
ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించనున్నారట. అది కూడా ప్రభాస్‌కి అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. తనదైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారట సందీప్. ఈ మూవీలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్.
ఇందులో యాక్షన్ ఓ రేంజ్‌లో ఉంటుందని భోగట్టా. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. బాలీవుడ్‌లో సంజయ్ దత్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్‌కి అన్నయ్యగా ఆయన్ని తీసుకోనున్నారట సందీప్. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి సంజయ్ అయితే పక్కాగా సరితూగుతారన్నది దర్శకుడి ఆలోచనట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. మరి ‘స్పిరిట్’లో సంజయ్ దత్ భాగం అవుతారా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment