెలరేగడంతో నవలలో కథకు మాత్రమే కాపీరైట్ ఇస్తున్నామని, కంప్యూటర్ సృష్టించిన బొమ్మలకు ఇవ్వలేదని కాపీరైట్ ఆఫీసు తన నిర్ణయాన్ని సవరించుకుంది. బొమ్మలు, కార్టూన్లు, చిత్రాలను కృత్రిమమేధ కాపీ కొట్టకుండా షికాగో యూనివర్సిటీకి చెందిన ఓ బృందం ‘గ్లేజ్’ అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఉపయోగిస్తే, అది చిత్రాలపై కంటికి కనిపించని ఒక తెరను కప్పేస్తుంది. దాంతో కృత్రిమమేధ ఈ చిత్రాన్ని కాపీ కొట్టడం కుదరదు. ‘కృత్రిమమేధ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కొన్ని మార్గదర్శకాలు, ఆంక్షలు అవసరం’ అని గ్లేజ్ సృష్టికర్త స్వాన్షాన్ అభిప్రాయపడ్డారు. సహజీవనం తప్పదు కృత్రిమమేధ విస్తృతిని ఆపడం ఎవరివల్లాకాదు. అన్ని రంగాల్లోకి అది చొచ్చుకుపోతోంది. ఇక కృత్రిమమేధను మన జీవితాల్లోకి ఆహ్వా నించక తప్పదు. దాంతో సహజీవనానికీ మార్గం సుగమం చేసుకోవాల్సిందే అని విజ్ఞులు చెబుతున్నారు. సాల్వడార్ డాలీ సర్రియలిస్టు పెయింటింగ్స్‌ను, పికాసో అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ను, బ్రాక్ క్యూబిజమ్ను మొదట్లో కళగా గుర్తించలేదు. కానీ ఇప్పుడవి అద్భుత కళాఖండాలుగా ఆవిష్కృతమయ్యాయి. కొత్తదనాన్ని స్వీకరించడానికి మనిషికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు కృత్రిమమేధ సృష్టించే కళారూపాల్ని ముందు ముందు మనం ఆమోదించి ఆహ్వా నిస్తామేమో?. -
డాలర్ డౌన్ ఫాల్!
దొడ్డ శ్రీనివాసరెడ్డి : గ్లోబల్ కరెన్సీగా అమెరికన్ డాలర్‌కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. డాలర్‌కు వ్యతిరేకంగా సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య పెరిగిపోయింది. ఈ దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అమెరికన్ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, రుణాలు, సెక్యూరిటీల లావాదేవీల్లో సగానికి పైగా డాలర్లలోనే సాగుతున్నాయి. ఇక విదేశీ కరెన్సీల ఎక్సే్ఛంజ్ మార్కెట్లలో మొత్తం అన్ని కరెన్సీలను కలుపుకొన్నా 90 శాతం ట్రేడింగ్ అమెరికన్ డాలర్ల ద్వారానే జరుగుతోంది. ఇక ముందు ఈ పరిస్థితి మారబోతోంది. డాలర్‌పై ఆధారపడటం మాని సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనే కోరికతో అనేక దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సమీప భవిష్యత్‌లోనే గ్లోబల్ కరెన్సీ స్థానాన్ని అమెరికన్ డాలర్ కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఇలా మొదలైంది.. బ్రెట్టన్‌వుడ్ ఒప్పందంతో అమెరికన్ డాలర్ పెత్తనం మొదలైంది.రెండో ప్రపంచ యుద్ధకాలంలో కుదేలైన అనేక దేశాలు ముఖ్యంగా యూరప్ దేశాలు అనేకానేక ఉత్పత్తుల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది. వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలనే విషయమై ఐక్యరాజ్యసమితి ద్రవ్య, ఆర్థిక సదస్సు అమెరికా న్యూ హాంప్‌షైర్‌లోని బ్రెట్ట్టన్వుడ్లో జరిగింది. 44 దేశాలు పాల్గొన్న ఈ సమావేశంలో అంతర్జాతీయంగా బంగారు ధరలను డాలర్ విలువకు జతచేస్తూ ఒప్పందం చేసుకున్నా యి. దాంతో ఇతర కరెన్సీల విలువను డాలర్ మారక విలువ కోసం ఈ ఒప్పందం ప్రాతిపదికైంది. ఒక డాలర్ విలువ ఒక ఔన్స్ (31.1034768 గ్రాములు) బంగారంతో సమానమైంది. 1970లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ విలువను బంగారు ధరకు జత చేయడాన్ని రద్దు చేసినప్పటికీ అప్పటికే డాలర్ నిల్వలు అన్ని దేశాల్లో పెరిగిపోయి గ్లోబల్ కరెన్సీగా అవతరించింది. పనామా, ఎల్ సాల్వడార్, జింబాబ్వే లాంటి 11 దేశాలు ఇప్పటికీ అమెరికన్ డాలర్‌నే తమ దేశాల్లో అధికారిక కరెన్సీగా చెలామణి చేస్తున్నాయి. డాలర్ శక్తిసామర్థ్య ంతో రెచ్చి పోయిన అమెరికా అనేక సందర్భాల్లో ఆ డాలర్‌నే ఆయుధంగా వాడుకుంది. ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వ చేసిన 64,000 కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది. రష్యా విదేశీ మారక నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంది. ఇలాంటి ప్రయోగమే వివిధ సందర్భాల్లో అఫ్గానిస్తాన్, ఇరాన్, వెనెజులా వంటి దేశా లపై అమెరికా ప్రయోగించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది. తొలుత రష్యాలో.. క్రిమియా ఆక్రమణ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొనడానికి 2014లో రష్యా చైనాతో చేతులు కలిపి డాలర్‌కు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీంతో గ్లోబల్ కరెన్సీగా చెలామణి అవుతున్న అమెరికన్ డాలర్‌కు పెద్ద సవాల్ మొదలైంది. రష్యా, చైనా మధ్య జరిగే అన్ని వ్యాపార లావాదేవీల్లో మారక ద్రవ్యంగా రూబుల్–యువాన్లు వినియోగించాలని ఈ రెండు దేశాలు నిర్ణయించా యి. అంతేకాదు రష్యా తన విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అధికశాతం చైనా యువాన్ కరెన్సీని సమకూర్చుకోవాలని కూడా నిర్ణయించింది. దాంతో గత ఏడాదికి రష్యా విదేశీ మారక నిల్వ ల్లో యువాన్ 60 శాతానికి పెరిగినట్లు రష్యా ఆర్థిక శాఖ ప్రకటించింది. అలాగే డాలర్ స్థానంలో తమ సొంత కరెన్సీల్లోనే వ్యాపారం నిర్వహించాలని ఇటీవల చైనా, బ్రెజిల్ నిర్ణయించాయి. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన బ్రెజిల్‌తో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా డాలర్ పెత్తనానికి మరో పెద్ద సవాల్ ఏర్పడింది. బ్రెజిల్ రీస్ చైనా యువాన్ బంధం డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించింది. గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య 15,000 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. డాలర్, యూరో, యెన్, పౌండ్లకు బదులు తమ దేశాల కరెన్సీలతోనే వ్యాపారం సాగించాలనే ఏకైక ఎజెండాతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖలు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవల అధికారిక సమావేశం నిర్వహించాయి. 70 శాతం నుంచి 59 శాతానికి.. గత జనవరిలో దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెది పాండోర్ ఒక ఇంటర్వ్యూలో ‘బ్రిక్, (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ మారకాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటున్నాయి’అని వెల్లడించారు. సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్–జదాన్ ఇటీవల మరో బాంబు పేల్చారు. చమురు వ్యాపారంలో డాలర్‌కు ఇతర కరెన్సీల వినియోగంపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అంతర్జాతీయంగా చమురు వాణిజ్యం దాదాపుగా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. అందుకే దాన్ని పెట్రోడాలర్గా పిలుస్తారు. చమురు ఎగుమతుల్లో ఒపెక్ (చమురు ఉత్పత్తి చేసే దేశాలు) దేశాల్లో అగ్రస్థానంలో నిలిచే సౌదీ అరేబియా ఇతర కరెన్సీల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చరమగీతం పాడినట్లేనని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. భారత్–రష్యా మధ్య కూడా వాణిజ్యం అమెరికన్ డాలర్లో కాకుండా ఇతర కరెన్సీల్లో జరుగుతోంది. భారతీయ సంస్థలు రష్యా నుంచి చేసుకున్న దిగుమతులకు అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ దినార్‌ను వినియోగించేవి. ఇప్పుడు రూబుల్లో చెల్లింపులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభానికి వివిధ దేశాల విదేశీ మారక నిల్వల్లో అమెరికన్ డాలర్ వంతు 59 శాతానికి తగ్గిపోయింది. ఇది 1999 నాటికి 70 శాతం ఉండేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఇక భారత్ వంతు.. భారత్ కూడా తన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశలో చర్యలు మొదలుపెట్టింది. అనేక దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న తరుణంలో డాలర్, యూరో, యెన్, పౌండ్లతో దీటుగా రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చెలామణి చేసేందుకు తొలి అడుగులు వేసింది. రూపాయిని మారక విలువగా వినియోగించేందుకు వీలుగా ఆర్బీఐ రష్యా, శ్రీలంకతోపాటు మొత్తం 18 దేశాల్లోని 60 బ్యాంకుల్లో వోస్ట్రో అకౌంట్లను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి ద్వారా నిర్వహించడానికి వీలుగా ఆర్బీఐ ఈ అకౌంట్లను ప్రారంభించిందని భారత ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ప్రకటించారు. రూపాయితో వ్యాపారం చేయడానికి ఒప్పుకున్న దేశాల్లో బ్రిటన్, మలేషియా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, శ్రీలంక, మయన్మార్, బోట్స్వానా, ఇజ్రాయెల్, ఫిజి, ఒమన్, జర్మనీ, కెన్యా, గయానా, మారిషస్, టాంజానియా, ఉగాండా దేశాలున్నాయి. అమెరికా వాల్‌స్ట్రీట్‌లో ‘డాక్టర్ డూమ్’గా పేరుపడ్డ ఆర్థికవేత్త నౌరియల్ రుబిని ‘రానున్న రోజుల్లో భారత రూపాయి అంతర్జాతీయ విపణిలో అతి ముఖ్యమైన విదేశీ మారకద్రవ్యంగా అవతరించబోతోంది’ అన్నారు. -
నా సినిమాల జోలికొస్తే మూడో కన్ను తెరుస్తా
తెనాలి: ‘సినిమా నా ఊపిరి. సినిమా, రాజకీయం నాకు రెండు కళ్లు. నరసరావుపేటలో బాలకృష్ణ పాట వేశారని అభ్యంతరం పెట్టారట.. జాగ్రత్త..’ అంటూ ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో పెమ్మసాని థియేటరులో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగిస్తుండగా, పక్కనే ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెవిలో నరసరావుపేట అంటూ ఏదో చెప్పారు. వెంటనే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నరసరావుపేటలో బాలకృష్ణ పాట ఎందుకు వేస్తారని అన్నారట.. జాగ్రత్త.. ఒకసారి నేను మూడోకన్ను తెరిచానో.. పొలిటీషియన్‌గా నాపై రండి.. నేను రెడీ. సినిమా జోలికొస్తే.. మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోండి’ అంటూ హెచ్చరించారు. పరోక్షంగా నరసరావుపేట ఎమ్మెల్యేనుద్దేశించి బాలకృష్ణ ఈ హెచ్చరిక చేసినట్లు భావిస్తున్నారు. మహానటి సావిత్రి, ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డికి ప్రకటించిన ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలను వారి వారసులు విజయ చాముండేశ్వరి, బి.విశ్వనాథరెడ్డి అదుకున్నారు. బాలయ్యా.. నోరుపారేసుకోవద్దు: నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నోరుపారేసుకుంటున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. ‘మహా శివరాత్రికి కోటప్పకొండలో ప్రభలు కట్టడం ఆనవాయితీ. భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రజల నుంచి చందాలు వసూలు చేసి ప్రభ కట్టి తాగి తందానాలాడి దానిని కోటప్ప కొండకు తీసుకువెళ్లకుండానే మధ్యలో ఆపేసి ప్రజలకు అసౌకర్యం కలిగించారు. దీనికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడటం పద్ధతి కాదు’ అని చెప్పారు. -
వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి
కర్నూలు(హాస్పిటల్): కత్తిపోట్లకు గురై వీపున కత్తితో వచ్చిన ఓ వ్యక్తికి కర్నూలు వైద్యులు సకాలంలో స్పందించి శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డికి ఆస్తి వివాదాలు ఉండటంతో కొంత కాలంగా అనంతపురం పట్టణంలోని మారుతినగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. శనివారం రాత్రి భోజనం ముగించుకుని బయట వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కత్తి శ్రీనివాసరెడ్డి వీపున అలాగే దిగబడిపోయింది. వెంటనే అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కర్నూలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వెంటనే కార్డియోథొరాసిక్ హెచ్‌వోడి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేశారు. శ్రీనివాసరెడ్డి ఆరోగ్యపరిస్థితి గురించి అక్కడి వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. వెంటనే కర్నూలుకు తీసుకురండి ఆపరేషన్ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో శ్రీనివాసరెడ్డిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. తెల్లవారుజాము నుంచే ఎక్స్‌రే, సీటీస్కాన్ తీసి కత్తి ఎంత వరకు వెళ్లిందో పరిశీలించారు. ఆదివారం ఉదయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్రలతోపాటు అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ కొండారెడ్డితో కలిసి శ్రీనివాసరెడ్డికి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి కోలుకుంటున్నారని వివరించారు. -
తిరుపతి జూ పార్క్‌కు తరలిన పులి కూనలు
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయంలో ఉంచిన ఉన్న నాలుగు పులి కూనలను గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జువాలాజికల్ పార్కుకు తరలించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు నాగార్జున సాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలి పారు. తల్లితో పులి కూనలను కలిపేందుకు నాలుగు రోజులపాటు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పులి కూనల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జూ పార్క్‌కు తరలించారు. పులి కూనల ఆరోగ్యం భేష్ తల్లి పులి బతికే ఉందని నిర్ధారణ కావడం, పులి కూనలు కూడా ఆరోగ్యంగా చలాకీగా ఉండటం సంతోషకరమని నాగార్జునసాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జూపార్క్‌కు అనుబంధంగా ఉన్న అడవిలో పులి కూనలను పెంచుతామన్నారు. కొంత వయసు వచ్చాక వేటలో తర్ఫీదునిచ్చి తిరిగి అడవిలో ప్రవేశ పెడతామని చెప్పారు. ఇదిలావుండగా.. పులి పాదముద్రలు కనిపించాయని కొందరు చెప్పగా.. ఆ ప్రదేశానికి గురువారం తెల్లవారుజామున పులి కూనలను తరలించారు. కూనల అరుపులతో కూడిన రికార్డింగ్స్‌ను వినిపిస్తూ.. తెల్లవారే వరకు ఎదురు చూసినా తల్లి పులి జాడ కనిపించలేదు. -
నాలుగో రోజైనా జాడ దొరికేనా?
ఆత్మకూరు రూరల్/కొత్తపల్లి: శ్రీశైలం–నాగార్జున సాగర్ పులుల అభయారణ్యంలో 4 ఆడ పిల్లలను ఈనిన ‘టీ108’ అనే పెద్దపులి వాటికి దూరమై 3 రోజులు గడిచిపోయింది. మరో వైపు తల్లీ బిడ్డల పునరేకీకరణ (రీయూనియన్)కు అటవీ అధికారులు పూర్తిగా శ్రమిస్తున్నారు. 300 మంది ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్) సిబ్బంది, అధికారులు విడతల వారీగా పాద పరిశీలన (ఫుట్ పేట్రోలింగ్) చేస్తున్నారు. పులుల ప్రవర్తనాంశాలను పరిశీలిస్తే తల్లి పులి తన పిల్లల కోసం గరిష్టంగా 4 రోజుల వరకు వెతికే యత్నం చేస్తుందని పులి జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు చెబుతున్నారు. అయితే ఇంకో 24 గంటలు గడిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక తల్లి పులి తన బిడ్డలను గుర్తించి అక్కున చేర్చుకోవడమన్నది అసాధ్యమంటున్నారు. తల్లి పులి జాడ దొరకని పక్షంలో పులి కూనలను జంతు ప్రదర్శన శాలకు తరలించే అవకాశం ఉంది. కాగా, పులి కూనల ఆరోగ్యం నిలకడగా ఉందని ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్) డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ చెప్పారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పులి కూనలు చక్కగా ఆహారం తీసుకుంటున్నాయని, కోడి కాలేయం ముక్కలను ఇష్టంగా భుజించాయని తెలిపారు. 300 మంది ఎన్ఎస్టీఆర్ సిబ్బంది, అధికారులు విడతల వారీగా పాద పరిశీలన (ఫుట్ పేట్రోలింగ్)లో ఉన్నట్లు వివరించారు. తల్లిని విడిచిన కూనలు కొంత షాక్‌లో ఉంటాయి కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించడం వాటికి ఇబ్బంది అయిన కారణంగా మొదట తల్లిని అన్వేషించి ఆ తరువాత పిల్లలను ఆ పులి వద్దకు చేర్చే వ్యూహాన్ని పాటిస్తున్నామన్నారు. స్నిప్పర్ డాగ్స్‌తో (శునక శోధన), డ్రోన్ కెమెరాలతో పులిని గుర్తించే యత్నం చేయడం లేదని, అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని చెప్పారు. ఆ పాదముద్ర తల్లి పులిదేనా? నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ముసలిమడుగు, చిన్నగుమ్మడాపురం గ్రామాల మధ్యన ప్రధాన రహదారికి కొద్ది దూరంలో ఆటోడ్రైవర్‌కు పెద్దపులి బుధవారం కనిపించింది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న గొర్రెల కాపరి చిన్న వెంకటేశ్వర్లుకు అతడు తెలపగా..అతను చూసేలోపు పులి అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి కాలిముద్రలను పరిశీలించారు. అచ్చిరెడ్డికుంట వరకు పెద్దపులి కాలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడినుంచి పులి ఎటువైపుగా వెళ్లిందనే కోణంలో గాలింపునకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఈ పులి పాదముద్రలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అచ్చు తీసి టీ108 తో సరిపోల్చి నిర్థారించగలిగితే తల్లిని అన్వేషించే పనిలో కొంత పురోభివృధ్ధి సాధించినట్లేనని శ్రీశైలం అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు డీఎఫ్‌వో అలెన్చాంగ్టేరాన్ తెలిపారు. -
తల్లి కోసం పులి కూనల కలవరం
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి జాడ రెండు రోజులైనా కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే మీమాంస అధికారుల్లో నెలకొంది. పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్ఫ్రారెడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలుత తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి³ పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్ నుంచి వదులుతారు. ఆ నాలుగూ ఆడ కూనలే పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి. వాటిలో రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. బతికిన వాటిలో సాధారణంగా ఒక్కొక్క ఆడ, మగ కూనలు ఉండవచ్చు. పెద్ద పులుల సంరక్షణ, సంతతి పెరుగుదలలోనూ ఆడ పులులదే ప్రధాన పాత్ర. గుమ్మడాపురంలో ఏకంగా ఒకే ఈతలో నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడంతో అటవీ శాఖ అధికారులకు పెద్ద సంబరమే అయ్యింది. ఒక ఆడపులి తన జీవిత కాలంలో (అడవిలో అయితే 18 ఏళ్లు) 20 పులులను పునరుత్పత్తి చేయగలదు. చేరదీస్తుందో.. లేదో! వన్యప్రాణుల్లో పెద్ద పులి, దొమ్మల గొండి (హైనా) తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. బిడ్డలకు ఏ కారణంగా అయినా మనిషి స్పర్శ తగిలితే వాటిని తిరిగి తమ దగ్గరకు రానీయవు. పులి కూనలను ఇక్కడి జనం ఇష్టం వచ్చినట్లు పట్టుకుని ఫొటోలు తీసుకోవడం, వాటితో ఆటలాడటం వంటి పనులు చేయడంతో పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పిల్లలను తల్లి చెంతకు చేర్చడంలో జాప్యం జరిగితే.. తల్లి వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. కాగా, మనిషి ముట్టిన వాసనలను పోగొట్టేందుకు వీలుగా అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరిస్తున్నారు. దీంతో పులి పిల్లల వంటిని తడపనున్నారు. అన్ని సందర్భాల్లో వర్తించదు మనిషి స్పర్శ తగిలితే పులులు కూనలను తిరస్కరించడం సహజమే అయినా ఇది అన్ని సందర్భాల్లో వర్తించదని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ పేర్కొన్నారు. తల్లికి, పిల్లలకు మధ్య ఉండే బలమైన బంధం, ప్రత్యేక పరిస్థితులు దీనికి మినహాయింపు కావచ్చన్నారు. అందువల్ల పిల్లల్ని జూకు తరలించడం కంటే తల్లి వద్దకు చేర్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శాస్త్రీయ పద్ధతుల్ని అవలంభిస్తాం పులి కూనలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆత్మకూరులోని అటవీ శాఖ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్లో గర్భంతో ఉన్న పులిని ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో గుర్తించామన్నారు. నాలుగు కూనలకు సరైన రక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ గుమ్మడాపురం గ్రామ శివార్లకు తీసుకొచ్చి ఉండవచ్చన్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల వన్యప్రాణి వైద్య నిపుణులు డాక్టర్ తోయిబా సింగ్ పులి కూనల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారన్నారు. కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటి ఆఫ్ ఇండియా నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చోంగ్ టెరాన్, విఘ్నేష్ పాల్గొన్నారు. -
తనపై రెండు కేసులు కొట్టేయాలంటూ రఘురామకృష్ణరాజు పిటిషన్లు
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో తనపై నమోదైన రెండు కేసులను కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాలను పరిశీలించిన న్యాయమూర్తి.. విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషనర్ న్యాయవాది ఉమేష్‌చంద్ర చెప్పారు. దీంతో ఈ వ్యాజ్యాలను మరో న్యాయమూర్తి ముందుంచేందుకు ఫైళ్లను సీజే ముందుంచాలని జస్టిస్ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీని ఆదేశించారు.. -
Oskar Barnack: ఫొటోజర్నలిజం పితామహుడు
జర్మనీ దేశస్థుడైన ఆస్కార్ బర్నాక్ కెమెరా డిజైనర్, కంటి అద్దాల ఇంజనీర్, పారిశ్రామిక వేత్త కూడా. ఆయన రూపొందించిన ‘లైకా’ కెమెరా అనేక మార్పులతో ఇప్పటికీ అన్నిదేశాల్లో వాడకంలో ఉంది. మొదట డాగురే 183 సంవత్సరాల క్రితం ‘కెమెరా’ను కనుగొన్నారు. తొలుత తయారైన కెమెరాలు పెద్దసైజులో ఉండేవి. ఫొటోలు తీయడం కూడా చాలా ఖర్చుతో కూడి ఉండేది. ఆ తర్వాత 75 ఏళ్లకు ఆస్కార్ బర్నాక్ అతిసూక్ష్మమైన సైజులో ఉండే కెమెరాను రూపొందించి మొదటి ప్రపంచ యుద్ధం (1914) సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించి పత్రికా రంగానికి ప్రాణం పోశాడు. అందుకే వీరిని ‘ఫొటోజర్నలిజం పితామహుడు’ అంటారు. వారు తీసిన చిత్రాలు 1916లో ప్రచురింపబడి ప్రపంచ మానవాళికి యుద్ధం వల్ల జరిగే నష్టాలను తెలియ చెప్పటంలో కీలకపాత్ర పోషించాయి. ఆస్కార్ బర్నాక్ జన్మదినం నవంబర్ 1ని ‘ప్రపంచ ఫొటోజర్నలిజం’ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఎన్నో కొత్త కంపెనీల చిన్న కెమెరాలు ఎన్ని వచ్చినా ఈనాటికీ డిజిటల్ యుగంలో కూడా ఆస్కార్ బర్నాక్ సృష్టించిన లైకా విధాన కెమెరా అత్యంత పరిపూర్ణమైంది. 1914 తర్వాత వార్తలు, సమాచార ఫొటోగ్రఫీ జర్నలిజం ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేయటంలో ఆయన ఆవిష్కరణ కీలక పాత్ర వహించింది. 1932లో ఓ అడుగు ముందుకువేసి బర్నాక్ కెమెరా లోపల ఒక చిన్న మోటారు అమర్చి ఒక దృశ్యాన్ని తీయగానే ఫిలిం ముందుకు జరిగే విధానానికి నాందిపలికి 1937లో ప్రపంచానికి పరిచయం చేశారు. (క్లిక్ చేయండి: ‘అనంత’ సాంస్కృతిక సేనాని) ఈమధ్య ఆ కెమెరాను వేలంవేయగా దాదాపుగా 19కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. బర్నాక్ 57వ ఏట 16 జనవరి 1936న అకాల మరణం చెందారు. 1979 నుంచీ ఆయన శత జయంతి సందర్భంగా ‘లైకా ఆస్కార్ బర్నాక్’ అంతర్జాతీయ అవార్డును ప్రతి ఏటా ఫొటో జర్నలిజంలో విశేషంగా కృషిచేసిన వారికి లైకా సంస్థ అందిస్తోంది. – టి. శ్రీనివాసరెడ్డి, ఫొటోజర్నలిస్ట్ ఫెలో ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ, గ్రేట్ బ్రిటన్ (నవంబర్ 1న ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవం) -
వైరస్ల విరుగుడుకు ప్రత్యేక ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనా వంటి మహ మ్మారులను నియంత్రించేందుకు... వైరస్‌లకు విరుగుడుగా పనిచేయగల మందులను గుర్తించేందుకు యాంటీ వైరల్ మిషన్ పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మందులుగా ఉపయోగపడగల రసాయన పరమాణువుల బ్యాంక్ (మోల్ బ్యాంక్) వైరస్‌లను నాశనం చేసేందుకు ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలుసుకొనేందుకు ఈ మిషన్ ఉపకరించనుందని తెలిపారు. అయితే గుర్తించిన మందులను పరీక్షించేందుకు బీఎస్ఎల్–3 స్థాయి పరిశోధనశాల అవసరమవుతుందని, దీని ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవలే పదవీబాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తన ప్రాథమ్యాలను వివరించారు. కొత్త రసాయనాలు దోమల్ని చంపేస్తాయి.. డెంగీ, జీకా వంటి వైరల్ వ్యాధులు ప్రబలేందుకు కారణ మైన దోమలను నియంత్రించేందుకు ఇప్పటికే వినూత్న రసాయనాలను గుర్తించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న రిపెల్లెంట్ల రసాయనాల గాఢత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. తాము గుర్తించిన కొత్త రసాయనాలు సహజసిద్ధమైన వాటిని పోలి ఉన్నందున ప్రమాదం తక్కువని... పైగా ఇవి దోమలను నిరోధించడమే కాకుండా చంపేస్తాయన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలతో కలసి ఈ రసాయనాలను పరీక్షించే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు. అలాగే కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే వ్యాధులకు కొత్త మందులు కనుక్కునేందుకు సిలికాన్ స్విచ్ విధానం ఉపయోగపడుతుందన్నారు. యువ శాస్త్రవేత్తలూ కష్టే ఫలి... సమాజ హితానికి సైన్స్ ఎంతో ఉపయోగపడుతున్నందున శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాజానికి మేలు జరిగేలా చూడాలని శ్రీనివాసరెడ్డి కోరారు. యువ శాస్త్రవేత్తలు కష్టే ఫలి సిద్ధాంతాన్ని గుర్తించాలన్నారు. అవార్డులు అనేవి కష్టానికి దక్కే ప్రయోజనాలు మాత్రమే అన్నారు. ప్రాజెక్టు అసిస్టెంట్ నుంచి ఐఐసీటీ డైరెక్టర్ దాకా.. నల్లగొండ జిల్లా శోభనాద్రిపురానికి చెందిన సాధార ణ రైతు కుటుంబంలో పుట్టిన డాక్టర్ డి.శ్రీనివాసరె డ్డి దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఐఐసీటీ డైరెక్టర్ స్థానాన్ని చేపట్టడం ఒక విశేషమైతే..జమ్మూలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లకు తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటం మరో విశేషం. ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పనిచేసిన ఐఐసీటీకే ఆయన డైరెక్టర్‌గా రావడం గమనార్హం. సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా... ‘రైతు కుటుంబంలో పుట్టిన నేను టెన్త్ వరకు రామన్నపేటలో, ఇంటర్ సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో, బీఎస్సీ (బీజెడ్సీ) సర్దార్ పటేల్ కాలేజీలో చేశా. ఖర్చులకు అవసరమైన డబ్బు సంపాదన కోసం వార్తాపత్రికల పంపిణీ, హోం ట్యూషన్లు, కట్టెల మండీలో పని చేశా. ఆ దశలోనే ఓ సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా. నిజాం కాలేజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ తర్వాత పీహెచ్డీ చేద్దామనుకున్నా ఫెలోషిప్ లేక ఐఐసీటీలో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా చేరా. కొంతకాలానికి సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష పాసై ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా వద్ద పీహెచ్డీ (సెంట్రల్ యూనివర్సిటీ) చేశా. షికాగో, కాన్సస్ యూనివర్సిటీల్లో చదువుకున్నాక భారత్‌కు తిరిగి వచ్చి పలు ప్రఖ్యాత సంస్థల్లో పనిచేశా. ఆపై విద్యాబోధన వైపు మళ్లా. 2010లో పుణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీలో చేరా. 2020లో జమ్మూలోని ఐఐఐఎంకు డైరెక్టర్‌గా ఎంపికయ్యా’ అని డాక్టర్ శ్రీనివాసరెడ్డి తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. -
ఐఐసీటీ డైరెక్టర్‌గా డి.శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డైరెక్టర్‌గా డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐఐసీటీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహి స్తున్న ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ వీఎం తివారీ నుంచి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2020 నుంచి జమ్ములోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి, ఫిబ్రవరి నుంచి లక్నోలోని సీఎస్ఐ ఆర్ సంస్థ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరె క్టర్గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఐసీటీ డైరెక్టర్‌గా నియమితు లైన నేపథ్యంలో ఆయన మిగిలిన రెండు సంస్థలకు అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. మెడిసినల్ కెమిస్ట్రీలో అపారమైన అనుభవం.. ఉస్మానియా వర్సిటీలో పట్టభద్రుడైన శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 2000లో సింథ టిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశారు. తరువాత షికాగో కాన్సస్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధనలు చేశారు. 2003లో అడ్వినస్ థెరప్యూ టిక్స్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీల్లో కొంతకాలం పని చేసి 2010లో పుణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీలో చేరారు. మెడిసినల్ కెమిస్ట్రీ, ఔషధ ఆవిష్కరణల్లో శ్రీనివాస రెడ్డికి 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు సుమారు 120 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. పంటల పరిశోధన రం గంలోనూ కృషి చేశారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుతో పాటు జేసీ బోస్ ఫెలోషిప్ కూడా అందుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో సభ్యులు -
రెడ్డినాడు శ్రీనివాస్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, రెడ్డినాడు మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వై.శ్రీనివాసరెడ్డి ఆదివారం కన్నుమూశారు. గత రెండు నెలలుగా పెద్దపేగు, ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1985లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించిన ఆయన ఈనాడు, డెక్కన్ క్రానికల్, సమయం, ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల్లో దీర్ఘకాలం పనిచేశారు. రెడ్డినాడు అనే పత్రికను నెలకొల్పి రెడ్డినాడు శ్రీనివాస్‌గా గుర్తింపు పొందారు. మాజీమంత్రి మైసూరారెడ్డి వద్ద ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో)గా పనిచేశారు. శ్రీనివాస్‌రెడ్డి కోలుకోవడం కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 24 యూనిట్ల రక్తాన్ని ఆయనకు దానం చేసింది. శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల పలువురు పాత్రికేయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
మూడోకన్నుకు... 182 వసంతాలు
1839వ సంవత్సరంలో ఫొటోగ్రఫీ ఆవిష్కరణ జరిగిన తరువాత క్రమంగా ప్రపంచ దేశాలు అన్నిటిలోకి ఈ ప్రక్రియ వ్యాపించటం మొద లైంది. ఈ క్రమంలో మన దేశంలోకి కూడా ఫొటోగ్రఫీ ప్రవేశించింది. ఆధా రాలని బట్టి సుమారు 1840లోనే మనదేశంలోకి ప్రవేశించినట్లు దాఖలాలు ఉన్నాయి. ఆరోజుల్లో మొట్ట మొదటి వ్యాపారసంస్థను ఎఫ్. స్వ్రాన్‌హోపర్ అనే కమర్షియల్ ఫొటోగ్రాఫరు కలకత్తాలో కేలోటైపు ఫొటోగ్రఫీ ప్రక్రియతో ఒక స్టూడియోను ప్రారంభించినట్లుగా ఋజువులున్నాయి. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. యజమాన్యాలు ఎన్నిమారినా ఆ స్టూడియో ఇప్పటికి 8 చౌరంగీరోడ్డు కల కత్తాలో నిల్చి ఉన్నది. ఆ రోజుల్లోనే 1853లో రాయల్ ఫొటో గ్రాఫిక్ సొసైటీని ఇంగ్లాండులో స్థాపించారు. 1854లో ఫొటో గ్రాఫిక్ సొసైటీ ఆఫ్ బాంబే స్థాపించబడింది. మనదేశంలో ఇది మొట్టమొదటి ఫొటోక్లబ్బు. ఆ తర్వాత ఇది ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియాగా మార్పు చెందింది. ఇది ఇప్పటికీ ఫొటోగ్రఫీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. 1855లో ఈ క్లబ్బు మొట ్టమొదట ఫొటో ప్రదర్శనని ఏర్పాటు చేసింది. 1840 తరువాత నెమ్మదిగా అనేక ఫొటోస్టూడి యోలు స్థాపితమై, ఫొటోగ్రఫీకి కావలసిన రసాయనాలు, పరికరాలు విక్రయించటం మొదలు పెట్టాయి. హైదరాబాద్ సంస్థానంలో రాజా లక్ష్మణరావు నైజాం నవాబుల సంస్థానంలో సేవచేస్తూ గొప్ప పరిపాలనాదక్షతతో పేరుపొందారు. రాజాలక్ష్మణరావుకి ముగ్గురు కుమారులు: రాజ రామ్రాజ్, రాజాత్రయంబక్రాజ్, రాజా థోండేరాజ్ రాజా దీన్‌దయాళ్ ప్రోత్సాహంతో రాజాత్రయం బక్ కెమె రాని చేపట్టి ఛాయా చిత్రకారుడిగా పేరు పొందారు. ఛాయా చిత్రకళలో, ముద్రణలో, చిత్ర నిర్మాణంలో నిష్ణాతులైన, ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఆంగ్ల గురువుల వద్ద అభ్యాసం కోసం సాంకేతిక నైపుణ్య సాధనకు ఇంగ్లాండు వెళ్ళారు. ఛాయాచిత్ర కళకు మొదటిరోజులలో ప్రామాణికత అనేది లేదు. అటువంటి పరిస్థితులలోనే మంచి ఛాయా చిత్రకారుడిగా పేరు పొంది ఇంగ్లాండు దేశంలోని రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటి నుంచి తన ఛాయాచిత్రనైపుణ్యానికి గుర్తింపుగా ఎసోసియేట్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటి గౌరవపట్టాను తన మొదటి ప్రయత్నం లోనే సాధించగలిగారు. కెమెరా కంటే కెమెరా వెనుక ఉన్న కన్ను ఎంతో ముఖ్యమనేది ఆయనభావం. భారతదేశంలో కార్బన్ ప్రాసెస్‌లో వర్ణచిత్రాలను తయారు చేసిన ఘనత ఆయనదే. రాజాత్రయంబక్ ఆంధ్రరాష్ట్ర అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీకి ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ 20వ తేదీ నవంబరు 1969వ సంవత్సరంలో పరమపదించారు. డా. ఎన్ భగవాన్‌దాసు బ్రిటీస్ ఎయిర్‌ఫోర్సులో స్క్వాడ్రెన్ లీడరుగా పనిచేసి 1947లో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో ఆఫీసరుగా నియమితులయ్యారు. ఆంధ్రరాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో ఉన్న ఫొటోగ్రా ఫర్లని అందరినీ కలిపి ఒక సంఘం ఏర్పరచాలని నిర్ణయించి, ఎడ్వర్డ్స్. వి. బాపిరాజు ఇలా ఇంకా కొందరిని కలిసి వారితో చర్చించి రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఫొటో గ్రాఫర్స్ అనే సంస్థని 1963 సంవత్సరంలో స్థాపించారు. అప్పటి నుంచి నిర్విరామంగా కృషి సల్పుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఫొటోగ్రఫీ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. తరువాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శిగా నియమించబడ్డారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోను కనీసం ఒక ఫొటోక్లబ్ ఉండాలనే ధ్యేయంతో ఎంతో కృషి చేశారు. 1966లో తొలిసారిగా ఎ.పి. శాలన్ ఆఫ్ ఫొటోగ్రఫి తెలు గునేలపై తొలిసారిగా ఫొటో ప్రదర్శనను ఏర్పాటుచేయగా నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రారంభించారు. గడచిన 54 ఏళ్ళలో ఎంతోమంది ఆర్ట్ ఫొటోగ్రఫీలో జాతీయ, అంత ర్జాతీయ పురస్కారాలు సాధించి దేశంలోనే ఫొటోగ్రఫీ రంగం లోను ఆకర్షినీయమైన రాష్ట్రంగా నిలిపారు. 2015లో జరిగిన రాజకీయ మార్పులతో అప్పటివరకు కొనసాగుతున్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అకాడమీ ఆఫ్ ఫొటోగ్రíఫీ మార్పు చెంది తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ పేర్లుతో కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థ లలో దాదాపుగా 300 మందికి పైగా సభ్యులు వివిధ అంశాల్లో వారివారి ప్రతిభకు గుర్తిస్తూ అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ఈ ఏడాది 182వ ప్రపంచ ఫొటోగ్రíఫీ వేడుకలు జరుపుకొంటున్నాం. కళాత్మక ఛాయాచిత్రరంగంలో తెలుగు వారిదే పై చేయి కావాలని అంతర్జాతీయంగా భారతీయ మువు న్నెల జెండాను ఫొటోగ్రఫీ రంగంలో తెలుగు వారు ఎగరవే యడంలో ప్రథమంగా ఉండాలని ఆశిస్తూ.. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలతో... టి. శ్రీనివాస రెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ, ప్రధానకార్యదర్శి (నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం) -
పక్కా పథకం ప్రకారం.. ‘ట్రైనీ ఎస్ఐ’పై ఎస్ఐ లైంగికదాడి!
సాక్షి, వరంగల్ క్రైం/మరిపెడ/మహబూబాబాద్ రూరల్: ఆమె ట్రైనీ ఎస్ఐ.. స్టేషన్‌కు వచ్చి 15 రోజులే అయ్యింది. వచ్చిన నాటి నుంచే ఆమెపై ఆ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కన్నేశాడు. చివరగా లైంగికదాడికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో వరంగల్ సీపీని కలసి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా, పోలీస్‌శాఖలో ప్రకంపనలు సృష్టించింది. ట్రైనీ ఎస్ఐ ఫిర్యాదు ఆధారంగా వివరాలిలా ఉన్నాయి. శిక్షణలో భాగంగా మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు 15 రోజుల క్రితం మరిపెడ స్టేషన్‌కు వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సోమవారం అర్ధరాత్రి పెద్దమొత్తంలో నల్లబెల్లం ఉన్నట్లు సమాచారం వచ్చిందని శ్రీనివాస్‌రెడ్డి సదరు ట్రైనీ ఎస్ఐని వెంటబెట్టుకుని వెళ్లాడు. నిర్జన ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఆమెను బలవంతం చేశాడు. కాగా, ఆమె శరీరంపై భౌతికగాయాలు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వం ఎస్హెచ్ఓకు కేటాయించిన వాహనం నడపడానికి డ్రైవర్ ఉంటాడు. కానీ.. అర్ధరాత్రి మారుమూల ప్రాంతంలో నల్లబెల్లం ఉందని, శ్రీనివాసరెడ్డి.. ట్రైనీ ఎస్ఐని మాత్రమే వెంటబెట్టుకొని వెళ్లినట్లు సమాచారం. ఇతర సిబ్బంది ఉన్నా తీసుకెళ్లలేదు. ఇది పక్కా పథకం ప్రకారం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పందించని అధికారులు.. శ్రీనివాసరెడ్డి తీరును ఆ ట్రైనీ ఎస్ఐ మహబూబాబాద్ పోలీస్ అధికారులకు విన్నవించుకున్నట్లు సమాచారం. వారు ఆమె విజ్ఞప్తికి స్పందించకపోగా ‘నీకు ఉజ్వల భవిష్యత్ ఉంది. ఇలాంటి ఫిర్యాదులు ఉద్యోగంలో పనికిరావు. సర్దుకుపోవాలి’ అని చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ఉద్యోగం వద్దనుకొని తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు వివరించి.. వరంగల్ సీపీ తరుణ్ జోషిని కలసి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నార్త్‌జోన్ ఐజీ, వరంగల్ ఇన్చార్జ్ డీఐజీ నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని సీపీ జోషి పేర్కొన్నారు. విచారణలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా ట్రైనీ ఎస్ఐ ఎస్సీ కావడంతో శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లల కింద కేసు నమోదైంది. ఎస్ఐని మహబూబాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
కొత్తగా నిర్మించే ఇళ్లకు నిబంధనలు తప్పనిసరి
సాక్షి, పాలమూరు: పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన జంక్షన్ వెడల్పు, రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహకరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జంక్షన్ అభివృద్ధి పనులను ఆదివారం రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త కాలనీల్లో నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రోడ్లు అక్రమించుకోవద్దన్నారు. గతంలో గ్రామాలను మున్సిపాలిటీల్లో వీలినం చేసిన సందర్భాల్లో పంచాయతీలుగానే కొనసాగించాలనే డిమాండ్ ప్రజల నుంచే వచ్చేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చూసి అందరూ మున్సిపాలిటీల్లో కొనసాగాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేష్, కలెక్టర్ వెంకట్రావ్ పాల్గొన్నారు. -
టూరిజం హబ్‌గా నల్లమల
మన్ననూర్ (అచ్చంపేట): ప్రకృతి స హజమైన పర్యాటక ప్రాంతాలు, శైవక్షేత్రాలకు నిలయమైన నల్లమలను టూ రిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారిలోని మన్ననూర్ చెరువుకొమ్ము లింగమయ్యస్వామి ఆలయ స మీపంలో రూ.14 కోట్ల నిధులతో నిర్మించిన హరిత టూరిజం రెస్టారెంట్ ను ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మె ల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ ప్రాంగణంలో ఆయన వి లేకరులతో మాట్లాడారు. బోటులో పర్యటిస్తున్న మంత్రి 3,500 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న నల్లమల పరివాహక ప్రాంతంలో అనే క శైవక్షేత్రాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రా ల నుంచి కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తుంటారనే ఉద్దేశంతో ఇక్క డ పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం మన్ననూర్‌తోపాటు ఈగలపెంట సమీపంలోని ఆ క్టోపస్ వద్ద నిర్మించిన హోటళ్లు, విశ్రా ంతి గదులు, లిఫ్టు తదితరా లకు రూ. 50 కోట్లు ఖర్చు చేశామన్నా రు. నల్లమలలో టూరిజంకు పెద్దపీట వేయడంతోపాటు ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పి ంచేందుకు కృషిచేస్తామన్నారు. ఇప్పటి కే సోమశిల నుంచి శ్రీశైలానికి ఏసీ బోటు సౌకర్యం కల్పించామన్నారు. 500 ఎకరాల్లో ఇండస్ట్రీ కారిడార్ జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేసిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అ భి వృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో సైనికులుగా పనిచేస్తామన్నా రు. టూరిస్టులకు అన్ని రకాల సౌకర్యా లు కల్పిస్తూ మర్యాదపూర్వకంగా ఉంటూ టూరిజం అభివృద్ధికి కృషిచేయా లని సూచించారు. ప్రభుత్వ విప్, ఎ మ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ వలసలు వాపస్ రావాలనే సీఎం కేసీఆర్ నినాదం ప్రస్తుతం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందన్నారు. అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. ఇందులో భాగంగానే అన్నిరంగాల్లో వెనుకబడిన నల్లమలలో టూరిజం హబ్‌తోపాటు అమ్రాబాద్‌కు సాగునీరు అందించేందుకు రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామన్నారు. ఈ ప్రాంతాన్ని వ్యవసాయ పరంగా సస్యశ్యామలం చేసి ప్రజలు, ముఖ్యంగా రైతుల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. సీఎంతోపాటు యువనేత కేటీఆర్, కేబినెట్లో ఉన్న ఉద్యమ నాయకుల స హకారంతో అచ్చంపేటను మరో సి ద్ధిపేటగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్ప ర్సన్ పద్మావతి, కలెక్టర్ శ్రీధర్, ఆర్డీఓ పాండు, డీఎంహెచ్ఓ సుధాకర్లాల్, టూరిజం ఎండీ మనోహర్, తిరుపతిరె డ్డి, ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ శ్రీరాం, జెడ్పీటీసీ సభ్యుడు రాంబాబు, ఎంపీ పీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ ప్రణీత, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు, బా లమ్మ, నాయకులు రవీందర్‌రెడ్డి, న ర్సింహగౌడ్, రాజేందర్, సతీష్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఓ కిరాతకుడి వాంగ్మూలం
-
హాజీపూర్ కేసులో ముగిసిన నిందితుడి తరపు వాదన
-
కోర్టుకు నిందితుడు శ్రీనివాసరెడ్డి
సాక్షి, నల్లగొండ: హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు. అదే విధంగా కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సైతం సమర్పించారు. ఈ క్రమంలో చివరిగా నిందితుడు శ్రీనివాసరెడ్డి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుంది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసును నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారిస్తోంది. గత రెండు నెలల కాలంలో ఈ కేసులో దాదాపు 300 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ క్రమంలో గురువారం చివరిసారిగా నిందితుడి వాంగ్మూలం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు.. శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని బాధిత కుటుంబాలు డిమాండు చేస్తున్నాయి. -
భాగ్యనగర వీధుల్లో...
హాస్యనటుడు వై. శ్రీనివాసరెడ్డి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అక్టోబరులో సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాకు రచయితగా చేసిన పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ సినిమాకు సంగీతం: సాకేత్ కొమండూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధనుంజయ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: చిత్రం శ్రీను. -
సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు
సాక్షి, హైదరాబాద్ : పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల నిందితుడు,హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. ముగ్గురు విద్యార్థినులను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాలపై ఉన్న రక్తపు మరకలు శ్రీనివాస్‌రెడ్డివిగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తేల్చింది. హత్య జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్‌రెడ్డి సెల్ సిగ్నల్స్‌ను పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి కేసులో పోలీసులు 300 మంది సాక్షులను విచారించారు. నేర నిరూపణ కావడానికి కావాల్సిన బలమైన సాక్ష్యాధారాలను అన్నిటినీ కోర్టుకు పోలీసులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలంలోని హజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాముల శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టెబావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. ఈఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీని వాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ ఘటనలపై గ్రామ ప్రజలు, ప్రతిపక్షాలు, బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. పోలీసు యంత్రాంగం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పర్యవేక్షణలో భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఇటీవల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రానుంది. -
శ్రీనివాసరెడ్డిని ఉరితీయాలి!
సాక్షి, నల్గొండ : హాజీపూర్ సైకో, సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు పెట్టి, ఉరితీయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కేసును వీలైనంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, హజీపూర్‌నుంచి మాచనపల్లి గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్సించాలని కోరారు. శ్రీనివాసరెడ్డి అదనపు నేరాలపై పోలీసుల పిటిషన్ శ్రీనివాస్‌రెడ్డిపై అదనపు నేరాలు చేర్చాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాసరెడ్డి అదనపు నేరాలపై ఈ శనివారం యాదాద్రి పోలీసులు నల్గొండ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నల్గొండ కోర్టు సోమవారం విచారణ జరపనుంది. బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారుల బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఎన్ని విధాల ప్రయత్నించినా నిందితుడు నోరుమెదపడం లేదని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. పోలీసులు కొద్దిరోజుల క్రితమే హాజీపూర్‌లో క్రైం సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను పూర్తి చేశారు. గ్రామస్తులు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో రాత్రి సమయంలోనే క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసినట్టు సమాచారం. -
మానవ మృగాన్ని ఉరి తీయాలి..
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రం హాజీపూర్ గ్రామస్తుల ఆందోళనలతో భగ్గుమంది. ముగ్గురు బాలికలను అతి కిరాతకంగా బలిగొన్న నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని ప్రభుత్వాన్ని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బొమ్మలరామారం మండల కేంద్రంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి గుడిబావి చౌరస్తా వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం న్యాయం చేయాలని, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయ పోరాటానికి మండల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని హామీలిచ్చిన అధికారులు జాడ లేకుండా పోయారని విమర్శించారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఎమ్మెల్యే సునీత దగ్గరికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పినా బాధితులు ససేమిరా అన్నారు. ఇంతవరకు పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. హామీ వచ్చేవరకు దీక్ష విరమించం బాధితులకు ప్రభు త్వం స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష విరమిం చేదిలేదు. ముగ్గురు బాలి కలు దారుణ హత్యలకు గురైనా ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రాలేదు. శ్రావణి మృత దేహంతో ధర్నా నిర్వహిస్తే కూతవేటు దూరం లో ఉన్న ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. బాధితులకు భరోసా ఇవ్వలేదు. – పక్కీరు రాజేందర్‌రెడ్డి, హాజీపూర్ వెనకడుగు వేయం కడుపుకోతకు గురైన కుటుంబాలకు న్యా యం జరిగే వరకు వెనకడుగు వేయం. ఆ కిరాతకుడిని ప్రభుత్వం ఉరి తీయలేని పరిస్థితి ఉంటే ప్రజలకు అప్పగించాలి. బడుగు, బలహీన వర్గాల పిల్లలంటే లెక్క లేదా. సైకో కిల్లర్ అంటున్న అధికారులు నిందితుడిని చంపడానికి ఎందుకు ఆలోచిస్తుండ్రు. – తుంగని భాగ్యమ్మ, కల్పన తల్లి కుటుంబాన్నీ ఉరి తీయాలి అభంశుభం తెలి యని ఆడపిల్లలపై అ ఘాయిత్యాలకు పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డితోపాటు అతని కుటుంబ సభ్యులనూ ఉరి తీయాలి. కుటుంబసభ్యుల సహకారంతోనే శ్రీనివాస్‌రెడ్డి హత్యలకు పాల్పడ్డాడు. నిదితుడిని బహిరంగంగా ఉరితీస్తేనే ఇలాంటి నేరాలు చేసే వారి వెన్నులో వణుకు పుడుతుంది. – తిప్రబోయిన నవనీత, మనీషా సోదరి -
‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘స్థానిక’ సంస్థల వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి(వరికోలు) శ్రీనివాస్‌రెడ్డికే అవకాశం దక్కింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఆదివారం ప్రకటించిన కేసీఆర్.. వరంగల్‌కు శ్రీనివాస్‌రెడ్డి పేరును కూడా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ‘పోచంపల్లి’ పేరే ప్రచారంలో ఉంది. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షు డు తక్కళ్లపెల్లి రవిందర్ సైతం తనవంతు ప్రయత్నం చేశారు. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌లకు క్లాస్మేట్గా వారితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు కలిగిన శ్రీనివాస్‌రెడ్డి మొదటి నుంచి కేసీఆర్ కుటుంబానికి విధేయుడు, విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపిన కేసీఆర్ శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. పాత వరంగల్ జిల్లాలోని పరకాల మండలం వరికోలు గ్రామానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ‘పోచంపల్లి’ నేపథ్యం ఇదీ.. పాత వరంగల్ జిల్లాలోని పరకాల మండలం వరికోలు గ్రామానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరికోలు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, 8 నుంచి 10వ తరగతి వరకు పరకాల సీఎస్ఐ మిషన్ హైస్కూల్లో విద్యనభ్యసించారు. ఇంటర్మీడిఝెట్(1992–1994) హన్మకొండలోని నాగార్జున ప్రైవేట్ జూనియర్ కాలేజీ, డిగ్రీ హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో బీకాం(1994–1996) చేశారు. ఎంబీఏ పుణేలోని వీ.కె పటేల్ ఫౌండేషన్ కళాశాలలో జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి చదివిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఆయన 2001 సంవత్సరం నుంచి టీఆర్ఎస్లో ఒక కార్యకర్తగా పనిచేస్తూ ప్రతి పనిని చేసుకుంటూ వచ్చారు. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కేటీఆర్ రోడ్ షోలకు ఇన్చార్జిగా ఉండి కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల కోసం మూడు పార్లమెంట్ నియోజవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలకు ఇన్చార్జిగా వ్యవహించి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, జూబ్లీ హిల్స్, గోశామహల్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. బయోడేటా.. పేరు : పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పుట్టిన తేదీ : ఏప్రిల్ 15, 1973 భార్య : మమత రెడ్డి కూతురు : అశ్రితరెడ్డి తండ్రి : జనార్దన్‌రెడ్డి తల్లి : సమ్మక్క తోబుట్టువులు : ఇద్దరు అక్కలు, ఒక చెల్లి,పెద్దక్క నల్ల స్వరూపరాణిరెడ్డి(47 డివిజన్ కార్పొరేటర్), బావ : సుధాకర్‌రెడ్డి రిటైర్డ్ ఇంజినీర్, రెండో అక్క పోరెడ్డి విజయనిర్మల (గహిణి), బావః పోరెడ్డి వాసుదేవరెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలర్, ములుగు విద్యాభ్యాసం.. ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరికోలు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల 8 నుంచి 10వ తరగతి వరకు సీఎస్ఐ మిషన్ హైస్కూల్, పరకాల ఇంటర్మీడిఝెట్ 1992–94 సంవత్సరం హన్మకొండలోని నాగార్జున ప్రైవేట్ జూనియర్ కాలేజీ డిగ్రీ హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో బీకాం(1994–96) ఎంబీఏ పుణేలోని వి.కె పటేల్ ఫౌండేషన్ కళాశాల 2001 సంవత్సరం నుంచి టీఆర్ఎస్లో కార్యకర్తగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉంటూ వారిని జైలు నుంచి బయటకు తీసుకావడంలో కీలక పాత్ర షోషించారు. విద్యార్థులతో కలిసి ఉద్యమంలో పని చేశారు. -
శ్రీనివాసరెడ్డి కస్టడీ పిటిషన్‌పై విచారణ
-
‘శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్ మృతుల కుటుంబాలతో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చర్చలు ముగిసాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ఔట్సోర్సింగ్ ద్వారా బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వారు ఎప్పుడైనా ఉద్యోగంలో చేరవచ్చన్నారు. ఇప్పటికే హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాము.. దాంతో పాటు మరిన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సీసీ కెమరాలను మరమత్తు చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు. డీజీపీని కలిసిన టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు హాజీపూర్‌లో బాలికలను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన దారుణ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారని టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉన్నవారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, పోలీసులతో సీఎం చర్చించి పూర్వాపరాలు వెలికి తీయాలని ఆమె కోరారు. హాజీపూర్ వంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
మా పిల్లల ఉసురు తీశాడు..
సాక్షి, యాదాద్రి: ‘కూలీనాలీ చేసుకుని బతికేటోళ్లం.. రెక్కాడితేగాని కడుపు నిండని మా జీవితాల్లో ఆరని చిచ్చుపెట్టాడు. ముక్కు పచ్చలారని పిల్లల ఉసురు తీశాడు. కాయకష్టం చేసుకుని జీవించే ప్రశాంతమైన మా ఊరి పరువు బజారులో పెట్డాడు. అభం శుభం తెలియని ఆడపిల్లలను పొట్టన పెట్టుకున్న ఆ మానవ మృగాన్ని అప్పగిస్తే నిలువునా కాల్చి బూడిద చేస్తాం. హైదరాబాద్‌కు చేరువలో ఉన్నా బస్ సౌకర్యం లేని మా ఊరి దుస్థితిని పాలకులు పట్టించుకోరా..’అని హాజీపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో హత్యల ఉదంతంపై మంగళవారం పలువురిని ‘సాక్షి’పలకరించింది. గ్రామస్తుల్లో ఎక్కడ లేని ఆవేదన, ఆక్రోశం, భయం వ్యక్తమైంది. తమ గ్రామానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలను చంపి బావిలో బొందపెట్టిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కాపాడుతున్నారని వారు ఆరోపించారు. మాలోనే ఉన్నాడని తెల్వలే.. ‘శ్రీనివాస్‌రెడ్డి తనకున్న భూమిలో అద్దెకరం అమ్మి ఊరి చివరన 6 నెలల క్రితం కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పసిపిల్లల ప్రాణాలు దారుణంగా తీసిన వాడి ఇల్లు ఊరంతా కలసి తగులబెట్టాం. అ ఇంటికి ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో ఏం పని చేస్తాడో ఎవరికి తెల్వదు. శ్రావణి బావిలో శవమై కనిపించిన రోజు మాతోపాటే ఉన్నాడు. బావిలోకి ఇలా దిగాలి, అలా దిగాలి అని చెప్తుంటే ఆ మానవ మృగం మాలోనే ఉన్నాడని గుర్తించలేకపోయాం..’అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డలను పొట్టన పెట్టుకున్నది ఊరివాడేనని తెలియడంతో వారంతా భయంతో వణికిపోతున్నారు. వ్యవసాయ పనులు, ఉపాధి పనులు చేసుకుని జీవించే తాము బయటకు వెళ్లాలంటే భయంతో హడలిపోతున్నామని చెప్పారు. గ్రామానికి బస్సులు రాకనే.. ‘మా గ్రామానికి బస్సులు సరిగా రావు. బొమ్మలరామారం నుంచి గ్రామానికి ఆటోలోనే రావాలి. ఒక్కరు ఆటోలో వస్తే 100 రూపాయలు తీసుకుంటారు. లేదంటే కాలినడకన రావాల్సిందే. ఈసీఐఎల్ నుంచి గ్రామానికి వచ్చే బస్‌లు పరిమితంగా వచ్చి ఇక్కడి నుంచే వెళ్లిపోతాయి. మధ్యాహ్నం బస్సులుండవు. హాజీపూర్–మైసిరెడ్డిపల్లి మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే భువనగిరి–ఈసీఐఎల్ మధ్యన బస్‌లు ఎక్కువ ట్రిప్పులు తిప్పవచ్చు కానీ బ్రిడ్జి నిర్మాణం ప్రభుత్వం చేయడం లేదు. బస్‌లు సకాలంలో వస్తే మా పిల్లలు మేము సురక్షితంగా ఇల్లు చేరుతాం.’అని గ్రామస్తులు తమ సమస్యలు వివరించారు. గ్రామంలోని బెల్టు షాపుల మూసివేత, మత్తుమందుల అమ్మకం అరికట్టేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బహిరంగంగా ఉరితీయాలి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలి. గ్రామంలో మహిళలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు. పోలీసులు సకాలంలో పట్టించుకుంటే ఇంతదాకా రాకపోయేది. మా కూతురు కనపడకుండా పోయినప్పుడే మేం ఫిర్యాదు చేశాం. అయినా అప్పుడు పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాడికి శిక్షను బహిరంగంగానే అమలు చేయాలి. నేరాలు చేయాలంటే బయపడే విధంగా శిక్షలుండాలి. –భాగ్యమ్మ (కల్పన తల్లి), మైసిరెడ్డిపల్లి తలుచుకుంటేనే భయం వేస్తోంది కూలీనాలీ కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్తుంటాం. ఇలాంటి సంఘటనలు బయట పడుతుంటే భయం వేస్తోంది. ఇంట్లో ఉండి బతుకు సాగించలేం. హత్యలకు కారణమైన శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. –పరిద సత్తెమ్మ, హాజీపూర్ గంజాయి అమ్మకం ఆగాలి గ్రామంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతోనే యువకులు చెడిపోతున్నారు. ఈ హత్యలు కూడా గంజాయి తాగి చేసినవే. వెంటనే గ్రామంలో గంజాయి నిర్మూలన చేయాలి. ఊరిని కాపాడాలి. –ఊట్ల మనీల, హాజీపూర్ -
జితేందర్ రెడ్డి దారెటో?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఊహించినట్టే జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డికి ఈ సారి టికెట్ చేజారింది. ఆయన స్థానంలో జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నవాబ్‌పేటకు చెందిన మన్నె శ్రీనివాస్‌రెడ్డికి సీఎం కేసీఆర్ గురువారం రాత్రి బీ ఫాం అందజేశారు. దీంతో నిన్నటి వరకు టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్న జితేందర్‌రెడ్డి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధినేతదే తుది నిర్ణయమని పలు సందర్భాల్లో చెప్పిన జితేందర్‌రెడ్డి ఇంకా గులాబీ దళంలోనే కొనసాగుతారా? లేక పార్టీ మారుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే జితేందర్‌రెడ్డికి ఈ సారి టికెట్ రాదని విస్తృత ప్రచారం జరిగింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎంపీలకు పార్టీ నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేశారు. టికెట్ రాని వారి జాబితాలో జితేందర్‌రెడ్డి పేరు కూడా ఉందా? మళ్లీ టికెట్ రాదనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఇదే క్రమంలో జితేందర్‌రెడ్డి కాంగ్రెస్ లేదా బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో జరిగింది. కానీ జితేందర్‌రెడ్డి మాత్రం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘ కేసీఆర్ తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. ఇప్పటికీ ఆయనపై పూర్తి నమ్మకం ఉంది’ అనే సందేశం వాట్సప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తోంది. వ్యతిరేకతే కారణం.. పార్టీలో ఉన్న వ్యతిరేకతే జితేందర్‌రెడ్డికి టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా ఆయన అనుచరులకు మద్దతు తెలిపారంటూ పలువురు ఎమ్మెల్యేలు బాహాటంగానే జితేందర్‌రెడ్డిని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఎంపీ టికెట్ ఖరారు చేసే క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారందరూ జితేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని నిరాకరించినట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ ఈ స్థానం నుంచి కొత్తవారికి అవకాశం కల్పించాలని కేసీఆర్ అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నవాబ్‌పేటకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ అధినేత సత్యనారాయణ రెడ్డి తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. -
ఎలా బయటపడ్డారు?
అమర్, ప్రదీప్ వర్మ, ఉదయ్, అభి, సి.టి, ఖాదర్, లక్ష్మీ, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఇందులో శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు. కనగాల రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కి రాజ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రమేష్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 32ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్‌గా చిత్రపరిశ్రమలో పని చేసిన నేను దర్శకునిగా తెరకెక్కించిన తొలి చిత్రమిది. సాఫ్ట్వేర్ కంపెనీలో బాగా పనిచేసే ఓ పది మంది ఉద్యోగులను ఆ కంపెనీ ఎండీ కేరళ టూర్‌కి పంపిస్తాడు. కేరళ అడవుల్లో జరుగుతున్న కోయవారి జాతరకు వెళ్లిన ఆ పదిమంది అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా బయటపడ్డారనేది చిత్రకథాంశం. మలేసియాలో తీసిన క్లైమాక్స్ ఓ హైలైట్. దాదాపు 125 రోజుల పాటు రెండు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన స్పెషల్ సాంగ్ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ సంగీతం అందించారు. -
టీఆర్ఎస్ నేతల హత్యకు మావోయిస్టుల పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిధులను మావోయిస్టులు టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను ఎలాగైతే హత్య చేశారో అదే తరహాలో.. తెలంగాణలోని ఎమ్మెల్యేలను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మావోయిస్టు యాక్షన్ టీమ్స్.. తెలంగాణకు చెందిన ఓ ఆపద్ధర్మ మంత్రి, స్పీకర్‌ను టార్గెట్ చేసినట్టు సమాచారం. అదేవిధంగా తాడ్వాయి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల కుట్రను పసిగట్టిన తెలంగాణ పోలీసులు అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మావోయిస్టుల ముప్పు గురించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో మంత్రి అజ్మీరా చందూలాల్ తాడ్వాయ్ మండలంలోని కటాపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు. ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రంగంలోకి దిగిన 30 మంది మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రాదు: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. 5సీట్లు వస్తే రాష్ట్రంలో అధికారం వచ్చినట్లుగా బీజేపీ నేతలు అనుకోవడం సరికాదన్నారు. గురువారం తెలంగాణ భవన్లో వారు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల దగ్గర సబ్జెక్టు లేక అనవ సర విషయాలు మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన వాటితోపాటు పెట్ట నివీ అమలు చేస్తోందని తెలిపారు. తాము ఏం చేశామో చెప్పుకోవడానికి బోలెడంత విషయం ఉందని పేర్కొన్నారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను చూస్తేనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లాగు తడుస్తోందని అన్నారు. చంద్రబాబు డబ్బులతో గెలవాలని ఉత్తమ్ ఆరాటపడుతున్నారని, రాష్ట్ర ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబుకు ఉత్తమ్ వంత పాడటం శోచనీయమన్నారు. కేసీఆర్ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని చెప్పా రు. పరిపూర్ణానంద బీజేపీ కండువా కప్పుకోగానే అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు. -
10 రోజులు ప్రైవేట్ పాఠశాలలు బంద్: ట్రాస్మా
సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్స్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. బుధవారం కరీంనగర్లో తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రాస్మా) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాస్మా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి శేఖర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్స్‌పై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సమస్యలను పదిరోజుల్లో పరిష్కరించకుంటే ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్‌ను నడపడమే నేరం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలపై దుష్ప్రచారం మానుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేట్ పాఠశాలల బస్సులు రాకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, తమ పిల్లలను ప్రెవేట్ స్కూల్స్‌కు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలలకు అనవసరమైన నిబంధనలను ఫైర్ పోలీసులు నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతితో ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేస్తామని వారు హెచ్చరించారు. -
ప్యాకేజీ–8.. సవాళ్లూ ‘భారీ’వే!
భూమికి 333 మీటర్ల లోతున ఓ పెద్ద షాపింగ్ మాల్ ఉంటే..! ఇది అంతకంటే భారీ నిర్మాణమే. 65 మీటర్ల ఎత్తయిన రాతి ట్యాంక్. సొరంగం ద్వారా నీరు ఆ ట్యాంక్‌లోకి చేరుతుంది. అక్కడి నుంచి అత్యంత భారీ పంపులు, మోటార్ల సాయంతో దాదాపు 117 మీటర్ల పైకి వస్తాయి. వీటిని ఆపరేట్ చేయటానికి ఆ భూగర్భంలోనే భారీ నాలుగంతస్తుల సముదాయమూ ఉంది. క్లుప్తంగా... కాళేశ్వరం ప్యాకేజీ–8 ఇదే. ‘సర్జ్ పూల్’గా పిలుస్తున్న ఆ ట్యాంక్‌లు మూడున్నాయి. వీటిలో 2 కోట్ల లీటర్ల నీళ్లు నిల్వ ఉంటాయి. పలు ఇంజనీరింగ్ విశిష్టతలతో రాష్ట్రానికి చెందిన మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) చేపడుతున్న ఈ ప్రాజెక్టును సోమవారం రాష్ట్ర, జాతీయ మీడియా ప్రతినిధులు సందర్శించారు. మోటార్లు, పంప్‌లు, ఇతర పరికరాలు సరఫరా చేసిన భెల్, నిర్మాణం చేపట్టిన ‘మేఘ’ సంస్థలు ప్రాజెక్టు విశేషాల్ని ఈ సందర్భంగా వివరించాయి. కాళేశ్వరం ప్యాకేజీ–8లో భాగంగా రామడుగు వద్ద నిర్మిస్తున్న భారీ భూగర్భ టన్నెల్, అక్కడే నిర్మించిన సర్జ్‌పూల్‌లు... వీటిలోని నీటిని పంప్ చేసేందుకు 139 మెగావాట్ల చొప్పున ఏర్పాటవుతున్న 7 పంప్‌లు... 600 టన్నుల బరువుండే మోటార్లు... ఇవన్నీ ఇతర ఏ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లోనూ కనిపించకపోవచ్చు. ఈ ఏడు పంపుల ద్వారా ఏక కాలంలో 21 వేల క్యూసెక్కుల నీటిని పంప్ చేయొచ్చు కూడా. 24 గంటలూ పనులు జరుగుతున్నాయని, జాప్యం నివారించడానికి... కీలక ఎలక్ట్రో–మెకానికల్ పరికరాల్ని ఖర్చుకు వెనకాడకుండా విమానాల్లో తెప్పిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి చెప్పారు. మోటార్లను భోపాల్‌లో తయారు చేశామని, షాఫ్ట్‌లు, పంప్‌లు కూడా ఆలస్యం లేకుండా అందిస్తున్నామని ‘భెల్’ సాంకేతిక సలహాదారు నరేంద్ర కుమార్ తెలియజేశారు. ‘‘భెల్ సరఫరాల్ని జాప్యం లేకుండా తెచ్చి కమిషన్ చేయటానికి మా పాతికేళ్ల ఇంజనీరింగ్ అనుభవం పనికొస్తోంది. ఈ ప్యాకేజీ ఎన్నో సవాళ్లు విసిరింది. వాటిని ఛేదించుకుంటూ వచ్చాం. సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా 600 టన్నుల బరువుండే మోటార్లను భూగర్భంలోనే ఏర్పాటు చేయాల్సి వచ్చినా వెనకాడలేదు. 85 శాతం పని పూర్తయింది. మిగిలింది 4 నెలల్లో చేస్తాం’’ అని శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ ఒక్క ప్యాకేజీ–8 విలువే దాదాపు రూ.4,700 కోట్లు!!. లింక్–2 ఈపీసీ... లింక్–1 బీఓక్యూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం 80 వేల కోట్లు. వీటిలో దాదాపు 50 శాతం పనుల్ని మేఘ దక్కించుకుంది. ఏడు లింకులుగా విభజించిన ఈ పనుల్లో... లింక్–2 పనుల్ని ఈపీసీ పద్ధతిలో, లింక్–1 బీఓక్యూ పద్ధతిలో చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టు రేటు ముందే నిర్ణయమవుతుంది. బీఓక్యూలో చేస్తున్న పనులకు తగ్గ బిల్లుల్ని ప్రభుత్వం చెల్లిస్తుంటుంది. ‘‘లింక్–1లో మేం 3 లిఫ్ట్‌లు చేపట్టాం. ఇందులో ప్యాకేజీ–8లోని భూగర్భ పంప్‌హౌస్‌తో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు ఓపెన్ పంప్‌హౌస్‌ల నిర్మాణం కూడా ఉంది. అన్నీ 80–85 శాతం వరకూ పూర్తయ్యాయి. లింక్–2లో ప్యాకేజీ–6 పనులే చేపట్టాం. ఇక్కడ మరో నాలుగు నెలల్లో 7 పంపుల ఏర్పాటూ పూర్తవుతుంది’’ అని చెప్పారాయన. కావాల్సిన నిధుల్ని అంతర్గత వనరులు, బ్యాంకు రుణాల ద్వారా సమీకరిస్తున్నామన్నారు. నిధుల కొరత లేదని, ఇప్పటికైతే పబ్లిక్ ఇష్యూకు వెళ్లే ఆలోచన కూడా లేదని చెప్పారాయన. భవిష్యత్తులో ఆ అవకాశాల్ని కొట్టి పారేయలేమన్నారు. తమ సంస్థకు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్... ఏప్లస్ క్రెడిట్ రేటింగ్ ఇచ్చిందని గుర్తుచేశారు. ‘‘మా ఆర్డర్‌బుక్ రూ.60వేల కోట్లుంది. గడిచిన ఆరు నెలల్లోనే రూ.8 వేల కోట్ల ఆర్డర్లు కొత్తగా వచ్చాయి. ఇక 2017–18లో టర్నోవర్ 50% వృద్ధి చెంది 3 బిలియన్ డాలర్లకు చేరింది’’ అన్నారాయన. ఇన్ఫ్రాతో పాటు గ్యాస్ సరఫరా, విద్యుత్, విమానయాన రంగాల్లోనూ తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తు చేశారు. ‘‘దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు జాంబియా, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాల్లోనూ పలు ప్రాజెక్టులు చేపట్టాం. 2017–18 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 70 ప్రాజెక్టులు పూర్తి చేశాం’’ అని వివరించారు. ఇవీ... సర్జ్‌పూల్ విశేషాలు 333 మీటర్ల లోతున భూగర్భంలో 65 మీటర్ల ఎత్తులో భారీ ట్యాంక్‌లా ఉండే ఈ పూల్ పూర్తిగా ఆటోమేషన్తో పనిచేస్తుంది. సర్జ్‌పూల్‌లో చేరిన నీటిని తోడి... పూల్ వెనకాల 90 డిగ్రీల కోణంలో ఏర్పాటు చేసిన 117 మీటర్ల ఎత్తయిన పంప్‌ల ద్వారా పైనుండే పాండ్‌లోకి పంప్ చేస్తారు.పంప్ ట్రిప్ అయినపుడు నీరు వెనక్కొచ్చి సర్జ్‌పూల్‌లో నీటి స్థాయి పెరిగి, ఆటోమేషన్ విభాగం మునిగిపోయే ప్రమాదముంది. అందుకే... ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తూ 3 పూల్స్ నిర్మించారు. వాటిలోకి నీరు సర్దుకుంటుంది. ప్రాజెక్టును చాన్నాళ్ల క్రితమే చేపట్టినా... ఈ పనులన్నీ మూడున్నరేళ్లలోనే చేసినట్లు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వీటి పనితీరును నీరు లేకుండా ఇప్పటికే పరీక్షించామని, మరో రెండున్నర నెలల్లో నీటితో పరీక్షిస్తామని చెప్పారు. ఈ విద్యుత్ కోసం బయట 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. - (మంథా రమణమూర్తి) -
జంబలకిడిపంబ మూవీ టీమ్‌తో చిట్ చాట్
-
బుద్ధులు ఇద్దరా? ఇద్దరూ ఒక్కరా?
అదో దాయాది వైరం. ఒకే తండ్రి సంతతైనా దేవదానవుల మధ్య ఆధిపత్య పోరు. సాగరమధనం చేసి అమృతం సాధించినా దక్కింది సురులకే. ఇక తీవ్ర తపస్సు చెయ్యడం, మరణం లేని జీవితం కావాలనడం, ప్రత్యక్షమైన దేవతలు సృష్టి విరుద్ధమైన కోరిక అనటం, నానా ఉపాయాలతో మరణం తప్పించుకునే కోరిక సాధించడం, దేవతలు త్రిమూర్తులను శరణు వేడటం, ఆ కోరికలోని లొసుగుల ద్వారా అసుర సంహారం జరగడం, వింత కోరిక కోరి చివరకు పగలూ రాత్రీ కాని సంధ్యా సమయంలో, ఇంటాబయట కాకుండా, నరుడూ మృగమూ కాకుండా నరమృగం చేత చచ్చిన హిరణ్య కశిపుడి కథ, వానరులంటే చిన్నచూపుతో వారిని విస్మరించిన రావణుడి కథ మరొకటి.. మరొకటి.. ఇలా ఎన్నెన్నో! తారకాసురుడి వంతు శివపుత్రుని చేత చావు కావాలన్నాడు తారకాసురుడు. కారణం సతీదేవి వియోగంతో శివుడు ఆత్మనిష్టలో ఉన్నాడు. ఇక ఆయన పెళ్లి, కుమారుడు కలగడం అసంభవం అనుకున్నారు.శివుడి ధ్యాస మరల్చడానికి దేవతలు విష్ణు మానసపుత్రుడు మన్మధుడిని తపోభంగం చెయ్యమన్నారు. తన సతి రతీదేవితో కలిసి వచ్చి చెరుకువింటితో పంచశరాలను సంధించాడు. శివుడి క్రోధానలంలోదగ్ధమయ్యాడు. ఈలోగా పర్వత రాజ పుత్రికగా పుట్టిన పార్వతి శివుడికి సపర్యలు చేసి, తీవ్ర తపస్సు చేసి భోళాశంకరుడిని పెళ్లాడింది. ఆ తర్వాత కుమార సంభవం, తారకాసుర సంహారం జరిగిపోయాయి. కథ ఇక్కడితో ఆగిపోలేదు తారకుడి కొడుకులు ముగ్గురు తీవ్ర తపస్సు చేసి, వరం చేత బంగారం, వెండి, ఇనుము (త్రి) పురాలను పొంది విహరించసాగారు. వేర్వేరు కక్ష్యలు, లోకాల్లో తిరిగే ఈ మూడు పురాలు వెయ్యేళ్లకొకసారి లిప్త కాలం పాటు ఒకే సరళరేఖ మీదకు వచ్చిన సమయంలో ఒకే బాణం దెబ్బకు మాత్రమే నాశనమవ్వాలని కోరుకున్నారు. వరగర్వంతో ముల్లోకాలను గడగడలాడిస్తున్న వీరిని సంహరించమని దేవతలు శివుడిని వేడుకున్నారు. మేరు పర్వతం చాపంగా మారగా, ఆదిశేషు అల్లెతాడు, విష్ణువు బాణం కాగా శివుడు ఆ త్రిపురాసుర సంహారం చేసి త్రిపురాంతకుడు, పురహరుడు అయ్యాడు. ఆ ధనుస్సు దేవతల ద్వారా దేవరాతునికి చేరింది. వారి వంశంలో ఒకడైన జనకుడి కూతురు జానకిని ఈ విల్లు విరిచే రాముడు పెళ్లాడాడు. అయితే, అంతకుముందు శరణు వేడిన దేవతలతో.. ‘‘త్రిపురాసురులు ధర్మ విరుద్ధమైన పనులు చెయ్యమంటారు. ఇది దాయాది వైరం మాత్రమే. అందుకే సహాయం చెయ్యనని’’ నిరాకరిస్తాడు శివుడు. వారిని ధర్మభ్రష్టులను చేసే పని చెయ్యడానికి మహావిష్ణువు మరో అవతారం ఎత్తవలసి వచ్చింది. అదే బుద్ధుడి అవతారం.బుద్ధుడి అవతారంలో వచ్చిన విష్ణువు త్రిపురాసురుల నగరాల్లో దైవం, పునర్జన్మలు, పాపపుణ్యాలను లేవని బోధించి నాస్తికతను వ్యాపింపచేశాడని, యజ్ఞక్రతువులు, అక్కడ జంతుబలులు ఆపించి ధర్మభ్రష్టులను చేసినందువల్ల వీరిని శివుడు సంహరించగలిగాడని ఒక కథ. ధర్మబద్ధుడు, అధర్మబుద్ధుడు హైందవం బౌద్ధాన్నీ వదలకుండా మింగేసి, బుద్ధుడిని అవతారంగా మార్చుకుందని విమర్శ. కాదు చరిత్రలో మనం చదువుకునే శాక్యముని బుద్ధుడు, పురాణ బుద్ధుడు వేర్వేరంటారు కొందరు.ఈ బుద్ధుడిని అవతారాల్లో ప్రస్తావించిన 12వ శతాబ్దం నాటి జయదేవ కవి ‘గీతగోవిందం’లోని ‘ప్రళయ పయోధి జలే’ అనే అష్టపదిని చూపుతారు కొందరు. కానీ అందులో కరుణా దృష్టితో యజ్ఞయాగాల్లో జంతుబలిని ఆపిన గౌతమ బుద్ధుడి వర్ణన ఉంటుంది!ఈ అష్టపదిలో కాకుండా బుద్ధావతారాన్ని వర్ణించిన కీర్తనలు మరేమైనా ఉన్నాయా? లేకేం.. పదకవితా పితామహుడు అన్నమయ్య కీర్తనల్లో కొన్ని దశావతార కీర్తనలు ఉన్నాయి. వాటిలో కొన్ని పరిశీలిస్తే బుద్ధుడి వర్ణన ఈ విధంగా ఉంది. కెలసి బిత్తల తిరిగేటి భూతం (పుడమి నిందరిబట్టె భూతము) ::: పొంచి సిగ్గెగ్గెరుగని బోయనాయుడు (పొడవైన శేషగిరి బోయనాయుడు) ::: ఆకసానబారే ఊరి అతివల మానముల కాకుసేయువాడు(తెప్పగా మర్రాకుమీద తేలాడు వాడు) ::: పురసతుల మానముల పొల్లసేసిన చేయి (ఇందరికి నభయంబులిచ్చు చేయి) ::: బిత్తల అంటే దిసమొల/దిగంబరత్వం అని అర్ధం. ఈ పదాన్ని కొద్ది మార్పులతో రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకల్లో వాడుతారు. సిగ్గెగ్గులెరగని అన్నా కూడా దిసమొలతో తిరిగేవాళ్లను అంటారు.అతివల మానములు కాకుచేయువాడు, పురసతుల మానముల పొల్ల చేసిన అన్నప్పుడు.. విష్ణువు మాయారూపంలో వచ్చి పాతివ్రత్యాన్ని భంగం చేసిన తులసి, జలంధరుల కథలాగా పురసతులను బుద్ధావతారంలో మోసగించాడని అర్థమవుతుంది. ఈ కీర్తనలూ ఆ విషయాన్నే చెబుతున్నాయి.సింకసూపుల వాడు సిన్నెక్క (సిరుత నవ్వులవాడు సిన్నెక్క) ::: కోరి బుద్ధుడైన సిగ్గు (శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలుమంగ) ::: పరకాంతల భంగపరచకుంటే మేలు (సంసారమే మేలు సకల జనులకు) ::: మోస మింతుల జేయు మునిముచ్చు దొంగ (వీడివో యిదే వింతదొంగ) ::: పొంచి అసురకాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాడు (ఇతనికంటే మరి దైవము గానము) ::: కొంగు జారినంతలోన కూలెను త్రిపురములు (హరీ నీ ప్రతాపమునకడ్డమేది లోకమున). శృంగేరిలో దిగంబర బుద్ధుడు దిగంబరత్వం జైనంలో ఉంది కానీ, బౌద్ధంలో కనిపించదు. ఈ బిత్తల బుద్ధుడు తెలుగు సంకీర్తనల్లో కనిపించాడు కానీ మిగిలిన చోట్ల ఉన్నాడా? ఉన్నాడు. సాహిత్యం సంగతేమో కానీ శిల్ప రూపంలో ఈ బిత్తల బుద్ధుడు కనిపిస్తాడు. అదే శృంగేరి లోని పురాతన విద్యాశంకర ఆలయం. హంపి విజయనగర స్థాపకులు హరిహర బుక్కరాయలు, వారి గురువు విద్యారణ్య స్వామి ఆదేశానుసారం 14 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర. అదివరకే ఉన్న హోయసలాలయాన్ని పునర్నిర్మించారని కొందరు చరిత్రకారులు నిర్ధారించారు. ఈ విద్యాశంకర ఆలయం వెనుకవైపు విష్ణు అవతారాలను చెక్కారు. మత్స్య నుండి రాబోయే కల్కి వరకు మొత్తంగా 11 అవతారాలను చెక్కారు. దశావతారాలను ఎక్కువ ప్రాచుర్యంలోకి తెచ్చారు కానీ భాగవతానుసారం 24 విష్ణు అవతారాలు ఉన్నాయి. ఈ అవతార శిల్పాల్లో మరో ప్రత్యేకత పరశురాముడి ఆహార్యం క్షత్రియుణ్ణి పోలి ఉంటుంది. అన్నమయ్య వర్ణించిన సిగ్గెగ్గులెరగని బిత్తల అవతారం కూడా వీటిల్లో ఉంది. ఇంతకూ జంతుబలులు, యజ్ఞయాగాదులు నిరసించిన గౌతమ బుద్ధుడు, త్రిపురాల్లో నాస్తికత బోధించిన అవతార బుద్ధుడు ఒకరా? వేర్వేరా? మరింత పరిశోధనలు జరిగేవరకూ ఆలోచిస్తూ ఉందాం.ఈ బుద్ధావతారం కథ సంగతేమో కానీ అన్నమయ్య కంటే వందల ఏళ్ల పురాతనమైన ఈ ఆలయ మంటపంలో 12 స్తంభాలుంటాయి. వాటిమీద 12 రాశుల చిహ్నాలుంటాయి. వాటిని చూడగానే ఇన్ని రాసులయునికి అంటూ రాశులమీద ఉన్న కీర్తన గుర్తొస్తుంది. – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
జంబ లకిడి పంబ ట్రైలర్ విడుదల
-
‘వెలిగొండ’లో విస్తుగొలిపే అవినీతి
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల(సొరంగాల) పనుల్లో ముఖ్యనేత, మరో కీలక మంత్రి అందిన కాడికి మింగేయాలని తహతహలాడుతున్నారు. మొదటి టన్నెల్లో రూ.89.50 కోట్ల విలువైన పనులను వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆర్కే ఇన్ఫ్రా సంస్థకు నామినేషన్ విధానంలో కట్టబెట్టాలంటూ అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెస్తున్నారు. పాత కాంట్రాక్టర్ నుంచి 60సీ నిబంధన కింద ఈ పనులను తొలగించాలంటే స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ అనుమతి తీసుకోవాలని చెబుతున్నా లెక్కచేయడం లేదు. కావాల్సిన వారికి పనులు కట్టబెట్టి, కమీషన్లు నొక్కేయాలన్నదే వారి అసలు వ్యూహం. నామినేషన్‌పై అప్పగించాలట! వెలిగొండ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గడువు తక్కువగా ఉంది, పనులు త్వరగా పూర్తి కావాలనే సాకుతో పాత కాంట్రాక్టర్లపై వేటు వేసింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.601.49 కోట్లు పెంచేసింది. అస్మదీయులైన కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించి రూ.300 కోట్లకు పైగా కమీషన్లు కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ఇటీవల టెండర్లు నిర్వహించారు. మొదటి టన్నెల్లో కొన్ని పనులే మిగిలిపోయాయి. వీటి విలువ రూ.25.43 కోట్లకు మించదు. ఆ పనులపై టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి కన్ను పడింది. దాంతో సదరు పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, శ్రీనివాసరెడ్డి సంస్థకు నామినేషన్‌పై అప్పగించాలని ముఖ్యనేత ఆదేశించారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక రూ.89.50 కోట్ల విలువైన పనులను శ్రీనివాసరెడ్డి సంస్థకు నామినేషన్‌పై అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. సీఎస్ అభ్యంతరాలు బేఖాతర్ వెలిగొండ హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ చానల్, మొదటి సొరంగంలో 150 మీటర్లు, రెండో సొరంగంలో 108 మీటర్ల తవ్వకం పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి మినహాయించకుండానే గతేడాది మార్చి 23న ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. ముఖ్యనేత, కీలక మంత్రి బెదిరింపుల నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి సంస్థ మినహా ఇతరులెవరూ బిడ్ దాఖలు చేయలేదు. దాంతో సింగిల్ బిడ్‌నే ఆమోదించాలంటూ హైపవర్ కమిటీకి వెలిగొండ అధికారులు ప్రతిపాదనలు పంపారు. భారీ పనులు చేసే సామర్థ్యం లేని ఆర్కే ఇన్ఫ్రాకు రూ.91.52 కోట్ల విలువైన పనులను ఎలా అప్పగిస్తారంటూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదిర్శ దినేష్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్కే ఇన్ఫ్రాకు అప్పట్లో రూ.91.52 కోట్ల పనులను దొడ్డిదారిన అప్పగించగా, ఇప్పుడు రూ.89.50 కోట్ల విలువైన పనులు నామినేషన్‌పై కట్టబెడుతుండడం వెనుక లోగుట్టు ఏమిటన్నది తెలిసిందే. చేయని పనులకు రూ.11.67 కోట్లు చెల్లింపు సొరంగాలు తవ్వాలన్నా.. హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించాలన్నా శ్రీశైలం రిజర్వాయర్ మీదుగా పడవపై కొల్లం వాగుకు చేరుకోవాలి. కానీ, భారీ పడవలు లేకుండానే యంత్రాలను తరలించకుండానే చేయని పనులను చేసినట్లుగా ఆర్కే ఇన్ఫ్రా మాయాజాలం ప్రదర్శించింది. ఆ సంస్థతో కుమ్మక్కైన అధికారులు చేయని పనులు చేసినట్లు రూ.11.67 కోట్లు చెల్లించేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ విచారణకు ఆదేశించారు. కానీ, ముఖ్యనేత రంగ ప్రవేశంతో విచారణ ప్రాథమిక దశలోనే అటకెక్కింది. -
జానపదమే నృత్యపథం..
అమ్మలారా.. అయ్యలారా.. ఊరోన్ని నేను.. పల్లెటూరోన్ని నేను.. అంటూ ప్రారంభమైన ప్రస్థానం సినీపరిశ్రమ వరకు సాగింది. జానపద నృత్యంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభచూపాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాడు. సత్తుపల్లికి చెందిన ఓ అరటిపండ్ల వ్యాపారి నృత్య ప్రదర్శనలో ఎంతో ఖ్యాతిని ఆర్జించాడు. సత్తుపల్లిటౌన్: పట్టణంలో పేదకుటుంబానికి చెందిన బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి జీవనాధారం కోసం అరటిపండ్లు అమ్ముకుంటూ జానపదంపై పట్టు సాధించారు. బాల్యం నుంచే అనేక నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. అంతర్జాతీయ నర్తకి, సినీనటి మంజుభార్గవి సరసన నృత్య ప్రదర్శన చేశాడు. దాదాపు 28 ఏళ్లుగా జానపదంపై పట్టు సాధించిన ఈయన అనేక పాఠశాలల విద్యార్థులతో పాటు సరిహద్దున ఉన్న కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం ప్రాంతాలలోని చిన్నారులకు కూడా నృత్యంలో శిక్షణ ఇస్తూ.. జానపద కళకు ప్రాణం పోస్తున్నారు. ఈయన చేస్తున్న కృష్టికి ఇటీవల డాక్టరేట్ కూడా సాధించారు. దేశ,విదేశాలలో ప్రదర్శనలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, చైనా, కాట్మాండ్ దేశాలలో కూడా బొమ్మారెడ్డి అనేక నృత్యం ప్రదర్శించారు. అమ్మలారా.. అయ్యలారా అనే ఒకే జానపద నృత్యాన్ని 1800 సార్లు ప్రదర్శించి ఇటీవల తెలుగుబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. బెంగుళూరు క్రిష్టయన్ యూనివర్సిటీ నుంచి జానపద నృత్యంలో డాక్టరేట్ కూడా సాధించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియర్స్ బుక్ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించారు. ఇలా ఇప్పటి వరకు 27 జాతీయ అవార్డులు, ఒక అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు. మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ, సినీహీరో చిరంజీవి, సినినటీ జయసుధ వంటి ప్రముఖుల నుంచి కూడా అభినందనలు పొందారు. తండ్రి పేరిట ఉచిత శిక్షణలు దేశ, విదేశాలలో ప్రదర్శనలు, ప్రశంసలు పొందుతూనే.. మరో వైపు తన తండ్రి పేరున స్థాపించిన బీఎన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వివిధ జిల్లాల్లో ప్రతినెలా 400 మంది పేద విద్యార్థులకు వివిధ సంస్థల ద్వారా ఉచిత శిక్షణలు ఇస్తున్నారు. సినీ కొరియో గ్రాఫర్‌గా.. సినీరంగంపై బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉన్న ఆసక్తి కొరియో గ్రాఫర్‌గా అవకాశం లభించింది. జాతీయ సినీ నృత్య దర్శకులు డాక్టర్ శివశంకర్ మాస్టర్ వద్ద శిక్షణ పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన చందమల్ల అభిలాష్ డైరెక్టర్‌గా ఉన్న డేంజర్‌జోన్ అనే హరర్ తెలుగు చిత్రంలో సింగిల్‌కార్డు నృత్యదర్శకునిగా పని చేశారు. కందాల వంశీ దర్శకత్వంలో ‘ఏదో కలవరం’ చిత్రంలో కొరియో గ్రాఫర్‌గా.. మిరియాల రవికుమార్ దర్శకత్వంలో సుమన్ హీరోగా నటించిన త్యాగాల వీణ చిత్రం, రామచంద్రారెడ్డి దర్శకత్వంలోని ప్రేమశక్తి చిత్రానికి, మువ్వా దర్శకత్వంలో జగపతిబాబు, చార్మి నటీనటులుగా ఉన్న ‘శబ్దం’ చిత్రానికి కొరియో గ్రాఫర్‌గా పని చేశారు. క్లీన్ ఇండియా, శ్రీనుగాడి ప్రేమ, ప్రేమనీదే చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేశారు. ఇలా 8 చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేయగా 4 చిత్రాలు విడుదలయ్యాయి. ఇటీవల లేపాక్షి ఉత్సవాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లేపాక్షి అవార్డును అందుకున్నారు. కళాకారులనుతయారు చేయాలని.. నా లాగే జానపద కళలో ఎంతోమంది నిరుపేద కళాకారులు ఉన్నారు. వారిని కూడా ఈ కళలో తీర్చిదిద్దాలనుకుంటున్నా.. 28 ఏళ్లుగా జానపదకళకు సేవ చేస్తున్నాను. ప్రతీ జిల్లాలో నృత్య పాఠశాలను ఏర్పాటు చేసి అంతరించి పోతున్న జానపద కళను పైకి తేవాలనేది నా ఆశయం. –బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, నృత్య కళాకారుడు, సత్తుపల్లి -
మళ్లీ అత్తింటి ముందు సంగీత ధర్నా
-
తాళం పగులగొట్టి లోపలికి వెళ్లిన సంగీత
-
కోర్టు ఆదేశాలున్నాయ్.. ఇంట్లోకి వెళ్తా
సాక్షి, హైదరాబాద్ : అత్తమామలు, భర్త తనను వేధిస్తున్నారంటూ 54 రోజులుగా సంగీత దీక్ష చేసిన ఇంటి వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు సంగీత ప్రయత్నించారు. శ్రీనివాసరెడ్డి, సంగీతల కేసును విచారించిన మియాపూర్ ఫ్యామిలీ కోర్టు ఆమెను ఇంట్లోనే ఉండనివ్వాలని, నెలకు రూ. 20 వేలు భరణంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతో కోర్టు నుంచి బోడుప్పల్‌లోని ఇంటి వద్దకు చేరుకున్న సంగీత తలుపు తాళం పగులగొట్టారు. అనంతరం కూతురుతో తలుపు గడి తీయించి, ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. పాప భవిష్యత్ ముఖ్యం ఇంటి తాళం పగులగొడుతున్న సంగీతకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. కోర్టు తీర్పుతో సంగీతకు కొంత బలం చేకూరిందని చెప్పాయి. కోర్టు తీర్పుతో కాకుండా సంగీత అత్తమామలు వచ్చి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్తే బావుండేదని అభిప్రాయపడ్డాయి. పాప భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస రెడ్డి, సంగీతతో రాజీకి రావాలని కోరాయి. సంతోషంగా చూసుకుంటే తీసేస్తాను.. కోర్టు తీర్పు నేపథ్యంలోపై సంగీత ‘సాక్షి’తో మాట్లాడారు. 54 రోజులుగా ఇంటి బయటే దీక్ష చేశానని చెప్పారు. అత్తింటివాళ్లు వస్తారని ఎదురుచూశానని తెలిపారు. శ్రీనివాస రెడ్డి వస్తే కలసి జీవించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. శ్రీనివాస రెడ్డికి వివాహేతర సంబధాలు ఉండటం వల్లే ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయని చెప్పారు. హ్యాపీ ఉంటున్నామని అనుకున్న రోజే కేసును ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. పెళ్లి అయిన నాటి నుంచి తాను ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్నానని చెప్పారు. అందుకే కోర్టు తీర్పు అనంతరం తాళం పగులగొట్టి లోపలికి వెళ్తున్నానని తెలిపారు. చాలా నష్టం జరిగింది : శ్రీనివాస రెడ్డి కోర్టు తీర్పు వల్ల తమకు చాలా నష్టం జరిగిందని బహిష్కృత టీఆర్ఎస్ నేత, సంగీత భర్త శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం పిటిషన్ దాఖలు చేయగా.. గురువారమే ఉత్తర్వులు రావడం బాధకరమని చెప్పారు. తాను సంగీతతో కలసివుండాలంటే కేసును ఉపసంహరించుకోవాల్సిందేనని తెలిపారు. సంగీత డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో.. బోడుప్పల్‌లోని ఇల్లు తన తల్లిదండ్రులదని చెప్పారు. ఆ ఇంటితో తనకు సంబంధం లేదన్నారు. సంగీతకు నిజంగా నాతో జీవించాలని ఉంటే తానెక్కడ ఉంటే ఆమె అక్కడే ఉండాలన్నారు. అందుకు ఇష్టపడితే తాను ఎక్కడ ఉంటున్నానో ఆమెకు చెబుతానన్నారు. -
హైకోర్టుకు చేరిన సంగీత వివాదం
సాక్షి, హైదరాబాద్ : తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్న సంగీత వ్యవహారం తాజాగా హైకోర్టుకు చేరింది. బోడుప్పల్‌లోని ఇంటి నుంచి సంగీతను ఖాళీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె అత్తింటివారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సంగీత బలవంతంగా ఇంటి తాళాలు పగులగొట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసిందని, తమను ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటుందని.. ఇంటి ముందు దీక్ష కొనసాగించవద్దని ఆదేశించాలని, సంగీత అత్తింటి వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో, సంగీతకు నోటిసులు అందాయి. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్లో టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం 20వ రోజుకు చేరుకుంది. అత్తింటి వారు చేసిన దాడికి నిరసనగా తనకు న్యాయం కావాలని సంగీత గత ఇరవై రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సంగీతకు రోజురోజుకూ మహిళా సంఘాల మద్ధతు పెరుగుతూనే ఉన్నా.. ఆమె ఆరోగ్యం మాత్రం రోజురోజుకూ క్షీణిస్తుంది. ఇప్పటికే సంగీత భర్త, అత్త జైలులో ఉండగా.. మామ బాల్రెడ్డికి కూడా కోర్టు బెయిల్ రద్దు చేసింది. సంగీత మాత్రం న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తోంది. -
క్షీణిస్తున్న సంగీత ఆరోగ్యం
-
క్షీణిస్తున్న సంగీత ఆరోగ్యం
హైదరాబాద్: మూడో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి వద్ద పోరాటం చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమెతోపాటు ఆమె కుమార్తె ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఆమె చేపట్టిన న్యాయ పోరాటం నాలుగో రోజుకు చేరింది. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ నిద్రాహారాలు మాని చంటిపిల్లతో కలిసి పోరాటం చేస్తున్నారు. నాలుగు రోజులుగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటిముందు ధర్నా కొనసాగిస్తున్నా అత్తింటి వారి నుంచి స్పందన లేదు. అత్తామామలు లేదా ప్రభుత్వం తనకు హామీ ఇచ్చే వరకు ఇంటిముందే పోరాటం సాగిస్తానంటోన్నారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
'నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతా'
-
మూడో పెళ్లిపై నిలదీస్తే భార్య , ఆమె సోదరునిపై దాడి
-
భార్యపై దాడి చేసి గెంటేసిన టీఆర్ఎస్ నేత
-
మూడో పెళ్లిపై నిలదీస్తే జుట్టుపట్టి.. ఈడ్చిపడేశాడు
హైదరాబాద్: అతడో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. పైగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు.. తొలి భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు.. అయితే పెళ్లైనప్పటి నుంచీ అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు.. అత్తింటి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.. అయితే రెండో భార్యకు తెలియకుండా ఇటీవల మూడో పెళ్లి చేసుకున్నాడా ప్రబుద్ధుడు. తనకు విడాకులివ్వకుండా ఎలా పెళ్లి చేసుకున్నావని నిలదీసినందుకు రెండో భార్యను దూషించడమే కాక జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చిపడేశాడు. ఆమెపై.. ఆమె సోదరునిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రాచకొండ కమిషనరేట్‌లోని మేడిపల్లి ఠాణా పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైనప్పటి నుంచీ వేధింపులే.. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ శ్రీనగర్‌కాలనీలో నివసించే పులకండ్ల బాల్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. తొలుత స్వాతి అనే యువతిని వివాహం చేసుకున్నా.. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. 2013 అక్టోబర్ 19న శేర్లింగంపల్లి సుందరయ్యనగర్‌కు చెందిన సంగీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప ఉంది. పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ బాల్‌రెడ్డి, ఐలమ్మ, ఆడబిడ్డ భాగ్యలక్ష్మి.. సంగీతను శారీరకంగా, మానసికంగా వేధించేవారు. వేధింపులపై ఈ ఏడాది జూన్ 13న చందానగర్ పోలీసులకు సంగీత ఫిర్యాదు చేసింది. ఇదిలాఉండగా బోడుప్పల్‌కు చెందిన దేవిజగదీశ్వరి(20)ని ఆగస్ట్ 11న శ్రీనివాస్‌రెడ్డి మూడో పెళ్లి చేసుకున్నాడు. తన నుంచి విడాకులు తీసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటావని సంగీత మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్వరి, భాగ్యలక్ష్మిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా.. బాల్‌రెడ్డి, ఐలమ్మ కోర్టులో లొంగిపోయి బెయిల్‌పై బయటకొచ్చారు. భర్త ఇంటి వద్ద నిరాహార దీక్ష బెయిల్‌పై బయటకొచ్చిన శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్వరితో కలసి ఉంటున్నాడు. దీంతో సంగీత, ఆమె తల్లి పద్మ, తమ్ముడు రంజిత్‌రెడ్డి ఆదివారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ క్రమంలో సంగీత కుటుంబసభ్యులకు, శ్రీనివాస్‌రెడ్డికి మధ్య మాటామాటా పెరిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన సంగీతను శ్రీనివాసరెడ్డి, అత్త ఐలమ్మ అసభ్య పదజాలంతో దూషిస్తూ.. జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. అడ్డుకున్న సంగీత సోదరునిపైనా శ్రీనివాస్‌రెడ్డి దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఐలమ్మ పరారీలో ఉంది. సంగీత, రంజిత్‌లను ఆస్పత్రికి తరలించారు. భార్యను దారుణంగా కొట్టి ఇంటి నుండి గెంటిశాడు -
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
వీణవంక(హుజూరాబాద్): రైతు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బేతిగల్ గ్రామానికి చెందిన దాసరి జయప్రకాశ్ మృతిచెంది ఆరు నెలలు గడిచినా.. ఇంతవరకు చర్యలు చేపట్టలేదని అన్నారు. జయప్రకాశ్‌ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చొప్పదండిలోని ఓ సర్పంచ్ సమస్యలపై నిలదీస్తే రౌడీషీట్ ఓపెన్ చేశారని, సమస్యలను కూడా అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండాపోయిందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభించలేదని, కొందరు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. జిల్లా నాయకుడు చెన్నమాదవుని నరసింహారాజు, మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్‌గౌడ్, యువ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా నాయకులు సాగర్‌రెడ్డి, ఆదిరెడ్డి, దామోదర్ పాల్గొన్నారు. -
సచ్చింది..’లో కామెడీ చేస్తా
బుల్లితెర యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ వెండితెరపైనా రాణిస్తున్నారు. తాజాగా ఆమె ‘సచ్చింది రా గొర్రె’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, ‘జబర్దస్త్’ రాకేష్, శివారెడ్డి, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో శ్రీధర్‌రెడ్డి యార్వ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీపక్ ముకుత్, యన్.యమ్.పాషాలు అపర్ణ కిటేతో కలిసి సోహామ్ రాక్‌స్టార్ ఎంటర్ టైన్మెంట్– ఎంటర్టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై రూపొందుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీధర్‌రెడ్డి యార్వ మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్వులు పండిస్తుంది. దర్శకుడిగా ఇదే నా తొలి సినిమా అయినప్పటికీ డిఫరెంట్ జోనర్లో డార్క్ కామెడీతో తెరకెక్కిస్తున్నా. అనసూయ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘హీరో–హీరోయిన్ అని కాకుండా కేవలం కథే హీరోగా నడిచే చిత్రమిది. ఇందులోని తెలంగాణ సాంస్కృతిక గీతం ఒగ్గు కథ నన్ను ఆకట్టుకుంది. సినిమాటిక్‌గా ఉంటూనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో నేను ఫస్ట్ టైమ్ కామెడీ రోల్ ట్రై చేస్తున్నా. ఈసారి అందర్నీ నవ్విస్తా’’ అన్నారు అనసూయ. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌కుమార్. -
ఇప్పుడు తెలుగు సినిమాలే సెంటరాఫ్ ఎట్రాక్షన్!
‘‘హారర్ సినిమాలను అంతగా ఇష్టపడను. మాములుగా దెయ్యాలంటే మనుషులు భయపడుతుంటారు. కానీ, మా ‘ఆనందోబ్రహ్మ’ చిత్రంలో మాత్రం మనుషులకు దెయ్యాలు భయపడతాయి. డైరెక్టర్ మహి చెప్పిన ఈ పాయింట్ ఎగై్జటింగ్‌గా అనిపించింది’’ అన్నారు తాప్సీ. ఆమె ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ‘షకలక’ శంకర్, తాగుబోతు రమేశ్ కీలక పాత్రల్లో మహి.వి. రాఘవ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా తాప్సీ చెప్పిన విశేషాలు... ► స్టార్టింగ్ టు ఎండింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో నటించడంతోనే నా పనైపోయిందనుకోను... ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తాను. అది నటిగా నా బాధ్యత. ఈ సినిమాలో స్టార్ హీరోలు లేరు. అందుకే నా వంతుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాను. సినిమా చేసేటప్పుడు నా సలహాలను డైరెక్టర్ మహి.వి. రాఘవ్ గౌరవించారు. నేను కూడా ఆయన దగ్గర కొన్ని దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నా. ► ఒకప్పుడు నేను చేసిన తమిళ, తెలుగు చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. అందుకే క్యారెక్టర్, స్క్రిప్ట్ పరంగా రాజీపడకూడదనుకున్నాను. హిందీలో స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేస్తూ కొంత కాలం తీరిక లేకుండా ఉన్నాను. అలా అని హిందీలోనే యాక్ట్ చేస్తానని కాదు.. అక్కడ సినిమాల పరంగా నాకు కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. తెలుగు సినిమాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు తెలుగు సినిమాలు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ► ప్రస్తుతం హిందీలో ‘జుడ్వా 2’ చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా చేద్దామనుకుంటున్నాను. ‘ఆనందోబ్రహ్మ’ సినిమా ఫలితం కోసం ఎగై్జట్‌గా ఎదురు చూస్తున్నాను. తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. నాకు క్రీడలంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో ఎవరైనా క్రీడాకారుల జీవిత చరిత్రలో నటించే అవకాశం వస్తే వదులుకోను. -
కొత్త ఐడియాతో...
శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, శివారెడ్డి, రాకేశ్ ముఖ్య తారలుగా శ్రీధర్‌రెడ్డి యార్వ దర్శకత్వంలో సోహం రాక్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, ఎంటైర్టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై నిర్మాతలు దీపక్ ముకుత్, పాషా నిర్మిస్తున్న చిత్రం ‘సచ్చింది రా గొర్రె’. ‘‘కొత్త కంటెంట్‌ని, ఐడియాస్ని ప్రోత్సహించే సోహం రాక్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలసి వినోదాత్మకంగా సాగే సినిమాలను నిర్మించాలనుకుంటున్నాం. మంచి కథలను, టాలెంట్‌ని ప్రొత్సహిస్తూ క్వాలిటీ సినిమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత పాషా. ‘‘దక్షిణాది సినిమాల్లో వినూత్నమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త టాలెంట్‌ని వెతికి పట్టుకుని ప్రొత్సహిస్తూ నిర్మాణం చేపట్టడమే మా లక్ష్యం’’ అన్నారు నిర్మాత దీపక్ ముకుత్. ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: అపర్ణా కిటే, సంగీతం: సంతోష్‌కుమార్. -
తాప్సీ చాలా అందమైన దెయ్యం : ప్రభాస్
‘‘ఓ దెయ్యం మనుషులకు భయపడటం అనే కాన్సెప్ట్‌తో ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్ వస్తోన్న చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. చాలా కొత్తగా, ఆసక్తిగా ఉంది. తాప్సీ మోస్ట్ బ్యూటీఫుల్ దెయ్యంగా నటించింది’’ అని హీరో ప్రభాస్ అన్నారు. తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘కాన్సెప్ట్ బావుంది. విజయ్ ఎప్పుడు కలిసినా ఈ సినిమా గురించే మాట్లాడేవాడు. ఆగస్టు 18న ఈ సినిమా విడుదలవుతుంది. సినిమా సక్సెస్ తర్వాత నిర్మాత విజయ్ పార్టీ ఇవ్వాలి’’ అన్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాత విజయ్‌కు నేను వరుసకి బాబాయ్. విజయ్‌కి సినిమాలంటే ప్యాషన్. తను నిర్మించిన తొలి చిత్రం ‘భలే మంచి రోజు’ పెద్ద సక్సెస్ అయింది. విజయ్, శశి ఇలాంటి సక్సెస్‌లు వరుసగా సాధించాలి. ప్రభాస్ వీరిని పిలిచి డేట్స్ ఇచ్చేలా సినిమాలు చేయాలి’’ అన్నారు. ‘‘శరీరం, ఆత్మల కలయికే మనిషి. శరీరం లేని ఆత్మ దెయ్యం. అది ఎలా ఉంటుందో నాకే కాదు ఎవరికీ తెలియదనుకుంటున్నా’’ అన్నారు మహి వి.రాఘవ్. తాప్సీ, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, హీరో సుధీర్‌బాబు, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘తాగుబోతు’ రమేశ్, నటుడు రాజీవ్ కనకాల తదితరులు పాల్గొన్నారు. -
రివర్స్ కాన్సెప్ట్‌తో థ్రిల్!
‘‘పాఠశాల’ తర్వాత మరో మంచి సినిమా చేయాలని గ్యాప్ తీసుకున్నా. కథ రాయడానికి, ఆర్టిస్టుల డేట్స్ కుదరడానికీ సమయం పట్టింది’’ అన్నారు దర్శకుడు మహి వి. రాఘవ్. తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘ఆనందోబ్రహ్మ’ ఈ నెల 18న విడుదలవుతోంది. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ – ‘‘నేను దేవుణ్ణి, దెయ్యాన్ని నమ్మను. దానికి కారణం భయమే. హారర్ థీమ్‌నే రివర్స్‌లో చెప్పి, థ్రిల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడే మనిషికి దెయ్యం భయపడితే ఎలా ఉంటుంది? అని కథ రాసుకున్నా. కథ విని, చేయడానికి తాప్సీ సిద్ధమైంది. ఆమె డేట్స్ కోసం నాలుగు నెలలు వెయిట్ చేశా. సినిమా బాగా రావడానికి నిర్మాత విజయ్‌గారు కూడా ఓ కారణం. హారర్ సినిమాల్లో సౌండ్ చాలా కీలకం. అందుకే మేము సౌండ్ కొత్తగా ఉండాలని చాలా సమయం తీసుకున్నాం. ప్రస్తుతానికి ఏ సినిమా ఒప్పుకోలేదు. ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నా’’ అన్నారు. -
భయానికి నవ్వంటే భయం
తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. ‘భయానికి నవ్వంటే భయం’ అన్నది ఉపశీర్షిక. మహి.వి రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ‘‘హారర్ నేపథ్యంలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మహి వి.రాఘవ్. ‘‘మనుషులను చూసి దెయ్యాలు భయపడితే ఎలా ఉంటుందన్నదే కథ. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు నవ్వుతుంటారు. ఇప్పటి వరకూ ఏ హారర్ మూవీనీ అమెరికాలో విడుదల చేయలేదు. తొలిసారి అక్కడ మేము 85 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు విజయ్ చిల్లా. ‘‘గీతాంజలి’ తర్వాత పలు హారర్ కథలు విన్నా. అయితే ఒకే టైప్‌లో ఉండటంతో ఒప్పుకోలేదు. ‘ఆనందో బ్రహ్మ’ కథ విన్న తర్వాత ఈ సినిమా వదులుకోకూడదనిపించింది’’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు. -
నరేష్-స్వాతిని ఎందుకు రప్పించారు?
హైదరాబాద్ : దారుణ హత్యకు గురైన నరేష్ కేసులో పోలీసులు వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోందని మృతుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేష్-స్వామిలను ముంబై నుంచి పిలిపించడం వెనుక పోలీసుల పాత్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. భువనగిరి పోలీసులే ఈ ఘోరానికి కారకులని, డీసీపీ రామచంద్రయ్య ఈ కేసులో ప్రేక్షక పాత్ర పోషించారని నరేష్ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. స్వాతి తండ్రే నరేష్‌ను చంపి ఉంటాడని తాము ముందు నుంచీ చెప్తున్నామని, అయితే కేసును పక్కదోవ పట్టించడానికి స్వాతిని కూడా తండ్రే హత్య చేశాడన్నారు. ఇద్దరి ప్రాణాలు తీసిన స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. కాగా పోలీసులు వ్యవహారశైలిపై ఇప్పటికే నరేష్ తల్లిదండ్రులు హైకోర్టుతో పాటు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. మేజర్ల వివాహంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారని, పెళ్లయిన వారానికే నరేష్-స్వాతిలను ఇక్కడకు ఎందుకు రప్పించారని, మళ్లీ రెండోసారి రప్పించడంలో పోలీసుల పాత్ర ఏంటని నరేష్ బంధువులు ప్రశ్నిస్తున్నారు. తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి! భువనగిరి పోలీసుల పాత్రపై విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ దారుణానికి భువనగిరి పోలీసులు బాధ్యులు కారా? అని ప్రశ్నలు సంధించారు. తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్‌ను పరువు కోసం హతమార్చినట్లు స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. -
తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి!
-
తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి!
తన భార్య కోసం వచ్చి.. మామ చేతిలో హత్యకు గురైన నరేష్ కేసు పలు మలుపులు తిరిగింది. పుట్టింట్లో ఉన్న తన భార్యను కలుసుకోడానికి వచ్చిన నరేష్.. అనుకోకుండా మామ శ్రీనివాసరెడ్డి కంట్లో పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. తమ ఇంటి దగ్గర తచ్చాడుతున్న నరేష్‌ను చూసిన శ్రీనివాసరెడ్డి.. అతడిని తమ పొలానికి తీసుకెళ్లి తల వెనుక భాగంలో ఇనుప రాడ్‌తో ఒక్కటే దెబ్బ కొట్టాడని, దాంతో నరేష్ అక్కడికక్కడే మరణించాడని ఆయన తెలిపారు. ముందు ఎలాగోలా శవాన్ని తగలబెట్టేద్దామని అనుకున్నా తర్వాత పెట్రోలు తీసుకొచ్చి శవానికి పైన, కింద కూడా టైర్లు పెట్టి పూర్తిగా కాలిపోయేలా చూశారన్నారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి... నరేష్ అదృశ్యంపై అతడి తండ్రి వెంకటయ్య కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాకలు చేయడంతో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు విచారణ ప్రారంభించామని, ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావును దర్యాప్తు అధికారిగా నియమించామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. జాయింట్ సీపీ తరుణ్ జోషి నేతృత్వంలో వేర్వేరు బృందాలను రూపొందించి ముంబై, షోలాపూర్ తదితర ప్రాంతాలకు పంపినట్లు చెప్పారు. నరేష్ సొంత ఊరు పల్లెర్ల, శ్రీనివాసరెడ్డి ఊరు లింగరాజపల్లి తదితర ప్రాంతాల్లో విచారణ జరిపినట్లు తెలిపారు. ముందు నుంచి శ్రీనివాసరెడ్డి మీద అనుమానం ఉండటంతో ఆయనను పిలిపించి, డీసీపీ ఆధ్వర్యంలో ఎస్ఓటీ బృందం విచారించిందన్నారు. చివరకు శ్రీనివాసరెడ్డి నుంచి నిజాన్ని రాబట్టామని తెలిపారు. మే రెండో తేదీన శ్రీనివాసరెడ్డి, స్వాతి పిన్నికొడుకు సత్తిరెడ్డి కలిసి తమ వద్ద ఉన్న వ్యాగన్ ఆర్ కారులో స్వాతిని లింగరాజపల్లికి తీసుకెళ్లారని, అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో తమ ఇంటి దగ్గర ఒక మోటార్ సైకిల్ తచ్చాడుతుండటంతో అది చూసి శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చారని సీపీ చెప్పారు. తమ వద్ద ఉన్న హోండా బైకును శ్రీనివాసరెడ్డి డ్రైవ్ చేస్తుండగా, సత్తిరెడ్డి వెనకాల కూర్చుని వెళ్లారని, అర కిలోమీటరు దూరంలో వాళ్లకు నరేష్ కనిపించడంతో అతడిని మధ్యలో కూర్చోబెట్టుకుని తమ పొలానికి తీసుకెళ్లారని వివరించారు. అక్కడ నరేష్‌తో సత్తిరెడ్డి మాట్లాడుతూ ఉండగా శ్రీనివాసరెడ్డి వెనక నుంచి రాడ్‌తో తల వెనక భాగంలో ఒకే దెబ్బ కొట్టాడని, దాంతో నరేష్ అక్కడికక్కడే మరణించాడని చెప్పారు. అక్కడే శవాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించగా, అది పూర్తిగా కాలలేదని, దాంతో ఆత్మకూరు వెళ్లి అక్కడ 5 లీటర్ల పెట్రోలును క్యానులో కొనుక్కుని తీసుకొచ్చి శవానికి పైన, కింద కొన్ని టైర్లు పెట్టి, పెట్రోలు పోసి శవాన్ని తగలబెట్టారని ఆయన తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ బోడుప్పల్ బాలాజీ హిల్స్ ప్రాంతంలో ఉన్న తన ఇంటికి నరేష్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని సత్తిరెడ్డి వచ్చాడన్నారు. మర్నాడు.. అంటే మూడోతేదీ ఉదయం శ్రీనివాసరెడ్డి వచ్చి అస్థికలను ఒక గోనెసంచిలో సేకరించి, మూసీ నదిలో కలిపేశారని చెప్పారు. మొత్తం హత్య, దానికి సంబంధించిన ఆధారాలను మాయం చేయడం అన్నీ మే 2, 3 తేదీలలో జరిగాయన్నారు. శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డి ఇద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించగా ఇద్దరూ ఇవే విషయాలు చెప్పారని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే.. ఈనెల 16వ తేదీన స్వాతి ఆత్మహత్య చేసుకుందని, అయితే ఆమె తీసుకుందని చెబుతున్న సెల్ఫీ వీడియోపై అనుమానాలు ఉండటంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని సీపీ చెప్పారు. భువనగిరి నుంచి ఒక విలేకరి తమ ఇంటికి వచ్చి ఆమెను అసభ్యంగా ప్రశ్నించడంతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయిందని అంటున్నారని తెలిపారు. అయితే అసలు ఈ కేసులో విషయాలన్నీ చాలా నాటకీయంగా ఉన్నాయని, దర్యాప్తులో కూడా తమకు చాలా సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. పెళ్లయిన తర్వాత ముంబైలోని వర్లి పోలీసు స్టేషన్లో స్వాతి, నరేష్ ఇద్దరూ కలిసి వెళ్లి తమకు స్వాతి తండ్రి నుంచి ముప్పు ఉందని స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత స్వాతి మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి తన పరిస్థితి ఏమీ బాగోలేదని, తన సెల్ఫోన్లో బ్యాలెన్స్ వేయించాలని అడిగిందని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. తాను రెండుమూడు సార్లు అలా బ్యాలెన్స్ వేయించినట్లు శ్రీనివాసరెడ్డి చెప్పారన్నారు. నరేష్ సోదరి షోలాపూర్‌లో ఉంటారని, ఆమెతో కూడా శ్రీనివాసరెడ్డి టచ్‌లో ఉన్నారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గతంలోనూ హత్యల చరిత్రేనా?
-
స్వాతిది ఆత్మహత్యా.. హత్యా?
-
స్వాతిది ఆత్మహత్యా.. హత్యా?
ప్రేమజంట స్వాతి- నరేష్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో సరికొత్త అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఈనెల ఒకటో తేదీ నుంచే నరేష్ కనిపించడం లేదు. ఆ తర్వాత.. దాదాపు పది రోజుల క్రితం స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. నరేష్ గురించి కూడా చాలా కాలం పాటు అసలు ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియలేదు. ఎట్టకేలకు అతడిని హతమార్చినట్లు తెలియడంతో ఒక్కసారిగా అంతా నివ్వెరపోయారు. దాంతోపాటే అసలు స్వాతి కూడా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఆమెను సైతం హతమార్చారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంబోజు నరేష్ అదృశ్యం అయిన సుమారు 15 రోజుల తర్వాత స్వాతి మరణించింది. ఇద్దరికీ పెళ్లి చేస్తామని పిలిపించడంతో ఆమె నమ్మకంగా ఇంటికి వచ్చింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఇప్పుడు నరేష్ హత్యకు గురైనట్లు తేలడంతో.. స్వాతి మరణం కూడా సహజమా, అసహజమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నరేష్ మరణించిన విషయం స్వాతికి తెలిసి ఉంటుందని, దానిపై ఆమె గొడవ చేయడంతో విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని ఆమెను కూడా చంపేసి ఉండొచ్చని స్థానికులు గట్టిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం మీద కూడా మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన హత్యలతో పాటు ఇప్పుడు సంభవించిన ఈ రెండు మరణాల మీద కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గతంలోనూ హత్యల చరిత్రేనా?
నరేష్ హత్య కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. అతడిని చంపిన శ్రీనివాసరెడ్డికి 20 ఏళ్ల వయసు నుంచే నేర చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ముందు నుంచే రౌడీషీటర్లతో తిరిగేవాడని అంటున్నారు. గతంలో 1992 సంవత్సరంలో ఒక పొలం వివాదంలో శ్రీనివాసరెడ్డి సొంత అన్న హత్యకు గురయ్యారు. ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు సైతం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అప్పట్లో ఈ మూడు హత్యల విషయంలోనూ ఈయనపై అనుమానాలు తలెత్తాయి గానీ, ఆధారాలు ఏమీ లేకపోవడంతో రుజువు కాలేదు. ఇప్పుడు స్వాతి కూడా ఆత్మహత్య చేసుకుందా.. లేక చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ అనుమానాస్పద మృతి, నరేష్ హత్య కేసులలో కూడా దాదాపు ఇలాగే జరిగేది. అయితే కోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఆలస్యంగానైనా స్పందించి విచారణ వేగవంతం చేయడంతో మొత్తం కేసు ఒక కొలిక్కి వచ్చింది. హత్య జరిగిన తీరు మొత్తం బట్టబయలైంది. స్వాతి పేరు మీద ఉన్న పొలంలోనే ఆమె భర్త నరేష్‌ను దారుణంగా చంపి, టైర్లతో తగలబెట్టిన శ్రీనివాసరెడ్డి.. అతడి అస్థికలను మూసీనదిలో కలిపేశాడు. దాంతో అసలు ఆధారాలన్నవి దొరకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే పోలీసులు చుట్టుపక్కల విచారించడంతో పాటు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఎవరైనా హత్య లాంటి నేరాలు చేస్తే ఎక్కడో ఒకచోట ఆధారాలు వదలకుండా ఉండారు. కానీ శ్రీనివాసరెడ్డి మాత్రం పక్కాగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా చేసి చివరకు అస్థికలను కూడా మూసీనదిలో కలిపేయడంతో.. స్వయంగా ఆయన చెబితే తప్ప హత్య జరిగిందన్న విషయం కూడా బయటకు వచ్చేది కాదు.