
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తీసింది రెండు మూడు సినిమాలే గానీ దేశవ్యాప్తంగా యమ క్రేజ్ సంపాదించాడు. ఇతడి సినిమాలే అనుకుంటే ఇంటర్వ్యూలు కూడా ఆ రేంజులోనే ఉంటాయి. ప్రస్తుతం 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్న ఇతడు.. మూవీ టార్గెట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో చేయబోయే సినిమా 'స్పిరిట్'. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు కానీ డార్లింగ్ హీరో వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ మొదలుపెట్టడం ఆలస్యమవుతోంది. సరే ఈ విషయం పక్కనబెడితే రీసెంట్ గా సందీప్.. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. బోలెడన్ని విషయాల్ని పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)
అయితే సందీప్ చెప్పిన ఓ సమాధానం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. 'షాహిద్, రణ్ బీర్ సింగ్ కి వాళ్ల కెరీర్ లోనే పెద్ద హిట్స్ ఇచ్చారు. మరి ప్రభాస్ 'స్పిరిట్'కి మీ టార్గెట్ ఏంటి?' అని అడగ్గా.. ఒకవేళ నా సినిమా, బాహుబలిని దాటాలంటే రూ.2000 కోట్లు కలెక్షన్స్ రావాలి. ఇది చాలా పెద్ద టార్గెట్. ఇప్పటికైతే నేను మంచి సినిమా తీస్తా. బాక్సాఫీస్ దగ్గర అది ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి అని సందీప్ సమాధానమిచ్చాడు.
బాహుబలి తర్వాత రెండు సినిమాల విషయంలో ప్రభాస్ కాస్త డౌన్ అయినట్లు కనిపించాడు. కానీ సలార్, కల్కి 2898 చిత్రాలతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మరి ముఖ్యంగా కల్కి మూవీ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మరోవైపు సందీప్ చివరగా తీసిన యానిమల్ కూడా వెయ్యి కోట్ల రూపాయలు సాధించింది. దీనిబట్టి చూస్తే 'స్పిరిట్'కి రూ.1000 కోట్లు రావడం పెద్ద విషయం కాదు. కానీ రూ.2000 వస్తే మాత్రం ఇద్దరూ రికార్డ్ సెట్ చేసినట్లే.
(ఇదీ చదవండి: బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?)
Comments
Please login to add a commentAdd a comment