
తాప్సీ చాలా అందమైన దెయ్యం : ప్రభాస్
‘‘ఓ దెయ్యం మనుషులకు భయపడటం అనే కాన్సెప్ట్‌తో ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్ వస్తోన్న చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. చాలా కొత్తగా, ఆసక్తిగా ఉంది. తాప్సీ మోస్ట్ బ్యూటీఫుల్ దెయ్యంగా నటించింది’’ అని హీరో ప్రభాస్ అన్నారు. తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘కాన్సెప్ట్ బావుంది.
విజయ్ ఎప్పుడు కలిసినా ఈ సినిమా గురించే మాట్లాడేవాడు. ఆగస్టు 18న ఈ సినిమా విడుదలవుతుంది. సినిమా సక్సెస్ తర్వాత నిర్మాత విజయ్ పార్టీ ఇవ్వాలి’’ అన్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాత విజయ్‌కు నేను వరుసకి బాబాయ్. విజయ్‌కి సినిమాలంటే ప్యాషన్. తను నిర్మించిన తొలి చిత్రం ‘భలే మంచి రోజు’ పెద్ద సక్సెస్ అయింది. విజయ్, శశి ఇలాంటి సక్సెస్‌లు వరుసగా సాధించాలి.
ప్రభాస్ వీరిని పిలిచి డేట్స్ ఇచ్చేలా సినిమాలు చేయాలి’’ అన్నారు. ‘‘శరీరం, ఆత్మల కలయికే మనిషి. శరీరం లేని ఆత్మ దెయ్యం. అది ఎలా ఉంటుందో నాకే కాదు ఎవరికీ తెలియదనుకుంటున్నా’’ అన్నారు మహి వి.రాఘవ్. తాప్సీ, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, హీరో సుధీర్‌బాబు, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘తాగుబోతు’ రమేశ్, నటుడు రాజీవ్ కనకాల తదితరులు పాల్గొన్నారు.