
అక్టోబరులో పోలీసాఫీసర్‌గా ప్రభాస్ చార్జ్ తీసుకోనున్నారట. ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న చిత్రం ఇది. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభించడానికి సందీప్ రెడ్డి వంగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సో... పోలీస్ ఆఫీసర్‌గా అక్టోబరు నుంచి ప్రభాస్ ఆన్ డ్యూటీ అన్నమాట. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఒకవైపు ఈ చిత్రం సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతూనే, మరోవైపు ‘స్పిరిట్’ సినిమా లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు సందీప్‌రెడ్డి. ఇందులో భాగంగా ఆయన ఇటీవల మెక్సికో వెళ్లొచ్చారు. అక్కడ ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా సందీప్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మించనున్న ‘స్పిరిట్’ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.