సీక్రెట్‌ పెళ్లి.. నాలుగు నెలలకే విడాకులు.. స్పందించిన బుల్లితెర నటి | "I was facing a lot of misbehaviour...": Aditi Sharma Reacts To Cheating Allegations By Husband Abhineet Kaushik | Sakshi
Sakshi News home page

Aditi Sharma: పెళ్లయిన నెలకే గొడవలు.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఇంకా చాలా జరిగాయి!

Published Fri, Mar 14 2025 12:57 PM | Last Updated on Fri, Mar 14 2025 1:17 PM

Aditi Sharma Reacts to Cheating: I was Facing a lot of Misbehaviour

ఇటు ప్రేమ కావాలి, అటు కెరీర్‌ కావాలి అనుకుంది హిందీ బుల్లితెర నటి అదితి శర్మ (Aditi Sharma). అందుకే నాలుగేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ప్రియుడు అభిజిత్‌ కౌశిక్‌(Abhineet Kaushik)ను సీక్రెట్‌గా పెళ్లాడింది. దంపతులుగా కొత్త జీవితం ప్రారంభించి నాలుగు నెలలైందో లేదో అప్పుడే విడాకులు కావాలన్నాడు అభిజిత్‌. అదితి.. నటుడు సమర్థ్య గుప్తా అత్యంత సన్నిహితంగా ఉండటం చూశానని, తనతో ఉండలేనని మీడియా ముందు వాపోయాడు.

సీక్రెట్‌ పెళ్లి- విడాకులు.. స్పందించిన నటి
తాజాగా ఈ విడాకుల వ్యవహారంపై అదితి తొలిసారిగా స్పందించింది. పెళ్లయిన నెలకే గొడవలు మొదలయ్యాయి. నాతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇంకా చాలా జరిగాయి. కానీ విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నందున ఇ‍ప్పుడవేవీ చెప్పలేను. అతడితో ఉండలేనని అర్థమైంది. అందుకే శాంతియుతంగా విడిపోవాలనుకున్నాం. ఇరు కుటుంబాలు అందుకు ఒప్పుకున్నాయి. అతడు చాలాసార్లు నా ఫ్రెండ్స్‌ ముందు.. నన్ను, నా కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడాడు. కానీ నేను ఎన్నడూ అతడి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. తనలా నేను హింసించలేదు. మనస్ఫూర్తిగా ప్రేమించాను.

అందుకే చెప్పలేదు
మరో విషయం.. మేము రహస్యంగా పెళ్లి చేసుకోలేదు. మా కుటుంబాలు, క్లోజ్‌ ఫ్రెండ్స్‌, బంధువులందరికీ మా వివాహం గురించి తెలుసు. అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్లి జరిగింది. నా కెరీర్‌ గ్రాఫ్‌ బాగుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకున్నానని తెలిస్తే బాగోదనిపించింది. ఎందుకంటే అపోలెనా సీరియల్‌లో నేను 18 ఏళ్ల అమ్మాయి పాత్ర పోషిస్తున్నాను. అందుకే పబ్లిక్‌కు ఈ విషయం గురించి ఇప్పుడే చెప్పకూడదనుకున్నాను అని అదితి శర్మ చెప్పుకొచ్చింది. 

అపోలెనా సీరియల్‌ నటుడు సమర్థ్య గుప్తాతో అదితి

ఆన్‌స్క్రీన్‌ కపుల్‌ మాత్రమే..
ఇకపోతే అపోలెనా సీరియల్‌లో సమర్థ్య గుప్తా- అదితి జంటగా నటిస్తున్నారు. వీరు సన్నిహితంగా ఉంటూ దొరికిపోయారన్న అభిజిత్‌ మాటలపై సమర్థ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము ఆన్‌స్క్రీన్‌పై మాత్రమే జంటగా కనిపిస్తామన్నాడు. అభిజిత్‌ చెప్పినట్లుగా తాము అడ్డంగా దొరికిపోయామన్నదాంట్లో ఎటువంటి నిజం లేదని వెల్లడించాడు. ఇలాంటి పిచ్చికామెంట్ల వల్ల తన పేరెంట్స్‌ ఇబ్బందిపడుతున్నారన్నాడు.

చదవండి: ‘దిల్‌ రూబా’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement