ఓటీటీలో నెంబర్‌వన్‌ సిరీస్‌.. కానీ దారుణమైన ట్రోల్స్: నటి | Rajshri Deshpande UPSET With Chatter Around Her Sacred Games | Sakshi
Sakshi News home page

'సూపర్ హిట్ సిరీస్.. ఆ సీన్స్ వల్ల నటిపై దారుణంగా ట్రోల్స్'

Published Fri, Jan 5 2024 6:09 PM | Last Updated on Fri, Jan 5 2024 6:46 PM

Rajshri Deshpande UPSET With Chatter Around Her Sacred Games - Sakshi

బాలీవుడ్‌ స్టార్ నవాజుద్దీన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్. 2018లో ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్‌ అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఐఎండీబీ ప్రకటించిన ఇండియాలో టాప్‌ 50 వెబ్‌ సిరీస్‌ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సిరీస్ తర్వాతే మీర్జాపూర్‌, స్కామ్‌, ద ఫ్యామిలీ మ్యాన్‌, ఆస్పిరంట్‌ టాప్‌-5లో నిలిచాయి. 

అయితే ఈ సిరీస్‌లో నటించిన మరో నటి రాజశ్రీ దేశ్‌పాండే.  'సేక్రెడ్ గేమ్స్'లో సుభద్ర పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో భార్యగా నటించింది. అయితే ఈ సిరీస్‌లో చాలా ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించడంతో విమర్శలకు గురైంది. గతేడాది ట్రయల్‌ బై ఫైర్ అనే వెబ్‌ సిరీస్‌తోనూ అభిమానులను అలరించింది. అయితే తాజాగా ఆమె నటించిన మరాఠీ చిత్రం సత్యశోధక్ జనవరి 5న థియేటర్లలో రిలీజైంది. నీలేష్ జలంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె సావిత్రి జ్యోతిబాయి పూలే పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాజశ్రీ.. సేక్రెడ్ గేమ్స్ రిలీజయ్యాక వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్‌పై స్పందించారు. 

రాజశ్రీ దేశ్‌పాండే మాట్లాడుతూ..''సేక్రెడ్ గేమ్స్‌లో నా సీన్స్‌ను సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. అంతే కాకుండా మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేశారు. ఆ సిరీస్ తర్వాత నాపై వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నన్ను పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ చేశారు. నేను రైతులు, సామాజిక సమస్యల గురించి చాలాసార్లు మాట్లాడా. కానీ వాటి గురించి ఎవరూ రాయలేదు. ఇలాంటి వాటికే మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఈ విషయం నాకు చాలా బాధేసింది' అని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement