
సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కుబ్రా సైత్. ఇటీవలే షాహిద్‌కపూర్ హీరోగా నటించిన దేవా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కుబ్రా సైత్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. గతంలో తనకు అబార్షన్ జరిగినప్పుడు ఎదురైన ఇబ్బందులను వివరించింది. ఆ సమయంలో తాను ధైర్యం కోల్పోయినట్లు వెల్లడించింది. అది తన జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదని తెలిపింది.
ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. 'నేను అబార్షన్‌కు వెళ్లినప్పుడు బలంగా ఉన్నట్లు అనిపించలేదు. ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నా. అలా చేయకుంటే బతుకుతానని చెప్పే ధైర్యం, శక్తి నాకు లేవు. ఆ సమయంలో నేను చాలా బలహీనంగా భావించా. నాకు ఏదో వెలితిగా అనిపించింది. అస్సలు విలువ ఉండదేమో అనుకున్నా. కానీ దాని నుంచి బయటపడేందుకు చాలా కాలం పట్టింది. నా కోసం ఒక నిర్ణయం తీసుకున్నా. అది కూడా నా సొంత ఆలోచనలకు కట్టుబడి నిర్ణయించుకున్నా. ఇక్కడ నేను సామాజిక నిబంధనలను ఉల్లంఘించాను అనడానికి ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేనే స్వయంగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నా. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు' అని వెల్లడించింది. ఓసారి తన స్నేహితురాలతో కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్‌తో ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. ఆ సమయంలో తన కళ్లలో నీళ్లు వచ్చాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment