ప్రభాస్‌తో సినిమా.. తొలిరోజే రూ.150 కోట్లు వస్తాయ్! | Director Sandeep Vanga Predicts Spirit Movie Box Office Earnings - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌తో రీమేక్ అన్నారు.. కానీ రిజెక్ట్ చేశా!

Published Mon, Apr 8 2024 5:21 PM | Last Updated on Mon, Apr 8 2024 6:04 PM

Sandeep Reddy Vanga Reveals Prabhas Spirit Movie Updates - Sakshi

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి' బిజీలో ఉన్నాడు. మే9న రిలీజ్ అనుకున్నారు గానీ వాయిదా పడొచ్చు. మరోవైపు ప్రభాస్ తర్వాత చేయబోయే మూవీస్ విషయంలో డైరెక్టర్స్ ఫుల్ స్పీడులో ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా)

'సలార్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్'లో యాంగ్రీ పోలీస్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీ 'యానిమల్' కంటే తీయాల్సింది కానీ ఆలస్యమైందని డైరెక్టర్ సందీప్ చెప్పుకొచ్చాడు. తొలుత హాలీవుడ్ రీమేక్ ప్లాన్ ఒకటి తన దగ్గరకొచ్చిందని, కానీ 'స్పిరిట్' కథ ప్రభాస్ కి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ బయటపెట్టాడు.

ప్రభాస్ 'స్పిరిట్' మూవీ షూటింగ్ ఈ ఏడాది డిసెంబరులో మొదలవుతుందని సందీప్ రెడ్డి వంగా చెప్పాడు. అలానే తనకు, ప్రభాస్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా.. అలానే టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేస్తే.. తొలిరోజే ఈ మూవీ సులభంగా రూ.150 కోట్ల మార్క్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అలానే స్టోరీ రైటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిందని చెప్పాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మాటలు విని తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు.

(ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement