తెలివితేటలను, ఆలోచనా శక్తిని పెంచుకోవడానికి చాలామంది చదరంగం, పదవినోదం వంటివి ఆడుతారు. అయితే ఇటీవల కాలంలో దీనికోసం బ్రెయిన్ టీజర్‌లు విరివిగా అందుబాటులోకి వచ్చేసాయి. ఇలాంటివి చూడటానికి గమ్మత్తుగా ఉన్నప్పటికీ.. లోతుగా ఆలోచింపజేస్తాయి. ఈ కోవకు చెందిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జెనెసిస్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ 'డినో డియోన్' ఈ పోస్ట్ చేస్తూ.. ఉద్యోగం కావాలంటే దీనికి మూడు సెకన్లలో సరైన సమాధానం చెప్పాలి, అని పేర్కొన్నారు. దీనికి సమాధానం నా ఆరేళ్ళ పిల్లాడు 30 సెకన్లలో చెప్పినట్లు వెల్లడించారు.
డినో డియోన్ షేర్ చేసిన పోస్టులో 3x3-3/3+3 అని ఉంది. ఇది కేవలం మేధావులకు మాత్రమే అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వేల లైక్స్ పొందిన ఈ పోస్టుకు.. భారీ సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.
ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..
సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్లలో.. దీనిని మూడు సెకన్లలో ఎలా చెప్పగలం అని కొందరు చెబితే.. మరికొందరు మూడు సెకన్లలో ఆలోచించడానికి ప్రయత్నించవచ్చని అన్నారు. ఇంకొందరు దీనికి సమాధానం తొమ్మిది అని వెల్లడించారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు సమాధానాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment