
‘స్పిరిట్’(Spirit) సినిమా సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రభాస్(Prabhas) హీరోగా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మేలో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.
దీంతో లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్‌గా మేకోవర్ కానున్నారట. ‘స్పిరిట్’ చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యం కావడానికి ఇదొక కారణమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా... ఇలా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్ కాలేదట. టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్న ‘స్పిరిట్’ చిత్రం 2026 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్.