నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో మీకు, నవాజుద్దీన్ సిద్ధిఖీకి మధ్య సెక్స్ సీన్స్ చాలా ఉన్నాయి. ఒక పోర్న్‌స్టార్‌లా నటించారు మీరు. చెయ్యనని చెప్పలేకపోయారా? విలువలకన్నా డబ్బే ముఖ్యం అనుకున్నారా?!
రాజశ్రీ దేశ్‌పాండే : డబ్బు సంగతి అలా ఉంచండి. అది ఎప్పటికీ ముఖ్యమే. ‘చెయ్యనని చెప్పలేకపోయారా’ అన్నారు! అంటే.. కథలో ఉన్నదాన్ని చెయ్యనని చెప్పమంటున్నారా? నవల దీనికి ఆధారం. విక్రమ్ చంద్ర అద్భుతంగా ఆ నవలని మలిచినప్పుడు, వరుణ్ గ్రోవర్ అద్భుతంగా ఆ నవలకు మాటలు రాసినప్పుడు, అనురాగ్ కాశ్యప్ అద్భుతంగా ఆ నవలని డైరెక్ట్ చేస్తున్నప్పుడు.. అందులో యాక్ట్ చేస్తున్న నేను కూడా అద్భుతంగానే చేయాలి కదా! ఇదెందుకు ఆలోచించరు మీరు? థీమ్‌ని, యాక్టర్స్‌ని వేర్వేరుగా ఎందుకు చూస్తారు? ఇందులో నవాజుద్దీన్ భార్యని నేను. మా ఇద్దరి మధ్య కొన్ని బెడ్ సీన్స్ ఉన్నాయి. ఐటమ్‌సాంగ్‌లా చురుకు పుట్టించడం కోసం పెట్టిన సీన్స్ కావవి.
కథకు అవసరమైనవి. అప్పుడు నేను నవాజ్‌కు భార్యగానే నటించాలి తప్ప రాజశ్రీ దేశ్‌పాండేలా దూరంగా జరిగిపోతే డైరెక్టర్ చెప్పాలనుకున్నది చెప్పగలడా? మీకో సంగతి చెప్పాలి. లైఫ్‌లో నా గోల్ ఒక్కటే.. గ్రామాల్లో స్కూళ్లు, మరుగుదొడ్లు కట్టించడం! కెమెరా ముందు ఉన్నప్పుడు కూడా నా మనసు గ్రామాల్లోనే ఉంటుంది. నవాజుద్దీన్ పక్కలో ఉన్నట్లు నేను మీకు కనిపిస్తాను కానీ ఎక్కడున్నా నాకు కనిపించేది నా గోల్ ఒక్కటే. గ్రామాల్ని చదివించి, గ్రామాల్ని ఆరోగ్యంగా ఉంచడం. ఇందుకోసం నటిగా నేను సక్సెస్ కావడం కూడా అవసరమే కదా!
Comments
Please login to add a commentAdd a comment