భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. రాజకీయంగా చూస్తున్నారు - ఈజ్‌మైట్రిప్ సీఈఓ | EaseMyTrip Suspension of Maldives Flights CEO Tweet Viral | Sakshi
Sakshi News home page

భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. రాజకీయంగా చూస్తున్నారు - ఈజ్‌మైట్రిప్ సీఈఓ

Published Tue, Jan 16 2024 1:19 PM | Last Updated on Tue, Jan 16 2024 1:28 PM

EaseMyTrip Suspension of Maldives Flights CEO Tweet Viral - Sakshi

ఇండియా & మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదాల కారణంగా ప్రముఖ ట్రావెల్ ఏజన్సీ 'ఈజ్‌మైట్రిప్' (EaseMyTrip) అన్ని బుకింగ్స్ నిలిపివేసింది. మన దేశానికి మద్దతుగా నిలువడానికి సంస్థ సీఈఓ అండ్ కో ఫౌండర్ 'నిషాంత్ పిట్టి' (Nishant Pitti) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.

ఈ విషయం మీద ప్రశాంత్ పిట్టి కూడా చలో లక్షద్వీప్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తూ.. మాల్దీవులు/సీషెల్స్ మాదిరిగానే లక్షద్వీప్‌లోని నీరు & బీచ్‌లు చాలా బాగున్నాయి. ఇటీవల వీటిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి అద్భుతమైన క్రేజీ స్పెషల్-ఆఫర్‌లు ఇక్కడ ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.

ఈజ్‌మైట్రిప్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాలు కొందరు రాజకీయంగా చూస్తున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి చాలామంది మాల్దీవులకు వెళ్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మాల్దీవులకు చెందిన ముగ్గురు డిప్యూటీ మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. దీంతో మాల్దీవుల చర్యలను భారత్ ఖండించింది.

ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు..

ప్రస్తుతం ఈజ్‌మైట్రిప్ తీసుకున్న నిర్ణయాన్ని సుమారు 95 శాతం మంది భారతీయులు సమర్థిస్తున్నారు. దీంతో యాప్ డౌన్‌లోడ్ కూడా గత వారం 280 శాతం పెరిగిందని.. 5 శాతం మంది మాత్రమే మా నిర్ణయాన్ని రాజకీయం చేస్తున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement