Spirit
-
స్టార్ డైరెక్టర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న త్రివిక్రమ్ కుమారుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్వరలో ఆయన కుమారుడు రిషీ మనోజ్ కూడా మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతలో తన కుమారుడికి శిక్షణ ఇచ్చే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకోకుండా మరో ఇద్దరు దర్శకులకు ఆ పని అప్పజెప్పారు. ఇప్పటికే రిషీ ట్రైన్ అయి ఉన్నాడు. అయితే, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోతున్నాడు.జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి వద్ద త్రివిక్రమ్ కుమారుడు ఇప్పటికే శిక్షణ తీసుకున్నాడు. విజయ్- గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' సినిమాకు అసిస్టెంట్‌గా త్రివిక్రమ్ కుమారుడు పనిచేస్తున్నాడు. దాదాపు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావస్తోంది. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా దగ్గరకు రిషీ వెళ్లనున్నాడు. ఇక్కడ త్రివిక్రమ్ ఫోన్ చేసి తన కుమారుడిని అసిస్టెంట్‌గా తీసుకోవాలని కోరితే ఎవరు వద్దంటారు..? అందుకే ప్రభాస్ స్పిరిట్ సినిమాకు రిషీ అసిస్టెంట్‌గా పనిచేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత రిషీ కూడా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.మరో రెండేళ్లలో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అకీరా, రిషీ ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌తో పరిచయం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పవన్-త్రివిక్రమ్‌ల మధ్య ఉన్న స్నేహం ఈ ప్రాజెక్ట్ సులభంగా పట్టాలెక్కనుందని చెప్పవచ్చు. -
స్పిరిట్‌లో విష్ణు
‘స్పిరిట్’(spirit) సినిమా కోసం స్పెషల్ అప్లికేషన్ పెట్టుకున్నారు హీరో మంచు విష్ణు(Manchu Vishnu). ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ ‘స్పిరిట్’. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ప్రభాస్(Prabhas). ఈ వేసవిలో ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణను ప్రారంభించనుంది యూనిట్. దీంతో నటీనటుల కోసం ‘ఎక్స్’లో ఓ నోట్‌ను షేర్ చేసింది.‘‘ఫిల్మ్ అండ్ థియేటర్ బ్యాక్‌గ్రౌండ్‌లో అనుభవం ఉన్న నటీనటులు మా సినిమాలో యాక్ట్ చేసేందుకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటూ కొన్ని షరతులతో ‘స్పిరిట్’ టీమ్ ఓ నోట్‌ను షేర్ చేసింది. ఈ నోట్‌ను ‘ఎక్స్’లో షేర్ చేసి, తాను ‘స్పిరిట్’ సినిమా కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, ఏం జరుగుతుందో చూడాలన్నట్లుగా విష్ణు మంచు పేర్కొన్నారు.మరోవైపు విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి... ప్రభాస్ ‘స్పిరిట్’ లో నటించే చాన్స్ విష్ణు మంచుకు దక్కుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ ‘స్పిరిట్’ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
ప్రభాస్ 'స్పిరిట్' ఆరంభం ఎప్పుడంటే..?
‘స్పిరిట్’(Spirit) సినిమా సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రభాస్(Prabhas) హీరోగా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మేలో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.దీంతో లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్‌గా మేకోవర్ కానున్నారట. ‘స్పిరిట్’ చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యం కావడానికి ఇదొక కారణమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా... ఇలా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్ కాలేదట. టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్న ‘స్పిరిట్’ చిత్రం 2026 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. -
ఎన్ని అడ్డంకులొచ్చినా...సంకల్పమే మీ బలం!
నూతన సంవత్సరంలో చాలా మంది ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినంత సంకల్ప బలం వారిలో ఉండదు. అందుకే మధ్యలోనే ఆ లక్ష్యాలను వదిలిపెడతారు. కొన్నిసార్లు మీ మనసే ఎన్నో సాకులను వెతుకుతుంది. మీ లక్ష్యాన్ని ఓడించాలని చూస్తుంది. అందుకే మీ మనసును చెదరని సంకల్ప బలంతో నింపండి. నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయాన్ని సాధిస్తాను! నేను లక్ష్యాన్ని చేరతాను అని పదే పదే మనసులో అనుకోండి! అనుకుందే ఆచరణలో పెట్టండి. మీరు చేయాల్సిన కృషితో పాటు దృఢమైన సంకల్ప శక్తి కూడా ఉండాలి. ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది మహా సముద్రాన్ని చేరాలని కలలు కంటూ ఉండేది. తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రతిసారీ దారిలో రాళ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలు ఎదురవడంతో ఆ చిన్న ప్రవాహం వెనుదిరిగి వెనకకు వెళ్లి΄ోయేది.‘‘నీకు ఇది సాధ్యం కాదు,’’ అని దారిలోని పెద్ద రాళ్లు చెప్పేవి. ‘‘నువ్వు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నావు నువ్వు చేయలేవు’’ అని ఆ చిట్టి ప్రవాహాన్ని నిరుత్సాహ పరిచేవి. ఒకనాడు చిట్టి ప్రవాహం చాలా దిగులుగా, ఇక ఎప్పటికీ తన కలను నెరవేర్చుకోలేనన్న బాధతో, సందేహంతో ఉండటాన్ని వృక్షమాత గమనించింది. వృక్ష మాత ప్రవాహంతో ఇలా చెప్పింది, ‘‘ఇలా బాధ పడినంత మాత్రాన నీ లక్ష్యాన్ని నీవు చేరగలవా..?? నువ్వు బాధ పడటం వల్ల ఏ ఉపయోగం లేదు! మహా సముద్రాన్ని చేరాలనే నీ తపననే నీ శక్తిగా మలుచుకో..నీ సంకల్పాన్ని బలపరుచుకో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదిరగననే వజ్ర సంకల్పం చేసుకో!’’ అని చిట్టి ప్రవాహానికి కొండంత ధైర్యమిచ్చి, విజయోస్తు! అని దీవించి పంపింది వృక్ష మాత. ఆ ధైర్యంతో, ప్రవాహం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ముందుకు వెళ్లాలని సంకల్పించుకుంది. పెద్ద రాళ్ళు ఎదురైనప్పుడు వాటి మధ్యనున్న చిన్న సందులనే మార్గంగా చేసుకుంది. ఎండ తీవ్రతకు ఆవిరైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, మేఘాలకెగసి అక్కడి నుండి నదిగా భువికి తిరిగి వచ్చింది. ఒకప్పటి చిట్టి ప్రవాహమే ఇప్పుడు మహా ప్రవాహమై చివరికి మహాసముద్రంలో లీనమైంది. ‘‘నీ లక్ష్యాన్ని నీవు సంకల్ప శక్తితో సాధించావు’’ అని వృక్ష మాత హర్షించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెదరని సంకల్ప బలంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి మనఃస్థితి ఉంటే ఏ పనిలోనైనా నిస్సందేహంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ యావత్ విశ్వంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు! – మాతా ఆత్మానందమయిఆధ్యాత్మిక గురువు -
స్పిరిట్‌లో..?
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ డ్రామాగా ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీసాఫీసర్‌గా నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రను మృణాల్ ఠాకూర్ చేయనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం కూడా బీ టౌన్లో జరుగుతోంది. ఇక ఆల్రెడీ సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ ఈ చిత్రంలో ఓ రోల్ చేయనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి... బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభాస్ సరసన మృణాళ్ కనిపిస్తారా? అలాగే కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కన్ఫార్మ్ అవుతారా? అనేది వేచి చూడాల్సిందే. -
‘స్పిరిట్’ డిసెంబరులో స్టార్ట్
‘స్పిరిట్’ సినిమా సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’. ఈ చిత్రం కోసం తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు ప్రభాస్. కాగా తాజాగా ‘స్పిరిట్’ సినిమా గురించి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ స్పందించారు.‘‘స్పిరిట్’ ప్రారంభోత్సవం ఈ ఏడాది డిసెంబరులో ప్లాన్ చేస్తున్నాం. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో ఈ మూవీని సెట్స్‌కు తీసుకువెళ్తాం. 2026 మధ్యలో రిలీజ్ ఉండొచ్చు. ప్రస్తుతం సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ సాంగ్స్ పనుల్లో ఉన్నారు. నేను రెండు సాంగ్స్ విన్నాను.. బాగున్నాయి’’ అని ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భూషణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
పాన్ ఇండియా మూవీస్ పంజా..!
-
ఎగతాళి చేసినవాళ్లే గౌరవిస్తున్నారు
‘మనం సినిమా చూసేవాళ్లమే కానీ తీసేవాళ్లం కాదు’... భార్య వెంకట నర్సమ్మతో భర్త చెన్నెబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ఒక్క సినిమా అయినా నిర్మించాలనే తల్లి ఆలోచనను కాదన్నాడు కుమారుడు వెంకట రవీంద్రనాథ్. రెండేళ్లు ఇంటికి దూరంగా ఎక్కడికో వెళ్లిపోయాడు కూడా. కొడుకు ఆచూకీ తెలుసుకుని ఇంటికి పిలిపించుకున్న నర్సమ్మ మళ్లీ సినిమా పాటే పాడారు. ఇక చేసేదేం లేక సినిమా నిర్మించాలని ఫిక్స్ అయిపోయారు. నర్సమ్మ వేలి ముద్ర మాత్రమే వేయగలరు. కానీ వెండితెరపై నిర్మాతగా ఓ ముద్రగా మిగిలిపోవాలని కూలి చేసి సంపాదించిన డబ్బు, రాగి సంగటి హోటలు పెట్టి, దాని ద్వారా వచ్చిన ఆదాయం... ఇలా కష్టం చేసిన డబ్బుతో ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) సినిమాని ఆరంభించారు. ఇక... మిగతా విశేషాలు నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ, ఆమె భర్త చెన్నెబోయిన వెంకటేశ్వరరావు మాటల్లో తెలుసుకుందాం.‘‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. పొలం పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో నేను, నా స్నేహితులు కలిసి సినిమాలు చూసే వాళ్లం. ‘బ్రహ్మంగారి చరిత్ర, పొట్టేలు పున్నమ్మ’ సినిమాలు నా మనసుని బాగా కదిలించాయి. సినిమాలపై ఇష్టంతో ఎప్పటికైనా ఓ సినిమా నిర్మించాలనుకున్నాను. అందుకోసం పట్టుదలగా పదేళ్లు శ్రమించాను. ఆ కల ఇన్నేళ్లకు ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) చిత్రంతో నెరవేరడం చాలా సంతోషంగా ఉంది’’ అని నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ అన్నారు. రవిబాబు, సత్యప్రకాశ్, ‘చిత్రం’ శ్రీను, చిట్టిబాబు, రమ్య, ప్రియ, పింకీ, జబర్దస్త్ నాగ్తేజ్, జూనియర్ రాజశేఖర్, సైదులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘స్పిరిట్’ ఈజ్ నాట్ వన్). తన కుమారుడు వెంకట రవీంద్రనాథ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎయిత్ వండర్ సినిమా పతాకంపై చెన్నెబోయిన వెంకట నర్సమ్మ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.నా కల ఇన్నేళ్లకు నెరవేరింది ఈ సందర్భంగా నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామం. నేను చదువుకోలేదు కాబట్టి చదవడం, రాయడం రాదు. చెన్నెబోయిన వెంకటేశ్వరరావుతో నా పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆయనతో కలిసి సినిమాలు చూసేదాన్ని. మాది వ్యవసాయ కుటుంబం. మాకున్న పొలంలో వ్యవసాయం చేసుకోవడంతో పాటు కూలి పనులకు వెళ్లేదాన్ని. బర్రెలు, మేకలు, పొట్టేళ్లు కూడా పెంచేవాళ్లం. ఓ చిన్నపాటి హోటల్ కూడా నడుపుతున్నాం. సినిమా నిర్మించాలనే నా ఆలోచనని ముందు నా భర్తకి చె΄్పాను. ఆ తర్వాత నా పెద్ద కుమారుడు వెంకట రవీంద్రనాథ్‌కి చె΄్పాను. సినిమా నిర్మాణం అంటే మాటలా? కోట్ల రూపాయలు కావాలి? మన ఆర్థిక పరిస్థితి ఏంటి? వద్దని వారించారు. ఆ తర్వాత నా పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి ఒప్పుకున్నారు. నా ఆలోచన నుంచి వచ్చిందే ‘స్పిరిట్’ సినిమా కథ. నా ఆలోచనలని వెంకట రవీంద్రనాథ్ చక్కగా తెరపై చూపించగలడనే నమ్మకంతో తననే డైరెక్షన్ చేయమన్నా. ఈ సినిమా కోసం మాకున్న పొలం, పశువులు, పొట్టేళ్లు, మేకలు, ఇల్లు అమ్మేశాం. సినిమా నిర్మాణం, పోస్ట్ ్రపొడక్షన్ పనులు, సెన్సార్ వంటి వాటికి ఇప్పటికే రూ. 90 లక్షలైంది. దాదాపు 40 లక్షలు దాకా అప్పులు చేశాం. సినిమా విడుదల చేసేందుకు పబ్లిసిటీ ఖర్చుల కోసం మరో రూ. 10 లక్షలు కావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... తెలంగాణాలోని దేవదాసీ వ్యవస్థలానే కోస్తాంధ్రలో మాతంగులు ఉండేవారు. ఇప్పుడూ ఉత్సవాలు, జాతర్లు, ఎల్లమ్మ తిరునాళ్ల వంటి సమయాల్లో వారిని డ్యాన్స్ చేయటానికి తీసుకొస్తుంటారు. వారి కష్టాలను కళ్లారా చూశాం. మాతంగుల జీవితాలు ప్రస్తుతం దుర్భరంగా ఉన్నాయి. వారిపై జరిగే దురాచారాలు పోవాలి. వారి పిల్లలు మాతంగుల వృత్తిలోకి రాకుండా చదువుకుని, ఉద్యోగాలు చేసుకోవాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం. త్వరలో ఆడియో రిలీజ్ చేసి, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే మా బంధువులు, తెలిసినవారు, ఊర్లోని వారు ‘మీరేంటి? సినిమా నిర్మించేదేంటి?’ అంటూ హేళనగా, చులకనగా మాట్లాడేవారు. అన్నింటినీ భరించి, ఈ సినిమా నిర్మించాం. దీంతో ఎగతాళిగా మాట్లాడినవారే అనుకున్నధి సాధించావంటూ ఆ΄్యాయంగా మాట్లాడుతున్నారు... గౌరవంగా చూస్తున్నారు. సినిమా నిర్మించాలనే నా కల నెరవేరింది. ఇకపై సినిమా నిర్మించను. ఇండస్ట్రీలోనే ఉండాలా? వద్దా అన్నది మా అబ్బాయి వెంకట రవీంద్రనాథ్ ఇష్టం. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ఆత్మస్థైర్యం కోల్పేలేదు – చెన్నెబోయిన వెంకటేశ్వరరావు సినిమా నిర్మించాలని ఉందని నా భర్య అన్నప్పుడు మొదట్లో నేను కూడా నవ్వుతూ, ఎగతాళి చేసేవాణ్ణి. అయితే తన పట్టుదల చూసి ఆ తర్వాత ఒప్పుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఈ సినిమా నిర్మించింది. ఈ సినిమా నిర్మాణం మాకో మధురానుభూతి. అలాగే ఓ విషాదం కూడా నింపింది. ఈ చిత్రంలో నటించిన మా రెండో అబ్బాయి పాముకాటుకు గురై మృతి చెందడం మమ్మల్ని కలిచివేసింది. మా అబ్బాయి నటించిన సన్నివేశాలు వచ్చినప్పుడు నా భార్య చూడదు... బాధపడాల్సి వస్తుందని. ఈ సినిమాలో నేనో పాత్ర చేశాను. ‘స్పిరిట్’ మాకు లాభాలు తీసుకురాకపోయినా పర్లేదు. కానీ, చేసిన అప్పులు తీర్చేలా డబ్బులు వస్తే చాలు. ఏది ఏమైనా సినిమా నిర్మించామన్న తృప్తి ఎప్పటికీ ఉంటుంది. -
దసరాకి ఖుషీ
దసరా పండగకి ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారట ప్రభాస్. అది కూడా గ్లింప్స్ రూపంలో. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబా’లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా అంగీకరించారు. ‘స్పిరిట్’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభం అవుతుందట.ఘను రాఘవపూడి దర్శకత్వంలోని సినిమా షూట్ ఆరంభమైంది. మధురైలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనడంలేదు. రెండో షెడ్యూల్ నుంచి పాల్గొంటారట. ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారట. 1940ల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే మార్చికి పూర్తవుతుందని సమాచారం. -
వరి అంటే ఆహారం మాత్రమే కాదు, మన కరెన్సీ కూడా!
‘అన్నం గురించి చెప్పండి’ అని అడిగితే... ‘రోజూ తింటాం’ అనేవాళ్లే ఎక్కువ. ‘మీకు తెలిసిన వరివంగడాల గురించి చెప్పండి’ అని అడిగితే... ఒకటి, రెండు మాత్రమే చెప్పేవాళ్లు ఎక్కువ. అంతేనా! ‘కాదు... ఎంతో ఉంది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ వినయ్ వారణాసి. భారతీయ సంస్కృతిలో అన్నం, సంప్రదాయ వరి ధాన్యాల ప్రాముఖ్యతను చెబుతున్న వినయ్ ప్రసంగాలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి.మనం ఎప్పుడూ వినని కొత్త కథలు కాదు. అయితే వాటిని కొత్తగా ఎలా చెప్పవచ్చో వినయ్ ప్రసంగాలు వింటే అర్థం అవుతుంది. అన్నంతో సంబంధం ఉన్న వివిధ ఆచారాలు, వాటి పట్ల రుషులకు ఉన్న భక్తి, మనిషి జీవితాన్ని నిలబెట్టడంలో దాని విలువైన పాత్ర, దైవత్వానికి దాని ప్రతీకాత్మక సంబంధం గురించి వివరిస్తాడు. అన్నదానం చేసే ప్రక్రియను పౌరాణిక కథల ద్వారా చెబుతాడు. ‘మన దేశంలో బియ్యం అనేది సామాజిక, ఆర్థిక కరెన్సీ’ అంటున్న వినయ్ ‘స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్’ అనే సంస్థతో కలిసి బడులను నుంచి వ్యవసాయ కళాశాలల వరకు వరి ధాన్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.‘ఎన్నో రకాల వరి వంగడాలను పునరుద్ధరించడంపై మేము దృష్టి సారించాం. ప్రతి దానికి దాని ప్రత్యేకమైన ఆకృతి. రంగు, వాసనకు పేరు ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు కన్యాకుమారిలో కనిపించే అనికొంబస్ ఇప్పుడు అంతరించిపోయింది. అనేక దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి’ అంటుంది ‘స్పిరిట్ ఆఫ్ ఎర్త్’ ఫౌండర్ షీలా బాలాజి. ప్రాచీన వరి వంగడాల పునర్జీవానికి వాటి గురించి అవగాహన కలిగించడం అనేది కీలకం.హైబ్రిడ్ వరి వంగడాల వైపు ఎక్కువగా దృష్టి సారించడం వల్ల అనేక సంప్రదాయ వరి రకాలు క్షీణించాయి. ఎక్కువమంది ఈ పురాతన రకాలపై ఆసక్తి చూపితే సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ మన వ్యవసాయ వైవిధ్యాన్ని కాపాడుతుంది. దీనికి అవగాహన కల్పించడం అవసరం. ఆ పనిని సగర్వంగా భుజాల కెత్తుకున్నాడు వినయ్ వారణాసి.ఇక వినయ్ మల్టీ టాలెంట్ విషయానికి వస్తే... ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ మాత్రమే కాదు ఆర్కిటెక్ట్, డిజైన్ రిసెర్చర్, క్లాసిక్ మ్యూజిక్ లిరిసిస్ట్, డిజైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘అన్బైండ్’ ఫౌండర్. -
అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!
హీరో ప్రభాస్, హీరోయిన్ కరీనా కపూర్ జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమాకు చెందిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్’ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. (చదవండి: ప్రేమకథ బయటపెట్టిన సోనియా.. బూతులందుకున్న పృథ్వి)ఈ లోపు ఈ సినిమాకు చెందిన నటీనటుల ఎంపికపై సందీప్ రెడ్డి దృష్టి పెట్టారట. ఈ క్రమంలోనే హీరోయిన్ పాత్ర కోసం కరీనా కపూర్‌ను సంప్రదించారని సమాచారం. అంతేకాదు... కరీనా భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ కూడా ‘స్పిరిట్’ చిత్రంలో కనిపిస్తారని, సైఫ్‌ది విలన్ పాత్ర అని బాలీవుడ్ భోగట్టా. (చదవండి: సూపర్‌స్టార్ కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య కూతురు..!)మరోవైపు మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారట రాజమౌళి. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం కరీనాను సంప్రదించారనే ప్రచారం టాలీవుడ్లో వినిపిస్తోంది. మరి... ప్రభాస్ ‘స్పిరిట్’కు కరీనా ఫైనల్ అవుతారా? మహేశ్‌బాబు చిత్రంలోనూ నటిస్తారా? లేదా ఈ రెండు భారీ చిత్రాల్లో భాగమయ్యేలా డబుల్ చాన్స్ దక్కించుకుంటారా? అనేది చూడాలి. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కాస్త ఆలస్యంగా ‘స్పిరిట్’?
‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టనున్నారట ప్రభాస్. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్΄ పాత్రలో నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారభించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందట. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలోని ‘రాజా సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్. త్వరలో హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూట్లో పాల్గొంటారు ప్రభాస్. అర్షద్ పిల్లలకు టాయ్స్ పంపుతా: నాగ్ అశ్విన్‘కల్కి 2898 ఏడీ’లోని ప్రభాస్ ΄పాత్రను తక్కువ చేస్తూ ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అర్షద్ కామెంట్స్‌పై ఇప్పటికే పలువురు తెలుగు హీరోలు, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ‘‘నార్త్ వర్సెస్ సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వంటి అంశాలకు తావు లేదు. అంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అర్షద్ సాబ్ మెరుగైన పదాలు వాడి ఉండాల్సింది... అయినా ఫర్వాలేదు. ఆయన పిల్లలకు బుజ్జి టాయ్స్ (‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కనిపిస్తాయి) పంపిస్తాను. నేను మరింత కష్టపడతాను. ‘కె 2’ (కల్కి 2898 ఏడీ సినిమా రెండో భాగాన్ని ఉద్దేశించి) సినిమా అన్ని థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో పూర్తి కాగానే ప్రభాస్ పాత్ర చాలా గొప్పగా ఉందంటూ ట్వీట్స్ వస్తాయి’’ అని ఓ నెటిజన్ పోస్ట్‌కు ‘ఎక్స్’ ద్వారా స్పందించారు నాగ్ అశ్విన్. అలాగే మరో నెటిజన్ పోస్ట్‌కు స్పందిస్తూ –‘‘ఆల్రెడీ ప్రపంచంలో ఎంతో నెగిటివిటీ ఉంది. మనం దాన్ని పెంచకూడదు. ప్రభాస్‌గారు అలానే అనుకుంటారని నేను అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న విడుదలైంది. ఈ సినిమాకి సీక్వెల్ రానుంది. -
మహేశ్ బాబుతో సినిమా తీసే సమయం లేదు: సందీప్‌రెడ్డి వంగా
రాజానగరం: ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌తో త్వరలోనే స్పిరిట్ సినిమా ప్రారంభమవుతుందని సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ చిత్రాలు తీసి హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్న ఆయన స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్వతంత్య్ర ఆసుపత్రి 38వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ముచ్చడించింది. ఆ వివరాలు ఇలా.. మీరు తీసే సినిమాల్లో వైద్యానికి సంబంధించి అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి. దానికి కారణాలేంటి?సందీప్‌రెడ్డి: ఫిజియోథెరపీ కోర్సు చేసిన నేను కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశాను. అందువల్ల ఆ ఛాయలు సినిమాల్లో కాస్త డీప్‌గా కనిపిస్తుంటాయి. వైద్య రంగంలో ఉన్న మీరు సినిమా రంగం వైపు ఎందుకు వెళ్లారు?సందీప్‌రెడ్డి: విద్యార్థి దశ నుంచి ఎందుకో సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. సినిమా తీసే విధానాన్ని నిశితంగా పరిశీలించే వాడిని. అందుకే ఫిజియోథెరపిస్టుగా ప్రాక్టీసు చేసే సమయంలోనే సినీ రంగం వైపు అడుగులు పడ్డాయి. తదుపరి సినిమాల గురించి చెబుతారా..!సందీప్‌రెడ్డి: ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. మహేష్‌బాబుతో సినిమా అన్నారు, ఎప్పుడు చేస్తారు?సందీప్‌రెడ్డి: ప్రస్తుతం అందుకు సమయం లేదు. స్పిరిట్ సినిమా తరువాత యానిమల్– 2కి వెళ్తాం. ఈ రెండింటికీ కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఆ తరువాతే ఏదైనా ఉంటుంది. వైద్య విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి?సందీప్‌రెడ్డి: సినిమాల ద్వారానే నా సందేశం ఏంటో చెబుతూనే ఉన్నాను. ఏదేమైనా చేసే పనిపై ఫోకస్ పెట్టాలి. అప్పుడే సరైన ఫలితాలను అందుకోగలుగుతాం. -
ఫ్యాన్స్ ఊగిపోయే అప్డేట్.. ఇంటర్నేషనల్ షేక్ పక్కా..
-
టాలీవుడ్ రేంజ్ పెంచుతున్న ప్రభాస్..
-
పాన్ ఇండియా ని షేక్ చేస్తున్న స్పిరిట్ రూమర్!
-
ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ విలన్... సెట్ అయితే మాత్రం!
ప్రభాస్ రేంజు రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. 'కల్కి'తో ఓవర్సీస్లోనూ దుమ్మలేపుతున్నాడు. మొన్నటివరకు ప్రభాస్‌కి తగ్గ సినిమాలు రావట్లేదని బాధపడినోళ్లు కాస్త.. ఇప్పుడు 'కల్కి'కి వస్తున్న వసూళ్లు చూసి కుళ్లుకుంటున్నారు. ఈ ఊపులోనే ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ స్టార్ నటుడు విలన్ అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కి ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చి పడింది. కాకపోతే దీని తర్వాత చేసిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. కానీ గతేడాది చివర్లో వచ్చిన 'సలార్', రీసెంట్ సెన్సేషన్ 'కల్కి'.. ప్రభాస్ అంటే ఏంటో నిరూపించాయి. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్ 2, కల్కి 2, హను రాఘవపూడితో మూవీ, స్పిరిట్ ఉన్నాయి.(ఇదీ చదవండి: OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్ హనీమూన్స్' ట్రైలర్)వీటిలో మిగతా వాటి సంగతి కాస్త పక్కనబెడితే 'స్పిరిట్'పై మాత్రం బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాబట్టి. 'యానిమల్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇతడు.. 'స్పిరిట్'లో ప్రభాస్‌ని పవర్ఫుల్ పోలీస్‌గా చూపించబోతున్నాడు. ఇందులోనే విలన్‌గా కొరియన్ నటుడు మా డాంగ్ సూక్ (డాన్ లీ)ని చేయబోతున్నాడని గాసిప్ బయటకొచ్చింది.మరి సోషల్ మీడియాలో అంటున్నట్లు ప్రభాస్‌ని ఢీకొట్టే విలన్‌గా కొరియన్ నటుడు డాన్ లీ కనిపిస్తే మాత్రం అంతర్జాతీయ స్థాయిలో మూవీకి గుర్తింపు వస్తుంది. ఒకవేళ సందీప్ ఇలాంటి ఆలోచన ఏమైనా చేస్తే గనక రచ్చ రచ్చే. ఇకపోతే డాన్ లీ.. ద గుడ్ ద బ్యాడ్ ద వీర్డ్, ద రౌండప్, ద ఔట్ లాస్ తదితర చిత్రాలతో నటుడిగా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు.(ఇదీ చదవండి: భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?) -
స్పిరిట్ మరో బాహుబలి కానుందా..
-
స్వాతంత్య్రం రాక ముందు...రజాకార్ నేపథ్యంలో ప్రభాస్ చిత్రం
ఇప్పటికే ‘సలార్ 2’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు అంగీకరించిన ప్రభాస్ తదుపరి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయనున్నారు. అరవై శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, డిసెంబరులో షూటింగ్ ఆరంభిస్తామని సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక తాజాగా ప్రభాస్ సైన్ చేసిన మరో సినిమా ప్రకటన వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ మూవీ అని మేకర్స్ పేర్కొన్నారు. కాగా స్వాతంత్య్రం రాక పూర్వం రజాకార్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. చిత్రసంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేశామని దర్శకుడు హను తెలిపారు. -
ప్రభాస్‌తో సినిమా.. తొలిరోజే రూ.150 కోట్లు వస్తాయ్!
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి' బిజీలో ఉన్నాడు. మే9న రిలీజ్ అనుకున్నారు గానీ వాయిదా పడొచ్చు. మరోవైపు ప్రభాస్ తర్వాత చేయబోయే మూవీస్ విషయంలో డైరెక్టర్స్ ఫుల్ స్పీడులో ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) 'సలార్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్'లో యాంగ్రీ పోలీస్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీ 'యానిమల్' కంటే తీయాల్సింది కానీ ఆలస్యమైందని డైరెక్టర్ సందీప్ చెప్పుకొచ్చాడు. తొలుత హాలీవుడ్ రీమేక్ ప్లాన్ ఒకటి తన దగ్గరకొచ్చిందని, కానీ 'స్పిరిట్' కథ ప్రభాస్ కి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ బయటపెట్టాడు. ప్రభాస్ 'స్పిరిట్' మూవీ షూటింగ్ ఈ ఏడాది డిసెంబరులో మొదలవుతుందని సందీప్ రెడ్డి వంగా చెప్పాడు. అలానే తనకు, ప్రభాస్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా.. అలానే టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేస్తే.. తొలిరోజే ఈ మూవీ సులభంగా రూ.150 కోట్ల మార్క్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అలానే స్టోరీ రైటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిందని చెప్పాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మాటలు విని తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) -
డిసెంబరులో ఆరంభం
ఈ ఏడాది డిసెంబరులో పోలీసాఫీసర్‌గా ప్రభాస్ చార్జ్ తీసుకోనున్నారని తెలిసింది. హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ‘స్పిరిట్’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబరులో ఆరంభించేలా ప్లాన్ రెడీ చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగా. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రష్మికా మందన్నా, కీర్తీ సురేష్, మృణాల్ ఠాకూర్ వంటివార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. భూషణ్ కుమార్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. -
స్పిరిట్ సీక్రెట్ చెప్పిన సందీప్..!
-
స్పిరిట్ కాదు మిర్చి 2..? స్పిరిట్ సీక్రెట్ చెప్పిన సందీప్
-
పోలీసుగా ప్రభాస్.. ‘స్పిరిట్’ స్టోరీ లైన్ చెప్పేసిన సందీప్ రెడ్డి
సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. సినిమాకి ‘స్పిరిట్’అనే టైటిల్ మాత్రం ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక రూమర్ మాత్రం వైరల్ అవుతోంది. స్పిరిట్ ఓ హారర్ మూవీ అని.. ఇందులో ప్రభాస్ మాంత్రికుడిగా కనిపించబోతున్నాడనే వార్తలు గత కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌పై తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి స్పందించాడు. ఓ బాలీవుడ్ సినిమా టీజర్ లాంచ్‌లో పాల్గొన్న సందీప్ స్పిరిట్ స్టోరీ లైన్ ఏంటో చెప్పేశాడు. ‘ప్రభాస్‌తో తెరకెక్కించబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ పనుల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి వెళ్లనుంది. అందరూ అనుకున్నట్లుగా ఇది హారర్ మూవీ కాదు. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ.తెరపై సరికొత్త ప్రభాస్‌ని చూస్తారు’అని చెప్పారు. తమ అభిమాన హీరో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారని తెలిసి ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘స్పిరిట్’లో నటిస్తారు. ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘కల్కీ 2898 ఏడీ’ మే 9న రిలీజ్ కాబోతుంది. -
సందీప్ వంగా క్రేజీ ప్రాజెక్ట్.. ప్రభాస్ సరసన యానిమల్ హీరోయిన్!
ఇటీవలే యానిమల్తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన కన్నడ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ సరసన నటించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ప్రస్తుత యానిమల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా టాప్‌లో దూసుకెళ్తోంది. అయితే యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్నారు. ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన రష్మికను ఎంపిక చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వార్త నిజం కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే రష్మిక, ప్రభాస్ ఇప్పటివరకు వెండితెరపై కనిపించలేదు. దీంతో ఈ జంటను స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2024లో ప్రారంభిస్తామని సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రభాస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ సమ్మర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత మారుతి డైరెక్షన్లో 'ది రాజా సాబ్' నటించనున్నారు. మరోవైపు రష్మిక మందన్నా పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. -
స్పిరిట్ తో సంచలనాలు సృష్టించేందుకు సిద్దమైన సందీప్ రెడ్డి వంగా..
-
2025 క్రిస్మస్ కు స్పిరిట్ రిలీజ్..
-
భయపెట్టే తంతిరం
భార్యాభర్తల మధ్యలో ఓ ఆత్మ ప్రవేశించడం వల్ల వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితమైంది? అనే కథాంశంతో రూపొందిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘తంతిరం’. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించారు. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వంలో శ్రీకాంత్ కంద్రగుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఆడియన్స్‌కు గుర్తుండిపోయే చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్ గుర్రం. ‘‘ఈ సినిమా చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అన్నారు మెహర్ దీపక్. ‘‘బడ్జెట్ ఎక్కువ అవుతున్నా రాజీ పడకుండా నిర్మించాం. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేయాలి’’ అన్నారు శ్రీకాంత్ కంద్రగుల. -
రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్‌పై అద్భుతమైన యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది. అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్‌గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్‌లో.. -
స్టార్ వార్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..!
బాక్సాఫీస్ వసూళ్ల కోసం గ్యాంగ్‌వార్‌కు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు స్టార్స్ వార్ డిక్లేర్ చేసి సెట్స్‌లో బిజీగా ఉన్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. ఈ బాక్సాఫీస్ గ్యాంగ్‌వార్ పై ఓ లుక్ వేద్దాం. పోలీసాఫీసర్‌గా ప్రభాస్ నటించనున్న సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘స్పిరిట్’ ముంబైలో జరిగే గ్యాంగ్‌వార్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హిందీ ‘యానిమల్’ కూడా ఇలాంటి తరహా చిత్రమే. రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న కంప్లీట్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. తండ్రి కోసం ఓ యువకుడు గ్యాంగ్‌వార్‌లో ఎలా చిక్కుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దర్శకుడు సుజిత్ తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైమ్‌లో ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే ట్యాగ్‌లైన్ తెరపైకి వచ్చింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని ప్రచారం జరిగింది. దీంతో పవన్–సుజిత్ కాంబినేషన్లోని మూవీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలైన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో కొన్ని గ్యాంగ్‌వార్ సీన్స్ చూశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప: ది రూల్’లోనూ కొన్ని గ్యాంగ్ వార్ సన్నివేశాలు ఉంటాయనుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా సీనియర్ యాక్టర్ రాజశేఖర్ సైతం ఈ వెండితెర గ్యాంగ్‌వార్‌లో భాగమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే యువ హీరో సందీప్ కిషన్ టైటిల్ రోల్లో, విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన ‘మైఖేల్’ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామానే. ఇంకోవైపు ‘మాస్టర్’ చిత్రం తర్వాత తమిళ ప్రముఖ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రూపొందనుంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌వార్‌గా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఆల్రెడీ కోలీవుడ్‌లో మొదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు లోకేష్ అండ్ కో. అదే విధంగా ఈ సినిమా తర్వాత కార్తీతో ‘ఖైదీ’కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తీయనున్నారు లోకేష్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘ఖైదీ 2’ గ్యాంగ్‌వార్ ఫిల్మ్ అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు కన్నడంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960–1984 బ్యాక్‌డ్రాప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కాగా, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ చేస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అభిషేక్ జోషి దర్శకుడు. దుల్కర్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. -
స్పిరిట్‌లో ఎవరు?
హీరో ప్రభాస్ సరసన నటించే చాన్స్ కొట్టేసేది ఎవరు? రష్మికా మందన్నానా? కియారా అద్వానీయా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌లో ఒకటి. ఈ చర్చ జరుగుతున్నది ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ‘స్పిరిట్’ చిత్రం గురించే. ఈ చిత్రం కోసం రష్మికా మందన్నా, కియారా అద్వానీలను సందీప్ సంప్రదించారట. వీరిద్దరిలో ఒకర్ని కథానాయికగా ఎంపిక చేయనున్నారని టాక్. ఆ ఒక్కరు ఎవరు? అనే చర్చ జరుగుతోంది. కాగా ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌గా సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’లో కియారా హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’లో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఇలా.. ఈ ఇద్దరి హీరోయిన్లూ సందీప్ దర్శకత్వంలో చాన్స్ దక్కించుకున్నారు. అయితే ఈ రెండూ హిందీ సినిమాలే. మరి.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్పిరిట్’లో ఈ ఇద్దరిలో ఒకరు కథానాయికగా కనిపిస్తారా లేక ఈ ఇద్దరూ కాకుండా వేరే తార తెరపైకి వస్తారా? అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. -
బంగారం లాంటి అవకాశం వదిలేశాడు..
క్రికెట్లో క్రీడాస్పూర్తి చాలా తక్కువగా కనిపిస్తుంది. తాము ఓడిపోతామని తెలిసి కూడా ప్రత్యర్థి జట్లకు మేలు చేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. మనది తప్పు అని తేలితే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయకుంటే దానిని క్రీడాస్పూర్తి అనొచ్చు. తాజాగా నేపాల్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ నేపాల్ బౌలర్ కమల్ సింగ్ వేశాడు. ఓవర్ రెండో బంతిని మార్క్ అడైర్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. చదవండి: తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి బంతి ఎక్కువ దూరం పోనప్పటికి సింగిల్ పూర్తి చేయొచ్చనే ఉద్దేశంతో మార్క్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌కు కాల్ ఇచ్చాడు. అయితే బంతి కోసం పరిగెడుతూ ఆండీ మెక్‌బ్రైన్‌ను కింద పడేసుకుంటూ వెళ్లాడు. బంతిని అందుకున్న కమల్.. కీపర్ ఆసిఫ్ షేక్‌కు త్రో విసిరాడు. ఔట్ చేసే అవకాశం వచ్చినప్పటికి ఆసిఫ్ బెయిల్స్‌ను పడగొట్టకుండా క్రీడాస్పూర్తి ప్రదర్శించాడు. ఈలోగా ఆండీ మెక్‌బ్రైన్ సురక్షితంగా క్రీజులోకి చేరాడు. దీంతో ఆసిఫ్ క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ ఇరుజట్ల ఆటగాళ్లు అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు నేపాల్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: ‘మేం దూరదృష్టితో ఆలోచిస్తాం’ 🏏 Spirit of cricket 🤝 Drop a ‘♥️’ below to show your appreciation for this golden gesture! 📺 Tune in to #FanCode and never miss moments like this again 👉 https://t.co/ccITeVbFiv@cricketireland @CricketNep pic.twitter.com/b4vzDyyyNU — FanCode (@FanCode) February 14, 2022 -
రెమ్యునరేషన్లో ప్రభాస్ రికార్డ్, ఇండియాలోనే నెం.1 హీరో!
Pan India Star Prabhas Remuneration: బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. నానాటికీ పెరిగిపోతున్న ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు ప్రభాస్‌తో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు చేస్తున్నారు. అలా ప్రభాస్ చేతిలో ఇప్పుడు రాధేశ్యామ్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, సలార్, స్పిరిట్ చిత్రాలున్నాయి. అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం డార్లింగ్ 'స్పిరిట్' సినిమాకు అక్షరాలా రూ.150 కోట్లు తీసుకుంటున్నాడట! స్పిరిట్ బడ్జెట్ రూ.300 కోట్లు అయితే అందులో సగం మన రెబల్ స్టార్కే ఇస్తున్నారన్నమాట! 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను ఎనిమిది భాషల్లో రూపొందిస్తుండగా బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. మొత్తానికి మన తెలుగు హీరో తొలిసారి ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌లో ఇంత భారీ మొత్తం పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డులకెక్కాడు. -
కొరియన్ భామతో ప్రభాస్ రొమాన్స్!
Korean Actress In Prabhas Movie: ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ఆనంతరం అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు సంతకం చేసి ఒక్కొక్కొ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ తన 25వ చిత్రం సందీప్ వంగ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. చదవండి: ‘నాటు.. నాటు’ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చెర్రి, తారక్ ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడి కట్టబోయే హీరోయిన్ ఎవరా? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్గా సౌత్ కొరియన్ బ్యూటీ నటించనుందని టాక్ వినిపిస్తోంది. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో(Song Hye-Kyo)ను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఇందులో లేడీ విలన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూన్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫాంహౌజ్ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్ ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్ -
'స్పిరిట్'కు ప్రభాస్ రికార్డు స్థాయి పారితోషికం!
అర్జున్‌రెడ్డి సినిమాతో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా మారారు సందీప్ రెడ్డి వంగా. ఆ చిత్రాన్ని బాలివుడ్లో షాహిద్ కపూర్‌తో రిమేక్ చేసి అక్కడ కూడా పెద్ద హిట్ కొట్టాడు. అయితే ఇపుడు సందీప్ రెడ్డి డైరెక్షన్లోనే ప్రభాస్ నటించనున్నారు.ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. టీ సిరీస్, సందీప్ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్ధ కూడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. అయితే ఈ భారీ చిత్రానికి ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్ పొందుతున్నాడని బీ టౌన్ టాక్. ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకోనున్నాడని బాలివుడ్ ట్రేడ్ టాక్. ఇప్పటికే బాలివుడ్లో వంద కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యూనిరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోలు పలువురున్న విషయం తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఈ ‘స్పిరిట్’ సినిమాతో అత్యంత భారీ స్థాయి పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోగా నిలుస్తున్నాడని సమాచారం. -
ప్రభాస్ 25వ చిత్రం: అఫీషియల్ అనౌన్స్మెంట్..టైటిల్ ఇదే..
Prabhas Announces 25th Film 'Spirit': ప్రభాస్ 25వ చిత్రం పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోనే ప్రభాస్ నటించనున్నారు.ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరు ఖరారు చేశారు. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్, జపాన్ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.ఇప్పటికే బాహుబలి చిత్రంలో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఈసారి పాన్ వరల్డ్ స్టార్‌గా మారనున్నారు. ఇలాంటి అరుదైన రికార్డ్‌ను సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ నిలవనున్నారు. The Mighty man marching On.....🙂#Prabhas25SandeepReddyVanga#BhushanKumar#Prabhas @VangaPranay #KrishanKumar @TSeries @VangaPictures pic.twitter.com/gbkfh6suLn — Sandeep Reddy Vanga (@imvangasandeep) October 7, 2021 -
విషాదం : మత్తు కోసం స్పిరిట్ తాగి ..
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని కశింకోట గోవిందరావు కాలనీలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాలు.. గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనంద్ రావ్ స్నేహితులతో పార్టీ చేసుకుందామని భావించారు. కిక్ కోసం మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్‌ను తీసుకొని వచ్చాడు. కాగా పార్టీలో ఆరుగురు పాల్గొనగా.. నలుగురు స్పిరిట్ తాగారు. కాగా తాగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిలోముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా మృతి చెందిన వారిలో వడిసెల నూకరాజు, కూనిశెట్టి ఆనంద్, పెతకం శెట్టి అప్పారావులుగా గుర్తించారు. చంద్రబాబుపై కేసు నమోదు -
తల్లి హక్కు
ఆ తల్లి ‘క్షమించాను’ అన్న మరుక్షణమే ఆ వ్యక్తి ఆత్మ అతని నుండి వేరైపోయింది ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) వద్దకు ఒక సహచరుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘అయ్యా! ఫలానా వ్యక్తి ఉదయం నుండి సక్రాత్ స్థితిలో.. అంటే చివరి ఘడియల్లో.. నరకయాతన అనుభవిస్తున్నాడు’’ అని తెలిపాడు.ప్రవక్త (స) ఆ వ్యక్తి వద్దకు వచ్చి, ‘‘ఇతను ఎవరికైనా ఋణ పడి ఉన్నాడా?’’ అని వాకబు చేసారు. అలాంటిదేమీ లేదు అని తెలిసింది. ‘‘మరి ఎవరైనా ఆయనంటే అయిష్టంగా ఉన్నారా?’’ అని అడిగారు. అక్కడ ఉన్న వారు ‘‘ఇతని తల్లి ఇతనంటే కాస్త అయిష్టతగా ఉంది’’ అని తెలిపారు.ప్రవక్త (స) తల్లిని పిలిచి ఆమె కుమారుడ్ని క్షమించవలసిందిగా కోరారు. కాని ఆమె ఎంతకూ వినకపోవడంతో, సహచరులను కట్టెలు పోగేసి మంట రాజేసి అతనిని అందులో వెయ్యమని ఆజ్ఞాపించారు.అప్పుడు ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ తన కొడుకును అగ్నిలో వెయ్యొద్దని ప్రాధేయపడింది. ‘‘చూడు తల్లీ, ఇక్కడ నీ కుమారుడిని మంటల్లో వేయడాన్ని భరించలేక పోతున్నావే, రేపు పరలోకం శాశ్వతంగా నరకాగ్నిలో కాల్చబడటం నీకు ఇష్టమేనా’’ అని అడిగారు ప్రవక్త (స).‘‘లేదు ప్రవక్త (స), లేదు. నేనే కాదు ఏ తల్లి కూడా భరించలేదు. అల్లాహ్ కరుణ కోసం నేను నా కుమారుడ్ని క్షమిస్తున్నాను’’ అని అంది. ఆ తల్లి ‘క్షమించాను’ అన్న మరుక్షణమే ఆ వ్యక్తి ఆత్మ అతని నుండి వేరైపోయింది.‘‘ఈ జీవితం శాశ్వతమైన మరణానంతర పరలోక జీవితానికి ఒక పరీక్ష. ఇక్కడ దైవం హక్కులలో లోటు జరిగినా దైవం క్షమిస్తాడు కానీ సాటి మనుషుల హక్కులలో చిన్న లోపం జరిగినా వారు క్షమించనంత వరకు అల్లాహ్ కూడా క్షమించడు’’ అని ప్రవక్త (స) తెలిపారు.ముఖ్యంగా తల్లితండ్రుల హక్కులు. అందునా తల్లి హక్కు. అందుకే ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. ‘తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది’ అని. కన్నవారి కంట కన్నీరు మన సకల అనర్ధాలకు మూలం అని గ్రహించి వారి సేవలో తరిద్దాం. ఇహ పరాల్లో సాఫల్యం పొందుదాం. – షేక్ అబ్దుల్ బాసిత్ -
అంతటా వ్యాపించి ఉన్నదే ఆత్మ!
ఆత్మ జన్మించడం లేదు, మరణించడం లేదు. అది సనాతనమైనదైనా నిత్యమైనది. శరీరం నశించినా, నశించనిదని కఠోపనిషత్తు కొన్ని వేలసంవత్సరాల కిందటే ఘోషించింది. ఇదే విషయాన్ని ‘శక్తి నిత్యత్వ నియమం’ ద్వారా ఆధునిక భౌతిక శాస్త్రమూ చెప్తోంది. మన ఋషులు విశేషమైన చింతన చేసి భగవంతుడు, దేవుడు, పరంధాముడు అంటూ వివిధ నామాలు సూచించకుండా సర్వాంతర్యామికి చక్కని అర్థాన్నిచ్చే ‘ఆత్మ’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ‘ఐతరేయోపనిషత్తు’ నొక్కి వక్కాణిస్తుంది. ఆత్మకు పదార్థ లక్షణాలైన ఆకారం, రంగు, రుచి, వాసనలు ఏమీ లేకపోయినా అది పదార్థంగా రూపొంది అన్ని లక్షణాలను ప్రదర్శిస్తూ, తిరిగి తనలోనే లయం చేసుకుని శక్తిగా మార్చుకుంటూ నిత్యనూతనంగా ఉంటూవస్తోంది. ‘ఈశావాస్యోపనిషత్తు’ ఆత్మనుండి అదే ఆత్మను తీసివేసినా, అంతే ఆత్మ మిగులుతుందని చెబుతూ పూర్ణమైన ఆత్మ నుండే ఆత్మ ఉద్భవించిందని అనటం గమ్మత్తుగా అనిపిస్తుంది. అంటే ఆత్మ అన్నింటికన్నా ముందే ఉన్నట్టుగా అర్థమవుతుంది. మరి ఆత్మను చూడడం సాధ్యమౌతుందా? అంటే ఆత్మను అర్థం చేసుకున్న వారికి సాధ్యమే అనిచెప్పవచ్చు. అర్థం చేసుకున్న వారు ఆచరిస్తే ఆ ఆత్మను, దాని నుండి ఉద్భవించే అనిర్వచనీయమైన అలౌకిక ఆనందాన్ని అనుభవించవచ్చు. చరాచరప్రపంచమంతా తానే అయిన ఆత్మే పదార్థమూ, ఆ పదార్థాన్ని ఆవరించిఉన్న శక్తినీ చూసే ప్రతి వస్తువు, కాంతి, ఉష్ణం, శబ్దం మొదలైనవన్నీ ఆత్మే. అంతేకాక మన మనోవాక్కాయ కర్మలు అన్నీ ఆత్మలో భాగమే. ఆత్మ నుండి పరిణామం చెంది పదార్థంగా రూపొందినవి కాబట్టి, పదార్థాలకు స్వాభావికంగా భౌతిక లక్షణాలు ఉండటం సహజం. ఈ సహజ భౌతిక లక్షణాలే ఆత్మను అర్థం చేసుకోకుండా అడ్డుపడేవి. దీనినే మాయ అన్నారు. ఈ మాయకు అతీతంగా ఆలోచిస్తేనే ఆత్మను అర్థం చేసుకోగలము. అర్థం చేసుకున్నా అది అనంతమైంది కాబట్టి, కన్నులతో సంపూర్ణంగా చూడలేము. అందుకు విశేషమైన సాధన చేయాలి. ఆ సాధనకు మనసు లోలోతుల నుండి తృష్ణ ఉద్భవించాలి. అప్పుడే ఏకాగ్రత సాధ్యమై, సాధకుడు సమాధి స్థితిని చేరుకుని తద్వారా లయ స్థితిని పొందుతాడు. అప్పుడే ఆత్మానుభవం సాకారమౌతుంది. అప్పుడు సాధకుని అరిషడ్వర్గాలు నశించి అమేయుడౌతాడు. అతని మనోవాక్కాయకర్మలన్నీ ఆనందాన్నీ, మంగళాన్నీ వెదజల్లుతాయి. అప్పుడు అతడే శివుడౌతాడు. ప్రతి ఒక్కరూ శివత్వాన్ని పొందితే ప్రకృతే పులకరించిపోతుంది. ప్రశ్నోపనిషత్తులో పిప్పలాదమహర్షి ఆత్మ గురించి ఇక ఇంతకన్నా చెప్పలేం అన్నట్టుగా, ఆ సర్వోత్కష్టమైన ఆత్మ గురించి నాకు తెలిసినంతగా, సాధ్యమైనంతగా మీ అందరితో పంచుకోవడం ఎంతో ఆనందకరం. ఈ ఆత్మానుభూతికి అవకాశం ఇచ్చిన ఆత్మస్వరూపులకు శిరసానమామి. – గిరిధర్ రావుల -
తిరుమల చరిత్రపై గొప్ప పరిశోధన
ఇంతవరకు తిరుమల చరిత్రపై వివిధ భాషల్లో వెలువడ్డ పుస్తకాలకు భిన్నంగా పరిపూర్ణంగా చరిత్రను పునాదిగా చేసుకుని రాసిన విశిష్ట గ్రంథమిది. చెట్లనీడలో, చెదల పుట్టల నడుమ కప్పబడి ఉన్న వెంకటేశుని ప్రతిమను తొండమాన్ చక్రవర్తి వెలికి తీయించి పునఃప్రతిష్ట గావించి శిలాస్తంభాలతో మండపరీతి ఆలయాన్ని నిర్మించింది మొదలుకుని ఆళ్వారులు ఎంతో కష్టంతో కొండల నడుమన ఉన్న వేంకటేశుని దర్శించి తాము సేకరించిన వివరాలను పాటగట్టి ఆ భక్తితత్వాన్ని ప్రచారం చేసిన చరిత్రను ఆచార్య దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి ఈ పుస్తకంలో వివరించారు. 2 వేల సంవత్సరాల చరిత్ర క్రమంలో తిరుమల చరిత్రను ఆధార సహితంగా వెలికి తీసి మనముందు ఉంచిన పరిశోధక స్థాయి కలిగిన గ్రంథమిది. ఈ పుస్తకంలో మహిమలు, భక్తి ప్రచారాలు. వేంకటేశ్వరుడి లీలలు కానరావు. అయితేనేం, మనిషి తమకు మంచి చేసినవారిని దేవుళ్లగా, చెడు చేసిన వారిని రాక్షసులుగా భావించి కొందరికి దైవత్వం, కొందరికి దానవత్వం ఎందుకు ఆపాదిస్తూ వచ్చాడో పరిణామ క్రమంలో వివరిస్తూ వచ్చిన ఈ గ్రంథం అందరూ తప్పక పఠించి తీరాల్సినది. గాడ్స్ ఆన్ అర్త్; తిరుమల చరిత్ర పుటలు: 310; వెల రూ. 300; ప్రతులకు: ప్రొ. దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి 303, బి1 బ్లాక్, వరరూప హోమ్స్, శ్రీ సాయి అపార్ట్మెంట్స్, తుమ్మలగుంట, తిరుపతి–517502. ఫోన్: 9849584324 ఈమెయిల్:dsreddy.svu@gmail.com – రాజశేఖర రాజు మానవుడు నిరంతర జిజ్ఞాశువు. అన్నింటినీ తెలుసుకోవాలనుకునే మానవుని తృష్ణకు సంపూర్ణంగా లొంగనిదా ఆత్మ. కారణం, అది అటు విశుద్ధశక్తి రూపంలోనూ, ఇటు దృశ్యమాన ప్రపంచరూపంలోనూ కలగలిసి ఉండటమే. అంతేగాక, విరుద్ధ లక్షణాలు ఆ ఆత్మ సొంతం. ఆత్మ ఎంత సూక్ష్మమో, అంత విస్తృతం. ఎంత తేలికో, అంత భారయుతం. ఎంతటి సరళమో, అంతటి సంక్లిష్టతమం. ఎంతటి నిర్లిప్తమైనదో, అంతటి చైతన్యమైనది. ఎంతటి స్థిరమైనదో, అంతటి పరిణామశీలి. అందుకే, ఉపనిషత్తులు ఆత్మను ‘సవితా’ అని పేర్కొన్నాయి. ఆత్మ సాంద్రత అనంతమవడం వల్ల ఆ ఆత్మలో ఎక్కడైనా భారీ లేక అతి భారీ నక్షత్రాలు, నక్షత్ర సముదాయాలు రూపొందుతున్నాయి. అలాగే, అంతే ప్రాంతంలో సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థాలు కూడా. ఆత్మ పరిణామతత్వం వల్లనే నిర్జీవులకు విఘటనం, జీవులకు మరణం తప్పదు. విఘటనం చెందిన నిర్జీవి ఏ రకంగా నైతే తిరిగి తన రూపాన్ని పొందదో, అలాగే జీవి మరణాంతరం తన రూపాన్ని తిరిగి పొందదు. ఎందుకంటే ఈ ఆత్మకు తిరిగి చూసుకునే అవసరమూ లేదు, అవకాశమూ లేదు. ఆత్మసాంద్రత అనిర్వచనీయమైనందువల్ల, అదే తిరిగి తిరిగి అన్ని రూపాల్లో పుడుతుందని, ఆ ఆత్మే తానని ఆత్మ జ్ఞానం పొందినవాడు గుర్తెరిగి, గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో ఉద్భవించేది తానేనని నిర్ధారించుకుంటాడు. తద్వారా మరణభీతిని జయిస్తాడు. అతన్ని మాత్రమే అరిషడ్వర్గాలు చేరలేవు. ఆత్మజ్ఞాని ఓ విశ్వమానవుడు ఆత్మజ్ఞాని ఓ విశ్వమానవుడు. అతనికి కులం లేదు, మతం లేదు, అసలు భేదమే లేదు. జీవుల్లోనే కాదు, నిర్జీవుల్లో కూడా భేదాన్ని గుర్తించలేడు. అభేదమే మనసుగా మారిపోగా, అదే ఆనందానికి మాతృకగా పరిణమిస్తుంది. మానవ సమాజం కూడా ఈ విషయాన్ని గుర్తిస్తే సమాజంలో భేదాభిప్రాయాలకు తావు ఉండదు. మతవాదం, కుల వాదం, జాతివాదం మొదలైనవే కాకుండా మానవుడే ఒక ఉన్నతజీవి అనే దురభిమానం కూడా పోతుంది. ఈ ప్రకృతిలో తనదొక విశిష్టమైన బాధ్యతాయుత జన్మ అని గుర్తిస్తుంది. ప్రకృతిలో ఇతర జీవాలను తోబుట్టువులుగా చూడడం జరుగుతుంది. ఆధిపత్య ధోరణి పోయి బాధ్యతాయుత జీవన విధానం ప్రారంభమవుతుంది. మానసిక శుభ్రతయే కాక, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మొదలైన ప్రాకృతిక కార్యకలాపాలు మొదలై ఓ చక్కటి సమాజం సాకారమౌతుంది. ప్రతీ గ్రామం ఓ మున్యాశ్రమంగా రూపుదిద్దుకుంటుంది. అయం నిజః పరోవేతి గణనా లఘు చేతసామ్ ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకామ్ అన్నట్టుగా వసుధ అంతా ఒకే కుటుంబమై విరాజిల్లుతుంది. – గిరిధర్ రావుల -
సూర్యుడే జీవుడు... జీవుడే ఆత్మ!
ఆత్మ సర్వాంతర్యామి అనే అద్వైత సూత్రాన్ని శక్తి నిత్యత్వ నియమం నిరూపిస్తోంది. సైన్స్ ఆత్మను అనంతశక్తిగా, విశ్వశక్తిగా పేర్కొంటుంది. ఈ ఆత్మ ఒక అద్భుత పరిణామశీలి. పుట్టేది గిట్టేది కాదు కాబట్టి, నిత్యయవ్వనంతో ఆత్మ కళకళలాడుతూ ఉంటుంది. తన నిత్యత్వాన్ని నిలుపుకోవడం కోసం పరిణామమనే ప్రక్రియను సాధనంగా చేసుకుని, తనకు తానుగా పదార్థంగా పరిణామం చెందుతూ వస్తోంది. మళ్ళీ ఆ పదార్థాలు విఘటనం చెందుతూ, నీటి ఆవిరి గాలిలో లయమైపోయినట్టుగా ఆత్మలో లయమైపోతున్నాయి.ఆత్మలాగే, పదార్థమూ అనాదిగా వస్తున్నదే. అయితే, ఆత్మ స్వీయ స్పందనల నుండి ఈ పదార్థం పుడుతూ, విచ్ఛిన్నమవుతూ వస్తోంది. ఈ ఖగోళ పదార్థాల సంఖ్య నిశ్చల, నిరంతర క్రియ కాదు. ఈ ఖగోళ పదార్థాల ప్రవర్తనకు సౌరకుటుంబమే నిదర్శనం. ఆత్మకు, జీవనిర్జీవ ప్రపంచానికి అనుసంధానకర్త అయిన సూర్యుని ద్వారానే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చని ‘ఈశావాస్యోపనిషత్తు’ ఉద్ఘాటిస్తోంది.తరచి చూస్తే సూర్యుడు కూడా జనన, బాల్య, కౌమార, ప్రౌఢ, వార్ధక్య దశలను దాటి నశించేవాడే. సూర్యుని నుండే గ్రహాలు ఉద్భవించాయని ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు, నవీన ఖగోళ శాస్త్రవేత్తలూ నిర్ధారించారు. గ్రహాలలో భూమి ఒక్కటే జీవావరణ అనుకూలం. అందునా మానవుడు మేథోపరుడు. ఆలోచిస్తే సౌరశక్తే జీవాలుగా మారినట్లు తెలుస్తుంది. సూర్యుని నుంచి విడిపడి ఏర్పడ్డ భూమిపై సూర్యరశ్మి పడడం, అందులోని శక్తిని తీసుకుని జీవరాశి తయారవడం కనిపిస్తుంది. అంటే ఆ సూర్యుడే అటు గ్రహాల రూపంలో, ఇటు జీవాల రూపంలో భాసిల్లుతున్నాడు. ఇదే విషయాన్ని ‘ఈశావాస్యోపనిషత్తు’ ‘సత్యధర్ము’డైన సాధకుడే సూర్యునిలో నెలకొన్నాడని తీర్మానిస్తోంది. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ఆత్మరూపుడు సూర్యుని ద్వారా ప్రయత్నించడం ఆ ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఇదే కోవలో మరింత లోతుగా ఆలోచిస్తే ఈ గ్యాలక్సీలలో ఉన్న కోటానుకోట్ల సూర్యులలో భాసిల్లేది ఆ ఆత్మనే. అంటే, అనంతమైన ఆత్మే నక్షత్రాలుగాను, గ్రహాలుగాను, పంచభూతాలుగాను, ప్రాణులుగానూ మారి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని గణిత సూత్రంలో పోలిస్తే ఒక విలువ రెండో విలువకు, రెండో విలువ మూడో విలువకు సమానమైనపుడు ఒకటో విలువ మూడో విలువకు సమానమౌతుంది. ఇదీ అంతే. ఆత్మే సూర్యుడు, సూర్యుడే జీవుడు, జీవుడే ఆత్మ. దీన్ని అర్థం చేసుకోవడమే ఆత్మసందర్శన. అదే భగవద్దర్శనం. ఆ సాధనే సత్యస్వరూపం –గిరిధర్ రావుల -
అవగాహన కలిగితే... అంతా దైవత్వమే
ఆత్మగా చెప్పబడే అనంతశక్తి పదార్థంగా, తిరిగి ఆత్మగా పరిణమిస్తూ ఉండడం నిరంతర ప్రక్రియ. ఈ అద్వైత సిద్ధాంతమే కనిపించేవన్నీ ఆత్మ స్వరూపాలేనని నిర్ధారిస్తోంది. అంతేకాక, అత్యంత సాంద్రతమ ఆత్మలో పదార్థము, పదార్థ అంతరాలలో ఆత్మ సమ్మిళితమై విరాజిల్లడమే గమ్మత్తు అంటోంది. ఈ పదార్థాలన్నింటినీ తనలో చరించే అవకాశం ఇచ్చే ఆకాశం కూడా ఆత్మలో ఒకానొక చిన్న భాగమేనంటే ఆ ఆత్మ పరిధి, సాంద్రతలు ఊహకందనివి. ఈ ఆత్మజనిత పదార్థాలు అంతర్గత చర్యలను జరుపుతూ తమ రూపాలను సూక్ష్మస్థాయి నుండి ప్రౌఢస్థాయి వరకు, ప్రౌఢస్థాయి నుండి వార్థక్యంలోకి తీసుకువెళ్లి, ఆ చర్యలు ఆగిపోగానే నశించిపోతాయి. దీనికి చక్కని ఉదాహరణ మన ఆదిత్యుడే. ఖగోళపరంగా చూస్తే ఆయనకూ పరిమిత జీవితమే ఉంది. సూర్యుని ఆవిర్భావానికి కారణమైన కేంద్రక సంలీనం అనే ప్రక్రియ నిత్యం కొనసాగుతూ, కాంతి, శబ్దం, ఉష్ణం లాంటి శక్తి రూపాలను వెలువరుస్తూ, సూర్యుని లోపలి హైడ్రోజన్‌ను పూర్తిగా వినియోగించి చివరకు సూర్యుని అంతానికి హేతువు అతుంది. ఈ ప్రక్రియ అనేది సూర్యునికి జీవం లాంటిది. ఈ ప్రక్రియను మనలో జరిగే జీర్ణశక్తితో, తద్వారా ఉద్భవించే ప్రాణంతో పోల్చుకోవచ్చు.సూర్యునితో సహా విశ్వంలో ఉన్న నక్షత్రాలు మొదలుకొని జీవుల వరకు ‘బ్రహ్మసూత్రాల’లో చెప్పిన ‘జన్మాద్యస్య యతః‘ అన్నట్టుగా పుట్టుట, పెరుగుట, నశించుట ఎవనియందు జరుగుతున్నదో అదే బ్రహ్మము అనే సూత్ర పరిధిలోకే వస్తారు. అదే విధంగా భూమి కూడా అనుకూల పరిస్థితుల వలన జలావరణాన్ని పొంది, తద్వారా ఈ ప్రకృతిని తయారు చేసుకుంది. ఎప్పుడైతే ఈ జలావరణం నశిస్తుందో, అప్పుడు భూమిపై ప్రాణం నశించి, సర్వాంతర్యామిలో లయమైపోతుంది. ఆదిశంకరుల ‘ఆత్మబోధ’ లో ఎలాగైతే చిల్లగింజల గంధం మురికి నీటిలో వేస్తే మురికిని తొలగిస్తూ, నీటిలో కలిసిపోతుందో, అలాగే జ్ఞానం, అజ్ఞానిలో ప్రవేశించగానే అజ్ఞానం తొలగి పోవడమే కాక, అజ్ఞాని జ్ఞానియై ఆత్మగా శోభిల్లుతాడని చెప్పబడింది. ఇదే విషయాన్ని ఐన్ స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం లో’ బలీయమైన నమ్మకం ఆవరించిన విస్తృత మేథస్సుతో ఆలోచిస్తే, ఈ అనుభవాత్మక ప్రపంచమంతా దేవుడనే అవగాహన కలుగుతోంది. సాధారణ మాటల్లో చెప్పాలంటే అదే విశ్వదైవత్వం ఇది అవగాహనలోకి వస్తే జీవి మనుగడంతా దైవత్వమే! -
‘సయీద్ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’
ఘూల్... అంటే అరబిక్‌లో ఆత్మ అని అర్థం!అబు ఘ్రైబ్.. అంటే కోవర్ట్ డిటెన్షన్ సెంటర్. బ్రిటిషర్స్ కాలంలోని కాలాపాని లాంటిది.. నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ లాంటిది. అండర్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉంటారు ఆర్మీ అధికారులు. ఈ రెండిటి కథే.. ఘూల్. నెట్‌ఫ్లిక్స్ సెకండ్ ఒరిజినల్. మూడు ఎపిసోడ్ల మినీ సిరీస్. నిదా రహీమ్ (రాధికా ఆప్టే).. నేషనల్ ప్రొటెక్షన్ స్క్వాడ్ ట్రైనీ. ఆమె తండ్రి ప్రొఫెసర్. యాక్టివిస్ట్ కూడా. ప్రభుత్వం నిషేధించిన సిలబస్‌ను పిల్లలకు బోధిస్తున్నాడని తండ్రి గురించి పోలీసులకు ఉప్పందించి అతనిని అరెస్ట్ చేయిస్తుంది. ప్రొఫెసర్‌ను కోవర్ట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలిస్తారు. ఇంటరాగేషన్ ద్వారా తండ్రి తన తప్పు తెలుసుకొని పరివర్తన చెందిన వ్యక్తిగా బయటకు వస్తాడని నిదా నమ్మకం. ఆమె ఇంటరాగేషన్ స్కిల్స్ పట్ల ఆర్మీలో మంచి పేరుంటుంది. సొంత తండ్రినే పట్టించిందన్న కీర్తీ కూడి డిటెన్షన్ సెంటర్లో ఇంటరాగేషన్ ఆఫీసర్‌గా అవకాశం వస్తుంది నిదాకు. దానికి హెడ్ డకున్హా (మానవ్ కౌల్) అనే మిలటరీ ఆఫీసర్. అనుమానం.. అసహనం ఆ సెంటర్ ఒక చీకటి గుహ. అందులో పనిచేసే వాళ్లకు కనీసం పగలు, రాత్రి తేడా తెలిసేలా ఉండాలని డిమ్ లైట్లు పెడ్తారు. ఆ వాతావరణానికి త్వరగా అలవాటు పడమని నిదాకు హుకుం జారీ చేస్తాడు ఆఫీసర్ డకున్హా. అక్కడే ఉన్న మరో లేడీ ఆఫీసర్ మేజర్ దాస్ (రత్నాబాలి భట్టఛార్జి). దేశభక్తిని నరనరాన నింపుకున్న ఆమెకు నిదా నచ్చదు. ముస్లిం అని, ఆమెను నమ్మడానికి వీల్లేదని డకున్హాకు చెప్తుంది. నిత్యం నిదాను అనుమానిస్తూ, మాటలతో వేధిస్తూంటుంది. అప్పుడే అక్కడికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అలి సయీద్‌ను తీసుకొస్తారు. ‘‘అలి సయీద్ నోట నిజాలు కక్కించి నీ ఇంటరాగేషన్ స్కిల్స్ నిరూపించుకో’’ అని సవాలు విసురుతాడు డకున్హా. ఆ ప్రయత్నంలోనే అలి సయీద్ నిదాను ‘‘నిదూ’’ అని పిలుస్తాడు. షాక్ అవుతుంది ఆమె. ‘‘నువ్వెవరు?’’అని రెట్టిస్తుంది సయీద్‌ని. మొహం, నోటి నుంచి రక్తమోడుతున్న అతడు వికృతంగా నవ్వుతాడు. భీతిల్లి వెనక్కి తగ్గుతుంది నిదా. ‘‘భయపడొద్దు.. బయట ఇంటరాగేషన్‌కు, ఇక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. నేర్చుకోవాలి’’ అని చెప్పి వెళ్లిపోతాడు డకున్హా. అసహనంగా నసుగుతూ నిదాను క్యాంటీన్‌కి తీసుకెళ్తుంది మేజర్ దాస్. ‘‘ఏమైందీ భయపడ్డావా?’’ అంటూ అనునయం నటిస్తుంది ‘‘నన్ను నిదూ అని మా నాన్న మాత్రమే పిలుస్తారు. ఆ పేరు సయీద్కెలా తెలిసింది?’’ అదే షాక్‌లో అడుగుతుంది నిదా. ‘‘వేషాలు వేయకు. నీకన్నీ తెలుసు. మీరంతా ఒకటే’’ స్థిరమైన గొంతుతో బెదిరిస్తుంది మేజర్ దాస్. అవాక్కవుతుంది నిదా. తండ్రి గుర్తొస్తాడు. ‘‘నాన్న ఏమైనట్టు?’’ ఆలోచన మొదలవుతుంది. ఆ రాత్రి ఆమెకు పీడకలొకటి వస్తుంది. తండ్రి పిశాచమై తనను పీక్కు తింటున్నట్టు. దిగ్గున లేచి కూర్చుంటుంది. ఆ రాత్రంతా నిద్రపోదు. ఏదో తెలియని గిల్ట్ వెంటాడుతుంటుంది. తెల్లవారి.. తన తండ్రి గురించి డకున్హాను అడుగుతుంది నిదా. అక్కడి నుంచి పంపేశామని చెప్పి.. అలి సయీద్ ఇంటరాగేషన్ కంటిన్యూ చేయమంటాడు. ఆరోజు.. నిదాతో పాటు చౌదరి, గుప్తా ఇద్దరూ ఇంటరాగేషన్ సెల్‌లోకి వెళ్తారు. సయీద్‌ను ఇంటరాగేట్ చేయడానికి సన్నద్ధమవుతుంటే.. ఆ సెంటర్లో జరిగిన కొన్ని నేరాల గురించి మాట్లాడ్తాడు సయీద్. విస్మయానికి లోనవుతారు చౌదరి, గుప్త. నిదాకు అంతా అయోమయంగా ఉంటుంది. చౌదరీకి తెలియకుండా, గుప్తా, గుప్తాకు తెలియకుండా చౌదరి చేసినవీ చెప్పి వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెడ్తాడు. సయీద్ ఇంటరాగేషన్‌ను మరిచిపోయి ఆ ఇద్దరూ గొడవపడ్తుంటారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి విఫలమవుతుంది నిదా. గుప్తాను కత్తితో పొడిచేస్తాడు చౌదరి. ఈ గొడవకు పరిగెత్తుకొచ్చిన డకున్హా, నిదా అంతా హతాశులవుతారు. అప్పుడూ నింద నిదా మీద తోసెయ్యడానికే చూస్తుంది మేజర్ దాస్. వాళ్లందరినీ బయటకు పంపేసి సయీద్‌కు కరెంట్ షాక్ ఇస్తాడు డకున్హా. ‘‘ఘూల్ ఘూల్’’ అని సణుగుతూ నోట్లోంచి నురగలు కక్కి తలవాల్చేస్తాడు సయీద్. అతను చనిపోయాడనుకుంటాడు డకున్హా. ఇదంతా రికార్డ్ రూమ్‌లోంచి గమనిస్తున్న నిదా.. సయీద్ సణిగిన మాట ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. టెర్రరిస్ట్ ముద్రతో సెల్లో ఉన్న ఒక మౌల్వీని పిలిచి ఆ రికార్డింగ్ వినిపించి అర్థం అడుగుతుంది. బిత్తరపోతాడు మౌల్వీ. చెప్పమని గద్దిస్తుంది నిదా. ‘‘ఘూల్ అంటే అరబిక్‌లో ఆత్మ. సయీద్ మనిషి కాడు. వాడు ఆత్మ’’ అని చెప్పి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు మౌల్వీ. డకున్హా ఇంటరాగేషన్ గదిలోంచి బయటకు రాగానే నిదా వెళ్లి చూస్తుంది. అక్కడ సయీద్ శరీరం ఉండదు. మళ్లీ ఎప్పటిలాగే గొలుసులతో బంధించి ఉంటుంది. అతను వికటాట్టహాసం చేస్తుంటాడు. చంపాలని ప్రయత్నిస్తుంది కాని కుదరదు. అప్పుడు నిదాకూ నిర్ధారణవుతుంది సయీద్ మనిషి కాదు అని. ఆ విషయమే డకున్హా, మేజర్ దాస్లతో చెప్తుంది. ఎవరూ నమ్మరు. మేజర్ దాసైతే నిదానూ టెర్రరిస్ట్‌గా ముద్ర వేసేస్తుంది. ఇంకో రోజు.. ఇంటరాగేషన్ స్పెషలిస్ట్ ఫౌలాద్ సింగ్ వస్తాడు సయీద్‌ను హింసించడానికి. ఆ టైమ్‌లోనే నిదా మౌల్వీ సెల్‌లోకి వెళ్తుంది ఘూల్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం. అపరాధభావంతో బాధపడేవాళ్ల శరీరాన్ని ఘూల్ కోరుకుంటుందని, అలా వాళ్ల శరీరంలోకి జొరబడి ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్తాడు మౌల్వీ. తన తండ్రి గురించీ ఆరా తీస్తుంది. ఏమీ చెప్పడు మౌల్వీ. ఈ లోపు స్పెషల్ ఇంటరాగేషన్ సెల్ నుంచి పెద్ద కేక వినిపిస్తుంది. అటుగా పరిగెత్తుతుంది నిదా. అప్పుడే డకున్హాకు ఫోన్ వస్తుంది. ‘‘సర్.. సయీద్ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’’ అనే సమాచారంతో. డకున్హాకు నోట మాటరాదు. మరిక్కడ ఉంది ఎవరు? స్పెషల్ ఇంటరాగేషన్ సెల్లో ఫౌలాద్ సింగ్ బాడీ కనిపిస్తుంది నిదాకు. సయీద్ అనుకుంటున్న వాడు ఏమైనట్టు? అనే డౌట్ వచ్చేలోపే ఫౌలాద్ సింగ్ శరీరంలో ఉన్న ఆత్మ గబగబా సెల్ నుంచి బయటకు వచ్చి ఇతర సెల్స్ తలుపులు తెరిచి అందులోని ఖైదీలందరినీ విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే నిదాను చూస్తుంది. ఆమె భయపడి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంది. సరైన సమయంలో డకున్హా అండ్ టీమ్ వచ్చి ఆమెను రక్షిస్తారు. అప్పడు జరిగిందంతా చెప్తుంది. వెళ్లి చూసి నిజమనే నమ్ముతారు. కాని మేజర్ దాస్ నమ్మదు. ఆ ఖైదీలను విడిపించడానికి నిదా ఆడుతున్న నాటకం అని, ఆమె వచ్చాకే ఆ సెంటర్ అంతా గందరగోళంగా తయారైందని, తమలో తామే తన్నుకు చస్తున్నారని మిగిలిన వాళ్లను రెచ్చగొడ్తుంది. వాళ్లూ నమ్ముతారు. మేజర్ దాస్ ఆజ్ఞ మేరకు నిదాను సెల్లో వేస్తారు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ మిగిలిన ఖైదీలు కనిపిస్తారు. ఆ గదిలో హత్యలు జరిగినట్టు గోడకు తుపాకీ తూటాల ఛిద్రాలు, రక్తం మరకలు కనిపిస్తాయి. అప్పుడు అర్థమవుతుంది నిదాకు. అది ఇంటరాగేట్ చేసి మనుషులను మార్చే సెంటర్ కాదు.. ఫక్తు హత్యలు చేసే సెంటర్ అని. అప్పుడు అక్కడే ఉన్న మౌల్వీని అడుగుతుంది మళ్లీ తన తండ్రి గురించి. చనిపోయి ఉంటాడని చెప్తాడు. అక్కడున్న ఖైదీల్లోనే ఎవరో ఘూల్ అన్న విషయమూ బోధపడ్తుంది నిదాకు. ‘అహ్మద్’ అనే వ్యక్తిని చూపిస్తూ నువ్వేనా అని అడుగుతుంది. ‘‘వాడు మూగవాడు.. ఆత్మ మూగవాడి శరీరంలోకి ప్రవేశించదు’’ అంటాడు మౌల్వీ. ‘‘ఒక టీ అమ్ముకునే వాడిని టెర్రరిస్ట్ అని పట్టుకొచ్చారు. వీడి నుంచి విషయాలు ఏమీ రాబట్టలేకపోయే సరికి వీడి భార్య, కొడుకును పట్టుకొచ్చి వీడి కళ్లముందే చంపేశారు. అప్పటి నుంచి వీడికి మాట పడిపోయింది’’ అని జరిగింది చెప్తాడు మౌల్వీ. దిమ్మ తిరుగుతుంది నిదాకు. చిమ్నీ చూపించి దాన్నుంచి బయటకు పొమ్మని అహ్మద్‌కు చెప్పి తనూ అహ్మద్ వెనక వెళ్తుంది. అహ్మద్ బయటపడి.. నిదాకూడా బయటపడే టైమ్‌కి ఘూల్ ఆమెను లోపలికి లాగి కాలి పిక్కను కొరుకుతుంది. అయినా తప్పించుకుని బయటకు వస్తుంది. ఇద్దరూ కలిసి డకున్హా చాంబర్‌కు వెళ్తారు. అక్కడ జరిగిన పెనుగులాటలో నిదా రూపంలో ఉంది ఆత్మ అని అర్థమవుతుంది అహ్మద్ కు. లోపల అసలు నిదా ఉంటుంది. మేజర్ దాస్.. నిదాను చంపబోతుంటే డకున్హా మేజర్ దాస్‌ను చంపేస్తాడు. మిగిలిన వాళ్లలో ఒకొక్కరిలోకే ఆత్మ చేరి ఒకొక్కరినీ చంపేస్తుంటుంది. ఈలోపు తన తండ్రిని చంపమని ఆర్డర్ ఇచ్చింది డకున్హానే అని తెలుస్తుంది నిదాకు. పశ్చాత్తాపంతో కుమిలి పోతుంది. అహ్మద్‌తో కలిసి ఆ సెంటర్ నుంచి బయటకు వస్తుంది. బాంబు వేసి ఆ సెంటర్‌ను పేల్చేసి తనూ బయట పడ్తాడు డకున్హా. సెంటర్ బయట ఆర్మీ ఉంటుంది. డకున్హాను చూసి ‘‘వీడు మనిషి కాదు.. ఘూల్ ’’ అంటూ ఆర్మీ వారిస్తున్నా వినకుండా డకున్హాను చంపేస్తుంది నిదా. ఆర్మీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. అప్పుడు చెప్తుంది నిదా.. ‘‘అది కోవర్ట్ డిటెన్షన్ సెంటర్ కాదు.. హత్యలు చేసే సెంటర్. అందరూ కరప్ట్ అయ్యారు’’అంటూ. నిదా కూడా టెర్రరిస్టే అని ముద్ర వేసి ఆమెనూ కోవర్ట్ డిటెన్షన్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడ.. బ్లేడ్‌తో అర చేతిని కోసుకొని రక్త తర్పణ చేసి తన శరీరంలోకి ఘూల్ని ఆహ్వానించేందుకు సిద్ధపడ్తుంది నిదా!ఇక్కడితో ‘ఘూల్’ సీజన్ వన్ ఎండ్ అవుతుంది. హైపర్ నేషనలిజం, ఇస్లామోఫోబియా వల్ల తలెత్తిన ఘర్షణకు దృశ్యరూపం ‘‘ఘూల్’’. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంది. దర్శకుడు పాట్రిక్ గ్రాహమ్. – సరస్వతి రమ -
దీనులకోసం యేసు కొండమీది ప్రసంగం
కష్టాలు, కన్నీళ్లు, ఓటములు, భరించలేని బాధల ‘లోయల్లో’ నలుగుతున్న ఎంతోమంది అభాగ్యుల సాంత్వన, ఆదరణ కోసం యేసుప్రభువు ‘కొండమీద’ ప్రసంగం చేశారు(మత్తయి 5–7 అధ్యాయాలు). ఆత్మలో దీనులు, దుఃఖపడేవారు, సాత్వికులు, నీతిని ప్రేమించేవారు, నీతికోసం హింసించబడేవారు, కనికరం గలవారు హృదయ శుద్ధిగలవారు, సమాధానపర్చేవారు ధన్యులు అంటూ ఎంతో విలక్షణంగా ఆరంభమై ఆత్మీయంగా అత్యంత విప్లవాత్మకంగా సాగిన ఆయన ప్రసంగం విన్న తర్వాత బోలెడు జనసమూహం ఆయన్ను వెంబడించారు కాని, వారిలో కేవలం ఒక కుష్టురోగి మాత్రమే ఆయనకు మొక్కి తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాడు (8:1,2). కుష్టురోగం మనిషిని నిలువెల్లా గుల్ల చేసి, రసి కారే దుర్గంధపూరితమైన గాయాలతో నింపి అతన్ని వికృతంగా మార్చితే, సమాజం అతన్ని వెలివేసింది. కాని యేసుప్రభువు మాత్రం అతన్ని రోగవిముక్తుని చేసి అక్కున చేర్చుకున్నాడు. తాను బోధించేవాడిని మాత్రమే కాదని, తన బోధల్ని జీవితంలో ఆచరించి చూపిస్తానని ప్రభువలా రుజువు చేసుకున్నాడు. నా మాటలు వినే వాడు కాదు, విని వాటి చొప్పున చేసేవాడే బుద్ధిమంతుడన్న తన ప్రసంగవ్యాఖ్యల్ని తన ప్రేమభరితమైన చర్యతో ఆచరించి చూపించాడు( 7:24)దేవుడు తన ధర్మాన్ని, విధివిధానాలను యూదులద్వారా లోకానికి అందించినా, అవి యూదులకే కాదు మొత్తం మానవాళికోసం నిర్దేశించినవని రుజువు చేస్తూ, తాను ప్రసంగించిన వెంటనే అన్యుడు, గ్రీసు దేశస్థుడైన ఒక శతాధిపతి కుటుంబంలో యేసుప్రభువు ఒక అద్భుతం చేశాడు. స్త్రీని ఏవగించుకొని ఎంతో చిన్నచూపు చూసే నాటి యూదు సమాజంలో, రోగపీడితురాలై మంచానికి అంటుకు పోయిన పేతురు అత్తగారిని కూడా ఆ వెంటనే బాగుపర్చి ‘సర్వమానవ సమానత్వాన్ని’ చాటిచెప్పాడు(మత్తయి 8 వ అధ్యాయం) . లోకంలో ఎంతో సులభమైన పని బోధించడం, కాని చాలా క్లిష్టమైన విషయం వాటిని ఆచరించి చూపించడం. యేసుప్రభువు మాత్రం ఆ పనిని అవలీలగా చేసి తన బోధలు సంపూర్ణంగా ఆచరణీయమైనవని రుజువు చేశాడు. అయితే ఆ రోజు ఆయన కొండమీది ప్రసంగం విన్న చాలామంది ఎంతో కలవరంతో తమ ఇళ్లకు వెళ్లారు. దేవుడు తన ధర్మాన్ని తన ప్రజలకందిస్తే, శాస్త్రులు, పరిసయ్యులు వాటిని ‘చేయకూడని, చేయదగిన నియమావళి’ తో కూడిన ఒక శాస్త్రంగా దాన్ని మార్చి, దాని వెనుక ఉన్న ‘దేవుని హృదయాన్ని’ విస్మరించారు. ధర్మశాస్త్రాన్ని అక్షరాలా ఆచరిస్తే చాలు పరలోకానికి వెళ్తామన్న నాటి పరిసయ్యులు, ఉపదేశకుల బోధలు విని అలా చేస్తూ తాము చాలా నీతిమంతులమన్న భావనతో ఉన్నవారి ఆశలన్నింటినీ యేసు ప్రసంగం వమ్ము చేసింది. అలాగే, తన సహోదరుని ద్వేషించేవాడు కూడా నరహంతకునితో సమానమేనన్న నాటి యేసు బోధ వారిని కలవరపరిచింది (5:21–25). పరస్త్రీతో శయనిస్తే అది వ్యభిచారమని ధర్మశాస్త్రం చెబుతుండగా, అలా కాదు పరస్త్రీని మోహపు చూపుతో చూసినా అది వ్యభిచారమేనని ప్రభువు అన్నాడు. ఆదిమ ధర్మశాస్త్రపు పరిధిని అలా విస్తరిస్తూ యేసు చేసిన కొండమీది ప్రసంగం నాటి ప్రజల్లో కలవరాన్ని రేపి ఆత్మావలోకనానికి పురికొల్పింది. పరలోకానికి చాలా దగ్గర్లో ఉన్నామనుకున్న చాలామంది నిజానికి దానికి తామెంత దూరంలో ఉన్నామో ఆ రోజు గ్రహించారు. మనవల్ల లోకంలో ఎంత సంతోషం, శాంతి, సోదరభావం నెలకొన్నది, ఎంతమంది అభాగ్యుల కన్నీళ్లు మనం తుడిచామన్నదే దేవుణ్ణి ప్రసన్నుని చేసే ప్రధానాంశం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆత్మ నుండి... ఆత్మలోకి
మనిషి అనేక ప్రాకృతిక చర్యలను గుర్తించలేడు. ఉదాహరణకు తాను భూమిలో భాగమై ఉండటం వలన భూభ్రమణాన్ని గమనించలేడు. అలాగే, తన శరీరంలో జరిగే చర్యలను గుర్తించలేడు. తనకున్న పరిమితులు, తన దృక్పథంతో మాత్రమే ఆలోచించడం వలన అనేక అపోహలు, నమ్మకాలు కలుగుతాయి. కొన్నింటిని ఇతరుల నుండి స్వీకరించి, కొన్ని స్వతహాగా ఊహించి అనుకూల వాదనలు చేస్తూ ఉంటాడు. ఈ మార్గం సరైంది కాదని తెలుసుకున్న భారతీయ ఆధ్యాత్మిక పరిశోధకులు హేతువు నుండి పరిశోధన మొదలు పెట్టారు. ఏది హేతువో అది ఆత్మ అని నిశ్చయించారు. ఆ ఆత్మ నుండే పదార్థం ఉద్భవిస్తోందని, తిరిగి దానిలోనే లయమైపోతోందని నిర్ధారించారు. ఈ సూత్రాన్ని ఒడిసిపడితే చాలు, అన్నింటికీ సమాధానం దొరికిపోతుంది. మనం మన తల్లిదండ్రుల ద్వారా ఉద్భవించినట్టు అనిపించినా, మన ఈ పరిణామరూపం ఆత్మచేత, ఆత్మ ద్వారా, ఆత్మ నుండి, ఆత్మలోనే జరుగుతుందని గుర్తించ గలుగుతాము. ఈ విధంగా మన ఆలోచనలను హేతుమార్గంలో విస్తృత పరచుకుంటే ఆత్మ అర్థమౌతుంది. అర్థమైన ఆత్మను అంతటా, అన్నింటా దర్శించే ప్రయత్నమే తపస్సు. ఈ తపస్సు నిరంతర ఆలోచనల్లో నిండిపోతే కలిగేదే ఆత్మసందర్శన లేక భగవత్సాక్షాత్కారం.ఆ ఆలోచనలను ఆచరిస్తే కలిగే స్థితే బ్రహ్మస్థితి. అంటే సాధకుడు ‘అహం బ్రహ్మాస్మి’ స్థాయికి చేరుకుంటాడు.’ఈశావాస్యోపనిషత్తు’ చెప్పినట్లుగా బ్రహ్మస్థితిలో ఉన్న సాధకుడికి తన చుట్టూ ఉన్న ఏ జీవీ అల్పమైనదిగానో, అసహ్యకరమైనదిగానో కనిపించదు. అన్నింటా ఈశ్వరుడు కనిపిస్తే ఏహ్యభావమెలా కలుగుతుంది? అలాగే, వస్తువాసనలు నశించిపోతాయి. అందువల్ల అరిషడ్వర్గాలు ఆవిరైపోతాయి.అరిషడ్వర్గాలు నశిస్తే దుఃఖానికి స్థానమెక్కడుంటుంది? దుఃఖమే లేనప్పుడు మనసంతా ఆనందమయమే కదా! ఈ ఆనందం మనకు కలిగే సంతోషాలకు భిన్నమయిందీ, ఉన్నతమయింది. సంతోషం స్వల్పకాలిక మానసిక ప్రతిస్పందన కాగా, ఈ ఆనందం ఎలాంటి మానసిక స్పందనలూలేని స్థిరస్థితి.దీనిలో అలజడులకూ, హెచ్చుతగ్గులకూ స్థానం లేదు. అలా నిశ్చలమై, నిరంతరమై ఉంటుంది. సాధకునికి తనలో, తన చుట్టూ కలిగే పరిణామాలకు సంబంధమే ఉండదు. సాధకుడి పని సాధకునిది.అదే కర్మతో, ప్రతిఫలంతో సంబంధం లేని మోక్షస్థితి. అందరూ ఆశించే పరమాత్మ సన్నిధి. -
రెండు డాలర్లంత వర్షం
ముసలి రెమిజియా గుర్రపు వీపును గట్టిగా కరచుకుని తన చిన్న ముఖాన్ని పైకెత్తుతూ ‘‘నరకంలో ఆత్మల కోసం ఇదిగో నా దమ్మిడీ. ఇక వర్షం పడుతుంది ఫెలిపా’’ అన్నది.ఫెలిపా చుట్ట తాగుతూ ఏ జవాబు ఇవ్వలేదు. కరువు గురించి ఎన్నో శోకాలను విన్నది ఆమె. అంతిమంగా చెయ్యి పైకెత్తి ఆకాశాన్ని ఒక కొస నుంచి మరో కొస వరకు పరీక్షగా చూసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. ఒక్క మబ్బు కూడా లేదు. ఆకాశపు తెల్లదనం రెమిజియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. ‘‘మన బ్రతుకులు అంతమయ్యే రోజు వచ్చింది రెమిజియా’’ అన్నది ఫెలిపా.పంటల్ని నాశనం చేస్తూ కరువు ప్రారంభమైంది. నిరాశ నిండిన ఎన్నో కుటుంబాలు పొలాలను వదిలేసి తమ గుర్రాల మీద ఎక్కి వర్షాభావం లేని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.కాని వృద్ధులైన రెమిజియా అందుకు నిరాకరించింది ఏదో ఒకరోజు వర్షం వస్తుందనీ. తన కొడుకును స్ట్రెచర్ మీద తీసుకెళ్తూ మనవడినొక్కడినే తనకు వదిలిన నాటి నుండి రెమిజియా ముభావంగా ఉంటూ పొదుపును అవలంబించసాగింది. తన సొరకాయ బుర్రను కొంత బూడిదతో నింపి ఒకటొకటిగా నాణేలను అందులో వేస్తూ పోయింది. మనవణ్ణి గుండెకు వేలాడదీసుకుని జీవితాన్ని స్వీకరించింది ఆమె. ‘‘నేను బతుకుతున్నది నీ కోసమే బిడ్డా! నువ్వు కూడా నీ తండ్రి లాగా జీవితం కోసం విపరీతమైన తంటాలు పడటం, లేక వయసు మీరకముందే చనిపోవడం నాకిష్టం లేదు’’ అంటుంది ఆమె ఆ పిల్లవాడితో. అంతా సవ్యంగా జరిగిపోతుంది. కానీ కొన్నాళ్ల తరువాత ఎందుకు ఎలా అని తెలియకుండా కరువు వచ్చింది. ఒక నెల వర్షం లేకుండా గడిచింది. తర్వాత రెండు నెలలు, ఆపైన మూడు నెలలు. ఒక్కోసారి ‘నరకంలో ఉన్న ఆత్మల కోసం కొవ్వొత్తుల్ని వెలిగించాలి’’ అంటుంది. కానీ వర్షం కురవలేదు. ఎన్నో కొవ్వొత్తుల్ని వెలిగించినా మొక్కజొన్న చేను వడలిపోయింది. ముసలి రెమిజియా పడక మీదికి పోయి దేవుణ్ని ప్రార్థించింది. నరకంలోని ఆత్మలకు మరిన్ని కొవ్వొత్తుల్ని వెలిగిస్తానని వాగ్దానం చేసి నిరీక్షించింది. ఆమెకు కొండశిఖరాల మీద వర్షం కురుస్తున్న చప్పుడు వినిపించినట్టనిపించింది.ఆశాభావంతో రాత్రి ఆమె నిద్ర పోయింది. కానీ ఉదయం లేచి చూసేసరికి ఆకాశం తెల్లని తాజా దుప్పటిలా ఖాళీగా, నిర్మలంగా ఉంది.జనాలకు ధైర్యం సడలిపోయింది. ఒక చల్లని ఉదయం పూట రొసెండో తన భార్య, ఇద్దరు పిల్లలు, ఆవు, కుక్క, బక్కచిక్కిన గాడిదను తీసుకుని వెళ్లిపోయాడు. సామానంతా గాడిద వీపు మీద తీసుకెళ్తూ ‘‘దీన్ని నేను తట్టుకోలేను రెమిజియా, ఈ ఊరి మీద ఏ దుష్టశక్తివో పాపిష్టి కళ్లు పడ్డాయి’’ అన్నాడు. రెమిజియా గుడిసె లోపలికి పోయి రెండు రాగి నాణాలతో బయటకు వచ్చింది. వాటిని రొసెండోకు ఇస్తూ ‘‘నరకంలోని ఆత్మల కోసం నా పేరు మీద ఈ డబ్బుతో కొవ్వొత్తుల్ని కొని వెలిగించు’’ అన్నది. రొసెండో ఆ నాణాల్ని తీసుకుని, వాటిని చూసి, తలపైకెత్తి ఆకాశాన్ని చాలాసేపు చూశాడు.‘‘నీకు రావాలనిపించినప్పుడు టవేరాకు వచ్చెయ్. అక్కడ మాకు చిన్న భూమి చెక్క దొరికింది. నీకు ఎప్పుడూ మా స్వాగతం ఉంటుంది’’ అన్నాడు. ‘‘నేనిక్కడే ఉంటాను రొసెండో. ఈ కరువు ఇట్లానే ఉండిపోదు’’ అన్నది రెమిజియా.రెమిజియా మనవడు ఎండల ధాటికి నీగ్రో లాగా నల్లబడిపోయాడు.‘‘నానమ్మా! ఒక పంది చచ్చిపోయినట్టుంది’’ అన్నాడు వాడు.రెమిజియా పందుల దొడ్డి వైపు పరుగెత్తింది. ముట్టెలు వడలిపోయి తీగల్లాగా తయారయి పందులు గురగురమంటూ రొద చేస్తూ ఒగరుస్తున్నాయి. అవి అన్నీ ఒకచోట గుమిగూడాయి. వాటిని పక్కకు తరిమి చూడగానే చచ్చిపడి ఉన్న ఒక పంది కనిపించింది ఆమెకు. అది బతికి ఉన్న పందులకు ఆహారంగా పనికి వచ్చిందని ఆమెకు అర్థమైంది. తనే స్వయంగా వెళ్లి నీళ్లు తెస్తే పందులు బతుకుతాయి కనుక అలా చేయాలని నిశ్చయించుకున్నది ఆమె.సూర్యోదయం కాగానే ఆమె ముదురు గోధుమరంగులో ఉన్న తన చిన్న గుర్రాన్ని తీసుకుని బయలుదేరింది. తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నమైంది. సొరకాయ బరువు తగ్గింది. అయినా నరకంలోని ఆత్మలు జాలి చూపుతాయని తను పొదుపు చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని ఆమె వెచ్చించింది. గుర్రానికి శ్రమ ఇవ్వకూడదని ఆమె నడచి వెళ్లటం ప్రారంభించింది.జనాలు ఆ ఊరిని వదిలి వెళ్లటం కొనసాగింది. ప్రతిరోజూ ఒక గుడిసె ఖాళీ అవుతోంది. నేల బూడిదరంగుకు మారి దాని మీద పగుళ్లు కనబబడసాగినై.రెమిజియా ఆశను పోగొట్టుకోలేదు. వర్షం వచ్చే సూచనల కోసం ఆమె ఆకాశాన్ని పరీక్షగా చూసింది. తన మోకాళ్ల మీద వంగి ‘‘నరకంలోని ఆత్మలారా, మీరు సహాయం చేయకపోతే మేము మాడిపోతాము’’అని వేడుకుంది.కొన్నిరోజుల తరువాత ఒక ఉదయాన గుర్రం తన కాళ్ల మీద నిలబడలేక పోయింది. అదేరోజు మధ్యాహ్నం ఆమె మనవడు జ్వరంతో కాలిపోతూ మంచం పట్టాడు. రెమిజియా ప్రతి గుడిసెకూ పోయింది. చాలా దూరంలో వున్న గుడిసెలకు కూడా వెళ్లింది. ఆ గుడిసెల వాసులతో ‘‘మనం సెయింట్ ఇసిడోరోకు రుద్రాక్ష విత్తుల దండ చేయిద్దాం’’ అన్నది. వాళ్లు ఒక ఆదివారం పొద్దున పెందరాళే బయలుదేరారు. ఆమె తన మనవణ్ణి చేతిలో పెట్టుకొని నడుస్తోంది. పదిహేను ఇరవైమంది పురుషులు, స్త్రీలు ఎండకు నల్లబడిన శిథిల దేహాల పిల్లలు, బంజరు నేలల మీది తోవల మీదుగా సాగిపోతూ శోకాలు పెడుతున్నారు. వాళ్లు మేరీ కన్య బొమ్మను, వెలిగించిన కొవ్వొత్తుల్ని పట్టుకుని నడుమ నడుమ ఆగి మోకాళ్ల మీద వంగుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఒక బక్కపలచని వృద్ధుడు మండే కళ్లతో, నగ్నమైన ఛాతితో, పొడుగుగా పెరిగిన గడ్డంతో వుండి ఆ ఊరేగింపు మొదట్లో నడుస్తున్నాడు ఆకాశం వైపు చూస్తూ...‘సెయింట్ ఇసిడోరో, ఓ కర్షకుడా / సూర్యుణ్ని కప్పేసి వర్షాన్ని తెప్పించు’ అంటూ వేడుకుంటున్నాడు.అందరూ వెళ్లిపోయారు. రొసెండో వెళ్లిపోయాడు. బుద్దిమాంద్యం వున్న తన కూతుర్ని తీసుకుని టోరిబియో వెళ్లిపోయాడు. ఫెలిపె, ఇతరులు, వేరేవాళ్లుఅందరూ వెళ్లిపోయారు. కొవ్వొత్తులు వెలిగించడానికి ఆమె వాళ్లందరికీ డబ్బు ఇచ్చింది. ఆఖరున వెళ్లినవాళ్లు ఎవరో ఆమెకు తెలియదు. వాళ్లు ఒక రోగిష్టి అయిన వృద్ధుణ్ని తీసుకుపోయారు. దుఃఖభారంతోవాళ్లు కుంగిపోయారు. ఇక వర్షం పడుతుందనే ఆశ అందరిలో అడుగంటిపోయింది. ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లేముందు వృద్ధులు ‘దేవుడు ఈ ప్రాంతాన్ని శిక్షిస్తున్నాడు’ అనుకున్నారు.యువకులు, పిల్లలు అక్కడేదో దుష్టశక్తి తనపాడు దృష్టితో కీడు కలిగిస్తున్నదని అనుకున్నారు.రెమిజియా ఆశను వదులుకోలేదు. ఆమె కొన్ని నీటి చుక్కల్ని సేకరించింది. మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాలని అనుకున్నదామె. ఎందుకంటే సొరకాయ బుర్ర దాదాపు ఖాళీ అయింది. తన చిన్న తోట లోని భూమి రహదారిలా మారిపోయి అంతటా ధూళి నిండింది.నరకంలోని ఒక మూలలో నడుముల దాక ఉన్న మంటల్లో కాలుతూ ఆ ఆత్మలు పరిశుద్ధమవుతున్నాయి. భూమ్మిద వర్షాన్ని కురిపించి జలమయం చేసే శక్తి ఆ ఆత్మలకే వుండటం విడ్డూరం, వ్యంగ్యభరితం. గడ్డం వున్న ఒక వికృతమైన ముసలి స్త్రీ ఇలా అన్నది ‘‘కారంబా! పోసో హోండో అనే వూళ్లో ముసలి రెమిజియా కొవ్వొత్తుల కోసం రెండు డాలర్లు వెచ్చించింది కాబట్టి అక్కడ వర్షం కురవాలి’’ఆమె సహచరులు అప్రతిభులయ్యారు. ‘‘రెండు డాలరా! అయ్య బాబోయ్’’మరొక ఆత్మ అన్నది ‘‘ఆమెకు ఎందుకు ఇంకా సహాయం అందలేదు. మనుషులతో మనం వ్యవహరించేది ఇలాగేనా’’‘‘ఆమె కోరికను మనం మన్నించాలి’’ అని గర్జించింది మరొక ఆత్మ.‘‘పోసొ హోండోకు రెండు డాలర్లంత వర్షం కురిపించాలి’’ఆ ఆత్మలన్నీ చాలా సంతోషించాయి. ఎందుకంటే వర్షం కోసం అంత పెద్ద మొత్తాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎవ్వరూ చెల్లించలేదు. అంత డబ్బు వెచ్చించి కొవ్వొత్తులు వెలిగించినందుకు ఎంత పుష్కలమైన వర్షం కురిపించాలో తలుచుకునేసరికి నరకంలోని ఆ ఆత్మలు అదిరిపడ్డాయి. దేవుడు తమను తన దగ్గరికి పిలిపించుకునేదాకా ఇలా మంటల్లోకలుతున్నంత కాలం వర్షాన్ని కురిపిస్తూనే వుండాలి కదా అని నివ్వెరపోయాయి ఆ ఆత్మలు.పోసోహోండాలో ఒక ఉదయాన ఆకాశం నిండా ముబ్బులు కమ్మినయ్. రెమిజియా తూర్పు దిక్కున ఉన్న ఆకాశాన్ని చూసింది. ఆమెకు పలుచనైన ఒక నల్లని మేఘం కనిపించింది. ఒక గంట తరువాత పెద్ద పెద్ద మేఘాలు జంటలుగా గుమిగూడి ఒకదాన్నొకటి తోసుకుంటూ వేగంగా కదలసాగినయ్.రెండుగంటల తర్వాత చిక్కని చీకటి ఏర్పడి రాత్రి అయిందా అనిపించింది.తక కలుగుతున్న సంతోషం సున్నా అవుతుందేమోనన్న భయం కమ్ముకోగా రెమిజియా ఏమీ మాట్లాడకుండా కేవలం చూస్తూ ఉండిపోయింది. ఆమె మనవడు ఇంకా జ్వరంతో మంచం మీద పడి వున్నాడు. వడు ఎముకల గూడులా చాలా బక్కగా వున్నాడు. పెద్ద ఉరుము ఉరిమింది. ఆమె తనలో తానే నవ్వుకుని, చేతులతో చెంపలను గట్టిగా పట్టుకుని, కళ్లను విశాలంగా చేసింది. చాలాకాలం తర్వాత మళ్లీ వర్షం పడుతోంది. వేగంగా కదులుతూ టపటపనే చినుకులతో పాటు పడుతున్నట్లుగా వర్షం రోడ్డును చేరి, గుడిసె పై కప్పు మీద చప్పుడు చేస్తూ గుడిసె దాటేసి పొలాల మీద కురవడం ప్రారంభించింది. రెమిజియా వెనక గుమ్మం వైపు పరుగెత్తి చిన్న వరదలాంటి నీరు పారుతూ వస్తుంటే నేల అణగిపోయి దట్టమైన ఆవిరులను చిమ్మటం గమనించింది. ఆమె విజయోత్సాహంతో బయటికి పరుగెత్తింది.‘‘వర్షం వస్తుందని నాకు తెలుసు’’ అంటూ బిగ్గరగా అరిచింది. ఆకాశం వైపు చేతులు చాస్తూ ‘‘వాన పడుతోంది...ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు’’ అంటూ కేరింతలు కొట్టింది. ఆమె ఇంటి లోపలికి పరుగెత్తి మనవణ్ని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుని వాడికి వర్షాన్ని చూపించింది. ఆకాశం నుండి వర్షం ధారాపాతంగా కురుస్తోంది. వర్షపు చినుకుల బలమైన తాకిడి ధాటికి తాటాకుల గుడిసె పైకప్పు పగులుతోంది. రెమిజియా కళ్లు మూసుకుని కొన్ని దృశ్యాలను దర్శించింది. విరగకాసిన తన పంటచేను చల్లని గాలి తరగల్లో కదలాడుతోంది. బయట ఎడతెరిపి లేకుండా బీభత్సంగా వర్షం. వారం రోజులు, పదిరోజులు, పదిహేను రోజులు గడిచాయి. వర్షం ఒక గంట సేపు కూడా ఆగక ఇంకా కురుస్తూనే వుంది. బియ్యం, వెన్న, అప్పుడు అన్నీ నిండుకున్నాయి. ఆహారపదార్థాల్ని కొనడానికి రెమిజియా వర్షంలోనే నగరానికి బయలుదేరింది. పొద్దున బయలుదేరిన ఆమె తిరిగి మధ్యరాత్రి ఇల్లు చేరింది. ఒక మధ్యాహ్నంవేళ పెద్ద కంచర గాడిద తలను లోపలికి దూర్చింది. ‘‘కిందికి దిగ లోపలికి వస్తే కొంచెం వెచ్చగా వుంటుంది’’ అన్నదామె.కంచర గాడిద బయటే వుండిపోయింది. అతడు ‘‘ఆకాశం నీళ్లుగా మారిపోయింది. నేను నీ పరిస్థితిలో వుంటే ఈ లోతట్టు ప్రదేశాల్ని వదిలి ఆ కొండమీదికి పోయేవాణ్ని’’ అన్నాడు.‘‘నేను యిక్కణ్నుంచి వెళ్లిపోవటమా? లేదు స్వామీ, ఈ వర్షం ఒకటి రెండు రోజుల్లో ఆగిపోతుంది’’ అన్నదామె.‘‘చూడమ్మా ఇది వరద పరిస్థితి. నేను కొన్ని భయంకర దృశ్యాల్ని చూశాను. వరద నీరు జంతువుల్నీ, ఇళ్లనూ, చెట్లనూ, మనుషుల్నీ లాక్కుపోతోంది. నేను దాటి వచ్చిన నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. పైగా నదుల జన్మస్థానాల్లో కుండపోతగా వర్షంకురుస్తోంది’’ అన్నాడతడు.‘స్వామీ, కరువు భయంకరంగా వుండింది. అందరూ పారిపోగా నేనొక్కదాన్నే తట్టుకుని ఇక్కడే వుండిపోయాను’’ అన్నది రెమిజియా.‘‘కరువు చంపకపోవచ్చు. కాని వరద ముంచేస్తుంది తల్లీ’’అన్నాడు ఆ ఆసామి. చీకటి పడుతుండటంతో అతడు వెళ్లిపోయాడు. ఆ రాత్రివేళ వెళ్లొద్దని ఆమె బతిమాలింది. కాని అతడు వినలేదు. ‘‘పరిస్థితి మరింత విషమించబోతుందమ్మా, నదులు గట్లను తెంపుకునిఅంతాజలమయం అవుతుంది’’ అంటూ వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. రెమిజియా గుడిసె లోపలికి పోయింది. లోపల పిల్లవాడు జడుసుకుంటున్నాడు. ఆ ఆసామి చెప్పింది నిజమైంది. అబ్బ, అది ఎంత భయంకరమైన రాత్రి! మధ్యమధ్యన ఉరుములు మెరుపులతో అత్యంత ఉధృతమైన కుంభవృష్టి ఎడతెరిపి లేకుండా కురిసింది. మురికినీళ్లు సుళ్లు తిరుగుతూ గుమ్మం తలుపులోని సందులోంచి లోపలికవచ్చినేల మీద నిండిపోయాయి. దూరాన గాలి ఈల వేస్తోంది. చెట్టు విరిగిన చప్పుడు ఫెళఫెళమని వినిపించింది. రెమిజియా తలుపు తెరిచింది. దూరాన మెరిసిన మెరుపు పోసా హోండోను వెలుతురు మయం చేసింది. కొండవాలు మీంచి నీళ్లే నీళ్లు... రహదారి నదిగా మారిపోయింది.‘‘ఇది వరద కావచ్చునా’’ రెజిమియాకు మొదటిసారిగా అనుమానం వచ్చింది. కాని ఆమె గుమ్మం తలుపులు మూసి లోపలికి పోయింది. గడచిన కరువు తీవ్రత కన్న, రాబోయే వర్షపు తీవ్రత కన్న బలమైన ఆశాభావం కలిగింది ఆమెకు. ఒక మధ్యరాత్రి వేళ గుడిసె పక్క గోడ నుంచి దభీమని చప్పుడు రావటంతో ఆమెకు మెలకువ వచ్చింది. మంచంలోంచి కిందికి దిగేసరికి తన మోకాళ్ల దాకా నీళ్లు వచ్చిన సంగతి తెలిసింది ఆమెకు.అబ్బ, ఎంతటి కాళరాత్రి! నీళ్లు ప్రవాహరూపంలో లోపలికి దూసుకువచ్చి లోపల మొత్తం నిండిపోయాయి. మరో మెరుపు మెరిసింది. పెద్ద ఉరుముతో ఆకాశం వణికినట్టనిపించింది.‘‘మేరీ కన్యాకా కరుణించు’’ అంటూఏడ్చింది. కానీ ఈ పరిణామానికి కారణం మేరీ కన్యక కాదు.నరకంలోని ఆత్మలు. అవి ‘‘ఈ వర్షం సగం డాలరుకే సమానం, సగం డాలరుకే’’ అంటూ అరిచాయి.ఎప్పుడైతే ఆ వరద నీరు గుడిసెను కదపడం మొదలెట్టిందో అప్పుడు రెమిజియా ఆశాభావాల్ని వదలి తన మనవణ్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె వాడిని సాధ్యమైనంత గట్టిగా ఎదకు హత్తుకుని నీళ్లలోంచి అతి ప్రయత్నపూర్వకంగా నడిచింది.ఎలాగో ఆమె తన గుడిసె తలుపును తీసి బయటికి నడిచింది. తను ఎక్కడికి పోతుందో ఆమెకు తెలియదు. గాలికి ఆమె వెంట్రుకలు విడివడి పోయాయి. దూరాన ఒక మెరుపు మెరిసింది. నీటి మట్టం ఇంకాఇంకా పెరుగుతోంది. తన మనవణ్ని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆమె. తూలి పడబోయింది కాని ఎలాగో నిలదొక్కుకుంది.ఉధృతంగా వీస్తున్న గాలి ఆమె కంఠస్వరాన్ని కబళించి దాన్ని జలమయమైన ఆ ప్రదేశం మీద పరిచింది.‘‘ఆమె గౌను నీళ్ల మీద తేలింది. ఆమె జారిపోతోంది. ఏదో వస్తువు తన వెంట్రుకలకు తట్టుకుని తలను ముందుకు పోకుండా ఆపినట్టనిపించింది ఆమెకు.‘‘ఇదంతా ముగిసిన తర్వాత బంగాళాదుంపలు నాటుతాను’’ అనుకున్నదామె.తన మొక్కజొన్న చేను మురికి నీళ్లలో మునిగిన దృశ్యం కనబడింది ఆమెకు. ఆమె తన వేళ్లను మనవడి ఛాతీలోకి గుచ్చిపట్టింది. గాలి ఊళ వేసింది. ఆకాశాన్ని పగలగొడుతున్నట్లు పెద్ద ఉరుము ఉరిమింది.ఆమె వెంట్రుకలు ఒక ముళ్ల చెట్టుకు తట్టుకున్నాయి. గుడిసెల్నీ, చెట్లనీ లాక్కెళ్తూ వరద నీరు పొర్లింది. నరకంలోని ఆత్మలు ‘‘ఈ వర్షం సరిపోదు, రెండు డాలర్లంత వర్షం, రెండు డాలర్లంత వర్షం కురవాలి’’ అంటూ ఉధృతంగా గర్జించాయి. డొమినికన్ మూలం : ఖ్వాన్ బాష్ తెలుగు : ఎలనాగ -
అభేదాన్ని తెలిపేదే అద్వైతం
సమస్త జీవరాశుల్లో ఆత్మను సందర్శించగల జీవి కేవలం మానవుడు మాత్రమే. మనకు తెలిసినంత వరకూ ఆత్మ పరిణామ క్రమంలో మానవునిది ఒకానొక ఉత్కృష్ట స్థాయి. మానవుడు తన దేహంలో ఉన్న మనసును ఆసరాగా చేసుకుని మాత్రమే ఆత్మను సందర్శించగలడు. దేహం అనేదొక ఒక పదార్థం. ఈ పదార్ధం, ఆత్మ లేక అనంతశక్తి పరిణామం చెందగా ఏర్పడింది. అంతర్లీనంగా చూస్తే పదార్థమే శక్తి, శక్తే పదార్థం. అదే అభేదం, ఆ అభేదాన్ని తెలిపేదే అద్వైతం. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడమే ‘ప్రజ్ఞానం బ్రహ్మ’. పంచభూతాల మేలిమి సమ్మేళనమైన శరీరం చైతన్యరాహిత్యం అయినప్పుడు మాత్రమే తిరిగి పంచభూతాల రూపంలోకి మారడం ప్రారంభిస్తుంది. శరీరం స్త్రీపురుషుల సంగమంతో పిండరూపంగా ప్రారంభమవుతుంది. ఐతే, ఇక్కడ సూక్ష్మమైన రూపంలో ఉన్న పిండం మానవ ఆకృతిని ఎలా పొందుతుందనే ప్రశ్న వేసుకుంటే, తల్లి తీసుకునే ఆహారం ద్వారా అనే జవాబు వస్తుంది. తల్లి స్వీకరించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతిలో రూపుదిద్దుకున్నాయి. అంటే శక్తి రూపాలైన పంచభూతాలు అనుకూల పరిస్థితుల్లో అత్యద్భుతంగా కలిస్తే ఏర్పడేదే జీవపదార్థం. తొలుత బీజరూపంగా ఉన్న పదార్థం, ఇతర జీవపదార్థాలను స్వీకరించి వివిధ పూర్ణరూపాలుగా పరిణమిస్తాయి. బీజరూపంగా ఏర్పడినది మొదలుకుని, చైతన్యరహితంగా ఏర్పడే వరకూ ఆ పదార్థాన్ని ప్రాణిగా చూస్తాం. ప్రయాణం మొత్తాన్ని జీవ ప్రయాణంగా పరిగణిస్తాం. ఈ ప్రయాణం ప్రారంభమవడమంటే, అనంతశక్తి లేక ఆత్మలో కొంత భాగం జీవశక్తిగా మారటమే. అందుకే, ‘ఛాందోగ్యోపనిషత్తు’ ఈ దేహాన్ని భగవంతుడు నివసించే పురం(బ్రహ్మ పురం)గా అభివర్ణించింది. ఆత్మ శరీరరూపంలోకి మారి, నివసించే గృహం ఈ దేహం. మరణానంతరం ప్రాణం ఏమవుతుందని నచికేతుడనే జ్ఞానపిపాసి, యముడు అనే జ్ఞానిని ప్రశ్నిస్తాడు. అందుకు ఆ జ్ఞాని, ఒకే అగ్ని ప్రపంచంలో వివిధ ఆకృతుల్లో ఏవిధంగానైతే విరాజిల్లుతుందో, ఒకే వాయువు వివిధ ఆకృతులలో ఏవిధంగానైతే పరిఢవిల్లుతోందో, అలాగే ఆత్మ వివిధ జీవుల్లో ఆయా ఆకృతుల్లో విరాజిల్లుతుందని ‘కఠోపనిషత్తు’లో తెలుపుతాడు. – రావుల గిరిధర్ -
కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ‘జిన్’ పోరు
లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్‌లు తమ సంప్రదాయ వైరాన్ని మర్చిపోలేదు. తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తన సొంత బ్రాండ్ జిన్ క్యూరేటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆక్స్‌ఫర్డ్‌తో మరో పోటీకి తెరతీసింది. గత ఏడాది ఆక్స్ఫర్డ్ వర్సిటీ తన సొంత ఫిజిక్ బ్రాండ్ జిన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. వర్సిటీ గార్డెన్‌లోని చెట్లు, మొక్కల నుంచి రూపొందించిన ఈ జిన్ ధర 35 పౌండ్లుగా నిర్ణయించింది. అయితే, ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఇసాక్ న్యూటన్ సాపేక్ష సిద్ధాంతం కనుగొనేందుకు కారణమైన యాపిల్స్ నుంచి తాము క్యూరేటర్ జిన్ తయారు చేస్తున్నట్లు కేంబ్రిడ్జ్ తెలిపింది. దీనిని తమ బొటానికల్ గార్డెన్స్‌లోని యాపిల్స్ నుంచి రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ జిన్ ధర 40 పౌండ్లుగా తెలిపింది. ఇప్పటికే యూనివర్సిటీలోని దాదాపు 12 కళాశాలలకు ఈ జిన్ను అందజేస్తున్నట్లు తెలిపింది. తాజాగా, ఇదే కోవలోకి లీసెస్టర్ యూనివర్సిటీ కూడా వచ్చి చేరింది. తమ వర్సిటీ బొటానిక్ గార్డెన్‌లోని మొక్కల నుంచి జిన్ తయారు చేసేందుకు ఇటీవలే తమ విద్యార్థులకు అనుమతినిచ్చింది. -
సనాతనం నిత్యనూతనం
ఆత్మ విషయంలో తాత్వికులు మనసుతో తాదాత్మ్యత చెందితే, అదే ఆత్మను భగవంతుడు అని భక్తులు భక్తిమార్గంలో ఆరాధిస్తారు. అదే ఆత్మను అనంతశక్తి అంటూ శాస్త్రవేత్తలు ప్రయోగాలతో నిరూపించేందుకు ప్రయత్నం చేస్తారు. ఉపనిషత్తులు సత్యాన్వేషణ ఎలా చేయాలో చెబుతాయి. సత్యమంటే మనం సాధారణ అర్థంలో తీసుకునే ఋజువాక్కులు కాదు.‘ఎల్లప్పుడు నిలిచి ఉండే వస్తువు. మహిమాన్వితమైన అనంతమైనశక్తి. రంగులేకున్నా, రూపులేకున్నా ఇంద్రియానుభవ స్వరూపాలకు అదే హేతువు. అది జననమరణాలు లేనిదైన శక్తి. దాని గురించి మాత్రమే ఉపనిషత్తులు చర్చిస్తాయి. అంతేకాకుండా, ఆ శక్తి పరిణామక్రమానికి నిదర్శనమైన ఖగోళ పదార్థాలన్నీ అశాశ్వత పదార్థాలు. నశించిపోతూ వస్తున్న అస్థిరపదార్థాల గురించి తాత్విక పరిశోధకులు ఉపనిషత్తులలో చర్చించలేదు. ఎందుకంటే, అవి హేతువులు కావు. అసలైన హేతువు, స్థిరవస్తువు, స్వతఃసిద్ధమైంది అయిన ఆత్మ గురించి మాత్రమే విశేషమైన చర్చ జరిగింది. ఇక ఆత్మ సనాతనంగా ఉంటూనే, నిత్యనూతనంగా ఎలా ఉండగలుగుతోంది అనేది పెద్ద ప్రశ్న. ఆత్మ తన ఉనికిని స్థిరంగా కొనసాగించడానికి పరిణామాన్ని ఆశ్రయించింది. ఈ పరిణామ ప్రక్రియలో తనకు తానుగా ఖగోళ పదార్థంగా మారుతూ, తిరిగి తనకు తానుగా అనంతశక్తిగా మారుకుంటూ తన స్థిరత్వాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ ప్రక్రియను అంతా తన లోపలనే గుంభనంగా కొనసాగిస్తూ నిశ్చలంగా, నిర్దిష్టంగా, శాశ్వతంగా ఉంటూ వస్తోంది, ఉండబోతోంది. ఆ శక్తి పరిణామాన్ని ఆశ్రయించడంలో రెండు ప్రాథమిక చర్యల ద్వారా పదార్థంగా ఏర్పడుతూ, గతిస్తూ ఉంటుంది. తద్వారా తన ఉనికిని నిత్యనూతనంగా ఉంచుకుంటోంది. ఆ చర్యలే సంలీనం, విచ్ఛిత్తి. క్వార్క్‌లు, హైడ్రోజన్ లాంటి అణువుల సంలీనం వలన నక్షత్రాలు, గ్రహాలు లాంటి ఖగోళ పదార్థాలేర్పడతాయి. అలా ఏర్పడిన వాటిల్లో అనుకూల వాతావరణం ఉన్న గ్రహాల పైన జైవికపదార్థాల సంలీనం వలన జీవాలు ఏర్పడతాయి. ఈ పదార్థాలు తమ మనుగడ తర్వాత విచ్ఛిన్నం చెందుతూ, తిరిగి అన్నీ శక్తిరూపంలోకి మారిపోతాయి. తద్వారా శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటూ, తనకు తానుగా ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. – గిరిధర్ రావుల -
సర్వాంతర్యామి ఎక్కడ?
సర్వాంతర్యామి అంటే ఎంతటి వాడు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఏ రూపలావణ్యాలను కలిగి ఉంటాడు... వంటి ప్రశ్నలు మదిని తొలిచేస్తుంటాయి. అదేవిధంగా తన రూపానికి కారణం ఏంటి? తన చుట్టూ ఉన్న దృశ్యమాన ప్రపంచం ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడిందనేవి నిరంతరం సమాధానాలు వెతుక్కునే ప్రశ్నలు. మానవుడు తనను తాను ఉత్కృష్ట రూపంగా, తన జన్మ మహోన్నతమైనదిగా ఊహించుకుని భగవంతుడు కూడా అదే విధంగా ఉంటాడనుకుంటాడు. మరింత శక్తిమంతుడు కాబట్టి, అనేక శిరస్సులు, బాహువులతో ఊహించుకుంటాడు. కానీ, ఉపనిషత్తుల్లోని జ్ఞానం మానవునికి ఆ భగవంతుని రూపాన్ని అనంతమైనశక్తిగా, ఇంద్రియాలు గ్రహించలేని సూక్ష్మరూపమైననూ, తాను లేని ప్రాంతంగాని, పదార్థాలు గాని లేనట్టి హేతువుగానూ తేల్చేసాయి. వేలప్రశ్నలకు, సందేహాలకు నిత్య నూతన సమాధానాలు ఉపనిషత్తులలో చూడగలం. ఉపనిషత్తులలో ఆధ్యాత్మికతను వెతికితే ఆధ్యాత్మికత, విజ్ఞానశాస్త్రాన్ని వెతికితే విజ్ఞాన శాస్త్రం, భగవంతుని వెతికితే భగవంతుడు కనిపిస్తాడు. అంటే ఈ మూడింటినీ సమాధానపరిచే అద్భుత జ్ఞానం వాటిల్లో ఉందన్నమాట. ఆత్మనైనా, అనంతశక్తినైనా, భగవంతుడినైనా జ్ఞానాన్ని ఆధారం చేసుకునే తెలుసుకోవాలి. ఆ జ్ఞానం సాహిత్యరూపంలో నిండి ఉంది. అయితే, భగవంతుని అర్థం చేసుకోవడానికి ఇక్కడొక వెంట్రుకవాసి వ్యత్యాసం ఉంటుంది. కేవలజ్ఞానం ద్వారా ఆ అనంతశక్తిని తెలుసుకున్నా అది పూర్తిగా అవగతం కాదు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, నిరంతర చింతన ద్వారా అటువంటి జ్ఞానాన్ని అనుభవిస్తామో, ఎప్పడైతే అలాంటి జ్ఞానాన్ని మనసులో రమింపజేస్తామో అప్పుడే ఆ పరమాత్మను లేక అనంతశక్తిని లేదా భగవంతుని సందర్శించగలుగుతాము. అప్పుడే ‘అహం బ్రహ్మాస్మి’ స్థితి సాధ్యమవుతుంది. అంటే ఆత్మకు, సాధకునికి మధ్య అభేదం ఏర్పడుతుంది. ఆ సాధకునికి పంచేంద్రియాల ద్వారా ఏ విషయాన్ని గ్రహించినా ఆత్మానందమే కలుగుతుంది. ఎందుకంటే ఈ దృశ్యమాన ప్రపంచం లోపలా, బయటా అంతటా తాను ఆ ఆత్మనే సందర్శించగలుగుతాడు. తనలో కూడా ఆ ఆత్మని అనుభవించగలుగుతాడు. అదే బ్రహ్మానందం. అదే ఆధ్యాత్మిక మకరందం. దానిని మించిన తీపి దొరకదు, దానిని మించిన ఆనందం లభించదు. – రావుల గిరిధర్ -
ఆత్మ సాక్షాత్కారం
రాధకు కృష్ణుడంటే అపరిమితమైన ప్రేమానురాగాలు. నిత్యం కృష్ణుడి ధ్యానంలోనే తలమునకలుగా ఉండేది. అది చూసిన ఓ పండితుడు రాధ వద్దకు వచ్చి ఆమెతో ఇలా అన్నాడు: ‘‘ఈ ప్రపంచమంతా మిధ్య. ఇది విషయానుభవాన్నిస్తుంది కాని ఆత్మానుభవాన్నివ్వలేదు. ఈ మాయామేయ ప్రపంచాన తిరుగుతున్న మహామాయగాడు ఆ కృష్ణుడు. ఆ మాయావిని ప్రేమించి, ధ్యానించి నీ జీవితాన్ని వృథా చేసుకుంటున్నావు. నా మాట విని దేహాభిమానాన్ని వీడి, ఇంద్రియాలను జయించి, అంతర్ముఖివై ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తరించు’’ అని ప్రబోధించాడు. వారి మాటలకు బదులుగా రాధమ్మ ‘‘స్వామీ మీ పాండిత్య ప్రకర్షకు, శాస్త్ర పరిజ్ఞానానికి శతకోటి నమస్కారాలు. కాని నాదొక విన్నపం. ఈ పరమాత్మ ప్రకృతి కన్నా వేరుగా ఉన్నాడా?’’అంది. అందుకా పండితుడు... పరమాత్మ వేరుగా లేడన్నాడు. ‘‘మరి ఈ పంచభూతాత్మక ప్రపంచమంతా తానే అయినప్పుడు, పరమాత్మ దర్శనం కేవలం అంతర్ముఖత్వంలోనే కలుగుతుందనడం సమంజసమా? బాహ్యాంతరంగాలన్నీ అతని దివ్యరూప స్వరూపాలే. అసంఖ్యాకమైన అణువులూ, ఈ తనువులు, ఈ ప్రపంచం... ఈ సాక్షాత్కరించినదంతా ఆత్మ సాక్షాత్కారమే. ఈ దేహం ప్రకృతిలోని భాగమే. దేహం ఆత్మదేవుని ఆనందమందిరం. దీనిలోని ప్రతిభాగం, ప్రతి ఇంద్రియం, సూక్ష్మాతి సూక్ష్మమైన కణసముదాయం... ఆత్మచైతన్యంతో నిండి మహాద్భుతంగా, మహిమాన్వితంగా అంతుచిక్కని ప్రజ్ఞతో పని చేస్తుంది. హృదయాన భావోదయం, మన కనులముందు కాంతిమయ ఈ అనంత విశ్వోదయం... ఇదంతా ఆత్మావిష్కృతమైన జగచ్చిత్రమే. ఆత్మ తప్ప అన్యం లేదన్న ప్రజ్ఞ కలిగినప్పుడు ‘నేనే అనే అహంకార వికారానికి తావెక్కడుంటుంది?’’ అని ప్రశ్నించింది. అప్పటివరకు రాధకు హితబోధ చేద్దామని వచ్చిన ఆ పండితుడి నోరు రాధ మాటలతో మూతబడిపోయింది. రెండు చేతులూ ఎత్తి రాధకు, ఆ తర్వాత కృష్ణుడికీ మనసులోనే నమస్కరించి అక్కడినుంచి చల్లగా జారుకున్నాడు. – డి.వి.ఆర్. -
ఆదిశేషుడి అంశగా...
శ్రీ కృష్ణుడి అవతారం ముగిసి ద్వాపరయుగం అంతరించింది. కలియుగంలో అధర్మం విజృంభిస్తున్నది. పరీక్షిత్తు, జనమేజయుడి తరువాత ధర్మపాలన కరువైపోయింది. వేదాలను పరిహసించి వ్యతిరేకించి ధర్మం తప్పి చరించే వితండ వాదాలు, మతాలు పెరిగిపోయాయి. విచ్చలవిడి జీవనం సామాన్యమైంది. నాస్తికుల ఆగడాలకు అంతులేదు. ఆస్తికులు అవమానాలపాలవుతున్నారు. నైతిక విలువలు సన్నగిల్లి కలికాలపు పోకడలు వీరవిహారం చేస్తున్నాయి. నారాయణుడు ఏం చేయడమా అని ఆలోచిస్తున్నాడు. మనకు కనిపించే దృశ్యమానమైన జగత్తు మాత్రమే సర్వం కాదు. ఈ పథ్వీప్రకృతి మండలానికి ఆవల సప్తావరణల మీదట, అప్రాకృతమైన, విలక్షణమైన పరమపావనమైన ప్రదేశం ఒకటుంది. ఆ దివ్యప్రదేశాన్ని శ్రీవైకుంఠమని అంటారు. అది క్షతిలేని నిత్యవిభూతి. అక్కడికి చేరిన జీవులకు మళ్లీ పుట్టుక ఉండదు. వారిని ముక్తులని అంటారు. అక్కడ నారాయణుని ప్రేమ వలె విరజానది అనునిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ముక్తజీవి ఆ నదిలోస్నానం చేస్తే ఆత్మకు అంటియున్న సూక్ష్మశరీరపు వాసనలన్నీ తొలగిపోయి దివ్యశరీరం వస్తుంది. అక్కడ ఇరమ్మదమనే సరస్సు, దాని ప్రక్కన అశ్వత్థ (రావి) వృక్షం కూడా ఉన్నాయి. అక్కడ ముక్తులతో పాటు నిత్యసూరులు ఉంటారు. నిత్యులు (నిత్యసూరులు) అంటే– నిరంతరం నారాయణుని సేవించే అనంతుడనే మహాసర్పము, గరుడుడు, విష్వక్సేనుడు మొదలైన వారు అక్కడ నివసిస్తుంటారు. నారాయణుడు శయనించినపుడు మెత్తని పరుపుగానూ, కూర్చున్నపుడు మంచి ఆసనంగానూ, హరి ప్రతికదలికకు అనుగుణంగా తనను తాను అనుగుణంగామార్చుకుంటూ ఉండే అనంతుడు అత్యంత ప్రియసేవకుడు. అంతులేనంతగా విస్తరించగల శక్తిమంతుడు కనుక ఆ మహాసర్పాన్ని అనంతుడని అంటారు. మొట్టమొదటి శేషుడు కనుక ఆదిశేషుడనీ అంటారు. త్రిలోకాలలో స్వామిని ఎక్కడికైనా తీసుకుని వెళ్లగల అద్భుతమైన సజీవ వాహనం గరుత్మంతుడు. అపారమైన విష్ణు గణాల సేనలకు సేనానాయకుడు, సేనానాథుడు విష్వక్సేనుడు. జీవులై సంసారబంధాల్లో చిక్కుకున్నా, భగవంతుడిని ఆరాధించి, హరి దివ్యానుభూతిని అనుభవించి, నారాయణుని అనుగ్రహంతో ముక్తిపొంది పరమపదం చేరి పరంధాముని సేవలో మునిగిపోయే అనేకమంది ముక్తులు వైకుంఠ వాసులు. చింతాక్రాంతుడైన శ్రీహరి ఆ వైకుంఠనగరిలో ఏముంటాయో, ఏ విధంగా ఉంటాయో చెప్పడం కష్టం. అదొక ఆనందవనం, ఆనంద నిలయం. అమృత సరస్సులు, మనోహరమైన ఉద్యానవనాలు, కాంతి పుంజాల తోరణాలు, నిర్మలమైన సుగంధ వాయువులు, అపురూపమైన ఫలవృక్షాలు, బంగారు మేడలు, రత్న ఖచిత ప్రాకారాలు, ఆలయాలు, మంటపాలు గోపురాలతో అలరారే సువిశాల ప్రదేశం. ఆ వైకుంఠంలో మణిమయమైన వేయి స్తంభాల మంటపంలో దివ్యచందన సుగంధాల మధ్య తనకు పరుపుగా అమరిన అనంతునిపై హరి శయనించి ఉన్నాడు ఆ హరి పసుపుపచ్చని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు (పీతాంబరుడు), ఓ పక్కన భూదేవి, మరో పక్క శ్రీదేవి ఉన్నారు. అతను నాలుగు చేతులలో శంఖ చక్ర గదాయుధాలు ధరించి మరో చేత పద్మం పట్టుకుని ఉంటాడని పురాణాలు వర్ణిస్తూ ఉంటాయి. ఆనందం తప్పమరేదీ ఉండని ఆ మహాలోకంలో నారాయణుడు ఉన్నా మనసులో విచారం హరి వదనంలో ప్రతిఫలిస్తున్నది. విచారవదనాన్ని గమనించి అనంతుడు. ఆ ‘‘ఏమిటి స్వామీ చింతాక్రాంతులైనారు?’’ అనడిగాడు. ఈ మానవులకు మంచికోసం ఇచ్చిన శరీరాన్ని బుద్ధిని మంచికి ఉపయోగించడం లేదే, ఇతరుల స్త్రీలను, సంపదలను హరించడానికి వినియోగిస్తున్నారే, పరమ స్వార్థపరులై పరమపదాన్నే మరిచారే అని హరి ఆలోచిస్తున్నాడు. ఆ విషయమే అనంతుడికి వివరించారు.హరి: దేహమే ఆత్మ అనుకునే అజ్ఞానులకు, బుద్ధి వక్రీకరించి దుర్మార్గంలో జీవించే మూఢులకు జ్ఞానోదయం కలించడం ఎలా అని మధనపడుతున్నాను.అనంత: సంభవామి యుగేయుగే అంటూ ధర్మసంస్థాపనకు సంభవిస్తారు కదా స్వామీ, మళ్లీ అవతరించే సమయం ఆసన్నమయినట్టున్నది కదాహరి: ఈసారి నేను కాదు, నీవు పుడమిలో అవతరించాలి. ఓ రెండొందల సంవత్సరాలు జీవులను ఉద్ధరించి మరలి రావాలి.అనంత: స్వామీ... మిమ్మల్ని విడిచి రెండు శతాబ్దాలా? అయినే నేనేం చేయగలను? రామావతారంలో లక్ష్మణుడిగా మీ వెంటే ఉన్నాను. మీరు శ్రీకృష్ణుడైనపుడు బలరాముడిగా కాపాడుకున్నాను. మీరు లేకుండా నేను భూమిపై నిలువలేను. మీరు లేకుండా మీవలె మహాయుద్ధాలు చేయగలనా? మీరు శంఖ చక్రగదాశార్ఞ ధరులు. నాకా ఏ ఆయుధాలూ లేవు. హరి: అనంతా, ఇప్పుడు యుద్ధాలతో పనిలేదు. ఆయుధాల అవసరమే లేదు. నీవు వేనోళ్లతో విజ్ఞానం పంచాలి. నీ వేయిపడగలతో ఆధ్యాత్మిక జ్ఞాన కాంతులు విరజిమ్మాలి, వైకుంఠానికి నిచ్చెనలు వేయాలి. పాపాత్ములను కడిగి పరమాత్మునివైపు నడిపించాలి. నీవే ఆచార్యుడివై వెళ్లాలి. బోధకుడవై సాధించాలి. నీకు జ్ఞానమే ఆయుధం. జీవులను పంచ సంస్కారములతో సంస్కరించు నాయనా. నారాయణుడికన్న గురువే గొప్పయని నీవు జీవించి చూపాలి. యాగాలు చేయాలని, కఠినమైన తపస్సులు చేయాలని కష్టాలు పెట్టకూడదు. భూరి దానాలు చేయాలనే సంక్లిష్ఠమైన నిర్బంధాలు, బాధలు ఏమీ లేకుండా శరణుతో సులభమైన తరుణోపాయములు నీవు చెప్పవలసి ఉంటుంది. ఆచార్యుని సేవతోనే జ్ఞాన సముపార్జనతోనే హరి లభిస్తాడని నీవు వివరించాల్సి ఉంటుంది. నా నిత్యవిభూతికి నీవెవరిని పంపినా కాదనను. నన్ను కాదని నిన్నాశ్రయించినా నాకు ఆనందమే. బద్దుడైన జీవిని బాగుచేయడానికి నీ మాట ఏదయినా నామాటే. నిన్ను కాదని నేనెవరకీ మోక్షమీయను, నీకిష్ఠుడే నాకిష్ఠుడు, నీ మాటే నామాట, నీమతమే నా మతము, నీ మంత్రమే నా మంత్రము, నీ ధ్యానమే నా ధ్యానం. నీకు నాకు మధ్య భేదమే లేదు. నిన్ను ఆశ్రయించిన వారి పక్షాన నీవు శరణాగతి చేసినా నాకు సమ్మతమే. నీవారు నావారనే భేదం చూపను.భవబంధాలలో చిక్కుకున్న ఈ బద్ధుడు ఏ విధంగానైనా బాగుపడితే ఇక నాకు కావలసిందేముంది? అని నారాయణుడు వివరించాడు.ఇది చాలా విశేషం. మోక్షాధికార ముద్రను హరి అనంతుడికి ఇచ్చారన్నమాట. అంటే అనంతుడి ఆజ్ఞలేకుండా మోక్షం ఎవరికీ దొరకదు. దీన్ని ఉభయ విభూతి నిర్వహణాధికారం అంటారు. విభూతిద్వయాధిపత్యంతో రామానుజుడై ఆదిశేషుడు అవతరించడానికి హరి ఆదేశించాడు.హరి ఆజ్ఞను అనంతుడు వేయిపడగలు వంచి శిరసావహించాడు. భూతపురి శ్రీ పెరుంబుదూర్ అది దక్షిణ భారతదేశంలోని శ్రీపెరుంబుదూరు. భూతపురమనీ, అరుణారణ్యము అనీ పిలుస్తారు. శంకరుడు దిగంబరుడై నాట్యం చేస్తూ ఉంటే భూతములు పరిహాసాస్పదంగా నవ్వినారట. శివుడు కోపించి అధోలోకంలోకి వారిని శాపగ్రస్తుల్ని చేసి తోసేసారట. శాపం నుంచి విముక్తి కోసం ఆ భూతములు ఈ అరుణారణ్య క్షేత్రంలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మిమ్మల్ని శివుడు అనుగ్రహిస్తాడని వరమిచ్చాడు.‘‘నేను ఇక్కడ నివసిస్తాను, ఈ ప్రాంతాన్ని నివాసయోగ్యమైన పురంగా నిర్మించండి’’అని ఆ భూతాలను హరి ఆదేశించాడు. భూతములు నిర్మించిన పురము కనుక దీనికి భూతపురమనే పేరు వచ్చింది. ఆదిశేషుడు రాబోయే కాలంలో అక్కడ అవతరిస్తారనే కాబోలు, మాధవుడు కేశవుడైవెలిసాడని ప్రతీతి.ఆసూరి కేశవసోమయాజి అనే శ్రీవైష్ణవస్వామి. యామునా చార్యుల శిష్యుడు శ్రీశైలపూర్ణుడు (తిరుమలనంబి). వీరి చెల్లెలు కాంతిమతిని ఆయన వివాహం చేసుకున్నారు. స్థిరమైన బుధ్ది, మితభాషణం, నిత్యానుసంధాన లక్షణాలతో అత్యంత నిష్ఠాగరిష్ఠులు కేశవ సోమయాజి. నీతిమంతుడు. అసత్యమాడడు. ఆయనకు నిరంతరం హరి నామస్మరణమే. కాని ఆ జంట సంతానంలేక పరితపిస్తున్నారు. నోములు వ్రతాలుచేస్తున్నారు. జపాలు తపాలు చేస్తున్నారు. పెద్దలు సూచిస్తే చంద్రగ్రహణ సమయంలో సముద్ర స్నానం చేశారు. ఆ తరువాత దానధర్మాలు చేశారు. పుత్రకామేష్ఠి చెన్నై(మద్రాస్) నగరంలో దివ్యదేశమైన తిరువళ్లికేన్ ఉంది. అక్కడ కైరవిణి పుష్కరిణిలో స్నానం చేశారు. అక్కడ వెలసిన పార్థసారథి పెరుమాళ్ కు పూజలు చేశారు. అక్కడే పుత్రకామేష్ఠి యాగాన్ని కూడా చేసినారు. పార్థుడికి గీత బోధించి జగద్గురువైన పార్థసారథి కరుణతో కేశవసోమయాజి కాంతిమతీ దంపతుల సంతానరూపంలో మరొక జగద్గురువు రాబోతున్న శుభ ఘడియలు అవి.దశరథుడి తరువాత పుత్రకామేష్ఠి యాగాన్ని కేశవసోమయాజులే చేసినట్టు కనిపిస్తుంది. పుత్రకామేష్ఠి యాగం తరువాత రాముడు జన్మించినట్టే, కాంతిమతీ కేశవులకు రామానుజుడు పింగళ నామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ పంచమి, గురువారం కర్కాటక లగ్నం మధ్యాహ్నం ఆర్ద్రా నక్షత్రంలో జన్మించినాడు. అది నవవసంతం.శ్లోకం: మేషార్ద్ర సంభవం, విష్ణోర్దర్శన స్థాపనోత్సుకం తుండీరమండలే శేషమూర్తిం రామానుజం భజే(అర్థం: మేషం ఆర్ద్ర నక్షత్రంలో పుట్టి, విష్ణువును చేరే మతాన్ని నిర్ధారించిన వాడైన రామానుజుడినే భజిస్తాను)కుమారుడు ఉదయించాడని కేశవ సోమయాజి ఆనందించి భూతపురములో ఇంటింటికీ చెరుకు ముక్కలు పంపించినాడు. తిరుమలలో నున్న తన బావమరిది శ్రీ శైల పూర్ణులకు పుత్రోదయ శుభవార్త పంపినాడు. వెంటనే శ్రీశైలపూర్ణులు పెరుంబుదూరు వచ్చి మేనల్లుడిని పరికించాడు. అతని అమితమైన తేజస్సులో మేనమామకు అద్భుతమైన భవిష్యత్తు దర్శనమైంది. గ్రహచార లక్షణాలను పరిశీలించాడు. ఇతను సామాన్యుడు కాడని శ్రీశైలపూర్ణుడు ఊహించాడు. చెవిదాకా విస్తరించిన కన్నులు...ఈతను కంటితోనే వింటాడా ఏమి? తల మీద విష్ణుపాదముల గుర్తుల వలె ఉన్నాయి. ఇది మహాసర్పలక్షణం. ఈతనెవరు? నమ్మాళ్వార్ చెప్పిన భవిష్యదాచార్యుడు ఇతడేనా? కన్నులు అశ్రుపూరితములైనాయి.‘‘ఏమిటన్నయ్యా అంతగా చూస్తున్నావు?’’... అంది కాంతిమతి. ‘‘కాంతిమతీ. నీ జన్మధన్యమైందమ్మా’’ అని మాత్రం అన్నాడు. మిగిలిన విషయాలు కాలాంతరంలో తెలుస్తాయన్న ఉద్దేశంతో. నామకరణం చేసే ఘడియ వచ్చింది. శ్రీశైలపూర్ణుల పైనే ఆ బాధ్యత పడింది. లక్ష్మణుడు జన్మించిన లగ్నంలో పుట్టినవాడు కనుక లక్ష్మణుడనీ, రామానుజుడనీ (రాముని తమ్ముడు) నామకరణం చేశారు. అదే సమయంలో మధురమంగళంలోని కాంతిమతి చెల్లెలు దీప్తిమతి, కమలనయనభట్టులకు పుత్రుడు జన్మించాడు. అతనికి మేనమామ గోవిందుడని నామకరణం చేశారు.ఒకరోజు బ్రహ్మోత్సవాలలో కేశవస్వామి రథం ఆసూరివారింటి ముందు ఆగింది. కాంతిమతీ కేశవసోమయాజి దంపతులు కర్పూర హారతి ఇచ్చి మంగళాశాసనం చేసినారు. తరువాత కదలవలసిన రథం ఎంతలాగినా కదలడం లేదు. కేశవస్వామి ఉత్సవమూర్తి ఆసూరి వారి ఇంటివైపు మరలి ఉంది. కేశవమూర్తి దంపతులకు ఈ మధ్యనే తేజోవంతుడైన పుత్రుడుదయించాడని తెలిసిన అర్చకులు రథం ఆగడంలో ఏదో మర్మముందనుకొని, ఆసూరిదంపతులతో మీ పుత్రుడిని కొనిరండని కోరారు. వారిని రామానుజుని తీసుకుని వచ్చి కేశవస్వామికి చూపిన స్వామి ఆశీస్సులు, అర్చకుల అక్షింతలు అందుకున్న తరువాత రథం కదిలింది. వైష్ణవస్వాములంతా ఆశ్చర్యపోయారు.స్వామి కూడా చూడాలనుకుంటున్నాడు, ఎవరీ బాలుడు శేషుడా లేక విష్వక్సేనుడా? అనుకున్నారు. ఊరేగింపు ముగిసిన తరువాత వచ్చి కొందరు ఈ బాలుడిని చూసారు. నిద్రలో బుసలు కొడుతున్నట్టు పడకలో కుండలిగా నున్నట్టు వారికి తోచింది. ఆ బాలుడికి దిష్టి తగులుతుందని తల్లికి భయం. మీరు ఈతడు మహర్జాతకుడని అందరికీ చెప్పకండి. మా అన్నకు పట్టిన పిచ్చి మీకూ పట్టినట్టుంది. మనమేం పుణ్యం చేసామని మనకు భగవంతుడో ఆతని సేవకుడో పుత్రుడై పుడతాడు? ఇవన్నీ అందరితో అంటూ నా కొడుక్కు దృష్టిదోషం తగిలేట్టు చేయకండి. నరుడి చూపుకు నల్ల రాయి కూడా పగులుతుందంటారు. అని కర్పూరంతో దిష్ఠి తీసిందాతల్లి. మిరపకాయల దిష్టి తీసి మంటలో వేస్తే పెళ పెళ లాడే చప్పుడుతో కాలిపోయాయి. ఈమె కూడా చిటచిట మెటికలు విరిచింది. చెడు చూపులు సోకుతాయని అలంకరించడం మానేసింది. ఓరోజు బాలుడు పాలు తాగకపోతే దిష్టి సోకడం వల్లనే అని ఆమె అనుమానం. మరోసారి బాలుడు పాలు తాగకపోతే ఏమిటా అని బాలుని తీసుకుని ఆరుబయట మంచిగాలిలో పక్కమీద పడుకోబెడితే కిలకిలమని నవ్వుతాడట. తల్లి చంకనుండి జరజరపాకుతూ సర్రున తలెత్తి చూస్తాడట. బోర్లపడి రొమ్ముతో పాకుతాడట. అతని అమితమైన తేజస్సులో మేనమామకు అద్భుతమైన భవిష్యత్తు దర్శనమైంది. గ్రహచార లక్షణాలను పరిశీలించాడు. ఇతను సామాన్యుడు కాడని శ్రీశైలపూర్ణుడు ఊహించాడు. చెవిదాకా విస్తరించిన కన్నులు... ఈతను కంటితోనే వింటాడా ఏమి? తల మీద విష్ణుపాదముల గుర్తుల వలె ఉన్నాయి. ఇది మహాసర్పలక్షణం. - ఆచార్య మాడభూషి శ్రీధర్ -
కాలం మింగిన నెమలిగుడ్డు
కథ పొద్దు ఇంకా పొడవక పోయినా.. అంతటా వెలుగు వ్యాపించిన ఉదయపు వేళ- గలగల పారుతున్న కొండవాగు వెన్నెల రాత్రి అనర్గళంగా కథలు చెప్పే బామ్మలా ఉంది. వాగుకు ఎగువన ఉన్న దట్టమైన అడవి మాత్రం ఎవరూ విప్పలేని పొడుపుకథలా ఉంది. వాగుకు పడమరన కొంచెం దూరంలో వనకన్యలు తీర్చిన బొమ్మల కొలువులా ఉంది ఆ పల్లె. డెబ్భయ్యోపడిలో ఉన్న వృద్ధుడూ, పాతికేళ్ళ వయసుండే యువకుడూ భుజాలపై తువాళ్ళతో వడివడిగా వాగు దిక్కుకు వస్తున్నారు. యువకుడు ఏదో చెపుతుంటే వింటున్న వృద్ధుడి ముఖంలో- విత్తూచేనూ, అదునూ పదునూ, నీరూసారం అన్నీ కుదిరి విరగపండిన పంటలా కుతూహలం. కథ చెపుతూ.. చెపుతూ బిగువు కోసమో, గుక్క తిప్పుకోవడానికో ఆగే బామ్మల్లాగే యువకుడు కొంతసేపు మౌనం వహించాడు. ‘‘చెప్పు.. చెప్పు.. అప్పుడేమైంది?’’ బామ్మ గడ్డం పట్టుకుని బలంగా తనవైపు తిప్పుకునే మనవడిలాగే.. ఆ వృద్ధుడు నడక ఆపి, యువకుడి భుజం పట్టి లాగాడు. తన ప్రశ్నకు జవాబిచ్చే వరకూ అడుగు ముందుకు వెయ్యనివ్వనన్నట్టు ‘‘మధ్యలో ఆపేశావేం.. చెప్పరా బాబూ! స్నానానికి తొందరేముంది గానీ, ముందు కథ పూర్తి చెయ్యి’’ అన్నాడు. యువకుడు మందహాసం చేస్తూ ‘‘తాతా! మరి అప్పుడేమైందంటే..’’ అని క థ కొనసాగిస్తూ మళ్ళీ నడక మొదలు పెట్టాడు. తండ్రి చెయ్యి పట్టుకుని, కళ్ళింతలు చేసుకుని తిరణాలలో వింతలు చూస్తున్న పిలగాడిలా వృద్ధుడు మనవడి చెయ్యి పట్టుకుని వెంట నడిచాడు. వాగు చేరే సరికి మనవడు చెపుతున్న కథ పూర్తయింది. ‘‘శభాష్‌రా.. మనవడా! కథల కనకయ్య మనవడివనిపించావ్. కాదు, కాదు.. నేనే గాథల గోవిందు తాతనని గొప్పగా చెప్పుకునేలా చేశావు. ఇన్నేళ్ళుగా కథలు చెపుతున్నాను.. వాటిలో ఏ ఒక్కటీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథకు ఆమడ దూరాన నిలవలేదురా. మనుషుల బతుకుల్లోని అన్ని రసాలనూ, అనుభూతులనూ, వాళ్ళ జీవితాల్లోని అనూహ్యమైన మలుపులనూ, వాళ్ళ మనసుల్లోని రాగాలనూ ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళెవరూ లేరన్నది ఈ వాగు పల్లానికి ప్రవహిస్తుందన్నంత నిఖార్సైన నిజం. ఉంటే గింటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ భగవంతుడే కావాలి’’ మనవడిని వాటేసుకుని మురిసిపోయాడు. స్నానం ముగించుకుని, వాగు ఒడ్డు ఎక్కుతున్న ఓ వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు : ‘‘ఏంటయ్యా.. తాతామనవలు మాంచి జోరు మీదున్నారు. కొత్త కథేమైనా కట్టారా.. ఏమిటి?’’ ‘‘ కథల కనకయ్యగా మీరంతా నన్ను మెచ్చుకుంటుంటారు. నిజం చెప్పాలంటే ఇంతవరకు నేను మీకు చెప్పిన కథలన్నీ వీడిప్పుడు నాకు చెప్పిన కథ ముందు- మహారణ్యం ముందు పెరటి మొక్కల్లాంటివే. నా బాటలోనే వీడూ కొన్నేళ్ళ నుంచి కథలు చెపుతున్నా, అవి నవరసాలతో నిండి ఉంటున్నా.. వీడిలో కల్పనాచాతుర్యం, వర్ణనా ప్రతిభ ఈ స్థాయిలో ఉన్నాయని నేనే ఊహించలేకపోయాను. వీడిప్పుడు చెప్పిన కథలో వసంతకాలంలో విరబూసిన వెయ్యి అరణ్యాల పరిమళాలున్నాయి. అంతకు మించిన వన్నెలున్నాయి’’ మెరిసే ముఖంతో మనవడిని చూస్తూ చెప్పుకుపోతున్నాడు కనకయ్య. ‘‘అదంతా సరే.. నీ మనవడు ఆ గొప్ప కథని ఆనక రచ్చబండ దగ్గర వినిపిస్తాడు కదా?’’ దుర్గయ్య అడిగాడు. ‘‘పొద్దుటిపూట కుదరదు దుర్గయ్యా! మా వాడికి పొలంలో తీరిక లేని పనుంది. ఊళ్ళో అందరికీ చెప్పు.. గోవిందు చెప్పే గొప్ప కథ వినాలంటే రాత్రికి రచ్చబండ దగ్గరకు రమ్మను’’ మురిసిపోతూ చెప్పాడు కనకయ్య. ‘‘వాడైతే పొలం వెళతాడు. మరి, నువ్వు చెప్పొచ్చుగా.. రాత్రి వరకూ ఆగడం ఎందుకు?’’ ‘‘అబ్బే.. అలా కుదరదు. వాడు కట్టిన గొప్ప కథ వాడి నోటి నుంచి వింటేనే మజా’’ అన్నాడు కనకయ్య. ‘‘అలాగే.. వాడి నోటి నుంచే వింటాంలే..’’ అంటూ దుర్గయ్య ఊరి దిక్కుకు నడిచాడు. తాతామనవలు వాగులో దిగారు. మీనాపురంలో రెండు వందల గడప ఉంటుంది. అమ్మవారి జాతరప్పుడూ, వేణుగోపాలస్వామి కళ్యాణమప్పుడూ ప్రదర్శించే నాటకాలూ, బుర్రకథలూ, తోలుబొమ్మలాటలూ, పర్వదినాల్లో హరికథలూ, మధ్య మధ్య కోలాటాలూ, భజనలూ, పురాణ కాలక్షేపాలూ, అప్పుడప్పుడూ సంచార జీవులైన జంగాలు చెప్పే కథలూ, పగటి వేషధారుల వేషాలూ.. ఇవే ఆ పల్లెలో వినోదాలు. అలాంటి పల్లెలో ఏడాది పొడవునా ఎండని వాగులా కనకయ్య కథాస్రవంతి అన్ని రుతువుల్లో కొనసాగుతూ ఉంటుంది. కథకుడిగా కనకయ్య ప్రస్థానం అతడి నూనూగు మీసాల ప్రాయంలో ప్రారంభమైంది. ఓరోజు అతడు పెద్దవాళ్ళతో కలిసి కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. బాగా తెలిసిన మనిషే అయినా ముఖానికి రంగు వేసుకుని, వైవిధ్యభరితమైన వస్త్రధారణతో రంగస్థలంపై అభినయిస్తున్నప్పుడు గుర్తించలేనట్టు-అడవి అతడికి నిత్యం కొత్త వన్నెలతో, కొత్త కవళికలతో అపరిచితంగా కనిపిస్తుంది. అడవిని తమకంతో చూస్తూ మిగిలిన వారికి ఎడంగా వెళ్ళిపోయిన కనకయ్య అది గుర్తించే సరికే చాలా దూరం వచ్చేశాడు. వాళ్ళ కోసం వెతికీ వెతికీ నీరసం రావడంతో ఓ చెట్టు నీడన పడుకున్న అతడికి గాఢంగా నిద్ర పట్టేసింది. నిద్రలో అతడికి అందమైన కలొచ్చింది. ఆ కలలో అతడు ముళ్ళను ఖాతరు చేయని గాలిలా ఆ కీకారణ్యంలో దట్టమైన పొదలలోకీ చొచ్చుకుపోయాడు. పులులపై స్వారీ చేశాడు. ఏనుగుల తొండాలపై ఊయలలూగాడు. గండభేరుండ పక్షి రెక్కలనెక్కి మబ్బుల్ని తాకాడు. చిత్రవిచిత్రమైన జంతువులు, పక్షులతో వాటి భాషలోనే సంభాషించాడు. మేలుకునే సరికి పొద్దు పడమటికి వాలవచ్చి అడవిలో వెలుగు క్రమంగా తరుగుతోంది. కల ఇచ్చిన ఆనందానుభూతితో కనకయ్య ముఖం మాత్రం పున్నమి వేళ తేట నింగిలో జాబిలిలా వెలిగిపోతోంది. తిరిగి తోటి వారిని చేరుకునేందుకు తోచిన దారిలో ముందుకు సాగాడు. చీకటి పడేలోగా వాళ్ళు కనబడకపోతే తన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కన్నా తన అనుభవాన్ని వాళ్ళకు చెప్పాలన్న ఆరాటమే అతడిలో అధికంగా ఉంది. కాసేపటికి వాళ్ళు తారసపడ్డారు. ‘‘ఇంతసేపూ ఎక్కడకు పోయావురా కనకయ్యా! నీ కోసం వెతకలేక చచ్చామనుకో!’’ వాళ్ళలో ఒకడు నిరసనగా అన్నాడు. కనకయ్యకు ఎందుకో కొంటెతనం వచ్చింది. ‘‘నేను పోవడమేమిటి.. వాళ్ళే నన్ను తీసుకు వెళ్ళారు’’ నిబ్బరంగా చెప్పాడు. ‘‘వాళ్ళెవర్రా?’’ ‘‘ఎవరేమిటి.. వనదేవతలు. వాళ్ళ ఇళ్ళకు తీసుకుపోయి ఎంత మర్యాద చేశారో తెలుసా..! ‘‘మరీ ఇంత ఆనబకాయ కోతలేంట్రా బాబూ!’’ మిగిలిన వాళ్ళు ఎకసెక్కెం చేశారు. ‘‘కోతలు కాదు.. నేను చెపుతున్నది జరిగిందే’’ ఏ మాత్రం తొణక్కుండా చెప్పాడు కనకయ్య. ‘‘సరే..సరే.. ఊళ్ళోకి పోతూ ఆ కథే చెపుదువు గానీ’’ అంటూ అందరూ కట్టెలమోపులు తలలకెత్తుకున్నారు. తనకొచ్చిన కలకు తన కల్పనాశక్తిని జోడించి, కలలోని దృశ్యాలన్నింటినీ గుదిగుచ్చి సుదీర్ఘమైన ఒకేకథగా మలచి చెప్పాడు కనకయ్య. విరుపులతో, నొక్కులతో, వర్ణనలతో, చిన్నిచిన్ని విరామాలతో కనకయ్య కథ చెపుతుంటే తమ తలలపైనున్నవి బరువైన కట్టెల మోపులు కాక పూలకిరీటాలన్నట్టు అలసట తెలియకుండా నడిచారు వాళ్ళంతా. కథ పూర్తయిందని కనకయ్య అన్న మరుక్షణం వాళ్ళందరిలో పెద్దవాడైన వ్యక్తి మోపును అమాంతం కింద పడేసి కనకయ్యను వాటేసుకున్నాడు. ‘‘ఒరే కనకయ్యా! ఎంత బాగా చెప్పావురా కథ. ఎక్కడ అబ్బిందిరా నీకీ కళ?’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ‘‘అదిగో మళ్ళీ కథ అంటావ్.. నేను జరిగిందే చెపుతున్నానన్నానా’’ రుసరుసలాడాడు కనకయ్య. ‘‘నువ్వు చెప్పింది నిజమేనని ఒప్పుకుంటాను. అది సరే గానీ.. ఇలా అడవికి వచ్చినప్పుడల్లా నువ్వు మాకో కథ చెప్పరాదటరా? పది పుట్ల కట్టెలైనా పూచికపుల్లల్లా మోసేస్తాం’’ పెద్దవ్యక్తి అడిగాడు. కనకయ్య కథన చాతుర్యం పల్లె పెద్దల చెవిన పడింది. గ్రామాధికారి నుంచి అతడికి కబురు వచ్చింది. ఓరోజు మధ్యాహ్నం రావిచెట్టు మొదలు చుట్టూ ఉన్న రచ్చబండపై గ్రామాధికారీ, పెద్దలూ కనకయ్యతో కథ చెప్పించుకున్నారు. అడవి నుంచి ఊరికి వచ్చే దారిలో తోటి వారికి చెప్పిన కథకే మరికొన్ని మలుపులు జోడించాడు కనకయ్య. అతడు కథ చెపుతున్నంతసేపూ- రచ్చబండ చుట్టూ అర ఎకరం విస్తీర్ణంలో పరుచుకున్న రావిచెట్టు నీడ నీడలా కాక హరివిల్లులా కనిపించింది వింటున్న వారందరికీ. ముగ్ధుడైన గ్రామాధికారి ‘‘ఇప్పటి నుంచీ వీడు ఉత్త కనకయ్య కాదురా.. కథల కనకయ్య’’ బిరుదు ప్రదానం చేసేశాడు. తాను చెప్పింది కథ అనడంపై పెద్దలతోనూ విభేదించాడు కనకయ్య. ఇప్పటికీ తాను తొలిసారి చెప్పింది కథ కాదు.. తన అనుభవమేనంటుంటాడు. తన మాటను పల్లెలో ఎవరూ నమ్మడం లేదని అతడికీ తెలుసు. అయినా అతడికి అదో ముచ్చట.. అలా అంటూనే ఉంటాడు. జనం కూడా దానికి తలూపుతూ అతడితో కొత్త కథలు చెప్పించుకుంటూనే ఉంటారు. అతడికి మనవడు గోవిందు తోడవడంతో పల్లెకు జంట కథకులు దక్కినట్టయింది. ఇప్పుడా పల్లె వారి బతుకులో- గాలిలో ప్రవహించే గుడిగంటల సవ్వడిలాగే, అడవి నుంచి ప్రసరించే సుగంధంలాగే, పల్లె జనుల దప్పిక తీర్చే తియ్యని వాగు నీటిలాగే తాతామనవల కథా కథనమూ భాగమైంది. తాతకు ‘కథల కనకయ్య’ బిరుదునిచ్చిన గ్రామాధికారే మనవడికి ‘గాథల గోవిందు’ అన్న బిరుదును ఇచ్చాడు. జనం చెవులారా జుర్రుకున్న నవరసభరితమైన వందలాది కథలు చెప్పిన తాతామనవళ్ళ జీవితంలో శోకమే ప్రధానరసమైంది. గోవిందుకు పదేళ్ళ వయసప్పుడు కుటుంబమంతా ఎడ్లబండిపై కొండకు అవతల నాలుగు క్రోసుల దూరంలో ఉన్న ఊళ్ళో బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి బయల్దేరారు. బండి కొండవాలు బాటలో వెళుతున్నప్పుడు కొండ పైనుంచి మృత్యువు ప్రయోగించిన ఫిరంగి గుండులా ఓ బండరాయి దొర్లుతూ వచ్చి బండి కాడిపై పడింది. బెదిరిన ఎడ్లు చిడత తాళ్ళు తెంపుకుని చెరోవైపూ దౌడు తీశాయి. గతి తప్పిన బండి లోయలోకి దొర్లింది. ఆ పాటుతో కనకయ్య భార్య, కొడుకు, కోడలు బండలకూ, చెట్ల కొమ్మలకూ కొట్టుకుని మరణించారు. గోవిందును ఒళ్ళో కూర్చోబెట్టుకుని బండి తోలుతున్న కనకయ్య మనవడితో సహా ఓ గుబురుపొదపై పడడంతో ప్రాణాలు దక్కాయి. నెత్తుటి ముద్దలుగా మారి, కసాయి దుకాణంలో కోసి వేలాడదీసిన మేకల్లా చెట్ల కొమ్మలకు వేలాడుతున్న తమ వాళ్ళను చూసి తాతామనవలు బండలు పగిలేంత బిగ్గరగా రోదించారు. పల్లె పల్లంతా కదిలి వచ్చింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కన్నీరు పెట్టుకున్నారు. వృద్ధులు తాతామనవళ్ళను అక్కున చేర్చుకున్నారు. ముగ్గురిని పోగొట్టుకున్న ఆ ఇద్దరికీ పల్లెలో అందరూ అయినవారేనని ఓదార్చారు. తాతామనవలు నెమ్మదిగా తేరుకుని పనిపాటుల్లో పడ్డారు. అప్పటి వరకూ పల్లెజనమే వాళ్ళ ఆలనాపాలనా చూశారు. పిడుగు పడ్డ మడుగులో కలువలు పూయనట్టు- జరిగిన ఘోరంతో కనకయ్య ఇక కథలు చెప్పలేడని అందరూ భావించారు. అయితే- చేలో పెరిగిన కలుపులా తన హృదయంలో అలముకున్న దుఃఖాన్ని పెకలించడానికి కథలనే పనిముట్టుగా వాడుకున్నాడు. ఉబికి వచ్చే కన్నీటిని తుడిచేందుకు తన కల్పననే దస్తీగా వినియోగించుకున్నాడు. తాత నుంచి కనుముక్కు తీరునే కాదు- కథన కౌశలాన్ని పుణికి పుచ్చుకున్నానన్నట్టు- కాలక్రమంలో గోవిందు కూడా కనకయ్యకు దీటుగా కథలు చెప్పనారంభించాడు. మధ్యాహ్నమైంది. కమ్మిన మబ్బుల వెనుక నుంచి మసకగా కనిపిస్తున్న సూర్యుడు ఎవరో దేవత కంటి నుంచి చెక్కిలి మీదకు జారి, అక్కడి నుంచి ఆమె చేలాంచలంపై రాలిన కన్నీటిబొట్టులా ఉన్నాడు. కనకయ్య పూరింటి అరుగుపై కొందరు వృద్ధులు చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. దుర్గయ్య కనకయ్యతో అన్నాడు : ‘‘మీ గోవిందు ఈరాత్రికి గొప్ప కథ చెప్పబోతున్నాడని నాకు కనిపించిన వాళ్ళందరికీ చెప్పేశాను. మిగిలిన అందరికీ చెప్పమని కూడా చెప్పాను. మీ వాడు పొలం పని చూసుకుని, రాత్రి బువ్వ తిని వచ్చేసరికే రచ్చబండ దగ్గర తిరణాలలాగే ఉంటుందనుకో’’ కనకయ్య ముఖంలో సంతోషం కదలాడింది. ఇంతలో దూరంగా కొందరు పొలాల వైపు నుంచి వడివడిగా రావడం కనిపించింది. మరికొంత దగ్గరకు వచ్చేసరికి వాళ్ళలో కొందరు ఓ మనిషిని చేతుల మీద మోసుకు వస్తున్నట్టు తెలిసింది. వాళ్ళు కనకయ్య ఇంటి ముందు ఆగి చేతుల మీద ఉన్న మనిషిని దించారు. అతడు గోవిందు. అప్పటికే అతడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. మోసుకు వచ్చిన వాళ్ళు దుఃఖిస్తూ విషయం చెప్పారు. మధ్యాహ్నం వరకూ పొలం పని చేసి అలసిన గోవిందు బువ్వ తిని, ఓ చెట్టు నీడలో విశ్రాంతిగా పడుకున్నాడు. అలసి ఉన్నాడేమో అలాగే నిద్ర పట్టేసింది. ఆ సమయంలో పక్కనున్న పుట్టలోంచి తాచుపాము బయటకు వచ్చింది. నిద్రలో ఎలా కదిలాడో, ఏమైందో పాము గోవిందుని కాటేసింది. మెలకువ వచ్చిన గోవిందు కేకలు వేయడంతో పక్క పొలాల్లోని వారు వచ్చారు. అతడిని ఊళ్ళోకి మోసుకు వస్తుంటే దారిలోనే ప్రాణం గాలిలో కలిసిపోయింది. చీకటి పడ్డాక పల్లెవాసులను రంగురంగుల ఊహల్లో ముంచెత్తే కథను చెపుతాడనుకున్న గోవిందు నోటి నుంచి తెల్లని నురగ వస్తోంది. వాకిట పడి ఉన్న మనవడి శవాన్ని చూస్తూ కనకయ్య హృదయం దుఃఖాన్నీ, కన్నులు చెమ్మనూ, పెదవులు రోదననూ కోల్పోయినట్టు శిలలా ఉండిపోయాడు. గోవిందు మృతదేహాన్ని చూసిన దుర్గయ్యకు రివాజుకు విరుద్ధంగా చిన్నపిల్లల కథకు చేదు ముగింపునిచ్చినట్టు అనిపించింది. గోవిందు పెద్దకర్మ నాడు ఆ తతంగమంతా ముగిశాక దుర్గయ్యతో చెప్పాడు కనకయ్య : ‘‘నా మనవడు చెప్పకుండానే వెళ్ళిపోయిన కథను ఈరాత్రికి నేను చెపుతాను. పల్లెలో అందరికీ చెప్పు’’ ‘‘ఇప్పుడెందుకులే కనకయ్యా! తర్వాత చెపుదువు గానిలే!’’ వారించాడు దుర్గయ్య. ‘‘లేదు.. ఆ కథ ను నేను ఈరోజే చెపుతాను’’ దృఢ నిశ్చయంతో అన్నాడు కనకయ్య. ‘‘సరే’’ అన్నాడు దుర్గయ్య. ఆ రాత్రి పున్నమి. చకచక కదిలే మబ్బుల నడుమ బిరబిరా సాగుతున్న జాబిలి మీనాపురం రచ్చబండను చేరుకోవాలని ఆరాటపడుతున్నట్టుంది. రచ్చబండ రావిచెట్టు- కనకయ్య చెప్పనున్న గోవిందు కథను ఆలకించడానికి భూమాత రిక్కించిన చెవిలా ఉంది. ఊయలల్లోని బిడ్డలను ఎత్తుకున్న తల్లుల నుంచి అడుగు వేయడానికి శక్తి చాలని వృద్ధుల వరకూ పల్లె అంతా రచ్చబండను చేరుకుంది. పైలోకాలకు చేరిన గోవిందు నవ్వు తునకల్లా- రావిచెట్టు సందుల్లోంచి వెన్నెల తరగలు రచ్చబండ మీదున్న కనకయ్యను తాకుతున్నాయి. గొంతు సవరించుకుంటూ మొదలు పెట్టాడు కనకయ్య. ‘‘నా మనవడు కట్టిన ఈ కథతో నా జీవితంలో నేను కట్టిన కథలన్నీ కలిపినా తూగవు. ఇంతకాలం మా కథలు విని ఆనందిస్తున్న మీరు ఈ కథనూ విని సంతోషిస్తేనే వాడి ఆత్మ శాంతిస్తుంది. ఇక కథ మొదలు పెడతాను..’’ అంటూనే.. చెట్టు నుంచి పండు రాలినట్టు రచ్చబండ అంచు నుంచి దబ్బున కిందకు కుప్పకూలిపోయాడు. జనంలో రేగిన కలకలానికి చెట్టుపైనున్న గూళ్ళలోని పక్షులు బిలబిలా ఎగిరిపోయినట్టే కనకయ్య ప్రాణం గాలిలో కలిసిపోయింది. జనం కనుకొలుకు ల్లోంచి రాలిన నీటిబొట్లు నేలలో ఇంకిపోయాయి. గోవిందు కనకయ్యకు చెప్పిన కథ, కనకయ్య నుంచి ఇంకెవరూ వినలేకపోయిన కథ- కొండచిలువ మింగిన నెమలిగుడ్డులా కాలగర్భంలో కలిసిపోయింది. విశ్వరహస్యం లాంటి శాశ్వత అజ్ఞాతంలా మిగిలిపోయింది. - యు.సూర్యచంద్రరావు (వి-రాగి) -
కలర్.. ఫుల్
- గోవా నుంచి యథేచ్ఛగా దిగుమతి - స్పిరిట్‌కు రంగు కలిపి మద్యం కలరింగ్ - ట్యాంకర్ల కొద్దీ కర్నూలు జిల్లాకు తరలింపు - సహకరిస్తున్న అధికార పార్టీ నేతలు - బెల్టు షాపుల ద్వారా భారీగా విక్రయాలు కర్నూలు : మందుబాబుల ఆరోగ్యంతో అధికార పార్టీ దందా చేస్తోంది. కుటుంబాల్లో చీకటి మిగిల్చే నకిలీ మద్యం జిల్లాను ముంచెత్తుతోంది. ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ బాగోతంలో నాయకులు గ్రూపులను కూడా పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. పర్యవేక్షించాల్సిన శాఖ మామూళ్ల మత్తులో జోగుతుండటం.. మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు అధికార టీడీపీ నేతలే కావడం.. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తుందోననే ఆందోళనకు తావిస్తోంది. జిల్లాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న నకిలీ మద్యం వెనుక అసలు సూత్రధారి కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేగా తెలుస్తోంది. గోవా నుంచి భారీగా నకిలీ మద్యాన్ని కడప జిల్లాలోకి తెచ్చి దర్జాగా కర్నూలుకు ట్యాంకర్ల ద్వారా డంప్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందుకు జిల్లాలోని అధికార పార్టీ నేతలు సహకరిస్తూ బెల్టు షాపుల ద్వారా విక్రయిస్తున్నట్లు సమాచారం. గోవా నుంచి భారీగా నకిలీ మద్యాన్ని తీసుకుని వస్తున్న సదరు ఎమ్మెల్యే.. జిల్లాలోని టీడీపీ నేతలతో సంబంధాలు పెట్టుకుని దర్జాగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా వచ్చిన నకిలీ మద్యాన్ని(స్పిరిట్) ఇక్కడున్న అధికార పార్టీ నేతలు బ్రాండ్ మద్యంగా బెల్టుషాపుల ద్వారా మందుబాబులకు అంటగడుతున్నారు. గోవా టు కర్నూలు వయా కడప గోవా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు నకిలీ మద్యానికి వివిధ రంగులు కలుపుతూ అసలు మద్యానికి దీటుగా తయారు చేస్తున్నారు. ఈ నకిలీ మద్యం ట్యాంకర్లలో దర్జాగా జిల్లాలోకి వస్తోంది. ఇక్కడి అధికార పార్టీ నేతలు ఈ స్పిరిట్‌ను అసలు మద్యం సీసాలను పోలిన సీసాల్లో నింపి బెల్టు షాపులకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రొద్దుటూరు నుంచి ప్రత్యేకంగా టీంలను కూడా రప్పిస్తున్నారు. ప్రధానంగా ఆళ్లగడ్డ కేంద్రంగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. వాస్తవానికి గతంలో గోవా నుంచి కర్ణాటకకు తెచ్చుకుంటూ అక్కడ కలర్‌ను కలిపి అసలు మద్యాన్ని తలపించేలా సిద్ధం చేసేవారు. అక్కడి నుంచి సులభంగా కర్ణాటక బోర్డర్లోని గ్రామాలకు సరఫరా అయ్యేది. అయితే, గతంలో ఒకసారి డోన్ సమీపంలో నకిలీ మద్యం దొరకగా అధికార పార్టీ నేతలు ఇరుక్కున్నారు. దీంతో రూటు మార్చి ఇప్పుడు గోవా నుంచి కర్నూలు వయా కడప మీదుగా దందా సాగుతోంది. ఈ మొత్తం దందాలో అధికార పార్టీ నేతలు తమ గ్రూపులను మరిచి మరీ వ్యాపారం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డలో వరుస ఘటనలు.. వాస్తవానికి ఆళ్లగడ్డలో వరుసగా నకిలీ మద్యం దొరుకుతోంది. కేవలం ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది కూడా ప్రధాన కార్యాలయంలోని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ వచ్చి దాడులు చేస్తేనే నకిలీ మద్యాన్ని పట్టుకునే పరిస్థితి ఉంది. జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీరికి ఈ నకిలీ మద్యం మాఫియా నుంచి భారీగా మామూళ్లు ముడుతుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ఆళ్లగడ్డలో లక్ష్మీ వెంకటేశ్వర వైన్స్‌లో కల్తీ చేస్తుంటే పట్టుకుని సీజ్ చేశారు. మరోసారి ఇదే ఆళ్లగడ్డలో ఏకంగా నకిలీ మద్యాన్ని తయారుచేస్తుంటే దాడులు చేసి పట్టుకున్నారు. ఇప్పుడు కూడా తాజాగా ఆళ్లగడ్డలోని సూర్యవైన్స్లో కూడా ఈ తరహాలోనే నకిలీ మద్యం విక్రయిస్తూ దొరికిపోయారు. అయినప్పటికీ జిల్లాలోని ఎక్సైజ్ అధికారులకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీలోని నేతలందరూ తమ గ్రూపు తగాదాలను పక్కనపెట్టి మరీ ఇప్పుడు కల్తీ మద్యం తయారీలో బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. -
మరణం తర్వాత ఆత్మ ...?
నచికేతోపాఖ్యానం కఠోపనిషత్తులో నచికేతోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. అందులో నచికేతు అడిగిన మూడవ ప్రశ్నకు యముని సమాధానం ఈ వారం. నాయనా! నచికేతా! ఆత్మను గురించి ఒక అవగాహన ఏర్పడితే నువ్వు అడిగిన మూడోప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని విను. నిరాకారమై విశ్వమంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మం తపస్సు చేత కేంద్రీకృతమై ఒక భౌతికరూపాన్ని పొందుతూ ఉంటుంది. తపస్సు కంటె ముందు కూడా అది ఉంది. పరబ్రహ్మం స్త్రీ పురుష విభాగాలకు అతీతమైనది కనుక ‘అది’ అంటాను. తెలుసుకో. సృష్టిలో ముందుగా భౌతికరూపాన్ని పొందిన నీటికి ముందు కూడా అది ఉంది. హృదయ కుహరంలో పంచభూతాత్మకంగా ఉన్న ఆత్మను తెలుసుకోలిగిన వాడు పరబ్రహ్మాన్ని చూడగలుగుతాడు. ఇదే ఆత్మ. పంచభూతాలతో సృష్టించబడిన ప్రాణంలో ఉంటూ, హృదయంలో స్థిరనివాసం చేసే ఆత్మను తెలుసుకొంటే పరమాత్మను తెలుసుకున్నట్టే. కడుపులో ఉన్న శిశువు తల్లిచే జాగ్రత్తగా సురక్షితంగా పోషించబడినట్టు మండే సమిధలలో ఉన్న అగ్ని రూపంలో ఉన్న ఆత్మయజ్ఞకర్తలతో నిత్యం రక్షించబడుతుంది. ఇది తెలుసుకో. సూర్యుడు ఉదయించడానికీ అస్తమించడానికీ కేంద్రం ఆకాశం. దానిలోనే దేవతలు అందరూ ఉన్నారు. ఎవరూ దానిని దాటిపోలేరు. ఇదే ఆత్మ అని తెలుసుకో. నీకంటికి ప్రత్యక్షంగా కనపడేది అంతా కనపడని పరబ్రహ్మంలో ఉంది.కనపబడని పరబ్రహ్మం నీకు కనపడే అన్నిటిలోనూ ఉంది. ఇది తెలుసుకోకుండా అదివేరు ఇది వేరు అని భ్రమపడే వారికి సత్యదర్శనం అయ్యేవరకూ జననమరణాలు తప్పవు. నచికేతా! నిరాకార పరబ్రహ్మం పంచభూతాలు (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం)గా సాకారమైంది. వాటి సమ్మేళనంతో వివిధ ప్రాణుల రూపాలను పొందింది. వాటిలో నిరాకారమైన మనస్సుగా వాటిని నడిపిస్తోంది. కనుక మనసుతోనే ఆత్మను తెలుసుకోవాలి. అప్పుడే నీకు భేదభావం నశిస్తోంది. ఆత్మసాక్షాత్కారం అవుతుంది. భిన్నత నుంచి బయటపడనంత వరకు చావు పుట్టుకలు తప్పవు. ‘అంగుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి’ బొటనవేలంత పురుషుడు (పరబ్రహ్మం) ప్రాణుల శరీరంలో ఉంటాడు. బుద్ధిగల జీవి అయిన మానవుడు ఈ విషయాన్ని తెలుసుకుంటే దేనికీ భయపడడు. అసహ్యించుకోడు. అంగుష్ఠమాత్ర పురుషుడే భూత, భవిష్యత్, వర్తమానాలకు అధిపతి. పొగలేని అగ్నిలా ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. అదే ఆత్మ అని తెలుసుకో. గౌతమవంశీయా! చావుపుట్టుకలు, వక్రతలు లేకుండా ఉండే ఆత్మ పదకొండు ద్వారాలు ఉన్న నగరంలో ఉంటుంది. (అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం పదకొండు). ఆ ఆత్మను తెలుసుకొన్నవారికి దుఃఖం ఉండదు. అన్ని బాధలనుంచి విముక్తుడు అవుతాడు. అంతరిక్షంలోని సూర్యుడు, ఆకాశంలోని వాయువు, యజ్ఞకుండంలోని అగ్ని, పాత్రలోని సోమరసం అన్నీ ఆత్మయే. మానవుల్లో, దేవతల్లో, ఆకాశంలో, యజ్ఞంలో, నీటిలో, నేలమీద, తపస్సులో, కొండల్లో అంతటా ఉండేది, పుట్టేది ఆత్మయే. అదే సత్యం. అదే సమగ్రం. నాయనా! ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనే అయిదు వాయువులకు ఆత్మ మధ్యలో ఉండి నడిపిస్తుంది. ప్రాణవాయువును పైకి, అపానాన్ని కిందికీ ఇలా పంపే ఆత్మను సమస్తదేవతలూ పూజిస్తూ ఉంటారు. శరీరంలో నివసించే ఆత్మ శరీరాన్ని విడిచిపోయాక అక్కడ ఏమీ మిగలదు. ప్రాణ, అపానాది వాయువులలో మానవుడు జీవిస్తున్నట్టు కనిపిస్తున్నా అవి సత్యం కాదు. వాటిని నడిపిస్తున్న ఆత్మతో జీవిస్తున్నాడు. ఆత్మ పరిశోధనలో ఈ దశ దాటిన నీకు అతి రహస్యమూ, సనాతనమూ అయిన పరబ్రహ్మను గురించి వివరిస్తాను. మరణం తరువాత ఆత్మ ఏమవుతుంది అనే నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను. శ్రద్ధగా విను. శరీరంలో ఉన్న ఆత్మ జీవాత్మ. శరీరాన్ని విడిచిన జీవాత్మ ఆ శరీరంతో చేసిన కర్మలను బట్టీ, సంపాదించిన జ్ఞానాన్ని బట్టీ మళ్లీ శరీరాన్ని పొందుతుంది. దానికోసం ఆయా మాతృగర్భాలలో ప్రవేశిస్తుంది. కదలికలు, అవయవాలు గల జంగమ ప్రాణుల్లోకి, అవి లేని స్థావరాలైన చెట్లు, కొండలు వంటి వాటిల్లోకీ కూడా జీవాత్మ రూపాంతరం చెందుతుంది. (వచ్చేవారంతో కఠోపనిషత్తు పూర్తవుతుంది) - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులలో ప్రసిద్ధమైన శాంతిమంత్రం ఓం శం నో మిత్ర శ్శం వరుణ ః శంనో భవత్వర్యమా! శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణు రురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామ్ అవతు వక్తారమ్ ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః పరబ్రహ్మమా! సూర్యుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, బృహ స్పతి, విష్ణువు, బ్రహ్మ, వాయువు నాకు శుభాలను ఇచ్చెదరు గాక! నువ్వే ప్రత్యక్షమైన బ్రహ్మానివి. నిన్నే ప్రత్యక్ష బ్రహ్మస్వరూపంగా చెబుతున్నాను. స్పష్టంగా, సత్యం చెబుతున్నాను. ఆ విజ్ఞానం నన్ను రక్షించుగాక! దానిని బోధించువారిని రక్షించుగాక! నన్ను, చెప్పిన గురువును రక్షించుగాక! -
రాజ్యాంగ స్ఫూర్తికి కోర్టు రక్ష
సమకాలీనం శాసన వ్యవస్థలపరంగా ఎవరు చర్య తీసుకున్నా, అది నిబంధనల ప్రకారం చట్టాలకు లోబడి, రాజ్యాంగబద్దంగా ఉండాలి. ఏపీ శాసనసభలో అందుకు భిన్నంగా జరిగింది. నిబంధనల్ని ఉల్లంఘించడమేగాక, సహజ న్యాయ సూత్రాలకు భంగం కలిగిస్తూ ఏక పక్షంగా సభ్యురాల్ని సస్పెండ్ చేశారని కోర్టు గుర్తించింది. అవతలి వాళ్లకు ఏమీ తెలి యదు, మాకే అన్నీ తెలుసు, మేం ఏం చెబితే అదే రూలు, చట్టం, రాజ్యాంగం’ అన్న మితి మీరినతనమే ఇందుకు కారణమని అధికార పార్టీలోని విజ్ఞులు తలలు పట్టుకుంటున్నారు. స్పీకర్ మా మనిషే! పాలకపక్షంగా చట్టసభను మా ఇష్టానుసారం నడుపు కుంటాం. రూల్స్ గీల్స్ జాన్తా నహీ! రాజ్యాంగమూ....! దానికో ఆత్మనా! అదెక్కడ?’ అన్న అధికార పక్షాల విపరీత ధోరణి నడవదని గురువారం రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు స్పష్టం చేశాయి. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నడుస్తున్న, దాన్ని నడిపిస్తున్న తీరుకు ఈ ఆదేశాలు చెంప పెట్టులాంటివి. జరిగిన పరిణామాలపై ఉన్నత న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యల్ని... ఈ ఒక్క కేసు దృక్కోణంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో, కేం ద్రంలో ఇప్పుడు చట్టసభలు నడుస్తున్న తీరుతెన్నులకు, వ్యవహారాలకు అన్వ యించి చూస్తే ఈ వ్యాఖ్యలు సందర్భోచితమైనవే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజాను ఏకపక్షంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది. సస్పెన్షన్ విధించే ముందు పాటించాల్సిన నిబంధనల్ని ఉల్లంఘించడమే కాక, సహజ న్యాయ సూత్రాలకూ తిలోదకాలిచ్చినట్టు న్యాయస్థానం భావించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో రోజా శాసనసభకు హాజరు కావడానికి ఉన్న ప్రతిబంధకం తొలగిపోయింది. అయితే, ఇంకా చాలా చాలా సందేహాలు తొలగాల్సి ఉంది. సభా నిర్వహణకు, న్యాయ సమీక్షకు సంబంధించి ఇంకొంత స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ల నాన్చివేత వైఖరిలోని ఔచిత్యాన్ని తేల్చాల్సి ఉంది. అధికారపక్షం వ్యవహార శైలి మారాల్సి ఉంది. తాజా పరిణా మంతోనైనా ప్రభుత్వ పెద్దలు విజ్ఞత ప్రదర్శించి, తీరు మార్చుకుంటారేమో చూడాలి. శాసన సభాపతిగా ఉన్న వ్యక్తి పాలకపక్షం కనుసన్నల్లో సభా కార్యకలాపాల్ని నడపడం గాక, నిష్పక్షపాతంగా వ్యవహరించగలరేమో వేచి చూడాలి. ఏపీ శాసనసభలో బాహాటంగానే వివక్ష, ఏకపక్ష దుందుడుకుతనం యథేచ్ఛగా సాగుతున్న క్రమంలో తాజా తీర్పుకు అత్యంత ప్రాధాన్యము న్నదని పరిశీలకుల భావన. నేటి రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులే కాక, ఇదే విషయమై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడెంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే స్ఫూర్తి కొనసాగితే చట్టసభల నిర్వహణలో బాధ్యత, జవాబుదారీతనం పెరగటమే కాదు, ప్రజల్లో న్యాయస్థానాలపై నమ్మకం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం బలపడతాయి. ఇంత జరిగితే గాని..... రోజా న్యాయ పోరాటం సాగించారు కనుక ఈ పాటి న్యాయమైనా జరిగింది. రోజా సుప్రీం తలుపులు తడితే, వారిచ్చిన ఆదేశాల మేరకు... ముందు స్పం దించని హైకోర్టు ఇప్పుడు విచారణ జరపడం వల్ల ఈ ఉత్తర్వులొచ్చాయి. ఆమెకు తగిన శాస్తి జరిగిందన్నారు. ఇంకా జరగాలన్నారు. ఈ ఏడాది కాలం పాటు జీతభత్యాలు కూడా ఉండవన్నారు. అసెంబ్లీ ప్రాంగణానికి రానిచ్చేది లేదన్నారు. అందులోనే ఉన్న పార్టీ శాసనసభా కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. సభలో ముఖ్యమంత్రిపై అనుచితవ్యాఖ్యలు చేశారన్నది ఆమెపై అభియోగం. ఏ పరిస్థితుల్లో తానా మాటలన్నానో వివరణ ఇచ్చుకునే అవకాశమైనా ఆమెకు ఇవ్వకుండా చర్య తీసుకున్నారు. పైగా, ఇది క్రమశిక్షణా చర్య కాదు, సస్పెన్షన్ మాత్రమే కనుక వివరణ తీసుకోవాల్సిన అవసరం రాలేదని న్యాయస్థానం ముందు పిడివాదం చేశారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోంది, తదనంతరమే తగిన చర్య అన్నది కవిహృదయం! శాసనసభ నిబంధన 340 (2) కింద తీర్మానం ప్రతిపాదించి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. నిజానికా నిబంధన కింద, గరిష్టంగా ఆ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేసే అధికారమే ఉంటుంది. ఇక్కడే నియమో ల్లంఘన జరిగిందని రోజా కోర్టులో సవాల్ చేశారు. నిబంధనలకు అతీతంగా సభకు, స్పీకర్‌కు విస్తృతాధికారం ఉంటుందనే మొండి వాదనను, ఈ పరిణా మాలు చోటుచేసుకున్న 2015 డిసెంబరు 18న పాలకపక్షం సభలో వినిపించే యత్నం చేసింది. అది సరి కాదు, గతంలో ఇలా ఒక సభ్యుడ్ని సెషన్ పరిధికి దాటి సస్పెండ్ చేయాల్సి వచ్చినపుడు, అందుకు అవరోధంగా ఉన్న ఇదే నిబంధన 340 (2)ను సస్పెండ్ చేసి, ఆ పైనే స్పీకర్ విస్తృతాధికారాల్ని ప్రయోగించారని చేసిన సూచనని కూడా వారు పట్టించుకోలేదు. అవతలి వాళ్లకు ఏమీ తెలియదు, మాకే అన్నీ తెలుసు, మేం ఏం చెబితే అదే... రూలు, చట్టం, రాజ్యాంగం’ అన్నట్టు వ్యవహరించే మితిమీరినతనమే ఈ పరిస్థితికి కారణమని పార్టీలోని విజ్ఞులూ తలపట్టుకుంటున్నారు. హైకోర్టు ముందు భిన్నమైన వాదన వినిపించే ప్రయత్నం చేసి భంగపడ్డారు. మంత్రి తెలియక నిబంధనను తప్పుగా ప్రస్తావించార’న్న అదనపు అడ్వొకేట్ జనరల్ వాద నను న్యాయమూర్తి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. సదరు మంత్రి లోగడ స్పీకర్‌గా పని చేసినందున ఏ నిబంధన ఎప్పుడు ఉపయోగించాలో తెలియదని చెప్పడానికి వీల్లేదనీ స్పష్టం చేశారు. పిల్లలాటా! రాజ్యాంగ స్ఫూర్తి అక్కర్లేదా...? అడ్డొస్తుందంటే చాలు... సదరు నిబంధనను సస్పెండ్ చేసెయ్ అన్న ధోరణి ప్రజాస్వామ్య పద్ధతి కాదు సరికదా, విచ్చలవిడితనానికి ప్రతీక! రాజ్యాంగ స్ఫూర్తినేగాక, రాజ్యాంగం నిర్దేశించే విధివిధానాల్ని యధాతథంగా ప్రతిబింబి స్తున్న నిబంధనను కూడా ఇదే ముఖ్యులు, ఇదే అసెంబ్లీ, ఇదే సెషన్లో ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చి నపుడు, అది అర్హమైనదైతే... నోటీసు అందిన 14 రోజుల తర్వాత మాత్రమే చర్చకు తేదీని ఖరారు చేయాలని శాసనసభ నిబంధన 71(1) చెబుతోంది. పాలకపక్షం రాజకీయ స్వప్రయోజనాల కోసం, విపక్ష ప్రయోజనాల్ని దెబ్బతీ యడానికి ‘మా ఇష్టం.. సదరు నిబంధనను తొలగించేస్తాం!’అంటే ఎలా? రాజ్యాంగంలోని అధికరణం-179, అందులో విస్పష్టంగా పేర్కొన్న స్ఫూర్తి ఏం కావాలి? మంద బలం ఉందని నిబంధనల్ని అడ్డగోలుగా సస్పెండ్ చేస్తూ, తమకనువైనదే నిబంధన అన్నట్టు ఏపీ శాసనసభ అధికార పక్షం వ్యవ హరించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘పద్నాలుగు రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలన్నారే తప్ప, విధిగా పద్నాలుగు రోజుల తర్వాతే చర్చ చేపట్టా లనలేదు, కనుక చర్చ ఎప్పుడైనా చేపట్టొచ్చు’ అన్న మంత్రి విచిత్ర అన్వయం అసెంబ్లీ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంది. విపక్షం తన సభ్యులకు అందేలా విప్ జారీ చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి కల్పించే ఎత్తుగడతో పాలకపక్షం అడ్డగోలుగా వ్యవహరించడాన్ని ప్రజలు గమనించారు. స్పీకర్ విస్తృతాధికారాలు వినియో గించడానికి ప్రతిబంధకమని తెలిసీ ఒక నిబంధనను సస్పెండ్ చేయక పోవడమైనా, ఓ నిబంధనను సస్పెండ్ చేయడమైనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిసీ అందుకు పూనుకోవడం... తామేమైనా చేయొచ్చన్న అహం భావ ప్రదర్శనే తప్ప మరొకటి కాదు. సభా దినాల్ని, కార్యకలాపాల్ని నిర్ణ యించడం నుంచి సభ ముగించే వరకు ఇంత యథేచ్ఛగా నిబంధనలకి, సంప్రదాయాలకు, ప్రజాస్వామ్య స్పూర్తికి నీళ్లొదలడం గతంలో ఎప్పుడూ లేదు. ఇదే సెషన్లో, వాతావరణం అనుకూలంగా లేదనగానే గవర్నర్ ప్రసం గానికి ధన్యవాదాలు తెలిపే చర్చను కూడా అర్థంతరంగా ఆపి ‘క్లోజర్ మోషన్’ను (నిబంధన-329) తెర మీదకు తేవడం ఒక ఉదాహరణ మాత్రమే. విపక్షం లేవనెత్తిన అనేకానేక అంశాలకు సమాధానమిచ్చే అవకా శాన్ని వదులుకొని, ఆ చర్చకు ముఖ్యమంత్రి సమాధానం కూడా ఇవ్వని అరుదైన పరిస్థితి! అటువంటిదే అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగింపు. ఏ ఒక్క సభ్యుడు అభ్యంతర పెట్టినా, మూజువాణి ఓటింగ్ కన్నా మెరుగైన ఫలితాలిచ్చే తలలు లెక్కించే ఓటింగ్‌కు వెళ్లాలన్న నిబంధనను గాలికొదిలే శారు. తమకు అనుకూలంగా ఉండటం కోసం ‘మమ’ అనిపించారు. ఎవరి అధికారాలు-పరిమితులు వారికున్నాయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని శాసన, న్యాయ వ్యవస్థల మధ్య పోరుగా అన్వయించడానికి కొందరు యత్నిస్తారు. స్పీకర్, చట్టసభ నిర్ణ యాల్లో న్యాయస్థానాల అనుచిత జోక్యమని అన్వయించే ఆస్కారమూ ఉంది. కానీ, ఎవరి అధికారాల పరిధిని, పరిమితుల హద్దును వారికి నిర్దేశించే స్పష్టత రాజ్యాంగంలో ఉంది. చట్టసభల సభ్యులు నిబంధనల్ని ఉల్లంఘిం చినపుడు, అనుచిత ప్రవర్తనతో తప్పు చేసినపుడు చర్యలు తీసుకునే అధికారం శాసనవ్యవస్థకే ఉంది. అందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవా ల్సిన అవసరమే లేదు. ఈ విషయమై లోగడ వివాదాలొచ్చినపుడు కొన్ని అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని కోర్టులు స్పష్టం చేశాయి. అలాగే సముచితమైన కొన్ని సందర్భాల్లో విచారించి, తీర్పులిచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ వంటి వారు న్యాయ వ్యవస్థ అనుచిత జోక్యాలను సమర్థంగా అడ్డుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే, శాసన వ్యవస్థల పరంగా ఎవరు చర్య తీసుకున్నా, సదరు చర్య నిబంధనల ప్రకారం చట్టాలకు లోబడి, రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నదే ముఖ్యం. చట్ట సభల కార్యాకలాపాల్ని తాము నిర్దేశించలేమని స్పష్టం చేసే న్యాయస్థానాలు, సదరు సభల్లో నిర్ణయాలు జరిగాక, అవి నిబంధనలకు, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించిన సందర్భాలు కోకొల్లలు. అన్నీ సవ్యంగా ఉన్నపుడు... తమ సభ్యులు తప్పు చేస్తే నేరుగా తామే శిక్షించే అధికారం చట్టసభలకుందని రాజారాంపాల్ వర్సెస్ స్పీకర్, లోక్ సభ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రశ్నలు వేయడానికి డబ్బులు పుచ్చుకున్న అభియోగాలు నిర్ధారణ అయిన ఈ కేసులో ఒక రాజ్యసభ, పది మంది లోక్‌సభ సభ్యుల్ని అనర్హులుగా ప్రకటిస్తూ సభ నుంచి బహిష్క రించినపుడు, సదరు నిర్ణయాన్ని సుప్రీం ఆమోదించింది. సభ్యులు తమ వాదన వినిపించడానికి తగిన అవకాశం కల్పించడమే కాకుండా సహజ న్యాయసూత్రాల్ని పార్లమెంటు రెండు సభలు, ఎథిక్స్ కమిటీ, పార్లమెంట్ ప్రత్యేక కమిటీలు సవ్యంగా పాటించాయని న్యాయస్థానం కితాబిచ్చింది. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అలా జరుగలేదు. అందుకు భిన్నంగా జరిగింది. నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా సహజన్యాయ సూత్రాలకు కూడా భంగం కలిగిస్తూ ఏకపక్షంగా సభ్యురాల్ని సస్పెండ్ చేశారని న్యాయస్థానం గుర్తించింది. సభ నిర్ణయం జరిగిపోయింది, కానీ, అది నిబంధనల ప్రకారం జరుగలేదు. సభ అయినా, స్పీకర్ అయినా నిబంధనలకు అతీతులు కారనే విషయాన్ని న్యాయస్థానం ఈ కేసు మధ్యంతర ఉత్తర్వులోనే స్పష్టం చేసింది. ఈ కేసు తుది తీర్పప్పుడైనా, అప్పీలుకు వెళితే ధర్మాసనమైనా, విస్తృత ధర్మాసనమైనా... సమీక్షించి న్యాయమే చేస్తుంది. అది న్యాయస్థానాల విధి. సత్యమేవ జయతే! (వ్యాసకర్త: దిలీప్ రెడ్డి) -
65 లీటర్ల స్పిరిట్ పట్టివేత
10 బస్తాల ఖాళీ సీసాలు, లేబుళ్లు స్వాధీనం ఎమ్మిగనూరు రూరల్: గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో 65 లీటర్ల స్పిరిట్, 10 బస్తాల ఖాళీ సాలు, లెబుళ్లను సోమవారం ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో రాత్రి 10 గంటలకు ఎక్సైజ్ డీసీ ధనలక్ష్మీ విలేకరులతో మాట్లాడుతూ పుట్టపాశం గ్రామానికి చెందిన బోయ రంగన్న స్పిరిట్‌తో నకిలీ మద్యం తయారు చేసి ఎమ్మిగనూరు, కోసిగి ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావటంతో దాడి చేశామన్నారు. ఎక్కడా అనుమానం రాకుండా సీసాలపై లేబుళ్లను అతికించి గ్రామాల్లో విక్రయిస్తున్నాడన్నారు. గంజెళ్ల ఉరుసు సందర్భంగా విక్రయించేందుకు సరుకు సిద్ధం చేసుకోగా అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. రంగన్నపై గతంలో పీడీ యాక్ట్ కింద కేసు కూడా నమోదయిందన్నారు. ఈ కేసు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించిన పత్తికొండ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్, సిబ్బందిని ఆమె అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సూపరిటెండెంట్ హెబ్సిబారాణి, టాస్క్‌ఫోర్స్ సీఐ కృష్ణకుమార్, ఎమ్మిగనూరు సీఐ లక్ష్మీదుర్గయ్య, పత్తికొండ, ఎమ్మిగనూరు ఎస్సైలు సునీల్‌కుమార్, భాగ్యలక్ష్మీ , సిబ్బంది పాల్గొన్నారు. -
ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి?
త్రికాలమ్ రాజ్యాంగాన్నీ, రాజ్యాంగ నిర్మాతలనూ, ముఖ్యంగా అంబేడ్కర్నూ ఇటీవల ఘనంగా స్తుతించినవారు సైతం రాజ్యాంగ స్ఫూర్తిని త్రికరణశుద్ధిగా అమలు చేయక పోవడం విషాదం. మాటకూ, చేతకూ పొంతన ఉండాలన్న పట్టింపు బొత్తిగా లేదు. ప్రేమలో, సమరంలో ఏదైనా చెల్లుతుందని నానుడి. ఎన్నికల పోరాటంలోనూ గెలుపే పరమావధిగా పావులు కదపవచ్చుననీ, రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ తిలోదకాలు ఇవ్వవచ్చుననీ అన్ని రాజకీయ పార్టీల అగ్రనాయకులూ భావిస్తున్నారు. ఈ విషయంలో మినహాయింపులు లేవు. మోతాదులో వ్యత్యాసం ఉంటే ఉండవచ్చు. ఇదివరకు ‘ఆయారాం, గయారాం’ రాజకీయాలు హరియాణాలో, ఇతర ఉత్తరాది రాష్ట్రాలలో ప్రబలంగా ఉండేవి. నరేంద్రమోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగానూ, అమిత్ షాని పార్టీ అధ్యక్షుడిగానూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నియమించిన అనంతరం విజయమే ప్రధానంగా ఎన్నికల వ్యూహాలు రచించి తెగించి అమలు చేశారు. బీజేపీ అభ్యర్థులు లేని అనేక నియోజక వర్గాలలో యూపీఏ-2లో మంత్రులుగా పని చేసినవారినీ, 2009లో కాంగ్రెస్ టిక్కెట్టుపైన గెలిచినవారినీ పిలిచి బీజేపీ టిక్కెట్లు ఇచ్చి పోటీలో నిలబెట్టారు. ఎన్నికలలో అనూహ్యమైన విజయం సాధించిన తర్వాత శివసేన నాయకుడు సురేశ్ ప్రభును పార్టీలో చేర్చుకొని మంత్రిమండలిలో చోటు కల్పించారు. తెలుగు రాష్ట్రాలలో ముమ్మరం తెలుగు రాష్ట్రాలలో ఈ తెగులు ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాయపాటి సాంబశివరావు వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన చంద్రబాబునాయుడు ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పినా పర్వాలేదంటారు. అవ సరం లేకపోయినా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న నాయకులను ఏమనాలి? నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి ప్రమాణం స్వీకరించక మునుపే వైఎస్ఆర్సీపీ నుంచి వైదొలిగి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అరకు లోక్‌సభ సభ్యురాలు కొత్తపల్లి గీత తనకు టిక్కెట్టు ఇచ్చి గెలిపించిన వైఎస్ఆర్సీపీకి దూరదూరంగా ఉంటూ టీడీపీతో అంటకాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఫలితం లేదు. స్పీకర్ ఈ అంశాన్ని పార్లమెంటు హక్కుల కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడే అపరిష్కృతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు ఎంఎల్సీలను చంద్రబాబునాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటే ఒక ఆకు ఎక్కువే చదివినట్టున్నారు. టీడీపీ టిక్కెట్టుపైన ఎన్నికలలో గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకోవడమే కాకుండా మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘన. తీగల కృష్ణారెడ్డి (రంగారెడ్డి జిల్లా మహేశ్వరం), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం), చల్లా ధర్మారెడ్డి (వరంగల్లు జిల్లా పరకాల), రెడ్యానాయక్ (వరంగల్లు జిల్లా డోర్నకల్) టీఆర్ఎస్లో చేరిపోయారు. వైఎస్ఆర్సీపీ టిక్కెట్టుపైన ఖమ్మం జిల్లాలో గెలిచిన ముగ్గురిలో ఇద్దరు శాసనసభ్యులను కలిపేసుకున్నారు. అందరికంటే ముందు గీత దాటినవారు కాంగ్రెస్ ఎంఎల్సీలు నేతి విద్యాసాగర్, యాదవరెడ్డి, రాజేశ్వరరావు. వారు టీఆర్ఎస్లోకి ఫిరాయించినప్పుడు శాసన మండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు ధర్మపురి శ్రీనివాస్. ఆయన రెండు విడతల పీసీసీ అధ్యక్షుడు. కాంగ్రెస్ ప్రభుత్వాలలో పలుమార్లు మంత్రిగా పని చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకునే అవకాశం ఉన్న నాయకుడు. పార్టీ ఫిరాయించినవారిపైన చర్య తీసుకోవాలనీ, వారి సభ్యత్వాలు రద్దు చేయాలనీ మండలి అధ్యక్షుడు స్వామి గౌడ్‌కు శ్రీనివాస్ విజ్ఞాపన పత్రం సమర్పించారు. సినిమా పరిభాషలో ‘సీన్ కట్’ చేస్తే అదే ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని, కేసీఆర్ చేత మెడలో కండువా వేయించుకొని, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారు హోదాలో ప్రజాసేవ చేస్తున్నారు. నిజమే. ఇది ఇప్పుడే కొత్తగా ఒక్క తెలంగాణలోనే జరుగుతున్న తంతు కాదు. కానీ, కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి సృజనాత్మకమైన జనహిత కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకుంటున్న విధంగానే రాజ్యాంగాన్ని సంపూర్ణంగా శిరసావహించి, తు.చ. తప్పకుండా పాటించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని తెలంగాణ ప్రజలు ఆశించడంలో తప్పు లేదు. వరంగల్లు లోక్‌సభ ఉపఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాతనైనా తలసాని చేత రాజీనామా చేయించి సనత్‌నగర్‌లో ఉప ఎన్నిక జరిపించవచ్చు. మర్రి శశిధరరెడ్డి కోరిక తీర్చవచ్చు. తలసాని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించేందుకు శశిధరరెడ్డి తట్టని తలుపు లేదు. తొక్కని గడప లేదు. ఆయన వాదన సమంజసమైనదే అయినప్పటికీ అధికార రాజకీయాల దాష్టీకం ఫలితంగా అది అరణ్యరోదనగానే మిగిలింది. సుపరిపాలన వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చట్టసభ వ్యవహారాలలో జోక్యం చేసుకునే వీలు లేని కారణంగా హితబోధ చేస్తున్నదే కానీ శ్రీనివాస యాదవ్ సభ్యత్వంపైన నిర్ణయం తీసుకోవాలని శాసనసభాపతిని ఆదేశించే పరిస్థితి లేదు. శాసనసభాపతి రాజ్యాంగ నిబంధనలను పాటించనప్పుడు ఏమి చేయాలో పాలుపోక అసహాయతను వ్యక్తం చేస్తున్న హైకోర్టును చూస్తున్నాం. ఎస్ఆర్ బొమ్మయ్ కేసులో గవర్నర్ నివేదికలపైన ఆధారపడి, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిన రాష్ట్రపతి నిర్ణయాన్నే సుప్రీంకోర్టు తిరగదోడింది. ఆ కేసులో వెలువరించిన 300 పేజీల తీర్పు 356వ అధికరణ దుర్వినియోగాన్నే కాకుండా ఫిరాయింపుల నిరోధక చట్టంపైన కూడా సవిస్తరంగా చర్చించింది. పార్టీలే ప్రధానం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలదే ప్రధాన పాత్ర. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద నమోదైన ప్రతి రాజకీయ పార్టీకీ నిర్దిష్టమైన హక్కులు ఉన్నాయి. 1985లో రాజీవ్‌గాంధీ హయాంలో 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్టీ ఆదేశాన్ని (విప్‌ను) ధిక్కరించిన సభ్యుడిని పార్టీ నుంచి బహిష్కరించవచ్చు. పార్టీలో మూడింట ఒక వంతు సభ్యులు పార్టీని వీడి వేరే పార్టీలో చేరినట్లయితే అది ఫిరాయింపు కిందికి రాదు. చీలిక వర్గం వేరే పార్టీలో విలీనమైనట్టు పరిగణిస్తారు. ఎన్నికల సంస్కరణలను సూచించిన దినేశ్ గోస్వామి కమిటీ, ఎన్నికల చట్టాలను సంస్కరించాలంటూ సిఫార్సు చేసిన లా కమిషన్, రాజ్యాంగం అమలు తీరును సమీక్షించిన జాతీయ సంఘం (నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్-ఎన్సీఆర్డబ్ల్యూసీ) వంటి సంస్థలు ఈ నిబంధన వల్ల రాజకీయ పార్టీలలో తిరుగుబాట్లు ఎక్కువై అస్థిరత చోటు చేసుకుంటుందనే ఆందోళన వెలిబుచ్చాయి. 2003లో అటల్ బిహారీ వాజపేయి హయాంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భయాన్ని కొంత వరకూ తొలగించారు. మూడింట రెండు వంతుల సభ్యులు పార్టీ వీడితేనే అది మరో పార్టీలో విలీనంగా పరిగణించాలనీ, అంతకంటే తక్కువ మంది సభ్యులు నిష్ర్కమిస్తే అది ఫిరాయింపు అవుతుందనీ కొత్త చట్టం స్పష్టం చేసింది. రెండు సవరణలలోనూ ఫిరాయింపు నిరోధక చట్టం కింద తీసుకునే చర్యలు చట్టసభల పరిధిలోకి మాత్రమే వస్తాయనీ, ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం ఎంత మాత్రం ఉండకూడదనీ స్పష్టంగా ఉన్నది. సభాపతి నిర్ణయమే అంతిమం. లోక్‌సభాపతి లేదా రాజ్యసభ అధ్యక్షుడు, శాసనసభాపతి లేదా శాసనమండలి అధ్యక్షుడు సాధారణంగా అధికార పార్టీకి చెందినవారై ఉంటారు. వారిపైన ప్రధాని లేదా ముఖ్యమంత్రి ప్రభావం ఎంతోకొంత పరోక్షంగానైనా ఉంటుంది. అందుకే అధికార పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకొని సభాపతులు వ్యవహరిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే ఫిరాయింపులకు ఆస్కారం ఉండదు. కానీ రాజ్యాంగం ప్రసాదించిన పదవులలో ఉన్న వ్యక్తులే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిస్తే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాత్రం ఏమి చేయగలదు? రాజ్యాంగం ప్రభావం దాన్ని అమలు చేసేవారి అంకిత భావంపైన ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్ అందుకే చెప్పారు. రాజ్యాం గాన్ని పాటించవలసినవారిలో చిత్తశుద్ధి లోపించిందనే వాస్తవం కశ్మీర్ నుంచి కొచ్చి వరకూ సర్వత్రా కళ్లకు కట్టుతున్నది. 52, 91 రాజ్యాంగ సవరణలకు కట్టుబడి చట్టసభల వ్యవహారాలలో జోక్యం చేసుకోలేని హైకోర్టు ‘సదరు సభ్యుడి పదవీకాలం పూర్తయ్యే వరకూ సభాపతి నిర్ణయం తీసుకోరా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నది. పార్టీలో ఒక చిన్న వర్గం చీలిపోవడాన్ని మరో పార్టీలో విలీనంగా పరిగణించరాదంటూ 91వ సవరణ తెచ్చినట్టే పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి సభాపతి ఎంత సమయం తీసుకోవచ్చునో నిర్దేశిస్తూ మరో సవరణ చేయవలసిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ఫిరాయింపులను నిరోధించడం సాధ్యం కాదు. జీహెచ్ఎంసీ ఎన్నికల పైనే దృష్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ముగిసే వరకూ టీఆర్ఎస్ నేతలు హితవాక్యాలను స్వీకరించే స్థితిలో లేరు. ఎట్లాగైనా సరే కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందాలన్న లక్ష్యంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. వరాలు ప్రకటిస్తున్నారు. 2014 డిసెంబరు 4వ తేదీతోనే జీహెచ్ఎంసీకి ఎన్నికైనవారి పదవీకాలం ముగిసింది. అప్పుడే జరగవలసిన ఎన్నికలు ఏదో కారణంపై వాయిదా పడుతూ వచ్చాయి. జనాభా ప్రాతిపదికగా పునర్విభజన, క్రమబద్ధీకరణ చేసి మొత్తం 200 డివిజన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తీరా కోర్టు డిసెంబర్ 15 కల్లా ఎన్నికల షెడ్యూలు ప్రకటించాలని నిర్ణయించేసరికి పాత 150 డివిజన్లే ఉంటాయని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దాదాపు సంవత్సరంపాటు వాయిదా వేయడంలోని ఆంతర్యం రాజకీయంగా బలం పుంజుకోవడానికి వెసులుబాటు కల్పించుకోవడమే. ఈ అవసరాన్ని కొందరు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనమండళ్లలో అధికార పార్టీలు ఆధిక్యం సంపాదించిన పద్ధతిలోనే రాజ్యసభలో రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యా బలాన్ని ఎన్డీఏ సంతరించుకోగలిగితే గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, రియల్ ఎస్టేట్ బిల్లులకు ఆమోదం పొందలేక నరేంద్రమోదీ, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు సతమతం కావలసిన అవసరం ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీతో రాజీ ప్రయత్నాలు చేయవలసిన అగత్యమూ ఉండేది కాదు. ఎన్డీఏ నాయకత్వం అటువంటి దుస్సాహసం చేయదు. కానీ, ఎగువ సభలో ఫిరాయింపులు జరిగే ధోరణే కనుక కనిపిస్తే ఇంగ్లీషు చానళ్ళూ, ఇంగ్లీషు పత్రికలూ, సోషల్ మీడియా ఊరుకోవు. దక్షిణాది రాష్ట్రాలలో ఏమి జరిగినా పట్టించుకోవు. - కె. రామచంద్రమూర్తి -
అంతరిక్షం అంచున.. అంతిమ సంస్కారం!
చనిపోయాక కొందరిని దహనం చేస్తారు. మరికొందరిని సమాధి చేస్తారు. ఒకవేళ ద హనం చేస్తే.. అస్థికలను గంగలో కలిపి చనిపోయినవారి ఆత్మకు శాంతి, మోక్షం చేకూరాలని కోరుకుంటారు. అయితే, మన ఆప్తులకు అంతరిక్షం అంచున కూడా అంతిమ సంస్కారం చేయొచ్చంటున్నారు అమెరికాలోని కెంటకీకి చెందిన ‘మీసోలోఫ్ట్’ కంపెనీవారు. మీరు ఓకే అంటే.. మీ ఆప్తుల చితాభస్మాన్ని కంటెయినర్లో ఉంచి ప్రత్యేక వెదర్ బెలూన్‌కు కట్టి వీరు అంతరిక్షం అంచుకు సుమారుగా 23 కిలోమీటర్ల ఎత్తుకు పంపిస్తారు. అక్కడికెళ్లగానే చితాభస్మం ఉన్న కంటెయినర్ తెరుచుకుంటుంది. చితాభస్మం బయటికి వస్తుంది. అయితే.. అది అప్పటికప్పుడే నేలపై పడిపోదు. కొన్ని నెలలపాటు భూమి చుట్టూ ధూళికణాల రూపంలో తిరుగుతూ క్రమంగా కిందికి వస్తుంది. చివరికి వర్షపు చినుకుల్లోనో, మంచు బిందువుల్లోనో కలిసిపోయి నేలకు చేరుతుంది. ఆకాశంలో చితాభస్మం జారవిడిచేటప్పుడు బెలూన్‌కు ఉండే కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా వీరు తీసిస్తారు. ప్యాకేజీని బట్టి ఈ అంతిమ సంస్కారానికి రూ. 17 లక్షల నుంచి రూ. 47 లక్షల వరకూ ఖర్చవుతుందట. -
'కచ్చా స్పిరిట్ వల్లే చిన్నారుల మృతి'
హైదరాబాద్: జూబ్లీహిల్స్ జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం సంభవించిన పేలుడు ఘటనకు కచ్చా స్పిరిట్ కారణమని పోలీసులు తెలిపారు. కచ్చా స్పిరిట్‌ను పొయ్యిలో పోయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో కీర్తివాణి, నర్సమ్మ అనే చిన్నారులు చనిపోగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద కారణాలను పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తల్లి సరస్వతి ఓ స్టూడియోలో పనిచేస్తోంది. పొయ్యి వెలిగించుకునేందుకోసం స్టూడియో నుంచి కచ్చా స్పిరిట్‌ను ఇంటికి తీసుకువచ్చింది. పెట్రోల్, స్పిరిట్‌ను కలిపితే కచ్చా స్పిరిట్ అవుతుందని పోలీసులు తెలిపారు. సినిమాల్లో పేలుళ్ల కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఈ రోజు ఉదయం పొయ్యి వెలిగించేందుకు ఈ స్పిరిట్‌ను వేయగా, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కీర్తివాణి, నర్సమ్మ చనిపోయారు. -
కల్తీ మద్యం... బతుకు ఛిద్రం
సంగారెడ్డి క్రైం: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్న మద్యాన్ని కల్తీ చేస్తున్న అక్రమార్కులు మందుబాబుల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. మద్యం బాటిళ్లపై సీల్ ఉన్నప్పటికీ కల్తీకి చేసేస్తున్నారు. బాటిల్లోని మద్యాన్ని సిరంజితో తీయడం అందులో నీటిని గానీ స్పిరిట్‌తో తయారు చేసిన మద్యాన్ని కానీ కలిపేస్తున్నారు. ఈ తరహా మోసాలను అరికట్టడం ఎక్సైజ్ శాఖకు సవాల్‌గా మారింది. జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో మద్యం ఒక్కోచోట ఒక్కో తీరుగా ఉంటోందని మందుబాబులు అంటున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో మద్యం కల్తీ అవుతోందని, ఆ మద్యం తాగిన వారికి కాళ్లు, చేతులు లాగడం, శరీరం నీరసంగా ఉంటుందని చెబుతున్నారు. పేరుకే ఎంఆర్పీ జిల్లాలోని చాలా దుకాణాల్లో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి పట్టణంతోపాటు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు సిండికేట్‌గా మారిన మద్యం వ్యాపారులు మద్యం బాటిళ్లకు రూ.5 నుంచి రూ.40 వరకు ఎంఆర్ పీ కంటే అధికంగా విక్రయిస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టముంటే కొనండి లేదంటే లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మద్యం బాటిళ్లకు ఉచితంగా ఇవ్వాల్సిన కవర్‌కు సైతం రూ.3 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. నిబంధనలకు నీళ్లు ఉదయం 10.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకే మద్యం విక్రయాలు కొనసాగించాలన్న నిబంధన ఉన్నప్పటికీ, జిల్లా ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. రాత్రి 12 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు తెరిచే ఉంచుతున్నారు. దీంతో అర్ధరాత్రి దాకా పీకలదాకా తాగుతున్న మందుబాబులు రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా 162 మద్యం దుకాణాలు కొనసాగుతుండగా, మొత్తం 11 సర్కిళ్లు ఉన్నాయి. సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 6 సర్కిళ్ల (సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, నర్సాపూర్)లో 87 మద్యం దుకాణాలున్నాయి. మెదక్ డివిజన్ పరిధిలోని ఐదు సర్కిళ్ల (మెదక్, సిద్దిపేట, గజ్వేల్, మిర్దొడ్డి, రామాయంపేట)లో 75 మద్యం దుకాణాలున్నాయి. మద్యం కల్తీ కాకుండా, అధిక ధరకు విక్రయించకుండా ఎక్సైజ్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. కానీ వారంతా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో ఎక్సైజ్ అధికారులు ఏ ఒక్క దుకాణాన్ని సైతం తనిఖీ చేసిన పాపాన పోలేదు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు అడపాదడపా తనిఖీలు నిర్వహించినా అవన్నీ మొక్కుబడిగానే సాగుతున్నాయి. దీంతో మద్యం వ్యాపారులు ఆడింది ఆటా, పాడింది పాటగా తయారైంది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించడం, మద్యాన్ని కల్తీ చేసేయడం వ్యాపారులకు అలవాటుగా మారిపోయింది. దీంతో మందుబాబులు జేబుతో పాటు శరీరాన్నీ గుల్ల చేసుకుంటున్నారు. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్‌లు ఏర్పాటు చేయడంతో మందుబాబులంతా అక్కడ తాగేసి రోడ్లపై చిందులు వేస్తున్నారు. దీంతో ఆ దారి వెంట వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఊహాతీత దర్శకుడు
డా. మాల్కమ్ క్రోవ్ ఒక చైల్డ్ సైకాలజిస్ట్. అతని దగ్గరకో విచిత్రమైన కేసు వస్తుంది. 9 ఏళ్ల కోల్ సియర్కి సంబంధించిన కేస్ అది. క్లాస్‌రూమ్‌లో కూర్చున్నప్పుడో లేక హోమ్ వర్క్ చేసుకుంటుండగానో ఏమౌతుందో తెలియదు కాని హఠాత్తుగా దేన్నో చూసి భయపడుతుంటాడు కోల్. దానికి కారణం... ఆ పిల్లాడికి దెయ్యాలు కనిపిస్తుండటం. మొదట క్రోవ్ నమ్మడు. కానీ ఓ సంఘటన వల్ల అది నిజమే అని అర్థమవుతుంది.‘‘అనుకోకుండానో, అదృష్టవశాత్తో నీకు మరణించిన వారి ఆత్మలను చూడగలిగే శక్తి వచ్చింది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నీకు కనపడే ఆత్మలు ఒకప్పుడు మనుషులే కదా. మనుషుల నుండి నీకు ఏ ముప్పూ లేనప్పుడు, ఆత్మల నుండి కూడా ఏ ముప్పూ ఉండదు’’ అని అతని భయాన్ని పోగొడతాడు క్రోవ్. తన డాక్టర్ చెప్పినట్టుగానే ఆత్మలను చూసి భయపడడం మానేసి, వాటితో స్నేహంగా ఉంటూ, ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు కోల్.ఇది 1999లో విడుదలైన ‘ది సిక్త్స్ సెన్స్’ అనే సినిమా కథాంశం. హాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రాన్ని తీసింది మనోజ్ నైట్ శ్యామలన్ అనే ప్రవాస భారతీయుడు. స్పీల్బర్గ్ వీరాభిమాని అయిన మనోజ్ శ్యామలన్ తీసే సినిమాల్లో కథ కన్నా కథనం కొత్తగా ఉంటుంది. అంతకుమించి వింతగా ఉంటుంది. ఆత్మలు, అతీంద్రియ శక్తులు లాంటి కథాంశాలకు ఏదో విధంగా మానవీయ స్పర్శను ఆపాదించడం శ్యామలన్ శైలి. ఇద్దరు సాధారణ వ్యక్తులను తీసుకెళ్లి అసాధారణ సందర్భంలో పారేయడం శ్యామలన్ సక్సెస్ ఫార్ములా. మనలో ఒకడు అనుకునే కేరెక్టర్ని ఎవ్వరూ ఊహించని సందర్భంలో పడేసి, ‘అరె! మనక్కూడా ఇలా జరగొచ్చు’ అని సినిమా చూసేంతసేపూ అదే ఆలోచనలో ఉండేలా చేస్తాయి శ్యామలన్ సినిమాలు. ‘అన్బ్రేకబుల్’, ‘సైన్స్’, ‘ది విలేజ్’ ఇవన్నీ ఈ కోవకు చెందినవే! పుట్టి పెరిగింది అమెరికాలోనే అయినా శ్యామలన్ మూలాలతో పాటు ఆలోచనలు కూడా భారతీయతతో నిండి ఉంటాయి. ప్రతి చిత్రంలోనూ భారతీయ ఆధ్యాత్మికత, తాత్విక విషయాలను మిస్టరీలో జొప్పించి, థ్రిల్లర్లను తెరకెక్కించడం అతని ప్రత్యేకత. ‘సిక్త్స్ సెన్స్’ కథను కాస్త నిశితంగా పరిశీలిస్తే ‘ఆత్మ శాంతి’ అనే భారతీయ అంశాన్ని తెరకెక్కించాడని మనకే అర్థమౌతుంది. అలాగే - ‘ది లాస్ట్ ఎయిర్‌బెండర్’ అనే సినిమాలో దేవుడి అవతారాల గురించి చెబుతాడు. ఇలా అతని కథలు ఒక ఎత్తయితే, వాటి స్క్రీన్‌ప్లే ఇంకొక ఎత్తు. ఎంతో సాధారణమైన కథతో సినిమా తీసినా, క్లైమాక్స్‌ను మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించని విధంగా తీస్తాడు. సినిమా ఆఖరి టైటిల్స్ పడేంత వరకూ కథ నడుస్తూనే ఉంటుంది. అంతేకాదు, అతని ప్రతి చిత్రంలోనూ చివర్లో ఒక ఆశ్చర్యకర సంఘటన ఉంటుంది. ఇదే అతని సినిమాల ప్రత్యేకత. ఈ కొత్త రకమైన మేకింగ్ వికటించి, ఎన్నో డిజాస్టర్లు అందించినా ఆ పద్ధతిని మాత్రం వదల్లేదు. అందుకే ఇప్పటికీ హాలీవుడ్లో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పెయిడ్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా చెలామణి అవుతున్నాడు మనోజ్. సాధారణ జీవితం, అసాధారణ సంఘటనలు, ఊహకందని మలుపులు - ఇదే శ్యామలన్ ట్రేడ్ మార్క్. అవును ఇంతకీ ‘సిక్త్స్ సెన్స్’లో శ్యామలన్ ట్రేడ్ మార్క్ గురించి చెప్పనేలేదు కదూ! అందులో క్రోవ్ కేవలం డాక్టరే కాదు... ఒక ఆత్మ కూడా! -
చనిపోయినవారి తల దగ్గర దీపమెందుకు?
నివృత్తం ప్రాణాలతో ఉన్న వ్యక్తికి చీకటిలో దారి చూపించి ముందుకు నడిపిస్తుంది దీపం. అలాగే జీవాన్ని కోల్పోయిన తరువాత ఆత్మకు కూడా సరైన దారి చూపమని కోరుతూ ఇలా తల దగ్గర దీపం పెడతారు. మరణించిన వ్యక్తి ఆత్మ బ్రహ్మకపాలం ద్వారా బయటకు వస్తే, ఆ వ్యకి ్తకి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బయటకు వచ్చిన ఆత్మ పైలోకాలకు చేరడానికి రెండు మార్గాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉత్తర మార్గం, రెండోది దక్షిణ మార్గం. ఉత్తర మార్గం వెలుగుతోను, దక్షిణ మార్గం చీకటితోను నిండి ఉంటుందట. ఉత్తమ గతులు కలగాలంటే వెలుగు మార్గలోనే ప్రయాణించాలి. కాబట్టి బ్రహ్మకపాలం నుంచి వచ్చిన ఆత్మకు వెలుగు మార్గం చూపించే ఉద్దేశంతోనే ఆ స్థానంలో దీపాన్ని ఉంచుతారు. పనిగల మేస్త్రి పందిరేస్తే... కుక్కతోక తగిలి కూలిపోయిందట! ఓ ఆసామి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఊళ్లో బోలెడంతమంది మేస్త్రీ లున్నా అద్భుతంగా కట్టేవాడు కావాలంటూ వెతకసాగాడు. అంతలో ఒక తాపీమేస్త్రి తారసపడి, తాను ఎంతమంది పెద్ద పెద్ద వాళ్లకి ఇళ్లు కట్టిపెట్టాడో చెప్పుకొచ్చాడు. దాంతో అతడికే పని అప్పగించాడు ఆసామి. అతడు కళ్లుమూసి తెరిచేలోగా ఇల్లు కట్టేసి, పెద్ద మొత్తంలో డబ్బు పుచ్చుకుని పోయాడు. అయితే ఉన్నట్టుండి గాలివాన రావడంతో ఆ ఇల్లు కూలిపోయింది. చుట్టూ ఉన్న ఇళ్లన్నీ బాగున్నా తన ఇల్లు కూలిపోవడం చూసి ఆసామి ఘొల్లుమన్నాడు. అతడిని చూసిన వాళ్లు... ‘మనోళ్లు బోలెడంతమంది ఉంటే గొప్పలకు పోయి ఎవడినో పట్టుకొచ్చాడు, ఇప్పుడు బాగా బుద్ధొచ్చి ఉంటుంది’ అంటూ పరిహాసం చేశారు. అప్పుడు పుట్టుకొచ్చింది ఈ సామెత. -
భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?
చరమాంకం వరకు మౌనంలో, ధ్యానంలో గడిపారు రమణ మహర్షి. అప్రమేయంగా సాగిన స్వల్ప సంభాషణలు తప్ప ఆయన ఎక్కడా ప్రసంగించలేదు. సంకేత మాత్రంగా స్వీయ శోధనను తప్ప దేనినీ ప్రవచించలేదు. ఆత్మసాక్షాత్కారం కోసం కౌమారంలోనే అరుణాచలం చేరుకున్న ఈ మహా రుషిలోని ఏ చిన్న కోణాన్నీ చిక్కువిప్పుకోడానికైనా ఎంత శక్తీ, ఎంత కాలమూ సరిపోదు. అందుకే - ఆయనతో దీర్ఘకాల ఆశ్రమ బాంధవ్యం ఉన్న ఓ వైద్యుని స్మృతులలో నుంచి ఈ నివాళి. ఓ రోజు (1948 డిసెంబరులో) శ్రీ భగవాన్ చేతిని మర్దనా చేస్తూంటే మోచేతికి కాస్త పైభాగంలో ఉన్న కణితిని గమనించాను. 1949 జూలై నాటికి ఆ భాగమంతా పచ్చి పుండు అయింది. ‘‘నయం కావాలన్న సంకల్పం మీకు ఉండాలి. సంకల్పించుకోండి’’ అని ప్రాధేయపడ్డాను. వారు చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. నేను మళ్లీ అర్థించాను. అప్పుడు వారు, ‘‘ఇక్కడ మనస్సంటూ ఏమీ లేదు. కాబట్టి సంకల్పించే ప్రసక్తే లేదు’’ అన్నారు. భగవాన్ శ్రీ రమణ మహర్షికి దేహం గానీ, దాని రోగాలు కానీ పట్టవు. పుండుకు కట్టు కడుతున్నప్పుడు నొప్పి అనివార్యం. కానీ వారు ఏ బాధనీ కనబరచలేదు. పెపైచ్చు ఆ కట్టు కట్టడానికి కుడిచేతితో సహాయం చేసేవారు... ఆ పుండు ఇంకెవరిదో అయినట్టు! వారి పుండుకు కట్టు కట్టే ముందు ఆ ప్రాంతాన్ని స్పిరిట్‌తో శుభ్రం చెయ్యాల్సి వచ్చేది. ఓసారి ఆ స్పిరిట్ చేతి మీదకు వచ్చింది. వెంటనే వారు, ‘‘స్పిరిట్ స్నానం అయింది నాకు’’ అన్నారు. అందరికీ అటువంటి స్పిరిట్ స్నానం అవసరమని కూడా అన్నారు. ఆ మాటల అంతరార్థమేమిటో తెలియక, వివరించి చెప్పమని కోరాను. వారు చిరునవ్వుతో ఇట్లా చెప్పారు. ‘‘చేపలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. బయటికి వస్తే బ్రతకలేవు. అట్లాగే మనం ఎప్పుడూ స్పిరిట్లోనే, అంటే శుద్ధ చైతన్యంలోనే ఉంటాం, ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శుద్ధచైతన్యంలో, అంటే ఆత్మలోనే ఉండాలి.’’ ఈ మాటల వల్ల వారెప్పుడూ సహజ సమాధిలోనే ఉంటారని నమ్మకం కలిగింది నాకు. శ్రీ భగవాన్ తరచు చిన్న చిన్న విషయాలలో కూడా ప్రగాఢమైన బోధనలు చేసేవారు. ఆ బోధనలకు మనపై గట్టి పట్టు ఉండేది. 1949లో ఒకసారి శ్రీ భగవాన్, ‘మనం సంతోషంగా ఉన్నప్పుడు కన్నీరు ఆవలి కొన నుంచీ, విచారంగా ఉన్నప్పుడు లోపలి కొన నుంచీ వస్తుంది’ అని చెప్పారు. అది నిజమే. మహా నిర్వాణ దినం నాడు 1950 ఏప్రిల్ 14న వారి గదిలో నేనూ ఉన్నాను. వారి కోరిక మీద వారు కాళ్లు చాచుకుని కూర్చోవడానికి ఏర్పాటుచేశాం. వారు కళ్లు మూసుకున్నారు. శ్వాస నెమ్మదిగా సాగుతోంది. బయట భక్తులు ‘అరుణాచల శివ స్తోత్రం’ పాడుతున్నారు. ఒక్కసారి కళ్లు తెరిచి, ఆ పాట వస్తున్న వైపు చూసి, మళ్లీ కళ్లు మూసుకున్నారు. వారి కళ్ల ‘ఔటర్ కాన్తస్’ నుంచి కన్నీరు కారింది. అంటే పరమాత్మునిలో ఐక్యమయ్యేటప్పుడు కలిగే ఆనందానికి ఆ కన్నీరు బాహ్యరూపం అనుకున్నాను. దేహాన్ని ఎంతో ప్రశాంతంగా విడిచారు. శ్రీ భగవాన్ రమణ మహర్షి అదేరోజు సాయంత్రం 8 గం. 47 ని.లకు శివైక్యం పొందారు. తన బాధ గురించి దుఃఖిస్తున్నవారి పట్ల కరుణ ఉండేది శ్రీ భగవాన్‌కి. ఆయనెప్పుడూ అసలు సత్యాన్నీ, తన బోధనలో ప్రధానాంశమైన ‘‘మనం దేహం కాదు’’ అనే మాటను జ్ఞాపకం చేస్తుండేవారు. తనదైన రీతిలో ఒక మాట అడిగేవారు కూడా. ‘‘భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?’’ అని. - ఆశ్రమ డాక్టర్ ఎం.అనంతనారాయణరావు స్మృతుల నుంచి. (సౌజన్యం: శ్రీరమణ కేంద్రం, హైదరాబాద్) భగవాన్ శ్రీరమణ మహ ర్షి 30 డిసెంబర్ 1879 - 14 ఏప్రిల్ 1950 అసలు పేరు: వెంకటరామన్ జన్మస్థలం: తిరుచ్చుళి, తమిళనాడు తల్లిదండ్రులు: అళగమ్మ, సుందరయ్యర్ సహోదరులు: అన్న, తమ్ముడు, చెల్లి చదువు: తొమ్మిదవ తరగతి, అమెరికన్ మిషన్ హైస్కూల్ ఆత్మజ్ఞానానికి అంకురార్పణ: పదహారేళ్ల వయసులో (తిరువణ్ణామలైలోని అరుణాచలం గురించి విన్నపుడు) ఇల్లు విడిచి అరుణాచలానికి: 1896 (సందర్శన 1, సెప్టెంబర్) నివాసం: మొదట అరుణాచల ఆలయ ప్రాంగణం తర్వాత గురుముహూర్త మఠం (1897), విరూపాక్ష గుహ (1899), స్కందాశ్రమం (1916), ఆ తర్వాత జీవిత చరమాంకం వరకు } రమణాశ్రమం (అరుణాచల పాదంలో తల్లి సమాధి చుట్టూ ఏర్పడిన ఆశ్రమం-1922). తాత్వికత: మౌనం, ధ్యానం, ఆత్మజ్ఞాన సాధన, ‘నేనెవరు?’ అన్న అన్వేషణ. సందర్శకులలో ముఖ్యులు కొందరు : డాక్టర్ పాల్ బ్రంటన్, టి.ఎం. కృష్ణస్వామి అయ్యర్, చింతాదీక్షితులు, గుడిపాటి వెంకటాచలం, చిత్తూరు నాగయ్య, డాక్టర్ రాజేంద్రప్రసాద్, జమ్నాలాల్ బజాజ్. -
అక్రమాలకు అడ్డుకట్ట ఏదీ..?
కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరు.. అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ జరగని వ్యాపారాలంటూ లేవు. కల్తీ కిరోసిన్, డీజిల్, పెట్రోల్, క్రూడాయిల్‌తో పాటు చివరకు ప్రాణాలను హరించే మిథేల్ వరకు అన్నీ అక్రమ వ్యాపారాలే. వీటి మాటున అక్రమార్కులు లక్షలు గడిస్తున్నారు. పాలేరుకే పరిమితం కాకుండా నల్గొండ జిల్లాకు కూడా విస్తరిస్తున్నారు. పాలేరులో గతంలో పలువురి ఇళ్లలో అక్రమంగా ఉంచిన డ్రమ్ముల కొద్దీ వైట్ పెట్రోల్, నీలి కిరోసిన్ లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జైలుకు వెళ్లినా తిరిగి అదే వ్యాపారాలను ఎంచుకోవ టం చూస్తే ఎంత అక్రమార్జన ఉంటుందో అర్థమవుతుంది. పాలేరులో రాష్ట్రీయ రహదారి పక్కన హోటళ్లు ఉండడంతో అక్రమార్కులకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. వైజాగ్, కాకినాడ నుంచి హైదారాబాద్ వరకు నిత్యం ఈ రహదారి గుండా వివిధ నూనెలు, రసాయనాలతో ట్యాంకర్లు వెళుతుంటాయి. వారు ఇక్కడ ట్యాంకర్లను ఆపి భోజనాలు చేస్తుంటారు. దీంతో అక్రమార్కులు ట్యాంకర్ల డ్రైవర్లను మచ్చిక చేసుకుని క్రూడాయిల్, కిరోసిన్, ముడి పెట్రోల్, డీజిల్, రెక్టిఫైడ్ స్పిరిట్, మిథేల్ వంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటిని గోడౌన్లలో రహస్యంగా నిల్వ ఉంచి రాత్రి వేళల్లో ఇతర ప్రదేశాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తుంటారు. మరికొందరు పలు కెమికల్స్ ద్వారా కల్తీ డీజిల్, పెట్రోల్ కూడా తయారు చేసి అక్రమ వ్యాపారం నడుపుతున్నారు. క్రూడాయిల్‌ను వంట నూనెలులగా తయారు చేసి విక్రయిస్తుంటారు. కొందరు హోటళ్ల యజమానులు ఈ వ్యాపారాల్లో ఆరితేరారు. మరి కొందరు ఈ వ్యాపారం కోసమే హోటళ్లను తెరవడం గమనార్హం. స్పిరిట్‌తో మద్యం, సారా కల్తీ... కొందరు అక్రమార్కులు ట్యాంకర్ల ద్వారా స్పిరిట్ (ఆర్ఎస్ను) గత కొంత కాాలంగా సేకరిస్తూ దాన్ని సారా, మద్యం సీసాలలో కలిపి క ల్తీ చేసి అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా తక్కువ ఖర్చుతో మత్తు ఎక్కే మద్యం తయారు చేసి మార్కెట్ ధరకే రహస్యంగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అంతా పాలేరులో కాకుండా సమీపంలోని తోటల్లో, గుట్టల్లో జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల పోచారం- బీరోలు గ్రామాల మధ్య ఓ మామిడి తోటలో డ్రమ్ముల కొద్దీ స్పిరిట్‌ను నిలువ ఉంచగా పోలీసులు పట్టుకుని వదిలేసినట్లు తెలిసింది. కొంప ముంచిన మిథేల్.... గతంలో అక్రమార్కులు స్పిరిట్‌తో మద్యం, సారాను కల్తీ చేసి అమ్ముతున్నా అది పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. కాగా ఇటీవల పాలేరుకు చెందిన మృతుడు కుసులూరి రాజయ్య, అతని కుమారుడు స్పిరిట్, పలు రకాల ఆయిళ్లను ట్యాంకర్ల ద్వారా తీసుకుంటూ వాటిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్నికల నేపథ్యంలో మద్యం, సారా కట్టడి కావటంతో మిథేల్ ఆల్కహాల్‌ను సారాగా అమ్మవచ్చని ట్యాంకర్ డ్రైవర్ చెప్పటంతో అతను అర లీటరు మిథేల్ తీసుకుని సారాగా తయారు చేసి ప్రయోగం చేశాడు. అది వికటించి ఆ వ్యాపారితో పాటు దాన్ని తాగిన మరో నలుగురు మృత్యువాత పడాల్సి వచ్చింది. మరో 27 మంది ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్రమ వ్యాపారాలను అదపు చేయలేక పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా స్పందించి ఈ అక్రమ వ్యాపారాలను అడ్డుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
ఆత్మ శాశ్వతం
అతిగహనమైన తాత్విక విషయాలను కూడా ఎంతో సుందరంగా కవితాత్మకంగా కథా రూపంలో చెప్పిన ఉపనిషత్తు కఠోపనిషత్. ఆ కథ ఇలా వుంటుంది. వాజస్రవసుడి కొడుకు నచికేతుడు. తండ్రి యజ్ఞంలో వట్టిపోయిన ముసలి ఆవుల్ని దానంగా ఇవ్వటం చూసి నచికేతుడు తండ్రిని నన్నెవరికి ఇస్తావని అడుగుతాడు. దీంతో కోపగించుకున్న తండ్రి ‘నిన్ను మృత్యువుకిస్తాను’ అంటాడు. నచికేతుడు మృత్యుదేవత అయిన యముడు ఇంటికి వెళతాడు. అప్పుడక్కడ యముడు లేడు. మూడు రోజులు ఏమీ తినకుండా నచికేతుడు వేచి వున్నాడు. ఆ తరువాత యముడు వచ్చి మూన్నాళ్ళు నిరాహారంగా వేచి వున్నందుకు పరిహారంగా మూడు వరాలు కోరుకొమ్మంటాడు. మొదటి వరంగా తనను తిరిగి తండ్రి వద్దకు పంపించమంటాడు. యముడు సరే అంటాడు. రెండో వరంగా స్వర్గప్రాప్తిని కలుగజేసే యజ్ఞాన్ని ఉపదేశించమంటాడు నచికేతుడు. యముడు ఉపదేశిస్తాడు. నచికేతుడు ఆ యజ్ఞకర్మను శ్రద్ధగా ఆకళింపు జేసుకొని అలాగే తిరిగి దాన్ని యముడికి ఒప్పజెప్పుతాడు. యముడు సంతోషించి ఆ యజ్ఞం నచికేతుడి పేరు మీద ప్రసిద్ధమవుతుందని అదనంగా వరం ఇస్తాడు. ‘మనిషి చనిపోయాక ఏమవుతాడు? ఆత్మ అనేది వున్నదా?లేదా?’ అంటూ మూడో వరంగా నచికేతుడు అడుగుతాడు. ‘దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. వేరే వరం కోరుకో. దీనికి బదులు ధనాన్ని, అధికారాన్ని, అన్ని రకాల సుఖాల్ని ఇస్తాను’ అంటాడు యముడు. ‘ఇవన్నీ క్షణికాలే. అవి నాకొద్దు. నేను అడిగిన మరణం తర్వాత వుండే జీవితం గురించి చెప్పు’ అంటాడు నచికేతుడు. యముడు సంతోషించి నచికేతుడు అడిగిన ఆ మూడో వరాన్ని కూడా తీర్చుతాడు. మృత్యువు తరువాత వుండే పరమ జీవితం, ఆత్మ, పరబ్రహ్మము గురించి యముడు నచికేతుడికి ఉపదేశించటంతో ఉపనిషత్తు ముగుస్తుంది. ఉపనిషత్కథ చిన్నదే అయినా అందులో శాశ్వత సత్యాలైన వేదాంత భావనలను ఎన్నింటినో పరమ రమణీయంగా చెప్పటం జరిగింది. లోకంలో రెండు మార్గాలున్నాయి. ఒకటి శ్రేయో మార్గం. రెండు ప్రేమో మార్గం. వాటి గమ్యాలు వేరు. శ్రేయోమార్గం శ్రేయస్కరమైనది. ప్రేమోమార్గం అంతిమంగా దుఃఖకరమైనది. బుద్ధిమంతుడు శ్రేయోమార్గాన్ని ఎన్నుకొని ముక్తిని పొందుతాడు. బుద్ధిహీనుడు ప్రేమోమార్గాన్ని ఎన్నుకొని పతనమవుతాడు. లోకంలో చాలా మంది ఆత్మ గురించి వినివుం డరు. విన్నవాళ్లకు అది ఏమిటో అర్థం కాదు. అలాం టప్పుడు దానిని గురించి ఉపదేశించే వాడు నిజంగా అద్భుతమైన వాడు అవుతాడు. ఉపదేశం పొందిన శిష్యుడూ అలాంటి అద్భుతమైన వాడే అవుతాడు. ఆత్మజ్ఞానం చర్చల వల్ల, తర్కం వల్ల పొందేది కాదు. ఆత్మ జ్ఞానం కలవాడు మాత్రమే దాన్ని బోధించటానికి అర్హుడు. సత్యనిష్ట కలవాడు మాత్రమే దాన్ని నేర్చుకోవటానికి అర్హుడు. ఆత్మకు చావూ లేదు, పుట్టుకా లేదు. శరీరం నశించినా, ఆత్మ నాశనం కాదు. ఆత్మ నిత్యం, శాశ్వతం, సనాతనం. చెడునడత మానుకోని వారూ, తనను తాను అదుపులో వుంచుకోలేని వారూ, ఏకాగ్రత లేని వారూ, మనస్సులో శాంతి లేని వారూ, ఎంత పాండిత్యం వున్నా ఆత్మజ్ఞానం పొందటానికి అనర్హులు. శరీరం రథం. ఆత్మ యజమాని. బుద్ధి సార థి. మనస్సు కళ్లెం. ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియ విషయాలు అవి వెళ్లే మార్గాలు. (అజ్ఞానం అనే నిద్ర నుండి) లేవండి, మేల్కొనండి, శ్రేష్ఠులైన వారి దగ్గర జేరి ఆత్మజ్ఞానం పొందండి. కఠోపనిషత్తులోని శ్లోకాలు కొన్ని కొద్ది కొద్ది మార్పులతో భగవద్గీతలో ఉండటం గమనించవచ్చు. - దీవి సుబ్బారావు -
ఎప్పుడూ తింటున్నట్లు కల వస్తుందా?
ఎప్పుడూ ఏదో తింటున్నట్లు కల వస్తుందా? ‘నేను మితాహారిని. ఇలాంటి కలలు వస్తున్నాయి ఏమిటి?’ అని ఆశ్చర్యపోతున్నారా? కల తాత్పర్యం: తిండి లేని శరీరం నీరసపడినట్లే విజ్ఞానం లేని బుర్ర చురుకుదనం కోల్పోతుంది. నిస్తేజంగా తయారవుతుంది. అందుకే ఎన్నో పుస్తకాలను చదవాలనుకుంటారు. విజ్ఞానపరంగా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలనుకుంటారు. కానీ, పుస్తకాలు చదవడానికి, నలుగురి దగ్గర కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీకు టైం ఉండదు. ఉన్నా.. ఏవో కారణాల వల్ల వాయిదా వేస్తారు. మీలో విజ్ఞాన దాహం ఉంటుంది గానీ ఆ దాహం తీర్చుకోవాలనే ఆసక్తి ఉండదు. మీ కలలో కనిపించే తిండి అనేది నిజానికి ‘తిండి’ కాదు. అది విజ్ఞానానికి ప్రతీక. కొన్నిసార్లు కేవలం తిండి మాత్రమే కనిపిస్తుంది. ‘ఫుడ్ ఫర్ థాట్’ అనే భావనను అది ప్రతిబింబిస్తుంది. ఒంటరిగా తింటున్నట్లు కల వస్తే... ఒంటరితనంతో బాధపడుతున్నారనీ, కుంగుబాటుకు గురవుతున్నారనీ, నష్టాలను ఎదుర్కొంటున్నారనీ అర్థం. మిడ్ లైఫ్ -క్రైసిస్! స్వగతం ఇప్పుడు నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు! ‘ఇప్పటికింకా నా వయసు...’ అని నా వయసును ఎప్పుడూ దాచుకునే ప్రయత్నం చేయలేదు. నా జుత్తుకు రంగు వేసే విషయం కూడా రహస్యంగా ఉంచలేదు. ‘మిడ్-లైఫ్ క్రైసిస్ ఎదుర్కొంటున్నారా?’ అని కొద్దిమంది నన్ను అడుగుతుంటారు. అలాంటి క్రైసిస్ ఏదీ ఇప్పటి వరకు నన్ను తాకలేదు. నా వయసు ఇంతా...అంతా అని లెక్కలేసుకుంటూ బాధపడను. ‘నేను చేయాల్సిన పనులెన్ని... వాటిలో ఎన్ని చేశాను’ ఇలా మాత్రమే ఆలోచిస్తాను. వయసు అంటే గుర్తుకు వచ్చింది...ఇప్పటికీ నేను మా అబ్బాయితో పరుగులో పోటీ పడుతుంటాను. ఒకరోజు వాడు గెలుస్తాడు. ఆ గెలుపు నా వయసును సవాలు చేసినట్లు అనిపిస్తుంది! అయితే మాత్రం నేను రాజీ పడతానా? మరుసటిరోజు గెలిచే వరకు నా మనసు నెమ్మదించదు. ఈ వయసులోనే కాదు యాభై ఏళ్లలో కూడా మా అబ్బాయిని ఓడించగలననే బలమైన ఆత్మవిశ్వాసం నాలో ఉంది. క్రియావాదం అంటే ఏమిటి? తత్వం శరీరం కేవలం ఒక పనిముట్టు లాంటిది. దానికి క్రియాశక్తి ఉన్నదేకాని, ఆలోచనశక్తి, ఇచ్ఛాశక్తి లేవు. కనుక ఆలోచనా శక్తికి, ఇచ్ఛాశక్తికి కేంద్రంగా ఆత్మ ఉంటుంది. ఆత్మ ఆలోచించి ఉచితం, అనుచితం అని నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ఇచ్ఛగా మారుతుంది. అప్పుడు అది మనసు ద్వారా దేహానికి, ఇంద్రియాలకు ఆదేశాన్ని ఇస్తుంది. శరీరం, ఇంద్రియాలు పనిచేస్తాయి. ఈ ఆత్మ నిత్యం, శాశ్వతం, అనంతం, అవ్యయం. కనుక అది చేసే పనులకు అదే బాధ్యత వహిస్తుంది. శరీరం పతనం అయిపోయి నశించి పోతుంది కనుక కర్మఫలం అంతా ఆత్మే అనుభవించ వలసి ఉంటుందని క్రియావాదులు భావిస్తారు. ఇక్కడ ఆత్మ కర్తగాను, భోక్తగాను ఉంటుంది. అయితే ఆత్మను అంగీకరిస్తూ ఆత్మకు కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని అద్వైత వేదాంతం నిరాకరిస్తుంది. రామానుజ దర్శనంలో ఆత్మ నిజంగా కర్త, భోక్తగా ఉంటుంది. సాంఖ ్య దర్శనం, అద్వైత దర్శనాలు మాత్రం- ‘‘శరీరం మాత్రమే అనేక కర్మలు చేస్తుంది’’ అంటాయి. -‘భారతీయ తత్వశాస్త్రం-సమగ్ర పరిశీలన’ నుంచి.. భార్య పేరు గిట్టని నెపోలియన్! తెలిసిన వ్యక్తి-తెలియని కోణం కొన్ని ఇష్టాయిష్టాలు నెపోలియన్‌కు బలంగా ఉండేవి. తనకు నచ్చనిది మార్పు జరిగే వరకు ఆయన మనసు శాంతించేది కాదు. నెపోలియన్ మొదటి భార్య పేరు రోజ్. అయితే ఆ పేరంటే నెపోలియన్‌కు ఇష్టం లేదు. అందుకే ఆమెను జోసెఫిన్ అని పిలుచుకునేవాడు. అలాగే, ఇటలీ తన పరిపాలనలోకి వచ్చినప్పుడు ఆ దేశ జెండాను తనకు నచ్చిన విధంగా మార్పులు చేర్పులు చేయించాడు. నెపోలియన్ మొదటి భార్య జోసెఫిన్ అందగత్తె. అరుదుగా మాత్రమే నోరు విప్పేది. దీనికి కారణం ఆమె మితభాషి కాదు...నోటి దుర్వాసన సమస్య! తన ద్వితీయ వివాహానికి రాలేదనే కారణంతో నెపో లియన్ 13 మంది రోమన్ క్యాథలిక్ మతాధికారుల్ని జైల్లో వేశాడు. నెపోలియన్ మాటలు ‘సూటిగా...సుత్తి లేకుండా’ అన్నట్లు ఉండేవి. ‘ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం’ అనే నానుడి ‘సుదీర్ఘమైన ఉపన్యాసం కంటే సుందరమైన చిత్రం ఉత్తమం’ అనే నెపోలియన్ మాట నుంచి వచ్చింది నెపోలియన్ పుట్టింది ఓ దీవిలో. చనిపోయింది కూడా దీవిలోనే. -
'రాష్ట్రపతి సమక్షంలో సమైక్యగళం'