Sacred Games
-
ఓటీటీలో నెంబర్‌వన్ సిరీస్.. కానీ దారుణమైన ట్రోల్స్: నటి
బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్. 2018లో ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్ అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఐఎండీబీ ప్రకటించిన ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సిరీస్ తర్వాతే మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్-5లో నిలిచాయి. అయితే ఈ సిరీస్‌లో నటించిన మరో నటి రాజశ్రీ దేశ్‌పాండే. 'సేక్రెడ్ గేమ్స్'లో సుభద్ర పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో భార్యగా నటించింది. అయితే ఈ సిరీస్‌లో చాలా ఇంటిమేట్ సీన్స్‌లో నటించడంతో విమర్శలకు గురైంది. గతేడాది ట్రయల్ బై ఫైర్ అనే వెబ్ సిరీస్‌తోనూ అభిమానులను అలరించింది. అయితే తాజాగా ఆమె నటించిన మరాఠీ చిత్రం సత్యశోధక్ జనవరి 5న థియేటర్లలో రిలీజైంది. నీలేష్ జలంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె సావిత్రి జ్యోతిబాయి పూలే పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాజశ్రీ.. సేక్రెడ్ గేమ్స్ రిలీజయ్యాక వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్‌పై స్పందించారు. రాజశ్రీ దేశ్‌పాండే మాట్లాడుతూ..''సేక్రెడ్ గేమ్స్‌లో నా సీన్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతే కాకుండా మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేశారు. ఆ సిరీస్ తర్వాత నాపై వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నన్ను పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ చేశారు. నేను రైతులు, సామాజిక సమస్యల గురించి చాలాసార్లు మాట్లాడా. కానీ వాటి గురించి ఎవరూ రాయలేదు. ఇలాంటి వాటికే మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఈ విషయం నాకు చాలా బాధేసింది' అని తెలిపింది. Victory!🌟#RajshriDeshpande shares some beautiful words after winning big at the #FilmfareOTTAwards2023, co-powered by Hyundai Motor India, Ajio and Film Bandhu - Government of Uttar Pradesh, in association with Fura Gems and ITC Fiama.@AJIOLife @FiamaIndia pic.twitter.com/lhwmUSWpo9 — Filmfare (@filmfare) November 27, 2023 View this post on Instagram A post shared by Rajshri (@rajshri_deshpande) -
ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లు ఇవే! టాప్ 5లో ఏమున్నాయంటే?
ఓటీటీల రాకతో ఎంటర్టైన్మెంట్ డబుల్ అయిందనే చెప్పాలి. కాలక్షేపం కోసం థియేటర్ దాకా వెళ్లనవసరం లేకుండా గడప దాటకుండానే అరచేతిలో కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. థియేటర్లో రిలీజైన సినిమాలతో పాటు ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ చేసుకుని మరీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు లేదా కొత్త వెబ్ సిరీస్‌లతో మస్త్ మజా అందిస్తున్నాయి. దీంతో గడిచిన రెండేళ్లలోనే ఓటీటీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారి అభిరుచికి తగ్గట్లుగానే కామెడీ, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని రకాల కంటెంట్‌ను అందిస్తోంది. ఈ సినిమాలు, సిరీస్‌లపై రివ్యూలు ఇచ్చే ఐమ్డీబీ ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. సాక్ర్డ్ గేమ్స్, మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరి ఇంకా ఏయే సిరీస్‌లు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాయి? అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో కింది పట్టికలో చూసేయండి. వాటిలో మీకు నచ్చినవాటిని వీకెండ్లో చూసేయండి. ర్యాంక్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 1 సాక్ర్డ్ గేమ్స్ నెట్‌ఫ్లిక్స్ 2 మీర్జాపూర్ అమెజాన్ ప్రైమ్ 3 స్కామ్ 1992 సోనీలివ్ 4 ద ఫ్యామిలీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్ 5 ఆస్పిరంట్స్ యూట్యూబ్ 6 క్రిమినల్ జస్టిస్ హాట్‌స్టార్ 7 బ్రీత్ అమెజాన్ ప్రైమ్ 8 కోటా ఫ్యాక్టరీ నెట్‌ఫ్లిక్స్ 9 పంచాయత్ అమెజాన్ ప్రైమ్ 10 పాతాళ్ లోక్ అమెజాన్ ప్రైమ్ 11 స్పెషల్ ఓపీఎస్ హాట్‌స్టార్ 12 అసుర్: వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ జియో సినిమా 13 కాలేజ్ రొమాన్స్ సోనీలివ్ 14 అఫరన్ జియో సినిమా 15 ఫ్లేమ్స్ అమెజాన్ ప్రైమ్ 16 దిండోరా యూట్యూబ్ 17 ఫర్జి అమెజాన్ ప్రైమ్ 18 ఆశ్రమ్ MX ప్లేయర్ 19 ఇన్సైడ్ ఎడ్జ్ అమెజాన్ ప్రైమ్ 20 ఉందేఖి సోనీలివ్ 21 ఆర్య హాట్‌స్టార్ 22 గుల్లక్ సోనీలివ్ 23 టీవీఎఫ్ పిచర్స్ జీ5 24 రాకెట్ బాయ్స్ సోనీలివ్ 25 ఢిల్లీ క్రైమ్స్ నెట్‌ఫ్లిక్స్ 26 క్యాంపస్ డైరీస్ MX ప్లేయర్ 27 బ్రోకెన్: బట్ బ్యూటిఫుల్ MX ప్లేయర్ 28 జంతారా: సబ్కే నంబర్ ఆయేగా నెట్‌ఫ్లిక్స్ 29 తాజ్ ఖబర్ హాట్‌స్టార్ 30 అభయ్ జీ5 31 హాస్టల్ డేస్ అమెజాన్ ప్రైమ్ 32 రంగ్‌బాజ్ జీ5 33 బందిష్ బందిత్స్ అమెజాన్ ప్రైమ్ 34 మేడ్ ఇన్ హెవన్ అమెజాన్ ప్రైమ్ 35 ఇమ్మాచ్యూర్ అమెజాన్ ప్రైమ్ 36 లిటిల్ థింగ్స్ నెట్‌ఫ్లిక్స్ 37 ద నైట్ మేనేజర్ హాట్‌స్టార్ 38 క్యాండీ జియో సినిమా 39 బిచ్చూ కా ఖేల్ జీ5 40 దహన్: రాఖన్ కా రహస్య హాట్‌స్టార్ 41 జేఎల్ 50 సోనీలివ్ 42 రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ 43 రే నెట్‌ఫ్లిక్స్ 44 సన్‌ఫ్లవర్ జీ5 45 ఎన్సీఆర్ డేస్ యూట్యూబ్ 46 మహారాణి సోనీలివ్ 47 ముంబై డైరీస్ 26/11 అమెజాన్ ప్రైమ్ 48 చాచా విధాయక్ హై హమారా అమెజాన్ ప్రైమ్ 49 యే మేరీ ఫ్యామిలీ అమెజాన్ మినీ టీవీ 50 అరణ్యక్ నెట్‌ఫ్లిక్స్ View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: పంచెకట్టులో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్ -
Hijab Protests: వలువలు విప్పేసి స్ట్రాంగ్ మెసేజ్
న్యూఢిల్లీ: మహ్సా అమినీ(22) మృతి చెంది నెలన్నర గడుస్తోంది. అయినా ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనల సెగ చల్లారడం లేదు. పైగా ఇరాన్ వనితాలోకం పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతూ పోతోంది. తాజాగా ఇరాన్‌కు చెందిన ఓ నటి తన వలువలు విప్పి తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది. ఇరాన్ నటి, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సాక్రెడ్ గేమ్స్‌లో నటించిన ఎల్నాజ్ నోరౌజీ(30) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరాన్ పోలీసుల నైతికతకు వ్యతిరేకంగా ఓ వీడియోను ఉంచింది. నిండుగా బుర్ఖాలో వచ్చిన ఆమె.. ఒక్కొక్కటిగా ఒంటిపై ఉన్న వలువలు విప్పేస్తూ చివర్లో.. యాంటీ హిజాబ్ నినాదాన్ని పోస్టు చేసి నిరసనను తెలియజేసింది. ‘‘ప్రతి స్త్రీ.. ప్రపంచంలో ఏమూల ఉన్నా.. ఎక్కడి నుంచి వచ్చినా.. ఎప్పుడైనా, ఎక్కడైనా తనకు నచ్చింది ఆమె ధరించే హక్కును కలిగి ఉండాలి. ఏ మగవాడుగానీ, మరేయితర స్త్రీగానీ ఆమెను వేరే దుస్తులు ధరించమని అడిగే హక్కు ఉండకూడదు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం ఉంచింది. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉంటాయి. వారిని అంతా గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే నిర్ణయించే అధికారం. ప్రతి స్త్రీకి తన శరీరంపై నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలి. నేను నగ్నత్వాన్ని ప్రచారం చేయడం లేదు.. స్వేచ్ఛను మాత్రమే ప్రచారం చేస్తున్నాను అంటూ పోస్ట్ చేసిందామె. ఇరాన్‌కు చెందిన నటి నోరౌజీ.. నటన కంటే ముందు పదేళ్ల పాటు డియోర్, లాకాస్టే, లె కాక్యూ స్పోర్టివ్ లాంటి బ్రాండ్స్‌కు మోడల్‌గా పని చేశారు. పర్షియన్ ట్రెడిషనల్ డ్యాన్స్‌తో పాటు భారత్‌లో కథక్‌ను సైతం ఆమె నేర్చుకున్నారు. View this post on Instagram A post shared by Elnaaz Norouzi (@iamelnaaz) This Video Is Not To Promote Nudity -
మాటలకు మించిన థెరపీ ఉండదు
కుబ్రా సేఠ్ ఈ జన్మనామం కన్నా ‘కుకూ’ అనే పాత్ర పేరుతోనే పాపులర్. కారణం.. ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌లోని ఆ భూమిక ట్రాన్స్‌జెండర్ కావడం.. దాన్ని కుబ్రా అద్భుతంగా పోషించడం. కుబ్రా స్క్రీన్ లైఫ్ ఎంత ఆసక్తికరమో ఆమె రియల్ లైఫ్ అంతే స్ఫూర్తిమంతం. ‘కుబ్రా’ అంటే అరబిక్‌లో ‘గ్రేట్’ అని అర్థం. ఆ సార్థకనామధేయురాలి గురించి... పుట్టిపెరిగింది బెంగళూరులో. తల్లిదండ్రులు... యాస్మిన్ సేఠ్ మహ్మద్ హదీద్. రేడియో జాకీ.. దానిష్ సేఠ్ ఆమె తమ్ముడు. ఇంట్రావర్ట్ టు ఎక్సాట్రావర్ట్... కుబ్రా తల్లి సంరక్షణలో పెరిగింది. ఏడవతగరతి వచ్చే వరకు ఎవ్వరితో మాట్లాడకుండా, కలవకుండా తనలో తానుగా ఉండేదట. అమ్మ యాస్మిన్ .. కూతురిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రయత్నం చేసింది. ఫలించి తర్వాతికాలంలో మంచి పబ్లిక్ స్పీకర్‌గా మారింది కుబ్రా. తనదైన హాస్యచతురతతో నలుగురునీ నవ్విస్తూ ఉంటుందెప్పుడూ. ‘మిస్ పర్సనాలిటీ.. బీబీఎమ్ పూర్తవగానే దుబాయ్‌లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం రావడంతో చేరింది. కాని మొదటి నుంచి ‘వినోదం’ అంటే ఇష్టం ఉన్న కుబ్రా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగింది. ఈలోపు దుబాయ్‌లోనే ‘మిస్ ఇండియా వరల్డ్‌వైడ్’ అందాలపోటీలు జరగడంతో అందులో పాల్గొని మిస్ పర్సనాలిటీ టైటిల్‌ను గెలుచుకుంది. దాంతో వచ్చిన మోడలింగ్ అవకాశాలను అందుకొని మైక్రోసాఫ్ట్‌కు ‘బై’ చెప్పింది. యూట్యూబ్ స్టార్.. ఆమెలోని మాట చతురత ‘పెప్ టాక్స్ విత్ కుబ్రా సేఠ్’ అనే యూట్యూబ్ చానెల్‌తో స్టార్‌ను చేసింది. ‘టెడ్ఎక్స్’ ఆమె పలుకులను వినిపించింది. ‘కొమ్యూన్’ కూడా కుబ్రాకు మైక్ ఇచ్చింది. రెడీ.. కుబ్రాను నటిగా పరిచయం చేసిన సినిమా. సేక్రెడ్ గేమ్స్.. 2017లో వెబ్ సిరీస్‌లో ప్రవేశించినా బ్రేక్‌నిచ్చింది మాత్రం అనురాగ్ కశ్యప్, విక్రమ్ మోత్వానీలు దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘సేక్రెడ్ గేమ్స్’. అందులోని ట్రాన్స్‌జెండర్ క్లబ్, క్యాబరే డాన్సర్ కుకూ పాత్ర ఆమెకు ఇంటింటా అభిమానులను సంపాదించి పెట్టింది. కుబ్రా కన్నా కుకూగానే ఫేమస్ చేసింది. వకాలత్ ఫ్రమ్ హోమ్.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లోని కుబ్రా లేటెస్ట్ సిరీస్. ఈ కామెడీ సిరీస్‌లో కుబ్రా లాయర్‌గా నటించి వీక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ప్రయాణాలు, సాహస క్రీడలు అంటే చాలా ఇష్టం కుబ్రాకు. స్కూబా డైవింగ్, బంగీ జంప్‌లో దిట్ట. ‘‘మాటలకు మించిన థెరపీ ఉండదు. అవి మనిషికిచ్చే బలమెంతో నేను రియలైజ్ అయ్యేలా చేసి.. నన్ను మంచి మాటకారిగా మార్చి.. నాకో గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దింది మా అమ్మే’’ అంటుంది కుబ్రా సేఠ్. -
క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ(26) మృతి చెందారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె శనివారం మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్దెమినిదేళ్ల వయస్సులోనే స్యామా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని నవాజుద్దీన్ గతేడాది సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా... చిన్న వయస్సు నుంచే తన చిట్టి చెల్లెలు చావుతో ధైర్యంగా పోరాడుతోందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దాదాపు ఏడేళ్లుగా స్యామాకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆమె మరణంతో నవాజుద్దీన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక స్యామా అంత్యక్రియలు సిద్ధిఖీ కుటుంబ స్వగ్రామమైన బుధానా(ఉత్తరప్రదేశ్)లో ఆదివారం నిర్వహించినట్లు సమాచారం. కాగా నవాజుద్దీన్ ఇటీవల ‘మోతీచూర్ చక్నాచూర్’ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సాక్రెడ్ గేమ్స్, యూకే సిరీస్ మెక్మాఫియా యూనిట్ తరఫున గత నెలలో జరిగిన ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యాడు. ప్రస్తుతం.. బంగ్లాదేశీ ఫిల్మ్‌మేకర్ సర్వార్ ఫరూఖీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నో ల్యాండ్స్ మ్యాన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో షూటింగ్ జరుగుతుండగానే చెల్లెలి మృతి విషయం తెలియడంతో ఇండియాకు వచ్చినట్లు సమాచారం. My sister ws diagnosed of advanced stage #breastcancer @ 18 bt it ws her will power & courage dat made her stand agnst all d odds she turns 25 2day & still fighting M thankful 2 Dr.@koppiker & @Lalehbusheri13 fr motivating her & m rly grateful 2 @resulp Sir fr introducng me 2 dem pic.twitter.com/xHsBK8uJDP — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) October 13, 2018 -
కోహ్లి, రవిశాస్త్రిపై ‘రెచ్చిపోయిన’ నెటిజన్లు..!
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం నేడు (శుక్రవారం) ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికి మరో అవకాశం ఇవ్వడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఇదివరకే పూర్తి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో క్రికెట్ అభిమానులు ఒకింత అసహనంతో ఉన్నారు. రవిశాస్త్రిని తప్పిస్తేనే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోహ్లి అనవసరంగా రవిశాస్త్రిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ‘సాక్రెడ్ గేమ్స్’ సీజన్-2 నిన్న (ఆగస్టు 15) విడుదలై దిగ్విజయంగా దూసుకుపోతోంది. ఆ సీరియల్లోని ఓ సన్నివేశాన్ని ఉదహరిస్తూ సోషల్ మీడియా వేదికగా కోహ్లి, రవిశాస్త్రిని బీభత్సమైన మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు. (శాస్త్రికి మరో అవకాశం!) ‘సాక్రెడ్ గేమ్స్’ సీజన్-2లో ప్రధానంగా వివిధ సంస్థల్లో అంతర్గతంగా ఎలాంటి వ్యవహారాలు నడుస్తాయని చూపించారు. తొలి రెండు మూడు ఎపిసోడ్లలో గురు, శిష్యుల సంబంధాన్ని చక్కగా చూపించారు. అయితే, అసలు విషయం ఐదో ఎపిసోడ్లో బయట పడుతుంది. శిష్యుడు గణేష్ గాయితొండే, గురూజీ మధ్య ‘సంబంధం’ వెలుగుచూస్తుంది. ఇక ఈ సన్నివేశం తాలూకు ఫొటోను కోచ్ రవిశాస్త్రి, టీమిండియా కెప్టెన్ కోహ్లికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ‘పోను పోను కోహ్లికి గురూజీ ప్రేమ దొరుకుందిలే..!’ అని ఒకరు.. ‘సాక్రెడ్ గేమ్స్‌లో శిష్యునికి గురూజీ ప్రేమ దొరికింది’ మరొకరు.. కామెంట్లు చేస్తున్నారు. -
పాపం పవిత్రం
సినిమాల్లో, సీరియళ్లల్లో జీవమున్నవే నటిస్తాయి! కానీ ఇందులో ఓ మహానగరానికి ప్రాణం పోశారు.. ఒక క్యారెక్టర్‌గా పిక్చరైజ్ చేశారు.. ప్రధాన భూమికగా.. దాని చుట్టే కథనం నడిపించారు! అదే ‘సేక్రెడ్ గేమ్స్’.. వెబ్ సిరీస్. ఆ ‘మహానగరమే’ ముంబై! పాప పవిత్రాలే థీమ్. మల్టీ స్టోర్ బిల్డింగ్ మీద నుంచి ఓ పామరేనియన్ డాగ్ కిందపడి నేలకు అతుక్కుపోతుంది... బస్ కోసం వెయిట్ చేస్తున్న స్కూల్ పిల్లలు భయంతో బిక్కచచ్చిపోతారు. ‘‘నా గ్యాంగ్‌లోని వాళ్ల మధ్య హిందూముస్లిం అనే తేడా లేదు. ఇప్పుడు మీరొచ్చి ఆ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టొద్దు. ఈ గోపాల్మuŠ‡ను శ్మశానంలా మార్చొద్దు’’ ‘‘నేను ఈజిప్ట్‌లో పుట్టిన టైమ్‌లోనే నువ్వు ముంబైలో పుట్టావు. అప్పుడే రాసి పెట్టాశాడు అల్లా.. మనిద్దరం ఇక్కడ ఇలా కలవాలని.. ’’ అంటూ టేబుల్‌కు కట్టేసి ఉన్న రెండు చేతుల్లోని ఒక చేయి బొటన వేలును నరికేస్తాడు.నేల మాళిగలో ఓ వ్యక్తి బందీగా ఉంటాడు. పైన మొదటి వాక్యం ఓపెనింగ్ షాట్. మధ్యలోని రెండు వేరు వేరు సీన్లకు సంబంధించిన రెండు డైలాగులు. చివరిది లాస్ట్ షాట్! ఇవి ‘సేక్రెడ్ గేమ్స్’ అనే వెబ్సిరీస్లోనివి. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఫస్ట్ ప్రొడక్షన్. మొదలవగానే పాపులర్ అయింది. టాప్ రేటింగ్‌కి వెళ్లిపోయింది. అసలు కథ.. 2006లో విక్రమ్ చంద్ర రాసిన నవల ‘‘సేక్రెడ్ గేమ్స్’’ ఆధారంగా చిత్రీకరించారు ఈ వెబ్‌సిరీస్‌ను. నవలలో కథాకాలం 1980, 90ల నాటిది. సిరీస్‌లో దాన్ని ఇప్పటి పరిస్థితులనూ కలిపారు. ముంబై చుట్టే తిరుగుతుంది.. అనేకన్నా ముంబై కూడా ఓ ప్రధాన భూమిక అంటే బాగుంటుంది. ఒకరు దీన్ని ఆకాశ హర్మ్యాలున్న చెత్తకుండిగా చూస్తారు. ఇంకొకరికి ఇది.. తెల్లవార్లూ బిడ్డలను కాపుకాస్తున్న తల్లిలాంటిది. మరోకోణంలో.. కాలుష్యంతో మసకబారిన నింగి,నేలకు మాఫియా మర్డర్లతో ఎరుపును అద్దే రంగుల కంచం. వెరుపు పుట్టించే బూచీ. ఈ వాతావరణం అక్కడున్న మనుషులకు ఒక్కో నేపథ్యాన్ని ఖాయం చేస్తుంది. అలాంటి భిన్న బ్యాక్‌గ్రౌండ్స్‌తో ఉన్న క్యారెక్టర్లే కనిపిస్తాయి సేక్రెడ్ గేమ్స్‌లో. కాలంతో పందెం పెట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్. త్రీ యాంగిల్స్.. త్రీ క్యారెక్టర్స్ మాఫియా, పోలీస్, రా.. త్రీ యాంగిల్స్. గణేశ్ గైతొండే, సర్తాజ్ సింగ్, అంజలీ మాథుర్.. త్రీ క్యారెక్టర్స్. గణేశ్ గైతొండే (నవాజుద్దీన్ సిద్దిఖీ)... ఓ బ్రాహ్మణుడు. యాచన చేస్తున్న తండ్రి తీరు నచ్చదు. ఆ నైజం గైతొండే తల్లికీ నచ్చదు. చేతకాని తనంగా పరిగణిస్తుంది. ఇంకో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. తల్లి అంటే ఇష్టమున్న గైతొండే ఆమె ప్రవర్తనను అసహ్యించుకుంటాడు. కోపం తెచ్చుకుని ఓ రోజు తల్లిని, పక్కనున్న వ్యక్తినీ చంపేసి ఊరు వదిలి పారిపోతాడు. అప్పటికి అతని వయసు పదేళ్లు. మధ్యలో ఎన్నో దార్లు. గాడ్ ఫాదర్లు. అలా ముంబైలో సెటిల్ అవుతాడు. డంప్‌యార్డ్‌ను ఆక్రమించుకుని.. మద్యం మహారాజుగా ఎదిగి.. గ్యాంగ్‌స్టర్‌గా స్థిరపడ్తాడు. మారుతున్న ముంబై రాజకీయ,సాంఘిక పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షిగా ఉంటాడు. ఇసా అనే ముస్లిం గ్యాంగ్ లీడర్ తన గ్యాంగ్‌లోని హిందువులను టార్గెట్ చేసిన తర్వాత కరడుగట్టిన హిందూ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. సర్తాజ్ సింగ్ (సైఫ్ అలీ ఖాన్).. సిన్సియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. అతని తండ్రి కూడా పోలీసే. వృత్తిలో తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుంటాడు. కాని పరూల్కర్ అనే పై అధికారి సర్తాజ్ను ‘‘అసమర్థ’’ ఇన్స్పెక్టర్గా నిరూపించే ప్రయత్నం చేస్తుంటాడు. కారణం.. సర్తాజ్ నిజాయితీ పరూల్కర్కు అడ్డంకిగా మారుతుంది. ఓ హత్యను ఎన్‌కౌంటర్‌గా మార్చి.. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేస్తుంటాడు పరూల్కర్. ఒప్పుకోడు సర్తాజ్. అందుకే సర్తాజ్ ఏ కేస్ డీల్ చేస్తున్నా ఆటంకాలను సృష్టిస్తుంటాడు. సర్తాజ్ ముక్కుసూటి వ్యవహారం, కచ్చితత్వం అతని వైవాహిక జీవితంలోనూ సమస్యలను క్రియేట్ చేస్తుంది. దాంతో అతని భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. ప్రొఫెషనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్‌లోని వైఫల్యాలతో సర్తాజ్ తీవ్ర అసంతృప్తికి లోనవుతాడు. నిద్రలేమి బారిన పడ్తాడు. యాంటీ యాంగై్జటీ పిల్స్‌కు బానిసవుతాడు. అంజలీ మాథుర్ (రాధికా ఆప్టే).. ‘రా’ ఏజెంట్. ఆమె తండ్రీ కూడా ‘రా’ ఉద్యోగే. ఏదో అసైన్‌మెంట్‌లో మిస్సింగ్‌గా ఉంటాడు. ఏళ్లు గడిచినా జాడ దొరకదు. రా వింగ్ అతను చనిపోయాడనే అనుకుంటుంది. ఆ మాటను అంజలీ ఒప్పుకోదు. ఎక్కడో తన తండ్రి బతికే ఉన్నాడనే భరోసా ఆమెకు. అన్ని చోట్లలాగే ‘రా’లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్‌ను ఫేస్ చేస్తుంటుంది. అసైన్మెంట్స్లోని కేస్‌లతో పాటు ఆ వివక్ష మీదా పోరాటం చేస్తుంటుంది అంజలీ.ఈ ముగ్గురు కాక త్రివేది అనే ఓ పాత్రా కథలో బలంగా వినపడుతుంది. గైతొండే, సర్తాజ్, అంజలివి వేరు వేరు ప్రపంచాలు. వేరువేరు ఉద్యోగాలుగా కనిపిస్తున్నా కామన్ కనెక్షన్ క్రైమ్. ఇంకో సారూప్యత.. ఈ ముగ్గురూ ‘డాడీ ఇష్యూస్’తో ఉన్నవారే. అంటే తండ్రులకు సంబంధించి ఏదో ఒకరకమైన ప్రభావంతో పెరిగినవారే. పోలీస్ ఇన్స్పెక్టర్గా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఉన్నప్పుడే గైతొండే నుంచి ఫోన్ వస్తుంది సర్తాజ్కు. ఆ ఫోన్ ట్రాక్ చేస్తూ చేస్తూ అతను ఉన్న చోటికి చేరుకుంటాడు. ‘‘బాంబే న్యూక్లియర్ త్రెట్‌లో ఉంది. దాన్నుంచి నగరాన్ని కాపాడ్డానికి 25 రోజుల టైమే ఉంది. త్రివేది మాత్రం తప్పించుకుంటాడు’’ అని సర్తాజ్తో చెప్పి అతని ముందే పిస్టోల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు గైతొండే. అప్పటి నుంచి సర్తాజ్ అన్వేషణ మొదలవుతుంది.. ఆ త్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి రూపకర్త ఎవరు? ఎలా ఆపాలి? ఇంతకీ ఆ త్రివేది ఎవరు.. ఎట్సెట్రా ఎట్సెట్రా! ఈ హింట్స్‌తో ఐఎస్ఐకి ఏదైనా సంబంధం ఉందా అని ఇటు రా ఏజెంట్ అంజలీ కూడా ఈ దర్యాప్తు చేపడుతుంది. యాజ్యూజవల్గా సర్తాజ్ ముందుకు వెళ్లకుండా ముల్లులు గుచ్చుతునే ఉంటాడు పరూల్కర్. అయినా తన ఎఫర్ట్‌ను ఆపడు సర్తాజ్. గైతొండే ఇచ్చిన లీడ్‌ను ఛేదించే క్రమంలో మారణాయుధాల స్మగ్లింగ్‌లో సెంట్రల్ హోమ్మినిస్టర్ హస్తమున్నట్టూ తెలుస్తుంది. ఇంకోవైపు సర్తాజ్ ఇన్వెస్టిగేషన్తో ఇంప్రెస్ అయిన అంజలి అతనికి ఓ టాస్క్ అప్పజెప్పుతుంది. దాన్నీ విజయవంతంగా పూర్తి చేస్తాడు సర్తాజ్. ఈలోపు తనను దేశం దాటిస్తే త్రివేది ఆచూకి చెప్తానని గైతొండే అనుచరుడు బంటీ.. అంజలీతో ఒప్పందానికి వస్తాడు. అది తెలియని సర్తాజ్ .. బంటీ పారిపోతున్నాడనుకుని అతనిని కాల్చే ప్రయత్నం చేస్తాడు. ఈ గలాటలో లారీ కింద పడి చనిపోతాడు బంటీ. మంచి క్లూని మిస్ చేశాడని అంజలి, పరూల్కర్లు సర్తాజ్ మీద అసహసంగా ఉంటారు. ఈ ఎంక్వయిరీ నుంచి సేఫ్‌గా బయటపడాలనుకుంటే ఎన్‌కౌంటర్‌కి సంబంధించి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని బ్లాక్మెయిల్ చేస్తాడు పరూల్కర్. ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు సర్తాజ్కు. ఈలోపు ముంబై త్రెట్‌లో ఐఎస్ఐ హ్యాండ్ ఉందేమోనని తేల్చుకునేందుకు ఒక అడుగు ముందుకేసిన అంజలి ఓ అజ్ఞాత వ్యక్తి చేతిలో హత్యకు గురవుతుంది. అతను ఎవరో కాదు.. మారణాయుధాలను సరాఫరా చేస్తున్న స్మగ్లరే అని తేలుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు టీవీలో ఇస్తున్న ప్రవచనాల్లోని ఓ మాట, కనిపిస్తున్న యంత్రం చిహ్నం ఆధారంతో త్రివేది ఉన్న ప్రాంతాన్ని కనుగొంటాడు సర్తాజ్. నేలమాళిగలో బందీగా పడి ఉన్న వ్యక్తి అతడే. ఇంకా ఆ మాళిగలో పేలే పదార్థాలూ ఉంటాయి. అక్కడితో ఎనిమిది ఎపిసోడ్ల సేక్రెడ్ గేమ్స్ .. ఫస్ట్ సీజన్ ఎండ్ అవుతుంది. ఈ కథనం అంతా గతం, వర్తమానం.. బ్యాక్ అండ్ ఫోర్త్గా సాగుతుంది. ఎనభై, తొంభైల సాంఘిక, రాజకీయ వాతావరణం, మతం.. రాజకీయాలకు ఒక ఆయుధంగా మారడం, గోవు, గొడ్డు మాంసం మీదున్న అప్రకటిత నిషేధం, ఎమర్జెన్సీ టైమ్ నుంచి నేటి దాకా దేశంలోని పరిస్థితులు, సెక్స్, మనీ, పవర్ అకృత్యాలు, అండర్ వరల్డ్ అరాచకాలు, ముంబై స్లమ్స్‌లోని చీకటి కోణాలు.. రాజకీయాలకు మాఫియా అండ.. రాజకీయనేతల అండతో మాఫియా వంటి పరస్పర ఆధారిత కార్యకలాపాలు..రెఫ్యూజీల కష్టాలు.. అన్నీటికీ అద్దం సేక్రెడ్ గేమ్స్. దీనికి ప్రాణం.. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే. ‘‘మీరు వాల్మీకి రామాయణం చదివి పెరిగారు.. నేను రామానంద్ సాగర్ రామాయణం చూసి’’ వంటి డైలాగ్స్ ప్రాక్టికాలిటీకి స్క్రీన్ రూపం తీసుకున్నాయి. నవాజుద్దీన్ పోర్షన్‌కు అనురాగ్ కశ్యప్, సైఫ్ అలీ ఖాన్ పోర్షన్‌కు విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్స్‌లో ఒక్కోదానికి పురాణ గాథల్లోని పేర్లను ఎంచుకున్నారు. మొదటి ఎపిసోడ్‌కు అశ్వత్థామ, రెండోదానికి హాలాహల, మూడోదానికి అతాపి వాతాపి, నాలుగోదానికి బ్రహ్మహత్య, అయిదో దానికి సరమ, ఆరోదానికి ప్రేతకల్ప, ఏడోదానికి రుద్ర, ఎనిమిదోదానికి యయాతి అని పేర్లు పెట్టారు. ఈ ఎనిమిది ఎపిసోడ్లు నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నాయి. సభ్యత్వం నమోదు చేసుకొని చూడొచ్చు. – సరస్వతి రమ -
'మాకు దెయ్యాలు ఎలాంటి హానీ చెయ్యలేదు'
రాధికా అప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ ‘గూల్’ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆగస్టు 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో స్పెషల్ సెల్లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్గా రాధిక ఆప్టే నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్‌హౌస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పాట్రిక్ మీడియాతో పంచుకున్నారు. ప్రశ్న: గూల్ తీయాలని మీకు ఎలా అనిపించింది. తొలి ప్రాజెక్టుకే ఇలాంటి స్టోరి ఎందుకు తీసుకున్నారు ? జవాబు: నేను మంచి కాన్సెప్ట్‌తో కూడిన కథను తెరకెక్కిద్దామని అనుకున్నాను. ఇలాంటి కథలు వచ్చి చాలా కాలం అయింది. అలాంటి థ్రిల్లర్‌ను చేయాలని నేను భావించాను. ఒక రచయితగా, దర్శకుడిగా ఇలాంటి ప్రాజెక్టును తెరకెక్కించాలని మొదటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని. నాకు ఈ స్టోరిని తెరకెక్కించడానికి ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్‌హౌస్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు సహకరించాయి. ప్ర: ఈ వెబ్ సిరీస్‌లో పాత్రల, లోకేషన్ల ఎంపిక ఎలా జరిగింది? జ: ప్రశాంత్ సింగ్ నేతృత్వంలో అద్భుతమైన నటులు దొరికారు. ఇందులో ముఖ్యంగా కండలు గల సైనికుల పాత్రల ఎంపిక చాలా కీలకమైంది. కానీ మాకు కావాల్సిన ప్రతీది సమకూర్చారు. మహేశ్‌కు చాలాసార్లు స్క్రీన్ టెస్టు నిర్వహించిన తర్వాత అలీ సయీద్ పాత్రకు అతడే కరెక్ట్ అనే నిర్ధారణకు వచ్చాం. రాధిక, మానవ్‌లు ఇద్దరు గొప్పగా నటించారు. వారికి ఈ తరహా పాత్రల్లో నటించడానికి ఆసక్తి ఉండటం అదృష్టంగా భావిసున్నాను. ఈ సినిమా లోకేషన్(తులిప్ స్టార్ బేస్మెంట్) కూడా చాలా బాగా కుదిరింది. ప్ర: అలాంటి చీకటి ప్రదేశాల్లో షూటింగ్ చేయడానికి ఇబ్బంది కలుగలేదా ? జ: కలిగింది. వాతావరణం చాలా ప్రతికూలంగా ఉండేంది. గాలి కూడా సరిగా ఆడేది కాదు. కొన్ని సార్లు దుర్వాసన భరించలేనంతగా ఉండేది(ముఖ్యంగా భోజనం చేసే సమయంలో). ఈ చిత్రీకరణ సమయంలో ఏ దెయ్యాలు మాకు ఎటువంటి హానీ చెయ్యలేదు(నవ్వుతూ..) ప్ర: మీరు దీనిని థియేటర్లలో రిలీజ్ చేయకుండా నెట్‌ఫ్లిక్స్‌ను ఎందుకు ఎంచుకున్నారు ? జ: ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు చేరాలంటే నెట్‌ఫ్లిక్స్ కన్నా బెటర్ ఆఫ్షన్ కనిపించలేదు. వారు ప్రతి విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తూ.. సపోర్ట్‌గా నిలిచారు. ప్ర: మీరు హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఎందుకు డబ్ చేశారు ? జ: మేము గూల్ ఎంతవరకు సాధ్యమైతే అంత ఎక్కువ మందికి చేరాలని భావించాం. హిందీతోపాటు, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్‌లో డబ్ చేసిన వర్షన్లు కూడా చాలా బాగున్నాయి. ఇది ఎక్కువ మంది ఈ వెబ్ సిరీస్‌ను చూడటానికి ఉపయోగపడుతోంది. ఇండియాలో ఎవరికైతే సబ్ టైటిల్స్ చదువుతూ సినిమా చూడటం నచ్చదో వారికి కూడా డబ్ చేయడం వల్ల దీనిని చూడటానికి ఇష్టపడతారు. ప్ర: ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జ: ఈ విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వెబ్ సిరీస్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు. కొత్త రకమైన కథలు తెరకెక్కిద్దామనుకునే వారికి ఈ విజయం మంచి ఉత్సాహన్ని ఇస్తుందన్ని భావిస్తున్నాను. స్కేర్డ్ గేమ్స్‌కు ఇండియన్ అన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇంత మంచి ఆదరణ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నేను నెగిటివ్ రివ్యూలను చదవను. -
‘ఈ గోడల మధ్య నుంచి.. మీరు తప్పించుకోలేరు’
వివాదాస్పద నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ గూల్. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం స్కేర్డ్ గేమ్స్‌కు మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో గూల్ కూడా విజయం సాధిస్తున్న నమ్మకంతో ఉన్నారు నెట్‌ఫ్లిక్స్ టీం. ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్‌హౌస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు పాట్రిక్ గ్రాహం దర్శకుడు. ఈ సిరీస్‌లో స్పెషల్ సెల్లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్గా రాధిక ఆప్టే కనిపిస్తున్నారు. -
ట్రాన్స్‌జెండర్ అనుకుంటే హ్యాపీనే!
ముంబై : ఓ వెబ్ సిరీస్‌లో కీలకపాత్ర పోషించిన నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పాత్రను చూసిన నెటిజన్లు నిజంగానే ట్రాన్స్‌జెండర్ నుకుని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారట. ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సాక్రిడ్ గేమ్స్’ ఫేమ్ కుబ్రా సైత్. ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్లు ప్రధాన పాత్రలు పోషించారు. నటి కుబ్రా సైత్ కుక్కూ అనే ట్రాన్స్‌జెండర్ రోల్లో కనిపించారు. అయితే వెబ్ సిరీస్ చూసిన నెటిజన్లు కుబ్రా సైత్ నిజంగానే ట్రాన్స్జెండరేనా అని అనుకునేలా నటించారు. దీంతో గూగుల్‌లో కుబ్రా అని టైప్ చేయగానే జెండర్ అనే కీవర్డ్ కనిపిస్తోంది. దీనిపై నటి కుబ్రా స్పందించారు. తనను ట్రాన్స్‌జెండర్ అని ప్రేక్షకులు భావించినందుకు గర్వంగా ఉందన్నారు. ’నాకు ఆ పాత్ర దక్కినందుకు సంతోషంగా ఉన్నా. నా నటనకు దక్కిన గౌరవంగా భావిస్తా. చిన్నప్పుడు స్కూల్లో ఓ నాటకంలో చెట్టు పాత్రను ఎంత నిజాయితీగా పోషించానో.. సాక్రిడ్ గేమ్స్‌లో ట్రాన్స్‌జెండర్ కుక్కూ పాత్రలోనూ అలాగే నటించా. నా సీన్లు బాగా రావడంతో మరిన్ని సీన్లు తీశారు. తన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందింటే నా నటనకు మంచి మార్కులు పడ్డాయని తేలిపోయిందని’ నటి కుబ్రా సైత్ వివరించారు. విక్రమ్ చంద్రా రాసిన నవల ఆధారంగా అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే దర్శకులుగా సాక్రిడ్ గేమ్స్ రూపొందిన విషయం తెలిసిందే. న్యూడ్ సీన్ పలుమార్లు తీస్తే ఏడ్చేశా! : నటి -
అడగకూడని ప్రశ్న!
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో మీకు, నవాజుద్దీన్ సిద్ధిఖీకి మధ్య సెక్స్ సీన్స్ చాలా ఉన్నాయి. ఒక పోర్న్‌స్టార్‌లా నటించారు మీరు. చెయ్యనని చెప్పలేకపోయారా? విలువలకన్నా డబ్బే ముఖ్యం అనుకున్నారా?! రాజశ్రీ దేశ్‌పాండే : డబ్బు సంగతి అలా ఉంచండి. అది ఎప్పటికీ ముఖ్యమే. ‘చెయ్యనని చెప్పలేకపోయారా’ అన్నారు! అంటే.. కథలో ఉన్నదాన్ని చెయ్యనని చెప్పమంటున్నారా? నవల దీనికి ఆధారం. విక్రమ్ చంద్ర అద్భుతంగా ఆ నవలని మలిచినప్పుడు, వరుణ్ గ్రోవర్ అద్భుతంగా ఆ నవలకు మాటలు రాసినప్పుడు, అనురాగ్ కాశ్యప్ అద్భుతంగా ఆ నవలని డైరెక్ట్ చేస్తున్నప్పుడు.. అందులో యాక్ట్ చేస్తున్న నేను కూడా అద్భుతంగానే చేయాలి కదా! ఇదెందుకు ఆలోచించరు మీరు? థీమ్‌ని, యాక్టర్స్‌ని వేర్వేరుగా ఎందుకు చూస్తారు? ఇందులో నవాజుద్దీన్ భార్యని నేను. మా ఇద్దరి మధ్య కొన్ని బెడ్ సీన్స్ ఉన్నాయి. ఐటమ్సాంగ్లా చురుకు పుట్టించడం కోసం పెట్టిన సీన్స్ కావవి. కథకు అవసరమైనవి. అప్పుడు నేను నవాజ్‌కు భార్యగానే నటించాలి తప్ప రాజశ్రీ దేశ్పాండేలా దూరంగా జరిగిపోతే డైరెక్టర్ చెప్పాలనుకున్నది చెప్పగలడా? మీకో సంగతి చెప్పాలి. లైఫ్‌లో నా గోల్ ఒక్కటే.. గ్రామాల్లో స్కూళ్లు, మరుగుదొడ్లు కట్టించడం! కెమెరా ముందు ఉన్నప్పుడు కూడా నా మనసు గ్రామాల్లోనే ఉంటుంది. నవాజుద్దీన్ పక్కలో ఉన్నట్లు నేను మీకు కనిపిస్తాను కానీ ఎక్కడున్నా నాకు కనిపించేది నా గోల్ ఒక్కటే. గ్రామాల్ని చదివించి, గ్రామాల్ని ఆరోగ్యంగా ఉంచడం. ఇందుకోసం నటిగా నేను సక్సెస్ కావడం కూడా అవసరమే కదా! -
‘బోర్‌కొట్టినప్పుడు విడాకులు తీసుకుంటాం
దర్శకుడు అనురాగ్ కశ్యప్, విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీలది హిట్ పెయిర్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘దేవ్ డీ’, ‘బ్లాక్ ఫ్రైడే’, ‘రామన్ రాఘవ్ 2.0’ మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ తీసిన ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌లో నవాజుద్దీన్ ప్రధాన ప్రాతలో నటించారు. అయితే నవాజుద్దీన్‌తో కలిసి పనిచేయడం గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘నేను చేసే పనిలో కొత్తదనం ఉంటేనే నవాజ్‌ను సంప్రదిస్తాను. ఇప్పటి వరకూ మేము చేసిన వాటిల్లో ఒక్కటి కూడా పునరావృతం కాలేదు. ఇప్పటి వరకూ మా ఇద్దరి కాంబినేషన్లో ఏం వచ్చాయి అనే దాని గురించి మాకు ఒక అవగాహన ఉంది. కొత్తగా చెప్పడానికి నా దగ్గర ఏం లేకపోతే ఖాళీగా ఉంటాను, తప్ప రొటీన్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించను’ అన్నారు. అంతేకాక.. ‘మా ఇద్దరి కాంచినేషన్ ఎంత కాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. మా ఇద్దరికి ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు విడాకులు తీసుకుంటాం. కలిసి పనిచేయం’ అన్నారు. నవాజుద్దీన్ గురించి మాట్లాడుతూ ‘నవాజుద్దీన్ ఎంత గొప్ప నటుడో మొత్తం ఇండస్ట్రీకి తెలుసు. అతనికి తన పని అంటే ప్రాణం.. సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. ఇప్పుడు నేను నవాజుద్దీన్‌ను కొత్తగా చూపకపోతే నాకు, మిగితా వారికి తేడా ఉండదు. ఈ పరిశ్రమలో నటులైన, సంగీత దర్శకులైన ఒక్కసారి విజయం సాధిస్తే ఇక మిగతా వారు కూడా వారిని అలానే చూపిస్తుంటారు. ఇక వారు జీవితాంతం అలాంటి పాత్రలకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. నేను మాత్రం ఇలా చేయలేను. విసుగ్గా ఉంటుంది’ అన్నారు. అందుకే ‘అతన్ని ఒకే రకం పాత్రలకు పరిమితం చేయలేను’ అన్నారు. స్వాతంత్ర్యానంతరం జరిగిన రాజకీయ పరిణమాలు ఫలితంగా మొదలైన ముంబై అండర్ వరల్డ్ ఇతివృత్తంగా ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్ సత్రాజ్ సింగ్ అనే నిజాయితి గల పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, నవాజుద్దీన్ సిద్దిఖి అండర్ వరల్డ్ డాన్ గణేష్ గేంతోడ్ పాత్రలో నటిస్తున్నారు. -
బూతు సైట్లలో నటి క్లిప్ హల్చల్
ఓ బోల్డ్ సీన్లో నటించినందుకుగానూ నటి రాజశ్రీ దేశ్‌పాండేకు ఊహించని షాక్ తగిలింది. వెబ్ సిరీస్ సాక్రెడ్ గేమ్స్‌లో ఓ సీన్లో ఆమె టాప్‌లెస్‌గా నటించారు. అయితే ఆ సీన్‌ను అశ్లీల సైట్లలో అప్లోడ్ చేసిన కొందరు.. పోర్న్ నటిగా ఆమె పేరును ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె మండిపడుతున్నారు. ‘అడల్డ్ స్టార్.. బోల్డ్ యాక్టర్... ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. కథను అనుగుణంగా ఆ సీన్ అవసరం. అందుకే అలా నటించా, ఆ మాత్రానికే నన్నో పోర్న్ నటిగా ప్రచారం చేయటం దారుణం. అలాగనీ వారికి బదులు చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్‌సీన్లు నటించే క్రమంలో ఇలాంటి విమర్శలు సహజం. పట్టించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. సాక్రెడ్ గేమ్స్‌లో నవాజుద్దీన్ వైఫ్ క్యారెక్టర్లో నటించిన రాజశ్రీ.. ఓ సీన్లో టాప్ లెస్‌గా నటించారు. ఈ నేపథ్యంలో పోర్న్ సైట్లలో సైతం ఆ సీన్ దర్శనమివ్వటం గమనార్హం. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌లో అశ్లీలత, అసభ్యత ఎక్కువగా ఉందంటూ సెన్సార్ బోర్డుకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. అడల్ట్ కంటెంట్.. పచ్చి బూతులు -
అశ్లీలత.. బీప్ లేకుండా బూతు డైలాగులు!
సెన్సార్ కష్టాలు త్వరలో వెబ్ సిరీస్‌లను కూడా చుట్టుముట్టబోతున్నాయి. ఇప్పటిదాకా బుల్లితెర, వెండితెరలకు మాత్రమే పరిమితమైన సెన్సార్ కత్తెరలను త్వరలో వెబ్ సిరీస్‌కు కూడా వర్తింపజేయాలని ప్రసార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కఠినతరమైన నిబంధనలను రూపొందించబోతున్నట్లు సమాచార సాంకేతిక మరియు ప్రసారాలశాఖ ప్రకటించింది. ‘మార్గదర్శకాలు ఇప్పటికైతే ఓ కొలిక్కి రాలేదు. కానీ, వాటిని రూపొందించి వీలైనంత త్వరగా అన్వయింపజేస్తాం’ అని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘టీవీల్లో ప్రసారం అయ్యే వాటికి ఇప్పటిదాకా నిబంధనలు వర్తిస్తున్నాయి. కానీ, ఇంటర్నెట్ కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. అడ్డు అదుపులేకుండా మేకర్లు హింస, అశ్లీలతను చూపించేస్తున్నారు. ఇది మాములు మోతాదులో ఉంటే పర్వాలేదు. కానీ, శృతి మించిపోతోంది. బీప్ లేకుండా బూతు డైలాగులను వాడేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం. అయితే నియంత్రణ పేరిట.. స్వేచ్ఛను మాత్రం హరించే ఉద్దేశం మాత్రం మాకు లేదు’ అని అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ఏప్రిల్ నెలలో మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో 10 మందితో కూడిన ఓ కమిటీని మార్గకదర్శకాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ తొలిసారిగా పూర్తి భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన ‘సాక్రెడ్ గేమ్స్’ విడుదలై.. వివాదాస్పదమైంది. నేర ప్రపంచం.. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ఓచోట మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని అసభ్య పదజాలంతో దూషించారని, ఆయన పాలన కాలంలో జరిగిన అంశాలను వక్రీకరించారని కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయటం, కాంగ్రెస్ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటం తెలిసిందే. విక్రమ్ చంద్రా నవల ‘సాక్రెడ్ గేమ్స్’ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించగా.. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానీ రూపొందించారు. -
న్యూడ్ సీన్ పలుమార్లు తీస్తే ఏడ్చేశా!
ముంబై : ‘నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావ్ అని నాకు తెలుసు. కానీ అలా చేయవద్దు. సీన్ మరింత బాగా రావడానికి మరోసారి న్యూడ్(నగ్నం)గా కనిపించాలని’ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పలుమార్లు చెప్పారని నటి కుబ్రా సైత్ అన్నారు. హాలీవుడ్లో విజయవంతమైన వెబ్ సిరీస్‌ల బాటలో ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ కొందరు దర్శకులు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో వచ్చిన బాలీవుడ్ వెబ్ సిరీసే సాక్రిడ్ గేమ్స్. జాతీయ మీడియా ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. ‘నేను ఈ వెబ్ సిరీస్‌లో కుక్కూ అనే ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించాను. కొన్ని సీన్లలో నేను నగ్నంగా కనిపించాల్సి ఉంటుందని దర్శకుడు అనురాగ్ కశ్యప్, కో డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానీ ముందుగానే చెప్పారు. అయితే వచ్చిన చిక్కేంటంటే.. నగ్నంగా నటించిన సన్నివేశాన్ని పలుమార్లు చిత్రీకరించేవారు. సీన్ ముగిసిన ప్రతిసారి మరో టేక్ చేద్దామనేవారు. ఇలా కనీసం 7సార్లు అలాంటి సీన్లు చిత్రీకరించారు. ఆ సమయంలో నేను దాదాపు ఏడ్చేశాను. ఆ సీన్లు పలుమార్లు తీస్తున్నానని తప్పుగా భావించవద్దని, సీన్ మరింత అందంగా, ఆకర్షణీయంగా రావడానికి అలా చేయాల్సి వచ్చిందని కశ్యప్ చెప్పేవారు. నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసునని, అయితే దయచేసి ఆ పని చేయవద్దని కశ్యప్ పదే పదే నన్ను అడిగేవారు. వెబ్ సిరీస్ విడుదలయ్యాక ఆ సీన్లు చూసి చాలా బాగా తీశారు. న్యూడ్ సీన్లను కూడా చాలా అందంగా చిత్రీకరించారు. మంచి టీమ్‌తో పని చేశానని మీరు భావిస్తారని’ అనురాగ్ కశ్యప్ తనతో చర్చించేవారని నటి కుబ్రా సైత్ వివరించారు. 1980, 90 దశాబ్దాలలో ముంబైలో గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య జరిగే దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. సాక్రిడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్ల నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వెబ్ సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.