ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ విలన్... సెట్ అయితే మాత్రం! | Korean Actor Ma Dong Seok Villian In Prabhas Spirit Movie | Sakshi
Sakshi News home page

Prabhas Spirit: డార్లింగ్ కోసం ఇంటర్నేషనల్ యాక్టర్.. నిజమేనా?

Published Sun, Jul 7 2024 2:01 PM | Last Updated on Sun, Jul 7 2024 2:52 PM

Korean Actor Ma Dong Seok Villian In Prabhas Spirit Movie

ప్రభాస్ రేంజు రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. 'కల్కి'తో ఓవర్సీస్‌లోనూ దుమ్మలేపుతున్నాడు. మొన్నటివరకు ప్రభాస్‌కి తగ్గ సినిమాలు రావట్లేదని బాధపడినోళ్లు కాస్త.. ఇప్పుడు 'కల్కి'కి వస్తున్న వసూళ్లు చూసి కుళ్లుకుంటున్నారు. ఈ ఊపులోనే ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ స్టార్ నటుడు విలన్ అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?

'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కి ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చి పడింది. కాకపోతే దీని తర్వాత చేసిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. కానీ గతేడాది చివర్లో వచ్చిన 'సలార్', రీసెంట్‌ సెన్సేషన్ 'కల్కి'.. ప్రభాస్ అంటే ఏంటో నిరూపించాయి. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్ 2, కల్కి 2, హను రాఘవపూడితో మూవీ, స్పిరిట్ ఉన్నాయి.

(ఇదీ చదవండి: OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్‌ హనీమూన్స్‌' ట్రైలర్‌)

వీటిలో మిగతా వాటి సంగతి కాస్త పక్కనబెడితే 'స్పిరిట్'పై మాత్రం బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాబట్టి. 'యానిమల్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇతడు.. 'స్పిరిట్'లో ప్రభాస్‌ని పవర్‌ఫుల్ పోలీస్‌గా చూపించబోతున్నాడు. ఇందులోనే విలన్‌గా కొరియన్ నటుడు మా డాంగ్ సూక్ (డాన్ లీ)ని చేయబోతున్నాడని గాసిప్ బయటకొచ్చింది.

మరి సోషల్ మీడియాలో అంటున్నట్లు ప్రభాస్‌ని ఢీకొట్టే విలన్‌గా కొరియన్ నటుడు డాన్ లీ కనిపిస్తే మాత్రం అంతర్జాతీయ స్థాయిలో మూవీకి గుర్తింపు వస్తుంది. ఒకవేళ సందీప్ ఇలాంటి ఆలోచన ఏమైనా చేస్తే గనక రచ్చ రచ్చే. ఇకపోతే డాన్ లీ.. ద గుడ్ ద బ్యాడ్ ద వీర్డ్, ద రౌండప్, ద ఔట్ లాస్ తదితర చిత్రాలతో నటుడిగా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు.

(ఇదీ చదవండి: భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement