
బాలీవుడ్ నటి అమృత అరోరా సోదరి, నటి ప్రీతిక రావు (Preetika Rao).. ఓ నెటిజన్‌పై భగ్గుమంది. వద్దంటున్నా వినకుండా నటుడు హర్షద్ అరోరా (Harshad Arora)తో కలిసున్న వీడియోను పదేపదే షేర్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఒకసారి చెప్తే అర్థం కాదా? అంటూ విరుచుకుపడింది. హర్షద్ అరోరా, ప్రతీక రావు బెయింటెహా సీరియల్‌లో కలిసి నటించారు. అందులోని సీన్లను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అవి ప్రీతికకు నచ్చలేదు. వాటిని తీసేయమని కోరింది. దీంతో సదరు అభిమాని.. పదేళ్ల క్రితం మీరు అతడితో కలిసి నటించినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? అని ప్రశ్నించాడు.
బుర్ర లేదా? చెప్తే అర్థం కాదా?
అందుకామె.. ఓరి నీ తెలివితక్కువవాడా.. నీకేం చెప్పినా అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు సడన్‌గా చెప్పి చేయమంటారు. అందుకే నేను టీవీలో అలాంటి సీన్లలో నటించాను. అంతమాత్రానికి ఆ సీన్ వీడియోలను పదేపదే షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది. ఇండస్ట్రీలో కొత్తగా ఎవరొస్తే వారితో పడక పంచుకునే వ్యక్తి తను.. అలాంటివాడితో కలిసి నటించిన వీడియోలు పోస్ట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవే.. నా మనసుకు నచ్చని పని చేస్తున్నావు.
అనుభవిస్తావ్..
అందుకు కర్మ అనుభవిస్తావ్. బెయింటెహా సీరియల్‌లో 95 శాతం వరకు సాధారణ సీన్లే ఉంటాయి. కేవలం 5 శాతం మాత్రమే ఎక్కువ సాన్నిహిత్యంతో ఉన్న సన్నివేశాలున్నాయి. నా మాట లెక్క చేయకుండా వాటిని షేర్ చేస్తూనే ఉన్నావ్.. ఇంతకింతా అనుభవిస్తావ్ అని శపించింది. ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అప్పట్లో హిట్ సీరియల్
బెయింటెహా సీరియల్ 2013లో ప్రసారమైంది. ఇందులో ప్రీతిక- హర్షద్ జంటగా నటించారు. అప్పట్లో ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగింది. తర్వాత ప్రీతిక.. లవ్ కా హై ఇంతేజార్, లాల్ ఇష్క్ వంటి సీరియల్స్ చేసింది. తెలుగులో 'ప్రియుడు' సినిమాలో వరుణ్ సందేశ్ సరసన కథానాయికగా యాక్ట్ చేసింది. తమిళంలో 'చిక్కు బుక్కు', కన్నడలో 'రెబల్' సినిమాలు చేసింది. హర్షద్.. ఘమ్ హై కిసీకే ప్యార్ మే, సాసురాల్ సిమర్ కా, డల్హీజ్, దేవోంకే దేవ్.. మహదేవ్ వంటి సీరియల్స్‌లో నటించాడు.

చదవండి: 'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్