question
-
అప్పులపై బాబు సమాధానం చెప్పాల్సిందే.. ఆధారాలతో బయటపెట్టే దమ్ము మీకుందా..
-
బీహార్ బాలికకు ప్రధాని మోదీని ప్రశ్నించే ఛాన్స్!
భాగల్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను తెలియజేస్తూ, దేశ ప్రజలను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇదేవిధంగా ప్రధాని విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం ‘పరీక్షా పర్ చర్చ’(పరీక్షలపై చర్చ) కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారు.ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన చిన్నారులు ప్రధాని మోదీతో సంభాషించే అవకాశాన్ని పొందుతారు. బీహార్‌కు చెందిన సుపర్ణ అనే బాలిక ఈ కార్యక్రమానికి ఎంపిక అయిన వారిలో ఒకరు. ఈ చిన్నారి బీహార్‌లోని భాగల్పూర్లోని సాహెబ్‌గంజ్‌లో కుటుంబంతో పాటు ఉంటోంది. అధికారుల ఇంటర్వ్యూ అనంతరం ఆ చిన్నారి ఎంపికయ్యింది. దీంతో ఆమె ‘పరీక్షా పర్ చర్చ’ కార్యక్రమంలో పాల్గొని, ప్రధాని మోదీని పలు సందేహాలు అడగనున్నారు.సుపర్ణ సిన్హా మీడియాతో మాట్లాడుతూ తాను భాగల్పూర్లోని గవర్నమెంట్ గర్ల్స్ ఇంటర్ లెవల్ హై స్కూల్లో 11వ తరగతి చదువుతున్నానని చెప్పింది. ఈ కార్యక్రమానికి తనను ఎంపిక చేసిన అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపింది. కాగా ప్రతి సంవత్సరం బోర్డు పరీక్షలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో పరీక్షల గురించి చర్చిస్తారు. దీనికి తొలుత ‘ఎగ్జామ్ వారియర్స్’ అని పేరు పెట్టారు. పరీక్షలకు ముందు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం ఈ కార్యక్రమంలోని ప్రధాన లక్ష్యం.ఈ కార్యక్రమంలో పొల్గొనేందుకు తొలుత విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. తరువాత వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ ప్రొఫెసర్లు ఈ ఇంటర్వ్యూ చేస్తారు. అనంతరం విద్యార్థులను ఎంపికచేస్తారు. ఈ విధంగా ఎంపికైన సుపర్ణ బోర్డు పరీక్షల్లో తనకు ఎదురైన అనుభవాలను అందరితో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం జరిగే తేదీని ప్రధాన మంత్రి కార్యాలయం త్వరలోనే వెల్లడించనుంది. గత ఏడాది ఈ కార్యక్రమం జనవరి 29న జరిగింది. ఇది కూడా చదవండి: ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం -
ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? యువతి పోస్ట్ వైరల్
ఉద్యోగం కావాలంటే అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోక తప్పదు. సంబంధిత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే టీం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగ అర్హతలు, సామర్థ్యం, అనుభవం, ఫైనల్‌గా జీతం లాంటి ప్రశ్నలు సాధారణంగా ఉంటాయి. కానీ ఒక మహిళా అభ్యర్థి తన అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వింత ప్రశ్న ఎదురు కావడంతో షాక్ అ అయ్యానంటూపేర్కొంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.యూకేకు చెందిన భారత సంతతికి చెందిన జాన్హవి జైన్ తన అనుభవాన్ని ఎక్స్‌లో షేర్ చేసింది. దీని ప్రకారం ఓ జాబ్ ఇంటర్వ్యూలో సదరు కంపెనీ హెచ్ఆర్ ఉద్యోగి వయసు ఎంత అని అడిగారు. పాతికేళ్లు అని తను జవాబు చెప్పింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందాఅని అడగడంతో అవాక్కయ్యానంటూ చెప్పుకొచ్చింది జాన్హవి. తాను విన్నది నిజమేనా? లేక పొరబడ్డానా? అని ఒక్క క్షణం గందరగోళంలో పడిపోయానని తెలిపింది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు లక్ష 20వేల వ్యూస్, వందల కమెంట్లు వెల్లువెత్తాయి. భారత దేశంలో తమకూ ఇలాంటి అనుభవం ఎదురయ్యాయని చాలామంది సమాధానం ఇచ్చారు. కొంతమంది అయితే పెళ్లి, పిల్లల ప్లానింగ్ గురించి కూడా అడుగుతారు కొన్ని మారవు అంతే కొందరు, ‘‘ఏం చేస్తాం మనం, గర్భసంచులతో పుట్టాం కదా, మనకి కొన్నితప్పవు’’ అని ఒక మహిళ వ్యాఖ్యానించారు. ‘‘నాకు ఇందులో తప్పు ఏమీ కనిపించడం లేదు. ఇది వారి ప్రాజెక్ట్ , టైమ్‌లైన్ కోసం. ఎక్కువ పనిచసేవాళ్లు కావాలి. వారి పనిని ప్రభావితం చేసేలా కుటుంబ బాధ్యతలు వద్దనుకుంటారు" అని మరో వినియోగదారు మద్దతివ్వడం గమనార్హం.This HR of an Indian company asked me how old I am and when I said 25, they asked me if I am looking to marry soon??? Is this still happening??— Janhavi Jain (@janwhyy) November 19, 2024 -
మేధావులకు ప్రశ్న.. చెబితే జాబ్: సీఈఓ పోస్ట్ వైరల్
తెలివితేటలను, ఆలోచనా శక్తిని పెంచుకోవడానికి చాలామంది చదరంగం, పదవినోదం వంటివి ఆడుతారు. అయితే ఇటీవల కాలంలో దీనికోసం బ్రెయిన్ టీజర్లు విరివిగా అందుబాటులోకి వచ్చేసాయి. ఇలాంటివి చూడటానికి గమ్మత్తుగా ఉన్నప్పటికీ.. లోతుగా ఆలోచింపజేస్తాయి. ఈ కోవకు చెందిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది.జెనెసిస్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ 'డినో డియోన్' ఈ పోస్ట్ చేస్తూ.. ఉద్యోగం కావాలంటే దీనికి మూడు సెకన్లలో సరైన సమాధానం చెప్పాలి, అని పేర్కొన్నారు. దీనికి సమాధానం నా ఆరేళ్ళ పిల్లాడు 30 సెకన్లలో చెప్పినట్లు వెల్లడించారు.డినో డియోన్ షేర్ చేసిన పోస్టులో 3x3-3/3+3 అని ఉంది. ఇది కేవలం మేధావులకు మాత్రమే అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వేల లైక్స్ పొందిన ఈ పోస్టుకు.. భారీ సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్లలో.. దీనిని మూడు సెకన్లలో ఎలా చెప్పగలం అని కొందరు చెబితే.. మరికొందరు మూడు సెకన్లలో ఆలోచించడానికి ప్రయత్నించవచ్చని అన్నారు. ఇంకొందరు దీనికి సమాధానం తొమ్మిది అని వెల్లడించారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు సమాధానాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. -
ఇదేనా ‘దూర’దృష్టి!
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాక్ ర్యాంకింగ్‌తో ఆంధ్రా యూనివర్సిటీని అగ్రస్థానంలో నిలబెట్టగా.. ఇప్పుడు సొంత బాకా కొట్టుకునేందుకే అన్నట్టుగా మార్చేశారు. ఏయూలో ఎంఏ జర్నలిజం దూరవిద్య పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన పరీక్షలో ఏయూ వీసీ శశిభూషణరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెప్పు పొందేందుకు టీడీపీ కరపత్రికగా ఉన్న ఈనాడు గురించి ప్రశ్నలు సంధించారు.వీసీ, ఏయూ అధికారుల వ్యవహారంపై విద్యార్థులు నిర్ఘాంతపోయారు. హిస్టరీ ఆఫ్ మాస్ మీడియా పరీక్ష ప్రశ్నపత్రంలో విద్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. సెక్షన్–ఏ లో మొదటి ప్రశ్నలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ 4 మార్కులు ప్రశ్న ఇచ్చారు. ఇందులో ఎనిమిది టాపిక్స్ ఇవ్వగా.. అందులో ఏడు మాత్రం సిలబస్‌లో ఉన్నవే ఇచ్చారు. కానీ.. సిలబస్‌లో లేని ‘ఈనాడు’ గురించి కూడా రాయాలంటూ ప్రశ్నపత్రంలో ఇవ్వడంపై విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈనాడు గురించి సిలబస్‌లో ఉంటే కచ్చితంగా ప్రశ్న ఇచ్చినా ప్రిపేరై రాసేవాళ్లమని.. కానీ, ఎక్కడాలేని ప్రశ్నని ఇస్తే.. తాము ఎలా రాస్తామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎనిమిదింటిలో నాలుగు ప్రశ్నలు మాత్రమే తెలుసనీ.. ఈనాడు బదులు సిలబస్‌లో ఉన్నది ఇచ్చి ఉంటే మరో ప్రశ్న కూడా రాసేవాళ్లమని చెబుతున్నారు. కేవలం ప్రభుత్వం మెప్పు పొందేందుకే వైస్ చాన్సలర్ ఈ విధంగా ప్రశ్నపత్రం తయారు చేయించి ఉంటారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో పరీక్షలో ఇంకెవరి గురించి రాయమని ప్రశ్నపత్నం తయారు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబుకి విడదల రజిని సూటి ప్రశ్న
-
భవిష్యత్తు మార్చేసిన ఒక్క ప్రశ్న
-
‘పెళ్లెప్పుడు?’.. రాహుల్ సమాధానాల జాబితా!
‘పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తరచూ ఎదురవుతుంటుంది. దీనికి అతని నోటి నుంచి సమాధానం తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ గాంధీ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మరోమారు ఈ ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. దానికి రాహుల్ గాంధీ నవ్వుతూ బదులిచ్చారు.రాయ్‌బరేలీ ఎన్నికల ర్యాలీలో ఒక వ్యక్తి రాహుల్‌ను మీ పెళ్లెప్పుడు? అని అడిగాడు. దానికి రాహుల్ నవ్వుతూ ‘త్వరలోనే చేసుకోవాలి’ అని సమాధానమిచ్చారు. గతంలో రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నప్పుడు ఓ ఆరేళ్ల చిన్నారి.. రాహుల్‌తో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించింది. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ప్రస్తుతం నేను పనుల్లో బిజీగా ఉన్నాను’ అని సమాధానమిచ్చారు. వెంటనే ఆ చిన్నారి ‘ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయని’ అడిగింది. ఈ ప్రశ్న వినగానే రాహుల్ ఆశ్చర్యపోయారు. అప్పట్లో రాహుల్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఒకసారి పట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీతో ‘మా మాట విని పెళ్లి చేసుకోండి. సమయం ఏమీ మించిపోలేదు. మీరు పెళ్లి చేసుకుంటే మేము ఊరేగింపులో పాల్గొంటాం. పెళ్లి విషయంలో మీరు మీ అమ్మగారి మాట కూడా వినడం లేదని ఆమె మాతో చెప్ప బాధ పడ్డారు. మీరు పెళ్లి చేసుకోవాల్సిందే’ అని అన్నారు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘మీరు అన్నారంటే.. అయిపోతుంది’ అని అన్నారు.గతంలో రాహుల్ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌కు వెళ్లిన సందర్భంలో ఆయన అక్కడ మోటార్ సైకిళ్లను రిపేర్ చేస్తున్న ఒక మెకానిక్‌తో మాట్లాడారు. అప్పుడు ఆ మెకానిక్ రాహుల్‌తో ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడిగాడు. దానికి రాహుల్ ‘నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే చేసుకుంటాను’ అని సమాధానమిచ్చారు. -
వెయ్యి రూపాయల పథకానికి మరికొన్ని నెలలు?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీలోని మహిళలకు అధికార ఆప్ ప్రభుత్వం నెలనెలా వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పథకం అమలుకు మరికొన్ని నెలలు పట్టేలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ పథకం గురించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలోని మహిళలకు ఈ వెయ్యి రూపాయల సహాయం ఎలా అందజేయనున్నామో, అందుకు ఉన్న నియమాలు ఏమిటో కేజ్రీవాల్ తెలియజేశారు. ప్రభుత్వ పెన్షన్ అందుకోని, ప్రభుత్వ ఉద్యోగంలో లేని, పన్నులు చెల్లించని మహిళలకు నెలనెలా వెయ్యి రూపాయలు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం మహిళలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని అధికారులు పరిశీలించాక ఆ మహిళలకు ప్రతినెలా డబ్బు అందుతుంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుండి ఈ పథకం ఎప్పటి నుండి అమలవుతుందనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్‌లో చర్చించాక ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అంటే ఈ పథకం అమలు కావడానికి కొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. -
బహిరంగంగా ప్రశ్నాపత్రాలు.. నేటి నుంచి వార్షిక పరీక్షలు!
బీహార్ విద్యాశాఖ లీలలు తరచూ బయటపడుతుంటాయి. రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ సెక్రటరీ కెకె పాఠక్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీహార్ విద్యావ్యవస్థలో మార్పురావడం లేదు. దీనికి ఉదాహరణగా ఛప్రా జిల్లా పాఠశాల నిలిచింది. ఈ పాఠశాలలో బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ నిర్వహించబోయే 11వ, 9వ తరగతుల వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాల బండిల్స్ బహిరంగంగా విసిరివేశారు. వీటిని పంపిణీ చేసేందుకు విద్యాశాఖలో ఏ ఉద్యోగి బాధ్యత తీసుకోలేదు. జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లేందుకు ఈ పాఠశాలకు వచ్చి, టెర్రస్ అంతా కలియ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు 9,11 తరగతుల వార్షిక పరీక్షలను మార్చి 13 నుంచి నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలను వెదికేందుకు గత మూడు రోజులుగా ఇక్కడే తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. పరీక్ష తేదీ సమీపించినా కొన్ని పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సంబంధిత ఉపాధ్యాయులకు ఇంకా చేరనేలేదు. మీడియాకు అందిన అందిన సమాచారం ప్రకారం 11వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 13 నుంచి, 9వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో తూర్పు చంపారన్‌లో కూడా విద్యాశాఖాధికారుల ఇటువంటి నిర్లక్ష్యం కనిపించింది. -
సాక్షి మీడియాపై నారా లోకేష్ అక్కసు
-
Sakshi TV-Big Question: ‘‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా
సాక్షి, హైదరాబాద్: జేబుకు తెలియకుండానే పర్సు కొట్టేసే రకం ఆయనది. స్కీమ్ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన స్కామ్ వల్లే ఇప్పుడు కటకటాల పాలయ్యారు. సీమెన్స్ అనే కంపెనీకి తెలియకుండానే వాళ్ల పేరుతో ఒప్పందం చేసుకోవడం ఒక వింత. అయితే అది 100 శాతం ఫ్రాడ్ అని తేల్చేసి బాబు బండారాన్ని బయటపెట్టింది సదరు సీమెన్స్ కంపెనీ. డిజైన్ టెక్ నుంచే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన షెల్ కంపెనీలకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు మళ్లాయి. ఆ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్ని ఈడీ గతంలోనే అరెస్ట్ చేసింది. రూ. 371 కోట్ల దోపిడీలో స్కిల్ చూపించిన చంద్ర బాబు, వికాస్ ఖన్వేల్కర్. స్కిల్ స్కామ్‌లో పక్కా ఆధారాలతో పట్టుబడ్డ బాబు అండ్ గ్యాంగ్.. ‘‘దెబ్బకు ఠా...దొంగల ముఠా’’ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో బిగ్ క్వశ్చన్ రాత్రి 7 గంటలకు.. మీ సాక్షి టీవీలో.. -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్‌లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్‌సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
పెళ్లంటేనే చైనా యువత వెన్నులో వణుకు.. ఎందుకంటే..?
వరుస గృహ హింస కేసులు తలెత్తుతున్న నేపథ్యంలో చైనాలో యువత పెళ్లంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి హింసాత్మక పెళ్లిళ్లు అవసరమా? అనే ప్రశ్నలు యువతలో తలెత్తుతున్నాయని చైనా మీడియాకి చెందిన ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల షాన్డాంగ్ ప్రావిన్స్‌లో భార్యను భర్త హింసాత్మకంగా చంపిన ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఓ భర్త తన భార్యను అతి క్రూరంగా హత్య చేశాడు. కారుతో తన భార్యపై పలుమార్లు దాడి చేశాడు. బాధితురాలు బతికే ఉందని తెలుసుకుని.. మరలా కారును ఆమెపై నుంచి పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త చైనా అంతటా వ్యాపించింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. కుటుంబ కలహాలతోనే 37 ఏళ్ల భర్త తన 38 ఏళ్ల భార్యను కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు ముందు మరో రెండు గృహ హింస కేసులు చైనాలో దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ ఘటనల్లో నిందితులు ప్రదర్శించిన క్రూరత్వం సర్వత్రా ప్రజలను భీతికొల్పే స్థాయిలో ఉంది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన భార్య, మరదలిని కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఎన్నో ఏళ్లుగా గృహ హింస అనుభవిస్తున్న మహిళ.. విడాకులను కోరింది. ఈ క్రమంలో దాడి చేశాడు భర్త. చెంగ్డు ప్రావిన్స్‌లోనూ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. విడాకులను కోరిన భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు ఎనిమిది రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. వారి రెండేళ్ల కాపురంలో భర్త తనపై 16 సార్లు దాడి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలు చైనా ప్రజలకు పెళ్లిపై ఎన్నో ప్రశ్నలను మిగిలిస్తున్నాయని చైనా మీడియా ప్రచురించింది. పెళ్లంటేనే యువత భయపడే పరిస్థితి ఎదురయ్యే ఘటనలు జరగుతున్నాయని వెల్లడించింది. ఇదీ చదవండి: పాకిస్తాన్లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో -
ఉమ్మడి పౌరస్మృతిపై ప్రశ్న..వేడిగా ఉందంటూ దాటవేసిన నితీష్..
బిహార్:ఉమ్మడి పౌరస్మృతిపై ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తోంది. ఈ అంశంలో లా కమిషన్ కూడా ఇప్పటికే వివిధ మత సంస్థల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో యునిఫామ్ సివిల్ కోడ్‌పై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తప్పించుకున్నారు.'ఎండలు బాగా కొడుతున్నాయ్.. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం'..అంటూ సింపుల్‌గా దాటవేశారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్యాయంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని నితీష్ నేతృత్వంలో ప్రముఖ నేతలు జూన్ 23న సమావేశం కానున్నారు. మూడో కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశాలను అందులో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్‌పై తన అభిప్రాయాన్ని నితీష్ కుమార్ చెప్పకుండా దాటవేశారు. కేంద్ర న్యాయ శాఖ సిఫారసుల మేరకు 22వ లా కమిషన్ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను పరిశీలిస్తోంది. జూన్ 14న ఈ మేరకు ప్రముఖ మత సంస్థల అభిప్రాయాన్ని కూడా కమిషన్ కోరింది. అయితే బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. 21వ లా కమిషన్ ఇచ్చిన సిఫారసుల మేరకు యూనిఫామ్ సివిల్ కోడ్ దేశానికి ఇప్పుడే అవసరం లేదని పేర్కొన్నట్లు కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ తెలిపారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా దేశ అవసరాలు ఉండవని అన్నారు. ఇదీ చదవండి:నితీష్ కుమార్ సర్కార్‌కు ఎదురుదెబ్బ ..మద్దతు ఉపసంహరించుకున్న జితన్ మాంఝీ పార్టీ -
కేసీఆర్, గవర్నర్ మధ్య వివాదాల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య వివాదాల నేపథ్యంలో ఆదివారం గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో గవర్నర్ల వ్యవస్థపై వచ్చిన రెండు ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. విశ్వవిద్యాలయాలకు కులపతిగా గవర్నర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తూ జస్టిస్ మదన్ మోహన్ పుంచీ కమిషన్ చేసిన సిఫారుసులపై ఓ ప్రశ్న వచ్చింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితులపై గవర్నర్ తమిళిసై కొంతకాలంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు వీలు కల్పించే బిల్లును ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వర్సిటీలపై గవర్నర్ల ఆజమాయిషీని ప్రశ్నిస్తూ గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఈ ప్రశ్న అడగడం గమనార్హం. ‘ ఏ) రాజ్యాంగ బాధ్యతలను న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించడానికి గవర్నర్‌పై.. రాజ్యాంగం కల్పించని పదవులు, అధికారాల (వర్సిటీల చాన్స్‌లర్ వంటి పదవులు)తో భారం వేయకూడదు. బీ) గవర్నర్‌ను విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా చేయడం ద్వారా అతనికి/ఆమెకు అధికారాలను అప్పగించడం చారిత్రకంగా కొంత ఔచిత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ నేడు కాల, పరిస్థితుల మార్పుతో అది ఉనికిని కోల్పోయింది’ అనే సిఫారసులను ఏ కమిషన్ చేసిందని ప్రశ్న వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 8 బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా దీర్ఘకాలంగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉంచడాన్ని సవాలు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌కు నేరుగా నోటీసులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. గవర్నర్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వానికి నోటిసులిచ్చింది. ఈ కేసు నేపథ్యంలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో మరో ఆసక్తికర ప్రశ్న రావడం గమనార్హం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి, ఒక రాష్ట్ర గవర్నర్లలో ఎవరు తమ పదవీ కాలంలో అధికారాలు, విధుల నిర్వహణ, పనితీరుపై ఏ న్యాయస్థానానికి జవాబుదారిగా ఉండరు?’ అని మరో ప్రశ్న వచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రం ఈ మేరకు రాజ్యాంగపర రక్షణ ఉంది. గవర్నర్ల వ్యవస్థపై ప్రశ్నలు రావడంతో రాజ్‌భవన్ వర్గాలు ఆరా తీశాయి. ప్రశ్నపత్రాన్ని తెప్పించుకొని పరిశీలించాయి. చదవండి: UPSC 2023: సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల -
అడల్ట్ సినిమాలో న్యూడ్‌గా నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు నటి ఏమందంటే?
అందాలు ఆరబోయడం అనేది ఇండస్ట్రీలో సర్వసాధారణ విషయం. అవకాశాలు రావాలంటే అందాల ఆరబోత తప్పనిసరి! గ్లామర్ షో చేస్తేనే కానీ దర్శకనిర్మాతల కంట పడరు అన్నట్లు తయారైంది సినీ ఇండస్ట్రీ పరిస్థితి. ఒక్క సినీఇండస్ట్రీ మాత్రమే కాదు బుల్లితెరది కూడా ఇంచుమించు అదే పరిస్థితి! సీరియల్స్ నుంచి సినిమాకు ప్రమోషన్ రావాలంటే గ్లామర్ షో చేయాల్సిందే! మంగళ గౌరి మధువె అనే కన్నడ సీరియల్‌తో పాపులర్ అయిన నటి తనీశా కుప్పంద తన అందంతో 2012లోనే పారిజాత అనే సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులు కూడా అందుకుంటోంది. ఇటీవల ఆమె పెంటగాన్ మూవీలో నటించింది. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేసింది నటి. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ బ్యూటీకి ఓ యూట్యూబర్ నుంచి వింత ప్రశ్న ఎదురైంది. 'మీరు అడల్ట్ సినిమా చేస్తారా?' అని అడిగేసరికి నటి ఒక్కసారిగా అవాక్కైంది. 'నేనేమీ బ్లూ ఫిలిం స్టార్ కాదు. మీరిలాంటి ప్రశ్న ఎలా అడుగుతున్నారు? కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎవరు న్యూడ్ మూవీస్ చేస్తున్నారు? ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎలా అడగాలనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు' అని మండిపడింది. అసలు ఆ యూట్యూబర్‌కు ఇతరులను గౌరవించడం ఏమాత్రం తెలియనట్లుంది అని కామెంట్ చేసింది. -
11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం దాదాపు 11 గంటల పాటు ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ అధికారులు.. 14 ప్రశ్నలు అడిగారని తెలిసింది. విచా రణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలంటూ కవిత చేసిన విజ్ఞప్తి మేరకు.. అధికారులు విచారణను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారణకు పిలిచారని ఈడీ అధికారులతో కవిత అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇది కేవలం రాజకీయ కుట్ర అని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిడితో ఈడీలో పారదర్శకత లోపించిందని చెప్పారు. ‘ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో నన్ను నిందితురాలిగా పిలిచారా?’ అని ప్రశ్నించారు. ‘కాదు..’ అని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని కవిత ప్రశ్నించారని సమాచారం. అలాగే తను ఫోన్ ధ్వంసం చేసినట్టు మీడియాకు లీకులెవరిచ్చారని కూడా కవిత ప్రశ్నించారు. గత విచారణలో స్వా«దీనం చేసుకున్న తన ఫోన్ పూర్తిగా చెక్ చేసుకోవచ్చని అన్నారు. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే అధికారులు విచారిస్తున్నారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. కాగా సోమవారం కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్న గంట తర్వాత అధికారులు వచ్చారని, చాలాసేపు కవిత ఒక్కరినే రూమ్ కూర్చోబెట్టారని సమాచారం. చదవండి: హస్తినలో హైటెన్షన్ -
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా గుర్తించిన మొత్తం 30 లింకులలో 8 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి సవివర ప్రాజెక్ట్ నివేదికలు పూర్తయ్యాయని జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ మరో 24 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఫీజిబిలిటీ (సాధ్యాసాధ్యాల) నివేదికలు కూడా పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ కింద నదుల అనుసంధానం కోసం జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) దేశవ్యాప్తంగా 30 లింకులను గుర్తించింది. ఈ లింకులన్నింటికీ ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అమలు కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుందని ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మంత్రి చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అమలు దశలో మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం, నిధుల సమీకరణ వంటి తదితర అంశాలు చర్చకు వస్తాయని పేర్కొన్నారు. చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..! -
తాజ్‌మహల్‌ని చూసి.. ముషారఫ్ ఏం అన్నారంటే..
పాక్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆగ్రా సమ్మిట్ కోసం భారత్‌ని సందర్శించారు. అప్పుడు ఆయన తన సతీమణితో కలిసి ఆగ్రాలోని ప్రేమకు స్మారక చిహ్నం అయిన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ముషారఫ్ తాజ్ మహల్ నిర్మాణ అద్భుతానికి ఎంతగానో మంత్ర ముగ్దులయ్యారు. ఆ స్మారక చిహ్నాన్ని చూసినప్పుడూ ఆయన అడిగిన మొదటి ప్రశ్న గురించి చెబుతూ.. నాటి సంఘటనను పురావస్తు శాస్తవేత్త కెకె మహ్మద్ గుర్తు చేసుకున్నారు. ముషారఫ్ తాజ్‌మహల్ సందర్శించడానికి వచ్చినప్పుడు మహ్మద్ పురావస్తు శాఖలోని ఆగ్రా సర్కిల్‌కు సూపరింటెండ్ ఆర్కియాలజిస్ట్‌గా ఉన్నారు. ముషారఫ్ తాజ్‌మహల్‌ని చూసిన వెంటనే దీన్ని ఎవరూ రూపొందించారు అని మహ్మద్‌ని ప్రశ్నించారు. బహుశా ఆయన నేను షాజహాన్ అని చెబుతానని అనుకుని ఉండోచ్చు, కానీ నేను ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అని చెప్పానన్నారు మహ్మద్. ఎందుకంటే ఉస్తాద్ లాహోర్కి చెందినవాడు. ముషారఫ్‌కి ఆ ప్రేమ స్మారక చిహ్నం విశిష్టత గురించి చెప్పేందుకు మహ్మద్‌ని టూరిస్ట్ గైడ్‌గా నియమించారు. ఈ స్మారక చిహ్నం ఆప్టికల ఇల్యూషన్ గురించి కూడా చెప్పినట్లు మహ్మద్ గుర్తు చేసుకున్నారు. అంతేగాదు ముషారఫ్ తనని తాజ్‌మహల్‌ని చూడటానికి ఉత్తమమైన సమయం ఎప్పుడూ అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. సూర్యుని కిరణాలు ఆ స్మారక కట్టడంపై పడగానే పాలరాతి మహల్ కాస్తా ధగధగ మెరుస్తుందని, అలాగే వర్షం కురిసినప్పుడూ బాధగా విలపిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అంతేగాదు తాను ముంతాజ్, షాజహాన్ల వివాహం లాహోర్ కోటలో జరిగిందని, మొఘల్ చక్రవర్తి జన్మస్థలం కూడా అదేనని చెప్పడంతో ముషారఫ్ ఒక్కసారిగా తాను తనవారి ఇంట్లో ఉన్నట్లు భావించారని చెప్పారు మహ్మద్. వాస్తవానికి మహ్మద్ ఆ తాజ్‌మహల్‌ని చూడటానికి 45 నిమిషాల సమయం ఇచ్చాం గానీ కానీ ఆయన తన భార్యతో కలిసి కాసేపు వ్యక్తిగతంగా గడిపేలా మరో 15 నిమిషాలు పొడిగించినట్లు మహ్మద్ నాటి సంఘటనను వివరించారు. కాగా, ముషారఫ్ సెప్టెంబర్ 25, 2006న తాను రచించిన ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ ఏ మెమోరియల్ పుస్తకంలో ఈ తాజ్‌మహల్ గురించి ప్రస్తావించారు. అందులో ..ఆగ్రా అనేది తాజ్‌మహల్ స్మారక ప్రదేశం. ఇది ప్రేమకు సంబంధించిన మొఘల్ స్మారక చిహ్నం. ఈ కట్టడం అతీతమైన అందం కారణంగానే ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలించింది అని ముషారఫ్ పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: జెలెన్స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? పుతిన్ ఏమన్నారంటే..) -
ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ని పలువురు ఈ శీతకాలంలో మీరు ఎందుకు కేవలం టీ షర్ట్ ధరించి నడుస్తున్నారు, మీకు చలిగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా రాహుల్ రైతు, కార్మికుడు, పేద పిల్లలను ఎప్పుడైనా ఇలా అడిగారా అని ఎదురు ప్రశ్న వేశారు. నులు వెచ్చని బట్టలు ప్రాథమిక వస్తువులు, వాటిని కొనుగోలు చేయని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగారు. నేను సుమారు 2,800 కిలోమీటలర్లు నడిచాను కానీ అది ఏమంతా పెద్ద విషయం కాదు. నిజానికి వ్యవసాయం చేసే రైతులు, కార్మికులు, రోజు చాలా దూరం నడుస్తారు, కష్టపడతారు అని చెప్పారు. ఈ యాత్రలో అన్నిరకాల ప్రజలను కలిశాను. తాను ఇప్పుడూ ఎవరి చేయినైనా పట్టుకుని వారు ఏం పని చేశారో చెప్పగలను అన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ జోడో యాత్ర కాశ్మీర్లో ముగియనుంది. "నాకు సాధారణ ప్రజలలో ద్వేషం కనిపించలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. కానీ నాకు యాత్ర ప్రారంభించినప్పుడూ ప్రజల్లో ద్వేషం ఉంటుందేమోనని చాలా భయపడ్డాను." అని అన్నారు. రాహుల్ చేపట్టిన ఈ జోడోయాత్రలో ప్రముఖులు, స్టార్లు, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే తోపాటు తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రాతో సహా అగ్ర నేతలందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు. (చదవండి: జోడో యాత్రలో పాల్గొంటే పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందన్నారు’) -
అది కాంతార మ్యానియా.. గవర్నమెంట్ ఎగ్జామ్‌లో మూవీపై ప్రశ్న
ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో కన్నడ మూవీ ‘కాంతర’ సృష్టించిన సన్సేషన్ అంతా ఇంత కాదు. కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేజీఎఫ్‌ను బీట్ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్కి ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో రిషబ్ ట్రాన్స్ఫార్మేషన్ అందరికి గూస్బంప్స్ తెప్పించింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ హవా కొనసాగింది. కన్నడ నుంచి బాలీవుడ్ వరకు కాంతార విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. తాజాగా కాంతార మ్యానియా విద్యారంగంలోనూ వ్యాపించింది. ఈ చిత్రం కర్ణాటక గ్రామ ప్రాంతాల్లో నిర్వహించే భూతకోల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపరల్లో కాంతార మూవీపై ప్రశ్న అడిగారు. ఇందుకు క్వశ్చన్ పేపర్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఇటీవల విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కింది’ అంటూ జల్లికట్టు, భూతకోల, యక్షగాన, దమ్మామి అని ఆప్షన్లు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హీరోయిన్ సప్తమి గౌడ్ ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ -
దుమారం రేపిన ఏడో తరగతి పరీక్ష పేపర్లోని ప్రశ్న!: నెటిజన్లు ఫైర్
బిహార్: ఏడో తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్న పెద్ద వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ పరీక్ష పేపర్లోని ప్రశ్న ఏమిటంటే...నేపాల్, చైనా, ఇంగ్లాండ్, కాశ్మీర్, భారత్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉంది. ఇందులో కాశ్మీర్‌ని వేరే దేశంగా పొరపాటున రావడంతో వివాదానికి దారితీసింది. అంతేగాదు ఈ వివాదం కాస్త చిలికిచిలికి రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇది పొరపాటు కాదని కావలనే ఇలా చేశారంటూ ఆ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ సుశాంత గోపీ విమర్శలు గుప్పించారు. పిల్లలు మనసుల్లో కాశ్మీర్‌ను భారత్‌ని వేరుచేసి చూపించే ప్రయత్నం చేస్తోంది నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పైగా రాజకీయంగా పట్టు సాధించాలనే నితీష్ కుమార్ కుట్రలోని భాగం ఇది అంటూ విమర్శులు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉండగా...ఆ పాఠశాల హెడ్మాస్టర్ ఎస్కే దాస్ ఈ విషయమై వివరణ ఇస్తూ...ఆ ప్రశ్న పత్రంలో ప్రశ్న కాశ్మీర్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉండటానకి బదులు కాశ్మీర్ దేశ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉంది. ఇది మానవ తప్పిదమే తప్ప మరోకటి కాదని వివరణ ఇచ్చారు. అంతేగాదు ఆ జిల్లా విద్యాధికారి సుభాష్ గుప్త అనవసరంగా ఈ విషయాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారన్నారు. అచ్చం ఇలానే ఐదేళ్ల క్రితం 2017లో బిహార్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఇదే ప్రశ్న ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు బీహార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తన తప్పుని సరిచేసుకోలేకపోవడం బాధాకరం. ఈ మేరకు ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడటమే కాకుండా సదరు టీచర్ని తొలగించాలంటూ ట్వీట్ చేశారు. Kishanganj, Bihar | Class 7 question paper terms Kashmir as separate country Got this via Bihar Education Board. Ques had to ask what are people from Kashmir called? Mistakenly carried as what are people of country of Kashmir called? This was human error: Headteacher, SK Das pic.twitter.com/VVv1qAZ2sz — ANI (@ANI) October 19, 2022 (చదవండి: భార్యా హంతకునికి జీవితఖైదు రద్దు: హైకోర్టు సంచలన తీర్పు) -
KBC 14: కోటి గెలుచుకున్న కవిత.. కానీ, రూ. 7.5 కోట్ల ప్రశ్నకు మాత్రం!
కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియల్టీ గేమ్ షో దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పోందిన షోగా పేరొందింది. ఇదే షో తెలుగులో మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా హిందీ వెర్షన్ కేబీసీ సీజన్ 14 నడుస్తోంది. ఇందులో బిగ్ బి తన చురుకైన మాటలతో షోకే హైలైట్‌గా నిలుస్తూ ప్రేక్షకులకు ఫుల్‌గా వినోదాన్ని అందిస్తున్నాడు. ఈ సీజన్లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన గృహిణి కవితా చావ్లా మొదటి కోటి రూపాయలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే చివరికి రూ.7.5 కోట్లు ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఆత్మవిశ్వాసంతో ఈ గేమ్ ఆడిన కవిత ప్రేక్షకులతో పాటు హోస్ట్ అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకుంది. ఏంటి ఆ ప్రశ్న.. అప్పటికే కోటి గెలిచిన ఉత్సాహంతో కవిత ఈ గేమ్‌లో ముందుకు అడుగువేశారు. ఇక ఈ రౌండ్ లో17వ ప్రశ్నగా రానే వచ్చింది. ఆ ప్రశ్న విలువ రూ.7.5 కోట్లు, దీంతో నరాలు తెగేంత ఉత్కంఠ ఎదురైంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి మ్యచ్ లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు గుండప్ప విశ్వనాథ్. అయితే ఆయన ఈ ఘనతను ఏ జట్టుపై సాధించాడు? ఆఫ్షన్లు ఇవే.. a) సర్వీసెస్ b) ఆంధ్రా c) మహారాష్ట్ర d) సౌరాష్ట్ర. మొదట ఈ ప్రశ్నకు కవితా చాలా సేపు సమాధానం కోసం ఆలోచించింది. కానీ జవాబుపై స్పష్టత లేకపోవడంతో పాటు ఆమె దగ్గర ఎటువంటి లైఫ్ లైన్స్ కూడా లేవు. దాంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం తన సమాధానంగా A ఎంపికను లాక్ చేశారు. అయితే, సరైన సమాధానం ఎంపిక B అని తేలింది. దీంతో తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా కవిత కేబీసీ షోలో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ రౌండ్ వరకు వచ్చింది. కానీ ఆ రౌండ్ దాటి రాలేకపోయింది. ప్రస్తుతం పట్టుదలతో షోలో పాల్గొనడంతో పాటు కోటి గెలిచి సోషల్‌మీడియా సెన్సేషన్‌గా మారింది. చదవండి: Samantha: స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు సమంత..?, మేనేజర్ ఏం చెప్పారంటే.. -
వైరల్: ఆన్లైన్ క్లాస్‌లో టీచర్ ప్రశ్న.. ఉహించని రిప్లై విని ఏం చేసాడంటే!
కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, టీచర్ల మథ్య జరిగిన సంభాషణలున్న వీడియోలు వైరల్‌గా మారి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ తరహాలోనే సీఏ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాస్‌లో.. ఓ టీచర్ అడిగిన ప్రశ్నకు స్టూడెంట్ షాకింగ్ సమాధానం చెప్పగా ప్రస్తుతం అది నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆ వీడియోలో.. ఎడ్నోవేట్ వ్యవస్థాపక సభ్యుడు సీఏ ధవల్ పురోహిత్ విద్యార్థులకు పాఠాలు చెప్తుంటాడు. ఆ సమయంలో ఒక క్వార్టర్ అంటే ఎంత? అనే ప్రశ్నను విద్యార్థులను అడుగుతాడు. అక్కడ చాట్ బాక్స్‌లో ఉండే ఓ విద్యార్థి వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా 30 ఎంఎల్ అని రాశాడు. చిర్రెత్తుకొచ్చిన ధవల్.. క్వార్టర్ అంటే 3 నెలలు.. అని ఓ వింత ఎక్స్ప్రెషన్తో వివరణ ఇచ్చాడు. దీంతో ఆన్లైన్ క్లాస్‌లో ఒకటే నవ్వులు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. ఓ నెటిజన్ అయితే సీఏ క్లాసెస్లోనే ఇలాంటివి జరుగుతాయి? అని కామెంట్ చేశాడు. ఇంతకీ ఆ సమాధానం ఇచ్చని మహానుభావుడు ఎవరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/sJpn9I2jQA — Avdhoot D (@avdhootd007) October 3, 2021 చదవండి: Bhuvan Bam: నెలకు రూ.95 లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్ -
వీళ్లంతా మీ ఫొటో తీస్తున్నారేందుకు..?!
లండన్ : అప్పుడప్పుడు చిన్న పిల్లలు అడిగే అమాయకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత తేలికేం కాదు. అలాంటి సందర్భాల్లో చాలామంది ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తారు. ఇదే పరిస్థితి బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్కి ఎదురయ్యింది. కానీ ఆమె చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. ఈమధ్యే ప్రసూతి సెలవులు ముగించుకున్న కేట్ మిడిల్టన్ వెస్ట్ లండన్‌లో సయేర్స్ క్రాఫ్ట్స్ ఫారెస్ట్ స్కూల్‌ని, వైల్డ్ లైఫ్ గార్డెన్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు కేట్‌ని ఫొటో తీయడానికి పోటీ పడ్డారు. ఈ హడావుడి చూసిన పిల్లలకు ‘ఏంటి ఈమె ప్రత్యేకత.. అందరు ఎందుకు ఈమెని ఫొటో తీయడానికి ఇంతలా పోటీ పడుతున్నారు’ అనే అనుమానం మొదలయ్యింది. సందేహం అయితే వచ్చింది కానీ ఎవరూ దాన్ని బయటపెట్ట లేదు. కానీ ఓ చిన్నారి మాత్రం ధైర్యంగా ‘వీళ్లంతా ఎందుకు మిమ్మల్ని ఫోటో తీస్తున్నారు’ అని కేట్‌ని అడిగింది. అందుకు యువరాణి నవ్వుతూ ‘వారంతా నన్ను ఫొటో తీయడం లేదు.. నిన్ను ఫొటో తీస్తున్నారు. ఎందుకంటే నువ్వు చాలా ప్రత్యేకం కదా’ అంటూ సమాధానం చెప్పారు. కేట్ చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక అక్కడున్న వారిని కూడా సంతోషపెట్టింది. కేట్ సమాధానం విన్న నెటిజన్లు ‘ఎంతైనా ముగ్గురు పిల్లలకు తల్లి కదా..! పిల్లలతో ఎలా ప్రవర్తించాలో బాగానే తెలిసి ఉంటుందం’టూ ప్రశంసిస్తున్నారు. అంతేకాక ‘అవును మరి అంత చిన్న బుర్రకు కేట్ యువరాణి అని.. అందుకే ఫొటో తీస్తున్నారంటే ఎలా అర్థమవుతుంది.. అర్థమవ్వకపోగా మరిన్ని సందేహాలు తలెత్తే అవకాశం ఉందం’టూ కామెంట్ చేస్తున్నారు. -
అడగకూడని ప్రశ్న!
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో మీకు, నవాజుద్దీన్ సిద్ధిఖీకి మధ్య సెక్స్ సీన్స్ చాలా ఉన్నాయి. ఒక పోర్న్‌స్టార్‌లా నటించారు మీరు. చెయ్యనని చెప్పలేకపోయారా? విలువలకన్నా డబ్బే ముఖ్యం అనుకున్నారా?! రాజశ్రీ దేశ్‌పాండే : డబ్బు సంగతి అలా ఉంచండి. అది ఎప్పటికీ ముఖ్యమే. ‘చెయ్యనని చెప్పలేకపోయారా’ అన్నారు! అంటే.. కథలో ఉన్నదాన్ని చెయ్యనని చెప్పమంటున్నారా? నవల దీనికి ఆధారం. విక్రమ్ చంద్ర అద్భుతంగా ఆ నవలని మలిచినప్పుడు, వరుణ్ గ్రోవర్ అద్భుతంగా ఆ నవలకు మాటలు రాసినప్పుడు, అనురాగ్ కాశ్యప్ అద్భుతంగా ఆ నవలని డైరెక్ట్ చేస్తున్నప్పుడు.. అందులో యాక్ట్ చేస్తున్న నేను కూడా అద్భుతంగానే చేయాలి కదా! ఇదెందుకు ఆలోచించరు మీరు? థీమ్‌ని, యాక్టర్స్‌ని వేర్వేరుగా ఎందుకు చూస్తారు? ఇందులో నవాజుద్దీన్ భార్యని నేను. మా ఇద్దరి మధ్య కొన్ని బెడ్ సీన్స్ ఉన్నాయి. ఐటమ్సాంగ్లా చురుకు పుట్టించడం కోసం పెట్టిన సీన్స్ కావవి. కథకు అవసరమైనవి. అప్పుడు నేను నవాజ్‌కు భార్యగానే నటించాలి తప్ప రాజశ్రీ దేశ్పాండేలా దూరంగా జరిగిపోతే డైరెక్టర్ చెప్పాలనుకున్నది చెప్పగలడా? మీకో సంగతి చెప్పాలి. లైఫ్‌లో నా గోల్ ఒక్కటే.. గ్రామాల్లో స్కూళ్లు, మరుగుదొడ్లు కట్టించడం! కెమెరా ముందు ఉన్నప్పుడు కూడా నా మనసు గ్రామాల్లోనే ఉంటుంది. నవాజుద్దీన్ పక్కలో ఉన్నట్లు నేను మీకు కనిపిస్తాను కానీ ఎక్కడున్నా నాకు కనిపించేది నా గోల్ ఒక్కటే. గ్రామాల్ని చదివించి, గ్రామాల్ని ఆరోగ్యంగా ఉంచడం. ఇందుకోసం నటిగా నేను సక్సెస్ కావడం కూడా అవసరమే కదా! -
సమాధానం వెనుక విషాదం
లండన్ : నష్టపోయిన చోటే అదృష్టాన్ని వెతుక్కోమన్నారు పెద్దలు. అలాంటిది నష్టపోయిన చోటు వల్ల కోట్లు కలిసొస్తే.. ఇక ఆనందానికి అవధులుండవు. అలాంటి సంఘటనే లండన్‌లో చోటు చేసుకుంది. తన కాలును పోగొట్టుకున్న ప్రదేశాన్ని జవాబుగా చెప్పి అక్షరాలా 7,500,000 లక్షల రూపాయలు గెలుచుకున్నాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని హలీఫాక్స్ కు చెందిన గారెత్ కెండాల్ హు వాంట్స్ టు బీ ఏ మిలయనీర్?(మీలో ఎవరు కోటీశ్వరుడు?కు మాతృక) అనే టి.వి షోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా.. ఉర్క్హార్ట్ కోట ఎక్కడ ఉందన్న ప్రశ్నకు గారెత్ చెప్పిన సమాధానం షో హోస్ట్‌ను నివ్వరపోయేలా చేసింది. ఉర్క్హార్ట్ కోట తనకు బాగా తెలుసునని, అక్కడే తన కాలును పోగొట్టుకున్నానని చెప్పడంతో కొద్ది సేపు హాలు మొత్తం నిశ్శబ్ధం అలుముకుంది. హోస్ట్ జెర్మీ క్లార్క్ సన్‌కు జరిగిన విషాదం గురించి వివరించాడు గారెత్. కోట దగ్గరి ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో తన ఎడమ కాలును పోగొట్టు కున్నానని, ఆ ప్రమాదం తర్వాత బతికుండటం మరో జన్మని అన్నాడు. హాస్పిటల్ ఐసీయూలో ఉన్న తాను బతకటం చాలా కష్టమని వైద్యులు చెప్పారని తెలిపాడు. చాలా రోజులు ఆస్పత్రి బెడ్ మీదే గడిచి పోయాయని వివరించాడు. కోట ఉన్న ప్రాంతాన్ని చెప్పడంతో లక్షల రూపాయలు గారెత్ సొంతమయ్యాయి. తర్వాత రౌండ్‌కు వెళ్లే అవకాశం ఉన్నా అంతటితో ఆటకు ముగింపు పలికి షోలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు గెల్చుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. -
‘ఐ పుట్ ది క్వశ్చన్’కు స్వస్తి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో కొనసాగిస్తున్న కొన్ని పాత విధానాలకు స్వస్తి పలుకుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో మండలి చైర్మన్ ప్రశ్న సంఖ్య ప్రకటించగానే, ఆ ప్రశ్న వేసిన సభ్యుడు లేచి ‘ఐ పుట్ ది క్వశ్చన్’అని చెప్పి కూర్చోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత మంత్రి సమాధానం చెప్పాలని చైర్మన్ పేర్కొన్నాక మంత్రి సమాధానం కొనసాగిస్తారు. ఈ సంప్రదాయంపై బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు లేవనెత్తారు. ‘‘ప్రతి సభ్యుడు లేచి ‘ఐ పుట్ ది క్వశ్చన్’’అని లేచి చెప్పి కూర్చునే పద్ధతితో కాలయాపన జరుగుతోంది. ఈ పద్ధతి శాసనసభలో లేదు. ప్రశ్న సంఖ్య చెప్పగానే నేరుగా సంబంధిత మంత్రి సమాధానం చెబితే సమయం ఆదా అవుతుంది కదా.. పరిశీలించండి’’అని చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీంతో తర్వాతి ప్రశ్న నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టి నేరుగా మంత్రి సమాధానమివ్వటం ప్రారంభించారు. చైర్మన్ బెల్ నొక్కారు.. మంత్రి కూర్చున్నారు.. సాధారణంగా సభ్యులు సమయానికి మించి ఎక్కువసేపు మాట్లాడితే స్పీకర్ బెల్ నొక్కి ముగించాల్సిందిగా సూచిస్తారు. బుధవారం మండలిలో ఈ బెల్ వ్యవహారం కాస్త అయోమయానికి కారణమైంది. నీటిపారుదల శాఖకు సంబంధించి పలు ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఈ సమయంలో చైర్మన్ బెల్ నొక్కారు. దీంతో మంత్రి తన సమాధానం ముగించి కూర్చున్నారు. అయితే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదంటూ సభ్యులు పేర్కొనటంతో సమాధానం చెబితే బాగుంటుందన్నట్లు హరీశ్ వైపు చైర్మన్ చూశారు. దీంతో ‘మీరు బెల్ నొక్కేసరికి కూర్చున్నాను’అని మంత్రి పేర్కొన్నారు. కొందరు సభ్యులు ముచ్చట్లు పెడుతుండటంతో వారించేందుకు బెల్ నొక్కానని, మంత్రిని ఉద్దేశించి కాదని చైర్మన్ చెప్పడంతో మళ్లీ మంత్రి లేచి పూర్తి సమాధానం చెప్పారు. -
ఒకే ప్రశ్న.. 16 మంది సభ్యులు!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా అసెంబ్లీలో ఒకే అంశానికి సంబంధించి వివిధ పార్టీల వారు ప్రశ్నిస్తుంటారు. కొన్నిసార్లు ఐదారుగురు ఒకే అంశంపై ప్రశ్నిస్తారు. కానీ మంగళవారం ఒకే అంశాన్ని ఏకంగా 16 మంది లేవనెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా శ్మశాన వాటికలకు తీవ్ర కొరత ఉన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. దీంతో స్పీకర్ కూడా దాన్ని గంభీరమైన సమస్యగా పరిగణించి ఎక్కువసేపు చర్చించేందుకు అవకాశమిచ్చారు. ఇంత మంది సభ్యులు ప్రశ్నించటాన్ని బట్టే ఇది ఎంతపెద్ద సమ స్యో అర్థమవుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. వెయ్యి ప్రాంతాల్లో వాటి పనులు సాగుతున్నాయన్నారు. నిర్మాణ వ్యయంలో 25 శాతం లేదా రూ.5 లక్షలు.. ఏది ఎక్కువో అది భరిస్తే ఆ శ్మశాన వాటికకు దాతలు సూచించిన పేరు పెడతామన్నారు. ‘నరేగా’ పథకంలో భాగంగా వాటిల్లో వసతులు కల్పిస్తున్నట్టు వెల్ల డించారు. మరోవైపు రాష్ట్రంలో రూ.300 కోట్ల వ్యయంతో రైతు వేదికలు నిర్మిస్తు న్నామని వ్యవసాయ మంత్రి పోచారం వెల్లడించారు. మూడు నాలుగు గ్రామాలు ఓ క్లస్టర్‌గా, 2,635 క్లస్టర్లలో వీటిని నిర్మిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. -
టెన్త్ పరీక్ష: నవ్వులు పూయించిన కోహ్లి
సాక్షి, కోలకతా: పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే.. పరీక్షా పత్రాల లీకులు, వింత వింత ప్రశ్నలు లాంటి పొరపాట్లు, గ్రహపాట్లు చాలాకాలంగా వింటున్నదే. అయితే పశ్చిమ బెంగాల్లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష పేపర్లో అధికారులు అడిగిన ప్రశ్న ఇపుడు వార్తల్లో నిలిచింది. 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్, ఇంగ్లీష్ పేపర్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి వ్యాసం రాయాలన్న ప్రశ్న చూసి విద్యార్థులు ఎగిరి గంతులేసినంత పనిచేశారు. అసలే విద్యార్థులకు క్రికెట్ అంటే క్రేజ్. అందులోనూ తమ అభిమాన ఆటగాడు.. ఐకాన్ కెప్టెన్ గురించి రాయమంటే.. ఆ చాన్స్‌ను ఎలా వదులుకుంటారు. మిక్కిలి సంబరంతో కోహ్లి క్రికెట్ చరిత్రలో రికార్డులు, సెంచరీలతోపాటు బాలీవుడ్ హీరోయిన్ అనుష్కతో పెళ్లి.. హనీమూన్ లాంటివి గుర్తు చేసుకుంటూ పది మార్కుల ప్రశ్నను ఎవ్వరూ వదిలిపెట్టకుండా ఆన్సర్ చేశారు. దాదాపు తామంతా ఈ ప్రశ్నకు సమాధానం రాశామని, పదికి పది గ్యారంటీ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నను ఊహించలేదు.. హి ఈజ్ మై ఐడల్ అంటూ షమిమ్ అక్తర్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. స్పోర్ట్స్ ఐకాన్ గురించి పరీక్షలో రాయడంపై విద్యార్ధులు సంతోషిస్తున్నారని పశ్చిమ మిడ్నాపూర్ సల్బోనిలో ముసుల్ దేశాప్రన్ విద్యాపీఠ్ ప్రధానోపాధ్యాయుడు ప్రసాన్ పారియా చెప్పారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా కోహ్లీ గురించి అడగడం బాగుందని, ఇలాంటి ప్రశ్నలడిగే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించడం విశేషం. విరాట్ కోహ్లి ప్రస్తుతం క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
'ఇళ్ల నిర్మాణంపై ఈటల ప్రశ్నకు జవాబు చెప్పాలి'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నలుగురి నియోజకవర్గా ల్లో మినహా ముందుకు సాగట్లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ఈటల నిజాలు చెప్పారన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న వాళ్లను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పశువులతో పోల్చడం తగదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న పెద్దపెద్ద కాంట్రాక్టర్లే డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నారని, దీని వెనుక చీకటి ఒప్పందం ఉందని తాము నిరూపిస్తామని సవాల్ చేశారు. -
ప్రశ్నిస్తేనే విద్యారంగంలో మార్పు సాధ్యం
► విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి ► రిటైర్డ్ ప్రొఫెసర్, ఆర్థిక వేత్త అందె సత్యం మిర్యాలగూడ అర్బన్ : యువత చైతన్యవంతులై పాలకులను ప్రశ్నిస్తేనే విద్యారంగంలో మార్పు సాధ్యమని రిటైర్డ్ ప్రొఫెసర్, ఆర్థిక వేత్త అందె సత్యం అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ణానిక శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు యువత ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. పాలకుల విధానాల కారణంగానే విద్య పేదలకు అందని ద్రాక్షగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జీడీపీలో 6శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలని కొఠారీ కమిషన్ గతంలోనే చెప్పినా పాలకులు నేటికీ కేవలం 3.9 శాతం నిధులనే కేటాయిస్తున్నారని అన్నారు. హేతుబద్ధీకరణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిలోకం సంఘటితంగా పోరాడి ప్రభుత్వ విద్యను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వర్రావు, కోట రమేశ్, ఆలిండియా సైన్స్ జాతీయ వేదిక కార్యదర్శి తాటి రమేష్ పాల్గొన్నారు. -
మద్య నిషేధం ఏదీ బాబు?
- ఐద్వా రాష్ట్ర మహాసభల్లో అధ్యక్షురాలు ప్రభావతి ప్రశ్న అమలాపురం రూరల్: ఎన్నికలకు ముందు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని..బెల్ట్ షాపులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ హామీలే మరిచారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.ప్రభావతి అన్నారు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఐద్వా శిక్షణ తరగతులకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతులను జ్యోతి ప్రజ్వలనచేసి ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని...మహిళలు మద్య నిషేధం కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రభావతి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఊరూ వాడా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ గ్రామాలను మద్యం మయం చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 1993–94 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. బాబు పాలనలో దానికి విరుద్ధంగా మద్యం అమ్మకాలను విచ్చల విడి చేసి ఖాజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ మద్యం వల్ల మహిళల బతుకులు అస్తవ్యస్తంగా మారాయని, భర్త సంపాదనలో అధిక శాతం మద్యానికే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల పరిశ్రమల్లో సరైన భద్రత లేకే మహిళలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా నాయకురాలు అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, జిల్లా ఉపాధ్యక్షురాలు కుడుపూడి రాఘవమ్మ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు కేవీవీ సత్యనారాయణ, మద్యం వ్యతిరేక కమిటీ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ, ఐద్వా లీగల్ కార్యదర్శి శిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
అంగట్లో ప్రశ్నపత్రాలు!
► విద్యార్థుల చేతుల్లో 7వ తరగతి ► సామాన్యశాస్త్రం ఇంగ్లిష్ మీడియం పేపర్ ► వనపర్తిలో ఒకరోజు ముందే వెలుగులోకి ► క్వశ్చన్ పేపర్ ధర రూ.100 సాక్షి వనపర్తి : ఏడో తరగతి సామాన్యశాస్త్రం ఇంగ్లిష్ మీడియం పేపర్ వనపర్తిలో ఒకరోజు ముందుగానే విద్యార్థుల చేతుల్లోకి చేరింది. ప్రస్తుతం 10వ తరగతి మినహా అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన రోజు నుంచి ఇదేతంతు కొనసాగుతోందని సమాచారం. స్థానికంగా ఉన్న మీసేవా కేంద్రాలు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు ప్రశ్నపత్రాలకు అడ్డాగా మారాయి. క్వశ్చ¯ŒS పేపర్‌ను రూ.100కు విక్రయిస్తున్నారని తెలిసింది. దీంతో విద్యార్థులు కొందరు పేపర్ కొనుగోలు చేసి ఇతర విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పంపుకుంటున్నారని తెలుస్తోంది. గురువారం జరగాలి్సన సామాన్యశాస్త్రం పేపర్‌ను ఇలానే ఓ విద్యార్థి కొని తెచ్చుకోవడంతో తండ్రి మందలించాడని సాక్షిదృష్టికి వచ్చింది. వెంటనే ఈ విషయమై నిజానిజాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగడంతో అసలుసంగతి బయటపడింది. పరీక్ష ముందురోజే క్వశ్చన్ పేపర్ తెచ్చుకుని విద్యార్థులు బట్టీపట్టడం, లేదా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడటం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రం మార్కెట్లో దొరకడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కుమ్మక్కై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇదే నిజం
-
యూనెస్కో రిపోర్టులు నిజమేనా?
న్యూఢిల్లీ: యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ 50 ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందని యూనెస్కో పేర్కొన్నట్లు కేంద్ర మానవవనరుల అభివద్ధి శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుష్వాహా వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా యూనెస్కో రిపోర్టులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నలకు స్పందించిన కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. యూనెస్కో రిపోర్టులపై ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. 1. ఈ ఏడాది విడుదల చేసిన యూనెస్కో రిపోర్టుల్లో యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ యాభై ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందనే మాట నిజమేనా? జవాబు: యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ 50ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందని యూనెస్కో ఇచ్చిన రిపోర్టు వాస్తవమే. 2. ప్రాథమిక విద్యను 2050కు, యూనివర్సల్ లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్ ను 2060కు, యూనివర్సల్ అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్ ను 2085కు భారత్ అందుకుంటుందని యూనెస్కో పేర్కొందా? జవాబు: ప్రాథమిక విద్యను 2050కు, సెకండరీ ఎడ్యుకేషన్(ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకూ)ను 2060కు, అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్(తొమ్మిది, పది తరగతులు)ను 2085కు అందుకుంటుందని యూనెస్కో పేర్కొన్నట్లు అంగీకరించారు. 3. 2030లోగా విద్యారంగంలో ప్రాథమిక మార్పులు చేస్తేనే విద్యారంగం స్ధిరత్వానికి వస్తుందనే రిపోర్టు కూడా నిజమేనా? జవాబు: విద్యారంగంలో ప్రాథమిక మార్పులు కారణంగా స్ధిరత్వం ఏర్పడుతుందని గతంలో చేసిన సర్వేల ఆధారంగా యూనెస్కో చేసిన సూచన. ఇందులో మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రమేయం లేదు. 2009లో అమల్లోకి వచ్చిన ఉచిత, నిర్భంద విద్య చట్టం కింద కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ పేరిట ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ లెవల్స్ లో పిల్లలకు విద్యను అందిస్తోంది. యూనివర్సల్ ఎడ్యుకేషన్ గుర్తింపుకు తగినంత మంది విద్యార్థులకు ఈ చట్టం కింద విద్య అందుతోంది. యూనెస్కో రిపోర్టు పాత ట్రెండ్స్ ఆధారంగా చేసింది. ప్రస్తుతం పరిస్ధితుల్లో యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను యూనెస్కో రిపోర్టుల కంటే ముందే భారత్ అందుకుంటుందనే భరోసా ఉంది. -
టీచర్ ప్రశ్నకు హుందాగా సమాధానం ఇచ్చిన హిల్లరీ
-
బాబూ.. గిరిజనులకు భూములేవి?
బాబు వాగ్దాన భంగంపై కాకాణి ఫైర్ పైనాపురంలో గడపగడపకు వైఎస్సార్ ముత్తుకూరు : పేద గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి రెండు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క సెంటు భూమైనా పంపిణీ చేశారా? అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. గడపగడపకు వైఎస్సార్‌లో భాగంగా సోమవారం పైనాపురం పంచాయతీలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెన్కో ప్రాజెక్ట్ యాష్‌పాండ్‌కు దగ్గరగా ఉన్న దేవరదిబ్బ గిరిజనకాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించే అంశం జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులివ్వకుండా చంద్రబాబు ఓడిపోయిన వారికి అప్పగించి, దుష్ట సంప్రదాయానికి ఒడిగట్టారన్నారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తుంటే తనపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి విమర్శలకు భయపడి, జరుగుతున్న అవినీతిని చూస్తూ ఊరుకునేదిలేదన్నారు. తొలుత కాకాణి స్థానిక భోగేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, సర్పంచ్‌లు పల్లంరెడ్డి జనార్దన్‌రెడ్డి, కట్టా సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, మండల నాయకులు లక్ష్మణరెడ్డి, ఈదూరు శ్రీనివాసులురెడ్డి, కలికి చంద్రశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, మారు సుధాకర్‌రెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, చిన్నపరెడ్డి, ధనుంజయరెడ్డి, గండవరం సూరి, చెంగారెడ్డి, ఆలపాక శ్రీనివాసులు, చిన్నపరెడ్డి పాల్గొన్నారు. -
పదహారు కళల పురుషుడు!
ప్రశ్నోపనిషత్ పిప్పలాద మహర్షికి శుశ్రూష చేసి ఆయన అనుగ్రహంతో బ్రహ్మజ్ఞానాన్ని క్రమంగా, సమగ్రంగా, త్రికరణ శుద్ధితో తెలుసుకోవాలని భక్తిశ్రద్ధలతో వచ్చిన ఆరుగురు ఋషులలో చివరివాడు భరద్వాజ గోత్రుడైన సుకేశుడు అడగబోయే ప్రశ్న వింతగా, విచిత్రంగా కనిపిస్తుంది. కాని మొదటి ప్రశ్న నుండి ఆరవ ప్రశ్నలో ఒక క్రమవికాసం గోచరిస్తుంది. ప్రాణిపుట్టుక ఎలా జరిగింది? జీవులను ఎందరు దేవతలు పోషిస్తున్నారు? శరీరంలోకి ప్రాణం ఎలా వస్తోంది? ఎలా పోతోంది? మెలకువ, నిద్ర, కలలు, గాఢనిద్ర ఇవన్నీ అనుభవించేది ఎవరు? ఓంకార ధ్యానక్రమం, ప్రయోజనాలు..? పదహారు అంగాలతో ఉండే పురుషుడు ఎవరు? అనే ప్రశ్నల సమాధానాలలో నిరాకార పరబ్రహ్మం సాకారత ఎనభై నాలుగు లక్షల జీవరాశిగా గోచరించటం, బ్రహ్మపదార్థపు రాకపోకలు, నిద్ర, స్వప్నాది అవస్థలను అనుకరిస్తూ ధ్యానమార్గంలో తానే నిరాకార పరబ్రహ్మమనే జ్ఞానాన్ని, అద్వైత స్థితిని పొందటంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. భరద్వాజ గోత్రుడైన సుకేశుడు పిప్పలాద మహర్షికి నమస్కరించాడు. దేవర్షీ! ఒకప్పుడు కోసలదేశపు యువరాజు హిర ణ్యనాభుడు నా దగ్గరకు వచ్చాడు. సుకేశా! పదహారు కళలతో ఉండే పురుషుడు ఎవరో నీకు తెలుసా? అని అడిగాడు. యువరాజా! అతను ఎవరో నాకు తెలియదు. తెలిస్తే ఎందుకు చెప్పను? తెలియకుండా అబద్ధం చెప్పేవాడు సమూలంగా నశించిపోతాడు. కనుక నేను అబద్ధం చెప్పను అన్నాను. యువరాజు మౌనంగా రథమెక్కి వెళ్లిపోయాడు. ఆ ప్రశ్న ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పదహారు కళలతో ఉన్న పురుషుడు ఎవరు? అప్పుడు పిప్పలాద మహర్షి ఇలా అన్నాడు. సుకేశా! నీవడిగిన మహాపురుషుడు ఎవరో కాదు. ఆత్మయే. ఆత్మ మన శరీరంలోనే ఉంటుంది. దానిలోనుంచే పదహారు కళలు, అంగాలు ఆవిర్భవించాయి. ఒకప్పుడు ఆత్మ ‘ఎవరు బైటికి వెళితే నేను బైటికి వెళ్లినవాణ్ణి అవుతాను? ఎవరు లోపల ఉంటే నేను లోపల ఉండగలుగుతాను?’ అని తనలో తాను ప్రశ్నించుకుంది. భరద్వాజా! ఆత్మయే ప్రాణాన్ని సృష్టించింది. ఆ ప్రాణం నుంచి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, అన్నం నుంచి వీర్యం, తపస్సు, మంత్రాలు, కర్మలోకాలు, అలోకాలు అన్నీ ఏర్పడ్డాయి. కర్మలను బట్టి ఆయా లోకాలకు పేర్లు ఏర్పడ్డాయి. వీటిని అన్నిటినీ లెక్కిస్తే పదహారు కళలు అవుతాయి. కనుక పదహారు కళలు లేదా అంగాలు కల పురుషుడు ఆత్మయే. నదులన్నీ సముద్రం వైపు ప్రవహిస్తాయి. సముద్రాయణంలో వేర్వేరు పేర్లు కలిగిన నదులు సముద్రంలోకి చేరగానే భిన్నభిన్న నామరూపాలను కోల్పోతున్నాయి. అన్నిటినీ కలిసి సముద్రం అని పిలుస్తున్నాం. అదేవిధంగా వేర్వేరుగా కనపడుతున్న పంచభూతాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు అన్నీ ఆత్మ సృష్టించిన ప్రాణంలో నుంచి ఏర్పడినవే. ఈ పదహారు ఆత్మ వైపు ప్రయాణం చేసి ఆత్మలో కలిసిపోతాయి. ఇదే పురుషాయణం. ఆత్మ పురుషునిలో లీనం కాగానే వీటి పేర్లు, రూపాలు అన్నీ పోతున్నాయి. మొత్తానికి ‘పురుషుడు’ అనే ఒక్క పేరు మిగులుతోంది. ఈ పురుష శబ్దం స్త్రీ పురుష లింగభేదాల్లోనిది కాదు. రూపరహితం, నామ రహితం, లింగరహితమూ అయిన ఆత్మను పురుష శబ్దంతో వేదం పేర్కొంటోంది. పురుష సూక్తం ఈ ఆత్మస్వరూపాన్ని విశ్వాత్మ సమగ్ర దర్శనాన్ని చెబుతోంది. పురుష శబ్దంతో చెప్పబడే ఆత్మకు ఎటువంటి కళలు, అంగాలు, చావు పుట్టుకలు, మార్పులు, చేర్పులు ఏవీ ఉండవు. అది అమరం. అది శాశ్వతం. ఆ ఆత్మ బహిర్ముఖం అయినప్పుడు పదహారు కళలతో ఉంటోంది. కనుక పదహారు కళలు గల పురుషుడు ఆత్మయే. ‘అరా ఇవ రథనాభౌ కలా యస్మిన్ ప్రతిష్ఠితాః తం వేద్యం పురుషం వేద యథా మా వో మృత్యుః పరివ్యథా ఇతి’ నాయనా! రథచక్రంలోని ఆకులు (చువ్వలు)లాగా పదహారు కళలు ఎవరిలోనుండి వెలుపలికి వస్తూ ఎవరిలో లీనమైపోతున్నాయో ఆ పురుషుణ్ణి గురించి తెలుసుకోండి. అనగా పరమాత్మను గురించి తెలుసుకోండి. అప్పుడు మృత్యువు ఇక మిమ్మల్ని బాధపెట్టదు. మీ ఆరుగురు నా దగ్గర తెలుసుకోవడానికి వచ్చిన బ్రహ్మజ్ఞానంలో నాకు తెలిసింది ఇంతే. ఇది తెలిస్తే అంతా తెలిసినట్టే అని ఆశీర్వదించాడు. వారంతా ఎంతో ఆనందంతో ‘‘మహర్షీ! అజ్ఞాన సాగరాన్ని దాటించి అవతల తీరానికి చేర్చిన మీరే మాకు తండ్రి. మీకు శత సహస్ర వందనాలు’’ అంటూ పాదాభివందనం చేశారు. మూలాధారం నుంచి సహస్రారానికి చేరుకునే కుండలినీ శక్తికి, ఆరుచక్రాల ప్రయాణంలాగా సాగిన ప్రశ్నోపనిషత్తుకు అభివందనం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఆత్మజ్ఞానాన్ని పొందితే...అన్నీ తానే!
ప్రశ్నోపనిషత్ పిప్పలాద మహర్షి దగ్గరకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి వెళ్లిన ఆరుగురు రుషులు ప్రాథమిక దశ నుండి క్రమంగా ఒక్కొక్క ప్రశ్న అడిగి సమాధానాలు పొందుతున్నారు. ప్రాణం రాకడ, నిలకడ, పోకడలను గురించి ఆశ్వలాయనుడు అడిగిన మూడోప్రశ్నకు సమాధానంగా మహర్షి ‘ఆత్మనుంచి ప్రాణం పుడుతుంది’ అని వివరించాడు. తరువాత సూర్యవంశానికి చెందిన గార్గ్యుడు అనే రుషి నాలుగోప్రశ్న ఇలా అడుగుతున్నాడు. ‘‘భగవాన్! ఆత్మలోనుండి ప్రాణశక్తితో దేహాన్ని ధరించిన జీవునిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి (మెలకువ, కలలు, గాఢనిద్ర) అవస్థలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జీవునిలో నిద్రించేవి ఏవి? కలలు కనేవి ఏవి? మేలుకొని ఉండేవి ఏవి? వచ్చిన కలలను అనుభవించేది, చూసేది ఏ దైవ శక్తి? ఆ సుఖం అంతా ఎవరికి చెందుతోంది? ఇవి అన్నీ ఎవనియందు ప్రతిష్ఠితమై ఉంటున్నాయి?’’ అని ప్రశ్నించాడు. పిప్పలాద మహర్షి అడిగిన ప్రశ్నలన్నీ శ్రద్ధగా విన్నాడు. జ్ఞానసముపార్జనకు వచ్చిన ఆరుగురు ఒకేవిధమైన పరిశోధనాదృష్టితో వినటం, తెలుసుకోవటం ఆయనకు నచ్చింది. నాలుగోప్రశ్నకు ఇలా సమాధానం చెబుతున్నాడు. ‘‘గార్గ్యా! సూర్యుడు అస్తమించేటప్పుడు అతని కిరణాలు అన్నీ తేజోమండలంలో ఐక్యమైపోతాయి. ఉదయించేటప్పుడు అన్నీ బయటకి వ్యాపిస్తాయి. అలాగే ఒక ప్రాణి నిద్రపోతున్నప్పుడు ఇంద్రియాలు అన్నీ మనసులో ఐక్యమవుతాయి. అప్పుడు ఆ మనిషి వినలేడు, చూడలేడు. వాసన చూడలేడు. రుచి చూడలేడు. స్పర్శజ్ఞానం ఉండదు. మాట్లాడలేడు. దేనినీ స్వీకరించలేడు. ఆనందించలేడు. వదలలేడు. పట్టుకోలేడు. కదలలేడు. ఈ స్థితిని నిద్రించటం అంటారు. నాయనా! దేహి నిద్రపోతున్నప్పుడు ప్రాణశక్తి అగ్నిహోత్రంలా వెలుగుతూనే ఉంటుంది. అపాన వాయువు గార్హపత్యాగ్ని (గృహంలో ఎప్పుడూ వెలిగేది). వ్యానవాయువు అన్వాహార్యపచనాగ్ని (వంటకు ఉపయోగించేది), గార్హపత్యాగ్ని నుంచి తయారయ్యేదే ఆహవనీయాగ్ని (యజ్ఞానికి ఉపయోగించేది), ఈ మూడింటిని త్రేతాగ్నులు అంటారు. ప్రాణి నిరంతరమూ ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే ఆహుతులను సమానంగా సమర్పించటం వల్ల వెలిగే ఆ హవనీయాగ్నియే సమాన వాయువు. ఈ యజ్ఞాన్ని చేసే యజమానుడే మనస్సు. ఈ యజ్ఞం ద్వారా ప్రాణి కోరే ఇష్టఫల మే ఉదాయనవాయువు. ఈ వాయువే దేహిని ఎల్లప్పుడూ పరబ్రహ్మం దగ్గరకు చేరుస్తూ ఉంటుంది. నిద్రలో తరువాత దశ స్వప్నావస్థ. ఈ దశలోని అనుభూతులన్నీ జీవుడు తానే పొందుతాడు. మెలకువతో ఉన్నప్పుడు తాను భౌతికమైన ఇంద్రియాలతో చూసినవే చూస్తాడు. విన్నవే వింటాడు. వివిధప్రదేశాలలో వివిధ దిశలలో భౌతికంగా తాను అనుభవించినవాటినే స్వప్నంలో అనుభవిస్తాడు. మెలకువతో చూసినవి, చూడనివి, విన్నవి, విననివీ, అనుభవించినవీ, అనుభవించనివీ, సత్యాసత్యాలన్నిటినీ కలలో జీవుడు దేహంతో సంబంధం లేకుండా తానే అనుభవిస్తాడు. జీవుడు స్వప్నావస్థ దాటి దివ్యమైన తేజస్సులో కలిసిపోతాడు. అప్పుడు కలలు రావు. ఆ స్థితిలో ఆత్మానందం కలుగుతుంది. ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ చివరికి తాముండే చెట్టుపైకి చేరుకున్నట్టు అన్నీ ఆత్మలో ఐక్యమైపోతాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, వాటి తత్వాలు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలు వాటి తత్త్వాలు, నోరు, చేతులు, కాళ్లు, మలమూత్రావయవాలు అనే కర్మేంద్రియాలు, వాటి తత్త్వాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, తేజస్సు, వాటివిధులు, ప్రాణశక్తితో ముడిపడి ఉన్నవన్నీ ఆత్మలో లీనమైపోతాయి. నాయనా! చూసేది, స్పృశించేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది, తలచుకునేది, తెలుసుకునేది, చేసేది, విజ్ఞానవంతమై ఉండేది అంతా ఆత్మయే. చావుపుట్టుకలు లేని పరమాత్మలో ఈ ఆత్మ కలిసిపోతోంది. అదే సుషుప్తి. రంగు, రుచి, వాసన, రూపం, నీడ లేనిది స్వచ్ఛమూ, శాశ్వతమూ అయిన ఆత్మానుభూతిని, ఆత్మజ్ఞానాన్ని ఎవడు పొందుతాడో వాడే సర్వజ్ఞుడు అవుతాడు. సర్వమూ తానే అవుతాడు. విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వైః ప్రాణా భూతాని సంప్రతిష్ఠంతి యత్ర తదక్షరం వే దయతే యస్తు సోమ్య స సర్వజ్ఞ సర్వమేవా వివేశేతి జ్ఞాన, కర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకారాలు, చిత్తం, తేజస్సు, ప్రాణం అన్నింటికీ కేంద్రమై, శాశ్వతమైన విశ్వాత్మను పరమాత్మను తెలుసుకున్నవాడు అన్నీ తానే అవుతాడు. అంతటా తానే అవుతాడు’’. ఇలా నిద్ర గురించి అడిగిన ప్రశ్నకు ఆత్మజ్ఞానాన్ని పొందే క్రమాన్ని నిద్రతో అన్వయించి వివరించాడు పిప్పలాద మహర్షి. తరువాత సత్యకాముడు అడిగిన ప్రణవోపాసన ప్రశ్నకు సమాధానాన్ని వచ్చేవారం చూద్దాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఉప ముఖ్యమంత్రా? కుల సంఘ నేతా?
మాల మహానాడు ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రా లేక కుల సంఘ నేతా? అనిమాల మహానాడు గురువారం ప్రశ్నించింది. ఎస్సీల వర్గీకరణ వద్దంటూ ఇక్కడ జంతర్ మంతర్‌లో నిర్వహిస్తున్న రెండో రోజు రిలే దీక్షలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీలను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి కడియం శ్రీహరి సిఫారసు చేయడం ఎంత మేరకు సబబని ప్రశ్నించారు. ‘కడియం శ్రీహరి ఒక కుల సంఘానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రికి మాలల ఓట్లు అవసరం లేదా? వచ్చే ఎన్నికల్లో ‘మాలల పంతం-కేసీఆర్ అంతం’ అనే నినాదంతో మాలలు ముందుకు సాగుతారు. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది. తెలంగాణలో మాలల కంటే మాదిగలే మెజారిటీ జిల్లాల్లో లబ్ధి పొందుతున్నారని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక తేల్చిచెప్పింది..’ అని అన్నారు. వర్గీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రెండు రాష్ట్రాల్లో మంత్రులు, ఎంపీలను అడ్డుకుంటామన్నారు. వర్గీకరణ జాతీయ సమస్య అని, అనేక రాష్ట్రాల్లో దళితులు దీనిని వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఈ దీక్షలో చెన్నయ్యతోపాటు జె.శ్రీనివాస్, భాస్కర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీక్ష అనంతరం ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకమని, అమలు చేయరాదని కోరుతూ ఎస్సీ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించినట్టు చెన్నయ్య తెలిపారు. -
అసాంజేను లండన్‌లో ప్రశ్నించనున్నారు
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను త్వరలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. లండన్‌లోని ఓ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఈక్వెడార్ విదేశాంగ అధికారులు తెలిపారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను ప్రశ్నించేందుకు 2010 నుంచి స్వీడన్ ప్రయత్నిస్తోంది. అయితే, ఆయన ప్రస్తుతం ఈక్వెడార్‌లోని లండన్ రాయబార కార్యాలయంలో గత మూడేళ్లుగా(2012నుంచి) రక్షణ పొందుతున్నారు. ఇటీవల స్వీడన్‌కు చెందిన ఓ న్యాయవాది అసాంజే వద్దకు వచ్చి ప్రశ్నించే విధానం, కొన్ని మినహాయింపులు చెప్పిన తర్వాత అసాంజే సమ్మతి తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈక్వెడార్ అధికారులు స్వీడన్ తో పలు కోణాల్లో చర్చలు జరిపి ఆయనను లండన్ లో విచారించేందుకు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. దీంతో త్వరలోనే అసాంజేను స్వీడన్ అధికారులు ప్రశ్నించనున్నారు. -
ఈ ప్రశ్నకు జవాబు లేదు..!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు జవాబు లేని ప్రశ్న ఎదురైంది. సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ప్రశ్నాపత్రంలో 'ఏ పార్టీ భాగస్వామ్యంతో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది' అనే ప్రశ్న ఉంది. ఈ మల్టీపుల్ చాయిస్ ప్రశ్న కింద (బిట్) నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఈ నాలుగింటిలో ఒక్కటీ జవాబు (బీజేపీ) లేదు. దీంతో విద్యా శాఖ అధికారులు చేసిన నిర్వాకం వల్ల జవాబు ఏం రాయాలో తెలియక విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. జమ్ము కశ్మీర్లో బీజేపీతో కలసి పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆ ప్రశ్నకు బీజేపీ అన్నది సమాధానం. అయితే ఆ ప్రశ్న కింద కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అనే నాలుగు సమాధానాలు ఇచ్చారు. వీటిలో బీజేపీ పేరు లేకపోవడంతో విద్యార్థులు ఆ ప్రశ్నను విడిచిపెట్టారు. ఆ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు స్పందిస్తూ ఈ విషయంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కీలకమైన ప్రశ్న
సందేహం రాకుండా పోవాలిగానీ వచ్చిందంటే చాలా యాతనే. అది తీరే దాకా సమస్యే. మూడేళ్లక్రితం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో బాలిక ఐశ్వర్య మహాత్మ గాంధీకి ‘జాతిపిత’ పురస్కారాన్ని ఎవరిచ్చారని సందేహం వ్యక్తంచేసింది. అది ఎవరూ ఇచ్చిందికాదని... వ్యవహారికంలో ఎప్పుడు చేరిందో ఎవరికీ తెలియదని ‘అధికారికం’గా వెల్లడైంది. అప్పటికామెకు పదేళ్ల వయసు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఎలా చూడాలన్న సందేహం చర్చలోకి వచ్చింది. ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పరిగణించాలా లేక భారత ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించవచ్చునా అనేది ఆ సందేహం సారాంశం. జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ సందేహాన్ని వ్యక్తంచేశారు. చూడటానికి రెండింటిమధ్యా పెద్ద తేడా ఏముందని పిస్తుంది. కానీ ఇది సాధారణమైన సమస్య కాదని తరచి చూస్తే అర్థమవుతుంది. మన రాజ్యాంగంలోని 124వ అధికరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ‘భారత ప్రధాన న్యాయమూర్తి’గా పేర్కొంటున్నది. వివిధ పదవులకు ప్రమాణ స్వీకారం చేసే విధానాన్ని నిర్దేశించిన రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ మాత్రం ఆ పదవిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తావించింది. న్యాయమూర్తి ప్రస్తావించేవరకూ ఈ వ్యత్యాసం సంగతే ఎవరి దృష్టికీ రాలేదని విచారణ సందర్భంగా జరిగిన సంభాషణను గమనిస్తే తెలుస్తుంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అయినా, సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్ అయినా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేకపోయారు. ఈ సమస్యగురించి ఆలోచించవలసి ఉన్నదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల్లో నియమితులయ్యే వారు ఎలాంటి పదవీ స్వీకార ప్రమాణం చేయాలో విడిగా ఉన్నాయి. 60వ అధికరణ రాష్ట్రపతి ప్రమాణస్వీకారంపైనా, 69వ అధికరణ ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారంపైనా సవివరంగా తెలిపాయి. 124వ అధికరణ భారత ప్రధాన న్యాయమూర్తి గురించి ప్రస్తావించినా ప్రమాణస్వీకారం దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇతరుల గురించి కూడా ప్రస్తావించే మూడో షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఇన్ని దశాబ్దాల్లో న్యాయవ్యవస్థలో ఎందరో పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన న్యాయకోవిదులున్నారు. అయినా ఇలాంటి సందేహం ఎవరికీ ఇన్నేళ్లుగా కలగలేదంటే ఆశ్చర్యమనిసిస్తుంది. మన రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యులు అనేక అంశాలపై కూలంకషంగా చర్చించారు. వివిధ పదవులకు సంబంధించిన హోదాలు, అధికారాలు... ఆ పదవుల్లో ఉండేవారి పరిధులు వగైరాలన్నీ నిర్దిష్టంగా ఉన్నాయి. ఆ పదవుల ప్రమాణస్వీకారానికి సంబంధించిన నియమనిబంధనలను జాగ్రత్తగా పొందుపరిచారు. అయితే, ఎంత చేసినా ఏవో లోటుపాట్లు ఉండకతప్పదు. ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు కావొచ్చు...తలెత్తే కొత్త సమస్యలు కావొచ్చు... ఉన్న సమస్యలే కొత్త పరిష్కారాలను కోరడంవల్ల కావొచ్చు-అలాంటివాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించారు. ఇప్పుడు జస్టిస్ జోసెఫ్ లేవనెత్తిన సమస్యపై కూడా విస్తృత చర్చ జరిగి, అవసరమైతే రాజ్యాంగంలో ఆ మేరకు మార్పులు చేయక తప్పదు. అయితే, న్యాయమూర్తి వ్యక్తం చేసిన సందేహం ఆసక్తికరమైనదే తప్ప అంత అవసరమైనది కాకపోవచ్చునని సాధారణ పౌరులకు అనిపిస్తుంది. ఆ పదవి గురించిన ప్రస్తావనలో ఉన్న తేడావల్ల ఆచరణలో తలెత్తే ఇబ్బంది ఏముంటుందని పిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సందేహం కీలకమైనది. న్యాయమూర్తుల ఎంపిక కోసం ఇన్నాళ్లూ అనుసరిస్తూ వస్తున్న కొలీజియం స్థానంలో ఇప్పుడు కొత్తగా ఎన్‌జేఏసీ ఏర్పడిన నేపథ్యంలో ఇది ముఖ్యమైనది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలన్న నిబంధన ఉంది. రాజ్యాంగంలోని 217వ అధికరణ ఆ సంగతిని సవివరంగా ప్రస్తావించింది. అయితే, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తిని సరిగా అమలు చేయడంలేదని, సుప్రీంకోర్టు పాత్ర అందులో ఉండటం లేదని భావించిన జస్టిస్ జేఎస్ వర్మ 1993లో ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుండే కొలీజియం వ్యవస్థ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. 1998లో మరో తీర్పు ద్వారా ఇది అయిదుగురు సభ్యుల కొలీజియంగా మారింది. ఈ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకునే విధానంగా మారిందని అంటూ ఎన్డీయే సర్కారు ఎన్‌జేఏసీ చట్టం తీసుకొచ్చింది. ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయమూర్తులిద్దరూ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, మరో ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారని చట్టం చెబుతున్నది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ రీత్యా చూస్తే ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మిగిలిన సభ్యులతో సమానమవుతారు. 124వ అధికరణ అయినా, 217వ అధికరణ అయినా రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని న్యాయవ్యవస్థ పెద్దగా, ప్రతినిధిగా చూస్తున్నది. కానీ, ఎన్‌జేఏసీ ఆ పాత్రను కుదిస్తున్నది. రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలను పరిమితం చేస్తున్నది. కనుక రెండింటిమధ్యా ఉన్న వ్యత్యాసాన్ని, అందువల్ల ఏర్పడిన అయోమయాన్ని పోగొట్టాలన్నది జస్టిస్ జోసెఫ్ సంధించిన ప్రశ్నలోని అంతరార్ధం కావొచ్చు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా పారదర్శకంగా పనిచేసినప్పుడే అర్ధవంతంగా ఉంటుంది. న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అందరూ కోరుకునేది అందుకే. అది జరగడానికి ముందు రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాముఖ్యత, పాత్ర ఏమిటన్నది కూడా తేలడం కూడా అవసరమే. -
తప్పు చేస్తే ప్రశ్నిస్తాం: కోదండరాం
గోదావరిఖని(కరీంనగర్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీగా ఏర్పడి ఉద్యమించిన తరహాలోనే ప్రభుత్వ పాలనలో ఏదైనా తప్పు జరిగితే కచ్చితంగా ప్రశ్నిస్తామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల అభినందన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని, లేకుంటే మరో ఉద్యమానికి జేఏసీ సిద్ధంగా ఉంటుందని తేల్చి చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విజయాన్ని ఆస్వాదించినట్లే పరిపాలనలో ఏవైనా తప్పులు దొర్లితే పాలకులను అడగవలసిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రజలతో కలిసి నడిచేందుకు జేఏసీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, జేఏసీ నాయకులు పిట్టల రవీందర్, గురిజాల రవీందర్రావు, కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకిచ్చినా ప్రశ్నించే వీల్లేదు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని పేరిట సమీకరించిన భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహం అమలు చేసింది. రైతుల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినా, ఏరకంగా వినియోగించుకున్నా ప్రశ్నించే అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంది. సమీకరించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు జీఓ జారీ చేసిన ప్రభుత్వం.. వాస్తవానికి దీనికి ముందునుంచే రైతులతో చేసుకుంటున్న ఒప్పందపత్రాల్లో అందుకనుగుణంగా షరతులు విధించింది. భూములు ప్రైవేటువారికిచ్చినా రైతులు ఎటువంటి అభ్యంతరం చెప్పకూడదని 9.14 ఒప్పందపత్రాల్లో 15వ షరతుగా పేర్కొంది. తద్వారా భూములపై సర్వ హక్కులు సీఆర్డీఏకే లభించేలా చూసుకుంది. భూములిచ్చిన రైతులకు మాత్రం వాటిపై ఎటువంటి హక్కులు లేకుండా, కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా చేసింది. ఈ షరతుల గురించి ఏమాత్రం అవగాహన లేకుండానే చాలామంది రైతులు 9.14 పత్రాలపై సంతకాలు పెట్టి సీఆర్డీఏ అధికారులకు ఇచ్చారు. కోర్టుకెళ్లడమూ చట్ట విరుద్ధమే! భూములపై సర్వహక్కులు ఉండేలా చూసుకున్న సీఆర్డీఏ.. ఆ భూములపై ఏవైనా బకాయిలుంటే మాత్రం మళ్లీ రైతుల వాటా నుంచే మినహాయించుకునే వెసులుబాటు కల్పించుకుంది.ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి మించి రైతులు అదనంగా ఎటువంటి పరిహారం అడగకుండా ఉండడంతోపాటు కనీసం దానిపై నిరసన తెలిపే హక్కు కూడా రైతుకు లేకుండా చేశారు. కనీసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం కూడా ఒప్పందాలు చేసుకున్న రైతులకు లేదు. ఒకవేళ దాఖలు చేసినా అవి చెల్లుబాటు కావని అలా చేయడం చట్టవిరుద్ధమని ముందే ఒప్పందంలో పేర్కొన్నారు. సీఆర్డీఏదే అంతిమ నిర్ణయం తనకు అనుకూలంగా ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న ప్రభుత్వం.. ఒకవేళ ఏ కారణంతోనైనా భూసమీకరణ పథకాన్ని కొనసాగించకపోయినప్పటికీ రైతు మాట్లాడేందుకు వీల్లేకుండా కూడా చూసుకుంది. ఎటువంటి కారణం లేకుండా, ఏ సమయంలోనైనా భూసమీకరణ ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం సీఆర్డీఏకు ఉంటుంది. -
ప్రశ్నిస్తూనే ఉంటాం: సోనియా
న్యూఢిల్లీ: రైతాంగ సమస్యలను కాంగ్రెస్ లేవనెత్తుతూనే ఉంటుందని పార్టీ చీఫ్ సోనియాగాంధీ స్పష్టం చేశారు. పార్టీ ఎంపీలతో సమావేశంలో ఆమె.. ఈ వారం పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై లోతుగా చర్చించారు. రైతులతో భేటీ, పార్టీ భేటీల కారణంగా లోక్‌సభలో రాహుల్ ప్రసంగాన్ని వినడం సాధ్యం కాలేదని, అయితే, బాగా ప్రసంగించారని తెలిసిందని అన్నారు. కాగా, వందలాది రైతులు సోమవారం సోనియాతో సమావేశమయ్యారు. అధికారిక నివాసంలో వారితో రైతు సమస్యలు, భూ బిల్లు తదితరాలపై బృందాలవారీగా సోనియా చర్చలు జరిపారు. సుష్మా ఆరోగ్యంపై సోనియా వాకబు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఆరోగ్యంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సోమవారం వాకబు చేశారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో లోక్‌సభ సభ వాయిదా పడ్డాక వారిద్దరూ స్వయంగా సుష్మ వద్దకు వెళ్లారు. బాగున్నారా..? ఆరోగ్యం ఎలా ఉందంటూ నవ్వుతూ పలకరించారు. సుష్మ కూడా చిరునవ్వుతో వారితో మాట్లాడారు. ఆదివారం పార్లమెంట్ హౌస్‌లో ఓ సదస్సుకు హాజరై వస్తుండగా.. మెట్లపై తడబడడంతో సుష్మ కాలు బెణికింది. కాలు నొప్పి ఉన్నా ఆమె యథావిధిగా అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. జకార్తాలో జరగనున్న బన్దుంగ్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆమె ఇండోనేసియా వెళ్లనున్నారు. -
వీడిన హరిబాబు హత్యకేసు మిస్టరీ
నెల్లూరు(క్రైమ్): సోదరితో ఓ వ్యక్తి సన్ని హితంగా మెలగడాన్ని ఆమె సోదరులు జీర్ణించుకోలేకపోయారు. రూ.2 లక్షలు సుఫారి ఇచ్చి ఆ యువకుడిని హత్య చేయించారు. కిరాయి హంతకులతో పాటు సోదరుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు రాయపు హరిబాబు హత్య కేసు మిస్టరీని చేధించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుళ్ల కోసం గాలింపు చేపట్టారు. వివరాలను నెల్లూరు ఐదో నగర పోలీసుస్టేషన్లో సిటీ డీఎస్పీ మగ్బుల్ ఆదివారం విలేకరులకు వివరించారు. ఆయన కథనం మేరకు..వెంకటాచలం మండలం నిడిగుంటపాళేనికి చెందిన ఆమవరపు సుధాకర్, ఏడుకొండలు అన్నదమ్ములు. కానిస్టేబుల్ అయిన ఏడుకొండలు గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పీఎస్ఓగా ఉంటున్నాడు. వీరి సోదరి ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా పనిచేస్తోంది. వితంతువు అయిన ఆమె నెల్లూరులో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన రాయపు హరిబాబు(25) నెల్లూరులో టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ ఆటోమోబైల్ షోరూంలో పనిచేసేవాడు. ఎక్సైజ్ ఎస్సైతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ముత్యాలపాళెంలోనే స్నేహితుడి గదిలో ఉండే హరిబాబు తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో సంపాదించిందంతా హరిబాబుకే పెడుతోందని సోదరులు పలుమార్లు ఆమెను మందలించారు. ఆమె తీరులో మార్పు రాకపోవడంతో హరిబాబును అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై ఏడుకొండ లు నెల్లూరుకు చెందిన తన స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ గోను శ్రీనివాసులుతో చర్చించాడు. తన సోదరులు గోను సుబ్బయ్య, గోను ఏడుకొండలుతో హత్య చేయిద్దామని శ్రీనివాసులు హామీ ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టులో సుధాకర్, ఏడుకొండలు నిడిగుంటపాళెంలో నిర్వహించిన గ్రామదేవతకు పొంగళ్ల కార్యక్రమానికి గోను శ్రీనివాసులు తన సోదరులతో కలిసివచ్చాడు. అక్కడ అందరూ కూర్చుని హరిబాబు హత్యకు ప్లాన్ చేశారు. గోను సుబ్బయ్య, ఏడుకొండలు రూ.2 లక్షలకు సుఫారి కుదుర్చుకున్నారు. గ్రామంలోనే ఓ ఫ్లెక్సీలో ఉన్న హరిబాబు ఫొటోను తన సెల్ఫోన్లో బంధించిన సుబ్బయ్య, అతనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాడు. అనంతరం సెప్టెంబర్‌లో గోను ఏడుకొండలుతో కలిసి బైక్ కొనుగోలు సాకుతో హరిబాబు పనిచేసే షోరూంకు వెళ్లారు. ఆయనతో పరిచ యం ఏర్పరచుకుని తర్వాత స్నేహంగా మార్చుకున్నారు. తరచూ మందు పార్టీలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 13న హరిబాబును కనుపర్తిపాడు క్రాస్‌రోడ్డులోని ఓ దాబా వద్దకు ఆహ్వానించారు. దాబా మూసేసేంత వరకు అక్కడ ముగ్గురూ కలిసి మద్యం తాగారు. అనంతరం మద్యం తీసుకుని సమీపంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లారు. తర్వాత హరిబాబు బైక్‌ను అక్కడే వదిలేసి ముగ్గురూ ఒకే బైక్‌పై చలపతినగర్ శివారులోని ఖాళీప్లాట్ల వద్దకు వచ్చారు. అక్కడ హరిబాబును హతమార్చి మృతదేహాన్ని చెట్లపొదల్లో లాక్కెళ్లి పడేశారు. తర్వాత రోజు హరిబాబుకు చెందిన బైక్, పర్సు. వాచ్, సెల్‌ఫోన్ తదితర వస్తువులను ఆమవరపు సుధాకర్, ఏడుకొండలకు ఇచ్చారు. వారు బైక్‌ను తీసుకెళ్లి వెంకటాచలం అడవుల్లో వదిలేశారు. 15వ తేదీ హరిబాబు హత్య వెలుగులోకి రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో విచారించి కేసును చేధించారు. ఆదివారం వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో గోను సుబ్బయ్య, గోను ఏడుకొండలుతో పాటు ఎక్సైజ్ ఎస్సై సోదరుడు సుధాకర్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కానిస్టేబుళ్లు ఆమవరపు ఏడుకొండలు, శ్రీనివాసులు కోసం గాలిస్తున్నారు. హత్యకేసును చేధించిన ఐదో నగర ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ మగ్బుల్ అభినందించారు. -
నరసింహన్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందం కేసులో సీబీఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను త్వరలో ప్రశ్నించనుంది. సీబీఐ అధికారులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కేసులో సీబీఐ ప్రశ్నించనున్న మూడో గవర్నర్ నరసింహన్. ఇదే కేసులో సీబీఐ ఇంతకుమందు పశ్చిమబెంగాల్, గోవా గవర్నర్లు నారాయణన్, వాంచూను ప్రశ్నించారు. ఆ తర్వాత వీరిద్దరూ పదవులకు రాజీనామా చేశారు. 3,726 కోట్ల రూపాయిల హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు ఆదేశించారు. ఒప్పందం సమయంలో నారాయణన్ జాతీయ భద్రత సలహాదారుగా, వాంచూ స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఛీప్‌గా, నరసింహన్ ఇంటలిజెన్ప్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. 2005లో జరిగిన సమావేశానికి ఈ ముగ్గురు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నరసింహన్ వాంగూల్మం కీలకంకానున్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయనను సాక్షిగా ప్రశ్నించనున్నారు. -
రేస్‌క్లబ్ కథ కంచికేనా ?
-
సహానుభూతి
‘‘మరీ అంతగా నెత్తిన పెట్టుకున్నారేం?’’ గతవారం ‘దైవికం’ చదివిన వారిలో కొందరు ‘సాక్షి’కి ఫోన్ చేసిన అడిగిన ప్రశ్న ఇది. స్త్రీకి దైవత్వాన్ని ఆపాదించడం కూడా దైవదూషణే అవుతుందని వారు ఈ కాలమిస్టును ఆత్మీయంగా హెచ్చరించారు. ధన్యవాదాలు. అయితే ఒక సందేహం. స్త్రీకి కనీస గౌరవాన్ని, కనీస సౌకర్యాన్ని ఇవ్వకపోవడం దైవదూషణ అనిపించుకోదా?! ఇవన్నీ వాదనలతో తేలేవీ, తెలిసేవీ కాదు. కవి శివారెడ్డిలా స్త్రీ హృదయంలోకి ప్రవేశించాలి. అప్పుడిన్ని సందేహాలు రావు. అయితే- ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ, ‘‘ఆఫీస్‌కి క్యారేజీ రెడీ చేశావా, రాత్రికేం చేస్తున్నాం’’ అని అడిగినంత తేలికా... స్త్రీ హృదయంలోకి ప్రవేశించడం? కానే కాదు. మగపుట్టుక కదా! అన్నీ వేర్వేరు. లోపలి గ్రంధులు, నరాలు, నాళాలు. ఆ స్ట్రక్చర్, ఆ థాట్స్ అన్నీ డిఫరెంట్. మానవుడిగా పుట్టి దైవసాక్షాత్కారానికి యోగ్యత సాధించడం ఎంత కష్టమో, స్త్రీని మగవాడు అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం! ఇక మనం చేయగలిందేమైనా ఉందా అంటే స్త్రీల అసౌకర్యాలను అనుభూతి చెందే ప్రయత్నం చెయ్యడం. అది కూడా అయ్యే పని కాదు. చాలా శక్తి కావాలి. ఈ కండలు సరిపోవు. ఈ బుర్రలు సరిపోవు. ఈ చదువులు, సంస్కారాలు కూడా. ఒక సుపీరియన్ హ్యూమన్ బీయింగ్‌గా మగవాడు ఎదగాలి. అప్పుడేమైనా స్త్రీ మనసు మగవాడి మనసుకు అందుతుందేమో! లైంగిక హింస, లైంగిక దౌర్జన్యం, లైంగిక వేధింపు, లైంగిక అత్యాచారం స్త్రీని ఎంతగా కుంగదీస్తాయో మగవాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆ బాధ, ఆ ఆవేదన, ఆ అవమానం ఎలా ఉంటుందో ఎన్ని జన్మలకీ అర్థం కాదు (ఆడజన్మకు తప్ప). బెత్తంతో కొడితే బెత్తానికి బాధ తెలుస్తుందా? రాయి తగిలితే రాయి ‘అమ్మా’ అంటుందా? అలాగే మగజన్మకు నొప్పి తెలియకపోవడంలో వింతేం లేదు. ఎలా మరి? దేనికి ఎలా? అదే, ఆడవాళ్ల బాధను అర్థం చేసుకోవడం ఎలా? ఇదిగో ఈ ప్రశ్న వేశారు కదా, సగం అర్థం చేసుకున్నట్లే. కనీసం అర్థం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి! స్త్రీల ఆవేదనను, అసౌకర్యాలను అర్థం చేసుకునే ఉద్యమం ఒకటి ప్రస్తుతం బల్గేరియాలో బయల్దేరింది. ‘వాక్ ఎ మైల్ ఇన్ హర్ షూజ్’ అంటూ అక్కడి మగవాళ్లు కొందరు ఆడవాళ్లలా హై హీల్స్ వేసుకుని నడుస్తూ లైంగిక హింసలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టారు. ‘స్త్రీల ఇబ్బందులేమిటో కొంతలో కొంతైనా అర్థం కావాలంటే, ఆ ఇబ్బందిని అనుభవించాలి తప్ప ఊహించలేం’ అనే విషయాన్ని సింబాలిక్‌గా హై హీల్స్ వేసుకుని మరీ అక్కడి మగవాళ్లు చూపిస్తున్నారు. మొన్న హైదరాబాద్‌లో కూడా ఉమెన్స్ డేకి ఇలాంటిదే ‘అర్థం చేయించే’ ప్రయత్నం ఒకటి జరిగింది. బస్టాపులు, టీ స్టాళ్లు, షాపింగ్ మాల్స్, పార్కులు... ఇలా కొన్ని బహిరంగ ప్రదేశాలలో అప్పటికప్పుడు కొంతమంది ఆడవాళ్లు ప్రత్యక్షమై, మగవాళ్లను వేధించారు. (రోడ్లపై మగాళ్లు ఆడవాళ్లను ఎలాగైతే వేధిస్తారో, సరిగ్గా అలాగే). ఇదో కనువిప్పు కార్యక్రమం. ‘నొప్పంటే ఇలా ఉంటుందిరా బయ్’ అని మగవాళ్లకు తెలియచెప్పడం. ‘మిర్రర్ మాబ్’ పేరుతో ‘హైదరాబాద్ ఫర్ ఫెమినిజం’ సంస్థ సభ్యులు ఇలా కొందరు మగాళ్లని ‘టీజ్’ చేశారు. వేధింపుల నాటకం అయ్యాక వీళ్లు అసలు విషయం చెప్పేవారు. ఆడవాళ్లను హర్ట్ చెయ్యడం హీరోయిజం కాదు అని చిన్నపాటి ప్రసంగం ఇచ్చి, ఇంకోచోటికి వెళ్లేవారు. ఏం జరుగుతుంది ఈ ప్రయత్నాల వల్ల? జరగనవసరం లేదు. జరగకుండా ఆగిపోతే చాలు... స్త్రీలపై ఈ దౌర్జన్యాలు, అఘాయిత్యాలు! స్త్రీ హృదయంలోకి ప్రవేశించే ద్వారాలను కాలితో తన్ని మూసేస్కోవడం మగవాడికి బాగా అలవాటు. ఆ అలవాటును మాన్పించే ఏ చిన్న ప్రయత్నమైనా దైవాన్వేషణ లాంటిదే. ముందు ఒక మెట్టంటూ ఎక్కితే, తర్వాత దేవుడే తన సన్నిధిలోకి రప్పించుకుంటాడు ఎంత నాస్తికుడినైనా! స్త్రీ హృదయంతో సహానుభూతి చెందడం అంటే దైవసాక్షాత్కారానికి యోగ్యత సంపాదించడమే. తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని, ఇరవై ఏళ్లు కళ్లలో పెట్టుకుని, ఆ తర్వాత భాగస్వామిగా జీవితాంతం కనిపెట్టుకుని ఉండే స్త్రీని నెత్తిన పెట్టుకోవడం దైవార్చన అవుతుంది కానీ దైవదూషణ అవుతుందా? చెప్పండి. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశ్నపత్రాలు ఇప్పుటికే జిల్లాకు చేరాయి. జవాబు పత్రాలు, ఇతర 24 రకాల పరీక్షల సామగ్రిని 106 సెంటర్లకు చేరవేసే కార్యక్రమం పూర్తయింది. మొత్తం 87,247 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 39,135మంది. వీరికి ఈ నెల 12నుంచి 25వ తేదీ వరకు, 48,112 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 13 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకే హాలులో ఉండాలి .విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటల వరకు కేటాయించిన గదిలో కూర్చోవాలి. ప్రత్యేక కారణాలుంటే తప్ప ఆ తర్వాత అనుమతించరు. 8.45గంటల తర్వాత వస్తే ఏ కారణం చేత ఆలస్యమయింది, విద్యార్థిపేరు, హాల్‌టికెట్ నంబర్, ఏ కాలేజీ తదితర వివరాలను ఇంటర్ బోర్డుకు నివేదిస్తారు. అదే విద్యార్థి తర్వాత జరిగే పరీక్షలకు కూడా ఆలస్యంగా వస్తే అనుమతించరు. ఆలస్యం కారణాలపై నిఘా పెడతారు. విచారించి తగు చర్య తీసుకుంటారు. విద్యార్థులు గుంపులుగా సెంటర్‌కు రాకూడదు. విద్యార్థులు వారి స్థానాల్లో కూర్చున్నాక 8.45గంటల తర్వాతే ప్రశ్నపత్రాలు తెరిచి 8.58 గంటలకు ఆయా గదులకు పంపించాలి. గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరిజ్ఞానం అమలు పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు కూడా సెల్‌ఫోన్ వాడరాదు. ఆర్జేడీ, డీవీఈఓ, ఆర్ఐఓ, డీఈసీ, హెచ్పీసీ, సభ్యులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ల ఫోన్ నంబర్లు ఇప్పటికే బోర్డులో నమోదు చేశారు. గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను అమలు చేస్తున్నారు. దీంతో పరీక్షా కేంద్రంలో వాడే సెల్, ల్యాండ్ ఫోన్‌నంబర్లు, సంభాషణలు, ఎస్ఎంఎస్లు ఎప్పటికప్పుడు రికార్డు అవుతాయి. సిబ్బంది నియామకం పూర్తి జిల్లాలో గత సంవత్సరం 119 సెంటర్లుండగా ఈ యేడాది 13 సెంటర్లను తగ్గించి 106 సెంటర్లనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సెంటర్‌కు ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంట్ అధికారిని నియమించారు. తహసీల్దార్, ఎస్ఐ, ఇంటర్ అధికారులతో కూడిన 4 ఫ్లైయింగ్ స్క్వాడ్, 10 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తాయి. ఇన్విజిలేటర్ల నియామకం కూడా పూర్తయ్యింది. పరీక్ష అనంతరం జవాబు పత్రాలను సీల్చేసి అదే రోజు స్థానిక పోస్టాఫీసు ద్వారా స్పీడ్ పోస్టులో జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ (డీఆర్డీసీ)కి చేరవేస్తారు. ఇతర జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రిన్సిపాళ్లు, ఇద్దరు సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉండే డీఆర్డీసీ నుంచి జవాబు పత్రాలను కేటాయించిన జిల్లాలకు పంపుతారు. వివరాలను గోప్యంగా ఉంచుతారు. తెలంగాణ జిల్లాల పేపర్లను ఈ ప్రాంతంలోనే దిద్దాలనే డిమాండ్‌పై బోర్డు స్పందన ఇప్పటికీ గోప్యంగానే ఉంది. అడిషనల్ ఆన్సర్‌షీట్లు ఇవ్వరు ప్రతిపేజీకి 24 గీతలుండే 24 పేజీల ఆన్సర్షీట్ ఇస్తారు. అడిషనల్ షీట్లు ఇవ్వరు. అన్ని జవాబులను అందులోనే సర్దుబాటు చేయాలి. ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు ద్వితీయ బాష పరీక్షకు కొత్త సిలబస్‌తో, బ్యాక్లాగ్వారికి పాత సిలబస్‌తో ప్రశ్నపత్రాలు ఇస్తారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం సైన్స్ రెగ్యులర్ విద్యార్థులకు కొత్త సిలబస్‌లో, బ్యాక్లాగ్వారికి పాతసిలబస్తో ప్రశ్నపత్రాలు అందజేస్తారు. నామినల్ రోల్స్, హాల్‌టికెట్లు, ఓఎంఆర్ బార్కోడ్ షీట్లు, జవాబు పత్రాలు, ‘డీ’ ఫారాలు సెంటర్ల వారీగా పంపించారు. మీడియం మార్పునకు అవకాశం మీడియం మార్పు, ద్వితీయ భాషను మార్చుకునేందుకు విద్యార్థులకు పరీక్ష రాసే ముందు రోజు వరకు అవకాశం ఇచ్చారు. విద్యార్థి ఫొటో, సంతకం, మార్పు అంశాలను ఆయా కళాశాలల నుంచి ఆన్లైన్ ద్వారా పంపించాలి. వివరాలను ఆర్ఐఓ కార్యాలయంలో నిర్ధారణ చేసిన అనంతరం అనుమతిస్తారు. -
వారాంత పరీక్షలకు విఘాతం
ప్రశ్నపత్రాలు రూపొందించని ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు సమస్యలు పరిష్కరించాలని సహాయ నిరాకరణ ఆందోళనలో విద్యార్థులు నూజివీడు, న్యూస్‌లైన్ : నూజివీడు ట్రిపుల్ ఐటీలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు వీటిని పరిష్కరించాల్సిన ఆర్జీయూకేటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అధ్యాపకుల సహాయ నిరాకరణతో ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం ఇంజినీరింగు విద్యార్థులకు నెలరోజులుగా వీకెండ్ (వారాంతపు) పరీక్షలు జరగడం లేదు. కొన్ని బ్రాంచీలకు ఒక్క మ్యాథ్స్ సబ్జెక్టుకు మాత్రమే నిర్వహిస్తుండగా, సివిల్, ఈసీఈ బ్రాంచీలకూ ఒక్క సబ్జెక్టుకు కూడా పరీక్షలు జరగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. లెర్నింగ్ బై డూయింగ్... టీచింగ్ బై హోంవర్క్ విధానంలో భాగంగా వీకెండ్, క్యాట్ పరీక్ష(నెలవారి)లు తప్పనిసరి. ఆ వారంలో పూర్తయిన సిలబస్‌కు సంబంధించి వీకెండ్ పరీక్షలను ప్రతి శనివారం నిర్వహించాలి. ఇందులో వచ్చిన మార్కులను పరిగణలోనికి తీసుకునే సంవత్సరాంతంలో విద్యార్థుల జీపీఏ(గ్రేడ్ పాయింట్ ఏవరేజ్)ను నిర్ణయిస్తారు. మొండికేసిన అధ్యాపకులు ! ప్రశ్న పత్రాలను రూపొందించాల్సిన అధ్యాపకులు మొండికేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని తెలుస్తోంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జనవరి నెలాఖరులో అధ్యాపకులు తరగతులకు వెళ్లలేదు. వీసీ రాజకుమార్ వచ్చి మీడియాను కూడా రానీయకుండా రహస్య చర్చలు జరిపారు. అనంతరం అధ్యాపకులు తరగతులకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు తప్పితే.. పరీక్షలు పెట్టడం లేదని తెలుస్తోంది. తరువాత అన్నీ ఒకేసారి నిర్వహిస్తే తమపై ఒత్తిడి పెరుగుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు జరగని మాట వాస్తవమే ఇంజినీరింగులో పలు బ్రాంచీలకు వీకెండ్ పరీక్షలు జరగని మాట వాస్తవమే. అధ్యాపకులు ప్రశ్నపత్రాల రూపకల్పనలో సహకరించకపోవడమే దీనికి కారణం. ప్రశ్నపత్రాలను ఇవ్వమని అధ్యాపకుల్ని కోరాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. -ఇబ్రహీంఖాన్, ట్రిపుల్ ఐటీ డెరైక్టర్, నూజివీడు