బూతు సైట్లలో నటి క్లిప్‌ హల్‌చల్‌ | Rajshri Bold Video in Sacred Games goes Viral | Sakshi
Sakshi News home page

Jul 15 2018 11:44 AM | Updated on Apr 3 2019 6:34 PM

Rajshri Bold Video in Sacred Games goes Viral - Sakshi

ఓ బోల్డ్‌ సీన్‌లో నటించినందుకుగానూ నటి రాజశ్రీ దేశ్‌పాండేకు ఊహించని షాక్‌ తగిలింది. వెబ్‌ సిరీస్‌ సాక్రెడ్‌ గేమ్స్‌లో ఓ సీన్‌లో ఆమె టాప్‌లెస్‌గా నటించారు. అయితే ఆ సీన్‌ను అశ్లీల సైట్లలో  అప్‌లోడ్‌ చేసిన కొందరు.. పోర్న్‌ నటిగా ఆమె పేరును ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె మండిపడుతున్నారు. ‘అడల్డ్‌ స్టార్‌.. బోల్డ్‌ యాక్టర్‌... ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. కథను అనుగుణంగా ఆ సీన్‌ అవసరం. అందుకే అలా నటించా, ఆ మాత్రానికే నన్నో పోర్న్‌ నటిగా ప్రచారం చేయటం దారుణం. అలాగనీ వారికి బదులు చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్‌సీన్లు నటించే క్రమంలో ఇలాంటి విమర్శలు సహజం. పట్టించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. సాక్రెడ్‌ గేమ్స్‌లో నవాజుద్దీన్‌ వైఫ్‌ క్యారెక్టర్‌లో నటించిన రాజశ్రీ.. ఓ సీన్‌లో టాప్‌ లెస్‌గా నటించారు. ఈ నేపథ్యంలో పోర్న్‌ సైట్లలో సైతం ఆ సీన్‌ దర్శనమివ్వటం గమనార్హం. అంతేకాదు ఈ వెబ్‌ సిరీస్‌లో అశ్లీలత, అసభ్యత ఎక్కువగా ఉందంటూ సెన్సార్‌ బోర్డుకు పలు ఫిర్యాదులు కూడా అందాయి.   అడల్ట్‌ కంటెంట్‌.. పచ్చి బూతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement